అష్టలక్ష్మి ప్రార్థనలు - తాత్పర్యము Ashtalakshmi Prayers


🌹. అష్టలక్ష్మి ప్రార్థనలు - తాత్పర్యము 🌹

ప్రసాద్ భరద్వాజ

1. సంతాన లక్ష్మి, 2.ఆదిలక్ష్మి, 3.గజలక్ష్మి , 4.ధనలక్ష్మి, 5.ధాన్యలక్షి, 6.విజయలక్ష్మి, 7.ఐశ్వర్యలక్ష్మి, 8.వీరలక్ష్మి


🍀. సంతాన లక్ష్మీ ప్రార్థన 🍀


శ్లో : దరహసిత మనోజ్ఙాన్‌ కర్దమానంద ముఖ్యాన్‌

కరధృత విజ హస్తాన్‌ లాలయన్తీ స్వపుత్రావ్‌ః

వితరతు పరితుష్టా స్మాసు సంతాన లక్ష్మీః

మహిత సుగుణ భవ్యాం. సంతతిం సంతతేర్నః


భావం:- చిరునవ్వుతో ముచ్చట గలిగించు కర్దముడు, ఆనందుడు, చిక్తీతుడు అను తన కుమారులను ప్రేమతో ఎత్తుకొని లాలించుచూ ఆనందించు నట్టి సంతాన లక్ష్మి గుణ శ్రేష్ఠులైన మంచి సంతానమును మాకు ప్రసాదించుగాక.


🍀. ఆదిలక్ష్మీ స్తుతి 🍀

శ్లో : కరయుగ ధృత పద్మా పద్మ మాలాభిరామా

శ్రీతజన నిధిరేషా సర్వ లోకైక మాతా

కమల నయన వక్షఃపీఠ మాతస్ధుషీనః

ప్రదిశతు పురషార్థా నాది లక్ష్మీ రభీష్టాన్‌ః


భావం:- హస్తముల యందు పద్మములను, కంఠమున పద్మమాలను ధరించి ప్రకాశించునదియూ, ఆశ్రయించిన భక్తుల కోరికలను తీర్చుటలో విధి వంటిదియూ, సర్వ జగత్తుకూ ఏకైక మాతయూ, పుడరీకాక్షుని వక్ష స్థలము నిత్య నివాసముగా గలదియునగు ఆదిలక్ష్మీ ధర్మార్థ కామ మోక్షాది సకల పురుషార్థములను, సర్వాభీష్టములను దయతో మాకు అనుగ్రహించుగాక.


🍀. గజలక్ష్మీ ప్రార్థన 🍀

శ్లో : జలజ మధి వసన్తీ మత్త వేదండ శుండో

ధృతి జల కణికాభి స్పిచ్చ మానా నితాన్తమ్‌ః

నత జన దురవస్థా ధంసనీయమ గజాన్తాం

ప్రదిశతు గజలక్ష్మీ స్పంపదం న స్పమృద్దామ్‌ః


భావం:- పద్మమున కూర్చున్నదియూ, రెండు వైపులా మదపుటేనుగులు తొండములతో నీరు గ్రహించి చేయు అభిషేకమును స్వీకరించుచున్నదియ, ఆశ్రయించిన భక్తుల దురవస్థలను నశింపజేయునట్టిదియూ అయిన గజలక్ష్మీ గజములను (ఏనుగులను) పోషింప గల సమృద్ధమైన సంపదను ఇచ్చి కాపాడుగాక.


🍀. ధనలక్ష్మీ ప్రార్థన 🍀

శ్లో : ధనపతి ముఖదేవై స్తూయమానా దయార్ధ్రా

దినకర విభవర్లా బిల్వ వృక్షాలయా శ్రీః

ధృత నవవిధి హస్తా దేవతా మంగళానాం

వితరతు ధనలక్ష్మీ విత్త రాశీన్‌ పదా నః

భావము:- మహా ధనాధిపతియైన కుబేరుడు, మున్నగు దేవతలచే స్తుతింపబడుచున్న దయా స్వరూపిణీయూ, సూర్యుని కాంతితో సమనమైన శరీరచ్ఛాయ కలదియూ, మారేడు వృక్షము నివా సముగా గలదియూ ‘మంగళం మంగళానాం’ అనురీతిగా శుభ ములను సాధించునట్టి దేవతయు, అయిన ధనలక్ష్మీ మాకెల్లప్పుడూ సమృద్ధమైన సంపదల నిచ్చి కాపాడుగాక.


🍀. ధాన్యలక్ష్మీ ప్రార్థన 🍀

శ్లో : అభయ వరద ముద్రా సధృక్త శోకా

కరకమల విరాజ ఛ్చాలి మంజర్యుదారాః

ప్రతికల మిహ దత్తాం సర్వ సస్యోపయాతాం

అతులిత బహుధాన్యాం సంపదం ధాన్యలక్ష్మీః

భావం:- ఒక చేయి అభయమునూ, మరియొక చేయి వరములనూ ప్రసాదించునట్లు హస్త ముద్రలను ధరించి భక్తుల దుఃఖమును తొలగించునదియూ కరద్వయమున ధాన్యపు కంకులను ధరించినదియూ అగు ధాన్యలక్ష్మీ సకలములైన సస్యములను ఫలింపజేసి సకలవిధ ధాన్యసమృద్ధి, ధనసమృద్ధి కలుగునట్లు అనుగ్రహించుగాక.


🍀. విజయలక్ష్మీ ప్రార్థన 🍀

శ్లో : శుభమణిగల చారు స్వర్ణ సింహాసనస్ధా

సురనర వనితాభి స్పాదరం సేవ్యమానాః

సకల శుభ విధాత్రీ సర్వలోనేశ్వరీయం

దిశతు విజయలక్ష్మీ ర్విష్ణుపత్నీ జయం నః

భావం:- మణులచే పొదగబడిన, మిక్కిలి సుందరమైన స్వర్ణ సింహాసనము నధిష్టించి దేవతా స్ర్తీలచే అదర పూర్వకముగా సేవింప బడుచున్నదియూ, భక్తులకు సకల శుభము లను ప్రసాదించునదియు. శ్రీ మహా విష్ణువున కు పత్నియై సకల లోకములను శాసించున దయు అయిన విజయలక్ష్మీ అన్ని కార్యములం దును మనకు విజయమును కలుగ జేయుగాక.


🍀. ఐశ్వర్యలక్ష్మీ ప్రార్థన 🍀

శ్లో : రుచిర కనక భూషా భూషితా స్వర్ణవర్ణా

శ్రీత నయన చకోరా నంద దాస్సేందు బింబాః

కలశ జలధి కన్యా సేయమైశ్వర్య లక్ష్మీః

నిరవధిక విభూతిర్న:ప్రదద్వాది హో ష్టౌః

భావం:- మనోజ్ఙమైన (కన్నులకు ఆనందము కలిగించు) బంగారు ఆభరణము లెన్నిటినో ధరించి సువర్ణ ఛ్చాయతో నొప్పు శరీరము గలదియు చక్రవాక పక్షులకు చంద్రబింబము ఆనందము కల్గించునట్లు ఆశ్రీతులకు ఆనందము కలిగించు ముఖ సౌందర్యము గలదియు పాల సముద్రము నుండి అవతరించి నదియు అయిన ఐశ్వర్యలక్ష్మీ అణియు మున్నగు నిరవధికములైన అష్టైశ్వర్యములను మనకు ప్రసాదించి కాపాడుగాక.


🍀. వీరలక్ష్మీ ప్రార్థన 🍀

శ్లో : గజవర మధిరూఢా శంఖ చక్రాల సిశార్ధా

ద్యమిత నిశిత శస్త్రాస్త్రోద్భటా శాత్రవేషు:

సుమధుర దరహోసేనాశ్రీఆన్‌ హర్షయన్తీ రిపునివహ నిరాసం వీరలక్ష్మీ ర్విధత్తామ్‌:

భావం:- మదపుటేనుగు నధిరోహించి శంఖము, చక్రము, ఖడ్గము, విల్లు మున్నగు ప్రభావ భాసురములైన ఆయుధములను ధరించి శతృవులపై ఆగ్రహమును చూపుచూ వారిని వణికించునదియూ అదే సమయమున భక్తులను చిరునవ్వులతో ఆనందించేయు నట్టిదయూ అయిన వీరలక్ష్మీ శతృవినాశమును గావించి భక్తులను కాపాడుగాక.


🌹 🌹 🌹 🌹 🌹

ఓషో రోజువారీ ధ్యానాలు - 262. స్వీయ-కేంద్రీకృతత / Osho Daily Meditations - 262. SELF-CENTEREDNESS


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 262 / Osho Daily Meditations - 262 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 262. స్వీయ-కేంద్రీకృతత 🍀

🕉. వారి స్వంత స్వభావంపై ఆసక్తిని కలిగి ఉన్న వ్యక్తులు మరియు వారు ఎవరో తెలుసుకోవాలనుకునే వ్యక్తులు స్వీయ-కేంద్రీకృతులు అవుతారు; అది కేవలం సహజమైనది. 🕉


మీరు చాలా స్వీయ-కేంద్రీకృతంగా మారినప్పుడు, అదే మీ స్వీయ ప్రవేశం యొక్క చివరి అవరోధంగా మారుతుంది; అందువల్ల అది కూడా వదలాలి. దానిలో ఏమీ మార్చవలసిన అవసరం లేదు; బదులుగా, దానికి ఏదైనా జోడించాలి మరియు అది సమతుల్యతను తెస్తుంది. బుద్ధుడు ధ్యానం మరియు కరుణ కలిసి ఉండాలని పట్టుబట్టారు. మీరు ధ్యానం చేసి పారవశ్యాన్ని అనుభవించినప్పుడు, వెంటనే మొత్తం ఉనికిపై పారవశ్యాన్ని కురిపించండి అని ఆయన చెప్పేవారు. మీరు కూడా వెంటనే, 'నా పారవశ్యం మొత్తం ఉనికిలో ఉండనివ్వండి' అని చెప్పండి.

దానిని నిల్వ ఉంచుకోవద్దు, లేకుంటే అది సూక్ష్మమైన అహం అవుతుంది. దీన్ని పంచుకోండి. వెంటనే ఇవ్వండి, తద్వారా మీరు మళ్లీ ఖాళీగా ఉంటారు. ఖాళీ చేయడం కొనసాగించండి. ఎప్పుడూ నిల్వ చేయవద్దు. లేకపోతే, మీరు డబ్బును కూడబెట్టుకున్నట్లే, మీరు పారవశ్యాలు, శిఖరాగ్ర అనుభవాలు మరియు అహంకారాన్ని చాలా బలపరుచుకోవచ్చు. ఈ రెండవ రకం అహం మరింత ప్రమాదకరమైనది, ఎందుకంటే ఇది మరింత సూక్ష్మమైనది - ఇది చాలా సాత్వికమైన అహం, మరియు స్వచ్ఛమైన విషం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 262 🌹

📚. Prasad Bharadwaj

🍀 262. SELF-CENTEREDNESS 🍀

🕉. It happens: People who become interested in their own nature and want to know who they are become self-centered; it is just natural. 🕉



When you become too self-centered, your very self- enteredness becomes the last barrier; it has to be dropped. Nothing has to be changed in it; rather, something has to be added to it, and that will bring balance. Buddha used to insist on meditation and compassion together. He used to say, when you meditate and feel ecstasy, immediately shower ecstasy on the whole of existence. Immediately say, "Let my ecstasy be of the whole existence."

Don't go on hoarding it, otherwise that will become a subtle ego. Share it, immediately give it, so that you are empty again. Go on emptying, but never hoard. Otherwise, just as you hoard money, so you hoard ecstasies, peak experiences, and the ego can be strengthened very much. And this second type of ego is more dangerous, because it is more subtle-it is a very pious ego, pure poison.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 127 / Agni Maha Purana - 127


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 127 / Agni Maha Purana - 127 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 40

🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 1🌻


భగవంతుడైన హయగ్రీవుడు చెప్పెమ : ఓ బ్రహ్మదేవా! పూర్వము సమస్తప్రాణులకును భయంకరమైన ఒక మహాభూత ముండెను. దానిని దేవతలు భూమిలో పాతిపెట్టిరి. దానికే వాస్తపురుషుడని పేరు. అరువదినాలుగు పదములు క్షేత్రమునందు అర్ధకోణమునందున్న ఈశుని ఘృతాక్షతలచే తృప్తిపరుపవలెను. ఒక పదమునందున్న పర్జన్యుని కమ-జ ముంచేతను.

రెండు పదములలో ఉన్న జయంతుని పతాకచేతను, రెండు కోష్ఠముల దున్న ఇంద్రుని కూడ అదే విధమునను, రెండుపరములలో నున్న సూర్యుని ఎఱ్ఱని అన్ని పదార్థములచేతను, రెండు పదములపై నున్న సత్యుని వితానము (చాందని) చేతను, ఒక పరము నందున్న భృశుని ఘృతముచేతను, అగ్ని కోణము నందిలి అర్ధకోణము నందున్న ఆకాశమును శాకున మను ఓషం జగురుచేతను, ఆ కోణమునందే రెండవ ఆర్ధపదమున దున్న అగ్నిదేవుని స్రుకు-చేతను, ఒక పదమునం దున్న పూషుని లాజించేతను, రెండు పదములపై నున్న వితథునిస్వర్ణము చేతను, ఒక పదముపై నున్న గృహక్షతుని వెన్నచేతను, ఒక పదముపై నున్న యమధర్మరాజును మాంసాన్నముచేతను, రెండు పదము పై ఉన్న గంధర్వుని గంధముచేతను.

ఒక పరముపై నున్న భృంగుని శాకునిజిహ్వ అను ఓషధిచేతను, అర్ధపరముపై ఉన్న మగమును నీలబట్టచేతను, అర్థకోష్ఠము నిన్నుభాగమునందున్న పితృగణమును పులగముచేతను, ఒక పరముపైనున్న ద్వారవాలకుని దంతకాష్ఠముచేతను, రెండుపరములపై నున్న సుగ్రీవుని యవలతో చేసిన పదార్థము చేతను తృప్తి పరుపవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 127 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 40

🌻 The mode of making the respectful offering to the god - 1 🌻



The Lord said:

1. In days of yore that material principle was dreadful among all principles. It being placed on the earth it was known to be the lord of that place.

2. At a place (divided) into sixty-four compartments Īśa occupying a half of the corner square is worshipped with ghee and unbroken rice. Then the (god) Parjanya (the rain god) occupying a square (is worshipped).

3. The god Jayanta, who occupies two squares (is worshipped) with lotus (flowers) and water, and the lord Mahendra, who remains in one square (is worshipped) with a banner. The Sun god (is worshipped) in a square with all red things.

4. The (god of) truth occupying half a square at the bottom is worshipped with canopy and profuse offering of ghee. The lord of the sky occupying half the aṅgular square (is propitiated) with the bird’s flesh.

5. The fire-god in half a square (is worshipped) with the sacrificial ladle and the god Pūṣan in a square with fried grains, the lord of untruth in two squares with gold, churning rod and unbroken rice in the house.

6. The lord Dharmeśa stationed in two squares is worshipped) with meat and cooked food, the Gandharva in two squares with incense and the tongue of a bird.

7. Mṛga occupying one upper (square) (is) then (worshipped) with blue cloth. The manes (are worshipped) with a dish composed of milk, sesamum and rice in half a square and sticks of tooth-brush in another square.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


కపిల గీత - 88 / Kapila Gita - 88


🌹. కపిల గీత - 88 / Kapila Gita - 88🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 44 🌴

44. రసమాత్రాద్వికుర్వాణాదంభసో దైవచోదితాత్|
గంధమాత్రమభూత్తస్మాత్ పృథ్వీ ఘ్రాణస్తు గంధగః॥


అనంతరము దైవ ప్రేరణచే రస స్వరూపమగు జలము వికారము నొందుటచే దాని వలన గంధతన్మాత్ర ఏర్పడెను. దాని నుండి పృథ్వి మరియు గంధగ్రహణ సామర్థ్యమును కలిగించు ఘ్రాణేంద్రియము (ముక్కు) ఉత్పన్నమాయెను.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 88 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 44 🌴

44. rasa-mātrād vikurvāṇād ambhaso daiva-coditāt
gandha-mātram abhūt tasmāt pṛthvī ghrāṇas tu gandhagaḥ


Due to the interaction of water with the taste perception, the subtle element odor evolves under superior arrangement. Thence the earth and the olfactory sense, by which we can variously experience the aroma of the earth, become manifest.

Starvation can be mitigated by drinking water. It is sometimes found that if a person who has taken a vow to fast takes a little water at intervals, the exhaustion of fasting is at once mitigated. In the Vedas it is also stated, āpomayaḥ prāṇaḥ: "Life depends on water." With water, anything can be moistened or dampened. Flour dough can be prepared with a mixture of water. Mud is made by mixing earth with water.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


12 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹12, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ వీరభద్ర దండక స్తోత్రం - 2 🍀


విరాడ్రూప | వారాశిగంభీర | సౌజన్యరత్నాకరా | వారిదశ్యామ | నారాయణధ్యేయ మౌనీంద్రచిత్తాబ్జభృంగా | సురారాతిభంగా | మహోదార | భక్తౌఘకల్పద్రుమా | శిష్టరక్షా | ప్రశస్తప్రతాపోజ్జ్వలా | శ్రీకరా | భీకరా | భీకరాలోక |

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : మతాల సంకుచితత్వం పట్ల పీఠాల దుష్టత్వం పట్ల, నిరసనగా నాస్తికత్వం పుట్టింది. అట్టి మలినపు గూడులను కూల్చడానికి భగవంతుడు దానిని రాయిగా ఉపయోగిస్తూ వుంటాడు. మతం పేరిట ఎంతటి ద్వేషాన్నీ, మౌఢ్యాన్నీ అందంగా పొదిగి ప్రదర్శిస్తూ వుంటాడో మానవుడు! 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, కార్తీక మాసం

తిథి: కృష్ణ చవితి 22:27:05 వరకు

తదుపరి కృష్ణ పంచమి

నక్షత్రం: మృగశిర 07:33:03 వరకు

తదుపరి ఆర్ద్ర

యోగం: సిధ్ధ 22:02:05 వరకు

తదుపరి సద్య

కరణం: బవ 09:20:19 వరకు

వర్జ్యం: 16:54:45 - 18:41:45

దుర్ముహూర్తం: 07:50:07 - 08:35:33

రాహు కాలం: 09:09:38 - 10:34:50

గుళిక కాలం: 06:19:13 - 07:44:26

యమ గండం: 13:25:15 - 14:50:27

అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22

అమృత కాలం: 23:09:15 - 24:56:15

సూర్యోదయం: 06:19:13

సూర్యాస్తమయం: 17:40:51

చంద్రోదయం: 20:45:28

చంద్రాస్తమయం: 09:36:16

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు : వజ్ర యోగం - ఫల ప్రాప్తి

07:33:03 వరకు తదుపరి ముద్గర

యోగం - కలహం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹