🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 2 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 2 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 2 🌻

5. సత్యమేయైన శాశ్వతత్వములో, అద్వితీయమైన, అనంతమైన,
శాశ్వతమైన, సర్వవ్యాపకమైన అస్థిత్వమే ఉన్నది.

6. భగవంతుని అనాది అనంత ఆది మూలస్థితి - పరాత్పర పరబ్రహ్మ స్థితి
(“భగవంతుడు ఉన్నాడు” అను స్థితి)

7. God “IS”= సత్‌ (భగవంతుడు ఉన్నాడు), నిస్సీమ కేవల శూన్యత్వం.
భగవంతుని, యీ “ఆదిమూల అపార కేవల శూన్యస్థితి” లో,
ఏ వ్యక్త స్థితియు లేదు. అది అవ్యక్తస్థితి.
గుప్తొతి గుప్తము ( అంతరాంతర్ష్నిహితము ) గ్రహింపరానిది,
ఇది అని చెప్పరానిది (నేతి, నేతి), అసాధ్యమైనది.
భగవంతుని అంతర్నిహిత శక్తియే (శక్యత) భగవంతుని అంతరస్థితి.
🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి - Mind Power - 77

No photo description available.
🌹. మనోశక్తి  - Mind Power  - 77 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 73 :-- Code language (కోడ్ లాంగ్వేజ్) 🌻

Ans :--
1) onion కి అనేక పొరలున్నట్లే మన దేహం కూడా అనేక పొరలను కలిగి ఉంది.

ఇప్పుడు మనం ఏ దేహాన్ని కలిగి ఉన్నా స్త్రీగాగాని, పురుషుడుగగాని గతజన్మలకు సంబందించిన దేహాలు ఆ జన్మలలో పొందిన ఆధ్యాత్మిక జ్ఞానం కోడ్ లాంగ్వేజ్ అనగా విద్యుదయస్కాంత శక్తి రూపంలో అంతర్ శక్తిలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. మనం ఆ దేహాలను ఆ కోడ్ లాంగ్వేజ్ ని అంతరేంద్రియాల ద్వారా దర్శించే వీలుంది.

2) ఇప్పుడు మనం ధరించి ఉన్న దేహం యొక్క genetic నిర్మాణం గత జన్మల్లో మనం సంపాదించిన ఆధ్యాత్మిక జ్ఞానం బట్టి ఉంటుంది. మన దేహంలోని జీవకణాలన్నీ అనేకానేక జన్మల్లో పొందిన జ్ఞానాన్నంతటిని కోడ్ లాంగ్వేజ్ రూపంలో దాచుకుని ఉన్నాయి.

3) ఉల్లిపాయను గమనిద్దాం, ఉపరితలం లో ఉన్న పొర మాత్రమే మనకు కనిపిస్తుంది. లోపల పొరలు కనిపించవు. ఉల్లిపాయకు ఉన్న ప్రతి పొరలో విద్యుదయస్కాంత శక్తి,జీవరసాయినిక శక్తి ఉండటం వల్ల ఉల్లిపాయకు ఒక ఆకారం ఏర్పడింది. ఉల్లిపాయకు గల రుచి,దాని ఘాటు వాసనలు దానిలో ఉన్న చైతన్య శక్తి వల్ల వచ్చింది. 

అలాగే వర్తమానంలో మనకు దేహం మాత్రమే కనిపిస్తుంది. మిగతా అనేకానేక జన్మలలోని దేహాలు అదృశ్యపొరలు వలె మన దేహంలోనే ఇమిడి వున్నాయి .ఈ దేహాలన్నీ చైతన్య శక్తి ద్వారా అనుసంధానింపబడి ఉన్నాయి.

4) అనేకానేక జన్మల్లో ధరించిన దేహాలు ఆధ్యాత్మిక జ్ఞానం చైతన్య పరిణామం అంతా ఆత్మశక్తి కి వారసత్వంగా సంక్రమిస్తుంది.

5) మనం అనారోగ్యం తో ఉన్నామనుకోండి,గత జన్మలో మన ఆరోగ్యకరమైన దేహం యొక్క జెనెటిక్ కోడ్ లాంగ్వేజ్ ని ప్రస్తుత దేహంలోకి చొప్పించి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

6) ఈ జన్మలో మనకు ధైర్యం లేదనుకోండి,గత జన్మలో ధైర్యవంతుడిగా మనం పొందిన అనుభవాల ద్వారా ధైర్యాన్ని మనకు మనమే ప్రాప్తించుకోవచ్చు.

7) ఈ కోడ్ లాంగ్వేజ్ transfer చేసుకోవడానికి స్వప్నాలు,అంతర్ ప్రపంచం మనకు ఉపయోగపడతాయి.
🌹 🌹 🌹 🌹 🌹

Twelve Stanzas from the Book of Dzyan - 6 : STANZA II - The Knowledge of the Heart - 1

No photo description available.
🌹 Twelve Stanzas from the Book of Dzyan  - 6 🌹
🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴

🌻 STANZA II -  The Knowledge of the Heart - 1 🌻

13. The Day arrived. The Wheel gradually gained momentum and led human Hearts towards Knowledge — something the Hearts had known for a long time.

But man was not yet able to comprehend the Wisdom of his own Heart. He had not actually guessed that the Heart was capable of knowing. 

And all the while, the still, small Voice, which imparted the wise counsel of Life, was practically inaudible to the insensitive human ear. And even when that Voice rang out with unmistakable clarity, like an alarm bell, calling its hearers to arm themselves with the Power of Love on the eve of death, man attempted to muffle it, preferring to take a roundabout route through the labyrinths and machinations of the mind.

 But the intellect was not able to perceive what the Heart knew, for it was subject to decay. Evil could easily penetrate thereinto, not fearing any encounter with the bright, dazzling Light of Fiery Thought. Man could think only on the lowest levels. And so the Wheel began a New Round.

14. People gradually began to pay attention to the leadings of their own Heart, becoming convinced that the mind’s contemplations, more often than not, led them to wrong conclusions. 

And the barely perceptible Voice of the Heart, it appeared, had presaged the Truth... And so there was a pressing need to hearken to that which possessed the Wisdom of insight. 

But how to do this? How is it possible to avoid mistaking the voice of the mind for the inaudible tremors of the currents of the Heart? People became thoughtful once again. 

And the Heart meanwhile was still waiting for the time when it would be accepted as the best and most faithful friend...
🌹 🌹 🌹 🌹 🌹

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 17

Image may contain: 1 person, standing and shoes
🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 17 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు  స్వధర్మము-పరధర్మము - 5 🌻

మానవులకు శ్రేయోమార్గము, ప్రేయోమార్గము అను ఈ రెండును అనుసరింపదగినవిగానే తోచును. ఈ రెంటిలో కల భేదమును సామాన్య మానవుడు గుర్తింపలేకున్నాడు.

 ధీరుడగు విద్వాంసుడు ప్రేయస్సుకంటే శ్రేయస్సే శ్రేష్టమైనదని తలంచి దానినే అనుసరించును. మందబుద్ధికలవాడు ధనమును, గృహారామ క్షేత్రాదులను సంపాదించి వానిని కాపాడుట యనెడి యోగక్షేమాత్మకమైన ప్రేయోమార్గమునే శ్రేష్టమైనదానినిగా తలంచి ఆ మార్గమునే అనుసరించును.

 సాధారణముగా మానవులలో అధికసంఖ్యాకులు ధనసంపాదనకు దాని రక్షణను గొప్పగా భావించి తమ జీవితములను గడుపుచున్నారు. వారు పరమును గురించి ఆలోచింపరు. వారు శాశ్వత సుఖమునిచ్చు శ్రేయోమార్గమునకు దూరముగా నుందురు.

   మన గురించి బాగా చెప్పాడు ఇక్కడ. చూడండి. కృతయుగకాలంలోనే జీవులందరూ కలియుగంలో ఎలా వుంటారనేది ఈ ఉపనిషత్తులో చక్కగా బోధించాడు. 

ఇవ్వాళ మనందరి జీవితాలను గమనిస్తే వెనక్కి తిరిగి ఏం కనబడుతున్నదీ అంటే ఐహికమైనటువంటి, ఇహలోక సంబంధమైనటువంటి, పరిణామము చెందేటటువంటివి, వాటిని మాత్రమే శాశ్వతమని తలంచుచున్నాము. మనం ఎవరినైనా ఒక ప్రశ్న వేశామనుకోండి , నాయనా! నువ్వు నీ జీవితంలో ఎప్పటికి స్థిరపడతావు? అని అడుగుతాం. యవ్వనంలోకి ప్రవేశించిన వారందరినీ కూడా మనం అడిగే ప్రశ్న ఏమిటంటే, నీ జీవితంలో నువ్వు ఎప్పటికి స్థిరపడతావు? 

 ఏమిటి స్థిరపడటమంటే అని తిరిగి ప్రశ్నిస్తే వివాహం చేసుకోవడం, రెండు ఇల్లు కట్టడం, మూడు పిల్లల్ని కనడం, నాలుగు వస్తు సముదాయాన్ని సమీకరించుకోవడం , అయిదు వారసులందరికీ , వచ్చే మూడు నాలుగు తరాలకు సరిపడా ధనార్జన చేయడం - ఇవన్నీ కలిపి మనం స్థిరపడటం క్రింద లెక్కేసుకోవడం మొదలుపెట్టాం. ఇదంతా ప్రేయోమార్గము. 

మానవుడికి ఎన్ని చెప్పుల జతలు వుండాలి అసలు అని ఆలోచిస్తే ఒక జత సరిపోతుంది కదా. మహా అయితే రెండు జతలు సరిపోతాయి కదా. కాని ఇవ్వాళ ఎవరింట్లో చూసినా కూడా ఒక చెప్పుల షాపు వుంటుంది.

 ప్రయోజనమేముంది? ప్రయోజనం లేదు కదా. అలాగే ప్రతి వస్తు సముదాయమునకు ఒక పేద్ద షాపు maintain చేయడం అలవాటు చేసుకున్నాం. 

తద్వారా ఏమైంది? ఆ యా వస్తువులను సరియైనటువంటి పద్ధతిలో వుంచలేము, క్రమమైన మార్గములో వాటిని శుద్ధి చేయలేము, శుద్ధి చేసిన వాటిని మరల తిరిగి వుంచలేము, వాటిని సరిగా సర్దుకోలేము, వాటిని సరిగా ఏర్పాటు చేసుకోలేము, ఆ వస్తువులని ఏర్పాటు చేసుకోలేక, ఆ వస్తువులను సరిగా సరిదిద్దుకోలేక సతమతమైపోతూ వాటిల్లో సుఖంగా వున్నానని భ్రమ చెందుతున్నాడనమాట. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 12 / Sri Gajanan Maharaj Life History - 12 🌹

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 12 / Sri Gajanan Maharaj Life History - 12 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 3వ అధ్యాయము - 2 🌻*

ఆ బైరాగిని తనదగ్గరకు తేగానే మూడునెలల నుండి నీసంచిలో ఉంచిన మూటబయటకు తియ్యి అని శ్రీమహారాజు అనడంతో ఆబైరాగి ఆనందంలో మునిగి దొర్లడం ప్రారంభించాడు. 

సిగ్గులేకుండా నాకు గంజాయి ఇద్దామనుకుని వచ్చి ఇప్పుడు సంచిలోంచి తీయడానికి సిగ్గుపడతావేమి అని శ్రీమహారాజు అన్నారు. 

నేను తీసి ఇస్తున్న ఈగంజాయి నాజ్ఞాపకార్ధం శాశ్వతంగా శ్రీమహారాజు అంగీకరించాలని నివేదిస్తున్నాను అని చురుకైనబధిగల ఆబైరాగి అన్నాడు. మీకు గంజాయి అవసరంలేదు అనినాకుతెలుసు కానీ నా నవ్రమయిన ఈకానుకను కృపయా స్వీకరించడి. 

భక్తులయొక్క కోరికలన్నీ భగవంతుడు పూర్తిచేస్తాడు, ఉదాహరణకు శివుని తనగర్భంనుండి పిల్లవానిగా జన్మించమని అంజని ప్రార్ధించగా శివుడు అంగీకరించి మహారుద్ర హనుమాన్గా పుట్టాడు. 

ఈవిధంగా కోతిరూపంలో భగవాన్ శివుడు పుట్టడం తనభక్తుని కోరిక నెరవేర్చడంకోసమే. శ్రీగజానన్ కొద్దిగాసంకోచించారు, కానీ తరువాత అంగీకరించారు. అప్పుడు ఆబైరాగి గంజాయి తీసి, చేతిలో నలిపి, పొగగొట్టంలో నింపి శ్రీమహారాజుకు త్రాగేందుకు ఇచ్చాడు. ఈవిధంగా శ్రీగజానన్ గంజాయి త్రాగడం మొదలుపెట్టారు, కానీ దీనికి బానిస ఎన్నటికికాలేదు. తామరఆకు వలె ఈయన మక్కువకు, అనురాగాలకు అతీతులు. 

ఆబైరాగి కొద్దిరోజులు అక్కడ ఉండి రామేశ్వరానికి వెళ్ళిపోయాడు. శ్రీమహారాజు ఒక్కోసారి చక్కటి మధురవాణితో వేదపఠనం చేసేవారు. ఒక్కోసారి నిశ్శబ్దం పాటించేవారు. వేదపఠనం చేస్తున్నప్పుడు ఈయన బ్రాహ్మణుడు అని అనిపించేది. ఒక్కోసారి తనుతయారు చేసిన గీతాలను వేరువేరు రాగాలలో పాడేవారు, లేదా గణ గణ గణాతబోతే అనే తన మంత్ర పఠనం చేసేవారు. 

మిగిలినవేళ నిశ్శబ్దం పాటించేవారు, లేదా నిద్రపోయేవారు. ఒక్కోసారి పిచ్చివానిగా ప్రవర్తించేవారు లేదా అడవిలో తిరిగేవారు, లేదా ఊహంచని రీతిగా ఎవరి ఇంటిలోకయినావెళ్ళేవారు. జానారావ్ దేష్ ముఖ్ అనే ప్రఖ్యాతమయిన వ్యక్తి షేగాంలో ఉండేవాడు. ఆయన మరణశయ్యపైన ఉన్నాడు. వైద్యులు అందరూకూడా ఈయన బతకడంమీద ఆశలు వదులుకోమని అతనిబంధువులకు చెప్పారు. 

వారికి ఇదివిచారకరమయినవార్త. వారు భగవంతుడిని ప్రార్ధించారు, మొక్కుకున్నారు కాని ఉపయోగం లేకపోయింది. యోగులు చమత్కారం చెయ్యగలరు అనే నమ్మకంతో చివరి ఉపాయంగా వారు శ్రీగజానన్ దరికి చేరదామని అనుకున్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 12 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 3 - part 2 🌻*

When he was broughtforth, Shri Gajanan Maharaj said, “Take Out that bundle which you have been keeping in your bag for the last three months.”

 Overwhelmed with joy, the ascetic started rolling like a child before Shri Gajanan Maharaj . Maharaj said, “Shamelessly you vowed to offer Ganja to me and now feel shy to take it out of your bag.” 

The shrewd ascetic said that he would take it out and offer Ganja with a request that Shri Gajanan Maharaj , as a token of his remembrance, accept the offering permanently. 

He further said, “I know that You don’t need Ganja, but kindly accept it as my humble offering. God fulfills all the desires of devotees. For example, Anjani prayed to Lord Shiva to come to her womb and take birth as her child. 

Lord Shiva accepted and took birth as Maharudra Hanuman. Taking the form of a monkey was accepted by Lord Shiva to fulfil the desire of His devotee.” Shri Gajanan hesitated a bit but then agreed. 

The ascetic, then, took out Ganja, rubbed it in his hand, filled in the pipe and gave it to Shri Gajanan Maharaj to smoke. This is how Shri Gajanan started smoking Ganja, but He never became an addict to it. Just like a lotus leaf, he was free from attachments. 

The ascetic stayed there for a few days and then went away to Rameshwar. Sometimes Shri Gajanan Maharaj used to recite Vedic verses in sweet clear tones, while other times observed silence. 

His Reciting of the Vedas indicated that He was a Brahmin. Sometimes he used to sing a composition in different ragas or go on singing His Mantra, “Gan Gan Ganat Bote”. 

At other times He observed silence or quietly slept. Sometimes He behaved like a mad man, wandered in the jungles or entered somebody’s house unexpectedly. 

At Shegaon there was a famous man named Janrao Deshmukh. He was on deathbed and all the doctors declared him to be as a hopeless case, and accordingly notified his relatives. 

They prayed to God, took vows in exchange of his life, but to no avail. So they thought of the last remedy i.e. of approaching Shri Gajanan Maharaj with the belief that saints can perform any miracle. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

శివగీత - 20 / The Siva-Gita - 20

🌹. శివగీత - 20 / The Siva-Gita - 20 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 4 🌻

అతస్త్యాం దీక్ష యిష్యామి - విర జాగ మమాశ్రితః,
తేన మార్గేణ మర్త్యత్వం - హిత్వా తేజో మయోభవ. 16

యేన హత్వా రణే శత్రూ- న్సర్వా న్కామా నవా ప్స్యసి,
అధ ప్రణమ్య రామస్తం - దండవ న్ముని సత్తమమ్. 17

ఉవాచ దుఃఖ నిర్ముక్తః ప్రహృష్టే నాంత రాత్మనా,

ఆ కారణము చేత శివునికి ప్రీతి దాయంబైన విరజా దీక్షను నీకు నొసంగెదను.
 ఆ పద్ధతి నాచరించి నీవు మానుషత్వమును వీడి తేజో మూర్తి వగుదువు. ఆ మార్గము శత్రు సంహారము చేయు కోరికను దీర్చును.

 (సూతుడు చెప్పుచున్నాడు ) ఆ మీదట శ్రీరాముడు నా అగస్త్య 
మహా ఋషికి దీర్ఘ దండ నమస్కారము గావించి, దుఃఖమును వీడి సంతసించిన వాడై యిట్లు పలికెను. (శ్రీరాముడు చెప్పును )

కృతార్దో హం మునే ! జాతో - వాంచి తార్దో మమా గతః
పీతాం బుధి: ప్రసన్నస్త్వం -యది మేకిము దుర్లభమ్ 18

అతస్త్యం విరజా దీక్షాం బ్రూహి మే ముని సత్తమ! 19

ఓయీ అగస్త్య మహా రుషీ! నేను నీ యనుగ్రహము వలన ధన్యుడ నైతి,
 ఇక మీదట నా అభిలాష నెరవేరి నట్లున్నది.

 సముద్రమున అర చేతన్ గొనియా పోశనం బొనర్చిన మీరు నన్ను 
అనుగ్రహింపు చుండగా నేనెట్లు సఫలము మనో రధుడను గాను?
 అందుచేత నన్ను అతి శీఘ్రముగా ననుగ్రహింపుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 20 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
🌻 Viraja Deeksha Lakshana Yoga - 4 🌻

15. For that reason, I would initiate you under 'Viraja Deeksha' which pleases lord Shiva. By following that method your human nature would get discarded and you would get filled with supreme aura. 

16. This method would fulfil your dream of vanquishing your enemies. Suta said: After that, Sri rama did prostrations to Agastya, became filled with happiness and said the following words 

17. Sri Rama said: O sage Agastya! I have become blessed today due to your grace. It looks like my wishes are going to be fulfilled now. 

18. You are the one who drank the entire ocean in three holy sips, when such a great sage has blessed me, how can I not succeed in achieving my goals? Therefore initiate me at the earliest. 

19. Agastya said: Eitehr on the Chaturdasi (fourteenth day) in Shuklapaksha (fortnight after the new moon day), or on the Ashtami day (eighth day), or on the Ekadashi day (eleventh), or any monday which falls under Arudra star; one should begin this rite called Pashupata Vratam. 

Continues....
🌹🌹🌹🌹🌹

3-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 447 / Bhagavad-Gita - 447🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 235 / Sripada Srivallabha Charithamrutham - 235🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 115🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 137🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 51 / Sri Lalita Sahasranamavali - Meaning - 51 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 54 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 22 🌹
8) 🌹. శివగీత - 20 / The Shiva-Gita - 20🌹
9) 🌹. సౌందర్య లహరి - 62 / Soundarya Lahari - 62🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 361 / Bhagavad-Gita - 361🌹

11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 188🌹
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 63 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 59🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 74 🌹
15) 🌹 Seeds Of Consciousness - 138 🌹
16) 🌹 Seeds Of Consciousness - 139 🌹
17) 🌹. మనోశక్తి - Mind Power - 77 🌹
18)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 23🌹
19) 🌹 Twelve Stanzas from the Book of Dzyan - 6 🌹
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 17🌹
21) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 2 🌹
22) 🌹. Balance Your Thoughts and Actions 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 447 / Bhagavad-Gita - 447 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -02 🌴*

02. శ్రీ భగవానువాచ
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |
శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతా: ||

🌷. తాత్పర్యం : 
శ్రీకృష్ణభగవానుడు పలికెను: నా స్వీయరూపము నందు మనస్సును లగ్నము చేసి దివ్యమును, ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైనవారు అత్యంత పరిపూర్ణములని నేను భావింతురు.

🌷. భాష్యము : 
అర్జునుని ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణభగవానుడు తన స్వీయరూపమును ధ్యానించుచు శ్రద్ధాభక్తులను గూడి తనను పూజించువాడు యోగమునందు పరిపూర్ణుడని స్పష్టముగా పలుకుచున్నాడు. సర్వము కృష్ణుని కొరకే ఒనరింపబడుచున్నందున అట్టి కృష్ణభక్తిభావనలో నున్నవానికి ఎట్టి భౌతికకర్మలను ఉండవు. అటువంటి కృష్ణభక్తిరసభావనలో భక్తుడు సంతతమగ్నుడై యుండును. కొన్నిమార్లు అతడు జపమును గావించును. కొన్నిమార్లు కృష్ణుని గూర్చిన శ్రవణము లేదా పఠనమును కొనసాగించును. మరికొన్నిసార్లు కృష్ణునికై ప్రసాదమును తయారు చేయును. ఇంకొన్నిమార్లు కృష్ణుని నిమిత్తమై అవసరమైనదేదియో ఖరీదు చేయుటకు అంగడికేగును. ఇంకను మందిరమును శుభ్రము చేయుట, భగవానుని భోజనపాత్రులను కడుగుట వంటి కార్యముల నొనరించును. ఈ విధముగా ఆతడు కృష్ణపరకర్మలకు అంకితము కాకుండా క్షణకాలమును వృథాచేయడు. అటువంటి కర్మ సంపూర్ణముగా సమాధిగతమై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 447 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 12 - Devotional Service - 02 🌴*

02. śrī-bhagavān uvāca
mayy āveśya mano ye māṁ
nitya-yuktā upāsate
śraddhayā parayopetās
te me yukta-tamā matāḥ

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: Those who fix their minds on My personal form and are always engaged in worshiping Me with great and transcendental faith are considered by Me to be most perfect.

🌹 Purport :
In answer to Arjuna’s question, Kṛṣṇa clearly says that he who concentrates upon His personal form and who worships Him with faith and devotion is to be considered most perfect in yoga. For one in such Kṛṣṇa consciousness there are no material activities, because everything is done for Kṛṣṇa. A pure devotee is constantly engaged. 

Sometimes he chants, sometimes he hears or reads books about Kṛṣṇa, or sometimes he cooks prasādam or goes to the marketplace to purchase something for Kṛṣṇa, or sometimes he washes the temple or the dishes – whatever he does, he does not let a single moment pass without devoting his activities to Kṛṣṇa. Such action is in full samādhi.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 235 / Sripada Srivallabha Charithamrutham - 235 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 45
*🌻. శ్రీసాయి అవతరణ 🌻*

మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మా కోరికపై భాస్కర పండితులు శ్రీపాదుల లీలలను మళ్ళీ వర్ణించసాగారు: "శ్రీచరణులు కాశీ మహాపుణ్యక్షేత్రంలో ఎందరికో యోగ, సిద్ధ శక్తులను ప్రసాదించారు. 

క్రియా యోగాన్ని గృహస్థు లకు బోధించడానికి శ్రీశ్యామచరణులు అనే మహా మనీషిని అక్కడ జన్మించ వలసినదిగా ఆదేశించానని, వారికి హను మంతులచే క్రియాయోగదీక్షను ఇప్పించెదనని చెప్పారు. 

తరువాత వారు బదరికావనం మీదుగా నేపాల్ వెళ్ళి అక్కడ ఒక పర్వతం పైన రామనామ ధ్యానంలో నిమగ్నులై ఉన్న హనుమంతునికి సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేతులుగా దర్శనమిచ్చి అనంతకాలం అగ్నిబీజ రూపమైన రామనామాన్ని లెక్కకు అందనన్ని మార్లు జపం చేసి కాలాతీతుడు, కాలాత్మకుడు అయ్యారని చెప్పి కలియుగంలో ఒకమారు అవతరించాల్సి ఉందని, వారు ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపచేయగల సమర్థులు అగుటచే శాయి అనే పేరుతో విఖ్యాతి చెందుతారని చెప్పారు. 

అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి, అహ్ అనగా శాక్త, శక్తిని ధరించినవాడు. అందువల్ల అల్లాహ్ అనగా శివ శక్తుల సంయుక్త స్వరూపమని, వారు తమ అవతారంలో శివశక్తి స్వరూపమైన అల్లా నామమును స్మరిస్తారని కూడా తెలిపారు.  
 
*🌻. హనుమ విన్నపాలు 🌻*

అపుడు స్వామి జన్మించిన భారద్వాజ గోత్రంలోనే తాము కూడా జన్మించాలని, అంశావతారంలా కాక దత్తసాయు జ్యంతో మూలావతారంలాగా అవతరించాలనే తమ కోరికను హనుమంతులవారు తెలియజేసారు. 

వెంటనే శ్రీపాదులు కాలపురుషుని పిలిచి, "ఇతనికి నా సాయు జ్యాన్ని ప్రసాదింప దలిచాను. కనుక హనుమలోని చైత న్యాన్ని దానికి అనుగుణంగా మార్చ వలసినది." అని ఆఙ్ఞా పించారు. 

ఒక్క క్షణంలో హనుమయొక్క శరీరంలోని జీవా ణువులు అన్ని విఘటన చెంది దానిలోనుండి అనసూయా మాత ఆవిర్భవించి, ప్రసవవేదన పడసాగింది. 

తన కన్నుల ఎదురుగా ఉన్న దత్తుడు తిరిగి తన గర్భంలో జన్మించ దలచినాడా? అని ఆశ్చర్య పడసాగింది. దానికి వారు ఆమె గర్భమందున్నది హనుమ అని, వారికి తాము సాయుజ్య స్థితిని ఇస్తున్నామని సమాధానం చెప్పారు. 

ఇంతలో అనసూయ ముద్దులు మూటకట్టే మూడు తలల దత్త మూర్తికి జన్మనిచ్చింది. కొంతసేపటికి ఆ మూర్తి ఒక పసి పాపడిలా మారిపోయింది, అనసూయ ఆ నవజాతశిశు వుకు స్తన్యం ఇచ్చింది. కొంతసేపటికి ఆ శిశువు హనుమలా మారిపోయాడు. 

తమలో లీనమై ఉన్న మహబూబ్ సుభానీ అను మహాఙ్ఞానిని వారిష్ ఆలీషా అనే పేరుతో అవతరింప చేస్తామని, వారు గురువై యోగరహస్యాలు బోధిస్తారని, తమనే నిరంతరం స్మరిస్తూ తమ చైతన్యంలో మనస్సును లీనంచేసి ఉన్న గోపాలరావు అనే మహా భక్తుడిని హిందూ ధర్మాన్ని ఉపదేశించడానికి వారికి గురువుగా ప్రసాదిస్తున్నామని, అతడు వెంకటేశ్వర భక్తుడై వెంకూశా పేరుతో వారి సాయిబాబా అవతారంలో గురువు అవుతారని శ్రీపాదులు హనుమతో చెప్పారు. 

అపుడు హనుమ సీతతో, "తల్లీ! మీరు ప్రేమతో ఇచ్చిన మాణిక్య హారాన్ని, దానిలో ఎక్కడైనా రామనామం ఉందేమో చూడ టానికని నేను విరగకొట్టి, రామనామం లేకపోవడంతో పారేసాను. ఆ అపరాధం మన్నించండి," అని ప్రార్థించారు. 

దానికి శ్రీపాదులు ఆ మాణిక్య హారమే మాణిక్యప్రభువులనే గురు స్వరూపంగా అవతరిస్తుందని తమ సన్నిధిలో కారణం లేని కార్యం జరగదని విశదీకరించారు. 

*🌻. కురుంగడ్డ వాసం 🌻*

తరువాత శ్రీపాదులు ద్రోణగిరి అని పిలువబడే సంజీవని పర్వతం వద్దకి వెళ్ళి అక్కడి ఋషిపుంగవులతో కొంతకాలం గడిపి, కల్కి ప్రభువు జన్మించే శంబల గ్రామానికి వెళ్ళారు. 

అక్కడనుండి అనేక దివ్య క్షేత్రాలను దర్శిస్తూ, మహర్షు లను ఆశీర్వదిస్తూ గోకర్ణానికి వెళ్ళి అక్కడే మూడు సంవ త్సరాలు గడిపి లెక్క లేనన్ని లీలలు చేసారు. తరువాత శ్రీశైలం వెళ్ళి అక్కడ సిద్ధపురుషులను సమావేశపరిచి వారికి దివ్య-ఙ్ఞానయోగాన్ని బోధించారు. మరికొంతకాలానికి కురుంగడ్డ చేరారు.

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 235 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 25
*🌻 Description of Rudrakshas 🌻*

Wearing Rudrakshas is compulsory for Siva devotees. Among them, there are Brahma jathi, Kshatriya Jathi, Vysya Jathi, Sudra Jathi rudrakshas. The white Rudrakshas belong to Brahma jathi. It is very difficult to get them. Red and Honey coloured rudrakshas belong to Kshatriya jathi.  

The rudrakshas in the colour of Tamarind seed belong to Vysya jathi. Black rudrakshas belong to Sudra jathi. Commonly one gets Rudrakshas with 5 to 16 faces in plenty. If rudrakshas are put in milk or water, they sink.  

The rudrakshas not having weight or tender rudrakshas should not be worn. If rudraksha is kept under copper ‘uddarini’ and if a copper pancha patra is kept underneath, they revolve in a clock wise fashion.  

They cause poverty. So householders (Grihasthu) should not use them. If they use, death of wife, breakdown of family and sanyasa yogam will occur.  

Such things can be used by sanyasis. Kaalaagni Rudra said, ‘Brahmins should use white rudrakshas. Kshatriyas should use red coloured rudrakshas. Vysyas should use light yellow coloured rudrakshas. Sudras should use black rudrakshas.  

Then they will get good favourable results, sins get destroyed and all desires will be fulfilled. Ekamukhi (one faced) rudraksha is Siva’s form. Two faced (dwi mukhi) rudraksha is Ardhanareeswara’s form.  

Trimukhi (three faced) rudraksha is Agni form. Chaturmukhi (four faced) rudraksha is Brahma’s form, Pancha mukhi (five faced) rudraksha is Kaalaagni Rudra’s form. Shanmukhi (six faced) rudraksha is Karthikeya’s form. Sapta mukhi (seven faced) rudraksha is Manmadha’s form.  

Ashta mukhi (eight faced) rudraksha is Rudra Bhairava’s form. Nava mukhi rudraksha (nine faced) is Kapila muni’s form. It is very difficult to get this.  

This contains nine Shakti’s – Vidya Shakti, Jnana Shakti, Kriya Shakti, Shanta Shakti, Vama Shakti, Jyesta Shakti, Roudra Shakti, Anga Shakti, and Pasyanthi.  

So, the Nava mukhi rudraksha is Dharma Devatha’s form. Dasa mukhi (ten faced) rudraksha is Vishnu’s form. Ekadasa (eleven faced) rudraksha is indeed ‘Rudramsa’ form.  

Dwadasa Mukhi (twelve faced) rudraksha is the form of Dwadasa adityas. In this way, there is a close relation between rudrakshas and different forms of Gods.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 115 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 

*🌻. జ్ఞానులు- దైత్యులు - 3 🌻*

దైత్యులకు తమ ఆస్తిపై గాని, తమకు‌ ఇష్టమున్న వారిపై గాని, తాము నమ్మిన దేవునిపై గాని, హోదాలపై గాని వీరి జీవిత సౌఖ్యము ఆధారపడి యుండును. దైవమును నమ్మితిమి అనుకొన్నను తాను కోరినది ఇచ్చువాడే దైవము గాని తన కన్నా దైవమునకు ఎక్కువ తెలియును అను నమ్మకముండదు. 

వీరందరు గూడ వేద శాస్ర్తాదుల యందు పాండిత్యము వహించి ఉందురు. 

కాని వీరి దృష్టిలో వేదమనగా కొన్ని విధి నిషేధ వాక్యముల గ్రంథము. దానితో ఎవరి వేదము వారికి ఉండును. ఎవరి వేదము నిజమైనది? అను సమస్య తీరదు. అంతర్యామి సాధన చేయువారికిని వేదమున్నది. వారికి ఈ సృష్టియే గ్రంథము. అందలి ప్రకృతి ధర్మములే శాస్ర్తములు. 

జీవరాసుల రూపములే దేవుని సజీవ విగ్రహములు. కష్ట సుఖములు ఆయా వ్యక్తులు చేసిన పనుల ఫలితములుగా అనుభవములు అగుచుండునే గాని దేవుడు కావలెనని కల్పించినవి కావు. 

ఈ రెండు తెగలవారు నరజాతి ఆవిర్భావము నుండి ఉన్నారు. రజస్తమస్సులు ప్రాధాన్యము వహించి పనిచేయుచున్నంత వరకు నరులు దైత్యజాతికి చెందిన జన్మలు అనుభవింతురు. సత్త్వగుణమున స్థిరత్వము కలిగిన నాటి నుండి దివ్యులు లేక ముముక్షువుల జన్మలు అనుభవింతురు....
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 137 🌹*
*🌴 Crises and Development - 5 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Learning through Crises - 2 🌻*

By accepting the crisis and seeing the divine in ourselves and in the crisis, we get the right thoughts and guidance. 

Prayer and patience are very helpful. Every crisis has a certain duration; with time, it dissolves again. There can be personality crises that might last for years or run throughout life.

Through self-centredness we create crises in which we are cooked. Accumulating knowledge, power or wealth for oneself certainly brings crises. 

Their message is that we should distribute. Selfishness, pride or the tendency of controlling others are like a shadow following us. 

Crises slowly “burn” individual consciousness; they allow a greater consciousness to emerge in order to initiate the work of the soul. All crises serve to orient the personality to better things. 

Their message is: be above the crisis and view it as an observer. Then link yourself to the universal energy. We are always connected to it, but when we are attuned to it, it becomes stronger and we can grow beyond the crisis.

Many crises also arise when different opinions collide. For example, we see or read the news and worry about a possible danger. We think that one side is right and the other is wrong. 

On the plane of thought, this contributes to the manifestation of the incident which actually would have been avoidable. As seekers of truth, we should keep away from views and opinions and remain neutral witnesses without prejudice. 

We should invoke light and transmit it to both parties so that what is good for all can happen.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: Uranus. Notes from seminars.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 51 / Sri Lalita Sahasranamavali - Meaning - 51 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 95

451. తేజోవతీ - 
తేజస్సు కలది.

452. త్రినయనా - 
మూడు కన్నులు కలది.

453. లోకాక్షీ కామరూపిణీ - 
స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము గలది.

454. మాలినీ - 
మాలికారూపము చెల్లునది. లేదా మాల గలది.

455. హంసినీ - 
హంసను (శ్వాసను) గలిగినది.

456. మాతా - తల్లి.

457. మలయాచలవాసినీ - మలయపర్వమున వసించునది.

🌻. శ్లోకం 96

458. సుముఖీ - 
మంగళకరమైన ముఖము కలది.

459. నళినీ - నాళము గలిగినది.

460. సుభ్రూః - 
శుభప్రధమైన కనుబొమలు కలిగినది.

461. శోభనా - 
సౌందర్యశోభ కలిగినది.

462. సురనాయికా - 
దేవతలకు నాయకురాలు.

463. కాలకంఠీ - 
నల్లని కంఠము గలది.

464. కాంతిమతీ - 
ప్రకాశవంతమైన శరీరము కలది.

465. క్షోభిణీ - 
క్షోభింపచేయునది అనగా మథించునది.

466. సూక్ష్మరూపిణీ - 
సూక్ష్మశక్తి స్వరూపిణి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 51 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 51 🌻*

451 ) Vigna nasini -   
She who removes obstacles

452 ) Tejowathi -   
She who shines

453 ) Trinayana -   
She who has three eyes

454 ) Lolakshi - Kamaroopini -   
She who has wandering passionate eyes

455 ) Malini -   
She who wears a garland

456 ) Hamsini -   
She who is surrounded by swans

457 ) Matha -   
She who is the mother

458 ) Malayachala vasini -  
 She who lives in the Malaya mountain

459 ) Sumukhi -   
She who has a pleasing disposition

460 ) Nalini -  
 She who is tender

461 ) Subru -   
She who has beautiful eyelids

462 ) Shobhana -   
She who brings good things

463 ) Sura Nayika -   
She who is the leader of deva

464 ) Kala kanti -   
She who is the consort of he who killed the god of death

465 ) Kanthi mathi -   
She who has ethereal luster

466 ) Kshobhini -   
She who creates high emotions or She who gets agitated

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 54 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 31

🌻 31. రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్‌ - 2 🌻

అజ్ఞాన జ్ఞాన భేదమే గాని, భక్తుడు నిజానికి ఆ సనాతన పురుషుడైన భగవంతుడే. అందువలన భక్తుడు భగవంతుడయ్యాడని గాని, ఆ భక్తుడు భగవంతుడిలో ఐక్యమయ్యాడని గాని అనరాదు. 

కాని సాధన పూర్తై మరుపు విడిచేదాకా అలా అనడం జరుగవచ్చు. ఎందుకంటె అజ్ఞానిగా ఉన్న సన్యాసి బిడ్డ తాను రాజకుమారుడని తెలియనప్పుడు రాజు వద్దకు వెళితే ఆ రాజు అతడిని యువరాజుగా చేస్తే ఏమనుకుంటాడు ? అది అతని అదృష్టంగా భావిస్తాడు. 

అదే జ్ఞాని అయిన సన్యాసి బిడ్డ, తాను రాజకుమారుడని తెలిసి, యువరాజైతే ఏమనుకుంటాడు ? అది తన హక్కు అనుకుంటాడు. 

అలాగే భక్తుడు భగవంతుడే గనుక, ఆ భక్తుడు భగవంతుడే అనే జ్ఞానం కలిగినంతనే అది అతడి హక్కు అయిపోయింది. అది అదృష్టం కాదు.

2) ఒక గృహస్థుడు స్వగృహంలో సుఖంగా ఉండేవాడు. ఒక రోజున స్వగృహం విడచి దేశాంతరం వెళ్ళి, చాలా సంవత్సరాలు అనేక మజిలీలలో మకాం వేస్తూ తిరిగాడు. కొన్ని చోట్ల ఇబ్బందులతో గడిపాడు. 

మరికొన్ని చోట్ల సంతోషంగాను, వినోదంగానూ గడిపాడు. ఏమైనా గాని, ఆ అనుభవాలమధ్య స్వగృహంలో ఉన్న తృప్తిని మరిచాడు. చివరకు అతడు తన స్వగృహం చేరాడు. అక్కడ తృప్తిగా హాయిగా ఉన్నాడు. మునుపటివలె అనగా అంతకుముందు తను స్వగృహంలో ఉన్నప్పటివలె, తిరిగి అదే తృప్తితో ఉన్నాడు. 

ఈ విధమైన స్వగృహంలో ఉన్నప్పటి తృప్తి దేశాటన తర్వాత తిరిగి లభించిన తృప్తి ఒక్కటే గాని, ఈ రెండవసారి కల్గిన తృప్తి కొత్తగా వచ్చింది కాదు. ఆ పాత తృప్తే కొంతకాలం వేరే అనుభవాల మధ్య మరుగునపడి, తిరిగి కలిగింది. అంతేగాని, ఇప్పటి స్వగృహ తృప్తి కొత్తది కాదు. 

బయట ఎంత సుఖంగా, వినోదంగా గడిపినప్పటికీ అది స్వగృహంలో ఉన్నప్పుడుండే సహజత్వం వలన కలిగే తృప్తితో సాటికాదు. దేశాటన పిదప, స్వగృహ నివాసం వలన కలిగిన తృప్తి, సంతోషం సిద్ధ వస్తువు. అనగా నూతనంగా సంపాదించినది కాదు. 

కనుక పరాభక్తి కూడా సిద్ధ వస్తువే. ఎందుకంటే తాను తానైనదే తిరిగి అనుభవంలోకి వచ్చిన భగవత్స్వరూపం. కొంతకాలం మరుగునపడి ఇప్పుడు సిద్ధించింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 22 🌹*
✍️ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

*🌷 Guru principle transcends the three Gunas 🌷*
 
At once Brahma stimulated merely through mental vibrations, the intellects of his mind-born son Atri, and his shadow-born son Prajapati. The marriage between Atri and Anasuya, and the birth of Lord Dattatreya, the embodiment of the Trinity were a result of this action. 

The story of the incarnation of Lord Dattatreya gives direct proof that the Guru principle transcends the three Gunas. We are all familiar with the story of Datta. We are all asked to study the story of Datta as a ritual for seven days or for 40 days. 

Therefore, this Guru principle is close to all traditions and is not in conflict with any. Lord Dattatreya is the fundamental principle who is at the root of all subsequent different philosophies which have evolved. 

Hence, whether knowingly or unknowingly all those who meditate upon Guru contemplate on Lord Dattatreya who is the form of the Trinity, Brahma, Vishnu, and Siva, as they chant, “Gurur brahma, gurur vishnuhu gurur devo maheswaraha …” 
When these philosophical ideas are presented, some of you may express another doubt. 

The impression is entertained by many that in life a Guru should be approached only when all worldly desires have been satisfied, and when one is ready to renounce all involvements. Another false notion of some people is that Guru should be sought only after retirement, and that once a Guru is accepted, one has to give up everything, or will lose everything and will have to become a sanyasi. 

This is a mistaken idea. 
Why are we engaging in this discussion? We began with the premise that the countless desires that we experience stem from three basic desires which each individual wishes to fulfill. 

You may think that today you have only this one desire. Not just from this lifetime, but since innumerable past lifetimes you have been entertaining a multitude of desires. Some people adhere to only one desire through many consecutive lifetimes. 

Such a persistent single desire is tantamount to penance. But we do not follow that trend. We forget the old desires and come up with new desires each time. 

God in His compassion, has to satisfy all of our desires, and as a result we are forced to be born over and over again to experience the fulfillment of all such desires. 

Hence, it is better not to entertain any desires. You have heard the story of King Kartaveeryarjuna. It is the ultimate example of one who got all his desires fulfilled. 

If you study the history of Datta you will understand. Is anyone capable of asking for any greater boons than what Kartaveeryarjuna had asked for? Guru’s compassion granted him all his desires and bestowed even more boons upon him. 

Worship of Guru is the best worship. There are several different austerities and rituals of worship. But the facility with worship of Guru is that it is superior. 

Other manners of worship procure for you only what you ask for. 

But with worship of Guru you not only have all your worldly desires fulfilled, but you gain benefits that you had not even imagined. In addition, without your knowledge, your intellect develops towards the understanding of higher spiritual truths. 

That is why, although Kartaveeryarjuna approached Guru with a desire for kingdom, he ended up by climbing the spiritual ladder up to the level of becoming merged with his Guru. Even though he began with worldly desires, he did not simply remain at that level. 

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 20 / The Siva-Gita - 20 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
*🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 4 🌻*

అతస్త్యాం దీక్ష యిష్యామి - విర జాగ మమాశ్రితః,
తేన మార్గేణ మర్త్యత్వం - హిత్వా తేజో మయోభవ. 16

యేన హత్వా రణే శత్రూ- న్సర్వా న్కామా నవా ప్స్యసి,
అధ ప్రణమ్య రామస్తం - దండవ న్ముని సత్తమమ్. 17

ఉవాచ దుఃఖ నిర్ముక్తః ప్రహృష్టే నాంత రాత్మనా,

ఆ కారణము చేత శివునికి ప్రీతి దాయంబైన విరజా దీక్షను నీకు నొసంగెదను.
 ఆ పద్ధతి నాచరించి నీవు మానుషత్వమును వీడి తేజో మూర్తి వగుదువు. ఆ మార్గము శత్రు సంహారము చేయు కోరికను దీర్చును.

 (సూతుడు చెప్పుచున్నాడు ) ఆ మీదట శ్రీరాముడు నా అగస్త్య 
మహా ఋషికి దీర్ఘ దండ నమస్కారము గావించి, దుఃఖమును వీడి సంతసించిన వాడై యిట్లు పలికెను. (శ్రీరాముడు చెప్పును )

కృతార్దో హం మునే ! జాతో - వాంచి తార్దో మమా గతః
పీతాం బుధి: ప్రసన్నస్త్వం -యది మేకిము దుర్లభమ్ 18

అతస్త్యం విరజా దీక్షాం బ్రూహి మే ముని సత్తమ! 19

ఓయీ అగస్త్య మహా రుషీ! నేను నీ యనుగ్రహము వలన ధన్యుడ నైతి,
 ఇక మీదట నా అభిలాష నెరవేరి నట్లున్నది.

 సముద్రమున అర చేతన్ గొనియా పోశనం బొనర్చిన మీరు నన్ను 
అనుగ్రహింపు చుండగా నేనెట్లు సఫలము మనో రధుడను గాను?
 అందుచేత నన్ను అతి శీఘ్రముగా ననుగ్రహింపుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 20 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
*🌻 Viraja Deeksha Lakshana Yoga - 4 🌻*

15. For that reason, I would initiate you under 'Viraja Deeksha' which pleases lord Shiva. By following that method your human nature would get discarded and you would get filled with supreme aura. 

16. This method would fulfil your dream of vanquishing your enemies. Suta said: After that, Sri rama did prostrations to Agastya, became filled with happiness and said the following words 

17. Sri Rama said: O sage Agastya! I have become blessed today due to your grace. It looks like my wishes are going to be fulfilled now. 

18. You are the one who drank the entire ocean in three holy sips, when such a great sage has blessed me, how can I not succeed in achieving my goals? Therefore initiate me at the earliest. 

19. Agastya said: Eitehr on the Chaturdasi (fourteenth day) in Shuklapaksha (fortnight after the new moon day), or on the Ashtami day (eighth day), or on the Ekadashi day (eleventh), or any monday which falls under Arudra star; one should begin this rite called Pashupata Vratam. 

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 12 / Sri Gajanan Maharaj Life History - 12 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 3వ అధ్యాయము - 2 🌻*

ఆ బైరాగిని తనదగ్గరకు తేగానే మూడునెలల నుండి నీసంచిలో ఉంచిన మూటబయటకు తియ్యి అని శ్రీమహారాజు అనడంతో ఆబైరాగి ఆనందంలో మునిగి దొర్లడం ప్రారంభించాడు. 

సిగ్గులేకుండా నాకు గంజాయి ఇద్దామనుకుని వచ్చి ఇప్పుడు సంచిలోంచి తీయడానికి సిగ్గుపడతావేమి అని శ్రీమహారాజు అన్నారు. 

నేను తీసి ఇస్తున్న ఈగంజాయి నాజ్ఞాపకార్ధం శాశ్వతంగా శ్రీమహారాజు అంగీకరించాలని నివేదిస్తున్నాను అని చురుకైనబధిగల ఆబైరాగి అన్నాడు. మీకు గంజాయి అవసరంలేదు అనినాకుతెలుసు కానీ నా నవ్రమయిన ఈకానుకను కృపయా స్వీకరించడి. 

భక్తులయొక్క కోరికలన్నీ భగవంతుడు పూర్తిచేస్తాడు, ఉదాహరణకు శివుని తనగర్భంనుండి పిల్లవానిగా జన్మించమని అంజని ప్రార్ధించగా శివుడు అంగీకరించి మహారుద్ర హనుమాన్గా పుట్టాడు. 

ఈవిధంగా కోతిరూపంలో భగవాన్ శివుడు పుట్టడం తనభక్తుని కోరిక నెరవేర్చడంకోసమే. శ్రీగజానన్ కొద్దిగాసంకోచించారు, కానీ తరువాత అంగీకరించారు. అప్పుడు ఆబైరాగి గంజాయి తీసి, చేతిలో నలిపి, పొగగొట్టంలో నింపి శ్రీమహారాజుకు త్రాగేందుకు ఇచ్చాడు. ఈవిధంగా శ్రీగజానన్ గంజాయి త్రాగడం మొదలుపెట్టారు, కానీ దీనికి బానిస ఎన్నటికికాలేదు. తామరఆకు వలె ఈయన మక్కువకు, అనురాగాలకు అతీతులు. 

ఆబైరాగి కొద్దిరోజులు అక్కడ ఉండి రామేశ్వరానికి వెళ్ళిపోయాడు. శ్రీమహారాజు ఒక్కోసారి చక్కటి మధురవాణితో వేదపఠనం చేసేవారు. ఒక్కోసారి నిశ్శబ్దం పాటించేవారు. వేదపఠనం చేస్తున్నప్పుడు ఈయన బ్రాహ్మణుడు అని అనిపించేది. ఒక్కోసారి తనుతయారు చేసిన గీతాలను వేరువేరు రాగాలలో పాడేవారు, లేదా గణ గణ గణాతబోతే అనే తన మంత్ర పఠనం చేసేవారు. 

మిగిలినవేళ నిశ్శబ్దం పాటించేవారు, లేదా నిద్రపోయేవారు. ఒక్కోసారి పిచ్చివానిగా ప్రవర్తించేవారు లేదా అడవిలో తిరిగేవారు, లేదా ఊహంచని రీతిగా ఎవరి ఇంటిలోకయినావెళ్ళేవారు. జానారావ్ దేష్ ముఖ్ అనే ప్రఖ్యాతమయిన వ్యక్తి షేగాంలో ఉండేవాడు. ఆయన మరణశయ్యపైన ఉన్నాడు. వైద్యులు అందరూకూడా ఈయన బతకడంమీద ఆశలు వదులుకోమని అతనిబంధువులకు చెప్పారు. 

వారికి ఇదివిచారకరమయినవార్త. వారు భగవంతుడిని ప్రార్ధించారు, మొక్కుకున్నారు కాని ఉపయోగం లేకపోయింది. యోగులు చమత్కారం చెయ్యగలరు అనే నమ్మకంతో చివరి ఉపాయంగా వారు శ్రీగజానన్ దరికి చేరదామని అనుకున్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 12 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 3 - part 2 🌻*

When he was broughtforth, Shri Gajanan Maharaj said, “Take Out that bundle which you have been keeping in your bag for the last three months.”

 Overwhelmed with joy, the ascetic started rolling like a child before Shri Gajanan Maharaj . Maharaj said, “Shamelessly you vowed to offer Ganja to me and now feel shy to take it out of your bag.” 

The shrewd ascetic said that he would take it out and offer Ganja with a request that Shri Gajanan Maharaj , as a token of his remembrance, accept the offering permanently. 

He further said, “I know that You don’t need Ganja, but kindly accept it as my humble offering. God fulfills all the desires of devotees. For example, Anjani prayed to Lord Shiva to come to her womb and take birth as her child. 

Lord Shiva accepted and took birth as Maharudra Hanuman. Taking the form of a monkey was accepted by Lord Shiva to fulfil the desire of His devotee.” Shri Gajanan hesitated a bit but then agreed. 

The ascetic, then, took out Ganja, rubbed it in his hand, filled in the pipe and gave it to Shri Gajanan Maharaj to smoke. This is how Shri Gajanan started smoking Ganja, but He never became an addict to it. Just like a lotus leaf, he was free from attachments. 

The ascetic stayed there for a few days and then went away to Rameshwar. Sometimes Shri Gajanan Maharaj used to recite Vedic verses in sweet clear tones, while other times observed silence. 

His Reciting of the Vedas indicated that He was a Brahmin. Sometimes he used to sing a composition in different ragas or go on singing His Mantra, “Gan Gan Ganat Bote”. 

At other times He observed silence or quietly slept. Sometimes He behaved like a mad man, wandered in the jungles or entered somebody’s house unexpectedly. 

At Shegaon there was a famous man named Janrao Deshmukh. He was on deathbed and all the doctors declared him to be as a hopeless case, and accordingly notified his relatives. 

They prayed to God, took vows in exchange of his life, but to no avail. So they thought of the last remedy i.e. of approaching Shri Gajanan Maharaj with the belief that saints can perform any miracle. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 62 / Soundarya Lahari - 62 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

62 వ శ్లోకము

*🌴. సుఖ నిద్ర కొరకు 🌴*

శ్లో: 62. ప్రకృత్యా రక్తాయా స్తవ సుదతి దంతచ్ఛదరుచేః ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విదృమలతా l 
నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులా మధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా ll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా ! చక్కని పలువరుసలు కలిగిన తల్లీ ! స్వభావము చేత కాంతులు చిమ్ముతున్న నీ పెదవుల కాంతికి సారూప్యముగా ఈ ప్రపంచమున ఏమియూ లేదు, నీ పై పెదవి సహజమయిన కాంతి కలది, అట్టి కాంతికి సమానముగా "పగడము" తీగకు పండినచో పోలిక కాగలదు.పోల్చుదమన్నదానికి దొండపండును పెదవుల కాంతి సహజము కాదు, దొందపండును బింబమని పలికెదరు, అది కూడా నీ పెదవుల యొక్క ప్రతిబింబము వలననే ఆ పేరు వచ్చెను. కదా ! 

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 8 రోజులు జపం చేస్తూ, తీపి గారెలు, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా సుఖ నిద్ర లభించును అని చెప్పబడింది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 SOUNDARYA LAHARI - 62 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 62

*🌴 Good Sleep 🌴*

62. Prakrithya'rakthayas thava sudhati dantha-cchada-ruchaih Pravakshye saadrisyam janayathu phalam vidhruma-latha; Na bimbam tad-bimba-prathiphalana-raagad arunitham Thulam adhya'rodhum katham iva bhilajjetha kalaya. 
 
🌻 Translation : 
Oh goddess who has beautiful rows of teeth tried to find a simile to your blood red lips, and can only imagine the fruit of the coral vine. The fruits of the red cucurbit, hang its head in shame, on being compared to your lips, as it has tried to imitate its color from you, and know that it has failed miserably.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 8 days, offering sweet vada as prasadam, and Honey it is believed that they will be blessed by the lord to have a peaceful sleep.

🌻 BENEFICIAL RESULTS: 
Sound sleep for the sleepless, robust constitution and power of enticing people. 
 
🌻 Literal Results: 
Healthy constitution, contentment and tranquility.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  

🌹. శ్రీమద్భగవద్గీత - 361 / Bhagavad-Gita - 361 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 09 🌴

09. మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్త: పరస్పరమ్ |
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ ||

🌷. తాత్పర్యం :
నా శుద్ధభక్తుల ఆలోచనలు నా యందే నిమగ్నమై, వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై యుండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని, ఆనందమును అనుభవింతురు.

🌷. భాష్యము :
శుద్ధభక్తులు (వారి లక్షణములు ఇచ్చట పేర్కొనబడినవి) శ్రీకృష్ణభగవానుడు దివ్యమగు ప్రేమయుతసేవలో సంపూర్ణముగా నిమగ్నులై యుందురు. 

వారి మనస్సు లెన్నడును శ్రీకృష్ణచరణారవిందముల నుండి మరలవు. వారి చర్చలు ఆధ్యాత్మిక విషయముల పైననే పూర్ణముగా కేంద్రీకృతమై యుండును. కనుకనే వారి దివ్యలక్షణములు ఈ శ్లోకమున ప్రత్యేకముగా వర్ణింపబడినవి. అట్టి శుద్ధభక్తులు ఇరువదినాలుగుగంటలు శ్రీకృష్ణభగవానుని గుణములను మరియు లీలలను కీర్తించుట యందు లగ్నమై యుందురు. హృదయము మరియు ఆత్మ సదా శ్రీకృష్ణతత్పరములై యుండి వారు ఇతర భక్తులతో ఆ దేవదేవుని గూర్చి చర్చించుట యందు ఆనదమును ననుభవింతురు.

భక్తియోగపు ప్రాథమికదశ యందు సేవ ద్వారా దివ్యానందము ననుభవించెడి భక్తులు పరిపక్వస్థితిలో భగవత్ప్రేమ యందే వాస్తవముగా స్థితులగుదురు. 

అటువంటి దివ్యస్థితి యందు నెలకొనిన పిమ్మట శ్రీకృష్ణభగవానుడు తన ధామమునందు ప్రదర్శించు సంపూర్ణత్వమును వారు అనుభవింపగలరు. భక్తియుతసేవను జీవుని హృదయమునందు బీజమును నాటుటగా శ్రీచైతన్యమహాప్రభువు పోల్చియున్నారు. 

విశ్వమునందలి అసంఖ్యాకలోకములలో సదా పరిభ్రమించు అనంతకోటి జీవరాసులలో భాగ్యవంతులైన కొందరే శుద్ధభక్తుని సాంగత్యమును పొంది భక్తిని గూర్చి తెలియుట అవకాశమును పొందుదురు. ఈ భక్తియుతసేవ యనునది బీజము వంటిది. 

అట్టి భక్తిబీజము హృదయములో నాటబడిన పిమ్మట మనుజుడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను కృష్ణనామమును కీర్తించుటను, శ్రవణము చేయుటను నిరంతరము కొనసాగించినచో నిత్యము జలమొసగుటచే వృక్షబీజము మొలకెత్తు రీతి, ఆ భక్తిబీజము మొలకెత్తగలదు. పిమ్మట భక్తిలత క్రమముగా పెరిగి పెరిగి బ్రంహాండమును చేదించుకొని ఆధ్యాత్మికాకాశమునందలి బ్రహ్మజ్యోతిని చేరును. 

ఆధ్యాత్మికాకాశము నందును అది గోలోకబృందావనమగా పిలువబడు అత్యున్నతమైన దివ్యకృష్ణలోకమును చేరునంతవరకు పెరిగి పెరిగి అంత్యమున కృష్ణపాదారవిందమును చేరి అచ్చట విశ్రమించును. అటుపిమ్మట లతలు పుష్పములను, ఫలములను ఒసగురీతి భక్తిలత సైతము ఫల, పుష్పములను ఒసగును. అట్టి సమయమున కూడా శ్రవణ, కీర్తనల రూపమున జలసేవ భక్తిలతకు జరుగుచునే యుండును. 

ఇట్టి భక్తిలత చైతన్యచరితామృతమునందు (మధ్యలీల 19వ అధ్యాయము) విపులముగా వర్ణింపబడినది. భక్తిలత శ్రీకృష్ణభగవానుని చరణాశ్రయమును సంపూర్ణముగా పొందిన పిమ్మట మనుజుడు భగవత్ప్రేమ యందు పూర్ణముగా లీనమగునని దాని యందు వివరింపబడినది. 

అంతట జలమును వీడి మత్య్సము బ్రతుకలేనట్లు, భక్తుడు భగవానుని సంబంధము లేకుండా క్షణకాలమును జీవింపలేడు. అటువంటి దివ్యస్థితిలో భక్తుడు శ్రీకృష్ణభగవానుని సంబధమున దివ్యమైన లక్షణములను వాస్తవముగా పొందును. 

భగవానుడు మరియు అతని భక్తుల నడుమగల సంబంధపు వర్ణనలతోనే శ్రీమద్భాగవతము నిండియున్నది. 

కావున భాగవతముననే (12.13.18) తెలుపబడినట్లు అది భక్తులకు అత్యంత ప్రియమైనదై యున్నది (శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం ). శ్రీమద్భాగవతమునందు ధర్మము, అర్థము, కామము, మోక్షములను గూర్చిన చర్చలేదు. భగవానుడు మరియు భక్తుల దివ్యస్వభావము పూర్ణముగా వర్ణింపబడిన ఏకైక చరితము శ్రీమద్భాగవతమే. 

కనుకనే యువతీయువకులు ఒండరుల సాహచర్యమున ఆనందమును పొందురీతి, కృష్ణభక్తిభావన యందు పూర్ణతనొందిన మహాత్ములు అట్టి దివ్యశాస్త్రములను శ్రవణము చేయుట యందు నిత్యానందమును పొందుదురు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 361 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 09 🌴

09. mac-cittā mad-gata-prāṇā
bodhayantaḥ parasparam
kathayantaś ca māṁ nityaṁ
tuṣyanti ca ramanti ca

🌷 Translation : 
The thoughts of My pure devotees dwell in Me, their lives are fully devoted to My service, and they derive great satisfaction and bliss from always enlightening one another and conversing about Me.

🌹 Purport :
Pure devotees, whose characteristics are mentioned here, engage themselves fully in the transcendental loving service of the Lord. Their minds cannot be diverted from the lotus feet of Kṛṣṇa. Their talks are solely on the transcendental subjects. The symptoms of the pure devotees are described in this verse specifically. 

Devotees of the Supreme Lord are twenty-four hours daily engaged in glorifying the qualities and pastimes of the Supreme Lord. Their hearts and souls are constantly submerged in Kṛṣṇa, and they take pleasure in discussing Him with other devotees.

In the preliminary stage of devotional service they relish the transcendental pleasure from the service itself, and in the mature stage they are actually situated in love of God. Once situated in that transcendental position, they can relish the highest perfection which is exhibited by the Lord in His abode. 

Lord Caitanya likens transcendental devotional service to the sowing of a seed in the heart of the living entity. There are innumerable living entities traveling throughout the different planets of the universe, and out of them there are a few who are fortunate enough to meet a pure devotee and get the chance to understand devotional service. 

This devotional service is just like a seed, and if it is sown in the heart of a living entity, and if he goes on hearing and chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare, that seed fructifies, just as the seed of a tree fructifies with regular watering. 

The spiritual plant of devotional service gradually grows and grows until it penetrates the covering of the material universe and enters into the brahma-jyotir effulgence in the spiritual sky. 

In the spiritual sky also that plant grows more and more until it reaches the highest planet, which is called Goloka Vṛndāvana, the supreme planet of Kṛṣṇa. 

Ultimately, the plant takes shelter under the lotus feet of Kṛṣṇa and rests there. Gradually, as a plant grows fruits and flowers, that plant of devotional service also produces fruits, and the watering process in the form of chanting and hearing goes on. 

This plant of devotional service is fully described in the Caitanya-caritāmṛta (Madhya-līlā, Chapter Nineteen). It is explained there that when the complete plant takes shelter under the lotus feet of the Supreme Lord, one becomes fully absorbed in love of God; then he cannot live even for a moment without being in contact with the Supreme Lord, just as a fish cannot live without water. In such a state, the devotee actually attains the transcendental qualities in contact with the Supreme Lord.

The Śrīmad-Bhāgavatam is also full of such narrations about the relationship between the Supreme Lord and His devotees; therefore the Śrīmad-Bhāgavatam is very dear to the devotees, as stated in the Bhāgavatam itself (12.13.18). 

Śrīmad-bhāgavataṁ purāṇam amalaṁ yad vaiṣṇavānāṁ priyam. In this narration there is nothing about material activities, economic development, sense gratification or liberation. 

Śrīmad-Bhāgavatam is the only narration in which the transcendental nature of the Supreme Lord and His devotees is fully described. Thus the realized souls in Kṛṣṇa consciousness take continual pleasure in hearing such transcendental literatures, just as a young boy and girl take pleasure in association.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 188 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
42. అధ్యాయము - 17

*🌻. గుణనిధి చరిత్ర - 1 🌻*

అథ సప్తదశోsధ్యాయః

గుణనిధిచరిత్ర

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మణస్స తు నారదః | పునః పప్రచ్ఛ తం నత్వా వినయేన మునీశ్వరాః || 1

సూతుడిట్లు పలికెను -

ఓ మహర్షులారా! బ్రహ్మయొక్క ఈ పలుకులను వినిన నారదుడు వినయముతో నమస్కరించి ఆయనను మరల ఇట్లు ప్రశ్నించెను (1).

నారద ఉవాచ |

కదా గతో హి కైలాసం శంకరో భక్తవత్సలః | క్వ వా సఖిత్వం తస్యా సీత్కుబేరేణ మహాత్మనా || 2

కిం చ కార హరస్తత్ర పరిపూర్ణశ్శివాకృతిః | ఏతత్సర్వం సమాచక్ష్వ పరం కౌతూ హలం హి మే || 3

నారదుడిట్లు పలికెను -

భక్తవత్సలుడగు శంకరుడు కైలాసమునకు ఎప్పుడు వెళ్లెను ? ఆయనకు మహాత్ముడగు కుబేరునితో స్నేహము ఎక్కడ కలిగెను ? (2) 

మంగళ స్వరూపుడు, పరిపూర్ణుడనగు శివుడు అక్కడ ఏమి చేసెను? ఈ విషయమునంతనూ చెప్పుడు నాకు వినుటయందు అతిశయించిన కుతూహలము గలదు (3).

బ్రహ్మోవాచ |

శృణు నారద వక్ష్యామి చరితం శశి మౌలినః | యథా జగామ కైలాసం సఖిత్వం ధనదస్య చ || 4

ఆసీత్కాం పిల్య నగరే సోమయాజికులోద్భవః | దీక్షితో యజ్ఞదత్తాఖ్యో యజ్ఞవిద్యావిశారదః || 5

వేదవేదాంగ విత్ర్పాజ్ఞో వేదాంతాదిషు దక్షిణః | రాజమాన్యోsథ బహుధా వదాన్యః కీర్తి భాజనః || 6

అగ్ని శుశ్రూషణరతో వేదాధ్యయనతత్పరః | సుందరో రమణీయాంగ శ్చంద్ర బింబ సమాకృతిః || 7

బ్రహ్మ ఇట్లు పలికెను -

నారదా! వినుము. చంద్రమౌళి యొక్క చరితమును చెప్పెదను. ఆయన కైలాసమునకు ఎట్లు వెళ్లెను? కుబేరునితో స్నేహము ఎట్లు కలిగెను? అను విషయములను వివరించెదను (4). 

కాంపిల్య నగరములో యజ్ఞ దత్తుడను పండితుడు ఉండెను. ఆయన సోమయాజుల వంశములో జన్మించెను. ఆయన యజ్ఞదీక్షను స్వీకరించినవాడు, యజ్ఞ విద్యలో సమర్థుడు (5). 

వేదవేదాంగముల నెరింగిన వాడు, వేదాంతము మొదలగు వాటియందు సమర్థుడు, అనేక రాజసన్మానములను పొందిన వాడు, దాత, కీర్తి గలవాడు (6).

అగ్ని శశ్రూషయందు శ్రద్ధ గలవాడు, వేదాధ్యయమునందు నిరతుడు, రమణీయమగు అవయవములు గల సుందరుడు మరియు చంద్రబింబము వంటి ముఖము గలవాడు (7).

అసీద్గుణనిధిర్నామ దీక్షితస్యాస్య వై సుతః | కృతోపనయనస్సోఎ్టౌ విద్యా జగ్రాహ భూరిశః || 8

అథ పిత్రానభిజ్ఞాతో ద్యూత కర్మరతోsభవత్‌ | ఆదాయాదాయ బహుశో ధనం మాతుస్సకాశతః || 9

సమదాద్ద్యూత కారేభ్యోమైత్రీం చకార సః | సంత్యక్త బ్రాహ్మణాచారస్సంధ్యాస్నాన పరాజ్ముఖః || 10

నిందకో వేదశాస్త్రాణాం దేవ బ్రహ్మణ నిందకః | స్మృత్యాచార విహీనస్తు గీతవాద్య వినోదభాక్‌ || 11

నట పాఖండ భాండైస్తు బద్ధ ప్రేమపరంపరః |

దీక్షితుడగు యజ్ఞ దత్తునకు గుణనిధియను కుమారుడుండెను. అతడు ఎనిమిదవ యేట ఉపనీతుడై అనేక విద్యలనభ్యసించెను (8). 

ఆతడు తండ్రికి తెలియకుండగా జూదమునందు అభిరుచి గలవాడాయెను. తల్లివద్ద నుండి అనేక పర్యాయములు ధనమును తీసుకొని (9) 

జూదగాళ్లకు ఆ ధనమును సమర్పించి, వారితో మైత్రిని చేసెను. ఆతడు స్నానసంధ్యాది బ్రాహ్మణాచారముల యందు రుచిలేని వాడై వాటిని పరిత్యజించెను (10). 

ఆతడు వేద శాస్త్రములను, దేవబ్రాహ్మణులను నిందించువాడై, స్మృతి, విహితములగు ఆచారములను విడనాడి సంగీతము మొదలగు వినోదములయందు నిమగ్నుడాయెను (11).

ఆతడు నటులతో, హాస్యగాళ్లతో, మరియు పాపులతో దృఢమగు స్నేహమును చేసెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 63 🌹*
Chapter 18
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 God is not Asleep 🌻*

Every ordinary human being must sleep, because every ordinary person exerts himself physically while awake. The Avatar is no ordinary man, and he is never asleep even after he has dropped his body.

When he, the Avatar, declares he sleeps between advents for 700 or 1400 years, it does not mean he is asleep, but that he is resting, and that he does not have to exert physically to do his work. The Avatar has already completed the work for the next 700 years, up to his next advent. 

So whatever is required for his universal work, he has made provisions to accomplish those results through his impersonal INFINITE CONSCIOUS- NESS. There is no physical exertion during those periods 700 to 1400 years when he is not physically present.

 Nevertheless he always maintains the responsibility for the universe.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 59 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 26
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. ముద్రల లక్షణము 🌻*

అథ షడ్వింశో7ధ్యాయః

అథ ముద్రాలక్షణమ్‌

నారద ఉవాచ :

ముద్రాణాం లక్షణం వక్ష్యే సాన్నిధ్యాది ప్రకారమ్‌ | అఞ్జలిః ప్రథమా ముద్రా వన్దనీ హృదయానుగా. 1

నారదుడు పలికెను :

దేవతాసాంనిధ్యాదులను కలిగించు ముద్రల లక్షణమును చెప్పెదను.

 హృదయమునకు సమీపమున కట్టబడిన అంజలి మొదటి ముద్ర. రెండవది వందని. మూడవది హృదయానుగ.

ఊర్ధ్వాఙ్గష్ఠో వామముష్టిర్దక్షిణాఙ్గుష్ఠబన్ధనమ్‌ | సవ్యస్య తస్య చాఙ్గష్ఠో యస్య చోర్ధ్వే ప్రకీర్తితః. 2

తస్రః సాధారణావ్యూహే అథాసాధారణా ఇమాః | కనిష్ఠికాదివిమో కేన అష్టౌ ముద్రా యథాక్రమమ్‌. 3

ఎడమచేతి పిడికిలిని బొటనవ్రేలు పైకినిలచి ఉండునట్లును, (అంజలి) కుడిచేతి బొటనవ్రేలు వంచిబింధించినట్లును (వందని) ఉంచవలెను. అట్లే రెండు పిడికెళ్ళ అంగుష్ఠములును పైకి నిలచి ఉండవలెను. (హృదయానుగ). 

ఈ మూడును వ్యూహామునందు సాధారణముద్రలు. వరుసగా కనిష్ఠిక మొదలైన వాటిని విడువగా ఏర్పడిన ఎనిమిది ముద్రలు అసాధారణములు.

అష్టానాం పూర్వబీజానాం క్రమశ స్త్వవధారయేత్‌ | అఙ్గుష్ఠేన కనిష్ఠాన్తం నామయిత్వాఙ్గులిత్రయమ్‌. 4

ఊర్ధ్వం కృత్వా సంముఖం చ బీజాయ నవమాయవై | వామహస్త మథోత్తానం కృత్వోర్థ్వం నామయేచ్ఛనైః.

వరాహస్య స్మృతౌ ముద్రా అఙ్గానాం చ క్రమాదిమాః | ఏకైకాం మోచయేద్బద్ధ్వా వామముష్టౌ తథాజ్గులీమ్‌.

ఆకుఞ్చయే త్పూర్వముద్రాం దక్షిణప్యేవ మేవ చ | ఊర్ధ్వాఙ్గుష్ఠో వామముష్టిర్మద్రాసిద్ధిస్తతో భవేత్‌. 7

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ముద్రా లక్షణం నామ షడ్వింశోధ్యాయః.

ఈ ఎనిమిది ముద్రలను పూర్వము చెప్పిన బీజములు ఎనిమిదింటికిని క్రమముగా వినియోగించవలెను. కనిష్ఠిక వరకును ఉన్న మూడు వ్రేళ్ళను అంగుష్ఠముచేత వంచి, పైకి ఉండునట్లును, సంముఖముగాను చేసి నవమబీజమునకు వినియోగించవలెను. 

వామహస్తమును తిరగదీసి మెల్లగా పైకి వంచవలెను. అది వరాహముద్ర. అంగములకు వరుసగా ఈ చెప్పబోవు ఎనిమిది ముద్రలు ఉపయోగించవలెను.

 వామముష్టియందు ఒక్కొక్క వ్రేలిని ముణిచి చూపవలెను. పూర్వముద్రను వంచవలెను. దక్షిణహస్తమునందు కూడ ఇట్లే చేయవలెను.

 వామముష్టియందలి అంగుష్ఠము నిలచి ఉండును. ఈ విధముగా చేసినచో ముద్రాసిద్ధి కలుగును.

అగ్ని మహాపురాణమునందు ముద్రాలక్షణ మను షడ్వింశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 74 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భృగువు మహర్షి - ఖ్యాతి - 10 🌻*

63. మంత్రాన్ని ఉచ్చరించి ఒక దర్భను అక్కడ పడేస్తే, వెళ్ళి శత్రువును అంటించి వచ్చేది ఒకనాడు. అదీ మంత్రాల శక్తి అంటే! ఇప్పుడు లేదు. అంటే నిరర్థకము, వ్యర్థము, అర్థరహితమూ అని కాదు. 

64. అలాంటి విశేషమైన, సృష్టిని మార్పుచేయగలిగినటువంటి శక్తి ఒకనాడు వేదమంత్రాలలో ఉండేది. మన ఆర్యసంస్కృతి ఇప్పుడు అన్నిదశలూ దాటి భాగవతమతమనే ఒకక్షేత్రానికి వచ్చింది. పరిభ్రమణం చేసిచేసి చిట్టచివరకు భాగవతమతంలో ప్రవేశించాము. 

65. నేటి మన యజ్ఞములు పూర్వమీమాంసాయజ్ఞములు కావు, ఇవి భావతయజ్ఞములే. ఆ మంత్రాలను వాడుకుని ఈశ్వరుణ్ణి మనం యజ్ఞక్రియద్వారా ప్రార్థిస్తున్నాము. ఆ భాష, వేదమంత్రములు వాడుకుంటున్నామంతే.

66. ప్రతీమంత్రానికి ఒక శక్తి ఉంటే ఆ శక్తి ఎవరిది? అని ప్రశ్న. అది పరమేశ్వరుడియొక్క ఒక అంశ. సముద్రంలో ఒక చుక్క అది. సముద్రమంతా ఆ ఈశ్వరుడయితే, ఒక్కొక్క మంతం ఒక్కొక్క చుక్క. ఆ చుక్కలన్నిటిలోనూ జలముందికానీ సముద్రంలో లేదు అనరాదు.

67. పూర్వమీమాంసకుడు ఆ ఈశ్వరుడి అంగములనే ఆరాధించి ఫలం పొందుతున్నాడు. అతడియొక్క అంశను మాత్రం ఆరాధించటం వంటిదిది. సంపూర్ణమైన ఈశ్వరతత్వం మరపురావటంచేత, కేవల పూర్వమీమాంసలో ఆత్యంతికమయిన ఫలం దొరకటంలేదు.

68. జాతిని, విద్యను బట్టి బ్రహ్మణజన్మ ఎత్తి విద్యావంతుడై వేదములను చదువుకున్నా, ధ్రమభ్రష్టుడయితే అలాంటి బ్రాహ్మణుడిని చంపితే బ్రహ్మహత్యాదోషం లేదు. అని భృగుమహర్షి చెప్పాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 138 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻. Me and the MINE 🌻*

Does love act deliberately?
Yes and no. Lifeme and the mine is love and love is life. What keeps the body together but love? 

What is desire, but love of the self? What is fear but the urge to protect? And what is knowledge but the love of truth? 

The means and forms may be wrong, but the motive behind is always love — love of the me and the mine. 

The me and the mine may be small, or may explode and embrace the universe, but love remains.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 139 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 CREATIVITY 🌻*

Maruti (Nisargadatta Maharaj's original name) eventually took on the name Nisargadatta, meaning “naturally (nisarga) given (datta)” or, more loosely, “one dwelling in the natural state.” 

“Nis-arga” literally means “without parts,” and suggests the unfragmented, seamless, solid Awareness of a sage. 

As he later told a dear disciple and successor, Jean Dunn: “At one time I was composing poems. Poems used to flow out of me and, in this flow, I just added ‘Nisargadatta.’ 

I was reveling in composing poems until my Guru cautioned me, ‘You are enjoying composing these poems too much; give them up!’ 

What was he driving at? His objective was for me to merge in the Absolute instead of reveling in my beingness.”

- Consciousness and the Absolute
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 77 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. Q 73 :-- Code language (కోడ్ లాంగ్వేజ్) 🌻*

Ans :--
1) onion కి అనేక పొరలున్నట్లే మన దేహం కూడా అనేక పొరలను కలిగి ఉంది.

ఇప్పుడు మనం ఏ దేహాన్ని కలిగి ఉన్నా స్త్రీగాగాని, పురుషుడుగగాని గతజన్మలకు సంబందించిన దేహాలు ఆ జన్మలలో పొందిన ఆధ్యాత్మిక జ్ఞానం కోడ్ లాంగ్వేజ్ అనగా విద్యుదయస్కాంత శక్తి రూపంలో అంతర్ శక్తిలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. మనం ఆ దేహాలను ఆ కోడ్ లాంగ్వేజ్ ని అంతరేంద్రియాల ద్వారా దర్శించే వీలుంది.

2) ఇప్పుడు మనం ధరించి ఉన్న దేహం యొక్క genetic నిర్మాణం గత జన్మల్లో మనం సంపాదించిన ఆధ్యాత్మిక జ్ఞానం బట్టి ఉంటుంది. మన దేహంలోని జీవకణాలన్నీ అనేకానేక జన్మల్లో పొందిన జ్ఞానాన్నంతటిని కోడ్ లాంగ్వేజ్ రూపంలో దాచుకుని ఉన్నాయి.

3) ఉల్లిపాయను గమనిద్దాం, ఉపరితలం లో ఉన్న పొర మాత్రమే మనకు కనిపిస్తుంది. లోపల పొరలు కనిపించవు. ఉల్లిపాయకు ఉన్న ప్రతి పొరలో విద్యుదయస్కాంత శక్తి,జీవరసాయినిక శక్తి ఉండటం వల్ల ఉల్లిపాయకు ఒక ఆకారం ఏర్పడింది. ఉల్లిపాయకు గల రుచి,దాని ఘాటు వాసనలు దానిలో ఉన్న చైతన్య శక్తి వల్ల వచ్చింది. 

అలాగే వర్తమానంలో మనకు దేహం మాత్రమే కనిపిస్తుంది. మిగతా అనేకానేక జన్మలలోని దేహాలు అదృశ్యపొరలు వలె మన దేహంలోనే ఇమిడి వున్నాయి .ఈ దేహాలన్నీ చైతన్య శక్తి ద్వారా అనుసంధానింపబడి ఉన్నాయి.

4) అనేకానేక జన్మల్లో ధరించిన దేహాలు ఆధ్యాత్మిక జ్ఞానం చైతన్య పరిణామం అంతా ఆత్మశక్తి కి వారసత్వంగా సంక్రమిస్తుంది.

5) మనం అనారోగ్యం తో ఉన్నామనుకోండి,గత జన్మలో మన ఆరోగ్యకరమైన దేహం యొక్క జెనెటిక్ కోడ్ లాంగ్వేజ్ ని ప్రస్తుత దేహంలోకి చొప్పించి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

6) ఈ జన్మలో మనకు ధైర్యం లేదనుకోండి,గత జన్మలో ధైర్యవంతుడిగా మనం పొందిన అనుభవాల ద్వారా ధైర్యాన్ని మనకు మనమే ప్రాప్తించుకోవచ్చు.

7) ఈ కోడ్ లాంగ్వేజ్ transfer చేసుకోవడానికి స్వప్నాలు,అంతర్ ప్రపంచం మనకు ఉపయోగపడతాయి.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 23 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం - 11 🌻*

గ్రామాలలో, పట్టణాలలో నెత్తుటి వాన కురిసేను..

రక్తం మాదిరిగా ఎరుపు రంగులో వానలు పడటం కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు చూశారు. వివిధ రసాయనాలు, వాతావరణ కాలుష్యం కారణంగా ఎరుపురంగు వర్షం పడుతోందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.

సూర్యుడు, చంద్రుడు ఉన్నంతవరకు నా మఠానికి పూజలు జరుగుతూనే ఉంటాయి. నా మఠానికి ఈశాన్యం వైపు ఒక చిన్నదానికి చిన్నవాడు పుట్టేను.. అతడు ”నేనే భగవంతుడను నన్ను పూజించండి ” అని పలుకుతాడు..

నెల్లూరు సీమ మొత్తం నీట మునిగి ఉంటుంది..

తుఫాను సమయంలో నెల్లూరు మొత్తం జలమయం అవడం అనేక సంవత్సరాలుగా మనకు తెలుసు కదా.

🌻. నవాబుకు కాలజ్ఞానం వినిపించిన వీరబ్రహ్మేంద్రస్వామి - 1 🌻

వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన జోస్యాలు, మహిమల గురించి బనగానపల్లె నవాబు విన్నాడు. అతనికి నమ్మకం కలగలేదు. అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలి అనుకున్నాడు. పోతులూరి చెప్పేవి సత్యాలో కాదో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాక భటులచేత బ్రహ్మంగారిని పిలిపించాడు. ఆయనకు ఎదురువెళ్ళి నమస్కారం చేసి, స్వాగతం పలికాడు. తర్వాత ఆయనను ఒక ఆసనంపై కూర్చోబెట్టారు.

నవాబు, తన సేవకుడిని పంపి స్వామివారు తినేందుకు పండ్లు, ఫలహారాలు తెప్పించాడు. అందులో మాంసాహారం పెట్టి తీసుకురమ్మని ముందుగానే పురమాయించాడు.

నవాబు ఆదేశాన్ని అనుసరించి, సేవకుడు కొన్ని మాంస ఖండాలను పళ్ళెంలో ఉంచి, వాటిపై వస్త్రం కప్పి, వినయంగా స్వామివారికి ఇచ్చాడు. ఆ పళ్ళెం పైనున్న వస్త్రాన్ని తీస్తే తాను ఫలహారం స్వీకరిస్తానని స్వామివారు చిరునవ్వుతో చెప్పాడు. ఆ సేవకుడు వస్త్రాన్ని తొలగించాడు.

నవాబు ఆశ్చర్యపోయే విధంగా ఆ పళ్ళెంలో పుష్పాలున్నాయి. ఈ ఉదంతంతో వీరబ్రహ్మేంద్రస్వామి నిజంగా శక్తివంతుడే అని బనగానపల్లె నవాబు నమ్మక తప్పలేదు. వెంటనే నవాబు క్షమాపణ చెప్పాడు. తనకు కూడా కాలజ్ఞానం వినిపించాలని కోరాడు.

అప్పుడు బ్రహ్మంగారు నవాబుకు కొన్ని సంగతుల గురించి వివరించాడు. ఆయన చెప్పిన వాటిలో కొన్ని ముఖ్యమైనవి…

విచిత్రమైన ఈత చెట్టొకటి పుట్టి రాత్రులు నిద్ర పోతుంది. పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరవు ఏర్పడుతుంది…

ఈ విషయం యదార్ధంగా జరిగింది. గుంటూరు జిల్లా చేబ్రోలు దగ్గర ఒక పొలంలో ఉన్న ఈతచెట్టు అచ్చం బ్రహ్మంగారి కధనాన్ని పోలి ఉండేది. రాత్రిపూట ఆ పొలంలో ఉన్న డొంక రోడ్డుకు అడ్డంగా పడుకునేది. మళ్ళీ సూర్యోదయం కాగానే లేచి నిలబడేది. ఈ వింత చెట్టు గురించిన విషయం అప్పట్లో ఫొటోలతో సహా దినపత్రికలో ప్రచురితమైంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 6 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴*

*🌻 STANZA II - The Knowledge of the Heart - 1 🌻*

13. The Day arrived. The Wheel gradually gained momentum and led human Hearts towards Knowledge — something the Hearts had known for a long time.

But man was not yet able to comprehend the Wisdom of his own Heart. He had not actually guessed that the Heart was capable of knowing. 

And all the while, the still, small Voice, which imparted the wise counsel of Life, was practically inaudible to the insensitive human ear. And even when that Voice rang out with unmistakable clarity, like an alarm bell, calling its hearers to arm themselves with the Power of Love on the eve of death, man attempted to muffle it, preferring to take a roundabout route through the labyrinths and machinations of the mind.

 But the intellect was not able to perceive what the Heart knew, for it was subject to decay. Evil could easily penetrate thereinto, not fearing any encounter with the bright, dazzling Light of Fiery Thought. Man could think only on the lowest levels. And so the Wheel began a New Round.

14. People gradually began to pay attention to the leadings of their own Heart, becoming convinced that the mind’s contemplations, more often than not, led them to wrong conclusions. 

And the barely perceptible Voice of the Heart, it appeared, had presaged the Truth... And so there was a pressing need to hearken to that which possessed the Wisdom of insight. 

But how to do this? How is it possible to avoid mistaking the voice of the mind for the inaudible tremors of the currents of the Heart? People became thoughtful once again. 

And the Heart meanwhile was still waiting for the time when it would be accepted as the best and most faithful friend...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 17 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము - 5 🌻*

మానవులకు శ్రేయోమార్గము, ప్రేయోమార్గము అను ఈ రెండును అనుసరింపదగినవిగానే తోచును. ఈ రెంటిలో కల భేదమును సామాన్య మానవుడు గుర్తింపలేకున్నాడు.

 ధీరుడగు విద్వాంసుడు ప్రేయస్సుకంటే శ్రేయస్సే శ్రేష్టమైనదని తలంచి దానినే అనుసరించును. మందబుద్ధికలవాడు ధనమును, గృహారామ క్షేత్రాదులను సంపాదించి వానిని కాపాడుట యనెడి యోగక్షేమాత్మకమైన ప్రేయోమార్గమునే శ్రేష్టమైనదానినిగా తలంచి ఆ మార్గమునే అనుసరించును.

 సాధారణముగా మానవులలో అధికసంఖ్యాకులు ధనసంపాదనకు దాని రక్షణను గొప్పగా భావించి తమ జీవితములను గడుపుచున్నారు. వారు పరమును గురించి ఆలోచింపరు. వారు శాశ్వత సుఖమునిచ్చు శ్రేయోమార్గమునకు దూరముగా నుందురు.

   మన గురించి బాగా చెప్పాడు ఇక్కడ. చూడండి. కృతయుగకాలంలోనే జీవులందరూ కలియుగంలో ఎలా వుంటారనేది ఈ ఉపనిషత్తులో చక్కగా బోధించాడు. 

ఇవ్వాళ మనందరి జీవితాలను గమనిస్తే వెనక్కి తిరిగి ఏం కనబడుతున్నదీ అంటే ఐహికమైనటువంటి, ఇహలోక సంబంధమైనటువంటి, పరిణామము చెందేటటువంటివి, వాటిని మాత్రమే శాశ్వతమని తలంచుచున్నాము. మనం ఎవరినైనా ఒక ప్రశ్న వేశామనుకోండి , నాయనా! నువ్వు నీ జీవితంలో ఎప్పటికి స్థిరపడతావు? అని అడుగుతాం. యవ్వనంలోకి ప్రవేశించిన వారందరినీ కూడా మనం అడిగే ప్రశ్న ఏమిటంటే, నీ జీవితంలో నువ్వు ఎప్పటికి స్థిరపడతావు? 

 ఏమిటి స్థిరపడటమంటే అని తిరిగి ప్రశ్నిస్తే వివాహం చేసుకోవడం, రెండు ఇల్లు కట్టడం, మూడు పిల్లల్ని కనడం, నాలుగు వస్తు సముదాయాన్ని సమీకరించుకోవడం , అయిదు వారసులందరికీ , వచ్చే మూడు నాలుగు తరాలకు సరిపడా ధనార్జన చేయడం - ఇవన్నీ కలిపి మనం స్థిరపడటం క్రింద లెక్కేసుకోవడం మొదలుపెట్టాం. ఇదంతా ప్రేయోమార్గము. 

మానవుడికి ఎన్ని చెప్పుల జతలు వుండాలి అసలు అని ఆలోచిస్తే ఒక జత సరిపోతుంది కదా. మహా అయితే రెండు జతలు సరిపోతాయి కదా. కాని ఇవ్వాళ ఎవరింట్లో చూసినా కూడా ఒక చెప్పుల షాపు వుంటుంది.

 ప్రయోజనమేముంది? ప్రయోజనం లేదు కదా. అలాగే ప్రతి వస్తు సముదాయమునకు ఒక పేద్ద షాపు maintain చేయడం అలవాటు చేసుకున్నాం. 

తద్వారా ఏమైంది? ఆ యా వస్తువులను సరియైనటువంటి పద్ధతిలో వుంచలేము, క్రమమైన మార్గములో వాటిని శుద్ధి చేయలేము, శుద్ధి చేసిన వాటిని మరల తిరిగి వుంచలేము, వాటిని సరిగా సర్దుకోలేము, వాటిని సరిగా ఏర్పాటు చేసుకోలేము, ఆ వస్తువులని ఏర్పాటు చేసుకోలేక, ఆ వస్తువులను సరిగా సరిదిద్దుకోలేక సతమతమైపోతూ వాటిల్లో సుఖంగా వున్నానని భ్రమ చెందుతున్నాడనమాట. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 2 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 2 🌻*

5. సత్యమేయైన శాశ్వతత్వములో, అద్వితీయమైన, అనంతమైన,
శాశ్వతమైన, సర్వవ్యాపకమైన అస్థిత్వమే ఉన్నది.

6. భగవంతుని అనాది అనంత ఆది మూలస్థితి - పరాత్పర పరబ్రహ్మ స్థితి
(“భగవంతుడు ఉన్నాడు” అను స్థితి)

7. God “IS”= సత్‌ (భగవంతుడు ఉన్నాడు), నిస్సీమ కేవల శూన్యత్వం.
భగవంతుని, యీ “ఆదిమూల అపార కేవల శూన్యస్థితి” లో,
ఏ వ్యక్త స్థితియు లేదు. అది అవ్యక్తస్థితి.
గుప్తొతి గుప్తము ( అంతరాంతర్ష్నిహితము ) గ్రహింపరానిది,
ఇది అని చెప్పరానిది (నేతి, నేతి), అసాధ్యమైనది.
భగవంతుని అంతర్నిహిత శక్తియే (శక్యత) భగవంతుని అంతరస్థితి.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

  *🌹. Balance Your Thoughts and Actions 🌹*
*✍ Pt. Shriram Sharma Acharya* 
*📚. Prasad Bharadwaj*

*When the mind is pulled in too many directions, it cannot    accomplish anything. It becomes disturbed by half- completed tasks and runs out of control. When it is burdened with too many tasks, it cannot complete a single one. You quickly lose time, energy, and most importantly, temper. By limiting your tasks and organizing your thoughts, you will not be as likely to waste your energies, and you will be able to achieve greater success in the tasks you undertake.*

*Before starting a task, saturate your mind with noble thoughts. This is the formula for worldly success. While we cannot change Situations, we can change ourselves to accommodate a situation and remain cheerful.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹