నిర్మల ధ్యానాలు - ఓషో - 184


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 184 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సమాజం ప్రేమ అంటే చాలా భయపడుతుంది. హృదయమంటే చాలా భయపడుతుంది. మేధలో జీవించే మనిషి పనిమంతుడు, మంచి సేవకుడు, వినయవంతుడు, బానిస అవుతాడు. సమాజానికి కావాల్సింది అదే. 🍀


ఎప్పుడయితే సమాజం చేసిన కుట్రను నువ్వు గ్రహిస్తావో వెంటనే నీ హృదయం మేలుకుంటుంది. దాని గుండా శక్తి ప్రవహిస్తుంది. అది సహజమార్గం. అలాగే వుండాలి. సమాజం యిష్టపడక పోవడం వల్ల అది అట్లా వుండదు. సమాజం ప్రేమ అంటే చాలా భయపడుతుంది. హృదయమంటే చాలా భయపడుతుంది. మేధలో జీవించే మనిషి పనిమంతుడు, మంచి సేవకుడు, వినయవంతుడు, బానిస అవుతాడు. సమాజానికి కావాల్సింది అదే.

సమాజానికి పనివాళ్ళు, మంచి సేవకులు కావాలి. సమాజానికి అధికారులు అవసరం లేరు. సాధికారమున్న వాళ్ళు అక్కర్లేదు. ఒకసారి నీ హృదయం విచ్చుకుంటే నువ్వు జైల్లో వున్నా స్వేచ్ఛాజీవివే. అధికారివే. నువ్వెంత సాధికారంగా వుంటావంటే నిన్నెవరూ నీ స్వేఛ్ఛ నించీ వేరు చెయ్యలేరు. కాబట్టి నువ్వు ఈ అద్భుతాన్ని నిర్వహించాలి. కాబట్టి నీ శక్తిని 'తల' నించీ హృదయానికి మళ్ళించు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


24 May 2022

No comments:

Post a Comment