1) 🌹 05, JANUARY 2023 THURSDAY, గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 114 / Kapila Gita - 114 🌹 సృష్టి తత్వము - 70
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 706 / Vishnu Sahasranama Contemplation - 706 🌹 🌻706. సంనివాసః, संनिवासः, Saṃnivāsaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 667 / Sri Siva Maha Purana - 667 🌹 🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 5 / Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 5 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 288 / Osho Daily Meditations - 288 🌹 🍀 288. వదిలి పెట్టడం / 288. LETTING GO 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 422 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 3 🌹 🌻 422. 'సంధ్యా' - 3 / 'Sandhya' - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹05, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*
*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 22 🍀*
22. త్వత్కింకరాలం కరణోచితానాం
త్వయైవ కల్పాంతర పాలితానాం
మంజుప్రణాదం మణినూపురం తే
మంజూషికాం వేదగిరాం ప్రతీమః ॥
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : గాయత్రీ మంత్రాన్ని అర్థభావన సహితంగా ధ్యానం చెయ్యి. మనస్సును నిశ్చల మొనర్చుకొని నీకిష్టమైన దేవతా స్వరూపాన్ని స్మరించు. సత్య తేజస్సును భరించే సామర్థ్యం నీ కలవరచు నట్లుగా ఆ ఇష్టదేవతను ప్రార్థించు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: శుక్ల చతుర్దశి 26:15:09
వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం: మృగశిర 21:26:59
వరకు తదుపరి ఆర్ద్ర
యోగం: శుక్ల 07:34:18 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: గార 13:07:14 వరకు
వర్జ్యం: 01:01:38 - 02:48:06
మరియు 30:48:48 - 32:36:00
దుర్ముహూర్తం: 10:29:55 - 11:14:27
మరియు 14:57:06 - 15:41:37
రాహు కాలం: 13:44:44 - 15:08:14
గుళిక కాలం: 09:34:16 - 10:57:45
యమ గండం: 06:47:16 - 08:10:46
అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:43
అమృత కాలం: 11:40:26 - 13:26:54
సూర్యోదయం: 06:47:16
సూర్యాస్తమయం: 17:55:13
చంద్రోదయం: 16:33:13
చంద్రాస్తమయం: 05:22:15
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: మృత్యు యోగం - మృత్యు
భయం 21:26:59 వరకు తదుపరి
కాల యోగం - అవమానం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 114 / Kapila Gita - 114🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 70 🌴*
*70. చిత్తేన హృదయం చైత్యః క్షేత్రజ్ఞః ప్రావిశద్యదా|*
*విరాట్తదైవ పురుషః సలిలాదుదతిష్ఠత॥*
*కాని, చిత్తము యొక్క అధిష్ఠాన దేవతయైన వాసుదేవుడు క్షేత్రజ్ఞ రూపములో చిత్తముతో గూడి హృదయము నందు ప్రవేశించినంతనే విరాట్ పురుషుడు జలము నుండి బహిర్గతుడై వచ్చి నిలబడెను.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 114 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 70 🌴*
*70. cittena hṛdayaṁ caityaḥ kṣetra-jñaḥ prāviśad yadā*
*virāṭ tadaiva puruṣaḥ salilād udatiṣṭhata*
*However, when the inner controller, the deity presiding over consciousness, entered the heart with reason, at that very moment the Cosmic Being arose from the causal waters.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 706 / Vishnu Sahasranama Contemplation - 706🌹*
*🌻706. సంనివాసః, संनिवासः, Saṃnivāsaḥ🌻*
*ఓం సన్నివాసాయ నమః | ॐ सन्निवासाय नमः | OM Sannivāsāya namaḥ*
*యస్సతామాశ్రయో విష్ణుః సన్నివాస ఇతీర్యతే*
*'సత్' అనబడు తత్త్వజ్ఞులకు, విద్వాంసులకు ఆశ్రయము గనుక విష్ణువు సంనివాసః.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 706🌹*
*🌻706. Saṃnivāsaḥ🌻*
*OM Sannivāsāya namaḥ*
*यस्सतामाश्रयो विष्णुः सन्निवास इतीर्यते / Yassatāmāśrayo viṣṇuḥ sannivāsa itīryate*
*Since Lord Viṣṇu is the refuge of those who are sat i.e., the learned - He is called Saṃnivāsaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥
సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥
Sadgatissatkrtissattā sadbhūtissatparāyaṇaḥ,Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 667 / Sri Siva Maha Purana - 667 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴*
*🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 5 🌻*
అపుడు దేవతలు, గణములు మరియు అప్సరసలు ఆనందముతో వాద్యములను మ్రోగించి ఆడి పాడిరి (33). అపుడు మహాత్ముడు, మంగళకరుడు అగు శంభుడు మిక్కిలి ప్రసన్నుడై ఆ గణేశునకు మరల వరము నిచ్చెను (34). ఓ గణేశా! నీవు భాద్రపద కృష్ణ చతుర్థి నాడు చంద్రోదయ శుభకాలమున జన్మించితివి (35). పవిత్ర మనస్కురాలగు గిరిజ నుండి మొదటి జాములో నీ రూపము ఆవిర్భవించెను గాన, నీ వ్రతము ఉత్తమమైనది (36).
కావున సర్వము సిద్దించుట కొరకై అదే తిథినాడు ఆరంభించి శుభకరమగు వ్రతమును ఆనందములో శ్రద్ధతో అనుష్ఠించవలెను (37). నా ఆజ్ఞచే, మరల సంవత్సరము తరువాత చతుర్థీ తిధి వచ్చువరకు నీ ఈ వ్రతమును చేయవలెను (38). సంసారము నందు సాటిలేని అనేక సుఖములను ఎవరు గోరెదరో, వారు నిన్ను చవితి నాడు భక్తితో యథావిధిగా పూజించవలెను (39). మార్గశీర్ష కృష్ణ చతుర్థినాడు ఉదయమే స్నానము చేసి వ్రతమునాచరించి బ్రాహ్మణులకు భోజనము నిడవలెను (40).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 667🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴*
*🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 5 🌻*
33. The gods, the Gaṇas and the celestial damsels sang songs joyously, danced and played on instruments.
34. Another boon was granted to Gaṇeśa by the delighted Śiva of great soul.
35-37. O Gaṇeśa, you are born in the first Prahara on the fourth day in the dark half of the Bhādra mouth at the auspicious hour of the moonrise. Since your form manifested itself from the good mind of Pārvatī, your excellent Vrata shall be performed on that Tithi itself or beginning from that day. It will be very auspicious and conducive to the achievement of all Siddhis.
38. At the bidding of us both the Vrata shall be performed till the fourth day at the end of a year.
39. Let those who yearn for unequalled happiness in the world worship you devoutly in various ways on the fourth day in accordance with the rules.
40. On the fourth day of Lakṣmī in the month of Mārgaśīrṣa he shall perform early morning ablution and entrust the Vrata to the brahmins.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 288 / Osho Daily Meditations - 288 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 288. వదిలి పెట్టడం 🍀*
*🕉. ఎలా వదిలేయాలో తెలిసిన తర్వాత, మొదటిసారి జీవితం జరగడం ప్రారంభమవుతుంది. మనం దేనినైనా సాధించాలని అనవసరంగా ప్రయత్నిస్తున్నాము, వాస్తవానికి, దానిని సాధించడానికి చేసే ప్రయత్నమే ఆటంకం. 🕉*
*జీవితం సంభవిస్తుంది - దానిని సాధించలేము. దాని కోసం ఎంత ఎక్కువ కష్టపడతాడో అంత తక్కువ జరుగుతుంది. దానికి ఎక్కడకి వెళ్లవలసిన అవసరం లేదు; అది దానికదే వస్తుంది. కావలసిందల్లా గ్రహణశక్తి, బహిరంగత యొక్క మొత్తం స్థితి. జీవితానికి ఆతిథ్యమివ్వాలి. జీవితాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు. వెంబడించడంలో దుఃఖం ఉంది; మీరు దానిని ఎంత ఎక్కువగా వెంబడిస్తే, అది అంత దూరం వెళుతుంది. జీవితం అన్నింటినీ కలిగి ఉంటుంది. అందులో భగవంతుడు ఉన్నాడు, అందులో ఆనందం ఉంది, అందులో ఆశీర్వాదం ఉంది, అందం, మంచి, నిజం, మీరు దేనిని పిలవాలనుకున్నా-అన్నీ దానిలో ఉన్నాయి; జీవితం తప్ప మరొకటి లేదు. జీవితం అనేది ఉనికి యొక్క సంపూర్ణత పేరు.*
*ఓపికగా విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోండి. ఆపై అద్భుతాల ఆవిష్కరణ జరుగుతుంది: ఒకరోజు మీరు నిజంగా విశ్రాంతిగా ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఏదో మార్పు వస్తుంది. ఒక తెర అదృశ్యమవుతుంది మరియు మీరు అన్నింటినీ ఉన్నట్లుగా చూస్తారు. మీ కళ్ళు చాలా ఆశయాలు, నిరీక్షణలు, కోరికలతో నిండి ఉంటే, సత్యాన్ని చూడలేరు. కళ్ళు కోరికల ధూళితో కప్పబడి ఉన్నాయి. అన్వేషణ అంతా వ్యర్థం. శోధన అనేది మనస్సు యొక్క ఉప ఉత్పత్తి. అన్వేషణ లేని స్థితిలో ఉండటం పరివర్తన యొక్క గొప్ప క్షణం. ధ్యానాలన్నీ ఆ క్షణం కోసం సన్నాహాలు మాత్రమే. అవి నిజమైన ధ్యానాలు కావు, కేవలం సన్నాహాలు కాబట్టి సాధ్యం అవడానికి ఒక రోజు మీరు ఏమీ చేయకుండా, ఏమీ కోరుకోకుండా కూర్చోవాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 288 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 288. LETTING GO 🍀*
*🕉. Once one knows how to let go, for the first time life starts happening. We are unnecessarily striving to attain something, in fact, the very effort to attain it is the hindrance. 🕉*
*Life happens-it cannot be attained. The more one strives for it, the less one has it. One need not go to it; it comes on its own. All that is needed is a total state of receptivity, of openness. One has to become a host to life. Life need not be chased. In chasing is misery; the more you chase it, the farther away it goes. And life contains all. It contains God, it contains bliss, it contains benediction, it contains beauty, good, truth, whatever you want to call it-it contains all; there is nothing other than life. Life is the name of the totality of existence. One has to learn to be patiently relaxed, and then the miracle of miracles happens.*
*One day when you are really relaxed, something suddenly changes. A curtain disappears, and you see things as they are. If your eyes are too full of desires, expectation, longing, they cannot see the truth. The eyes are covered with the dust of desire. All search is futile. Search is a byproduct of the mind. To be in a state of nonsearch is the great moment of transformation. All the meditations 'are just preparations for that moment. They are not real meditations but just preparations so that one day you can simply sit, doing nothing, desiring nothing.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 422 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*
*🌻 422. 'సంధ్యా' - 3🌻*
*ద్రౌపతి స్వయంవరమునకు పూర్వ ఘట్టమున పాండవులు ఏకఛత్రపురము నుండి పాంచాల రాజధాని కేగుచుండగ సాయంసంధ్య సమీపించినది. పాంచాలము చేరవలెనను ఆతురతలో వారు సాయం సంధ్యాదికములను గావింపక సాగుచుండిరి. అపుడు గంధర్వుడొకడు విల్లును ధరించి అర్జునుని యుద్దమునకై రెట్టించెను. అర్జునుడు అనుపమానమగు ధనుర్విద్యా పారంగతుడైననూ యుద్ధమున ఓడిపోయెను. అతడు అవమానముతో క్రుంగెను. అపుడు గంధర్వుడు అర్జునుని సమీపించి యిట్లనెను. “నీవు నిజమునకు అజేయుడవు. విజయుడవు. నీవు యుద్ధమున ఓడుటకు కారణము సాయం సంధ్యయందు ఆరాధన గావించక పోవటమే. అందువలన బలహీనుడవైతివి.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*
*🌻 422. 'Sandhya' - 3🌻*
*On the eve of Draupadi's Swayamvara, the Pandavas were approaching the capital of the Panchalas, from Ekachhatrapuram in the evening. In their haste to reach Panchala, they ignored the dusk rituals and continued travel. Then, one Gandharva called on Arjuna for a one on one battle. Even though Arjuna was an expert in archery, he was defeated in the battle. He was disappointed and ashamed. Then Gandharva approached Arjuna and said. 'You are, infact, invincible. The reason why you lost the battle was because you did not perform the dusk salutations( sandhyavandana). Therefore, you became weak.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj