శ్రీ లలితా సహస్ర నామములు - 91 / Sri Lalita Sahasranamavali - Meaning - 91

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 91 / Sri Lalita Sahasranamavali - Meaning - 91 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀

🍀 424. తత్త్వాసనా -
తత్ సంబంధమైన భావమే ఆసనముగా గలది.

🍀 425. తత్ -
ఆ పరమాత్మను సూచించు పదము.

🍀 426. త్వమ్‌ - 
నీవు.

🍀 427. అయీ -
అమ్మవారిని సంబోధించు పదము.

🍀 428. పంచకోశాంతరస్థితా -
ఐదు కోశముల మధ్యన ఉండునది.

🍀 429. నిస్సీమ మహిమా -
హద్దులు లేని మహిమ గలది.

🍀 430. నిత్యయౌవనా -
సర్వకాలములందును యవ్వన దశలో నుండునది.

🍀 431. మదశాలినీ -
పరవశత్వముతో కూడిన శీలము కలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 91 🌹

📚. Prasad Bharadwaj

🌻 91. tattvāsanā tattvamayī pañca-kośāntara-sthitā |
niḥsīma-mahimā nitya-yauvanā madaśālinī || 91 || 🌻

🌻 424 ) Tatwasana -
She who sits on principles

🌻 425 ) Tat -
She who is that

🌻 426 ) Twam -
She who is you

🌻 427 ) Ayee -
She who is the mother

🌻 428 ) Pancha kosandara sthitha -
She who is in between the five holy parts

🌻 429 ) Nissema mahima -
She who has limitless fame

🌻 430 ) Nithya youawana -
She who is ever young

🌻 431 ) Madha shalini -
She who shines by her exuberance

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

19 Jun 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 42

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 42 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ సమర్పణ బుద్ధి 🌻

గోపికలు గోకులము నందలి స్త్రీలు. వారి దగ్గర కృష్ణుడు వసించినది చిన్నతనమున.

ద్వారకలో భార్యలందరు నాగరిక స్త్రీలు. వారికి భగవంతుని సాన్నిధ్యము లభించినను , వారనుభవించినది కృష్ణుడు తనవాడు కావలెనను మమకారము.

గోపికలకు కృష్ణుని యెడల నున్నది ఆత్మ సమర్పణ బుద్ధి. కనుకనే గోపికలు కృష్ణుని సేవించుట, పోషించుట, ఆకలి దప్పులెరగి వర్తించుట ముఖ్య లక్షణములు.

భక్తికి కావలసినది ఎట్టి నడవడి యనగా వ్రజమునందలి గోపికలు చూపిన నడవడి యని నారదుడు భక్తి సూత్రము లలో వివరించెను.

🌹 🌹 🌹 🌹 🌹

19 Jun 2021

గీతోపనిషత్తు -214

🌹. గీతోపనిషత్తు -214 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 5-1

🍀 4-1. సంకల్పము - నిద్ర కుపక్రమించినపుడు తన యందలి ఈశ్వరుని స్మరించుచు, ఆధ్యాత్మ భావమున ప్రవేశించి, బ్రహ్మమును చేరు ప్రయత్నము చేయు సాధకుడు అనునిత్యము బ్రహ్మమును చేరగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. ఈశ్వరుడే విశ్వాత్మయని, అతనికి మూలము బ్రహ్మమని భావించుచు నిద్రించు వాడు నిద్రావస్థలు చెందక బ్రహ్మము దిశగ ప్రజ్ఞామయ లోకములలోనికి చనును. ఇది నిత్యము చేయవలసిన సాధన. 🍀

అంతకాలే చమామేవ స్మరమ్మక్యా కలేబరమ్ |
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః || 5

తాత్పర్యము :

అంత్యకాలమందు నన్నే స్మరించుచు శరీరమును విడిచినవాడు నా భావమునే (స్వరూపమును) పొంద గలడు. ఈ విషయమున సందేహము లేదు.

వివరణము :

అంత్యకాల మనగా ప్రజ్ఞకు మరపు కలుగుట. మరపులేని ప్రజ్ఞకు మరణము సంభవించదు. మానవునకు నిద్రా సమయ మంత్యకాలము వంటిదే. మెలకువ ఆరంభకాలము కాగా, నిద్ర అంత్యకాల మగుచున్నది.

నిద్ర కుపక్రమించినపుడు తన యందలి ఈశ్వరుని స్మరించుచు, ఆధ్యాత్మ భావమున ప్రవేశించి, బ్రహ్మమును చేరు ప్రయత్నము చేయు సాధకుడు అనునిత్యము బ్రహ్మమును చేరగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు.

నిద్ర కుపక్రమించినపుడు భావింపవలసినది తనయందలి ఈశ్వరుని. ఆ ఈశ్వరుడే విశ్వాత్మయని, అతనికి మూలము బ్రహ్మమని భావించుచు నిద్రించువాడు నిద్రావస్థలు చెందక బ్రహ్మము దిశగ ప్రజ్ఞామయ లోకములలోనికి చనును. ఇది నిత్యము చేయవలసిన సాధన.

ఇట్టి సాధన చేయువానికి దేహము నుండి విడిపడుట సులభమగును. మృత్యువునుండి విడిపడుట వీలగును. అట్టి వానికి దేహ విసర్జన సమయమున మృత్యువు అనుభూతముకాక సులభముగ దేహమునుండి ముక్తుడగును. "మృత్యోర్ముక్షీయ మామృతాత్" అనునది సత్యమగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

19 Jun 2021

శ్రీ శివ మహా పురాణము - 414

🌹 . శ్రీ శివ మహా పురాణము - 414🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 23

🌻. దేవతలు శివుని దర్శించుట - 4 🌻

విష్ణువు ఇట్లు పలికెను-

పార్వతీ దేవి చేయుచున్న తపస్సు యొక్క పరిస్థితి అంతయూ నాకు తెలియును. నేనిపుడు మీతో గూడి పరమేశ్వరుని వద్దకు వెళ్లుచున్నాను (31). ఓ దేవతలారా! ఆయన లోకకల్యాణము కొరకై ఇప్పుడు పార్వతిని చేబట్టవలయుననియు, ఆమె వద్దకు వెంటనే వెళ్లుడనియు మనము ఆనందముతో ఆయనను ప్రార్థించెదము (32).

పినాక పాణియగు ఆ దేవదేవుడు శివాదేవికి ఇప్పుడే వరమునిచ్చు విధముగా ఆయనను ఒప్పించవలయును. మనమా ప్రయత్నమును ఆచటనే చేయుదము (33). కావున, మహాప్రభుడు, పరమమంగళ స్వరూపుడునగు రుద్రుడు ఉగ్రమగు తపస్సును చేయుచున్న స్థలమునకు ఇప్పుడే మనము వెళ్లెదము (34).

బ్రహ్మ ఇట్లు పలికెను-

విష్ణువు యొక్క ఆ మాటను విని దేవతలు మొదలగు వారందరు, లయకారకుడగు రుద్రుడు హఠాత్తుగా కోపించి దహింప గోరునేమో యని మహా భయమును పొంది, ఇట్లు పలికిరి (35).

దేవతలిట్లు పలికిరి -

మహా భయంకరుడు, క్రోధములో ప్రలయ కాలాగ్నితో సమమగు కాంతి గలవాడు, ముక్కంటి, మహాప్రభుడు అగు రుద్రుని వద్దకు మేము ఎవ్వరమైననూ వెళ్లము (36). పూర్వము ఆయన దుర్జయుడగు మన్మథుని ఎట్లు దహించినాడో, అదే తీరున క్రోధముగలవాడై ఆయన మమ్ములను కూడ దహించివేయును. సందేహము లేదు (37).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇంద్రుడు మొదలగు వారి ఆ మాటను విని లక్ష్మీపతి ఆ దేవతలనందరినీ ఓదార్చెను. ఓ, మునీ! విష్ణువు అపుడు వారితో నిట్లనెను (38).

విష్ణువు ఇట్లు పలికెను-

ఓ దేవతలారా! మీరందరు నా మాటను ప్రీతితో ఆదరముతో వినుడు. దేవతల భయమును పోగొట్టే ఆ స్వామి మిమ్ములను దహించడు (39)జ కావున మీరు వివేకము గలవారై, శంభుడు శుభుములనిచ్చువాడని యెరింగి నాతో గూడి ఆ మహాప్రభుని శరణు పొందుడు (40). సనాతుడు, పరమ పరుషుడు, అధీశ్వరుడు, శ్రేష్ఠమగు రూపము గలవాడు, తపస్సును చేయుచున్నవాడు, పరమాత్మ సర్వరూపుడు, సర్వోత్కృష్టుడు అగు ఆ శివుని శరణు వేడెదము (41).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

19 Jun 2021

19-JUNE-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 214🌹  
2) 🌹. శివ మహా పురాణము - 414🌹 
3) 🌹 Light On The Path - 161🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -42🌹  
5) 🌹 Osho Daily Meditations - 31🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 91 / Lalitha Sahasra Namavali - 91🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 91 / Sri Vishnu Sahasranama - 91🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -214 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 5-1

*🍀 4-1. సంకల్పము - నిద్ర కుపక్రమించినపుడు తన యందలి ఈశ్వరుని స్మరించుచు, ఆధ్యాత్మ భావమున ప్రవేశించి, బ్రహ్మమును చేరు ప్రయత్నము చేయు సాధకుడు అనునిత్యము బ్రహ్మమును చేరగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. ఈశ్వరుడే విశ్వాత్మయని, అతనికి మూలము బ్రహ్మమని భావించుచు నిద్రించు వాడు నిద్రావస్థలు చెందక బ్రహ్మము దిశగ ప్రజ్ఞామయ లోకములలోనికి చనును. ఇది నిత్యము చేయవలసిన సాధన. 🍀*

అంతకాలే చమామేవ స్మరమ్మక్యా కలేబరమ్ |
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః || 5

తాత్పర్యము : 
అంత్యకాలమందు నన్నే స్మరించుచు శరీరమును విడిచినవాడు నా భావమునే (స్వరూపమును) పొంద గలడు. ఈ విషయమున సందేహము లేదు. 

వివరణము : 
అంత్యకాల మనగా ప్రజ్ఞకు మరపు కలుగుట. మరపులేని ప్రజ్ఞకు మరణము సంభవించదు. మానవునకు నిద్రా సమయ మంత్యకాలము వంటిదే. మెలకువ ఆరంభకాలము కాగా, నిద్ర అంత్యకాల మగుచున్నది. 

నిద్ర కుపక్రమించినపుడు తన యందలి ఈశ్వరుని స్మరించుచు, ఆధ్యాత్మ భావమున ప్రవేశించి, బ్రహ్మమును చేరు ప్రయత్నము చేయు సాధకుడు అనునిత్యము బ్రహ్మమును చేరగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. 

నిద్ర కుపక్రమించినపుడు భావింపవలసినది తనయందలి ఈశ్వరుని. ఆ ఈశ్వరుడే విశ్వాత్మయని, అతనికి మూలము బ్రహ్మమని భావించుచు నిద్రించువాడు నిద్రావస్థలు చెందక బ్రహ్మము దిశగ ప్రజ్ఞామయ లోకములలోనికి చనును. ఇది నిత్యము చేయవలసిన సాధన. 

ఇట్టి సాధన చేయువానికి దేహము నుండి విడిపడుట సులభమగును. మృత్యువునుండి విడిపడుట వీలగును. అట్టి వానికి దేహ విసర్జన సమయమున మృత్యువు అనుభూతముకాక సులభముగ దేహమునుండి ముక్తుడగును. "మృత్యోర్ముక్షీయ మామృతాత్" అనునది సత్యమగును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 414🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 23

*🌻. దేవతలు శివుని దర్శించుట - 4 🌻*

విష్ణువు ఇట్లు పలికెను-

పార్వతీ దేవి చేయుచున్న తపస్సు యొక్క పరిస్థితి అంతయూ నాకు తెలియును. నేనిపుడు మీతో గూడి పరమేశ్వరుని వద్దకు వెళ్లుచున్నాను (31). ఓ దేవతలారా! ఆయన లోకకల్యాణము కొరకై ఇప్పుడు పార్వతిని చేబట్టవలయుననియు, ఆమె వద్దకు వెంటనే వెళ్లుడనియు మనము ఆనందముతో ఆయనను ప్రార్థించెదము (32). 

పినాక పాణియగు ఆ దేవదేవుడు శివాదేవికి ఇప్పుడే వరమునిచ్చు విధముగా ఆయనను ఒప్పించవలయును. మనమా ప్రయత్నమును ఆచటనే చేయుదము (33). కావున, మహాప్రభుడు, పరమమంగళ స్వరూపుడునగు రుద్రుడు ఉగ్రమగు తపస్సును చేయుచున్న స్థలమునకు ఇప్పుడే మనము వెళ్లెదము (34).

బ్రహ్మ ఇట్లు పలికెను-

విష్ణువు యొక్క ఆ మాటను విని దేవతలు మొదలగు వారందరు, లయకారకుడగు రుద్రుడు హఠాత్తుగా కోపించి దహింప గోరునేమో యని మహా భయమును పొంది, ఇట్లు పలికిరి (35). 

దేవతలిట్లు పలికిరి -

మహా భయంకరుడు, క్రోధములో ప్రలయ కాలాగ్నితో సమమగు కాంతి గలవాడు, ముక్కంటి, మహాప్రభుడు అగు రుద్రుని వద్దకు మేము ఎవ్వరమైననూ వెళ్లము (36). పూర్వము ఆయన దుర్జయుడగు మన్మథుని ఎట్లు దహించినాడో, అదే తీరున క్రోధముగలవాడై ఆయన మమ్ములను కూడ దహించివేయును. సందేహము లేదు (37). 

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇంద్రుడు మొదలగు వారి ఆ మాటను విని లక్ష్మీపతి ఆ దేవతలనందరినీ ఓదార్చెను. ఓ, మునీ! విష్ణువు అపుడు వారితో నిట్లనెను (38).

విష్ణువు ఇట్లు పలికెను-

ఓ దేవతలారా! మీరందరు నా మాటను ప్రీతితో ఆదరముతో వినుడు. దేవతల భయమును పోగొట్టే ఆ స్వామి మిమ్ములను దహించడు (39)జ కావున మీరు వివేకము గలవారై, శంభుడు శుభుములనిచ్చువాడని యెరింగి నాతో గూడి ఆ మహాప్రభుని శరణు పొందుడు (40). సనాతుడు, పరమ పరుషుడు, అధీశ్వరుడు, శ్రేష్ఠమగు రూపము గలవాడు, తపస్సును చేయుచున్నవాడు, పరమాత్మ సర్వరూపుడు, సర్వోత్కృష్టుడు అగు ఆ శివుని శరణు వేడెదము (41).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 161 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 But to learn is impossible until the first great battle has been won. The mind may recognize truth, but the spirit cannot receive it. - 3 🌻*

576. While many people recognize that that must be so, and that of course the whole must take precedence over any part, they do sometimes feel a little that the parts are being ignored, that while everything is working for the good of the whole, yet individual parts often suffer by the way. 

The world is better managed than that; actually, that which is best for the whole is also best for each one of the parts, and not only is justice done to humanity as a whole, but it is so done as to involve no injustice to any of the units of humanity. Let us be sure of that, and realize it with absolute certainty; then we shall have no feeling of doubt or dismay, and whatever happens we shall be able serenely to trust that it is being done for the best.

577. Once having passed through the storm and attained the peace, it is then always possible to learn, even though the disciple waver, hesitate, and turn aside. The Voice of the Silence, remains within him, and though he leave the Path utterly, yet one day it will resound, and rend him asunder and separate his passions from his divine possibilities. Then, with pain and desperate cries from the deserted lower self, he will return.

578. In such a case there would be indeed a terrible struggle. Let. us not submit ourselves to that; it is better, while yet we may, to keep ourselves well in hand and not make ourselves the subjects of such a surgical operation as that of the tearing apart of the higher and lower self. 

The struggle with the lower self goes on all the time. If the disciple allows it to fasten its fangs into the higher and to draw him away from his greater possibilities, he must inevitably suffer terribly when the time of separation comes, as it must come, for those who have entered the stream can leave it only by reaching the further shore.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 42 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ సమర్పణ బుద్ధి 🌻*

గోపికలు గోకులము నందలి స్త్రీలు. వారి దగ్గర కృష్ణుడు వసించినది చిన్నతనమున.

ద్వారకలో భార్యలందరు నాగరిక స్త్రీలు. వారికి భగవంతుని సాన్నిధ్యము లభించినను , వారనుభవించినది కృష్ణుడు తనవాడు కావలెనను మమకారము.

గోపికలకు కృష్ణుని యెడల నున్నది ఆత్మ సమర్పణ బుద్ధి. కనుకనే గోపికలు కృష్ణుని సేవించుట, పోషించుట, ఆకలి దప్పులెరగి వర్తించుట ముఖ్య లక్షణములు.

భక్తికి కావలసినది ఎట్టి నడవడి యనగా వ్రజమునందలి గోపికలు చూపిన నడవడి యని నారదుడు భక్తి సూత్రము లలో వివరించెను.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 31 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 EXPERIMENTATION 🍀*

*🕉 Always remain open and experimentative, always ready to walk a path you have never walked before. Who knows? Even if it proves useless, it will be an experience. 🕉*

Edison was working on a certain experiment for almost three years, and he had failed seven hundred times. All his colleagues and his students became completely frustrated. Every morning he would come to the lab happy and bubbling with joy, ready to start again. It was too much: seven hundred times and three years wasted! Everybody was almost certain that nothing was going to come of the experiment. 

The whole thing seemed to be useless, just a whim. They all gathered and told Edison, "We have failed seven hundred times. We have not achieved anything. We have to stop." Edison laughed uproariously. He said, "What are you talking about? Failed? We have succeeded in knowing that seven hundred methods won't be of any help. 

We are coming closer and closer to the truth every day! If we had not knocked on those seven hundred doors, we would have had no way of knowing. But now we are certain that seven hundred doors are false. This is a great achievement! This is the basic scientific attitude: If you can decide that something is false, you are coming closer to the truth. 

Truth is not available in the market so that you can go directly and order it. It is not ready-made, available. You have to experiment. So always remain experimentative. And never become smug. Never think that whatever you are doing is perfect. It is never perfect. It is always possible to improve on it; it is always possible to make it more perfect.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 91 / Sri Lalita Sahasranamavali - Meaning - 91 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।*
*నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀*

🍀 424. తత్త్వాసనా - 
తత్ సంబంధమైన భావమే ఆసనముగా గలది.

🍀 425. తత్ - 
ఆ పరమాత్మను సూచించు పదము.

🍀 426. త్వమ్‌ - నీవు.

🍀 427. అయీ - 
అమ్మవారిని సంబోధించు పదము.

🍀 428. పంచకోశాంతరస్థితా -
 ఐదు కోశముల మధ్యన ఉండునది.

🍀 429. నిస్సీమ మహిమా - 
హద్దులు లేని మహిమ గలది.

🍀 430. నిత్యయౌవనా - 
సర్వకాలములందును యవ్వన దశలో నుండునది.

🍀 431. మదశాలినీ - 
పరవశత్వముతో కూడిన శీలము కలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 91 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 91. tattvāsanā tattvamayī pañca-kośāntara-sthitā |*
*niḥsīma-mahimā nitya-yauvanā madaśālinī || 91 || 🌻*

🌻 424 ) Tatwasana -   
She who sits on principles

🌻 425 ) Tat -   
She who is that

🌻 426 ) Twam -   
She who is you

🌻 427 ) Ayee -   
She who is the mother

🌻 428 ) Pancha kosandara sthitha -   
She who is in between the five holy parts

🌻 429 ) Nissema mahima -   
She who has limitless fame

🌻 430 ) Nithya youawana -   
She who is ever young

🌻 431 ) Madha shalini -   
She who shines by her exuberance

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 91 / Sri Vishnu Sahasra Namavali - 91 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*ధనిష్ట నక్షత్ర తృతీయ పాద శ్లోకం*

*🍀 91. భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః |*
*ఆశ్రమః శ్రమణః, క్షామః సుపర్ణో వాయువాహనః ‖ 91 ‖ 🍀*

🍀 847) భారభృత్ - 
భారమును మోయువాడు.

🍀 848) కథిత: - 
వేదములచేత సర్వోత్తముడుగా కీర్తించబడినవాడు.

🍀 849) యోగీ - 
ఆత్మజ్ఞానము నందే సదా ఓలలాడు వాడు.

🍀 850) యోగీశ: - 
యోగులకు ప్రభువు.

🍀 851) సర్వ కామద: - 
సకల కోరికలను తీర్చువాడు.

🍀 852) ఆశ్రమ: - 
జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.

🍀 853) శ్రమణ: -
 భక్తిహీనులను, వివేకరహితులను శ్రమ పెట్టువాడు.

🍀 854) క్షామ: - 
సర్వ జీవులను క్షీణింపజేయువాడు.

🍀 855) సుపర్ణ: - 
రమణీయ పత్రములు కలిగిన వృక్షము తానైనవాడు.

🍀 856) వాయువాహన: - 
వాయు చలనమునకు కారణభూతుడైనవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 91 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Dhanishta 3rd Padam* 

*🌻 91. bhārabhṛt kathitō yōgī yōgīśaḥ sarvakāmadaḥ |*
*āśramaḥ śramaṇaḥ, kṣāmaḥ suparṇō vāyuvāhanaḥ || 91 || 🌻*

🌻 847. Bhārabhṛt: 
One who bears the weight of the earth assuming the form of Ananta.

🌻 848. Kathitaḥ: 
One who is spoken of as the highest by the Veda or one of whom all Vedas speak.

🌻 849. Yogī: 
Yoga here means knowledge. So He who is attained by that is Yogi. Or Yoga means Samadhi. He who is ever established in His own Self, that is, the Paramatma. He is therefore Yogi.

🌻 850. Yogīśaḥ: 
He who is never shaken from Yoga or knowledge and establishment in His own Self, unlike ordinary Yogis who slip away from Yoga on account of obstacles.

🌻 851. Sarva-kāmadaḥ: 
One who bestows all desired fruits.

🌻852. Āśramaḥ: 
One who is the bestower of rest on all who are wandering in the forest of Samsara.

🌻 853. Śramaṇaḥ: 
One who brings tribulations to those who live without using their discriminative power.

🌻 854. Kṣāmaḥ: 
He who brings about the decline of all beings.

🌻 855. Suparṇaḥ: 
The lord who has manifested Himself as the tree of Samsara has excellent leaves (Parna) in the form of Vedic passages (Chandas).

🌻 856. Vāyuvāhanaḥ: 
He for fear of whom Vayu (Air) carries all beings.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹