నిర్మల ధ్యానాలు - ఓషో - 283
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 283 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దేవుడికి ప్రపంచానికి మధ్య వేర్పాటు లేదు. అంతా దైవత్వమే. ప్రపంచం దేవ నిర్మితం. భౌతికవాదానికి, ఆధ్యాత్మిక వాదానికి మధ్య విభజన అనవసరం. ఆ రెండూ కలిసే వున్నాయి. కాబట్టి చిన్ని విషయాల్లో ఆనందించు. 🍀
కొన్ని ప్రాపంచికమయినవని మరికొన్ని పవిత్రమైనవని అనుకోకు. ఆనందించగలిగిన వ్యక్తికి అన్నీ పవిత్రమైనవే. దేవుడికి ప్రపంచానికి మధ్య వేర్పాటు లేదు. అంతా దైవత్వమే. ప్రపంచం దేవ నిర్మితం. దేవుడు ప్రపంచం నిర్మించిన వాడు కాడా? వ్యక్తి ఆనందించగలిగితే విభజనలెందుకు? పువ్వు విత్తనం నించి వచ్చింది. మరి విత్తనం? రెండూ ఒకటే. ఈ ప్రపంచానికి అది తీరం.
భౌతికవాదానికి, ఆధ్యాత్మిక వాదానికి మధ్య విభజన అనవసరం. ఆ రెండూ కలిసే వున్నాయి. కాబట్టి చిన్ని విషయాల్లో ఆనందించు. తలస్నానం చేసి తన్మయించు. టీ తాగి ఆనందించు. ఎట్లాంటి ప్రత్యేకతలూ ఆపాదించకు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment