వివేక చూడామణి - 56 / Viveka Chudamani - 56


🌹. వివేక చూడామణి - 56 / Viveka Chudamani - 56 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 17. విముక్తి - 3 🍀

200, 201. లేని ప్రపంచము, దానికి మొదలులేనప్పటికి, దానికి ఎప్పుడో ఒకప్పుడు అంతమున్నదని తెలుస్తుంది. అందువలన జీవత్వమును ఆత్మ అని భావించినపుడు దానికి సంబంధము బుద్ధితో జతపర్చబడినది. ఉదా: ఎర్రని పుష్పము ప్రక్కన క్రిష్టల్ ఉంచినప్పడు ఆ ఎర్ర దనము క్రిష్టల్లో ప్రతిబింబిస్తుంది కదా! అలానే ఆత్మ ప్రకృతిలో నిండి ఉన్నప్పటికి, బుద్ది, ప్రకృతి సదా మారుతున్నప్పటికి ఆత్మలో మార్పు ఉండదు.

202. సరైన జ్ఞానము పొందినప్పడు బుద్ది, ఆత్మ ఒక్కటే అను తప్పుడు భావము తొలగిపోతుంది. వేరు మార్గము లేదు. సృతుల ప్రకారము సరైన జ్ఞానముతో తన యొక్క జీవాత్మను తాను తెలుసుకొన్నప్పుడే తాను బ్రహ్మమని తెలుసుకుంటాడు.

203. అసలైన సత్యాన్ని గ్రహించాలంటే వ్యక్తి; ఆత్మ, అనాత్మల భేదములను తెలుసుకొని ఉండాలి. అందువలన ప్రతి జీవాత్మకు పరమాత్మకు గల భేదమును తెలుసుకొనుటకు కృషి చేయాలి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 56 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 Liberation - 3 🌻


200-201. Previous non-existence, even though beginningless, is observed to have an end. So the Jivahood which is imagined to be in the Atman through its relation with superimposed attributes such as the Buddhi, is not real; whereas the other (the Atman) is essentially different from it. The relation between the Atman and the Buddhi is due to a false knowledge.

202. The cessation of that superimposition takes place through perfect knowledge, and by no other means. Perfect knowledge, according to the Shrutis, consists in the realisation of the identity of the individual soul and Brahman.

203. This realisation is attained by a perfect discrimination between the Self and the non-Self. Therefore one must strive for the discrimination between the individual soul and the eternal Self.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


05 Apr 2021

No comments:

Post a Comment