✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻48. ప్రభావము 🌻
ప్రతివాని జీవితము తన పరిధిలో ఇతరులను కొంత ప్రభావితము చేయుచుండును. కారణమేమనగా ప్రతి ఒక్కరూ చైతన్య స్వరూపులే అగుట వలన. కొందరి ప్రభావము తాత్కాలికముగ నుండును. కొందరి ప్రభావము చిరకాల ముండును. ఎంత చెట్టు కంత గాలి అన్నట్లు మంచి ప్రభావమైనను, చెడు ప్రభావమైనను జీవి పనులను బట్టి యుండును.
అందువలననే మంచి అయినను, చెడు అయినను సమర్థత కలవారి నుండే వ్యాపించును. పై కారణముగ మంచిని పెంచవలెనన్నచో మంచివారు సమర్థులై యుండ వలెను. సమర్థత, మంచితనము కూడియున్నచోట దీవ్యవైభవ ముండును. సామాన్యముగ సమర్థత యున్నచోట స్వార్థముండును.
మంచి తనము కలచోట సమర్థత లేక యుండును. స్వార్థపరులైన సమర్థులను మంచివారిని చేయుట కొంత కష్టము. సాధుజనులను సమర్థవంతు లను చేయుట సులభము. పై కారణముగనే దైవము అవతరించి నపుడు గొల్లలతో నుండెను.
మహాత్ములు కూడ సామాన్యులతో కూడి యుందురు. వారిని తీర్చిదిద్దుకొనుచు సంఘము చక్కబెట్టుట దివ్యకార్యము. అదియే దివ్య ప్రణాళిక కూడను. దివ్య జీవనమును అనుసరించదలచిన వారు ఈ మార్గముననే నడువవలెను.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
05 Apr 2021
No comments:
Post a Comment