సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
🍀 60. చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా ।
పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా ॥ 60 ॥ 🍀
🌻 247. 'పద్మనయనా' 🌻
పద్మముల వలె విచ్చుకొనిన అందమైన కన్నులు గలది శ్రీమాత అని అర్థము. కన్నులు పెద్దవిగను, అందముగను, ఆకర్షణీయముగను వుండుట ఒక శుభ లక్షణము. శ్రీమాత అనుగ్రహమున కవి సంకేతములు.
శ్రీమాత కన్నుల అందము వర్ణనాతీతము. ఆమెను పద్మాక్షి, మీనాక్షి, పద్మపత్రాయతాక్షి అనియు కీర్తించుట పరిపాటి. విశాల మైనవి, అందమైనవి, పద్మముల వలె వికసించియున్న కన్నులు గ్రహింపు శక్తికి చిహ్నము. ఇట్టి కన్నులు కలవారు చూపులతోనే సర్వమును గ్రహింతురు. ఇట్టివారు సహజముగమౌనముగ నుందురు.
చూపులతో వారు పొందు అవగాహనను సామాన్యముగ ప్రకటింపరు. ఆకళింపు శక్తి వీరికి ఎక్కువగ నుండును. ఇవి అన్నియూ శ్రీమాత అనుగ్రహ పరమగు సంకేతములే. శ్రీమాత కన్నులు వాత్సల్యపూరితములే కాక శక్తివంతములు, స్ఫూర్తిదాయకములు కూడ. ఆమె కన్నుల నుండి మాయను ప్రసరింప చేయగలదు. అట్టి మాయకు త్రిమూర్తులు కూడ లోబడి యుందురు.
అట్లే ఆమె కన్నుల నుండి మాయను తొలగింపజేయు శక్తిని కూడ ప్రసరింప చేయగలదు. శ్రీమాత కన్నుల ఆరాధన సర్వశుభంకరము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 247 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Padma-nayanā पद्म-नयना (247) 🌻
Her eyes are compared to lotus flower. Lotus blossoms at the time of moon rise. This nāma further confirms the effect of meditating on full moon day.
When Her eyes are compared to lotus flower, it also implies that Her eyes are wide open at the time of full moon. Please read this along with the notes at the end of nāma 245. Vishnu’s eyes are also compared to lotus flower.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
05 Apr 2021