శివగీత - 20 / The Siva-Gita - 20

🌹. శివగీత - 20 / The Siva-Gita - 20 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 4 🌻

అతస్త్యాం దీక్ష యిష్యామి - విర జాగ మమాశ్రితః,
తేన మార్గేణ మర్త్యత్వం - హిత్వా తేజో మయోభవ. 16

యేన హత్వా రణే శత్రూ- న్సర్వా న్కామా నవా ప్స్యసి,
అధ ప్రణమ్య రామస్తం - దండవ న్ముని సత్తమమ్. 17

ఉవాచ దుఃఖ నిర్ముక్తః ప్రహృష్టే నాంత రాత్మనా,

ఆ కారణము చేత శివునికి ప్రీతి దాయంబైన విరజా దీక్షను నీకు నొసంగెదను.
 ఆ పద్ధతి నాచరించి నీవు మానుషత్వమును వీడి తేజో మూర్తి వగుదువు. ఆ మార్గము శత్రు సంహారము చేయు కోరికను దీర్చును.

 (సూతుడు చెప్పుచున్నాడు ) ఆ మీదట శ్రీరాముడు నా అగస్త్య 
మహా ఋషికి దీర్ఘ దండ నమస్కారము గావించి, దుఃఖమును వీడి సంతసించిన వాడై యిట్లు పలికెను. (శ్రీరాముడు చెప్పును )

కృతార్దో హం మునే ! జాతో - వాంచి తార్దో మమా గతః
పీతాం బుధి: ప్రసన్నస్త్వం -యది మేకిము దుర్లభమ్ 18

అతస్త్యం విరజా దీక్షాం బ్రూహి మే ముని సత్తమ! 19

ఓయీ అగస్త్య మహా రుషీ! నేను నీ యనుగ్రహము వలన ధన్యుడ నైతి,
 ఇక మీదట నా అభిలాష నెరవేరి నట్లున్నది.

 సముద్రమున అర చేతన్ గొనియా పోశనం బొనర్చిన మీరు నన్ను 
అనుగ్రహింపు చుండగా నేనెట్లు సఫలము మనో రధుడను గాను?
 అందుచేత నన్ను అతి శీఘ్రముగా ననుగ్రహింపుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 20 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
🌻 Viraja Deeksha Lakshana Yoga - 4 🌻

15. For that reason, I would initiate you under 'Viraja Deeksha' which pleases lord Shiva. By following that method your human nature would get discarded and you would get filled with supreme aura. 

16. This method would fulfil your dream of vanquishing your enemies. Suta said: After that, Sri rama did prostrations to Agastya, became filled with happiness and said the following words 

17. Sri Rama said: O sage Agastya! I have become blessed today due to your grace. It looks like my wishes are going to be fulfilled now. 

18. You are the one who drank the entire ocean in three holy sips, when such a great sage has blessed me, how can I not succeed in achieving my goals? Therefore initiate me at the earliest. 

19. Agastya said: Eitehr on the Chaturdasi (fourteenth day) in Shuklapaksha (fortnight after the new moon day), or on the Ashtami day (eighth day), or on the Ekadashi day (eleventh), or any monday which falls under Arudra star; one should begin this rite called Pashupata Vratam. 

Continues....
🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment