వేదములు - వాటి ప్రాముఖ్యత - ఆవిర్భావము (The Vedas - Their Importance - Origin)

🌹. వేదములు - వాటి ప్రాముఖ్యత - ఆవిర్భావము 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

వేదమనగా – విద్ అను ధాతువు నుండి పుట్టినది. “వేద ఇతీతి వేదః” అనగా తెలియచేయునది వేదమని చెప్పబడును. “విదంతి యతో ధర్మాధర్మమితి వేదః” అనగా దేని సహాయము వలన ధర్మాధర్మములు తెలియబడుచున్నవో అదే వేదము.

శృతి|| శౄయత ఇతి శృతిః|| మరియు

శృతిః|| ఆమ్నాయతే పరంపర ఏత్యామ్నాయః||

అనగా శ్రోత్రేంద్రియమునకు వినబడుటచే శృతియనియూ, గురుశిష్య పరంపరగా తెలియబడునది అయినందున ఆమ్నాయమని చెప్పబడును. శ్రుతి గురువు నుంచి శిష్యుడు వినే దివ్యవాణి. ఆమ్నాయము ఆవృత్తి లేదా మననము ద్వారా నేర్చుకోబడే విద్య. వేదము మొదట్లో ఒక్కటిగానే వుండెను. కృష్ణ ద్వైపాయనుడు వేదమును నాలుగు భాగములుగా విభజించి మానవులకు సులభతరముగా అర్థమయ్యేటట్లు చేసిన మహాఋషి కావడముచేత వేదవ్యాసుడని పేరుగాంచెను.

మహాఋషులైన మంత్ర ద్రష్టల శ్రోత్రేంద్రియములకు వినిపించిన వాక్కులే వేదములు. కనుకనే వాటిని అపౌరుషేయములని చెప్పబడినవి. వేదములకు కర్త అనేవాడు ఒకడు లేనందున అనగా పురుష నిర్మితము కానందున అవి అపౌరుషేయములనీ, అనాది అగుటచే ఒక కాలములో పుట్టెననుటకు వీలు కాదనియూ, నిత్యమగుటచే మార్పుచెందునవిగాని నశించునవిగాని కావనియూ, కనుక సర్వకాలములకు, సర్వులకు నిత్యమైన ప్రమాణ గ్రంథరాజములు వేదములు అని స్తుతింపబడుచున్నవి.

పరమాత్మకు అన్యముగా వేదములు లేవు మరియు వేదములు పరమాత్మయందే నిక్షిప్తమై ప్రకటమగుచున్నందున ‘నిశ్వాసితం’ – ఈశ్వరుని యొక్క నిశ్వాసములే వేదములని బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడినది. వేదములను నిగమములని కూడా అంటారు.

వేదములు నాలుగు:

🌻 1) ఋగ్వేదము

🌻 2) యజుర్వేదము

🌻 3) సామ వేదము

🌻 4) అధర్వణ వేదము

వేదము బ్రాహ్మణములు, సంహితలు, అరణ్యకములు అని త్రివిధ భాగములుగా ఉండును.

🌻. బ్రాహ్మణములు కర్మ పద్ధతిని తెలియజేయునట్టివి. ఇది వివిధ ఆచారములు వాటిని పాటించే విధముల గురించి వివరించే భాగము.

🌻. సంహితలు అనగా భగవంతుని స్తుతించునట్టి స్తోత్రములు. ఇందులో ఇహలోక పరలోక లభ్ధికోసము వివిధ దేవతల గురించి ప్రార్థనలు ఉన్న భాగము. సంహితలలో భక్తి పద్ధతి బోధించబడినది.

🌻. అరణ్యకములు అనగా వేదాంతమును బోధించు ఉపనిషత్తులు. అరణ్యకములలోని ఉపనిషత్తులయందు జ్ఞాన పద్ధతి తెలియజేసి బ్రహ్మస్వరూపము ఉపదేశించబడినది. ఉపనిషత్తులనే వేదశిఖరములనియూ, వేదాంతములనియూ అంటారు. ఉపనిషత్తులు వేదములలోని సారాంశాన్ని వివరిస్తాయి.

మొత్తము వేద విజ్ఞానమును ఒక మహావృక్షంగా భావిస్తే బ్రాహ్మణములను ఆ చెట్టు పూలుగా, సంహితలను పచ్చి కాయలుగా, ఉపనిషత్తులను పండ్లుగా వర్ణించవచ్చును. కృష్ణ ద్వైపాయనుడు వేదములను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే వారికి బోధించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్య పరంపరగా ఈ నాలుగు వేదములు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదములను ఉచ్ఛరించడములో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అన్ని వేదములు కలిపి 1,180 అధ్యాయాలు, లక్ష పైగా శ్లోకాలు ఉండాలని అంటారు. ఒక్కొక్క అధ్యాయమునకు ఒక్కటేసి చొప్పున 1,180 అధ్యాయాలకు 1,180 ఉపనిషత్తులు ఉండేవి. కాని ప్రస్తుతము మనకు లభించిన శ్లోకాలు 20,023 (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు) కాగా, ఉపనిషత్తులు 108 మాత్రమే లభించినవి. మిగతావి కాలగర్భములో కలిసిపోయాయి.

🌻 1) ఋగ్వేదము

ఈ వేదము అన్ని వేదములలో ప్రాచీనమైనదిగా భావిస్తారు. ఈ వేదము మొట్టమొదటిసారిగా పైల మహర్షికి ప్రకటింపబడినది. అగ్ని దేవుడికి అంకితము చేయబడిన ఈ వేదమునకు అధిష్ఠాన దేవత గురువు. ఈ వేదము మొత్తము 10 మండలాలుగా విభజించబడి, 1028 సూక్తములతో 10,552 మంత్రాలతో అలరారుతూ ఉంది. ఈ వేదము మొదటిలో 21 శాఖలుగా విస్తరించి ఉండేది. కాని ఇప్పుడు 5 శాఖలు మాత్రమే దొరుకుతున్నాయి. దేవతా సూక్తములు, ఆత్మ సంబంధిత సూక్తములు, సామాన్య జీవన విధాన సూక్తములు ఇందులో పొందు పరచ బడినాయి.

🌻 2) యజుర్వేదము

వైశంపాయన మునికి మొదటి సారిగా ప్రకటించబడిన ఈ వేదము వాయు దేవునికి అంకితము చేయబడినది. అధిష్ఠాన దేవత శుక్రుడు. ఈ వేదము 40 స్కంధములుగా విభజించబడి, 1975 శ్లోకములతో అలరారుతుంది. ఈ వేదమును ‘శుక్ల’ యజుర్వేదము అని, ‘కృష్ణ’ యజుర్వేదము అని రెండు భాగములుగా విభజించారు. వీటిలో శుక్ల యజుర్వేదము ప్రాచీనమైనది. కృష్ణ యజుర్వేదము యాఙ్ఞవల్క్య మునికి ప్రకటించబడినది. యజుర్వేదము మొదట 102 శాఖలుగా ( 85 కృష్ణ, 17 శుక్ల) విస్తరించినప్పటికి, ప్రస్తుతానికి 4 కృష్ణ యజుర్వేద శాఖలు, రెండు శుక్ల యజుర్వేద శాఖలు మాత్రమే మనకు మిగిలాయి. ఈ వేదము ముఖ్యముగా సాంప్రదాయ పద్ధతులు, పూజా విధానములు, బలి మొదలైన వాటిని వివరిస్తుంది. కృష్ణ యజుర్వేదములో ‘తైతిరీయ’, ‘కఠ’ ఉపనిషత్తులు ఉండగా, శుక్ల యజుర్వేదములో ‘ఈశ’, ‘బృహదారణ్యక’ ఉపనిషత్తులున్నాయి.

🌻 3) సామ వేదము

ఈ వేదము మొట్టమొదటి సారిగా జైమిని మునికి ప్రకటించబడింది. ఈ వేదమునకు అధిష్ఠాన దేవత అంగారకుడు. ఈ వేదము ఆదిత్యునికి అంకితము చేయబడినది. ఈ వేదము రెండు భాగములుగా విభజించబడింది.

(1) పూర్వార్సిక: 4 స్కంధములలో 585 మంత్రములు కలిగి ఉంది.

(2) ఉత్తరార్సిక: 21 స్కంధములలో 964 మంత్రములను కలిగి ఉంది.

మొత్తం 1564 మంత్రములలో 75 మంత్రాలు ఋగ్వేదము నుంచి గ్రహించబడినాయి. మొదట్లో 1000 శాఖలుగా విస్తరించిననూ ప్రస్తుతానికి 3 శాఖలు మాత్రమే నిలిచి ఉన్నాయి. దైవ ప్రార్థనలు, సంగీతము, శాంతి ప్రార్థనలు ఈ వేదములో మనకు కనపడే విశేషములు.

🌻 4) అధర్వణ వేదము

ఈ వేదము మొదటి సారిగా సుమంతు మహామునికి ప్రకటించబడినది. ఆదిత్యునికి అంకితమైన ఈ వేదమునకు బుధుడు అధిష్ఠాన దేవత. ఈ వేదము రెండు భాగములుగా విభజించబడినది.

(1) పూర్వార్థ: అనేక విషయముల పై చర్చ.

(2) ఉత్తరార్థ: వివిధ ఆచారముల పై కూలంకష చర్చ.

అధర్వణ వేదము నాలుగు భాగములుగా విభజించబడి 20 స్కంధములతో 6,077 మంత్రములతో అలరారుతున్నది. మొదట తొమ్మిది శాఖలతో ఉన్న ఈ వేదములో ప్రస్తుతము 2 శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ వేదములో దైవ ప్రార్థనలతో పాటు సృష్టి పరిణామము గురించిన కథలు, భూత, పిశాచ, దుష్ట శక్తులను నివారించటానికి మంత్రములు, మంత్ర విద్య, తంత్ర విద్యలకు సంబంధించిన విషయములు కూడా పొందుపరిచారు. ఇందులో 93 ఉపనిషత్తులు పొందుపరుచబడి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ‘ప్రశ్న’, ‘మాండూక’, మరియు “మాండుక్య” ఉపనిషత్తులు.

ఈ నాలుగు వేదములు త్రిగుణాత్మకమైనవి. అనగా సత్వరజస్తమోగుణములతో కూడుకొని కర్మ, భక్తి, జ్ఞాన సంబంధమైన పద్ధతులనే బోధించును, కాని వాటికి అతీతమైన పద్ధతిని తెలియచేసి జననమరణ భ్రాంతిరహితమును సూచించు మార్గమును తెలియ చేయలేవని భావము. కనుకనే శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతయందు ఈ క్రింది విధముగా వక్కాణించి వున్నారు.

“శ్లో || త్రైగుణ్య విషయా వేదా | నిస్త్రైగుణ్యో భవార్జున |

నిర్ద్వంద్వో నిత్య సత్త్వస్థో | నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ||”

🌹 🌹 🌹 🌹 🌹

08 Jan 2021

శ్రీ విష్ణు సహస్ర నామములు - 106 / Sri Vishnu Sahasra Namavali - 106

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 106 / Sri Vishnu Sahasra Namavali - 106 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

రేవతి నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం

🍀 106. ఆత్మయోని స్స్యయంజాతో వైఖాన స్సామగాయనః|
దేవకీ నన్దన స్స్రష్టా క్షితీశః పాపనాశనః || 106 ‖ 🍀

🍀 985) ఆత్మయోని: -
తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు.

🍀 986) స్వయంజాత: -
మరొకరి ప్రమేయము లేకనే తనకు తానుగ ఆవిర్భవించువాడు.

🍀 987) వైఖాన: -
ప్రాపంచిక దు:ఖమును నివారించువాడు.

🍀 988) సామగాయన: -
సామగానము చేయువాడు.

🍀 989) దేవకీనందన: -
దేవకీ పుత్రుడైన శ్రీ కృష్ణుడు.

🍀 990) స్రష్టా -
సృష్టికర్త

🍀 991) క్షితీశ: -
భూమికి నాధుడైనవాడు.

🍀 992) పాపనాశన: -
పాపములను నశింపజేయువాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 106 🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Revathi 2nd Padam

🌻 106. ātmayōniḥ svayaṁjātō vaikhānaḥ sāmagāyanaḥ |
devakīnandanaḥ sraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ || 106 || 🌻

🌻 985. Ātmayōniḥ:
One who is the source of all; that is, there is no material cause other than Himself for the universe.

🌻 986. Svayaṁ-jātaḥ:
He is also the instrumental cause.

🌻 987. Vaikhānaḥ:
One who excavated the earth, taking a unique form.

🌻 988. Sāmagāyanaḥ:
One who recites the Sama chants.

🌻 989. Devakī-nandanaḥ: 
The Son of Devaki in the incarnation as Krishna.

🌻 990. Sraṣṭā:
The creator of all the worlds.

🌻 991. Kṣitīśaḥ:
A master of the world. Here it denotes Rama.

🌻 992. Pāpanāśanaḥ:
He who destroys the sins of those who adore Him, meditate upon Him, remember and sing hymns of praise on Him.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

08 Jan 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 142

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 142 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 21 🌻

575. బ్రహ్మజ్ఞానము :

పరిమిత అహం, అంటు లేకుండా పోయి, ద్వైతము పూర్తిగా అదృశ్యమైన తరువాత, మానవుడు ఈ జ్ఞానమును చేరుకొనును.

576. సర్వ సాధారముగా ప్రతియొక్కడును సర్వోత్తమ జ్ఞానమును బడయుటకు మధ్యతరగతులను దాటి రావలసినదే కానీ సద్గురు దర్శకత్వంలో మెలగిన వారు, ఈ మధ్యేమార్గం ఒక్కసారిగా బ్రహ్మజ్ఞానము పొందుదురు.

577. సప్తమ భూమికలో బ్రహ్మీ బూతుడు:- ఇచ్చట భగవంతుడు భగవంతునిగా తనను ప్రతివారిలో ప్రతి దానిలో చూచును. ఇది పంచఆధ్యాత్మిక సత్యములలో నొకటి.

🌹 🌹 🌹 🌹 🌹

08 Jan 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 203

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 203 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. దుర్వాసమహర్షి-కందళి - 7 🌻

35. విశ్వరూపదర్శనంకూడా కృష్ణుడు అర్జునుడికి లోపల అంతఃకరణలో తెరతీసి చూపించాడే తప్ప, అర్జునుడు సంపాదించుకున్న జ్ఞానం కాదు అది. అతడి మోహాన్ని తొలగించటానికి లోపల తెరతీసి చూపించాడు. అతనికి దృష్టినిచ్చాడు ఒక్కక్షణం. తనే కనబడితే ఊళ్ళో అందరికీ కనబడవలసిందే! ఆ యుద్ధరంగంలో ఎవరికీ కనబడలేదే! ఎవరి హృదయంలో తెరతీసాడో వాళ్ళకే కనబడ్డాడు.

36. కౌరవసభలో పూర్వం, వాళ్ళు ఆయనను బంధించే ప్రయత్నం చేసినప్పుడు, విశ్వరూపదర్శనం ఇచ్చాడు. ఆ గుడ్డివాడైన దృతరాష్ట్రుడికికూడా అది ప్రసాదించాడు. కానీ అతడు జ్ఞానాన్ని అడగలేదు. నువ్వు మహాపురుషుడివి అన్నాడు. కృష్ణుడికి దణ్ణం పెట్టాడే తప్ప, అతడికి పుత్రవ్యామోహంపోలేదు. జ్ఞానార్థికాలేదక్కడ. జ్ఞానార్థి అయితే జ్ఞానం వచ్చేదే.

37. “మీరు నన్నేమీ చెయ్యలేరు. నేను సర్వాంతర్యామిని. విరాట్పురుషుణ్ణి. నన్ను మీరు శిక్షించటమేమిటి?” అని వారి అహంకారాన్ని తగ్గించేందుకు ఇచ్చిందే ఆ దర్శనమంతా! వీళ్ళందరూ మూర్ఛపోయారు. ఎవ్వరూ చూడలేదు. సభఅంతా మూర్ఛపోయింది. బ్రహ్మాండమయిన వెలుగేదో కనబడింది. వాళ్ళు స్పృహతప్పిపడిపోయారు. ధృతరాష్ట్రుడు ఆ తేజస్సును కళ్ళతో-చర్మచక్షువులతో-చూడలేదు కాబట్టి, అతడు మూర్ఛపోలేదు. అతడికి కృష్ణుడు అంతర్దర్శనం అప్పుడే ఇచ్చాడు.

38. నదిలో స్నానంచేస్తుంటే చెత్తకొట్టుకొస్తుంది. ఇలాఅలా తోసేసి మళ్ళీ మునుగుతాం. లేచేసరికి మళ్ళీ చెత్తవస్తుంది. అక్కడి పరిశుద్ధత మనం మునిగి లేచేలోపల అయిపోతుంది. దానికి అంతే పారిశుద్ధ్యం! మళ్ళీ చెత్త కొట్టుకుని వస్తూనే ఉంటుంది. అలాగే ఈ ప్రకృతి అనే మహాప్రవాహంలో ఎప్పుడూ మనం ఉంటాము. జ్ఞానం క్షణికంగా ఉంటుంది.

39. ఎందుకంటే ఉన్నదంతా బ్రహ్మాడమయిన చీకటి. నల్లనిమబ్బు. జ్ఞానం మెరుపులా ఒక్క క్షణంవచ్చి బ్రహ్మాండంగా వెలుగు చూపిస్తుంది. ఎంతసేపుంటుంది? ఏదీ ఉండదు. చూస్తుండగానే అంతర్థానం అయిపోతుంది. అజ్ఞానం అనే ఈ నల్లని మబ్బుల్లో, అంధకారంలో మెరిసేమెరుపులాగా. క్షణంమాత్రమే ఉండిపొతుండి.

40. ప్రపంచంలో, జీవితంలో ఈ సుఖంఅనేది కూడా అంతే! మెరుపులాగా క్షణం కనబడేదే! ఎప్పుడో అలాగ ఒక్కక్షణం మాత్రం మెరిసే మెరుపుని పట్టుకుని శాశ్వతంగా పెట్టుకుందామని ప్రయత్నం చేయడం ఏమి వివేకం? ఎప్పుడూ సుఖంగా బతకాలి అనేమాట కూడా అజ్ఞానంతో కూడినదే. ఏముంది సుఖం? ఎలా ఉంటుంది శాశ్వతంగా! దీనికి సిద్ధపడే ఇక్కడ జీవించాలి కాని, భ్రమలలో కాదు.

41. లేదా, “ఇక్కడికి నేను కర్మక్షయం కోసం వచ్చాను” అనే దృక్పథంతో జీవించడం ఒక మార్గం. అంటే, కష్టపడటానికే వచ్చాను అనే వివేకమన్నమాట. “నేనెంతమందికి బాకీఉన్నానో, సేవచేసి ఆ ఋణం తీర్చుకోవటానికి వచ్చాను” అనే దృక్పథం. ఇలాగ ఉండి, ఈ మాటలు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటే దుఃఖం ఉండదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

08 Jan 2021

శ్రీ శివ మహా పురాణము - 318

🌹 . శ్రీ శివ మహా పురాణము - 318 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

80. అధ్యాయము - 35

🌻. విష్ణువు పలుకులు - 1 🌻

దక్షుడిట్లు పలికెను -

హే దేవదేవా! హరే! విష్ణో !దీనబంధూ! దయాసాగరా! నీవు నన్ను, నాయజ్ఞమును రక్షించవలెను (1). యజ్ఞము నీస్వరూపమే. యజ్ఞమును రక్షించువాడవు నీవే. యజ్ఞమును చేయు యజమాని కూడ నీ స్వరూపమే. నీవు దయను చూపుము. హే ప్రభూ! యజ్ఞము నాశము కాని విధముగా అనుగ్రహించుము (2).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్షుడు ఈ విధముగా అనేక తెరంగులలో సాదరముగా విన్నవించుకుని, భయముచే కల్లోలితమగు మనస్సు గలవాడై ఆయన పాదములపై పడెను (3). అపుడు విష్ణువు చింతాగ్రస్తమైన మనస్సుగల ఆ దక్షుని పైకి లేవదీసి, దుర్బుద్ధియగు ఆతని ఆ పలుకులను విని శివుని స్మరించెను (4). మహేశ్వరుడు, తనకు ప్రభువు అగు శివుని స్మరించి, శివతత్త్వమును ఎరింగిన విష్ణువు దక్షుని సంబోధించి ఇట్లు పలికెను (5).

విష్ణువు ఇట్లు పలికెను -

దక్షుడా! వినుము. నేను యథార్థమగు వచనమును చెప్పెదను. నీకు అన్ని విధములా హితమును చేగూర్చి సుఖము నిచ్చే మహామంత్రమును చెప్పెదను (6). హే దక్షా! తత్త్వము నెరుంగని నీవు సకల జగత్తునకు అధీశ్వరుడు, పరమాత్మయగు శివుని అవమానించితివి (7).

ఈశ్వరుని తిరస్కరించినచో, సర్వకార్యములు అన్ని విధములా విఫలమగును. అంతమాత్రమే గాదు. ప్రతి అడుగు నందు ఆపదలు కలుగును (8). ఎచట పూజింపదగని వారు పూజింపబడుదురో, పూజింపదగిన వారు పూజింపబడరో, అచట దారిద్ర్యము, మరణము, భయము అను మూడు ఉండును (9).

కావున, అన్ని విధముల ప్రయత్నమును చేసి వృషధ్వజుడగు శివుని పూజించవలెను. కాని మహేశ్వరుని అవమానించుట వలన మహాభయము సంప్రాప్తమైనది (10). ఇప్పుడు మేమందరము సమర్ధులమైననూ, కలిసి ఆపదను నివారించుటకు శక్యము కాదు. ఇది అంతయూ నీ చెడునీతి వలన కలిగినది. నేను సత్యమును చెప్పుచున్నాను (11).

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు యొక్క ఆ మాటను విని దక్షుడు చింతాగ్రస్తుడాయెను. ఆతడు పాలిపోయిన ముఖము గలవాడై నేలపై గూర్చుండి మిన్నకుండెను (12). ఇంతలో సైన్యముతో కూడి యున్నవాడు, రుద్రునిచే ప్రోత్సహింపబడినవాడు, గణాధ్యక్షుడునగు వీరభద్రుడు యజ్ఞస్థలమును సమీపించుచుండెను (13).

కొన్ని గణములు ఆయన వెనుక, మరికొన్ని ఆకాశమునందు, ఇంకొన్ని సర్వదిక్కులను ఆక్రమించి ముందుకు సాగిరి (14). శూరులు, భయము లేనివారు, రుద్రునితో సమానమగు పరాక్రమము గలవారు, మహావీరులునగు ఆ గణములు లెక్కలేనంతమంది సింహనాదములను చేయుచూ ముందుకు సాగిరి (15).

ఆ శబ్దమునకు ముల్లోకములు దద్దరిల్లెను. ఆకాశము ధూళితో నిండెను. దిక్కులయందు చీకట్లు వ్యాపించెను (16). ఏడు ద్వీపములతో, పర్వతములతో, అడవులతో కూడియున్న పృథివి మిక్కిలి భయముతో కంపించెను. సముద్రములన్నియు క్షోభిల్లినవి (17). లోకములను నాశనము చేయగల ఇటువంటి ఆ మహాసైన్యమును చూచి రాక్షసులు మొదలగు వారందరు ఆశ్చర్యచకితులైరి (18). తరువాత ఈ సైన్య సంరంభమును చూచిన దక్షుడు నోటినుండి రక్తమును గ్రక్కెను. ఆతడు భార్యతో గూడి విష్ణువు ఎదుట దండము వలె పడి, ఇట్లు పలికెను (19).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

08 Jan 2021

గీతోపనిషత్తు -118

🌹. గీతోపనిషత్తు -118 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 1, 2.

🍀. 1. కర్మ - జ్ఞానము - కర్మత్యాగము, కర్మయోగము రెండును విముక్తి కలిగించ గలవు. రెండిటిలో కర్మయోగమే శ్రేష్ఠము. కర్మల నెవ్వరును త్యాగము చేయలేరు. నిద్రించుట, లేచుట, ఆలోచించుట, భుజించుట, మాటాడుట దేహకి తప్పనిసరి యగు కర్మలు. కర్మత్యాగ మనగా, కర్మఫలత్యాగమే అని తెలియవలెను. అంతియే కాదు, కర్మసంగ త్యాగము కూడ. కర్మల నాచరించుచు, వానిచే తగులకొన బడకుండుట కర్మ యందు కౌశలము. "కర్మ బ్రహ్మాద్భం విద్ధి" - కర్మ బ్రహ్మము నుండి పుట్టుచున్నదని, బ్రహ్మము అక్షర పరబ్రహ్మము నుండి పుట్టినవాడని, కావున సృష్టియందు కర్మ మనివార్యమని, కర్మమును బ్రహ్మవలె నాచరించినచో జీవుడు ముక్తుడుగ నుండునని ముందే తెలుపబడినది. 🍀

1. సన్న్యాసం కర్మణాం కృష్ణ పున ర్యోగం చ శంససి |
యచ్ఛేయ ఏతయో రేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ||

2. సన్న్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా వుభౌ |
తయోస్తు కర్మసన్న్యాసా త్కర్మయోగో విశిష్యతే || 2

శ్రీ కృష్ణా! నీ ప్రబోధమున కర్మయోగము, కర్మత్యాగము రెంటిని పలుకుచున్నావు. ఇంతకును జీవుడు కర్మయోగము నందుండవలెనా, కర్మత్యాగము నందుండవలెనా అని అర్జునుడు ప్రశ్నించినాడు.

అర్జునా! కర్మత్యాగము, కర్మయోగము రెండును విముక్తి కలిగించ గలవు. రెండిటిలో కర్మయోగమే శ్రేష్ఠము.

కర్మల నెవ్వరును త్యాగము చేయలేరు. నిద్రించుట, లేచుట, ఆలోచించుట, భుజించుట, మాటాడుట దేహకి తప్పనిసరి యగు కర్మలు. కర్మత్యాగ మనగా, కర్మఫలత్యాగమే అని తెలియవలెను.

అంతియే కాదు, కర్మసంగ త్యాగము కూడ. కర్మల నాచరించుచు, వానిచే తగులకొనబడకుండుట కర్మ యందు కౌశలము. కర్మలను నిర్వర్తింపకుండుటకు ఎవ్వడును సమర్థుడు కాడు. నిర్వర్తించునపుడు కర్మ సంగము, కర్మ ఫలము కలుగుచుండును. త్యాగము చేయవలసినది సంగము, ఫలమే గాని కర్మలు కాదు.

ఫలముల నాశించక, కర్తవ్య కర్మలను నిర్వర్తించుచు, నిర్వర్తింపబడు కర్మలనుండి సంగము పొందక నిర్వర్తించుట కర్మయోగమే యగును.

"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన! మా కర్మఫల హేతుర్భూ ర్మా తే సంగో2 స్వకర్మణి |'' (2-47)

అను నాలుగు సూత్రములుగ కర్మలు నిర్వర్తించు పద్ధతి దైవము తెలిపినాడు. (వివరమునకు పై శ్లోక వివరము చూడుడు). అట్లాచరించినవాడు కర్మయోగియే. ఈ మార్గమున కర్మ క్షాళనమై, జీవుడు ముక్తుడగునని తెలుపుచున్నాడు.

పై విధముగ కర్మల నాచరించు కర్మయోగి క్రమముగ, కరృత్వ భావనను కూడ విసర్జించును. తన నుండి కర్మలు జరుగు చున్నవి గాని, తాను చేయుట లేదని తెలియును.

"కర్మ బ్రహ్మాద్భం విద్ధి" - కర్మ బ్రహ్మము నుండి పుట్టుచున్నదని, బ్రహ్మము అక్షర పరబ్రహ్మము నుండి పుట్టినవాడని, కావున సృష్టియందు కర్మమనివార్యమని, కర్మమును బ్రహ్మవలె నాచరించినచో జీవుడు ముక్తుడుగ నుండునని ముందే తెలుపబడినది.

కావున కర్మయోగమున నిష్ణాతుడైనవాడు తననుండి జరుగు కర్మ యంతయు దైవ సంకల్పమని తెలిసియుండును. కర్త తాను కాడు కనుక, కర్మలు చేయుచున్నానను భావన కూడ యుండదు.

కర్తృత్వ భావన లేక చేయుచు నుండును. ఈ స్థితిని కర్మ సన్న్యాస స్థితి అందురు. కర్మయోగికే కర్మ సన్న్యాస స్థితి లభించును. కర్మలు మానుట కర్మ సన్న్యాసము కాదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

08 Jan 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 173 / Sri Lalitha Chaitanya Vijnanam - 173

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 173 / Sri Lalitha Chaitanya Vijnanam - 173 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిఃసంశయా, సంశయఘీ, నిర్భవా, భవనాశినీ ‖ 48 ‖

🌻 173. 'సంశయఘ్నీ' 🌻

భక్తుల సంశయములను నిర్మూలించునది శ్రీమాత అని అర్థము.

మనస్సున సంశయములతో బాధపడువారు భక్తి శ్రద్ధలతో శ్రీమాత ఆరాధన గావించినచో వారి సంశయములన్నిటినీ ఆమె పటాపంచలు చేయును. భయము, సందేహము, సంశయము కలిగి

నప్పుడు, జీవితము అగమ్యగోచరమైనప్పుడు, కష్టనష్టముల పాలై నప్పుడు శ్రీమాత నారాధించు ఎందరెందరో భక్తులు కృతకృత్యులై శాశ్వతానందము పొందిరి. శ్రీమాత ఆరాధన విశేషముగా, భక్తుడు కర్తవ్యోన్ముఖు డగును.

నిర్వర్తించునది కర్తవ్యమైనపుడు లాభనష్టములతోను, జయాపజయములతోను సంబంధ ముండదు. కర్తవ్య మనగా చేయవలసిన పని. అందు ఇష్టాయిష్టములకు తావు లేదు. ఇష్టాయిష్టములతో పనిచేయు వారికి కర్తవ్యమెన్నటికిని అర్థము కాదు. సంశయమున పడిన అర్జునునికి ప్రప్రథమముగ శ్రీకృష్ణుడు కర్తవ్యమునే బోధించినాడు. “నీవు క్షత్రియుడవు. ధర్మ రక్షణము నీ కర్తవ్యము. ధర్మము కొరకై యుద్ధము చేయుచున్నావు. జయాపజయములతో నీకు సంబంధము లేదు.

నీకు కలిగిన సంశయము నీకు కర్తవ్యభ్రష్టత్వము కలిగించ గలదు. యుద్ధము చేయుము. ధర్మమును రక్షింపుము. పనికిమాలిన సందేహములను విసర్జింపుము” అని సూటిగ తెలిపినాడు. ఫలమందాసక్తి కలిగివుడు, కర్మయందు సందేహము కలుగును.

కర్తవ్యమందాసక్తి కలిగినపుడు, ఫలాసక్తి లేక నిర్వర్తింప బడుట యుండును. కర్తవ్య నిర్వహణమున సంపదలు, మానము, ప్రాణము పోయినను, అవమానములు కలిగినను, అంతమున దివ్య వైభవ ముండును. శ్రీరాముని జీవితమంతయు కర్తవ్య నిర్వహణమే. హరిశ్చంద్రుడును అట్లే.

సత్పురుషుల జీవితముల యందు కర్తవ్య నిర్వహణమే ప్రధానముగ గోచరించును. శ్రీమాత ఆరాధనమున భక్తులు కర్తవ్య దీక్షను పొందినచో అది సమారాధనయై నిలచును. సమారాధనయనగా సమ్యక్ ఆరాధనము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 173 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Saṃśayaghnī संशयघ्नी (173) 🌻

She clears doubts of Her devotees. She is capable of clarifying the doubts of wise men, as She is the embodiment of knowledge as per the previous nāma. She assumes the form of Guru as per nāma 603. gurumūrtiḥ.

The one who is called as Guru should be without doubts, should clarify the doubts of his disciples instantaneously and expecting nothing in return. It is said that ‘spirituality cannot be sold’.

At the same time, it is to be understood that those who seek knowledge should monetarily compensate the Guru, as he also needs money to sustain himself. But at no point of time the disciple should exceed his capacity in compensating the Guru and a real Guru will gladly accept whatever is offered by his disciples.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

08 Jan 2021

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 156

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 156 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 86 🌻

అంతా మానవత్వాన్నే కలిగియున్నారు. మానవత్వాన్ని కలిగియున్నవారందరూ మానవులే. కాబట్టి, అలా లక్షణ రీత్య నిర్ణయం చేసేటటువంటి ఎదుగుదలను మానవుడు సాధించాలి. ముఖ్యంగా సాధకులు సాధించాలి.

నీ చుట్టు పక్కల ఉన్నటువంటి నీ సంసారంలో, నీవు గుర్తించేటటువంటి మనుషులు కానీ, నిన్ను గుర్తించే మనుషులు కానీ, ఏవైతే, ఎవరైతే ఉన్నారో, వారంతా ఎవరు? నీ ఇంట్లో ఉన్నవస్తువులు కానీ, నువ్వు ప్రపంచంలో గుర్తుపట్టేటటువంటి వస్తువులు కానీ, ఇదంతా కూడా ‘ఇదం’, ఇదం అంటే నేను కాదని. ‘ఇదం’ - అనేటటువంటిది అంతా కూడా నేను కాదు.

మరి నేను ఎవరిని? ఆ ఇదం కి ఉన్న లక్షణాలకి వ్యతిరేకంగా ఏ సాక్షిత్వము అయితే ఉన్నదో... అంటే అర్థం ఏమిటి? నీవు ఒక వస్తువును చూస్తూఉన్నావు. చూస్తూఉంటే ఆ వస్తువు నువ్వు అవుతావా? ఆ ఘటము నువ్వు అవుతావా? ఓ కుండలో నీళ్ళు పట్టావయ్యా! కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయయ్యా! అది దాని లక్షణం.

కుండనువ్వా? నీళ్ళు నువ్వా? చల్లదనం నువ్వా అంటే, ఈ మూడు నేను కాదు. కారణం ఏమిటి? నేను చూస్తూ ఉన్నాను, నేను అనుభవిస్తూ ఉన్నాను, నేను తెలుసుకుంటూ ఉన్నాను. జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం, అధిగచ్ఛతి. నేను అధిగమించి ఉన్నటువంటి సాక్షిని. సర్వదా సాక్షిని. సర్వ సాక్షిని. కాబట్టి, నాకేమీ అంట లేదు, కుండ అంట లేదు, నీళ్ళు అంట లేదు, చల్లదనము అంట లేదు.

నాకు ఏ సంగత్వము లేదు అనేటటువంటి సాక్షిత్వ స్థితిని సాధించడం చాలా అవసరం. మరి కుండ అవసరం లేదా? మంచి నీళ్ళు అవసరం లేదా? అందులో చల్లటి మంచి నీళ్ళు అవసరం లేదా? అది భౌతిక అవసరం.

ఆత్మ అభౌతికం. ఆత్మ సూక్ష్మం. ఎన్ని అవసరాలున్నప్పటికీ, అవసరాలమేరకు పని చేసేటటువంటి వాడు, అనిత్య వస్తువులయందు రమించకుండా, కలిసిపోకుండా, తాదాత్మ్యత లేకుండా, సంగత్వ దోషం లేకుండా, తాను తానుగా ఉండి, తానైనటటువంటి స్థితిలో నిలిచి ఉండి, బట్టబయలే బ్రహ్మము అనేటటువంటి జన్మరాహిత్య లక్షణానికి ఆశ్రయంగా ఉండేటటువంటి, తత్త్వజ్ఞాన లక్ష్యం దృష్ట్యానే, వ్యావహారిక లక్షణాలను చూస్తాడు. ఈ రకంగా వ్యావహరిక దృష్టి అనేటటువంటిది సామాన్యమైపోయింది.

అప్రధానం అయిపోయింది. అనిత్య వస్తూపలబ్ది చేత ప్రేరేపించబడడం లేదు. పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల అనేక వస్తువుల ఉపలబ్ది జరుగుతూ ఉంటుంది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

08 Jan 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 216, 217 / Vishnu Sahasranama Contemplation - 216, 217

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 216, 217 / Vishnu Sahasranama Contemplation - 216, 217 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻216. స్రగ్వీ, स्रग्वी, Sragvī🌻

ఓం స్రగ్విణే నమః | ॐ स्रग्विणे नमः | OM Sragviṇe namaḥ

స్రగ్వీ, स्रग्वी, Sragvī

స్రక్ అస్య అస్తి మాల ఈతనికి కలదు. భూత తన్మాత్ర రూపమైన వైజయన్తీ నామక మాలను ఎల్లప్పుడును ధరించియుండును. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అను ఐదు జ్ఞానేంద్రియ విషయములగు తత్త్వములే పంచభూత తన్మాత్రలు. వాని శ్రేణినే పెద్దలు ఉపాసనకై విష్ణుని వక్షమున వ్రేలాడు వైజయంతీ నామక మాలనుగా చెప్పిరి.

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::

సీ. మానిత శ్యామాయమాన శరీర దీధితులు నల్దిక్కుల దీటుకొనఁగఁ

గాంచన మేఖలా కాంతులతోడఁ గౌ శేయ చేలద్యుతుల్ సెలిమి సేయ

లక్ష్మీసమాయుక్త లలిత వక్షంబున వైజయంతీప్రభల్ వన్నె సూప

హాటకరత్న కిరీట కోటి ప్రభల్ బాలార్క రుచులతో మేలమాడ

తే. లలితనీలాభ్రరుచిఁ గుంతలములు దనరఁ, బ్రవిమాలాత్మీయ దేహజప్రభ సరోజ

భవ భవమార ముఖ్యుల ప్రభలు మాప, నఖిలలోకైక గురుఁడు నారాయణుండు. (163)

ఎల్లలోకాలకూ మూలమైన శ్రీ వల్లభుని నల్లని మేమి కాంతులు నాల్గు దిక్కులయందు వ్యాపించుతున్నాయి. బంగారు మొలనూలి కాంతులతో పట్టు వలువ కాంతులు కలిసిపోయాయి. లక్ష్మీదేవికి కాపురమైన వక్షఃస్థలంపై వైజయంతీ మాలికాకాంతులు ప్రసరించుతున్నాయి. రత్నాలు పొదగబడిన బంగారు కిరీట కాంతులు బాలసూర్యుని ద్యుతులను అతిశయించుచున్నాయి. ఆయన శిరోజాలు నీలిమేఘ కాంతులతో ఒప్పుతున్నాయి. ఆయన దేహం నుంచి వెలువడే దివ్య ప్రభలు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతా శ్రేష్ఠుల దేహకాంతులను క్రిందుపరుస్తున్నాయి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 216🌹

📚. Prasad Bharadwaj

🌻216. Sragvī🌻

OM Sragviṇe namaḥ

Srak asya asti / स्रक् अस्य अस्ति One who wears the srak or garland. As the form of tanmātras, the essence of five elements, He wears always the garland called Vaijayanti.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

गुरुर्गुरुतमो धाम सत्यस्सत्यपराक्रमः ।निमिषोऽनिमिषस्स्रग्वी वाचस्पति रुदारधीः ॥ २३ ॥

గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః ।నిమిషోఽనిమిషస్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ ౨౩ ॥

Gururgurutamo dhāma satyassatyaparākramaḥ ।Nimiṣo’nimiṣassragvī vācaspati rudāradhīḥ ॥ 23 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 217 / Vishnu Sahasranama Contemplation - 217🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻217. వాచస్పతి రుదారధీః, वाचस्पति रुदारधीः, Vācaspati rudāradhīḥ🌻

ఓం వాచస్పతయే ఉదారధీయే నమః | ॐ वाचस्पतये उदारधीये नमः | OM Vācaspataye udāradhīye namaḥ

వాచస్పతి రుదారధీః, वाचस्पति रुदारधीः, Vācaspati rudāradhīḥవాచస్పతిః - వాచః విద్యాయాః పతిః వాక్కునకు అనగా విద్యకు రక్షకుడు. ఉదారధీః - ఉదారా సర్వార్థ విషయా ధీః అస్య ఉదారమైన అనగా సర్వ విషయములను గోచరింపజేసికొనగలది అగు ధీ అనగా బుద్ధి ఈతనికి కలదు.

వాక్కునకు పతియూ, సర్వ విషయములను ఉదారముగా గోచరింపజేసికొనగలది అగు బుద్ధి గలవాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 217🌹

📚. Prasad Bharadwaj

🌻217. Vācaspati rudāradhīḥ🌻

OM Vācaspataye udāradhīye namaḥ

Vācaspatiḥ - vācaḥ vidyāyāḥ patiḥ / वाचस्पतिः - वाचः विद्यायाः पतिः He who is the master of all vidyāys or all sciences. Udāradhīḥ - udārā sarvārtha viṣayā dhīḥ asya / उदारधीः - उदारा सर्वार्थ विषया धीः अस्य Whose dhīḥ or intellect is able to comprehend all knowledge.

He who is the master of knowledge since His intellect can perceive everything.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

गुरुर्गुरुतमो धाम सत्यस्सत्यपराक्रमः ।निमिषोऽनिमिषस्स्रग्वी वाचस्पति रुदारधीः ॥ २३ ॥

గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః ।నిమిషోఽనిమిషస్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ ౨౩ ॥

Gururgurutamo dhāma satyassatyaparākramaḥ ।Nimiṣo’nimiṣassragvī vācaspati rudāradhīḥ ॥ 23 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

08 Jan 2021

8-JANUARY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 603 / Bhagavad-Gita - 603🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 216, 217 / Vishnu Sahasranama Contemplation - 216, 217🌹
3) 🌹 Daily Wisdom - 22🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 156🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 177 🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 101🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 173 / Sri Lalita Chaitanya Vijnanam - 173🌹
8) 🌹. శ్రీమద్భగవద్గీత - 513 / Bhagavad-Gita - 513🌹

9) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 118🌹 
10) 🌹. శివ మహా పురాణము - 318🌹 
11) 🌹 Light On The Path - 71🌹
12) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 203🌹 
13) 🌹 Seeds Of Consciousness - 267🌹   
14) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 142🌹
15) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 106 / Sri Vishnu Sahasranama - 106🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 603 / Bhagavad-Gita - 603 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 20 🌴*

20. సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే |
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ ||

🌷. తాత్పర్యం : 
జీవులు అసంఖ్యాక రూపములుగా విభజింపబడినను వారి యందు అవిభక్తమై యున్నట్టి ఏకమైన ఆధ్యాత్మికస్వభావము ఏ జ్ఞానము ద్వారా గాంచబడునో అట్టి జ్ఞానము సత్త్వగుణప్రధానమైనదని తెలిసికొనుము.

🌷. భాష్యము :
దేవతలు, మానవులు, జంతువులు, పక్షులు, మృగములు, జలచరములు, వృక్షములు మొదలగు సర్వజీవుల యందును ఒకే ఆత్మను గాంచగలిగినవాడు సత్త్వగుణ ప్రధానమైన జ్ఞానమును కలిగినట్టివాడు. జీవులు తమ పూర్వ కర్మానుసారము వివిధ దేహములను కలిగియున్నను వాటన్నింటి యందును ఏకమైన ఆత్మ ఒకటి గలదు. 

సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు సర్వ దేహములందలి ప్రాణశక్తి శ్రీకృష్ణభగవానుని దివ్యచైతన్యము వలననే కలుగుచున్నది. కనుక భగవానుని అట్టి దివ్యచైతన్యమును ప్రాణశక్తిరూపున ప్రతిదేహము నందును గాంచుట సత్త్వగుణ వీక్షణమనబడును. దేహములు నశ్వరమైనను అట్టి జీవశక్తి నాశరహితమైనది. 

కాని జీవుల యందు భేదము దేహదృష్ట్యానే గోచరించుచున్నది. బద్ధజీవనమున భౌతికస్థితి కారణముగా పలురూపములు ఉండుటచే జీవశక్తి విభజింపబడినట్లు గోచరించుచుండును. ఇట్టి నిరాకారజ్ఞానము ఆత్మానుభూతియందు ఒక అంశము వంటిది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 603 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 20 🌴*

20. sarva-bhūteṣu yenaikaṁ bhāvam avyayam īkṣate
avibhaktaṁ vibhakteṣu taj jñānaṁ viddhi sāttvikam

🌷 Translation : 
That knowledge by which one undivided spiritual nature is seen in all living entities, though they are divided into innumerable forms, you should understand to be in the mode of goodness.

🌹 Purport :
A person who sees one spirit soul in every living being, whether a demigod, human being, animal, bird, beast, aquatic or plant, possesses knowledge in the mode of goodness. In all living entities, one spirit soul is there, although they have different bodies in terms of their previous work. 

As described in the Seventh Chapter, the manifestation of the living force in every body is due to the superior nature of the Supreme Lord. Thus to see that one superior nature, that living force, in every body is to see in the mode of goodness. 

That living energy is imperishable, although the bodies are perishable. Differences are perceived in terms of the body; because there are many forms of material existence in conditional life, the living force appears to be divided. Such impersonal knowledge is an aspect of self-realization.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 216, 217 / Vishnu Sahasranama Contemplation - 216, 217 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻216. స్రగ్వీ, स्रग्वी, Sragvī🌻*

*ఓం స్రగ్విణే నమః | ॐ स्रग्विणे नमः | OM Sragviṇe namaḥ*

స్రగ్వీ, स्रग्वी, Sragvī

స్రక్ అస్య అస్తి మాల ఈతనికి కలదు. భూత తన్మాత్ర రూపమైన వైజయన్తీ నామక మాలను ఎల్లప్పుడును ధరించియుండును. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అను ఐదు జ్ఞానేంద్రియ విషయములగు తత్త్వములే పంచభూత తన్మాత్రలు. వాని శ్రేణినే పెద్దలు ఉపాసనకై విష్ణుని వక్షమున వ్రేలాడు వైజయంతీ నామక మాలనుగా చెప్పిరి.

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
సీ. మానిత శ్యామాయమాన శరీర దీధితులు నల్దిక్కుల దీటుకొనఁగఁ
గాంచన మేఖలా కాంతులతోడఁ గౌ శేయ చేలద్యుతుల్ సెలిమి సేయ
లక్ష్మీసమాయుక్త లలిత వక్షంబున వైజయంతీప్రభల్ వన్నె సూప
హాటకరత్న కిరీట కోటి ప్రభల్ బాలార్క రుచులతో మేలమాడ
తే. లలితనీలాభ్రరుచిఁ గుంతలములు దనరఁ, బ్రవిమాలాత్మీయ దేహజప్రభ సరోజ
భవ భవమార ముఖ్యుల ప్రభలు మాప, నఖిలలోకైక గురుఁడు నారాయణుండు. (163)

ఎల్లలోకాలకూ మూలమైన శ్రీ వల్లభుని నల్లని మేమి కాంతులు నాల్గు దిక్కులయందు వ్యాపించుతున్నాయి. బంగారు మొలనూలి కాంతులతో పట్టు వలువ కాంతులు కలిసిపోయాయి. లక్ష్మీదేవికి కాపురమైన వక్షఃస్థలంపై వైజయంతీ మాలికాకాంతులు ప్రసరించుతున్నాయి. రత్నాలు పొదగబడిన బంగారు కిరీట కాంతులు బాలసూర్యుని ద్యుతులను అతిశయించుచున్నాయి. ఆయన శిరోజాలు నీలిమేఘ కాంతులతో ఒప్పుతున్నాయి. ఆయన దేహం నుంచి వెలువడే దివ్య ప్రభలు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతా శ్రేష్ఠుల దేహకాంతులను క్రిందుపరుస్తున్నాయి.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 216🌹*
📚. Prasad Bharadwaj 

*🌻216. Sragvī🌻*

*OM Sragviṇe namaḥ*

Srak asya asti / स्रक् अस्य अस्ति One who wears the srak or garland. As the form of tanmātras, the essence of five elements, He wears always the garland called Vaijayanti.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
गुरुर्गुरुतमो धाम सत्यस्सत्यपराक्रमः ।निमिषोऽनिमिषस्स्रग्वी वाचस्पति रुदारधीः ॥ २३ ॥

గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః ।నిమిషోఽనిమిషస్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ ౨౩ ॥

Gururgurutamo dhāma satyassatyaparākramaḥ ।Nimiṣo’nimiṣassragvī vācaspati rudāradhīḥ ॥ 23 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 217 / Vishnu Sahasranama Contemplation - 217🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻217. వాచస్పతి రుదారధీః, वाचस्पति रुदारधीः, Vācaspati rudāradhīḥ🌻*

*ఓం వాచస్పతయే ఉదారధీయే నమః | ॐ वाचस्पतये उदारधीये नमः | OM Vācaspataye udāradhīye namaḥ*

వాచస్పతి రుదారధీః, वाचस्पति रुदारधीः, Vācaspati rudāradhīḥవాచస్పతిః - వాచః విద్యాయాః పతిః వాక్కునకు అనగా విద్యకు రక్షకుడు. ఉదారధీః - ఉదారా సర్వార్థ విషయా ధీః అస్య ఉదారమైన అనగా సర్వ విషయములను గోచరింపజేసికొనగలది అగు ధీ అనగా బుద్ధి ఈతనికి కలదు.

వాక్కునకు పతియూ, సర్వ విషయములను ఉదారముగా గోచరింపజేసికొనగలది అగు బుద్ధి గలవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 217🌹*
📚. Prasad Bharadwaj 

*🌻217. Vācaspati rudāradhīḥ🌻*

*OM Vācaspataye udāradhīye namaḥ*

Vācaspatiḥ - vācaḥ vidyāyāḥ patiḥ / वाचस्पतिः - वाचः विद्यायाः पतिः He who is the master of all vidyāys or all sciences. Udāradhīḥ - udārā sarvārtha viṣayā dhīḥ asya / उदारधीः - उदारा सर्वार्थ विषया धीः अस्य Whose dhīḥ or intellect is able to comprehend all knowledge.

He who is the master of knowledge since His intellect can perceive everything.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
गुरुर्गुरुतमो धाम सत्यस्सत्यपराक्रमः ।निमिषोऽनिमिषस्स्रग्वी वाचस्पति रुदारधीः ॥ २३ ॥

గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః ।నిమిషోఽనిమిషస్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ ౨౩ ॥

Gururgurutamo dhāma satyassatyaparākramaḥ ।Nimiṣo’nimiṣassragvī vācaspati rudāradhīḥ ॥ 23 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 22 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 22. Truth Transcends Ideas of Omniscience and Omnipotence 🌻*

It is not possible to rest contented that a personal God is the ultimate Reality, however displeasing this may be to those who do not want to dispense with thinking in terms of the categories of the world. 

The philosopher-aspirant who is possessed of a flaming passion for integrating himself in Existence does not have the dull patience to linger on with the slow process of progressive self-transcendence through the channels of the different degrees of reality. 

The highest scientific mind always tries to cling to the Whole, and not to even the biggest part, for, according to it, partiteness in existence is illogical and an ignorant conception. Truth, dependent on its own Self, transcends even the ideas of omniscience and omnipotence, for these involve relations which are a limitation on the Absolute.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 156 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 86 🌻*

అంతా మానవత్వాన్నే కలిగియున్నారు. మానవత్వాన్ని కలిగియున్నవారందరూ మానవులే. కాబట్టి, అలా లక్షణ రీత్య నిర్ణయం చేసేటటువంటి ఎదుగుదలను మానవుడు సాధించాలి. ముఖ్యంగా సాధకులు సాధించాలి. 

నీ చుట్టు పక్కల ఉన్నటువంటి నీ సంసారంలో, నీవు గుర్తించేటటువంటి మనుషులు కానీ, నిన్ను గుర్తించే మనుషులు కానీ, ఏవైతే, ఎవరైతే ఉన్నారో, వారంతా ఎవరు? నీ ఇంట్లో ఉన్నవస్తువులు కానీ, నువ్వు ప్రపంచంలో గుర్తుపట్టేటటువంటి వస్తువులు కానీ, ఇదంతా కూడా ‘ఇదం’, ఇదం అంటే నేను కాదని. ‘ఇదం’ - అనేటటువంటిది అంతా కూడా నేను కాదు. 

మరి నేను ఎవరిని? ఆ ఇదం కి ఉన్న లక్షణాలకి వ్యతిరేకంగా ఏ సాక్షిత్వము అయితే ఉన్నదో... అంటే అర్థం ఏమిటి? నీవు ఒక వస్తువును చూస్తూఉన్నావు. చూస్తూఉంటే ఆ వస్తువు నువ్వు అవుతావా? ఆ ఘటము నువ్వు అవుతావా? ఓ కుండలో నీళ్ళు పట్టావయ్యా! కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయయ్యా! అది దాని లక్షణం. 

కుండనువ్వా? నీళ్ళు నువ్వా? చల్లదనం నువ్వా అంటే, ఈ మూడు నేను కాదు. కారణం ఏమిటి? నేను చూస్తూ ఉన్నాను, నేను అనుభవిస్తూ ఉన్నాను, నేను తెలుసుకుంటూ ఉన్నాను. జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం, అధిగచ్ఛతి. నేను అధిగమించి ఉన్నటువంటి సాక్షిని. సర్వదా సాక్షిని. సర్వ సాక్షిని. కాబట్టి, నాకేమీ అంట లేదు, కుండ అంట లేదు, నీళ్ళు అంట లేదు, చల్లదనము అంట లేదు. 

నాకు ఏ సంగత్వము లేదు అనేటటువంటి సాక్షిత్వ స్థితిని సాధించడం చాలా అవసరం. మరి కుండ అవసరం లేదా? మంచి నీళ్ళు అవసరం లేదా? అందులో చల్లటి మంచి నీళ్ళు అవసరం లేదా? అది భౌతిక అవసరం.
      
ఆత్మ అభౌతికం. ఆత్మ సూక్ష్మం. ఎన్ని అవసరాలున్నప్పటికీ, అవసరాలమేరకు పని చేసేటటువంటి వాడు, అనిత్య వస్తువులయందు రమించకుండా, కలిసిపోకుండా, తాదాత్మ్యత లేకుండా, సంగత్వ దోషం లేకుండా, తాను తానుగా ఉండి, తానైనటటువంటి స్థితిలో నిలిచి ఉండి, బట్టబయలే బ్రహ్మము అనేటటువంటి జన్మరాహిత్య లక్షణానికి ఆశ్రయంగా ఉండేటటువంటి, తత్త్వజ్ఞాన లక్ష్యం దృష్ట్యానే, వ్యావహారిక లక్షణాలను చూస్తాడు. ఈ రకంగా వ్యావహరిక దృష్టి అనేటటువంటిది సామాన్యమైపోయింది. 

అప్రధానం అయిపోయింది. అనిత్య వస్తూపలబ్ది చేత ప్రేరేపించబడడం లేదు. పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల అనేక వస్తువుల ఉపలబ్ది జరుగుతూ ఉంటుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 177 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
169

We discussed that Vayu Deva moves within the human body in the form of Prana, Apana, Vyana and Udana (vital airs in the body). He (Vayu Deva) helps us practice Yoga and provides good health. Although Air cannot be seen, we can feel it with our sense of touch. 

Air has two attributes of sound and touch. It is only because air is constantly moving that the entire creation is filled with life. Without air, there is no life. It is due to air that the skin covers the body and we are able to live, otherwise we wouldn’t be alive. In the outer space, there are seven planes of atmosphere. 

They are greatly benefiting the universe. Air exists in all living beings as life force or Prana. Even though it exists in everything, it has no attachments. It is subtly holding together the stars, the sky and the earth. “Anila” is Air. “Anala” is Fire. They are both friends. Anila and Anala – how nice are the names. 

Air along with Fire carries the offerings from the sacrifices to the deities. That is why they are both good friends. Like that, the Wind God and Fire bring us the blessings from the Gods.

The Veda extolls the greatness of Wind, “Tvameva Pratyaksham Brahma”. Using “Soham Hamsah”, all the great sages and realized souls regulate the air in their body That means, we should understand that the sages and realized souls earned the wealth of penance and meditation due to air.

Air expands our intellect. It molds the mind as desired. It subjects the mind to expansion and contraction. It equips the mind for analysis, intelligence and awareness.

 Knowledge, divinity, concentration, cleanliness and purity are caused by air. This the greatness of air.
Next, let us learn about what Avadhoota Swamy taught king Yadu. “I told you my second Guru is Air. We breathe in only as much air as we need. 

Similarly, I learned that wise people eat not to appease their tongue, but just enough to survive. Air carries fragrant smells. Similarly it also carries bad odors, but remains untainted itself. Neither does it shake off the bad smells, nor does it get excited with the fragrances. Air remains without any changes.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 101 / Sri Lalitha Sahasra Nama Stotram - 101 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 173 / Sri Lalitha Chaitanya Vijnanam - 173 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |*
*నిఃసంశయా, సంశయఘీ, నిర్భవా, భవనాశినీ ‖ 48 ‖*

*🌻 173. 'సంశయఘ్నీ' 🌻*

భక్తుల సంశయములను నిర్మూలించునది శ్రీమాత అని అర్థము.

మనస్సున సంశయములతో బాధపడువారు భక్తి శ్రద్ధలతో శ్రీమాత ఆరాధన గావించినచో వారి సంశయములన్నిటినీ ఆమె పటాపంచలు చేయును. భయము, సందేహము, సంశయము కలిగి
నప్పుడు, జీవితము అగమ్యగోచరమైనప్పుడు, కష్టనష్టముల పాలై నప్పుడు శ్రీమాత నారాధించు ఎందరెందరో భక్తులు కృతకృత్యులై శాశ్వతానందము పొందిరి. శ్రీమాత ఆరాధన విశేషముగా, భక్తుడు కర్తవ్యోన్ముఖు డగును. 

నిర్వర్తించునది కర్తవ్యమైనపుడు లాభనష్టములతోను, జయాపజయములతోను సంబంధ ముండదు. కర్తవ్య మనగా చేయవలసిన పని. అందు ఇష్టాయిష్టములకు తావు లేదు. ఇష్టాయిష్టములతో పనిచేయు వారికి కర్తవ్యమెన్నటికిని అర్థము కాదు. సంశయమున పడిన అర్జునునికి ప్రప్రథమముగ శ్రీకృష్ణుడు కర్తవ్యమునే బోధించినాడు. “నీవు క్షత్రియుడవు. ధర్మ రక్షణము నీ కర్తవ్యము. ధర్మము కొరకై యుద్ధము చేయుచున్నావు. జయాపజయములతో నీకు సంబంధము లేదు. 

నీకు కలిగిన సంశయము నీకు కర్తవ్యభ్రష్టత్వము కలిగించ గలదు. యుద్ధము చేయుము. ధర్మమును రక్షింపుము. పనికిమాలిన సందేహములను విసర్జింపుము” అని సూటిగ తెలిపినాడు. ఫలమందాసక్తి కలిగివుడు, కర్మయందు సందేహము కలుగును. 

కర్తవ్యమందాసక్తి కలిగినపుడు, ఫలాసక్తి లేక నిర్వర్తింప బడుట యుండును. కర్తవ్య నిర్వహణమున సంపదలు, మానము, ప్రాణము పోయినను, అవమానములు కలిగినను, అంతమున దివ్య వైభవ ముండును. శ్రీరాముని జీవితమంతయు కర్తవ్య నిర్వహణమే. హరిశ్చంద్రుడును అట్లే. 

సత్పురుషుల జీవితముల యందు కర్తవ్య నిర్వహణమే ప్రధానముగ గోచరించును. శ్రీమాత ఆరాధనమున భక్తులు కర్తవ్య దీక్షను పొందినచో అది సమారాధనయై నిలచును. సమారాధనయనగా సమ్యక్ ఆరాధనము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 173 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Saṃśayaghnī संशयघ्नी (173) 🌻*

She clears doubts of Her devotees. She is capable of clarifying the doubts of wise men, as She is the embodiment of knowledge as per the previous nāma. She assumes the form of Guru as per nāma 603. gurumūrtiḥ.  

The one who is called as Guru should be without doubts, should clarify the doubts of his disciples instantaneously and expecting nothing in return. It is said that ‘spirituality cannot be sold’.  

At the same time, it is to be understood that those who seek knowledge should monetarily compensate the Guru, as he also needs money to sustain himself. But at no point of time the disciple should exceed his capacity in compensating the Guru and a real Guru will gladly accept whatever is offered by his disciples. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 514 / Bhagavad-Gita - 514 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 24 🌴*

24. సమదు:ఖసుఖ: స్వస్థ: సమలోష్టాశ్మకాంచన: |
తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిన్దాత్మసంస్తుతి: ||

🌷. తాత్పర్యం : 
సమ దు:ఖ. . . అనంత చిదాకాశ స్వరూపమందు స్థిరుడై, సుఖదు:ఖము లందు సమముగనుండి, మట్టిని, రాతిని, బంగారమును సమముగ జూచుచు, ఇష్టానిష్ట వస్తుప్రాప్తితో సమచిత్తమునే కలిగి దూషణ భూషణము లందు చలింపక, ధీరుడై ఎవడు విలసిల్లునో వాడే త్రిగుణాతీతుడు.

🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 514 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 24 🌴*

24. sama-duḥkha-sukhaḥ 
sva-sthaḥ sama-loṣṭāśma-kāñcanaḥ
tulya-priyāpriyo dhīras tulya-nindātma-saṁstutiḥ

🌷 Translation : 
Alike in pleasure and pain, who dwells 
in the Self, to whom a clod of earth, stone andgold are alike, to whom the dear and the unfriendly are alike, firm, the same in censure and praise,

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -118 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 1, 2.

*🍀. 1. కర్మ - జ్ఞానము - కర్మత్యాగము, కర్మయోగము రెండును విముక్తి కలిగించ గలవు. రెండిటిలో కర్మయోగమే శ్రేష్ఠము. కర్మల నెవ్వరును త్యాగము చేయలేరు. నిద్రించుట, లేచుట, ఆలోచించుట, భుజించుట, మాటాడుట దేహకి తప్పనిసరి యగు కర్మలు. కర్మత్యాగ మనగా, కర్మఫలత్యాగమే అని తెలియవలెను. అంతియే కాదు, కర్మసంగ త్యాగము కూడ. కర్మల నాచరించుచు, వానిచే తగులకొన బడకుండుట కర్మ యందు కౌశలము. "కర్మ బ్రహ్మాద్భం విద్ధి" - కర్మ బ్రహ్మము నుండి పుట్టుచున్నదని, బ్రహ్మము అక్షర పరబ్రహ్మము నుండి పుట్టినవాడని, కావున సృష్టియందు కర్మ మనివార్యమని, కర్మమును బ్రహ్మవలె నాచరించినచో జీవుడు ముక్తుడుగ నుండునని ముందే తెలుపబడినది. 🍀*

1. సన్న్యాసం కర్మణాం కృష్ణ పున ర్యోగం చ శంససి |
యచ్ఛేయ ఏతయో రేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ || 

2. సన్న్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా వుభౌ |
తయోస్తు కర్మసన్న్యాసా త్కర్మయోగో విశిష్యతే || 2

శ్రీ కృష్ణా! నీ ప్రబోధమున కర్మయోగము, కర్మత్యాగము రెంటిని పలుకుచున్నావు. ఇంతకును జీవుడు కర్మయోగము నందుండవలెనా, కర్మత్యాగము నందుండవలెనా అని అర్జునుడు ప్రశ్నించినాడు.

అర్జునా! కర్మత్యాగము, కర్మయోగము రెండును విముక్తి కలిగించ గలవు. రెండిటిలో కర్మయోగమే శ్రేష్ఠము. 

కర్మల నెవ్వరును త్యాగము చేయలేరు. నిద్రించుట, లేచుట, ఆలోచించుట, భుజించుట, మాటాడుట దేహకి తప్పనిసరి యగు కర్మలు. కర్మత్యాగ మనగా, కర్మఫలత్యాగమే అని తెలియవలెను. 

అంతియే కాదు, కర్మసంగ త్యాగము కూడ. కర్మల నాచరించుచు, వానిచే తగులకొనబడకుండుట కర్మ యందు కౌశలము. కర్మలను నిర్వర్తింపకుండుటకు ఎవ్వడును సమర్థుడు కాడు. నిర్వర్తించునపుడు కర్మ సంగము, కర్మ ఫలము కలుగుచుండును. త్యాగము చేయవలసినది సంగము, ఫలమే గాని కర్మలు కాదు. 

ఫలముల నాశించక, కర్తవ్య కర్మలను నిర్వర్తించుచు, నిర్వర్తింపబడు కర్మలనుండి సంగము పొందక నిర్వర్తించుట కర్మయోగమే యగును. 

"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన! మా కర్మఫల హేతుర్భూ ర్మా తే సంగో2 స్వకర్మణి |'' (2-47) 

అను నాలుగు సూత్రములుగ కర్మలు నిర్వర్తించు పద్ధతి దైవము తెలిపినాడు. (వివరమునకు పై శ్లోక వివరము చూడుడు). అట్లాచరించినవాడు కర్మయోగియే. ఈ మార్గమున కర్మ క్షాళనమై, జీవుడు ముక్తుడగునని తెలుపుచున్నాడు. 

పై విధముగ కర్మల నాచరించు కర్మయోగి క్రమముగ, కరృత్వ భావనను కూడ విసర్జించును. తన నుండి కర్మలు జరుగు చున్నవి గాని, తాను చేయుట లేదని తెలియును. 

"కర్మ బ్రహ్మాద్భం విద్ధి" - కర్మ బ్రహ్మము నుండి పుట్టుచున్నదని, బ్రహ్మము అక్షర పరబ్రహ్మము నుండి పుట్టినవాడని, కావున సృష్టియందు కర్మమనివార్యమని, కర్మమును బ్రహ్మవలె నాచరించినచో జీవుడు ముక్తుడుగ నుండునని ముందే తెలుపబడినది. 

కావున కర్మయోగమున నిష్ణాతుడైనవాడు తననుండి జరుగు కర్మ యంతయు దైవ సంకల్పమని తెలిసియుండును. కర్త తాను కాడు కనుక, కర్మలు చేయుచున్నానను భావన కూడ యుండదు.

కర్తృత్వ భావన లేక చేయుచు నుండును. ఈ స్థితిని కర్మ సన్న్యాస స్థితి అందురు. కర్మయోగికే కర్మ సన్న్యాస స్థితి లభించును. కర్మలు మానుట కర్మ సన్న్యాసము కాదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 318 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
80. అధ్యాయము - 35

*🌻. విష్ణువు పలుకులు - 1 🌻*

దక్షుడిట్లు పలికెను -

హే దేవదేవా! హరే! విష్ణో !దీనబంధూ! దయాసాగరా! నీవు నన్ను, నాయజ్ఞమును రక్షించవలెను (1). యజ్ఞము నీస్వరూపమే. యజ్ఞమును రక్షించువాడవు నీవే. యజ్ఞమును చేయు యజమాని కూడ నీ స్వరూపమే. నీవు దయను చూపుము. హే ప్రభూ! యజ్ఞము నాశము కాని విధముగా అనుగ్రహించుము (2).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్షుడు ఈ విధముగా అనేక తెరంగులలో సాదరముగా విన్నవించుకుని, భయముచే కల్లోలితమగు మనస్సు గలవాడై ఆయన పాదములపై పడెను (3). అపుడు విష్ణువు చింతాగ్రస్తమైన మనస్సుగల ఆ దక్షుని పైకి లేవదీసి, దుర్బుద్ధియగు ఆతని ఆ పలుకులను విని శివుని స్మరించెను (4). మహేశ్వరుడు, తనకు ప్రభువు అగు శివుని స్మరించి, శివతత్త్వమును ఎరింగిన విష్ణువు దక్షుని సంబోధించి ఇట్లు పలికెను (5).

విష్ణువు ఇట్లు పలికెను -

దక్షుడా! వినుము. నేను యథార్థమగు వచనమును చెప్పెదను. నీకు అన్ని విధములా హితమును చేగూర్చి సుఖము నిచ్చే మహామంత్రమును చెప్పెదను (6). హే దక్షా! తత్త్వము నెరుంగని నీవు సకల జగత్తునకు అధీశ్వరుడు, పరమాత్మయగు శివుని అవమానించితివి (7). 

ఈశ్వరుని తిరస్కరించినచో, సర్వకార్యములు అన్ని విధములా విఫలమగును. అంతమాత్రమే గాదు. ప్రతి అడుగు నందు ఆపదలు కలుగును (8). ఎచట పూజింపదగని వారు పూజింపబడుదురో, పూజింపదగిన వారు పూజింపబడరో, అచట దారిద్ర్యము, మరణము, భయము అను మూడు ఉండును (9).

కావున, అన్ని విధముల ప్రయత్నమును చేసి వృషధ్వజుడగు శివుని పూజించవలెను. కాని మహేశ్వరుని అవమానించుట వలన మహాభయము సంప్రాప్తమైనది (10). ఇప్పుడు మేమందరము సమర్ధులమైననూ, కలిసి ఆపదను నివారించుటకు శక్యము కాదు. ఇది అంతయూ నీ చెడునీతి వలన కలిగినది. నేను సత్యమును చెప్పుచున్నాను (11).

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు యొక్క ఆ మాటను విని దక్షుడు చింతాగ్రస్తుడాయెను. ఆతడు పాలిపోయిన ముఖము గలవాడై నేలపై గూర్చుండి మిన్నకుండెను (12). ఇంతలో సైన్యముతో కూడి యున్నవాడు, రుద్రునిచే ప్రోత్సహింపబడినవాడు, గణాధ్యక్షుడునగు వీరభద్రుడు యజ్ఞస్థలమును సమీపించుచుండెను (13). 

కొన్ని గణములు ఆయన వెనుక, మరికొన్ని ఆకాశమునందు, ఇంకొన్ని సర్వదిక్కులను ఆక్రమించి ముందుకు సాగిరి (14). శూరులు, భయము లేనివారు, రుద్రునితో సమానమగు పరాక్రమము గలవారు, మహావీరులునగు ఆ గణములు లెక్కలేనంతమంది సింహనాదములను చేయుచూ ముందుకు సాగిరి (15).

ఆ శబ్దమునకు ముల్లోకములు దద్దరిల్లెను. ఆకాశము ధూళితో నిండెను. దిక్కులయందు చీకట్లు వ్యాపించెను (16). ఏడు ద్వీపములతో, పర్వతములతో, అడవులతో కూడియున్న పృథివి మిక్కిలి భయముతో కంపించెను. సముద్రములన్నియు క్షోభిల్లినవి (17). లోకములను నాశనము చేయగల ఇటువంటి ఆ మహాసైన్యమును చూచి రాక్షసులు మొదలగు వారందరు ఆశ్చర్యచకితులైరి (18). తరువాత ఈ సైన్య సంరంభమును చూచిన దక్షుడు నోటినుండి రక్తమును గ్రక్కెను. ఆతడు భార్యతో గూడి విష్ణువు ఎదుట దండము వలె పడి, ఇట్లు పలికెను (19).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 71 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 5 - THE 6th RULE
*🌻 6. Kill out desire for sensation. - Learn from sensation and observe it - 2 🌻*

287. Sometimes in a moment of temptation it is helpful to recognize that it is merely your past that has been revivified, and then you are right to say: “This is not I.” Then you look on it as outside yourself, as no part of your being or activity, and you know that it cannot hold you or stain you.

The patient confidence that arises from this knowledge has a great element of strength in it. You know that you are drawing nearer the time when you will not even feel this temptation. Presently it will not have the power to affect you at all.

288. In the deliberate process of weighing, measuring, and observing his own past feelings and thoughts, the disciple is killing the very last possibility of life in that dead self. The Voice of the Silence means this, when it says with regard to desire: “Take heed lest from the dead it should again arise.” 

The old feelings and thoughts are done with, not when they are merely buried out of sight, but when the very last fragment of them is worked out to the end, when the man looks at them and sees with perfect clearness just what they are and that they are no part of himself. In this quiet study he then kills them beyond all possibility of recall to life.

289. C.W.L. – We have first to learn to observe the working of sensation in ourselves from outside. So long as we are being swept away by it we cannot learn anything from it, because we are then slaves to it, but if we can rise and look down upon it, and think of it as something belonging to our past we are then in a position to observe and study it.

290. Waves of sensation are flowing all over the world and we have to learn to understand them so as to be able to help others, but of course we can do that only when we are no longer swayed by them. Doubtless it is largely a matter of temperament, but for many it is one of the greatest difficulties that sensations and emotions swirl them about, and as yet they do not understand fully how to control them. It is like standing in the breakers and trying to master them. 

A man cannot govern a thing which knocks him over again and again and sweeps him away; but people do not realize that emotion is really not an external force like that, but that it is within one-self and may be brought perfectly within one’s control if one understands how to do it.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 203 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. దుర్వాసమహర్షి-కందళి - 7 🌻*

35. విశ్వరూపదర్శనంకూడా కృష్ణుడు అర్జునుడికి లోపల అంతఃకరణలో తెరతీసి చూపించాడే తప్ప, అర్జునుడు సంపాదించుకున్న జ్ఞానం కాదు అది. అతడి మోహాన్ని తొలగించటానికి లోపల తెరతీసి చూపించాడు. అతనికి దృష్టినిచ్చాడు ఒక్కక్షణం. తనే కనబడితే ఊళ్ళో అందరికీ కనబడవలసిందే! ఆ యుద్ధరంగంలో ఎవరికీ కనబడలేదే! ఎవరి హృదయంలో తెరతీసాడో వాళ్ళకే కనబడ్డాడు.

36. కౌరవసభలో పూర్వం, వాళ్ళు ఆయనను బంధించే ప్రయత్నం చేసినప్పుడు, విశ్వరూపదర్శనం ఇచ్చాడు. ఆ గుడ్డివాడైన దృతరాష్ట్రుడికికూడా అది ప్రసాదించాడు. కానీ అతడు జ్ఞానాన్ని అడగలేదు. నువ్వు మహాపురుషుడివి అన్నాడు. కృష్ణుడికి దణ్ణం పెట్టాడే తప్ప, అతడికి పుత్రవ్యామోహంపోలేదు. జ్ఞానార్థికాలేదక్కడ. జ్ఞానార్థి అయితే జ్ఞానం వచ్చేదే. 

37. “మీరు నన్నేమీ చెయ్యలేరు. నేను సర్వాంతర్యామిని. విరాట్పురుషుణ్ణి. నన్ను మీరు శిక్షించటమేమిటి?” అని వారి అహంకారాన్ని తగ్గించేందుకు ఇచ్చిందే ఆ దర్శనమంతా! వీళ్ళందరూ మూర్ఛపోయారు. ఎవ్వరూ చూడలేదు. సభఅంతా మూర్ఛపోయింది. బ్రహ్మాండమయిన వెలుగేదో కనబడింది. వాళ్ళు స్పృహతప్పిపడిపోయారు. ధృతరాష్ట్రుడు ఆ తేజస్సును కళ్ళతో-చర్మచక్షువులతో-చూడలేదు కాబట్టి, అతడు మూర్ఛపోలేదు. అతడికి కృష్ణుడు అంతర్దర్శనం అప్పుడే ఇచ్చాడు.

38. నదిలో స్నానంచేస్తుంటే చెత్తకొట్టుకొస్తుంది. ఇలాఅలా తోసేసి మళ్ళీ మునుగుతాం. లేచేసరికి మళ్ళీ చెత్తవస్తుంది. అక్కడి పరిశుద్ధత మనం మునిగి లేచేలోపల అయిపోతుంది. దానికి అంతే పారిశుద్ధ్యం! మళ్ళీ చెత్త కొట్టుకుని వస్తూనే ఉంటుంది. అలాగే ఈ ప్రకృతి అనే మహాప్రవాహంలో ఎప్పుడూ మనం ఉంటాము. జ్ఞానం క్షణికంగా ఉంటుంది. 

39. ఎందుకంటే ఉన్నదంతా బ్రహ్మాడమయిన చీకటి. నల్లనిమబ్బు. జ్ఞానం మెరుపులా ఒక్క క్షణంవచ్చి బ్రహ్మాండంగా వెలుగు చూపిస్తుంది. ఎంతసేపుంటుంది? ఏదీ ఉండదు. చూస్తుండగానే అంతర్థానం అయిపోతుంది. అజ్ఞానం అనే ఈ నల్లని మబ్బుల్లో, అంధకారంలో మెరిసేమెరుపులాగా. క్షణంమాత్రమే ఉండిపొతుండి. 

40. ప్రపంచంలో, జీవితంలో ఈ సుఖంఅనేది కూడా అంతే! మెరుపులాగా క్షణం కనబడేదే! ఎప్పుడో అలాగ ఒక్కక్షణం మాత్రం మెరిసే మెరుపుని పట్టుకుని శాశ్వతంగా పెట్టుకుందామని ప్రయత్నం చేయడం ఏమి వివేకం? ఎప్పుడూ సుఖంగా బతకాలి అనేమాట కూడా అజ్ఞానంతో కూడినదే. ఏముంది సుఖం? ఎలా ఉంటుంది శాశ్వతంగా! దీనికి సిద్ధపడే ఇక్కడ జీవించాలి కాని, భ్రమలలో కాదు. 

41. లేదా, “ఇక్కడికి నేను కర్మక్షయం కోసం వచ్చాను” అనే దృక్పథంతో జీవించడం ఒక మార్గం. అంటే, కష్టపడటానికే వచ్చాను అనే వివేకమన్నమాట. “నేనెంతమందికి బాకీఉన్నానో, సేవచేసి ఆ ఋణం తీర్చుకోవటానికి వచ్చాను” అనే దృక్పథం. ఇలాగ ఉండి, ఈ మాటలు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటే దుఃఖం ఉండదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 267 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 116. Onto your Absoluteness, which is without form or shape, came this knowledge 'I am', which is also without shape and form. 🌻*

Just think about what you were prior to conception. You were simply not there! Nothing! So where is the question of form or shape in just infinite space? You were happily placed, there was no worry at all, and then this knowledge 'I am' arrived. 

This knowledge 'I am' inherits the properties of your Absoluteness in having no form and shape. Thus all knowledge is formless because at its origin lies the 'I am'.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 142 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 21 🌻*

575. బ్రహ్మజ్ఞానము :
పరిమిత అహం, అంటు లేకుండా పోయి, ద్వైతము పూర్తిగా అదృశ్యమైన తరువాత, మానవుడు ఈ జ్ఞానమును చేరుకొనును.

576. సర్వ సాధారముగా ప్రతియొక్కడును సర్వోత్తమ జ్ఞానమును బడయుటకు మధ్యతరగతులను దాటి రావలసినదే కానీ సద్గురు దర్శకత్వంలో మెలగిన వారు, ఈ మధ్యేమార్గం ఒక్కసారిగా బ్రహ్మజ్ఞానము పొందుదురు.

577. సప్తమ భూమికలో బ్రహ్మీ బూతుడు:- ఇచ్చట భగవంతుడు భగవంతునిగా తనను ప్రతివారిలో ప్రతి దానిలో చూచును. ఇది పంచఆధ్యాత్మిక సత్యములలో నొకటి.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 106 / Sri Vishnu Sahasra Namavali - 106 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*రేవతి నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🍀 106. ఆత్మయోని స్స్యయంజాతో వైఖాన స్సామగాయనః|*
*దేవకీ నన్దన స్స్రష్టా క్షితీశః పాపనాశనః || 106 ‖ 🍀*

🍀 985) ఆత్మయోని: - 
తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు.

🍀 986) స్వయంజాత: - 
మరొకరి ప్రమేయము లేకనే తనకు తానుగ ఆవిర్భవించువాడు.

🍀 987) వైఖాన: - 
ప్రాపంచిక దు:ఖమును నివారించువాడు.

🍀 988) సామగాయన: - 
సామగానము చేయువాడు.

🍀 989) దేవకీనందన: - 
దేవకీ పుత్రుడైన శ్రీ కృష్ణుడు.

🍀 990) స్రష్టా - 
సృష్టికర్త

🍀 991) క్షితీశ: - 
భూమికి నాధుడైనవాడు.

🍀 992) పాపనాశన: - 
పాపములను నశింపజేయువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 106 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Revathi 2nd Padam*

*🌻 106. ātmayōniḥ svayaṁjātō vaikhānaḥ sāmagāyanaḥ |*
*devakīnandanaḥ sraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ || 106 || 🌻*

🌻 985. Ātmayōniḥ: 
One who is the source of all; that is, there is no material cause other than Himself for the universe.

🌻 986. Svayaṁ-jātaḥ: 
He is also the instrumental cause.

🌻 987. Vaikhānaḥ: 
One who excavated the earth, taking a unique form.

🌻 988. Sāmagāyanaḥ: 
One who recites the Sama chants.

🌻 989. Devakī-nandanaḥ: The Son of Devaki in the incarnation as Krishna.