శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 540 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 540 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 540 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 540 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।
స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀

🌻 540. 'స్మృతి' - 2 🌻


అహంకారము కారణముగ విద్యలు రాణింపవు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారమూర్తులు కూడ సద్గురువుల నాశ్రయించిరి. శుశ్రూషలు చేసిరి. వినయము గలవారికే విద్య అని తెలియవలెను. సంపదలలో వినయ సంపద చాల గొప్పది. శ్రీమాతయే స్మృతి, శ్రుతి రూపము గనుక ఆమెను భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయువారు సర్వవిద్యల సారమును పొందగలరు. భక్తులీ మార్గముననే సర్వవిద్యలను నేర్చిరి. శ్రీమాత సర్వవిద్యా స్వరూపిణి కదా! ఆమెను గూర్చిన శ్రవణము, స్మరణము వలన కూడ జీవులు పూర్ణ వికాసము చెందుదురు. ఇదియునూ సదాచారమే. శ్రుతి స్మృతులు జీవుల మేధస్సును క్రమముగ వృద్ధి పరచుచూ తరింపజేయును. తరువాత నామము దీనినే ప్రతిపాదించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 540 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini
svahasvadha amati rmedha shrutih smrutir anuttama ॥110 ॥ 🌻

🌻 540. 'Smruti' - 2 🌻


Skills do not succeed because of pride. Incarnations like Lord Rama and Lord Krishna also submitted to sadgurus. Did service to them. Education is only for the humble. The wealth of humility is the greatest of all riches. As Srimata is the form of Smriti and Sruti, those who worship her with devotion can attain the essence of all knowledge. Devotees have attained knowledge through this method. Isn't Srimata the epitome of knowledge! By listening to and recollecting about her, living beings also develop knowledge. This is also a good practice. Sruti Smritis gradually expand the knowledge of living beings. The next name suggests this.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



అవగాహన మరియు పారవశ్యం ఒకటిగా మారుతుంది. / Awareness and Ecstasy Become One

🌹 అవగాహన మరియు పారవశ్యం ఒకటిగా మారుతుంది. / Awareness and Ecstasy Become One 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


'మీరు ఆనందంతో, పారవశ్యంతో ప్రవహిస్తున్నప్పుడు, అది నిజంగా ఎక్కువగా ఎరుకగా ఉండ వలసిన, మరియు అవగాహన చేసుకోవలసిన క్షణం. కానీ ప్రజలు సరిగ్గా వ్యతిరేకం చేస్తారు. సంతోషంగా ఉన్నప్పుడు అవగాహన గురించి ఎవరూ పట్టించుకోరు. అదే వారు వేదనలో ఉన్నప్పుడు, వారు ఖచ్చితంగా తెలుసుకోవడం మరియు వేదన నుండి బయట పడవలసిన సమయం అని ఆలోచించడం ప్రారంభిస్తారు. కానీ ఆ బాధ నుంచి ఎవరూ నేరుగా బయటపడలేక పోయారు.

“మొదట, పారవశ్యత నుండి బయటపడి అవగాహన వైపు మీ దృష్టి పెట్టాలి. మీరు మీ ఆనందకరమైన క్షణాల గురించి లోతుగా తెలుసుకో గలిగితే, నిరాశ, పతనాలు మీ జీవితంలోకి రావు. అదే వేదన నుండి బయటపడటానికి తలుపు. కాబట్టి ఇది సరళమైన మార్గం:

'సంతోషంగా ఉన్నప్పడు, గమనింపుగా ఉండండి.'

'ఆనందంగా ఉన్నప్పుడు, అవగాహనతో ఉండండి.'

'ప్రేమిస్తున్నప్పుడు, ఎరుకతో ఉండండి.'

'అవగాహనను ఒక రకమైన భంగం' అని చెప్పి పక్కన పెట్టవద్దు; నేను గొప్ప పారవశ్యంలో ఉన్నాను.’ అనే ఎరుక కలవరంలా మారుతుంది అనిపిస్తుంది; కానీ అలా జరగదు. ఇది ప్రారంభంలో అలా కనిపించ వచ్చు, కానీ త్వరలో ఇది మీ పారవశ్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని మీరు చూస్తారు. అంతిమంగా అవగాహన మరియు పారవశ్యం ఒకటిగా మారతాయి. అప్పుడు పతనాలు, నిస్పృహ క్షణాలు, వేదనలు అన్నీ మాయమవుతాయి.

🌹🌹🌹🌹🌹




🌹 Awareness and Ecstasy Become One 🌹

“When you are flowing with joy, blissfulness, that is the moment to be aware, but people do exactly the opposite. When they are happy who cares about awareness? And when they are in anguish, then certainly they start thinking it is time to be aware and get out of anguish. But nobody has ever been able to get out from anguish directly.

“First, one has to get into awareness from ecstasy. If you can be aware of your joyful moments in the first place, the depression, the downs will not come. The door to awareness is in ecstacy. So this is the simplest way:

“Be happy and be aware."

" “Rejoice and be aware."

“Love and be aware."

“Don’t put awareness aside saying, ‘This is a kind of disturbance; I am in such a great ecstasy.’ Awareness becomes like a disturbance; it is not. It may appear like this in the beginning, but soon you will see it will take your ecstasy to higher peaks. Ultimately awareness and ecstasy become one. Then those downs, depressive moments, agonies disappear.”

🌹🌹🌹🌹🌹


సిద్దేశ్వరయానం - 38 Siddeshwarayanam - 38

🌹 సిద్దేశ్వరయానం - 38 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 5వ శతాబ్దం నుండి 🏵

కాలభైరవమంత్ర సాధన చేయాలి. స్త్రీ పురుషులిద్దరూ భైరవ మంత్రజపం చేయాలి. దీనివల్ల సంతృప్తుడైన భైరవుడు నీకు దివ్య శక్తులిస్తాడు. అధర్మాన్ని జయించటానికి తప్పనిసరి పరిస్థితిలో దీనిని అనుసరించ వలసి వస్తున్నది. దీనిని ధర్మసూక్ష్మం అని గాని మహాధర్మమని గాని చెప్పవచ్చు. దీనికి ధర్మ విరుద్ధం కాని మార్గం నేను చెపుతాను. దానిని నాగ పురోహితుడు కూడ వినాలి." అని అతనిని పిలిపించాడు బోయాంగ్. “నాగయాజీ! మీరు శుక్రాచార్యుని వంశం వారు. చాలా యజ్ఞాలు చేశారు. చేయించారు. కనుక ఈ పేరు సార్థకమైనది. ఇతడూ భార్గవుడే. చ్యవనుని నుండి వచ్చిన వాడు. మీరూ కవి నుండి వచ్చిన వారు. కవి, చ్యవనుడు ఇద్దరు భృగుపుత్రులే. అది అలా ఉంచి రాక్షసులలో ఒక అత్యంత రహస్య ప్రయత్నం జరుగుతున్నది. అసుర మాంత్రికులు తమ సర్వ శక్తులు వినియోగించి ఒక దైత్య కన్యలో కాళీదేవిని ఆవాహనం చేస్తున్నారు.

సాక్షాత్తు మహాకాళి ఆమెను ఆవహిస్తున్నది. మీతో జరగబోయే మహాయుద్ధంలో అత్యవసర సమయంలో ఆమెను రణరంగానికి తీసుకువస్తారు. ఆమె దిగంబర ముక్త కేశ. చంపబడిన వారి బాహువులను నడుముకు కాంచికగా ధరించి ఉంటుంది. ఆమె నోటిలోనుండి మంటలు వస్తుంటవి. ఆమె చేతులలోకి వాటంతట అవి ఖడ్గశూలాదులు వస్తుంటవి. వాటితో ఆమె మీ సైన్యమును సంహరిస్తూ ఉంటుంది. మీ ఆయుధములు ఆమె మీద పనిచేయవు. ఆమె అజేయ పరాక్రమ. ఆమెకు సమరములో హరసిద్ధుడు కూడ చాలడు. హరసిద్ధునిలో భైరవుడు వచ్చినిలుచుంటే అతడు భర్త గనుక ఆమె యుద్ధం ఆపుతుంది. కనుక హరసిద్ధుడింక సిద్ధ భైరవుడు కావాలి. ఇక్కడి భైరవస్పర్శతో ఆ కార్యక్రమం మొదలైంది. భైరవుడు యుద్ధవీరుడు కూడా. పూర్వం నరకాసురుడు చేసిన సాధనలను గూర్చి మీరు వినే ఉంటారు.

కాళీదేవి అతనికి నిత్యయౌవనాన్ని, మహత్తర పరాక్రమాన్ని ఇచ్చింది అయితే రాజకన్యలను బలవంతంగా తెచ్చి మానభంగం చేసిన పాపానికి, ఇతర దుష్కృత్యాలకు శ్రీకృష్ణుని వలన సంహరించబడినాడు. ఇక్కడ ఆ సాధన మార్గము వరకు తీసుకోవాలి. కాళీ మంత్రం బదులు భైరవ మంత్రంతో చెయ్యాలి. దానికి కూడా అధర్మ మార్గం అక్కరలేదు. రాజకుమారి హిరణ్మయితో ఈ సాధన చేయవచ్చు. ధర్మయుక్తం కావటం కోసం వీరిద్దరి పెండ్లి చేయండి. కానీ ఈ వివాహ విషయం బయటకు పొక్కితే రాక్షసులు వెంటనే యుద్ధానికి వస్తారు. అలావస్తే మీరు తట్టుకోలేరు. కనుక కొద్ది రోజులలో కామాఖ్యలో కాళీ ఉత్సవాలు జరుగుతవి. అప్పుడప్పుడు మీ రాజుగారికి సకుటుంబంగా వెళ్ళి వాటిని వైభవోపేతంగా చేయించటం అలవాటే గదా! ఈ సారి అలానే వెళ్ళండి.

రహస్యంగా అక్కడి మీ భవనంలో కళ్యాణం చేయించండి. ఉత్సవాలు కాగానే మీరు రాజధానికి వెళ్ళవచ్చు. రాజకుమారి మీతోరాదు. తన భర్తయైన హరసిద్ధునితో రహస్యంగా హిమాలయాలలోని కైలాస పర్వత ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ సామాన్య మానవులు వెళ్ళలేని ఒక భైరవాలయం ఉన్నది. మహా సిద్ధుడైన మత్స్యేంద్రనాథుడు నిర్మించి ప్రతిష్ఠించిన భైరవవిగ్రహం ఆ మందిరంలో ఉంది. ఆ దేవుని వాహనమైన శ్వానరాజు స్వర్ణ విగ్రహమై గుడిలో రక్షకునిగా ఉన్నాడు. (ఇటీవల ఆ స్వర్ణవిగ్రహం దొరికితే భక్తులు దలైలామాకు తెలియబరిచారు. ఆయన దానిని అక్కడే ఉంచి పూజించమన్నారు. చైనా ప్రభుత్వం టిబెట్ను ఆక్రమించిన తరువాత అది యేమైనదో? ఒక చైనా సైనికుడు ఆ విగ్రహంలోకి తుపాకి బాయినెట్ గ్రుచ్చగా దానిలోనుండి నెత్తురుకారింది. ఎంత పని చేశావురా దుర్మార్గుడా! అని మాటలు వినిపించినవి. ఆ భటుడు మరణించాడు వెంటనే. ఇక దాని జోలికెవ్వరూ పోలేదు. ఆ గుడిని బౌద్ధులు బుద్ధుని ఆలయంగా పిలుస్తున్నారు. భోజారానాథ్ అన్నది టిబెట్ వారు పిలిచే పేరు. నాథ సంప్రదాయ చిహ్నం) భోజారనాధుని ఆలయంలో హిరణ్మయీ హరసిద్ధులు భైరవతంత్రం అనుష్ఠించాలి. ఆ పద్ధతులు నీకు నేను ఉపదేశిస్తాను.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

Osho Daily Meditations - 133. NOTHING HAPPENING / ఓషో రోజువారీ ధ్యానాలు - 133. ఏమీ జరగడం లేదు




🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 133 / Osho Daily Meditations - 133 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 133. ఏమీ జరగడం లేదు 🍀

🕉 నిశ్శబ్దంగా అనిపించడం కూడా ఒక జరగడమే మరియు ఇది ఇతర శబ్దాల కంటే గొప్ప జరగడం. 🕉


మీరు ఏడుస్తున్నప్పుడు లేదా అరుస్తున్నప్పుడు, ఏదో జరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. మీరు ఏడవనప్పుడు, అరవకుండా, కేకలు వేయనప్పుడు, గాఢమైన నిశ్శబ్దాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఏమీ జరగడం లేదని మీరు అనుకుంటారు. ఇది కూడా గొప్ప సంఘటన అని, మిగతా వాటి కంటే గొప్పదని మీకు తెలియదు. నిజానికి, ఆ ఇతర క్షణాలు దీనికి మార్గం సుగమం చేశాయి. ఇదే లక్ష్యం. అవి సాధనాలు మాత్రమే. కానీ మొదట్లో అది ఖాళీగా కనిపిస్తుంది, అంతా పోయినట్లు. మీరు కూర్చున్నారు, ఏమీ జరగడం లేదు. ఏమీ జరగడం లేదు, కానీ ఏమీ జరగకపోవడం సకారత్మకంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సకారత్మకమైన విషయం. బుద్ధుడు ఏదీ కానిదాన్ని నిర్వాణం, అంతిమమని పేర్కొన్నాడు. కాబట్టి దానిని అనుమతించండి, దానిని గౌరవించండి మరియు ఇది మరింత జరగనివ్వండి, దానిని స్వాగతించండి. ఇది జరిగినప్పుడు మీ కళ్ళు మూసుకుని ఆస్వాదించండి, తద్వారా ఇది తరచుగా వస్తుంది. ఇది నిధి. కానీ మొదట్లో, ఇది అందరికీ జరుగుతుందని నేను అర్థం చేసుకోగలను.

ప్రజలు విస్ఫోటకం అని పిలిచే అనేక అంశాలు ఉన్నాయి. అవి అదృశ్యమై అసలు విషయం వచ్చినప్పుడు, అది ఏమిటో వారికి ఏ మాత్రం తెలియదు అంతేకాక వారికి తమ విస్ఫోటకాల లోటు కలుగుతుంది. ఆ విస్ఫోటకాలు మళ్లీ జరగాలని వారు కోరుకుంటారు. వారు దాన్ని బలవంతం చేయడం మొదలుపెట్టి మొత్తం నాశనం చేస్తారు. కాబట్టి వేచి ఉండండి. ఏదైనా దానంతట అదే విస్ఫోటిస్తే పర్వాలేదు కానీ బలవంతం చేయకండి. నిశ్శబ్దం విస్ఫోటిస్తే, ఆస్వాదించండి. మీరు దాని గురించి సంతోషపడాలి! ఇది ప్రపంచ ప్రజల దుస్థితి-ఏది ఏమిటో తెలియదు, కాబట్టి కొన్నిసార్లు వారు దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు మరికొన్నిసార్లు వారు సంతోషంగా ఉండాల్సినప్పుడు, ఆనందం నిజంగా దగ్గరగా ఉన్నప్పుడు, దుఃఖానికి గురవుతారు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 133 🌹

📚. Prasad Bharadwaj

🍀 133. NOTHING HAPPENING 🍀

🕉 Feeling quiet is also a happening and it is a greater happening than other things that are noisy. 🕉


When you are crying or shouting, you feel that something is happening. When you are not crying, not shouting, not screaming, just feeling a deep silence, you think nothing is happening. You don't know that this too is a great happening, greater than the others. In fact, those other moments have paved the way for this one. This is the goal. They are just the means. But in the beginning it will look empty, everything gone. You are sitting, and nothing is happening. Nothing is happening, and "nothing" is very positive. It is the most positive thing in the world. Buddha has called that nothing is Nirvana, the Ultimate. So allow it, cherish it, and let it happen more, welcome it. When it happens just close your eyes and enjoy it so it comes more often. This is the treasure. But in the beginning, I can understand, it happens to everybody.

There are many things people call explosions. When they disappear and the real thing comes, they don't have any notion of what it is and they simply miss their explosions. They would like those explosions to happen again. They may even start forcing them, but they will destroy the whole thing. So wait. If something explodes on its own, it is okay, but don't force it. If silence is exploding, enjoy it. You should be happy about it ! This is the misery of the world-people don't know what is what, so sometimes they are happy when they are miserable and sometimes when they should be happy, when happiness is really close, they become miserable.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 874 / Sri Siva Maha Purana - 874

🌹 . శ్రీ శివ మహా పురాణము - 874 / Sri Siva Maha Purana - 874 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 37 🌴

🌻. స్కందశంఖచూడుల ద్వంద్వయుద్ధము - 2 🌻


ఆ యుద్ధములో వేలాది మొండెములు అనేక రకములుగా నాట్యమాడినవి. పిరికి వారికి భయమును గొల్పు పెద్ద కోలాహలము చెలరేగెను (10). మరల స్కందుడు పెద్దగా కోపించి బాణముల వర్షమును కురింపించి, క్షణకాలములో కోటి మంది రాక్షస వీరులను నేల గూల్చెను (11). స్కందుని బాణ పరంపరచే తెగిన దేహములు కలిగి మరణించగా మిగిలిన దానవులందరు అపుడు పారిపోయిరి (12). వృషపర్వుడు, విప్రచిత్తి, దండుడు మరయు వికంపనుడు అను వారందరు వరుసగా స్కందునితో యుద్ధమును చేసిరి. (13). మహామారి కూడ వెన్ను చూపకుండా యుద్ధమును చేసెను. స్కందుని శక్తి- ఆయుధముచే వారు తెగిన అవయవములు గలవారై అధికమగు పీడను పొందిరి (14).

ఓ మునీ! అపుడు మహామారి, స్కందుడు విజయమును పొందిరి. స్వర్గములో దుందుభులు మ్రోగెను. పూల వాన కురిసెను (15). మిక్కిలి భయంకరము, అద్భుతము, ప్రకృతి శక్తులను బోలి దానవులను వినాశమొనర్చునది అగు ఆ స్కందుని సమరమును గాంచి (16), మహామారిచే చేయబడిన వినాశకరమగు ఆ ఉపద్రవమును కూడ గాంచి, అపుడు శంఖచూడుడు మిక్కిలి కోపించి వెంటనే స్వయముగా యుద్ధమునకు సన్నద్ధుడై (17), అనేక శస్త్రాస్త్రములతో గూడినది, దానవవీరులందరికీ అభయమునిచ్చునది, అనేక శ్రేష్ఠవస్తువులతో నిర్మితమైనది అగు శ్రేష్ఠవిమానమునెక్కి (18), మహావీరులతో గూడి యుద్ధరంగమునకు వెళ్లెను. ఆతడు ఆ విమానరూపమగు రథమధ్యములో నున్న వాడై ఆకర్ణాంతము నారిత్రాటిని లాగి బాణముల వర్షమును కురిపించెను (19). ఆతని ఆ బాణవర్షము భయంకరమైనది, నివారింపశక్యము కానిది. వధస్థానము వంటి ఆ యుద్ధభూమిలో మిక్కిలి భయంకరమగు చీకటి నెలకొనెను (20). దేవతలు, మరియు నందీశ్వరుడు మొదలగు ఇతరుల అందరు పరుగెత్తిరి. రణరంగములో స్కందుడు ఒక్కడు మాత్రమే నిలబడి యుండెను (21)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 874 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 37 🌴

🌻 Śaṅkhacūḍa fights with the full contingent of his army - 2 🌻


10. Many thousands of headless bodies danced in the battle field. There was a great tumult that terrified the cowards.

11. Again Kārttikeya became furiously angry and showered volleys of arrows. He struck crores of leaders of the Asuras within a trice.

12. The Dānavas wounded in their bodies by the numerous arrows of Kārttikeya fled in fright. Those who remained were killed.

13. Vṛṣaparvan, Vipracitti, Daṇḍa, and Vikampana fought with Kārttikeya by turns.

14. Mahāmāri also fought. She was never routed. All of them afflicted by Kārttikeya’s spear were wounded.

15. O sage, Mahāmārī and Skanda won the battle. Big wardrums were sounded in the heaven. Showers of flowers fell down.

16-17. On seeing the wonderfully terrible fight of Kārttikeya that caused wastage in the rank and file of the Dānavas like natural disasters, as well as the harassment and havoc wrought by Mahāmāri, Śaṅkhacūḍa became furious and himself got ready for the battle.

18-19. He got into his excellent aerial chariot that contained different weapons and missiles, that was set in diamond and that encouraged and emboldened the heroes. Śaṅkhacūḍa drew the string of the bow upto his ear and discharged volleys of arrows from his seat in the middle of the chariot. He was accompanied by many heroes.

20. His volley of arrows was terrifying. It could not be withstood. A terrible darkness spread in the battlefield.

21. The gods Nandīśvara and others fled. Only Kārttikeya stayed behind in the battle field.


Continues....

🌹🌹🌹🌹🌹

శ్రీమద్భగవద్గీత - 520: 13వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 520: Chap. 13, Ver. 31

 

🌹. శ్రీమద్భగవద్గీత - 520 / Bhagavad-Gita - 520 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 31 🌴

31. యదా భూతపృథ గ్భావమేకస్థ మనుపశ్యతి |
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ||


🌷. తాత్పర్యం : బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి, జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించిరో గాంచినపుడు బ్రహ్మభావమును పొందును.

🌷. భాష్యము : జీవుల వివిధ కోరికల ననుసరించియే వారి వివిధదేహములు సృజింపబడు చున్నవనియు, వాస్తవముగా ఆ దేహములన్నియు ఆత్మకు సంబంధించినవి కావనియు దర్శించగలిగినప్పుడే మనుజుడు నిజదృష్టి కలిగినవాడగును. భౌతికదృష్టిలో కొందరు జీవులు దేవతారూపమున, కొందరు మానవరూపమున, కొందరు శునక, మార్జాలాది రూపమున గోచరింతురు.

ఇట్టి దృష్టి భౌతికమేగాని వాస్తవదృష్టి కాదు. ఈ భేదభావనమునకు జీవితపు భౌతిక భావనయే కారణము. కాని వాస్తవమునకు దేహము నశించిన పిమ్మట మిగులునది ఆత్మ ఒక్కటియే. ఆ ఆత్మయే భౌతికప్రకృతి సంపర్కము వలన వివిధదేహములను పొందుచుండును. ఈ విషయములను గాంచగలిగినవాడు ఆధ్యాత్మికదృష్టిని బడయగలడు. ఈ విధముగా మనిషి, మృగము, పెద్ద, చిన్న మొదలుగు భేదభావముల నుండి ముక్తుడై, చైతన్యమును శుద్ధి పరచుకొనిన వాడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమున కృష్ణభక్తిభావనను వృద్ధిచేసికొనగలడు. అట్టి భక్తుడు ఏ విధముగా సర్వమును గాంచునో తరువాతి శ్లోకమున వివరింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 520 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 31 🌴

31. yadā bhūta-pṛthag-bhāvam eka-stham anupaśyati
tata eva ca vistāraṁ brahma sampadyate tadā


🌷 Translation : When a sensible man ceases to see different identities due to different material bodies and he sees how beings are expanded everywhere, he attains to the Brahman conception.

🌹 Purport : When one can see that the various bodies of living entities arise due to the different desires of the individual soul and do not actually belong to the soul itself, one actually sees. In the material conception of life, we find someone a demigod, someone a human being, a dog, a cat, etc. This is material vision, not actual vision.

This material differentiation is due to a material conception of life. After the destruction of the material body, the spirit soul is one. The spirit soul, due to contact with material nature, gets different types of bodies. When one can see this, he attains spiritual vision; thus being freed from differentiations like man, animal, big, low, etc., one becomes purified in his consciousness and able to develop Kṛṣṇa consciousness in his spiritual identity. How he then sees things will be explained in the next verse.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 13, APRIL 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 13, APRIL 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 520 / Bhagavad-Gita - 520 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 31 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 31 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 874 / Sri Siva Maha Purana - 874 🌹
🌻. స్కందశంఖచూడుల ద్వంద్వ యుద్ధము - 2 / Śaṅkhacūḍa fights with the full contingent of his army - 2 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 133 / Osho Daily Meditations  - 133 🌹
🍀 133. ఏమీ జరగడం లేదు / 133. NOTHING HAPPENING 🍀
4) 🌹 సిద్దేశ్వరయానం - 38🌹
5)🌹 అవగాహన మరియు పారవశ్యం ఒకటిగా మారుతుంది. / Awareness and Ecstasy Become One 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 540 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 540 - 2🌹 
🌻 540. 'స్మృతి' - 2 / 540. 'Smruti' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 520 / Bhagavad-Gita - 520 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 31 🌴*

*31. యదా భూతపృథ గ్భావమేకస్థ మనుపశ్యతి |*
*తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ||*

*🌷. తాత్పర్యం : బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి, జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించిరో గాంచినపుడు బ్రహ్మభావమును పొందును.*

*🌷. భాష్యము : జీవుల వివిధ కోరికల ననుసరించియే వారి వివిధదేహములు సృజింపబడు చున్నవనియు, వాస్తవముగా ఆ దేహములన్నియు ఆత్మకు సంబంధించినవి కావనియు దర్శించగలిగినప్పుడే మనుజుడు నిజదృష్టి కలిగినవాడగును. భౌతికదృష్టిలో కొందరు జీవులు దేవతారూపమున, కొందరు మానవరూపమున, కొందరు శునక, మార్జాలాది రూపమున గోచరింతురు.*

*ఇట్టి దృష్టి భౌతికమేగాని వాస్తవదృష్టి కాదు. ఈ భేదభావనమునకు జీవితపు భౌతిక భావనయే కారణము. కాని వాస్తవమునకు దేహము నశించిన పిమ్మట మిగులునది ఆత్మ ఒక్కటియే. ఆ ఆత్మయే భౌతికప్రకృతి సంపర్కము వలన వివిధదేహములను పొందుచుండును. ఈ విషయములను గాంచగలిగినవాడు ఆధ్యాత్మికదృష్టిని బడయగలడు. ఈ విధముగా మనిషి, మృగము, పెద్ద, చిన్న మొదలుగు భేదభావముల నుండి ముక్తుడై, చైతన్యమును శుద్ధి పరచుకొనిన వాడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమున కృష్ణభక్తిభావనను వృద్ధిచేసికొనగలడు. అట్టి భక్తుడు ఏ విధముగా సర్వమును గాంచునో తరువాతి శ్లోకమున వివరింపబడినది.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 520 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 31 🌴*

*31. yadā bhūta-pṛthag-bhāvam eka-stham anupaśyati*
*tata eva ca vistāraṁ brahma sampadyate tadā*

*🌷 Translation : When a sensible man ceases to see different identities due to different material bodies and he sees how beings are expanded everywhere, he attains to the Brahman conception.*

*🌹 Purport : When one can see that the various bodies of living entities arise due to the different desires of the individual soul and do not actually belong to the soul itself, one actually sees. In the material conception of life, we find someone a demigod, someone a human being, a dog, a cat, etc. This is material vision, not actual vision.*

*This material differentiation is due to a material conception of life. After the destruction of the material body, the spirit soul is one. The spirit soul, due to contact with material nature, gets different types of bodies. When one can see this, he attains spiritual vision; thus being freed from differentiations like man, animal, big, low, etc., one becomes purified in his consciousness and able to develop Kṛṣṇa consciousness in his spiritual identity. How he then sees things will be explained in the next verse.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 874 / Sri Siva Maha Purana - 874 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 37 🌴*

*🌻. స్కందశంఖచూడుల ద్వంద్వయుద్ధము - 2 🌻*

*ఆ యుద్ధములో వేలాది మొండెములు అనేక రకములుగా నాట్యమాడినవి. పిరికి వారికి భయమును గొల్పు పెద్ద కోలాహలము చెలరేగెను (10). మరల స్కందుడు పెద్దగా కోపించి బాణముల వర్షమును కురింపించి, క్షణకాలములో కోటి మంది రాక్షస వీరులను నేల గూల్చెను (11). స్కందుని బాణ పరంపరచే తెగిన దేహములు కలిగి మరణించగా మిగిలిన దానవులందరు అపుడు పారిపోయిరి (12). వృషపర్వుడు, విప్రచిత్తి, దండుడు మరయు వికంపనుడు అను వారందరు వరుసగా స్కందునితో యుద్ధమును చేసిరి. (13). మహామారి కూడ వెన్ను చూపకుండా యుద్ధమును చేసెను. స్కందుని శక్తి- ఆయుధముచే వారు తెగిన అవయవములు గలవారై అధికమగు పీడను పొందిరి (14).*

*ఓ మునీ! అపుడు మహామారి, స్కందుడు విజయమును పొందిరి. స్వర్గములో దుందుభులు మ్రోగెను. పూల వాన కురిసెను (15). మిక్కిలి భయంకరము, అద్భుతము, ప్రకృతి శక్తులను బోలి దానవులను వినాశమొనర్చునది అగు ఆ స్కందుని సమరమును గాంచి (16), మహామారిచే చేయబడిన వినాశకరమగు ఆ ఉపద్రవమును కూడ గాంచి, అపుడు శంఖచూడుడు మిక్కిలి కోపించి వెంటనే స్వయముగా యుద్ధమునకు సన్నద్ధుడై (17), అనేక శస్త్రాస్త్రములతో గూడినది, దానవవీరులందరికీ అభయమునిచ్చునది, అనేక శ్రేష్ఠవస్తువులతో నిర్మితమైనది అగు శ్రేష్ఠవిమానమునెక్కి (18), మహావీరులతో గూడి యుద్ధరంగమునకు వెళ్లెను. ఆతడు ఆ విమానరూపమగు రథమధ్యములో నున్న వాడై ఆకర్ణాంతము నారిత్రాటిని లాగి బాణముల వర్షమును కురిపించెను (19). ఆతని ఆ బాణవర్షము భయంకరమైనది, నివారింపశక్యము కానిది. వధస్థానము వంటి ఆ యుద్ధభూమిలో మిక్కిలి భయంకరమగు చీకటి నెలకొనెను (20). దేవతలు, మరియు నందీశ్వరుడు మొదలగు ఇతరుల అందరు పరుగెత్తిరి. రణరంగములో స్కందుడు ఒక్కడు మాత్రమే నిలబడి యుండెను (21)*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 874 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 37 🌴*

*🌻 Śaṅkhacūḍa fights with the full contingent of his army - 2 🌻*

10. Many thousands of headless bodies danced in the battle field. There was a great tumult that terrified the cowards.

11. Again Kārttikeya became furiously angry and showered volleys of arrows. He struck crores of leaders of the Asuras within a trice.

12. The Dānavas wounded in their bodies by the numerous arrows of Kārttikeya fled in fright. Those who remained were killed.

13. Vṛṣaparvan, Vipracitti, Daṇḍa, and Vikampana fought with Kārttikeya by turns.

14. Mahāmāri also fought. She was never routed. All of them afflicted by Kārttikeya’s spear were wounded.

15. O sage, Mahāmārī and Skanda won the battle. Big wardrums were sounded in the heaven. Showers of flowers fell down.

16-17. On seeing the wonderfully terrible fight of Kārttikeya that caused wastage in the rank and file of the Dānavas like natural disasters, as well as the harassment and havoc wrought by Mahāmāri, Śaṅkhacūḍa became furious and himself got ready for the battle.

18-19. He got into his excellent aerial chariot that contained different weapons and missiles, that was set in diamond and that encouraged and emboldened the heroes. Śaṅkhacūḍa drew the string of the bow upto his ear and discharged volleys of arrows from his seat in the middle of the chariot. He was accompanied by many heroes.

20. His volley of arrows was terrifying. It could not be withstood. A terrible darkness spread in the battlefield.

21. The gods Nandīśvara and others fled. Only Kārttikeya stayed behind in the battle field.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 133 / Osho Daily Meditations  - 133 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 133. ఏమీ జరగడం లేదు 🍀*

*🕉 నిశ్శబ్దంగా అనిపించడం కూడా ఒక జరగడమే మరియు ఇది ఇతర శబ్దాల కంటే గొప్ప జరగడం. 🕉*

*మీరు ఏడుస్తున్నప్పుడు లేదా అరుస్తున్నప్పుడు, ఏదో జరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. మీరు ఏడవనప్పుడు, అరవకుండా, కేకలు వేయనప్పుడు, గాఢమైన నిశ్శబ్దాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఏమీ జరగడం లేదని మీరు అనుకుంటారు. ఇది కూడా గొప్ప సంఘటన అని, మిగతా వాటి కంటే గొప్పదని మీకు తెలియదు. నిజానికి, ఆ ఇతర క్షణాలు దీనికి మార్గం సుగమం చేశాయి. ఇదే లక్ష్యం. అవి సాధనాలు మాత్రమే. కానీ మొదట్లో అది ఖాళీగా కనిపిస్తుంది, అంతా పోయినట్లు. మీరు కూర్చున్నారు, ఏమీ జరగడం లేదు. ఏమీ జరగడం లేదు, కానీ ఏమీ జరగకపోవడం సకారత్మకంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సకారత్మకమైన విషయం. బుద్ధుడు ఏదీ కానిదాన్ని నిర్వాణం, అంతిమమని పేర్కొన్నాడు. కాబట్టి దానిని అనుమతించండి, దానిని గౌరవించండి మరియు ఇది మరింత జరగనివ్వండి, దానిని స్వాగతించండి. ఇది జరిగినప్పుడు మీ కళ్ళు మూసుకుని ఆస్వాదించండి, తద్వారా ఇది తరచుగా వస్తుంది. ఇది నిధి. కానీ మొదట్లో, ఇది అందరికీ జరుగుతుందని నేను అర్థం చేసుకోగలను.*

*ప్రజలు విస్ఫోటకం అని పిలిచే అనేక అంశాలు ఉన్నాయి. అవి అదృశ్యమై అసలు విషయం వచ్చినప్పుడు, అది ఏమిటో వారికి ఏ మాత్రం తెలియదు అంతేకాక వారికి తమ విస్ఫోటకాల లోటు కలుగుతుంది. ఆ విస్ఫోటకాలు మళ్లీ జరగాలని వారు కోరుకుంటారు. వారు దాన్ని బలవంతం చేయడం మొదలుపెట్టి మొత్తం నాశనం చేస్తారు. కాబట్టి వేచి ఉండండి. ఏదైనా దానంతట అదే విస్ఫోటిస్తే పర్వాలేదు కానీ బలవంతం చేయకండి. నిశ్శబ్దం విస్ఫోటిస్తే, ఆస్వాదించండి. మీరు దాని గురించి సంతోషపడాలి! ఇది ప్రపంచ ప్రజల దుస్థితి-ఏది ఏమిటో తెలియదు, కాబట్టి కొన్నిసార్లు వారు దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు మరికొన్నిసార్లు వారు సంతోషంగా ఉండాల్సినప్పుడు, ఆనందం నిజంగా దగ్గరగా ఉన్నప్పుడు, దుఃఖానికి గురవుతారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 133 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 133. NOTHING HAPPENING 🍀*

*🕉  Feeling quiet is also a happening and it is a greater happening than other things that are noisy.  🕉*

*When you are crying or shouting, you feel that something is happening. When you are not crying, not shouting, not screaming, just feeling a deep silence, you think nothing is happening. You don't know that this too is a great happening, greater than the others. In fact, those other moments have paved the way for this one. This is the goal. They are just the means. But in the beginning it will look empty, everything gone. You are sitting, and nothing is happening. Nothing is happening, and "nothing" is very positive. It is the most positive thing in the world. Buddha has called that nothing is Nirvana, the Ultimate. So allow it, cherish it, and let it happen more, welcome it. When it happens just close your eyes and enjoy it so it comes more often. This is the treasure. But in the beginning, I can understand, it happens to everybody.*

*There are many things people call explosions. When they disappear and the real thing comes, they don't have any notion of what it is and they simply miss their explosions. They would like those explosions to happen again. They may even start forcing them, but they will destroy the whole thing. So wait. If something explodes on its own, it is okay, but don't force it. If silence is exploding, enjoy it. You should be happy about it !  This is the misery of the world-people don't know what is what, so sometimes they are happy when they are miserable and sometimes when they should be happy, when happiness is really close, they become miserable.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 38 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
       
*🏵 5వ శతాబ్దం నుండి 🏵*

*కాలభైరవమంత్ర సాధన చేయాలి. స్త్రీ పురుషులిద్దరూ భైరవ మంత్రజపం చేయాలి. దీనివల్ల సంతృప్తుడైన భైరవుడు నీకు దివ్య శక్తులిస్తాడు. అధర్మాన్ని జయించటానికి తప్పనిసరి పరిస్థితిలో దీనిని అనుసరించ వలసి వస్తున్నది. దీనిని ధర్మసూక్ష్మం అని గాని మహాధర్మమని గాని చెప్పవచ్చు. దీనికి ధర్మ విరుద్ధం కాని మార్గం నేను చెపుతాను. దానిని నాగ పురోహితుడు కూడ వినాలి." అని అతనిని పిలిపించాడు బోయాంగ్. “నాగయాజీ! మీరు శుక్రాచార్యుని వంశం వారు. చాలా యజ్ఞాలు చేశారు. చేయించారు. కనుక ఈ పేరు సార్థకమైనది. ఇతడూ భార్గవుడే. చ్యవనుని నుండి వచ్చిన వాడు. మీరూ కవి నుండి వచ్చిన వారు. కవి, చ్యవనుడు ఇద్దరు భృగుపుత్రులే. అది అలా ఉంచి రాక్షసులలో ఒక అత్యంత రహస్య ప్రయత్నం జరుగుతున్నది. అసుర మాంత్రికులు తమ సర్వ శక్తులు వినియోగించి ఒక దైత్య కన్యలో కాళీదేవిని ఆవాహనం చేస్తున్నారు.*

*సాక్షాత్తు మహాకాళి ఆమెను ఆవహిస్తున్నది. మీతో జరగబోయే మహాయుద్ధంలో అత్యవసర సమయంలో ఆమెను రణరంగానికి తీసుకువస్తారు. ఆమె దిగంబర ముక్త కేశ. చంపబడిన వారి బాహువులను నడుముకు కాంచికగా ధరించి ఉంటుంది. ఆమె నోటిలోనుండి మంటలు వస్తుంటవి. ఆమె చేతులలోకి వాటంతట అవి ఖడ్గశూలాదులు వస్తుంటవి. వాటితో ఆమె మీ సైన్యమును సంహరిస్తూ ఉంటుంది. మీ ఆయుధములు ఆమె మీద పనిచేయవు. ఆమె అజేయ పరాక్రమ. ఆమెకు సమరములో హరసిద్ధుడు కూడ చాలడు. హరసిద్ధునిలో భైరవుడు వచ్చినిలుచుంటే అతడు భర్త గనుక ఆమె యుద్ధం ఆపుతుంది. కనుక హరసిద్ధుడింక సిద్ధ భైరవుడు కావాలి. ఇక్కడి భైరవస్పర్శతో ఆ కార్యక్రమం మొదలైంది. భైరవుడు యుద్ధవీరుడు కూడా. పూర్వం నరకాసురుడు చేసిన సాధనలను గూర్చి మీరు వినే ఉంటారు.*

*కాళీదేవి అతనికి నిత్యయౌవనాన్ని, మహత్తర పరాక్రమాన్ని ఇచ్చింది అయితే రాజకన్యలను బలవంతంగా తెచ్చి మానభంగం చేసిన పాపానికి, ఇతర దుష్కృత్యాలకు శ్రీకృష్ణుని వలన సంహరించబడినాడు. ఇక్కడ ఆ సాధన మార్గము వరకు తీసుకోవాలి. కాళీ మంత్రం బదులు భైరవ మంత్రంతో చెయ్యాలి. దానికి కూడా అధర్మ మార్గం అక్కరలేదు. రాజకుమారి హిరణ్మయితో ఈ సాధన చేయవచ్చు. ధర్మయుక్తం కావటం కోసం వీరిద్దరి పెండ్లి చేయండి. కానీ ఈ వివాహ విషయం బయటకు పొక్కితే రాక్షసులు వెంటనే యుద్ధానికి వస్తారు. అలావస్తే మీరు తట్టుకోలేరు. కనుక కొద్ది రోజులలో కామాఖ్యలో కాళీ ఉత్సవాలు జరుగుతవి. అప్పుడప్పుడు మీ రాజుగారికి సకుటుంబంగా వెళ్ళి వాటిని వైభవోపేతంగా చేయించటం అలవాటే గదా! ఈ సారి అలానే వెళ్ళండి.*

*రహస్యంగా అక్కడి మీ భవనంలో కళ్యాణం చేయించండి. ఉత్సవాలు కాగానే మీరు రాజధానికి వెళ్ళవచ్చు. రాజకుమారి మీతోరాదు. తన భర్తయైన హరసిద్ధునితో రహస్యంగా హిమాలయాలలోని కైలాస పర్వత ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ సామాన్య మానవులు వెళ్ళలేని ఒక భైరవాలయం ఉన్నది. మహా సిద్ధుడైన మత్స్యేంద్రనాథుడు నిర్మించి ప్రతిష్ఠించిన భైరవవిగ్రహం ఆ మందిరంలో ఉంది. ఆ దేవుని వాహనమైన శ్వానరాజు స్వర్ణ విగ్రహమై గుడిలో రక్షకునిగా ఉన్నాడు. (ఇటీవల ఆ స్వర్ణవిగ్రహం దొరికితే భక్తులు దలైలామాకు తెలియబరిచారు. ఆయన దానిని అక్కడే ఉంచి పూజించమన్నారు. చైనా ప్రభుత్వం టిబెట్ను ఆక్రమించిన తరువాత అది యేమైనదో? ఒక చైనా సైనికుడు ఆ విగ్రహంలోకి తుపాకి బాయినెట్ గ్రుచ్చగా దానిలోనుండి నెత్తురుకారింది. ఎంత పని చేశావురా దుర్మార్గుడా! అని మాటలు వినిపించినవి. ఆ భటుడు మరణించాడు వెంటనే. ఇక దాని జోలికెవ్వరూ పోలేదు. ఆ గుడిని బౌద్ధులు బుద్ధుని ఆలయంగా పిలుస్తున్నారు. భోజారానాథ్ అన్నది టిబెట్ వారు పిలిచే పేరు. నాథ సంప్రదాయ చిహ్నం) భోజారనాధుని ఆలయంలో హిరణ్మయీ హరసిద్ధులు భైరవతంత్రం అనుష్ఠించాలి. ఆ పద్ధతులు నీకు నేను ఉపదేశిస్తాను.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అవగాహన మరియు పారవశ్యం ఒకటిగా మారుతుంది. / Awareness and Ecstasy Become One 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*'మీరు ఆనందంతో, పారవశ్యంతో ప్రవహిస్తున్నప్పుడు, అది నిజంగా ఎక్కువగా ఎరుకగా ఉండ వలసిన, మరియు అవగాహన చేసుకోవలసిన క్షణం. కానీ ప్రజలు సరిగ్గా వ్యతిరేకం చేస్తారు. సంతోషంగా ఉన్నప్పుడు అవగాహన గురించి ఎవరూ పట్టించుకోరు. అదే వారు వేదనలో ఉన్నప్పుడు, వారు ఖచ్చితంగా తెలుసుకోవడం మరియు వేదన నుండి బయట పడవలసిన సమయం అని ఆలోచించడం ప్రారంభిస్తారు. కానీ ఆ బాధ నుంచి ఎవరూ నేరుగా బయటపడలేక పోయారు.*

*“మొదట, పారవశ్యత నుండి బయటపడి అవగాహన వైపు మీ దృష్టి పెట్టాలి. మీరు మీ ఆనందకరమైన క్షణాల గురించి లోతుగా తెలుసుకో గలిగితే, నిరాశ, పతనాలు మీ జీవితంలోకి రావు. అదే వేదన నుండి బయటపడటానికి తలుపు. కాబట్టి ఇది సరళమైన మార్గం:*
*'సంతోషంగా ఉన్నప్పడు, గమనింపుగా ఉండండి.'*
*'ఆనందంగా ఉన్నప్పుడు, అవగాహనతో ఉండండి.'*
*'ప్రేమిస్తున్నప్పుడు, ఎరుకతో ఉండండి.'*

*'అవగాహనను ఒక రకమైన భంగం' అని చెప్పి పక్కన పెట్టవద్దు; నేను గొప్ప పారవశ్యంలో ఉన్నాను.’ అనే ఎరుక కలవరంలా మారుతుంది అనిపిస్తుంది; కానీ అలా జరగదు. ఇది ప్రారంభంలో అలా కనిపించ వచ్చు, కానీ త్వరలో ఇది మీ పారవశ్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని మీరు చూస్తారు. అంతిమంగా అవగాహన మరియు పారవశ్యం ఒకటిగా మారతాయి. అప్పుడు పతనాలు, నిస్పృహ క్షణాలు, వేదనలు అన్నీ మాయమవుతాయి.*
🌹🌹🌹🌹🌹

*🌹 Awareness and Ecstasy Become One 🌹*

*“When you are flowing with joy, blissfulness, that is the moment to be aware, but people do exactly the opposite. When they are happy who cares about awareness? And when they are in anguish, then certainly they start thinking it is time to be aware and get out of anguish. But nobody has ever been able to get out from anguish directly.*

*“First, one has to get into awareness from ecstasy. If you can be aware of your joyful moments in the first place, the depression, the downs will not come. The door to awareness is in ecstacy. So this is the simplest way:*
*“Be happy and be aware."*
" “Rejoice and be aware."*
*“Love and be aware."*

*“Don’t put awareness aside saying, ‘This is a kind of disturbance; I am in such a great ecstasy.’ Awareness becomes like a disturbance; it is not. It may appear like this in the beginning, but soon you will see it will take your ecstasy to higher peaks. Ultimately awareness and ecstasy become one. Then those downs, depressive moments, agonies disappear.”*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 540 - 2  / Sri Lalitha Chaitanya Vijnanam  - 540 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*
*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*

*🌻 540. 'స్మృతి' - 2 🌻*

*అహంకారము కారణముగ విద్యలు రాణింపవు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారమూర్తులు కూడ సద్గురువుల నాశ్రయించిరి. శుశ్రూషలు చేసిరి. వినయము గలవారికే విద్య అని తెలియవలెను. సంపదలలో వినయ సంపద చాల గొప్పది. శ్రీమాతయే స్మృతి, శ్రుతి రూపము గనుక ఆమెను భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయువారు సర్వవిద్యల సారమును పొందగలరు. భక్తులీ మార్గముననే సర్వవిద్యలను నేర్చిరి. శ్రీమాత సర్వవిద్యా స్వరూపిణి కదా! ఆమెను గూర్చిన శ్రవణము, స్మరణము వలన కూడ జీవులు పూర్ణ వికాసము చెందుదురు. ఇదియునూ సదాచారమే. శ్రుతి స్మృతులు జీవుల మేధస్సును క్రమముగ వృద్ధి పరచుచూ తరింపజేయును. తరువాత నామము దీనినే ప్రతిపాదించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 540 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*
*svahasvadha amati rmedha shrutih smrutir anuttama ॥110 ॥ 🌻*

*🌻 540. 'Smruti' - 2 🌻*

*Skills do not succeed because of pride. Incarnations like Lord Rama and Lord Krishna also submitted to sadgurus. Did service to them. Education is only for the humble. The wealth of humility is the greatest of all riches. As Srimata is the form of Smriti and Sruti, those who worship her with devotion can attain the essence of all knowledge. Devotees have attained knowledge through this method. Isn't Srimata the epitome of knowledge! By listening to and recollecting about her, living beings also develop knowledge. This is also a good practice. Sruti Smritis gradually expand the knowledge of living beings. The next name suggests this.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj