శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 303-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 303 -2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 303-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 303 -2🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀
🌻 303-2.'హృద్యా' 🌻
సంపదలకు సుఖములకు అధికారిణిగ హ్రీమతి శ్రీ లలిత రూపమున అమ్మ హృదయమున గోచరించును. ఈమెనే రాబోవు నామములలో 'హాకిని'గ దర్శింగలము. హృదయము చేరిన మనస్సు మనోజ్ఞమై యుండును.
బుద్ధిలోక విశేషములను నిరంతరము గ్రహించుచు, ఆహ్వానించుచు అంత రాంతరముల లోనికి ప్రవేశించుటకు ప్రయత్నించును. హృదయము చేరిన జీవుడు బాహ్యమున తన జీవితమంతయు క్షరమని క్రమముగ తెలియగలడు. క్షరమగు విషయములకన్న అక్షరమగు జ్ఞానమున ఆసక్తి పెరుగు చుండును. జ్ఞానము పొందుచు క్రమముగ తా నక్షరుడని తన మనో యింద్రియములతో బాహ్యమున జరుగు వ్యాపారమంతయు క్షరమని తెలియును.
అక్షరుడైన తనకు అక్షరమగు విషయము నందాసక్తి పెరిగి అనంతమగు జ్ఞానమున కున్ముఖుడగును. అపరిమితము అనంతము అగు జ్ఞానము నుపాసించుచు పరిమితత్త్వము నుండి అపరిమితత్త్వము లోనికి చేరును. ఒక్కమాటలో చెప్పవలెనన్నచో జీవునికి సమస్త శుభ పరంపరలు హృదయమును చేరినప్పుడే ప్రారంభ మగును. అందు ప్రధానముగ హృద్యాదేవి అనుగ్రహము బడయ వలెను. బాహ్యము నుండి అంతరమును చేరు గడప వద్ద ప్రథమముగ ఆసీనమై యుండునది హ్రీంకారి, ప్రీమతి యగు 'హృద్య'.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 303-2 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |
hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀
🌻 303. Hṛdyā हृद्या (303) 🌻
She resides in the heart. Soul is said to be in the centre of the heart. Heart also stands for compassion and love. Since She is the Divine Mother, these qualities are in built in Her. Or it could also mean that She is loved by everybody.
Katha Upaniṣad (II.i.13) says, “The thumb sized puruṣaḥ (soul) is seen as smokeless flame rests in the centre of the body.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
24 Aug 2021
నిర్మల ధ్యానాలు - ఓషో - 63
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 63 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. తెలిసిన దాని నించీ తెలియని దాని వేపు అడుగు వేసినపుడే పరమానందం వీలవుతుంది. ధైర్యశాలులకు, తెగించే వాళ్ళకే అది లభ్యం. అది శ్రమతో కూడుకున్నది. ప్రమాదాల్ని ఎదుర్కోందే పరవశాన్ని అందుకోవడం వీలుపడదు. 🍀
సాహసవంతులకే పరమానందం దొరుకుతుంది. ధైర్యశాలులకు, తెగించే వాళ్ళకే అది లభ్యం. తెలిసిన దాని నించీ తెలియని దాని వేపు అడుగు వేసినపుడే అది వీలవుతుంది. తెలిసిన దానికి అంటిపెట్టుకుని వుంటే నీ జీవితం రొటీన్‌గా వుంటుంది. పునరుక్తిగా వుంటుంది. ఒకే దారిలో, ఒకే వలయంలో వుంటుంది. సున్నితత్వాన్ని క్రమంగా కోల్పోతాం. బండబారిపోతాం. గుడ్డితనం, మూగతనం ప్రాప్తిస్తాయి. అక్కడ ఏదీ చూడ్డానికి, ఏదీ వినడానికి, ఏదీ రుచి చూడ్డానికి, ఏదీ అనుభూతి చెందడానికి వుండదు. అట్లాంటి వాళ్ళకు ఆనందం అమడ దూరంలో వుంటుంది.
వాళ్ళకు తెలిసింది దు:ఖం, బాధ, నిరాశ, విషాదం, నిశ్చలన వేదన. వ్యక్తి సాహసంతో తెలిసిన దాని నించీ తెలియని దానికి అడుగు వెయ్యాలి. పరిచితమైన దాని నించీ అపరిచితమైన దానికి ప్రయాణించాలి. అది శ్రమతో కూడుకున్న విషయం. పరిచితమైన దానితో రక్షణ వుంటుంది. భద్రత వుంటుంది.
తెలియని దానిలోకి అడుగు పెడితే ఏం జరుగుతుందో ఎట్లాంటి గ్యారంటీ లేదు. కానీ ప్రమాదాల్ని ఎదుర్కోందే పరవశాన్ని అందుకోవడం వీలుపడదు. ప్రమాదకరంగా జీవించు! కారణం జీవితానికి మరో మార్గం లేదు. జీవితం తప్పనిసరిగా ప్రమాదకరంగా జీవించాలి. సన్యాసికి సాహనమన్నది అత్యున్నతమైన ధర్మం! అపుడే పరమానందానికి అవకాశముంది. వ్యక్తి ప్రమాదకరంగా జీవించడానికి సిద్ధపడితే ఎన్నో పూలు వికసిస్తాయి. పరమానంద సుమాలు విచ్చుకుంటాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
24 Aug 2021
దేవాపి మహర్షి బోధనలు - 131
🌹. దేవాపి మహర్షి బోధనలు - 131 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 108. స్వస్వరూప జ్ఞానము 🌻
సద్గురువును భ్రూమధ్యమున ధ్యాన మార్గమున వివరముగ దర్శించుట గూర్చి ముందు పాఠములలో తెలిపితిని. తేజోమయమగు అతని రూపమును ఆ విధముగ దర్శించు సాధన యందు మీకు పట్టు చిక్కిన వెనుక, నీవు భ్రూమధ్యమున సద్గురువు పాదముల చెంత కూర్చున్నట్లుగా దర్శించుటకు ప్రయత్నింపుము. నీ ముందు నీవు కూర్చున్నట్లు భావింపుము. నీ ముఖమును, రూపమును వివరముగ ఏకాగ్రతతో దర్శించుము.
శ్రద్ధ, భక్తి, నిరంతరత్వము, సద్గురువు అనుగ్రహము కారణముగ నీకు నీవు గోచరించుట ప్రారంభమగును. నీకు గోచరించు నీవు, నీకన్న తేజోమయముగ నుందువు. అపుడు నీవు “అది నేనే”, “అతడు నేనే”, “అతడే నేను” అని భావింపుము. దీనినే సంస్కృతమున “సో హం" అందురు. అతడు నీవైనప్పుడు, నీ వెవడవో కూడ నీకు తెలియును. అతడు తేజోమయుడు.
నీవు మృణ్మయుడవు. అప్పటి నీ భావన యిట్లుండును. "నేను తేజోమయుడను. ఈ మృణ్మయుడు నా గృహము, నా నివాసము, నా దేహము. అది నేను కాదు. నా నుండి అది ఏర్పడినది. దాని యందింతకాలము నీర, క్షీర న్యాయముగ కలిసి యున్నది. ఇపుడు విడిపడి నేను 'నేనుగ' నున్నాను. నా దేహమునందుండి పనులు చేయుదును.
అటుపైన దేహమును విడిచెదను. దాని నుండి విడిపడుటచే మరణించను. అది మరణించును. నేనుందును.” ఇట్టి క్షరాక్షరజ్ఞానము నీకు కలుగును. ఇది ధ్యానము వలననే సాధ్యము. కేవలము భావించుట వలన సాధ్యము కాదు. ఈ ధ్యానము సాధ్యపడుటకు కాలము, కర్మము కలసిరావలెను. అందులకై పరహిత కార్యములందు దీర్ఘకాలము సమర్పితుడవై జీవించవలెను. స్వార్థపరులకు యిది అసాధ్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
24 Aug 2021
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 479 / Vishnu Sahasranama Contemplation - 479
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 479 / Vishnu Sahasranama Contemplation - 479 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 479. అసత్, असत्, Asat 🌻
ఓం అసతే నమః | ॐ असते नमः | OM Asate namaḥ
అసద్బ్రహ్మ పరం వా చేత్యాదిశ్రుతిసమీరణాత్
మాయోపాధికమగు బ్రహ్మము - ఈశ్వరుడు లేదా పరబ్రహ్మము కంటే వేరు కావున 'అపరం బ్రహ్మ' అనీ, 'సత్' కంటే ఇతరము కావున 'అసత్' అనియూ చెప్పబడును. బ్రహ్మ తత్త్వ విషయములో సైతము నిరుపాధిక 'బ్రహ్మతత్త్వము' కాలత్రయములో ఉనికి కలది కావున 'సత్' అనబడును. అందుకు భిన్నముగా 'కార్యబ్రహ్మము' 'అసత్' అనబడును. ఇట్టి సోపాధిక బ్రహ్మము కూడా విష్ణుపరమాత్ముని విభూతియే.
:: ఛాందోగ్యోపనిషత్ షష్ఠ ప్రపాఠకః, ప్రథమ ఖండః ::
యథా సోమ్యైకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యా ద్వాచారమ్భణం వికారో నామధేయం మృత్తికే త్యేవ సత్యమ్ ॥ 4 ॥
మృణ్మయములైన కుండలు మున్నగునవన్నియు మృత్తికయే. నామ రూపములు వేరుగానున్నవి. మృత్తిక మాత్రము సత్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 479 🌹
📚. Prasad Bharadwaj
🌻 479. Asat 🌻
OM Asate namaḥ
असद्ब्रह्म परं वा चेत्यादिश्रुतिसमीरणात् / Asadbrahma paraṃ vā cetyādiśrutisamīraṇāt
The lower Brahman i.e., conditioned, which is not true in the ultimate pāramārthic sense, is Asat. Such a delusional Brahman is also Lord Viṣṇu.
:: छांदोग्योपनिषत् षष्ठ प्रपाठकः, प्रथम खंडः ::
यथा सोम्यैकेन मृत्पिंडेन सर्वं मृण्मयं विज्ञातं स्या द्वाचारम्भणं विकारो नामधेयं मृत्तिके त्येव सत्यम् ॥ ४ ॥
Chāndogyopaniṣat - Section 6, Chapter 1
Yathā somyaikena mrtpiṃḍena sarvaṃ mrṇmayaṃ vijñātaṃ syā dvācārambhaṇaṃ vikāro nāmadheyaṃ mrttike tyeva satyam. 4.
Just as by one clod of clay all that is made of clay is known, the modification being only a name, arising from speech, while the truth is that all is clay.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥
ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥
Dharmagub dharmakrd dharmī sadasatkṣaramakṣaram,Avijñātā sahasrāṃśurvidhātā krtalakṣaṇaḥ ॥ 51 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
24 Aug 2021
నిత్య పంచాంగము Daily Panchangam
🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹
ప్రసాద్ భరద్వాజ
24 ఆగస్టు 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
ఆయనం: దక్షిణాయణ, వర్ష ఋతువు
చాంద్రమానం : శ్రావణ మాసం
తిథి : కృష్ణ విదియ 16:06:12 వరకు
తదుపరి కృష్ణ తదియ
భాద్రపద - పౌర్ణమాంతం
పక్షం : కృష్ణ-పక్ష
నక్షత్రం : పూర్వాభద్రపద 19:49:48 వరకు
తదుపరి ఉత్తరాభద్రపద
యోగం : సుకర్మ 07:00:53 వరకు తదుపరి ధృతి
కరణం : గార 16:10:12 వరకు
వర్జ్యం : 01:55:52 - 03:33:20 మరియు
29:48:00 - 31:28:00
దుర్ముహూర్తం : 08:31:48 - 09:22:07
రాహు కాలం : 15:27:01 - 17:01:22
గుళిక కాలం : 12:18:16 - 13:52:38
యమ గండం : 09:09:33 - 10:43:54
అభిజిత్ ముహూర్తం : 11:53 - 12:43
అమృత కాలం : 11:40:40 - 13:18:08
సూర్యోదయం : 06:00:49
సూర్యాస్తమయం : 18:35:44
వైదిక సూర్యోదయం : 06:04:24
వైదిక సూర్యాస్తమయం : 18:32:10
చంద్రోదయం : 20:09:38
చంద్రాస్తమయం : 07:28:55
సూర్య సంచార రాశి : సింహం,
చంద్ర సంచార రాశి : కుంభం
ఆనందాదియోగం: కాల యోగం - అవమానం 19:49:48
వరకు తదుపరి సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
పండుగలు :
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🍀. కార్యసిద్ధిని చేకూర్చే ఆంజనేయ శ్లోకాలు 🍀
1. విద్యా ప్రాప్తికి:
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!
2. ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!
3. కార్య సాధనకు :-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!
4. గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!
5. ఆరోగ్యమునకు :-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
6. సంతాన ప్రాప్తికి :-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!
7. వ్యాపారాభివృద్ధికి :-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!
8. వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!
🌹🌹🌹🌹🌹
24 Aug 2021