1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 244 🌹
2) 🌹. శివ మహా పురాణము - 443🌹
3) 🌹 వివేక చూడామణి - 120 / Viveka Chudamani - 120🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -72🌹
5) 🌹 Osho Daily Meditations - 61🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 120🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
*🍀. శివషడక్షర స్తోత్రమ్ 🍀*
ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః 1
నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః
నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః 2
మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్
మహాపాపహరం దేవం మకారాయ నమో నమః 3
శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్
శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః 4
వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్
వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః 5
యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః
యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః 6
షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
🍀 🍀 🍀 🍀 🍀
23 ఆగస్టు 2021 విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
ఆయనం: దక్షిణాయణ, వర్ష ఋతువు
చాంద్రమానం : శ్రావణ మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 16:32:51 వరకు తదుపరి కృష్ణ విదియ
శ్రావణ - పౌర్ణమాంతం
పక్షం : కృష్ణ-పక్ష
నక్షత్రం, యోగం మరియు కరణం
నక్షత్రం: శతభిషం 19:27:09 వరకు తదుపరి పూర్వాభద్రపద
యోగం: అతిగంధ్ 08:33:38 వరకు తదుపరి సుకర్మ
కరణం : కౌలవ 16:35:51 వరకు
వర్జ్యం: 02:47:48 - 04:22:52
మరియు 25:55:52 - 27:33:20
దుర్ముహూర్తం: 12:43:44 - 13:34:08
మరియు 15:14:54 - 16:05:18
రాహు కాలం : 07:35:06 - 09:09:35
గుళిక కాలం : 13:53:01 - 15:27:30
యమ గండం : 10:44:04 - 12:18:33
అభిజిత్ ముహూర్తం : 11:53 - 12:43
అమృత కాలం : 12:18:12 - 13:53:16
సూర్యోదయం: 06:00:37, సూర్యాస్తమయం : 18:36:28
వైదిక సూర్యోదయం: 06:04:13, సూర్యాస్తమయం: 18:32:53
చంద్రోదయం : 19:31:29
చంద్రాస్తమయం : 06:34:23
సూర్య సంచార రాశి : సింహం
చంద్ర సంచార రాశి : కుంభం
ఆనందాదియోగం: అమృత యోగం - కార్య సిధ్ది 19:27:09 వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం
🌹🌹🌹🌹🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -244 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 23
*🍀 22. కాల స్వరూపము 🍀*
యత్ర కాలే త్వనావృత్తి మావృత్తించైవ యోగినః |
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరత్నభ || 23
*తాత్పర్యము : భరత శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఏ కాలము నందు దేహము త్యజించిన యోగులు మరల తిరిగిరారో, అట్లే ఏ కాలమునందు మరణించిన యోగులు మరల తిరిగి వత్తురో వివరించెదను- శ్రద్ధగ వినుము.*
వివరణము : భగవానుడు అపునరావృత్తి, పునరావృత్తి మార్గములలో వాని లక్షణములను ఈ తరువాతి శ్లోకములలో వివరించుచున్నాడు. ఈ కాలస్వరూపము నెరుగుట జిజ్ఞాసువులకు అవసరమై యున్నది. ఏ ఏ సమయములందు ప్రజ్ఞ సహజముగ వికాసము చెందుచు ఊర్ధ్వగతి చెందునో, ఏ యే సమయముల యందు వికాసమున కవరోధము కలుగునో తెలుయుట వలన జిజ్ఞాసువులు యుక్తి యుక్తముగ సాధనను కొనసాగించుకొన వచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 443🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 29
*🌻. శివపార్వతుల సంవాదము - 1 🌻*
నారదుడిట్లు పలికెను -
ఓ బ్రహ్మా! విధీ! మహాత్మా! తరువాత ఏమైనది? పవిత్రమగు ఆ వృత్తాంతమునంతనూ వినగోరుచున్నాను. నీవు శివాదేవి యొక్క కీర్తిని గురించి చెప్పుము (1).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ దేవర్షీ! నేనీగాథను ఆనందముతో చెప్పెదను. నీవు చక్కగా వినుము. ఈ గాథ మహాపాపములను పొగొట్టి శివభక్తిని వర్ధిల్లజేయును (2). పరమాత్మ యగు శివుని మాటను విని, ఆనందదాయకమగు ఆయన రూపమును చూచి, పార్వతి చాల సంతసిల్లెను. ఓ బ్రాహ్మాణా! (3) మహాపతివ్రత, మిక్కిలి ఆనందముతో నున్నది, ప్రీతిచే వికసించిన నేత్రములు గలది అగు శివాదేవి తన సమీపమునందున్న శివవిభునకు ఇట్లు బదులిడెను (4).
పార్వతి ఇట్లు పలికెను -
ఓ దేవదేవా! నీవు నా నాథడవు. నీవు నా కోసమై ఆగ్రహించి దక్షయజ్ఞమును ధ్వంసమొనర్చితివి. ఆ పూర్వగాథను మరచితివాయేమి? (5)
ఓ దేవదేవా! ఈశ్వరా! అట్టి నేను తారకునిచే పీడింపబడిన దేవతల కార్యము సిద్ధించుట కొరకై మేనయందు జన్మించితిని (6). ఓ దేవ దేవా! ఈశానా! ప్రభూ! నీవు ప్రసన్నుడవైనచో, నీకు దయ కలిగినచో, నా మాటను పాలించి నా భర్తవు కమ్ము (7). నీ అనుజ్ఞను పొంది నేను మా తండ్రిగారి ఇంటికి వెళ్లెదను. నీ పరమపవిత్రమగు కీర్తి నలుదిక్కులా వ్యాపించునట్లు చేయుము (8).
హే నాథా! ప్రభూ! నీవు హిమవంతుని వద్దకు వెళ్లవలెను. లీలాపండితుడవగు నీవు భిక్షుకుడవై ఆతని నుండి నన్ను కోరుము (9). అట్లు నీవు చేసి నీ కీర్తిని లోకములో విస్తరిల్ల జేయుము. మరియు నా తండ్రియొక్క గృహస్థాశ్రమమును సఫలము చేయుము (10).
మహర్షులచే బోధింపబడినవాడై నా తండ్రి బంధువులతో గూడి ప్రీతియుక్తముగా నీకోర్కెను మన్నించగలడు. ఈ విషయములో సందేహము వలదు (11).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 120 / Viveka Chudamani - 120🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 7 🍀*
398. మానసిక క్రియలన్ని బ్రహ్మములో కలసిపోయినపుడు (అందుకు నిర్వికల్ప సమాధి పొందవలెను) బ్రహ్మము అనంతమైన ఆత్మను పొందినపుడు ఈ భౌతిక ప్రపంచము యొక్క వ్యవహారములేవి కనిపించవు. అవి కేవలము మాటలకు మాత్రమే పరిమితము.
399. ఏకమైన బ్రహ్మములో విశ్వము యొక్క భావన కేవలము భ్రమ మాత్రమే. ఈ బ్రహ్మములో రెండవది ఏదీ లేదు. ఇది మార్పులేనిది. ఆకారములేనిది మరియు శాశ్వతమైనది.
400. ఏకత్వమైన ఈ బ్రహ్మములో; చూసేవాడు, చూడబడేది మరియు చూచునది అన్ని ఒక్కటే. దానికి మార్పులేదు, ఆకారము లేదు మరియు అది తిరుగులేనిది. అలాంటి దాంట్లో మార్పులు ఎలా సాధ్యము?
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 120 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 26. Self is Unchangeable - 7 🌻*
398. When the mind-functions are merged in the Paramatman, the Brahman, the Absolute, none of this phenomenal world is seen, whence it is reduced to mere talk.
399. In the One Entity (Brahman) the conception of the universe is a mere phantom. Whence can there be any diversity in That which is changeless, formless and Absolute ?
400. In the One Entity devoid of the concepts of seer, seeing and seen – which is changeless, formless and Absolute – whence can there be any diversity ?
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 72 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. ఆనందసూక్తము - 4 🌻
అయితే ఆనందాన్ని చేరుకొనే త్రోవ ఏమిటి? ఆ మార్గము సేవ, త్యాగములలో ఉన్నవి. ఆనందానికి సేవ, త్యాగములే ప్రోత్సాహకాలు. అవి అర్థం చేసుకోవటానికి ఎన్ని జన్మలు, పునర్జన్మలో కాలాన్ని హరించటానికి.
ఆనందాన్ని డబ్బుతో కొనుక్కోవచ్చని భావిస్తాము. అందుకై పడరాని పాట్లు. అవసరమైనవి, ఆవశ్యకమైనవి కొనుక్కొనుటకు మాత్రమే ధనము అవసరమన్న సంగతి మరచిపోతాము.
మనకు అవసరాలు, కోరికలు ఎన్నో!! కోరికల కొరకు వస్తువులు కొనటం మొదలుపెడతాము, కోరిక అనేది అడుగు భాగం లేని పాత్ర అని గ్రహించం. పైగా దానిని డబ్బుతో నింపాలని యత్నించి, డబ్బు సంపాదిస్తూ పోతుంటాము. దానికై కార్యకలాపాలు పెంచుకొంటాము. ఇదంతా ఎందుకంటే అనందంగా ఉండాలని ఉంది కనుక.
"ఆనందంగా జీవించాలనే దురదృష్టవంతునికి ఆనందంగా ఉండటానికి సమయమే చిక్కటం లేదు." అని పవిత్రగ్రంధాలు చెబుతున్నాయి.
ఆనందంగా ఉండటానికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నప్పుడల్లా మనకు వైఫల్యమే మిగులుతున్నది. ఎందుచేతనంటే ఆనందమునకు, ఆనందాన్ని కొనగలిగిన మరో వస్తువు లోకంలో లేదు. నిజంగా కొనగలిగితే, అది ఆనందం కంటే విలువయినదయి ఉండాలి. దానిని అంగీకరిస్తే పిచ్చితర్కమని జాలిపడాలి. అంటే దారి తప్పనట్టు లెక్క.
ఇళ్ళతోకాని, అతి విలువగల వస్తువులని భావించేవానితో మనం ఆనందాన్ని కొనుక్కోటానికి యత్నిస్తుంటాము. అది టి.వి. కావచ్చు, సోఫాలు కుర్చీలు కావచ్చు. విద్యుత్ పరికరాలు కావచ్చు. అవి మనకు చెంది ఉంటాయి. కాని అవి మనము కాము.
ఆనందం ఒకనికి చెందిన వస్తువు కాదు. అది ఒక విప్పారటం- తెరుచుకోవటం. అది నువ్వే అని మరచిపోకు. పువ్వుకు, రేకకు ఉన్న సంబంధము, నీకూ ఆనందానికి ఉన్న సంబంధము ఒక్కటే. అంటే పువ్వు యొక్క రేకలు ఆ పువ్వుకు చెందినవి కావు. అవి పుష్పంలోని భాగాలే. అవి పుష్పము యొక్క ఏకత్వములోను, సమన్వయములోనూ ఉన్నవి.
...✍️ *మాస్టర్ ఇ.కె.*🌹
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 61 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 61. DEATH 🍀*
*🕉 Nothing is wrong in death. Whenever it happens, it is a great rest. 🕉*
When your body is completely spent, death is the only thing needed. Then it happens; then you move into another body. You may become a tree or a bird or a tiger or something else, and ypu go on moving. The existence gives you a new body when the old is spent. Death is beautiful, but never ask for it, because when you ask for it, the quality of death changes toward suicide. Then it is no longer a natural death. You may not be committing suicide, but the very asking makes you suicidal. When alive, be alive; when dead, he dead. But don't overlap things.
There are people who are dying and who go on clinging to life. That too is wrong, because when death has come, you have to go, and you have to go dancing. If you are asking for death, even thinking about it, then you are alive and clinging to the idea of death. It is the same in the reverse direction. Somebody who is dying and goes on clinging to life, does not want to die. Somebody is alive and wants to die: That is non-acceptance. Accept whatever is there, and once you accept unconditionally, then everything is beautiful. Even pain has 'a purifying effect. So whatever comes on your way, just be thankful.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 120 / Sri Lalita Sahasranamavali - Meaning - 120 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా |*
*దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ‖ 120 ‖ 🍀*
🍀 595. హృదయస్థా -
హృదయమునందు ఉండునది.
🍀 596. రవిప్రఖ్యా -
సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది.
🍀 597. త్రికోణాంతర దీపికా -
మూడు బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మద్యమున వెలుగుచుండునది.
🍀 598. దాక్షాయణీ -
దక్షుని కుమార్తె.
🍀 599. దైత్యహంత్రీ -
రాక్షసులను సంహరించింది.
🍀 600. దక్షయజ్ఞవినాశినీ -
దక్షయజ్ఞమును నాశము చేసినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 120 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 120. hṛdayasthā raviprakhyā trikoṇāntara-dīpikā |*
*dākṣāyaṇī daityahantrī dakṣayajña-vināśinī || 120 || 🌻*
🌻 595 ) Hridayastha -
She who is in the heart
🌻 596 ) Ravi pragya -
She who has luster like Sun God
🌻 597 ) Tri konanthara deepika -
She who is like a light in a triangle
🌻 598 ) Dakshayani -
She who is the daughter of Daksha
🌻 599 ) Dhithya hanthri -
She who kills asuras
🌻 600 ) Daksha yagna vinasini -
She who destroyed the sacrifice of Rudra.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment