✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 2 🌻
5. సత్యమేయైన శాశ్వతత్వములో, అద్వితీయమైన, అనంతమైన,
శాశ్వతమైన, సర్వవ్యాపకమైన అస్థిత్వమే ఉన్నది.
6. భగవంతుని అనాది అనంత ఆది మూలస్థితి - పరాత్పర పరబ్రహ్మ స్థితి
(“భగవంతుడు ఉన్నాడు” అను స్థితి)
7. God “IS”= సత్ (భగవంతుడు ఉన్నాడు), నిస్సీమ కేవల శూన్యత్వం.
భగవంతుని, యీ “ఆదిమూల అపార కేవల శూన్యస్థితి” లో,
ఏ వ్యక్త స్థితియు లేదు. అది అవ్యక్తస్థితి.
గుప్తొతి గుప్తము ( అంతరాంతర్ష్నిహితము ) గ్రహింపరానిది,
ఇది అని చెప్పరానిది (నేతి, నేతి), అసాధ్యమైనది.
భగవంతుని అంతర్నిహిత శక్తియే (శక్యత) భగవంతుని అంతరస్థితి.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment