విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 358, 359 / Vishnu Sahasranama Contemplation - 358, 359


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 358 / Vishnu Sahasranama Contemplation - 358🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻358. సమయజ్ఞః, समयज्ञः, Samayajñaḥ🌻


ఓం సమయజ్ఞాయ నమః | ॐ समयज्ञाय नमः | OM Samayajñāya namaḥ

యఃసృష్టి స్థితి సంహార సమయాన్ షడృతూనుత ।
జానాతీత్యథవా సర్వభూతేషు సమతార్చనా ।
సాధ్వీ యస్యసనృహరిస్సమయజ్ఞః ఇతీర్యతే ॥

సృష్టి స్థితి సంహారముల సమయమును వేరు వేరుగా దేనిని ఎపుడాచరించవలయునో ఎరుగును. లేదా ఋతురూపములగు ఆరు సమయములను ఎరుగును. అవి ఎరిగి ఆ ఋతు ధర్మములను ప్రవర్తింపజేయును. లేదా 'సమ-యజ్ఞః' అను విభాగముచే సర్వభూతముల విషయమున సమము అనగా సమత్వము లేదా సమతాదృష్టి యజ్ఞముగా లేదా ఆరాధనముగా ఎవని విషమున కలదో అట్టివాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 358🌹

📚. Prasad Bharadwaj

🌻358. Samayajñaḥ🌻


OM Samayajñāya namaḥ

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अतुलश्शरभो भीमस्समयज्ञो हविर्हरिः ।सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः ॥ ३९ ॥

అతులశ్శరభో భీమస్సమయజ్ఞో హవిర్హరిః ।సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః ॥ ౩౯ ॥

Atulaśśarabho bhīmassamayajño havirhariḥ ।Sarvalakṣaṇalakṣaṇyo lakṣmīvān samitiñjayaḥ ॥ 39 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 359 / Vishnu Sahasranama Contemplation - 359🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻359. హవిర్హరిః, हविर्हरिः, Havirhariḥ🌻


ఓం హవిర్హరయే నమః | ॐ हविर्हरये नमः | OM Havirharayē namaḥ

హవిర్భాగం హరతి యజ్ఞములందు హవిస్సును, హవిర్భాగమును అందుకొనును. 'అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభు రేవ చ' (గీతా 9.24) సర్వ యజ్ఞములందును హవిస్సును భుజించు యజ్ఞఫలదాతయగు భోక్తయు, ప్రభుడను నేనే కదా! అను భగవద్వచనము ఇందులకు ప్రమాణము. లేదా 'హూయతే హవిషా' ఇతి హవిః హవిస్సుగా తాను హవనము చేయబడువాడు. 'అబద్నన్ పురుషం పశుమ్‍' (పురుష సూక్తమ్‍) దేవతలు తాము చేయు యజ్ఞమున విరాట్పురుషునే పశువునుగా హవిస్సునకై బంధించిరి' అను శ్రుతి ఇట ప్రమాణము. దీనిచే హరి 'హవిః' అనదగియున్నాడు. స్మృతిమాత్రేణ పుంసాం పాపం సంసారం వా హరతి ఇతి హరిద్వర్ణవాన్ ఇతి వా హరిః స్మరణమాత్రముచేతనే జీవుల పాపమునుగాని, సంసారమునుగాని హరించును. అథవా పచ్చని వర్ణము కలవాడు అను వ్యుత్పత్తిచే 'హరిః' అని నారాయణునకు పేరు. హవిః + హరిః రెండును కలిసి హవిర్హరిః అగును.

'హరా మ్యఘం చ స్మర్తౄణాం హవిర్భాగం క్రతుష్వహం వర్ణశ్చ మే హరిః శ్రేష్ఠ స్తస్మా ద్ధరి రహం స్మృతః' నేను నన్ను స్మరించిన వారి పాపమును హరింతును. యజ్ఞములయందు హవిర్భాగమును కూడ హరింతును (అందుకొనెదను). నా వర్ణమును శ్రేష్ఠమగు హరిద్వర్ణము. అందువలన నన్ను 'హరిః' అని తత్త్వవేత్తలు తలతురు అను భగవద్వచనము ఇందు ప్రమాణము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 359🌹

📚. Prasad Bharadwaj


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अतुलश्शरभो भीमस्समयज्ञो हविर्हरिः ।सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः ॥ ३९ ॥

అతులశ్శరభో భీమస్సమయజ్ఞో హవిర్హరిః ।సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః ॥ ౩౯ ॥

Atulaśśarabho bhīmassamayajño havirhariḥ ।Sarvalakṣaṇalakṣaṇyo lakṣmīvān samitiñjayaḥ ॥ 39 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹



05 Apr 2021

No comments:

Post a Comment