శ్రీ లలితా సహస్ర నామములు - 86 / Sri Lalita Sahasranamavali - Meaning - 86
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 86 / Sri Lalita Sahasranamavali - Meaning - 86 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀
🍀 393. ప్రభావతీ -
వెలుగులు విరజిమ్ము రూపము గలది.
🍀 394. ప్రభారూపా -
వెలుగుల యొక్క రూపము.
🍀 395. ప్రసిద్ధా -
ప్రకృష్టముగా సిద్ధముగా నున్నది.
🍀 396. పరమేశ్వరీ -
పరమునకు అధికారిణి.
🍀 397. మూలప్రకృతిః -
అన్ని ప్రకృతులకు మూలమైనది.
🍀 398. అవ్యక్తా -
వ్యక్తము కానిది.
🍀 399. వ్యక్తావ్యక్తస్వరూపిణీ -
వ్యక్తమైన, అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగా నున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 86 🌹
📚. Prasad Bharadwaj
🌻 86. prabhāvatī prabhārūpā prasiddhā parameśvarī |
mūlaprakṛtir avyaktā vyaktāvyakta-svarūpiṇī || 86 ||
🌻 393 ) Prabhavathi -
She who is lustrous of supernatural powers
🌻 394 ) Prabha roopa -
She who is personification of the light provided by super natural powers
🌻 395 ) Prasiddha -
She who is famous
🌻 396 ) Parameshwari -
She who is the ultimate goddess
🌻 397 ) Moola prakrithi -
She who is the root cause
🌻 398 ) Avyaktha -
She who is not clearly seen
🌻 399 ) Vyktha Avyaktha swaroopini -
She who is visible and not visible
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
07 Jun 2021
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 37
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 37 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. చంచలత్వము - స్థిరత్వము 🌻
లక్ష్మీదేవి జీవులయందు చంచలత్వము వహించును. అనగా జీవులు కోరికల రూపమున లక్ష్మిని స్థిరముగ పట్టుకొనలేరు.
ఆమె మాత్రము జీవులందరిలో ఈశ్వరుడై ప్రకాశించుచున్న వానిని భర్తగా నమ్మి స్థిరత్వము చెందియున్నది. అట్టివానిని కౌగలించిన వారే స్థిరత్వము చెందుదురు కాని, లక్ష్మియందు దృష్టి నిలిపిన వారు చాంచల్యముతో తిరుగాడుదురు.
కనుక శ్రీకృష్ణుని యందు నిష్ఠ నిలిపిన వారందరు వానికి భార్యలు. కొందరు జ్ఞానస్వరూపుడుగను , కొందరు సౌందర్య స్వరూపుడుగను , కొందరు తమ పరిజనుల యందు అంతర్యామి స్వరూపుడుగను దర్శించి ఉపాసించుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
07 Jun 2021
శ్రీ శివ మహా పురాణము - 409
🌹 . శ్రీ శివ మహా పురాణము - 409🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 22
🌻. పార్వతీ తపోవర్ణనము - 5 🌻
ఈ విధముగా ఆ కాళీ మహేశ్వరుని ధ్యానిస్తూ తపోవనములో తపస్సును చేయుచుండగా మూడువేల సంవత్సరములు గడచిపోయినవి (52). ఏ స్థానములో శివుడు అరవై వేల సంవత్సరములు తపస్సును చేసెనో, అదే స్థానమునందు ఆ పార్వతి కొంతసేపు కూర్చుండి ఇట్లు తలపోసెను (53).
ఓ మహాదేవా! నేను చిరకాలము నుండియు తపస్సును చేయుచున్ననూ నీవు నన్ను అనుగ్రహించ లేదు. నేనీ నియమములో ఉన్నాను అను విషయము నీకు ఇంత వరకు తెలియదా యేమి (54) లోకములోని భక్తులు, వేదములు మరియు మహర్షులు శంకరుడు, కైలాసగిరివాసి సర్వజ్ఞుడనియు, సర్వుల ఆత్మరూపుడనియు, సర్వసాక్షి అనియూ సర్వదా కీర్తించుచుందురు (55).
ఆ దేవుడు సర్వ సంపదలనిచ్చువాడు, అందరి మనస్సులోని భావముల నెరుంగువాడు, నిత్యము భక్తుల కోర్కెలనీడేర్చి క్లేశములనన్నిటినీ తొలగించువాడు (56). నేను కోర్కెలనన్నిటినీ విడిచి పెట్టి శివుని యందు అనురాగము కలిగియున్న దాననైనచో వృషభధ్వజుడగు ఆ శంకరుడు నన్ను అనుగ్రహించుగాక! (57)
నారదుడు ఉపదేశించిన పంచాక్షరీ మంత్రమును నేను తంత్ర పూర్వకముగా చక్కని భక్తితో యథావిధిగా ప్రతిదినము జపించి యున్నచో, శంకరుడు ప్రసన్నుడగుగాక! (58) నేను సర్వేశ్వరుడగు శివుని భక్తితో వికారములు లేనిదాననై యథావిధిగా ఆరాధించి యున్నచో, శంకరుడు ప్రసన్నుడగు గాక! (59) ఆమె తలను వంచుకొని, వికారములు లేనిదై జటలను నారబట్టలను ధరించి ఇట్లు నిత్యము తలపోయిచూ చిరకాలము తపస్సును చేసెను (60).
ఆమె ఆ విధముగా మునులకు కూడ చేయ శక్యము గాని తపస్సును చేసెను. అచటి వ్యక్తులు ఆమె తపస్సు గుర్తుకు వచ్చినపుడు గొప్ప ఆశ్చర్యమును పొందెడివారు (61) వారందరు ఆమె తపస్సును చూచుటకి వచ్చి తాము ధన్యులమైతిమని తలపోయుచూ పరస్పరము ఆమె తపస్సును గురించి చర్చించుకొనెడివారు. ఆమె తపోమహిమ విషయములో వారికి ఒకే అభిప్రాయముండెడిది (62).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
07 Jun 2021
గీతోపనిషత్తు -209
🌹. గీతోపనిషత్తు -209 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 46, 47, Part 5
🍀 45-5. యోగీభవ - కర్మము సుళువు తెలిసి కర్మమున నిలచి, దానముల విలువ తెలిసి, దానధర్మాదుల నాచరించుచు, ద్వంద్వముల మాయ తెలిసి వానియందు సమ్యక్ న్యాసము చెంది, తద్వారమున యతచిత్తుడై బుద్ధిని చేరి, బుద్ధియను వెలుగు మూలమును ధారణచేసి, ధ్యానించి ఆత్మగ తనను తాను తెలియుట ఈ మొత్తము సాధన. 🍀
ఆత్మ సంయమ యోగము అను ఈ ఆరవ అధ్యాయము ధ్యాన యోగమని పిలుతురు. ఆత్మ సంయమమునకు వలసిన సూత్రము లన్నియు ఈ ఆరు అధ్యాయముల యందు భగవంతుని పలుకులుగ తెలుపబడినవి. ఇవి అత్యంత గంభీరములు. ఇందలి రహస్యము లన్నియు శ్రద్ధ గలవారికి గోచరింపగలవు. వానిని భక్తి శ్రద్ధలతో అభ్యసించువాడు తప్పక యోగి కాగలడు.
ఈ సూత్రములు ఆచరణకే గాని పారాయణకు కాదు. ఆచరించినవారు తరించుట తథ్యము. ఆచరించని వారు తరించకుండుట కూడ తథ్యము. గీతా సూత్రములను అవగాహన చేసుకొనుట, ధీరతతో ఆచరించుట తరుణోపాయము. ఈ సూత్రముల వైశిష్యము లెక్క చేయక దొడ్డిదారులలో గమ్యమును చేరవలెనని భావించువారు తమకు తాము మోసగించుకొనువారు.
కర్మము సుళువు తెలిసి కర్మమున నిలచి, దానముల విలువ తెలిసి, దానధర్మాదుల నాచరించుచు, ద్వంద్వముల మాయ తెలిసి వానియందు సమ్యక్ న్యాసము చెంది, తద్వారమున యతచిత్తుడై బుద్ధిని చేరి, బుద్ధియను వెలుగు మూలమును ధారణచేసి, ధ్యానించి ఆత్మగ తనను తాను తెలియుట ఈ మొత్తము సాధన.
క్రమము నంతయు విపులముగ, విశిష్టముగ దైవ మెరిగించినాడు. కావున ఈ ఆరు అధ్యాయములను సాధన షట్కమని పేర్కొనిరి. ఆచరించి తరించుటకు భగవద్గీతకన్న మించిన గ్రంథము ప్రపంచములో లేదు. ఇది ముమ్మాటికిని సత్యము. పాఠకులు గ్రహించి, ధీరతతో ఆచరించి తరింతురు గాక!
శ్రీమద్భగవద్గీత యందలి 6వ అధ్యాయము 'ధ్యాన యోగ' వివరణము సంపూర్ణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
07 Jun 2021
7-JUNE-2021 MESSAGES
1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 209🌹
2) 🌹. శివ మహా పురాణము - 409🌹
3) 🌹 Light On The Path - 156🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -37🌹
5) 🌹 Osho Daily Meditations - 26🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 86 / Lalitha Sahasra Namavali - 86🌹
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 86 / Sri Vishnu Sahasranama - 86🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -209 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 46, 47, Part 5
*🍀 45-5. యోగీభవ - కర్మము సుళువు తెలిసి కర్మమున నిలచి, దానముల విలువ తెలిసి, దానధర్మాదుల నాచరించుచు, ద్వంద్వముల మాయ తెలిసి వానియందు సమ్యక్ న్యాసము చెంది, తద్వారమున యతచిత్తుడై బుద్ధిని చేరి, బుద్ధియను వెలుగు మూలమును ధారణచేసి, ధ్యానించి ఆత్మగ తనను తాను తెలియుట ఈ మొత్తము సాధన. 🍀*
ఆత్మ సంయమ యోగము అను ఈ ఆరవ అధ్యాయము ధ్యాన యోగమని పిలుతురు. ఆత్మ సంయమమునకు వలసిన సూత్రము లన్నియు ఈ ఆరు అధ్యాయముల యందు భగవంతుని పలుకులుగ తెలుపబడినవి. ఇవి అత్యంత గంభీరములు. ఇందలి రహస్యము లన్నియు శ్రద్ధ గలవారికి గోచరింపగలవు. వానిని భక్తి శ్రద్ధలతో అభ్యసించువాడు తప్పక యోగి కాగలడు.
ఈ సూత్రములు ఆచరణకే గాని పారాయణకు కాదు. ఆచరించినవారు తరించుట తథ్యము. ఆచరించని వారు తరించకుండుట కూడ తథ్యము. గీతా సూత్రములను అవగాహన చేసుకొనుట, ధీరతతో ఆచరించుట తరుణోపాయము. ఈ సూత్రముల వైశిష్యము లెక్క చేయక దొడ్డిదారులలో గమ్యమును చేరవలెనని భావించువారు తమకు తాము మోసగించుకొనువారు.
కర్మము సుళువు తెలిసి కర్మమున నిలచి, దానముల విలువ తెలిసి, దానధర్మాదుల నాచరించుచు, ద్వంద్వముల మాయ తెలిసి వానియందు సమ్యక్ న్యాసము చెంది, తద్వారమున యతచిత్తుడై బుద్ధిని చేరి, బుద్ధియను వెలుగు మూలమును ధారణచేసి, ధ్యానించి ఆత్మగ తనను తాను తెలియుట ఈ మొత్తము సాధన.
క్రమము నంతయు విపులముగ, విశిష్టముగ దైవ మెరిగించినాడు. కావున ఈ ఆరు అధ్యాయములను సాధన షట్కమని పేర్కొనిరి. ఆచరించి తరించుటకు భగవద్గీతకన్న మించిన గ్రంథము ప్రపంచములో లేదు. ఇది ముమ్మాటికిని సత్యము. పాఠకులు గ్రహించి, ధీరతతో ఆచరించి తరింతురు గాక!
శ్రీమద్భగవద్గీత యందలి 6వ అధ్యాయము 'ధ్యాన యోగ' వివరణము సంపూర్ణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 409🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 22
*🌻. పార్వతీ తపోవర్ణనము - 5 🌻*
ఈ విధముగా ఆ కాళీ మహేశ్వరుని ధ్యానిస్తూ తపోవనములో తపస్సును చేయుచుండగా మూడువేల సంవత్సరములు గడచిపోయినవి (52). ఏ స్థానములో శివుడు అరవై వేల సంవత్సరములు తపస్సును చేసెనో, అదే స్థానమునందు ఆ పార్వతి కొంతసేపు కూర్చుండి ఇట్లు తలపోసెను (53).
ఓ మహాదేవా! నేను చిరకాలము నుండియు తపస్సును చేయుచున్ననూ నీవు నన్ను అనుగ్రహించ లేదు. నేనీ నియమములో ఉన్నాను అను విషయము నీకు ఇంత వరకు తెలియదా యేమి (54) లోకములోని భక్తులు, వేదములు మరియు మహర్షులు శంకరుడు, కైలాసగిరివాసి సర్వజ్ఞుడనియు, సర్వుల ఆత్మరూపుడనియు, సర్వసాక్షి అనియూ సర్వదా కీర్తించుచుందురు (55).
ఆ దేవుడు సర్వ సంపదలనిచ్చువాడు, అందరి మనస్సులోని భావముల నెరుంగువాడు, నిత్యము భక్తుల కోర్కెలనీడేర్చి క్లేశములనన్నిటినీ తొలగించువాడు (56). నేను కోర్కెలనన్నిటినీ విడిచి పెట్టి శివుని యందు అనురాగము కలిగియున్న దాననైనచో వృషభధ్వజుడగు ఆ శంకరుడు నన్ను అనుగ్రహించుగాక! (57)
నారదుడు ఉపదేశించిన పంచాక్షరీ మంత్రమును నేను తంత్ర పూర్వకముగా చక్కని భక్తితో యథావిధిగా ప్రతిదినము జపించి యున్నచో, శంకరుడు ప్రసన్నుడగుగాక! (58) నేను సర్వేశ్వరుడగు శివుని భక్తితో వికారములు లేనిదాననై యథావిధిగా ఆరాధించి యున్నచో, శంకరుడు ప్రసన్నుడగు గాక! (59) ఆమె తలను వంచుకొని, వికారములు లేనిదై జటలను నారబట్టలను ధరించి ఇట్లు నిత్యము తలపోయిచూ చిరకాలము తపస్సును చేసెను (60).
ఆమె ఆ విధముగా మునులకు కూడ చేయ శక్యము గాని తపస్సును చేసెను. అచటి వ్యక్తులు ఆమె తపస్సు గుర్తుకు వచ్చినపుడు గొప్ప ఆశ్చర్యమును పొందెడివారు (61) వారందరు ఆమె తపస్సును చూచుటకి వచ్చి తాము ధన్యులమైతిమని తలపోయుచూ పరస్పరము ఆమె తపస్సును గురించి చర్చించుకొనెడివారు. ఆమె తపోమహిమ విషయములో వారికి ఒకే అభిప్రాయముండెడిది (62).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 156 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 When the disciple is ready to learn, then he is accepted, acknowledged, recognized. It must be so, for he has lit his lamp, and it cannot be hidden. - 7 🌻*
568. So I would say to those who grumble at what they consider faults in disciples, and say they ought not to be chosen: “You must be taking a partial view; you are using your intellect in a line where it is not useful.
If you know of the existence of the Masters, and understand anything of Their powers, you may be very sure that They know exactly what They are doing; and if you do not see what it is, after all it is not essential that you should. They know; that is the important thing.” The recognition is not always made known at once to the disciple.
The ordinary course is that a man who has shown himself worthy of the high honour of discipleship is brought somehow into close touch with one who is already a disciple of his future Master, and the Master through that disciple usually gives some instructions to him. Probably the Master will say to the older disciple: “Bring so-and-so to me astrally one night.”
The man is brought, and then the Master says to him: I have been watching your work, and I think that you can perhaps make a further advancement. I offer you the position of a probationary pupil if you will undertake to devote all your energies, or as much as you can, to the service of humanity, in a direction which I shall indicate.”
That is the most usual procedure, but sometimes such a recognition as that comes only after a very long period. And even then there may be reasons why the man should know nothing of it in his waking consciousness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 37 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. చంచలత్వము - స్థిరత్వము 🌻*
లక్ష్మీదేవి జీవులయందు చంచలత్వము వహించును. అనగా జీవులు కోరికల రూపమున లక్ష్మిని స్థిరముగ పట్టుకొనలేరు.
ఆమె మాత్రము జీవులందరిలో ఈశ్వరుడై ప్రకాశించుచున్న వానిని భర్తగా నమ్మి స్థిరత్వము చెందియున్నది. అట్టివానిని కౌగలించిన వారే స్థిరత్వము చెందుదురు కాని, లక్ష్మియందు దృష్టి నిలిపిన వారు చాంచల్యముతో తిరుగాడుదురు.
కనుక శ్రీకృష్ణుని యందు నిష్ఠ నిలిపిన వారందరు వానికి భార్యలు. కొందరు జ్ఞానస్వరూపుడుగను , కొందరు సౌందర్య స్వరూపుడుగను , కొందరు తమ పరిజనుల యందు అంతర్యామి స్వరూపుడుగను దర్శించి ఉపాసించుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 26 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 PLAYING A ROLE 🍀*
*🕉 Play, but play knowingly. Play your Barnes, whatever they are; don’t repress them. Play them as perfectly as possible, but stay fully alert. Enjoy it, and others will also enjoy it. 🕉*
When a person plays a role there is some reason in it. That role has some significance to the person. If the game is played perfectly, something from the unconscious will disappear, evaporate, and you will be freed from a burden.
For example, if you want to play like a child, that means that in your childhood something has remained incomplete. You could not be a child as you wanted to be; somebody stopped you. People made you more serious, forced you to appear more adult and mature than you were.
Something has remained incomplete. That incompletion demands to be completed and it will continue to haunt you. So finish it. Nothing is wrong in it. You could not be a child that time, back in the past; now you can be. Once you can be totally in it, you will see that it has disappeared and will never come again.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 86 / Sri Lalita Sahasranamavali - Meaning - 86 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।*
*మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀*
🍀 393. ప్రభావతీ -
వెలుగులు విరజిమ్ము రూపము గలది.
🍀 394. ప్రభారూపా -
వెలుగుల యొక్క రూపము.
🍀 395. ప్రసిద్ధా -
ప్రకృష్టముగా సిద్ధముగా నున్నది.
🍀 396. పరమేశ్వరీ -
పరమునకు అధికారిణి.
🍀 397. మూలప్రకృతిః -
అన్ని ప్రకృతులకు మూలమైనది.
🍀 398. అవ్యక్తా -
వ్యక్తము కానిది.
🍀 399. వ్యక్తావ్యక్తస్వరూపిణీ -
వ్యక్తమైన, అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగా నున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 86 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 86. prabhāvatī prabhārūpā prasiddhā parameśvarī |*
*mūlaprakṛtir avyaktā vyaktāvyakta-svarūpiṇī || 86 ||
🌻 393 ) Prabhavathi -
She who is lustrous of supernatural powers
🌻 394 ) Prabha roopa -
She who is personification of the light provided by super natural powers
🌻 395 ) Prasiddha -
She who is famous
🌻 396 ) Parameshwari -
She who is the ultimate goddess
🌻 397 ) Moola prakrithi -
She who is the root cause
🌻 398 ) Avyaktha -
She who is not clearly seen
🌻 399 ) Vyktha Avyaktha swaroopini -
She who is visible and not visible
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 86 / Sri Vishnu Sahasra Namavali - 86 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*శ్రవణం నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*
*🍀 86. సువర్ణ బిందు రక్షోభ్య: సర్వనాగీశ్వరేశ్వర:
మహాహ్రాదో మహాగర్తో మహాభూతో మహానిధి: !!86!! 🍀*
🍀 800. సువర్ణబిందుః -
బంగారు అవయువములు గలవాడు.
🍀 801. అక్షోభ్యః -
క్షోభ తెలియనివాడు.
🍀 802. సర్వవాగీశ్వరేశ్వరః -
వాక్పతులైన బ్రహ్మాదులకు కూడా ప్రభువైనవాడు.
🍀 803. మహాహ్రదః -
గొప్ప జలాశయము వంటివాడు.
🍀 804. మహాగర్తః -
అగాధమైన లోయ వంటివాడు.
🍀 805. మహాభూతః-
పంచభూతములకు అతీతమైనవాడు.
🍀 806. మహానిధిః -
సమస్త భూతములు తనయందు వున్నవాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 86 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Sravana 2nd Padam*
*🌻 suvarṇabindurakṣōbhyaḥ sarvavāgīśvareśvaraḥ |*
*mahāhradō mahāgartō mahābhūtō mahānidhiḥ || 86 || 🌻*
🌻 800. Suvarṇabinduḥ:
One whose 'Bindus' that is, limbs, are euaql to gold in brilliance.
🌻 801. Akṣobhyaḥ:
One who is never perturbed by passions like attachment and aversion, by objects of the senses like sound, taste, etc., and by Asuras the antagonists of the Devas.
🌻 802. Sarva-vāgīśvareśvaraḥ:
One who is the master of all masters of learning, including Brahma.
🌻 803. Mahāhradaḥ:
He is called a great Hrada (lake), because being the paramatman who is of the nature of Bliss, the Yogis who contemplate upon Him dip themselves in that lake of Bliss and attain to great joy.
🌻 804. Mahāgartaḥ:
One whose Maya is difficult to cross like a big pit.
🌻 805. Mahābhūtaḥ:
One who is not divided by the three periods of time - past, present and future.
🌻 806. Mahānidhiḥ:
One in whom all the great elements have their support. He is Mahan or a great one and 'Nidhi', the most precious one.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)