మైత్రేయ మహర్షి బోధనలు - 123


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 123 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 95. జాలి - దయ 🌻


జాలి పడుట దయ చూపుట కాదు. జాలి వేరు, దయ వేరు. జాలి పడువారు జాలిని కోరుదురు కూడ. తమపై ఎవరికిని జాలిలేదని కూడ వారికనిపించుచుండును. తానితరులపై జూపిన జాలి తనపై

నెవ్వరును చూపుట లేదని కూడ జాలి పడుదురు. దుఃఖింతురు కూడ. ఆ దుఃఖము నుండి ఇతరులపై ఆరోపణలు చేయుట ప్రారంభింతురు. తమను గూర్చి ఎవరును పట్టించు కొనుట లేదని రోషము చెందుదురు. తమలో గల జాలి తమపై ఆవరించి చైతన్యమునకు అవరోహణము కలిగించు కొనుచుందురు. వారి దుఃఖము, ద్వేషము, రోషము కారణముగ రోగగ్రస్తులు కూడ నగుదురు. దయ, జాలివంటిది కాదు.

దయ కలవాడు, ఇతరుల కష్టములను చూచి కేవలము జాలిపడక వారికేమి కావలయునో బుద్ధి నుండి గ్రహించి నిర్వర్తించును. వారి కష్టనష్టములను తన లోనికి గొనక వారికి సహాయ సహకారము లందించును. దయ గలవాడు, జాలి గలవాడి వలె దుఃఖించడు. కర్తవ్యనిర్వహణమే గావించును. జాలి హృదయ దౌర్బల్యము కలిగించును. దయ, హృదయ వికాసమును గావించును. జాలి విషయమున “జాలి పడుట" అందురు. దయ విషయమున “దయ చూపుట” అందురు. ఒకటి పడుట కాగ రెండవది చూపుట యుండును. పడుటకన్న చూపించుట మేలు కదా! హృదయము నందలి పురుషప్రజ్ఞ - దయ. స్త్రీ ప్రజ్ఞ - జాలి.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

24 May 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 184


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 184 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సమాజం ప్రేమ అంటే చాలా భయపడుతుంది. హృదయమంటే చాలా భయపడుతుంది. మేధలో జీవించే మనిషి పనిమంతుడు, మంచి సేవకుడు, వినయవంతుడు, బానిస అవుతాడు. సమాజానికి కావాల్సింది అదే. 🍀


ఎప్పుడయితే సమాజం చేసిన కుట్రను నువ్వు గ్రహిస్తావో వెంటనే నీ హృదయం మేలుకుంటుంది. దాని గుండా శక్తి ప్రవహిస్తుంది. అది సహజమార్గం. అలాగే వుండాలి. సమాజం యిష్టపడక పోవడం వల్ల అది అట్లా వుండదు. సమాజం ప్రేమ అంటే చాలా భయపడుతుంది. హృదయమంటే చాలా భయపడుతుంది. మేధలో జీవించే మనిషి పనిమంతుడు, మంచి సేవకుడు, వినయవంతుడు, బానిస అవుతాడు. సమాజానికి కావాల్సింది అదే.

సమాజానికి పనివాళ్ళు, మంచి సేవకులు కావాలి. సమాజానికి అధికారులు అవసరం లేరు. సాధికారమున్న వాళ్ళు అక్కర్లేదు. ఒకసారి నీ హృదయం విచ్చుకుంటే నువ్వు జైల్లో వున్నా స్వేచ్ఛాజీవివే. అధికారివే. నువ్వెంత సాధికారంగా వుంటావంటే నిన్నెవరూ నీ స్వేఛ్ఛ నించీ వేరు చెయ్యలేరు. కాబట్టి నువ్వు ఈ అద్భుతాన్ని నిర్వహించాలి. కాబట్టి నీ శక్తిని 'తల' నించీ హృదయానికి మళ్ళించు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


24 May 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 284 - 10. మన అభ్యాసంలో మనం అశాంతి లేదా ఇబ్బంది పడకూడదు / DAILY WISDOM - 284 - 10. We should not Feel Restless or Troubled in Our Practice


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 284 / DAILY WISDOM - 284 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 10. మన అభ్యాసంలో మనం అశాంతి లేదా ఇబ్బంది పడకూడదు 🌻


మనకు సంబంధించినంత వరకు ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి మరియు బాహ్యంగా మరియు అంతర్గతంగా వివిధ మార్గాల ద్వారా నిర్లిప్తత యొక్క సరైన వైఖరిని పాటించాలి. ఇదే వైరాగ్యం యొక్క సూత్రం, ఇది తిరిగి నొక్కిచెప్పడానికి, అతిగా భోగించడం లేదా అన్ని భోగాలను పూర్తిగా త్యజించడం లాంటి ఇతర తీవ్రతకు వెళ్లడం కాదు. ఇది పరిణామ క్రమంలో తన వ్యక్తిత్వం యొక్క ఎదుగుదలను బట్టి , ఇతరులను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడపడం కోసం కావాల్సిన వస్తువిషయాలను అనుమతించడం.

మళ్ళీ, స్వీయ-నిగ్రహం లేదా యోగా సాధనలో ప్రతి దశ సానుకూల దశే అని చెప్పవచ్చు, తద్వారా అభ్యాసంలో ఇబ్బంది ఉండదు. మనకు అనవసరమైన నొప్పి, ఇబ్బంది లేదా వేదన అనిపించినప్పుడు, అది విలువల యొక్క ఎంపికలో మనం చిన్న పొరపాటు చేశామని సూచిస్తుంది. మన సాధనని అశాంతిగా లేదా ఇబ్బందిగా భావించ కూడదు. అలా భావించారంటే వాస్తవం తెలుసుకోకుండా మనం మన పరిధిని దాటామని అర్థం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 284 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 10. We should not Feel Restless or Troubled in Our Practice 🌻


Everything has to be taken into consideration so far as we are related to it, and a proper attitude of detachment has to be practised by various means, external as well as internal. This is the principle of austerity which, to re-emphasise, does not mean either too much indulgence or going to the other extreme of completely cutting off all indulgence. It is the allowing in of as much relationship with things, both in quantity and quality, as would be necessary under the conditions of one's own personality in that particular stage of evolution, with the purpose of helping oneself in the onward growth to a healthier condition of spiritual aspiration.

Again, it may be pointed out that every stage in self-restraint or practice of yoga is a positive step, so that there should not be pain felt in the practice. When we feel undue pain, suffocation or agony—well, that would be an indication that we have made a slight mistake in the judgment of values. We should not feel restless or troubled in our practice. That would be the consequence of a little excess to which we might have gone, not knowing what actually has been done.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


24 May 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 605 / Vishnu Sahasranama Contemplation - 605


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 605 / Vishnu Sahasranama Contemplation - 605🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻605. శ్రీదః, श्रीदः, Śrīdaḥ🌻


ఓం శ్రీదాయ నమః | ॐ श्रीदाय नमः | OM Śrīdāya namaḥ

శ్రియం దదాతి భక్తేభ్య ఇతి శ్రీదః ఇతీర్యతే

భక్తులకు 'శ్రీ' కటాక్షించువాడుగనుక శ్రీదః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 605🌹

📚. Prasad Bharadwaj

🌻605. Śrīdaḥ🌻

OM Śrīdāya namaḥ

श्रियं ददाति भक्तेभ्य इति श्रीदः इतीर्यते / Śriyaṃ dadāti bhaktebhya iti śrīdaḥ itīryate

Since He confers Śrī upon His devotees, He is called Śrīdaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


24 May 2022

24 - MAY - 2022 మంగళవారం, భౌమ వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 24, మే 2022 మంగళవారం, భౌమ వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 206 / Bhagavad-Gita - 206 - 5- 02 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 605 / Vishnu Sahasranama Contemplation - 605🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 284 / DAILY WISDOM - 284🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 184 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 123🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 24, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. హనుమ భుజంగ స్తోత్రం-3 🍀*

*4. కృతాభీలనాదం క్షితిక్షిప్రవాదం ఘనక్రాంత భృంగం కటిస్థోరంగం*
*వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశమ్ జయశ్రీ సమేతం భజే రామదూతమ్ |*
*5. చలద్వాలఘాతం భ్రమచ్ఛక్రవాలం కఠోరాట్టహాసం *ప్రభిన్నాబ్జజాండం*
*మహాసింహనాధాద్విశీర్ణత్రిలోకం భజేదాంజనేయం ప్రభుం వజ్రకాయమ్ |*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ప్రార్థనతో దైవానుగ్రహం మీకు కలగడం లేదంటే మీలోని మాలిన్యాలే కారణం. వాటిని తొలగించు కోవడానికి ప్రయత్నం చేయండి. - సద్గురు శ్రీరామశర్మ. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ నవమి 10:46:53 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: పూర్వాభద్రపద 22:35:47 
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: వషకుంభ 23:40:16 వరకు
తదుపరి ప్రీతి
కరణం: గార 10:48:53 వరకు
వర్జ్యం: 04:49:12 - 06:26:00
దుర్ముహూర్తం: 08:18:17 - 09:10:26
రాహు కాలం: 15:28:30 - 17:06:16
గుళిక కాలం: 12:12:56 - 13:50:43
యమ గండం: 08:57:24 - 10:35:10
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:38
అమృత కాలం: 14:30:00 - 16:06:48
సూర్యోదయం: 05:41:51
సూర్యాస్తమయం: 18:44:03
చంద్రోదయం: 01:39:37
చంద్రాస్తమయం: 13:39:08
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: కుంభం
కాల యోగం - అవమానం 22:35:47
వరకు తదుపరి సిద్ది యోగం 
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 206 / Bhagavad-Gita - 206 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 02 🌴*

*02. శ్రీ భగవానువాచ*
*సన్న్యాస: కర్మయోగాశ్చ ని:శ్రేయసకరావుభౌ |*
*తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే ||*

🌷. తాత్పర్యం :
*శ్రీకృష్ణభగవానుడు సమాధానమొసగెను; కర్మపరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కాని ఆ రెండింటిలో కర్మపరిత్యాగము కన్నను భక్తియుత కర్మము ఉత్తమమైనది.*

🌷. భాష్యము :
కామ్యకర్మలు (ఇంద్రియప్రీతిని కోరునటువంటి) భవబంధమునకు కారణములై యున్నవి. దేహసౌఖ్యము పెంపొందించుకొను ఉద్దేశ్యముతో కర్మల నొనరించునంత కాలము జీవుడు వివిధములైన దేహములను పొందుచు భవబంధమున నిరంతరము కొనసాగవలసియే యుండును. శ్రీమద్భాగవతము(5.5.4-6) ఈ విషయమునే ఇట్లు నిర్ధారణ చేసినది. 

“ఇంద్రియప్రీతి యెడ ఆసక్తులై యుండు మనుజులు దుఃఖభూయిష్టమైన ప్రస్తుతదేహము గత కర్మఫలముగా లభించినదే యని తెలిసికొనజాలడు. ఈ దేహము ఆశాశ్వతమైనను ఉన్నంతకాలము జీవుని అది అనేకరకములుగా భాధించును. కనుక ఇంద్రియప్రీతి కొరకు వర్తించుట సరియైనది కాదు. మనుజడు తన నిజస్థితి గూర్చి ప్రశ్నించనంతకాలము జీవితములో పరాజయమును పొందినట్లుగా భావింపబడును. అతడు తన నిజస్థితిని ఎరుగనంతవరకు ఇంద్రియప్రీతికై ఫలముల నాశించి కర్మ యందు వర్తించవలసివచ్చును. అట్టి ఇంద్రియభోగానుభవ భావములో నున్నంతకాలము అతడు వివిధయోనుల యందు పరిభ్రమించవలసినదే. మనస్సు ఆ విధముగా కామ్యకర్మల యందు లగ్నమై యున్నను మరియు అజ్ఞానముచే ప్రభావితమై యున్నను ఏదియో ఒక విధముగా ప్రతియొక్కరు వాసుదేవుని భక్తియుతసేవ యెడ అనురక్తిని పెంపొందించుకొనవలెను. అప్పుడే ఎవ్వరైనను భవబంధము నుండి ముక్తిని పొందు అవకాశమును పొందగలరు.”

కావున జ్ఞానమొక్కటే(నేను దేహమున గాక ఆత్మననెడి జ్ఞానము) ముక్తికి సరిపోదు. అట్టి జ్ఞానముతో పాటు ఆత్మస్థితిలో వర్తించనిదే భవబంధము నుండి తప్పించుకొనుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. కాని కృష్ణభక్తిరసభావనమునందు ఒనరింపబడు కర్మ కామ్యకర్మ వంటిది కాదు. పూర్ణజ్ఞానముతో ఒనరింపబడు కర్మలు మనుజుని జ్ఞానమునందలి పురోగతిని మరింత దృడవంతము చేయగలవు. వాస్తవమునకు కృష్ణభక్తిభావన లేకుండా కేవలము కామ్యకర్మలను త్యజించుట యనునది బద్ధజీవుని హృదయమును పవిత్రము చేయజాలదు. హృదయము పవిత్రము కానంతవరకు మనుజుడు కామ్యభావనలో కర్మలను ఒనరింపవలసి వచ్చును. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 206 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 02 🌴*

*02. śrī-bhagavān uvāca*
*sannyāsaḥ karma-yogaś ca niḥśreyasa-*karāv ubhau*
*tayos tu karma-sannyāsā karma-yogo viśiṣyate*

🌷 Translation : 
*The Personality of Godhead replied: The renunciation of work and work in devotion are both good for liberation. But, of the two, work in devotional service is better than renunciation of work.*

🌹 Purport :
Fruitive activities (seeking sense gratification) are cause for material bondage. As long as one is engaged in activities aimed at improving the standard of bodily comfort, one is sure to transmigrate to different types of bodies, thereby continuing material bondage perpetually.

“People are mad after sense gratification, and they do not know that this present body, which is full of miseries, is a result of one’s fruitive activities in the past. Although this body is temporary, it is always giving one trouble in many ways. Therefore, to act for sense gratification is not good. One is considered to be a failure in life as long as he makes no inquiry about his real identity. As long as he does not know his real identity, he has to work for fruitive results for sense gratification, and as long as one is engrossed in the consciousness of sense gratification one has to transmigrate from one body to another. 

Although the mind may be engrossed in fruitive activities and influenced by ignorance, one must develop a love for devotional service to Vāsudeva. Only then can one have the opportunity to get out of the bondage of material existence.” Therefore, jñāna (or knowledge that one is not this material body but spirit soul) is not sufficient for liberation. One has to act in the status of spirit soul, otherwise there is no escape from material bondage. 

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 605 / Vishnu Sahasranama Contemplation - 605🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻605. శ్రీదః, श्रीदः, Śrīdaḥ🌻*

*ఓం శ్రీదాయ నమః | ॐ श्रीदाय नमः | OM Śrīdāya namaḥ*

*శ్రియం దదాతి భక్తేభ్య ఇతి శ్రీదః ఇతీర్యతే*

*భక్తులకు 'శ్రీ' కటాక్షించువాడుగనుక శ్రీదః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 605🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻605. Śrīdaḥ🌻*

*OM Śrīdāya namaḥ*

*श्रियं ददाति भक्तेभ्य इति श्रीदः इतीर्यते / Śriyaṃ dadāti bhaktebhya iti śrīdaḥ itīryate*

*Since He confers Śrī upon His devotees, He is called Śrīdaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 284 / DAILY WISDOM - 284 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 10. మన అభ్యాసంలో మనం అశాంతి లేదా ఇబ్బంది పడకూడదు 🌻*

*మనకు సంబంధించినంత వరకు ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి మరియు బాహ్యంగా మరియు అంతర్గతంగా వివిధ మార్గాల ద్వారా నిర్లిప్తత యొక్క సరైన వైఖరిని పాటించాలి. ఇదే వైరాగ్యం యొక్క సూత్రం, ఇది తిరిగి నొక్కిచెప్పడానికి, అతిగా భోగించడం లేదా అన్ని భోగాలను పూర్తిగా త్యజించడం లాంటి ఇతర తీవ్రతకు వెళ్లడం కాదు. ఇది పరిణామ క్రమంలో తన వ్యక్తిత్వం యొక్క ఎదుగుదలను బట్టి , ఇతరులను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడపడం కోసం కావాల్సిన వస్తువిషయాలను అనుమతించడం.*

*మళ్ళీ, స్వీయ-నిగ్రహం లేదా యోగా సాధనలో ప్రతి దశ సానుకూల దశే అని చెప్పవచ్చు, తద్వారా అభ్యాసంలో ఇబ్బంది ఉండదు. మనకు అనవసరమైన నొప్పి, ఇబ్బంది లేదా వేదన అనిపించినప్పుడు, అది విలువల యొక్క ఎంపికలో మనం చిన్న పొరపాటు చేశామని సూచిస్తుంది. మన సాధనని అశాంతిగా లేదా ఇబ్బందిగా భావించ కూడదు. అలా భావించారంటే వాస్తవం తెలుసుకోకుండా మనం మన పరిధిని దాటామని అర్థం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 284 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 10. We should not Feel Restless or Troubled in Our Practice 🌻*

*Everything has to be taken into consideration so far as we are related to it, and a proper attitude of detachment has to be practised by various means, external as well as internal. This is the principle of austerity which, to re-emphasise, does not mean either too much indulgence or going to the other extreme of completely cutting off all indulgence. It is the allowing in of as much relationship with things, both in quantity and quality, as would be necessary under the conditions of one's own personality in that particular stage of evolution, with the purpose of helping oneself in the onward growth to a healthier condition of spiritual aspiration.*

*Again, it may be pointed out that every stage in self-restraint or practice of yoga is a positive step, so that there should not be pain felt in the practice. When we feel undue pain, suffocation or agony—well, that would be an indication that we have made a slight mistake in the judgment of values. We should not feel restless or troubled in our practice. That would be the consequence of a little excess to which we might have gone, not knowing what actually has been done.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 184 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. సమాజం ప్రేమ అంటే చాలా భయపడుతుంది. హృదయమంటే చాలా భయపడుతుంది. మేధలో జీవించే మనిషి పనిమంతుడు, మంచి సేవకుడు, వినయవంతుడు, బానిస అవుతాడు. సమాజానికి కావాల్సింది అదే. 🍀*

*ఎప్పుడయితే సమాజం చేసిన కుట్రను నువ్వు గ్రహిస్తావో వెంటనే నీ హృదయం మేలుకుంటుంది. దాని గుండా శక్తి ప్రవహిస్తుంది. అది సహజమార్గం. అలాగే వుండాలి. సమాజం యిష్టపడక పోవడం వల్ల అది అట్లా వుండదు. సమాజం ప్రేమ అంటే చాలా భయపడుతుంది. హృదయమంటే చాలా భయపడుతుంది. మేధలో జీవించే మనిషి పనిమంతుడు, మంచి సేవకుడు, వినయవంతుడు, బానిస అవుతాడు. సమాజానికి కావాల్సింది అదే.*

*సమాజానికి పనివాళ్ళు, మంచి సేవకులు కావాలి. సమాజానికి అధికారులు అవసరం లేరు. సాధికారమున్న వాళ్ళు అక్కర్లేదు. ఒకసారి నీ హృదయం విచ్చుకుంటే నువ్వు జైల్లో వున్నా స్వేచ్ఛాజీవివే. అధికారివే. నువ్వెంత సాధికారంగా వుంటావంటే నిన్నెవరూ నీ స్వేఛ్ఛ నించీ వేరు చెయ్యలేరు. కాబట్టి నువ్వు ఈ అద్భుతాన్ని నిర్వహించాలి. కాబట్టి నీ శక్తిని 'తల' నించీ హృదయానికి మళ్ళించు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 123 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 95. జాలి - దయ 🌻*

*జాలి పడుట దయ చూపుట కాదు. జాలి వేరు, దయ వేరు. జాలి పడువారు జాలిని కోరుదురు కూడ. తమపై ఎవరికిని జాలిలేదని కూడ వారికనిపించుచుండును. తానితరులపై జూపిన జాలి తనపై
నెవ్వరును చూపుట లేదని కూడ జాలి పడుదురు. దుఃఖింతురు కూడ. ఆ దుఃఖము నుండి ఇతరులపై ఆరోపణలు చేయుట ప్రారంభింతురు. తమను గూర్చి ఎవరును పట్టించు కొనుట లేదని రోషము చెందుదురు. తమలో గల జాలి తమపై ఆవరించి చైతన్యమునకు అవరోహణము కలిగించు కొనుచుందురు. వారి దుఃఖము, ద్వేషము, రోషము కారణముగ రోగగ్రస్తులు కూడ నగుదురు. దయ, జాలివంటిది కాదు.*

*దయ కలవాడు, ఇతరుల కష్టములను చూచి కేవలము జాలిపడక వారికేమి కావలయునో బుద్ధి నుండి గ్రహించి నిర్వర్తించును. వారి కష్టనష్టములను తన లోనికి గొనక వారికి సహాయ సహకారము లందించును. దయ గలవాడు, జాలి గలవాడి వలె దుఃఖించడు. కర్తవ్యనిర్వహణమే గావించును. జాలి హృదయ దౌర్బల్యము కలిగించును. దయ, హృదయ వికాసమును గావించును. జాలి విషయమున “జాలి పడుట" అందురు. దయ విషయమున “దయ చూపుట” అందురు. ఒకటి పడుట కాగ రెండవది చూపుట యుండును. పడుటకన్న చూపించుట మేలు కదా! హృదయము నందలి పురుషప్రజ్ఞ - దయ. స్త్రీ ప్రజ్ఞ - జాలి.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹