1) 🌹 శ్రీమద్భగవద్గీత - 471 / Bhagavad-Gita - 471🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 259🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 139 🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 161🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 75 / Sri Lalita Sahasranamavali - Meaning - 75🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 78 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 48🌹
8) 🌹. శివగీత - 44 / The Shiva-Gita - 44🌹
9) 🌹. సౌందర్య లహరి - 86 / Soundarya Lahari - 86🌹
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 26🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 386 / Bhagavad-Gita - 386🌹
12) 🌹. శివ మహా పురాణము - 207🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 83 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 78 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 94 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 25🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 43 🌹
18) 🌹. అద్భుత సృష్టి - 15 🌹
19) 🌹 Seeds Of Consciousness - 158🌹
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 37🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 14 📚
22)
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 471 / Bhagavad-Gita - 471 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 16 🌴*
16. బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ |
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్ ||
🌷. తాత్పర్యం :
పరమాత్ముడు స్థావర, జంగములైన సర్వజీవుల అంతర్భాహ్యములలో నిలిచియుండును. సూక్ష్మత్వకారణముగా అతడు భౌతికేంద్రియములకు అగోచరుడును, ఆగ్రాహ్యుడును అయియున్నాడు. అతిదూరమున ఉన్నను అతడు సర్వులకు సమీపముననే ఉండును.
🌷. భాష్యము :
పరమపురుషుడైన నారాయణుడు ప్రతిజీవి యొక్క అంతర్భాహ్యములలో నిలిచియుండునని వేదవాజ్మయము ద్వారా మనము తెలిసికొనగలము.
అతడు భౌతిక, ఆధ్యాత్మిక జగత్తులు రెండింటి యందును నిలిచియున్నాడు. అతడు అత్యంత దూరమున ఉన్నను మనకు సమీపముననే యుండును. ఇవియన్నియును వేదవచనములు. ఈ విషయమున కఠోపనిషత్తు (1.2.21) “ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వత:” అని పలికినది.
దివ్యానందమగ్నుడైన ఆ పరమపురుషుడు ఎట్లు తన ఐశ్వర్యముల ననుభవించునో మనము అవగతము చేసికొనజాలము. ఈ భౌతికేంద్రియములతో ఈ విషయమును గాంచుట గాని, అవగతము చేసికొనుట గాని చేయజాలము.
కనుకనే అతనిని తెలియుట యందు మన భౌతిక మనో, ఇంద్రియములు పనిచేయజాలవని వేదములు పలుకుచున్నవి. కాని కృష్ణభక్తిరసభావనలో భక్తియోగమును అవలంబించుచు మనస్సును, ఇంద్రియములను పవితమొనర్చుకొనినవాడు అతనిని నిత్యము గాంచగలడు.
శ్రీకృష్ణభగవానుని యెడ ప్రేమను వృద్ధిగావించుకొనినవాడు అతనిని నిర్విరామముగా నిత్యము గాంచగలడని బ్రహ్మసంహిత యందు నిర్ధారింపబడినది. భక్తియుక్తసేవ ద్వారానే అతడి దర్శింపబడి అవగతమగునని భగవద్గీత (11.54) యందును ఈ విషయము నిర్ధారింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 471 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 16 🌴*
16. bahir antaś ca bhūtānām
acaraṁ caram eva ca
sūkṣmatvāt tad avijñeyaṁ
dūra-sthaṁ cāntike ca tat
🌷 Translation :
The Supreme Truth exists outside and inside of all living beings, the moving and the nonmoving. Because He is subtle, He is beyond the power of the material senses to see or to know. Although far, far away, He is also near to all.
🌹 Purport :
In Vedic literature we understand that Nārāyaṇa, the Supreme Person, is residing both outside and inside of every living entity. He is present in both the spiritual and material worlds.
Although He is far, far away, still He is near to us. These are the statements of Vedic literature. Āsīno dūraṁ vrajati śayāno yāti sarvataḥ (Kaṭha Upaniṣad 1.2.21). And because He is always engaged in transcendental bliss, we cannot understand how He is enjoying His full opulence. We cannot see or understand with these material senses.
Therefore in the Vedic language it is said that to understand Him our material mind and senses cannot act. But one who has purified his mind and senses by practicing Kṛṣṇa consciousness in devotional service can see Him constantly.
It is confirmed in Brahma-saṁhitā that the devotee who has developed love for the Supreme God can see Him always, without cessation. And it is confirmed in Bhagavad-gītā (11.54) that He can be seen and understood only by devotional service. Bhaktyā tv ananyayā śakyaḥ.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 259 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 30
*🌻 The eligibility required for a man to become ‘divya atma’ - 3 🌻*
My Dear! At the end of Kali Yugam, i.e. in Kali Maha Yugam, when Kali ‘antardasa’ is completed, and after the ‘Yuga Sandhi’ (the transition period) also is crossed, I will come to Tirumala in my own form. Later I will come to some other divine places. I will come to my ‘Maha Samsthanam’ in Peethikapuram.
I will take bath in ‘Ela’ River. I will visit Kukkuteswar. The Maha Siddhas and Maha Yogis who come with me to my Maha Samsthanam are blessed.
Sri Peethikapuram, Syaamalaambapuram and Vaayasapura Agraharam together become a great city. People who come to my Maha Samsthanam for my darshan will be like rows of ants.
I ordered Virupaksha who came along with Vasavee avathar, to come to birth again. I will make him the ruler of Bharat Desam. After he visits me in Peethikapuram, he will get the knowledge of his previous birth.
My Dear! Many strange things will happen in Kali Yugam. One great sadhaka born with the ‘amsa’ of Vasishta will be appointed as a priest in Sripada Srivallabha Maha Samsthanam.
The divine ‘leelas’ I perform with him will be endless. Every moment will be filled with divine ‘leelas’ and divine entertainment. I have to repay the loan to Kubera.
Arya Mahadevi was born in the family of Kubera as Vasavee Kanyaka. She should be given in marriage to Sri Nagareswara Maha Prabhu.
I do not like to take the required money again from Kubera for the marriage. So I will show many ‘leelas’ to the members of Kubera family and sons of Laxmi, remove their problems and take money as My tax.
It was Me who gave wealth to Kubera. So, it was Me who gave ‘Musthi (alms) to Kubera. Now I am immersed in a tremendous debt. So I am taking ‘Musthi’ from Kubera.
The Musthi in Mushti is called a ‘Veera Mushti’. Taking ‘Mushti’ with honour and arrogance is called ‘Veera Mushti’.” Even thousand births are not enough to see the divine smile of Sripada.
End of Chapter 30
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 138 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. జీవుని నారాయణుని - నిద్ర - - 3 🌻*
ఇక జీవుని కన్న నారాయణుడెట్లు అతీతుడనగా జీవులకు నిద్ర క్రమ్మును. నారాయణుడు నిద్రయందు అభిలాష పడును. అనగా నిద్రా స్థితిలో కూడ నిద్రాభిలాషయే గాని, జీవులు పొందునట్టి మొద్దునిద్ర కాదు.
....... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌹 🌹
*🌻. గురువు 🌻*
గురువనగా అయస్కాంతము. శిష్యుడనగా ఇనుప ముక్క. అయస్కాంతపు సాన్నిధ్యముచే ఇనుపముక్క అయస్కాంతము అగుచున్నది.ఇనుమునకు అయస్కాంతము సాన్నిధ్యము ఇచ్చినదే కాని అయస్కాంత తత్త్వమును ధారపోయలేదు.
అట్లే గురువు శిష్యునకు తన భావములను, నమ్మకములను, ఆచారములను రుద్దడు. రుద్దుట రాజకీయ లక్షణము అది పార్టీలు, మతములు మార్చుటకు పనికి వచ్చును. కాని శిష్యుని గురువుగా సృష్టించుటకు పనికిరాదు. జీవునికి దైవముగా రెండవజన్మము ఇచ్చుటకు పనికిరాదు.
ఇనుములో అయస్కాంత ధర్మము నిద్రాణమై యున్నది. దానిని మేల్కొలుపుటకు మాత్రమే అయస్కాంతము తన సాన్నిధ్యమును ప్రసాదించును. అట్లే గురువు ప్రయోగించినది ఉద్బోధము (Induction) అను ప్రక్రియే గాని, బోధ (Conduction) అను పద్ధతి కాదు..
.....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 The Masters of Wisdom - The Journey Inside - 159 🌹*
*🌴 The Buddhic Plane - 1 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj
*🌻 Intellect and Intuition 🌻*
The intellectual abilities of man encompass analytical thinking and interpreting.
This is reinforced through today’s educational system and is important in order to be effective in the external world.
The development of the intellect should not be confused with spiritual development though.
One of the spiritual abilities is the power of synthesis, through which we recognize the deeper correlations and the meaning of that which leads us to intellectual understanding. The intellect thinks critically.
Wisdom sees everything according to its purpose, and unanimity dominates. “The apparent contrasts complement each other,” said Pythagoras.
The intellect or mind can be equated with the Manas-principle, spirituality with Buddhi or the light of wisdom, and highest Divinity with Atma.
While Manas transmits messages from the environment to the inner man and also carries commands of will from within to the outside, Buddhi makes decisions about how to do things the right way.
It knows what is good and bad, what we should do or what rather not. In terms of reasoning, there is a gap between what we know and what we do.
We must build a bridge over this gap in order to live our lives in the light of wisdom. The bridge spans from the mental to the Buddhic plane, from intellect to intuition.
In the beginning, intuition is only a flashlight; but over time it transforms into a daily occurrence. “You connect yourselves, thus you receive.”
This is the promise of every master. “I guide and teach you from within. I will organize your personality from within. I will conduct the necessary transformations.”
🌻 🌻 🌻 🌻 🌻
Sources used: Master K.P. Kumar: Mithila / seminar notes – Master E. Krishnamacharya: Occult Anatomy / Full Moon Meditations.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 75 / Sri Lalita Sahasranamavali - Meaning - 75 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్లోకం 143
*భవదావసుధావృష్టి: పాపారణ్య దవానలా*
*దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా*
741. భవదావసుధావృష్టి: :
జన్మపరంపరలు అను దావాగ్నిని చల్లార్చుటకు అమృతవర్షము వంటిది
742. పాపారణ్యదవానలా :
పాపములు అనెడి అరణ్యమునకు కార్చిచ్చు వంటిది
743. దౌర్భాగ్యతూలవాతూలా :
దారిద్ర్యము, దురదృష్టము అనెడి పక్షి ఈకలకు హోరుగాలి వంటిది
744. జరాధ్వాంతరవిప్రభా :
ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది
🌻. శ్లోకం 144
*భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకి ఘనాఘనా*
*రోగపర్వతదంభొళి ర్మృత్యుదారుకుఠారికా*
745. భాగ్యాబ్ధిచంద్రికా :
సంపద అనెడి సముద్రమునకు వెన్నెల వంటిది
746. భక్తచిత్తకేకిఘనాఘనా :
భక్తుల మనస్సులు అనే నెమళ్ళకు వర్షాకాలపు మేఘము వంటిది
747. రోగపర్వతదంభొళి :
పర్వతములవంతి రోగములకు వజ్రాయుధము వంటిది
748. ర్మృత్యుదారుకుఠారికా :
మృత్యువనెడి వృక్షమునకు గొడ్డలి వంటిది
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 75 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 Sahasra Namavali - 75 🌻*
741 ) Rambha adhi vandhitha -
She who is worshipped by the celestial dancers
742 ) Bhava dhava sudha vrishti -
She who douses the forest fire of the sad life of mortals with a rain of nectar.
743 ) Paparanya dhavanala -
She who is the forest fire that destroys the forest of sin
744 ) Daurbhagya thoolavathoola -
She who is the cyclone that blows away the cotton of bad luck.
745 ) Jaradwanthara viprabha -
She who is the suns rays that swallows the darkness of old age
746 ) Bhagyabdhi chandrika -
She who is the full moon to the sea of luck
747 ) Bhaktha Chitta Keki Ganagana -
She who is the black cloud to the peacock which is he devotees mind
748 ) Roga parvatha Dhambola -
She who is the Vajra weapon which breaks the sickness which is like the mountain
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నారద భక్తి సూత్రాలు - 78 🌹*
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 46
*🌻 46. _ కస్తరతి కస్తరతి మాయమ్ ? యః సంగం త్వజతి,*
*యో మహానుభావం సేవతే, నిర్మమో భవతి ॥ 🌻*
భాగము - 2
విష్ణమాయ ఎంత బలీయమంటే ఒకసారి విష్ణుమూర్తి మోహినీ రూపం ధరించినప్పుడు సాక్షాత్తు హరుడే ఆ మోహంలో పడ్డాడు. వారికి ఒక కుమారుడు కూడా కలిగాడు. అతడే హరిహర సుతుడని పిలువబడే అయ్యప్ప స్వామి అని అందరికీ తెలుసు. అందువలన మాయను దాటటం ఎవరి వశం? అందుకే సంసార భ్రాంతి గురించి హెచ్చరిస్తున్నది ఈ సూత్రం.
మహాత్ముల, అనుభవజ్ఞుల సహాయాన్ని తీసుకోమంటున్నారు. రామ కృష్ణావతారాలు, సద్గురువులు, బుషివర్యులు, భాగవతోత్తములు, ఆచార్యులు వీరందరూ మహానుభావుల క్రిందికి వస్తారు. అవతారకాలం కానప్పుడు కూడా ఎవరో ఒక మహానుభావుడు అన్ని కాలాలలో ఉంటూనే ఉంటాడు.
మహానుభావులు లోక కళ్యాణం కోసం క్రతువులు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. దేవాలయ నిర్మాణాలు చేయిస్తూ, భక్తి మతాన్ని కాపాడుతూ ఉంటారు.
అనేక ప్రవచనాలు చేస్తూ ఉంటారు. అనేక ఆధ్యాత్మిక మార్గాలను ప్రచారం చెస్తూ ఉంటారు. కొందరికి ప్రేరణ ఇస్తూ పై చెప్పిన కార్యాలు జరిపిస్తూ కూడా
ఉంటారు. శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ వివేకానంద స్వామికి స్ఫూర్తినిచ్చి అతని వలన లోకోపకారం జరిపించారు. మహానుభావుల కృప అట్టది.
మహాత్ములు దొరకడమే అరుదు. మనకు సాధన మార్గమందు శ్రద్ధ కలిగి పురోగమిస్తూ ఉంటే, మహాత్ములు అప్రయత్నంగా దొరుకుతారు.
*సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం*
*సంభాషణం కోటి తీర్ధం వందనం మోక్ష సాధనం*
అని మహాత్ముల మహిమ గురించి పెద్దలు చెప్పేవారు. అట్టి వారిని సేవించడాన్ని అదృష్టంగా భావించాలి.
హఫీజ్ గురువుల విషయంలో ఈ విధంగా చెప్పాడు.
(1) ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు లేకుండా, అదృష్టవంతుడగు బానిసవలె మహాత్ముని ఆజ్ఞను పాటించాలి.
(2) ఆయన నుండి విన్న దానిని ఎన్నడూ తప్పు అనకు. ఎల అనగా ఆయనను అర్ధం చెసుకోలెని అసమర్ధత, లోపం మనలోనే ఉన్నది.
(3౩) అహంకార మమకారాలతో కూడిన గౌణభక్తి నుండి మనలను విడుదల చెసి ముఖ్యభక్తిలోనికి ప్రవేశపెట్టిన మహానుభావునికి ఏమిచ్చి బుణం తీర్చుకొనగలం?
(4) ఆయన ఏమి చేసినా మనకందరికీ అత్యంత ప్రయోజనకారి అవుతుంది.
(5) “దొరకునా ఇటువంటి సేవ” అని శుశ్రూష (సేవ) చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 47 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
*🌻. You should not disguise your laziness. You occupy a body. Your Guru also has taken a physical body. That is why it is inevitable that you offer physical service. 🌻*
Until you experience the principle of non-duality that you and the Guru are one and the same, you have to continue this.
For the sake of the sages, to help the sages experience the principle of non-duality, Parvati Devi prayed to Lord Shiva. Therefore, She first prostrated to Lord Shiva.
To demonstrate the behavior towards Guru, she observed the rules of approaching a Guru honoring Lord Shiva as Her Guru.
All this is the Divine Mother Parvati’s play. Here, who is Guru to Parvati Devi? In reality, a woman’s Guru is her husband.
She must get initiation from her husband. But, when the husband is not qualified to do so, the scriptures stipulate that both the husband and wife should get initiated by the same Guru.
They should not go to different Gurus. Who is qualified to initiate? Only one who has attained the full power of the mantra is qualified; otherwise he is not.
Some people feel they received great initiation if they receive a small mantra after going through a lot of physical suffering, fasting, fussing and almost collapsing from weakness.
Some get a cold water bath, sleep on the bare floor and feel like their deeksha or vow was fulfilled. Some Gurus also support this behavior. The disciples of course follow the Guru.
In reality, he who gives initiation needs to have chanted the mantra millions of times. They should have experienced the power of the mantra. They should then pass on the energy and the mantra to the disciple.
Only then will the disciple benefit from it. That is why, great saints don’t give initiation very easily. They postpone asking you to come back tomorrow, or the day after, or may be another day.
They say that now is not a good time or that you will forget the mantra etc. They will not give initiation. They keep postponing. In this context, the style of chanting is also explained.
Some people chant their mantra so loudly that people living three blocks away are annoyed. Then there are people who chant without letting out any sound. Their lips are moving and they are murmuring to themselves. This silent chanting is better.
Instead of ostentatiously chanting aloud, it is better to chant silently in your mind with your lips moving. There’s not much benefit from chanting loudly. Even with lips moving, there may not be much benefit, we shall see.
This (chanting silently with lips moving)is called “madhyama”. This gives mediocre results.”
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 44 / The Siva-Gita - 44 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
షష్ట మాధ్యాయము
*🌻. విభూతి యోగము - 8 🌻*
ఏషోస్మి దేవః ప్రదిశో పి సర్వాః
పూర్వో హాయ్ జాతో స్మ్రుహమేవ గర్భే
అహం మి జాత శ్చ జనిష్య మాణః
ప్రత్యగ్జ నాస్తి ష్టతి సర్వతో ముఖః 46
విశ్వత శ్చక్షు రుత విశ్వతో ముఖో
విశ్వతో బాహు రుత విశ్వాత స్సాత్,
సంబాహుభ్యా సమతి సం పత త్రై
ర్ద్యావాభూమీ జనయన్ దేవ ఏకః 47
వాలాగ్రమాత్రం హృదయస్య మధ్యే
విశ్వేదేవం జాతవేదం వరేణ్యమ్
మామాత్మ స్థం యేను పవ్యంతి ధీరా
స్తేషాం శాంతి శ్శాశ్వతీ నే త రేషామ్ 48
అహం యోని మది తిష్టామి చైకో
మయేదం పూర్ణం పంచ విధం చ సర్వమ్,
మా మీశానం పురుషం దేవ మిత్ధం
విచార్య మాణం శాంతి మత్యంత మేతి 49
ప్రాణే ష్వంత ర్మన సో లింగ మాహు
ర్మస్మిన్న శనాయా చ తృష్ణా క్షమాచ
తృష్ణాం ఛి త్వా హేతుజాలస్య మూలం
బుద్ధ్యా చిత్తం స్థాపయిత్వా మయీహ 50
దిశలను బుట్టినవాడును, జనన మందు వాడును, పుట్టబోవు వాడును, వృద్ధి చెందిన వాడును, (పెద్ద - జ్యేష్టుడు) సర్వతోముకుండును నేనే.
లోకములను రక్షించువాడును, విశ్వమే చక్షువులగను, ముఖములుగను, బాహువులుగను, పాదములుగాను కలవాడును, భూ:- భువః- స్వర్గాదుల స్రష్టను నేనే,
పోగా నిఖిలజన హృదయంబుల తో వాలాగ్ర మాత్రమగు ప్రకాశ స్వరూపముగా నుండు నన్ను ప్రపంచమునకు ప్రభువుగాను, ముఖ్యునిగాను, ఆత్మస్థితునిగాను ఎవ్వరైతే తెలిసికొందురో అట్టి వారలకే శాశ్వతమగు శాంతి కలుగును. ఇతరులకు కలుగనేరదు.
నే నొక్కడినే సమస్తములకు కారణభూతుండనై అయిదు ప్రాకారములుగా నిఖిల లోకమంతటిని సృష్టించి సర్వాంతర్యామినై యుండెదను.
ఈ విధముగా న్నీశ్వరునిగా తెలిసికొని, పురాణ పురుషునిగాను, మహాదేవునిగాను పరిశీలించువాడు మిగుల శాంతి చెందును.
ఆకలి దప్పికలకు ఓర్పునకేది పుట్టుకయో అట్టి ప్రాణములోని యాత్మకు కారణభూతుడిగా నన్ను వ్యావహరింతురు. అట్టి నాయందు మనస్సును కేంద్రీకరింపచేసి ఎవ్వరైతే ధ్యానించుచు భజింతురో అటువంటి వారలకే శాశ్వత శాంతి లభించును. ఇతరులకు కలుగదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 44 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 06 :
*🌻 Vibhooti Yoga - 8 🌻*
I am the lord who is born within directions (space and time),
I'm the one being born, I'm the one who is still inside the womb, I'm the old aged one, and I am the one who has faces everywhere.
I'm the protector of the worlds. All faces are my faces, all eyes are my eyes, all limbs are my limbs. I am the creator of BhuBhuvahSuvar kind of worlds.
Moreover people who realize me as the one dwelling in the hearts of all as a divine light, as the master and leader of all creation; such a kind of Jiva only can attain permanent peace called liberation, Others can not! I alone remain as the cause behind the creation and dwell as the inner soul of all.
In this way one who knows me as Eswara, primordial being, Mahadeva, and enquires into me such a one gains liberation. The Prana which is the cause of all sensations like hunger, thirst etc. such a Prana is also I alone.
One who meditates on me, and worships me such a one gains final bestitude as eternal peace. Others do not gain that.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 35 / Sri Gajanan Maharaj Life History - 35 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 7వ అధ్యాయము - 6 🌻*
దీనికి మహారాజు నవ్వి నువ్వు ఇప్పుడు సంతానంకోసం అధించావు. ఇది అర్ధింపు కనుక, నీకు కొడుకు పుడతాడని నేను దీవిస్తున్నాను, వాడికి నువ్వు భికయ అని పేరు పెట్టాలి. నీకు సంతానం ఇవ్వడం అనేది పూర్తిగా నాచేతులలో లేదు కాని ఆ మహాత్ముడిని నీకోరిక నెరవేర్చమని నేను అర్ధిస్తాను. నీకు కొడుకు కలుగుతాడు, దానికి బదులుగా, నీకృతజ్ఞతకు ఒకచిన్నకానుకగా, బ్రాహ్మణలకు మామిడిపండ్ల రసం తినిపించమని నేను నిన్ను అడుగుతున్నాను అని అన్నారు.
దానికి ఖాండు అంగీకరించాడు. ఇంటికి వెళ్ళి ఈసంభాషణను తన చిన్ననాన్నకి చెప్పాడు, కుకాజీ చాలా సంతోషించాడు. కొన్నిరోజుల తరువాత స్వామీజీ దీవెనలు నిజమని నిరూపించ బడ్డాయి, మరియు ఖాండుపాటిల్కు ఒక కొడుకు కలిగాడు. అతను చాలాసంతోషించాడు. కుకాజి సంతోషానికయితే అవధిలేదు. ఖాండుపాటిల్, బీదవాళ్ళకి ధాన్యం, మరియు గోధుమలు పిల్లలకు మిఠాయిలు షేగాంలో ఇచ్చారు.
ఆపిల్ల వాడికి అన్న విధంగా భికు అని పేరు పెట్టారు. చంద్రుడిలా వాడు పెరుగుతున్నాడు. తన వాగ్దానం ప్రకారం ఖాండపాటిల్, బ్రాహ్మణులకు మామిడి పండ్లరసం తినిపించాడు, ఈ ఆనవాయితీని అతని కుటుంబం ఇంకా చేస్తూనే ఉంది.
శ్రీగజానన్ మహారాజు కృపవల్ల ఆపిల్లవాడు ఖాండుపాటిల్ ఇంట్లో పాకడం మొదలు పెట్టాడు. పాటిల్ కుటుంబీకుల సంతోషానికి దేష్ ముఖ్ కుటుంబీకులు దుఖిఃతులయ్యారు, ఎందుకంటే షేగాం చాలా పూర్వ నుండి ఈవిధంగా విభజన చెందిన గ్రామం.
షేగాంలో రెండు పరస్పర విరోధ పార్టీలు ఉన్నాయి. ఒకటి పాటిల్ రెండవది దేష్ ముఖ్. వీళ్ళు ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వి, ఒకరినొకరు నాశనంచేసుకుందుకు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇద్దరు పండితులు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు యోద్ధలు, ఇద్దరు మరమ్మత్తు చేసేవారు మరియు రెండుకుక్కలు ఎప్పుడు ఒకరికొకరు ఎదురు పడ్డా దెబ్బలాడు కుంటారు.
ఈపాటిల్ దేష్ముఖే విషయం కూడా అలాంటిదే. కుకాజి తన మనుమడిని చూసిన తరువాత భీమానది తీరాన్న పండరిపూరులో మరణించారు.
తన రక్షకుడిని పోగొట్టు కున్నందుకు థాండుపాటిల్ దుఖితుడయ్యాడు. ఈవిధమయిన ఖాండుపాటిల్ మానసిక అవస్థ చూసి, అతనిని ఇబ్బంది పెట్టడానికి దేష్ ముఖ్ ఏవిధంగా ఈ ఆవకాశాన్ని ఉపయోగించుకున్నాడో మరుసటి అధ్యాయంలో వర్నించబడింది.
దయచేసి చిత్తశుద్ధితో దాసగణు రచించిన ఈ గజానన్ విజయను వినండి. మీకు శుభములు కలుగుగాక.
"శుభం భవతు"
7. అధ్యాయము సంపూర్ణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 35 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 7 - part 6 🌻*
At this, Swamiji smiled and said, You have now begged for a child; since it is a begging, I bless that you will get a son. It is not entirely in my hands to bless you thus, but I will request the Almighty to fulfil your desire.
In return, I ask you to feed mango juice to Brahmins every year and name the son Bhikya, as a token of your gratefulness.”
Khandu Patil accepted these conditions, went home and told about this conversation to his uncle.
Kukaji was very happy. After some days Swamiji's blessings proved true and Khandu Patil got a son. He was very happy and Kukaji’s happiness knew no bounds. Khandu Patil distributed jaggery and wheat to the poor and sweets to the children of Shegaon.
The child was rightly named Bhikya who, like a moon, went on growing. Khandu Patil, as promised, fed Brahmins with mango juice and continued this practice throughout his life; his decendents still continue this practice.
The child, by the grace of Shri Gajanan Maharaj, started crawling in the house of Khandu Patil. The happiness of the Patils made the Deshmukhs unhappy. Shegaon was a divided village since long; there were two rival groups in Shegaon: one of the Patils and the other of the Deshmukhs.
They were always searching for an opportunity to destroy each other. Two Pundits, two ministers, two fighters, two mechanics and two dogs when face-to-face, always fight. Same was the case with Patils and Deshmukhs.
After seeing his grandchild, Kukaji died at Pandharpur on the bank of the river Bhima; Khandu Patil was sad to have lost his protector.
Looking to Khandu Patil's state of mind, the Deshmukh exploited the opportunity to put Patil into trouble, the details of which will be narrated in the next chapter.
||SHUBHAM BHAVATU||
Here ends Chapter Seven
Continues..
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 26 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని మూడవ పాత్ర : సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 4 🌻*
97. ఆభావము యొక్క ఆవిష్కామైన సృష్టి, మిథ్య ద్వారా ఉన్నట్లు కనిపించుచున్నది.
98.అభావము యొక్క అసంఖ్యాక రూపముల వ్యక్తీకరణమే సృష్టి.
99. అనంత సర్వమ్, అయిన భగవంతునిలో, విలాసము (చిద్విలాసము) తరంగములవలె చలించుటకు పూర్వము, సర్వములో అంతర్నిహితమైయున్న అభావమున్నూ, అభావమునుండి ఆవిర్భవించిన సృష్టి యున్నూ ఒకేసారి బయటికి పొడుచుకురాగా , పరాత్పరస్థితిలో అభావముగా అంతర్నిహితమైయున్న చైతన్యము.
క్రమక్రమముగా భగవంతుని చైతన్యము గా ఆవిర్భవించి, సర్వమ్ నుండి పుట్టిన సృష్టికి తానే కర్తననెడి అనుభవమును భగవంతునికి కలుగజేసినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సౌందర్య లహరి - 86 / Soundarya Lahari - 86 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
86 వ శ్లోకము
*🌴. దుష్టశక్తుల నుండి రక్షింప బడుటకు, శత్రువుల మీద విజయం 🌴*
శ్లో: 86. మృషాకృత్వా గోత్ర స్ఖలన మథ వైలక్ష్య నమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే చిరా దన్త శ్శల్యం దహన కృత మున్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలి తమీశానరిపుణా ll
🌷. తాత్పర్యం :
అమ్మా! పార్వతీ దేవీ ! పొరపాటుగా నీ భర్త అయిన శివుడు నీ వద్ద గంగ పేరు ఉచ్ఛరించి కలవరపాటున ఏమిచేయవలెనో తోచక నీకు నమస్కారము చేసిననూ భర్తను నీ పాదపద్మముతో తాడనము చేయగా, చిరకాలముగా శత్రువుగా ఉన్న మన్మధుడు నవ్విన నవ్వు నీ కాలి అందెల చప్పుడుగా వెలువడెను, కదా !
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 21 రోజులు జపం చేస్తూ, పాయసం, అరటి పండు, కొబ్బరికాయ నివేదించినచో దుష్ట శక్తుల నుండి విడుదల, రక్షణ, శత్రు విజయం లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹Soundarya Lahari - 86 🌹*
📚. Prasad Bharadwaj
SLOKA - 86
*🌴 Removing Fear of Ghosts and Victory over Enemies 🌴*
86. Mrisha krithva gothra skhalana matha vailakshya namitham Lalate bhartharam charana kamala thadayathi thee Chiradantha salyam dhahanakritha -munmilee thavatha Thula koti kkana kilikilith -meesana ripuna
🌻 Translation :
In a playful mood, after teasing you, about you and your family, and at a loss to control your love tiff, when your consort does prostrations, your lotus like feet touches his forehead, and the god of love, the enemy of your lord, who was burnt,by the fire from his third eye, and was keeping the enmity with your lord, like the ever hurting arrowmakes sounds like kili kili, from your belled anklets on the legs.
(kili kili refers to the sound of teasing also sound from anklets)
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 21 days, offering milk payasam, coconut and banana fruit as prasadam, it is believed that they can overcome forms of fearand evil spirit in life and can get victory over enemies
🌻 BENEFICIAL RESULTS:
Subduing enemies, warding off evil spirits, obtaining power and strength.
🌻 Literal Results:
Gaining strength and infrastructure to attack and subdue enemies.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 386 / Bhagavad-Gita - 386 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 35 🌴
35. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసామహం |
మాసానాం మార్గశీర్షో(హమృతూనాం కుసుమాకర: ||
🌷. తాత్పర్యం :
నేను సామవేద మంత్రములలో బృహత్సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంతఋతువును అయి యున్నాను.
🌻. భాష్యము :
వేదములలో తాను సామవేదమునని శ్రీకృష్ణభగవానుని ఇదివరకే వివరించియున్నాడు. వివిధ దేవతలచే గానము చేయబడు శ్రావ్యగేయభరితమైన ఆ సామవేదమునందు “బృహత్సామము” అనునది ఒకటి.
అసాధారణ మధురిమను కలిగియుండెడి ఆ బృహత్సామము నడిరేయి యందు గానము చేయబడుచుండును.
సంస్కృతమున కవిత్వమునకు అనేక నియమములుండును. ఆధునిక కవిత్వములలో జరుగురీతి దానియందు ప్రాస మరియు ఛందములు తోచినరీతిని వ్రాయుబడవు. అట్లు నియమబద్ధముగా వ్రాయబడిన కవిత్వములలో గాయత్రీమంత్రము శ్రీమద్భావతమునందు పేర్కొనబడినది. ఈ మంత్రము భగవదనుభూతికై ప్రత్యేకముగా నిర్ణయింపబడియున్నందున దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును.
ఆధ్యాత్మిక పురోగతినొందిన మహాత్ముల కొరకై నిర్దేశింపబడియున్న దీనిని జపించుచు ఆధ్యాత్మికజయము నొందెడివారు భగవానుని దివ్యస్థానమున ప్రవేశింపగలరు.
కాని ఈ మహామంత్రము జపించుటకు పూర్వము మనుజుడు పూర్ణత్వమునొందిన మనుజుని లక్షణములను (సత్వగుణమును) అలవరచుకొనవలెను.
పరబ్రహ్మము యొక్క ధ్వని అవతారముగా భావింపబడు ఈ గాయత్రీమంత్రము వైదికజీవనవిధానమున అత్యంత ముఖ్యమైనది. బ్రహ్మదేవునిచే ప్రారంభింపబడిన ఈ మంత్రము పరంపర రూపముగా వ్యాప్తినొందినది.
మార్గశీర్షమాసము (నవంబర్ – డిసంబర్) అన్ని మాసముల యందును ఉత్తమమైనదిగా పరిగణింపబడును. ఏలయన ఆ సమయమున జనులు పొలముల నుండి ధ్యానమును సేకరించి ఆనందముతో నుందురు.
అలాగుననే ఋతువుల యందు వసంతఋతువు ప్రపంచమంతటికిని అత్యంత ప్రియమైనది. వాతావరణము అతివేడి, అతిశీతలముగా లేకుండ వృక్షములు ఫల, పుష్పభరితమై యండుటయే అందులకు కారణము.
ఈ వసంతఋతువు నందే శ్రీకృష్ణుని పలులీలలను గుర్తుచేసికొను పలు ఉత్సవములు జరుపబడుచుండును. కనుకనే ఋతువులన్నింటిని యందును వసంతఋతువు అత్యంత ఆనందదాయకమైనదిగా పరిగణింపబడును. అది దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 386 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 35 🌴
35. bṛhat-sāma tathā sāmnāṁ
gāyatrī chandasām aham
māsānāṁ mārga-śīrṣo ’ham
ṛtūnāṁ kusumākaraḥ
🌷 Translation :
Of the hymns in the Sāma Veda I am the Bṛhat-sāma, and of poetry I am the Gāyatrī. Of months I am Mārgaśīrṣa [November-December], and of seasons I am flower-bearing spring.
🌹 Purport :
It has already been explained by the Lord that amongst all the Vedas, He is the Sāma Veda.
The Sāma Veda is rich with beautiful songs played by the various demigods. One of these songs is the Bṛhat-sāma, which has an exquisite melody and is sung at midnight.
In Sanskrit, there are definite rules that regulate poetry; rhyme and meter are not written whimsically, as in much modern poetry. Amongst the regulated poetry, the Gāyatrī mantra, which is chanted by the duly qualified brāhmaṇas, is the most prominent.
The Gāyatrī mantra is mentioned in the Śrīmad-Bhāgavatam. Because the Gāyatrī mantra is especially meant for God realization, it represents the Supreme Lord.
This mantra is meant for spiritually advanced people, and when one attains success in chanting it, he can enter into the transcendental position of the Lord.
One must first acquire the qualities of the perfectly situated person, the qualities of goodness according to the laws of material nature, in order to chant the Gāyatrī mantra.
The Gāyatrī mantra is very important in Vedic civilization and is considered to be the sound incarnation of Brahman. Brahmā is its initiator, and it is passed down from him in disciplic succession.
The month of November-December is considered the best of all months because in India grains are collected from the fields at this time and the people become very happy.
Of course spring is a season universally liked because it is neither too hot nor too cold and the flowers and trees blossom and flourish.
In spring there are also many ceremonies commemorating Kṛṣṇa’s pastimes; therefore this is considered to be the most joyful of all seasons, and it is the representative of the Supreme Lord, Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 207 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴*
45. అధ్యాయము - 20
*🌻. శివుడు కైలాసమునకు వెళ్లుట - 6 🌻*
క్వచిత్కైలాస కుధరసుస్థానేషు మహేశ్వరః | విజహార గణౖః ప్రీత్యా వివిధేషు విహారవిత్|| 55
ఇత్థం రుద్రస్వరూపోsసౌ శంకరః పరమేశ్వరః | అకార్షీత్స్వగిరౌ లీలా నానా యోగివరోsపి యః || 56
నీత్వా కాలం కియంతం సోsపత్నీకః పరమేశ్వరః | పశ్చాదవాప స్వపత్నీం దక్షపత్నీ సముద్భవామ్ || 57
విజహార తయా సత్యా దక్షపుత్ర్యా మహేశ్వరః | సుఖీ బభూవ దేవర్షే లోకాచార పరాయణః || 58
విహారమునెరింగిన మహేశ్వరుడు ఒకప్పుడు కైలాస పర్వతప్రదేశముల యందు గణములతో కూడి ప్రీతితో విహరించెడివాడు (55).
శంకర పరమేశ్వరుడు యోగి శ్రేష్ఠుడే అయినా, ఈ తీరున రుద్ర రూపుడై తన పర్వతమునందు అనేక లీలలను చేసెను (56).
ఆ పరమేశ్వరుడు భార్య లేకుండగా కొంతకాలమును గడిపి, తరునాత దక్షుని కుమార్తెను వివాహమాడెను (57).
ఓ దేవర్షీ! మహేశ్వరుడు దక్షపుత్రియగు ఆ సతీదేవితో గూడి లోకాచారములను అనుష్ఠించుచూ సుఖియై విహరించెను (58).
ఇత్థం రుద్రావతారస్తే వర్ణి తోsయం మునీశ్వర| కైలాస గమనం చాస్య సఖిత్వాన్నిదిపస్య హి || 59
తదంతర్గత లీలాపి వర్ణితా జ్ఞాన వర్థినీ | ఇహాముత్ర చ యా నిత్యం సర్వకామఫలప్రదా || 60
ఇమాం కథాం పఠేద్యస్తు శృణుయాద్వా సమాహితః | ఇహ భుక్తిం సమాసాద్య లభేన్ముక్తిం పరత్ర సః || 61
ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే కైలాసోపాఖ్యానే శివస్య కైలాసగమనం నామ వింశోsధ్యాయః (20).
ఓ మహర్షీ! నీకు ఈ తీరున రుద్రావతారమును, కుబేరుని మైత్రి కారణము వలన శివుడు కైలాసమునకు వెళ్లుటను వర్ణించితిని (59).
ఈ గాథలో అంతర్గతముగా నున్న లీలలను కూడ వర్ణించితిని. ఈ గాథ జ్ఞానమును వృద్ధి పొందించును. ఇహ పరములయందు నిత్యము కోర్కెలనన్నిటినీ ఈడేర్చును (60).
ఎవరైతే ఈ కథను శ్రద్ధతో పఠించెదరో, లేదా వినెదరో, వారు ఇహలోకములో భుక్తిని పొంది, పరలోకములో ముక్తిని పొందెదరు (61).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు మొదటి ఖండములో కైలాసోపాఖ్యానములో శివుడు కైలాసమునకు వెళ్లుట అనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).
శ్రీ కృష్ణార్పణమస్తు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 83 🌹*
Chapter 25
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj
*🌻 The Language of Light - 1 🌻*
God is Light and his shadow, illusion, is darkness. God is Knowledge and his shadow, illusion, is ignorance.
Shadow is shadow and it cannot have substance, but this very shadow is the medium to know the Truth; for Light is experienced when darkness is known as darkness, and Knowledge is experienced when ignorance is known as ignorance. In the sphere of Infinity and Eternity, the language of Light is Knowledge, and the language of darkness is ignorance.
The aim of life is to become one with the Infinite and Eternal, and this aim is achieved through knowing the language of Light, to have Knowledge. But unless the language of darkness is forgotten, wiped out of the mind, the language of Light remains unknown—Knowledge is not experienced.
In order to forget the sounds of the language of darkness, it is necessary to learn the language of wine, which is ever-silent.
The language of wine, in its silence, absorbs all the sounds of the language of darkness, making the language of darkness non-existent; thus ignorance disappears.
The language of Light has no sound. It is the language of soundless sound, and because it is the very language of Knowledge Itself, it has substance. This substance is Knowledge Itself, and the Power of Knowledge is knowing, and its Bliss is knowing everything.
Shadow is the opposite of Light, therefore the expansion of shadow is always in the opposite direction of the Light—into darkness.
There are seven shadows in the opposite direction of the Light, and these seven shadows are active in their spheres of darkness. The fifth and sixth planes of the mental world are the first two shadows.
The four planes of the subtle world are the next four shadows. The gross world is the seventh shadow. These seven shadows, seven spheres of existence, are the seven shadows of God.
Gross sounds are produced in the gross world; subtle sounds are produced in the subtle world; mental sounds are produced in the mental world. These sounds are produced by the impressions of mind; sounds are the sound of sanskaras, and all sound is sanskaric.
So long as one has gross impressions, he makes a gross sound and cannot hear the subtle sound. Likewise, so long as one has subtle impressions, he makes a subtle sound and cannot hear the mental sound; and so long as one has mental light.
impressions, he makes a mental sound and cannot hear the soundless sound of the light.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 78 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 31
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻.అథ కుశాపామార్జన విధానమ్ - 3 🌻*
స్థావరం జఙ్గమం వాపి కృత్రిమం చాపి యద్విషమ్ | దన్తోద్భవం నఖభవమాకాశప్రభవం విషమ్. 27
లూతాదిప్రభవం యచ్చ విషమన్యత్తు దుఃఖదమ్ | శమం నయతు తత్సర్వం వాసుదేవస్య కీర్తనమ్. 28
గ్రహాన్ ప్రేతగ్రహాంశ్చాపి తథా వై డాకినీగ్రహాన్ | వేతాలాంశ్చ పిశాచాంశ్చ గన్ధర్వాన్ యక్షరాక్షసాన్. 29
శకునీపూతనాద్యాంశ్చ తథా వైనాయకాన్ గ్రహాన్ | ముఖమణ్డీం తథా క్రూరాం రేవతీం వృద్ధరేవతీమ్. 30
వృద్ధికాఖ్యాన్ గ్రహాంశ్చోగ్రాంస్తథా మాతృగ్రహానపి | బాలస్య విష్ణోశ్చరితం హన్తు బాలగ్రహానిమాన్. ప31
వృద్ధాశ్చ యే గ్రహాః కేచిత్ యే చ బాలగ్రహాః క్వచిత |
నరసింహస్య తే దృష్ట్యా దగ్ధా యే చాపి ¸°వనే. 32
సటాకరాలవదనో నారసింహో మహాబలః | గ్రహానశేషాన్నిః శేషాన్ కరోతు జగతో హితః. 33
నరసింహ మహాసింహ జ్వాలామాలోజ్జ్వలానన | గ్రహానశేషాన్ సర్వేశ ఖాద ఖాదాగ్నిలోచన. 34
స్థావరము, జంగమము, కృత్రిమము, దంతములందు పుట్టినది, నఖములందు పుట్టినది, అకాశమునందు పుట్టినది, సాలెపురుగు మొదలగువాటినుండి పుట్టినది, ఇంకను ఇతరవిధములైన దుఃఖకర మగు విషమును భగవంతుడైన వాసుదేవుని స్మరణము నశింపచేయుగాక.
బాలకృష్ణుని చరిత్రముయొక్క కీర్తనము గ్రహ-ప్రేతగ్రహ-డాకినీ పూతనాది గ్రహ-వినాయకగ్రహ - ముఖమండికా - క్రూరరేవతీ - వృద్ధరేవతీ - వృద్ధికానామకోగ్రగ్రహ - మాతృగ్రహాదులగు బాలగ్రహములను నశింపచేయుగాక!
భగవంతుడ వైన నరసివంహా! నీ దృష్టిప్రసారముచే బాలగ్రహములు, యువగ్రహములు, వృద్ధగ్రహాములు దగ్ధము లైపోవుగాక!
జూలుతో భయంకర మైన ముఖము కలవాడును, లోకమునకు హితము చేకూర్చువాడును, మహాబలవంతుడును అగు భగవంతు డైన నృసింహుడు సమస్తబాలగ్రహములను నశింపచేయుగాక,
ఓ నరసింహా! మహాసింహా! జ్వాలామాలలచే నీ ముఖమండలము ప్రకాశించుచున్నది. ఓ అగ్ని లోచనా! సర్వేశ్వరా! సమస్తగ్రహములను భక్షించుము! భక్షించుము.
యే రోగా యే మహోత్పాతా యద్విషం యే మహాగ్రహాః | యాని చ క్రూరభూతాని గ్రహాపీడాశ్చ దారుణాః.
శస్త్రక్షతేషు యే దోషా జ్వాలా గర్దభకాదయకః | తాని సర్వాణి సర్వాత్మా పరమాత్మా జనార్దనః. 36
కించిద్రూపం సమాస్థాయ వాసుదేవస్య నాశయ | క్షిప్త్వా సుదర్శనం చక్రం జ్వాలామాలాతిభీషణమ్. 37
సర్వదుష్టోపశమనం కురు దేవవరాచ్యుత | సుదర్శన మహాజ్వాలా చ్ఛిన్ధి చ్ఛిన్థి మహారవ. 38
సర్వదుష్టాని రక్షాంసి క్షయం యాన్తు విభీషణ | ప్రాచ్యాం ప్రతీచ్యాం చ దిశి దక్షిణోత్తరతస్తథా. 39
రక్షాం కరోతు సర్వాత్మా నరసింహః స్వగర్జితైః | దివిభువ్యన్తరిక్షేచ పృష్ఠతః పార్శ్వతో7గ్రత. 40
రక్షాం కరోతు భగవాన్ బహురూపీ జనార్దనః | యథా విష్ణుర్జగత్సర్వం సదేవాసురమానుషమ్. 41
పరమాత్ము డైన జనార్దనుడు సర్వాత్మస్వరూపుడు. ఓ వాసుదేవా! ఈ వ్యక్తియందు ఏ రోగములన్నవో, ఏ మహోత్పాతము లున్నవో, ఏ విషమున్నదో, ఏ మహాగ్రము లున్నవో, క్రూరభూతము లున్నవో, దారుణ మైన గ్రహపీడ లున్నవో వాటి నన్నింటిని ఏదియో ఒక రూపము ధరించి నశింపచేయుము.
దేవశ్రేష్ఠుడ వైన అచ్యుతా! జ్వాలామాలలచే మిక్కిలి భయంకరమైన సుదర్శనచక్రమును ప్రయోగించి దుష్టరోగలముల నన్నింటిని నశించేయుము.
తీవ్రజ్వాలలచే ప్రకాశించుచు, మహాధ్వని చేయుచున్న సుదర్శనచక్రమా! సమస్తదుష్టరాక్షసులను సంహరింపుము; సంహరింపుము.
నీ ప్రభావముచే ఆ రాక్షసు లందరును నశింతురుగాక. సర్వాత్మకు డగు నృసింహుడు, తన గర్జనముచే, పూర్వ-పశ్చిమ-ఉత్తర-దక్షిణదిశలందు రక్షించుగాక.
అ నేక రూపములను ధరించు భగవంతుడైన జనార్దనుడు స్వర్గలోక-భూలోక-అంతరిక్షములందును, ముందును, వెనుకను రక్షించుగాక.
దేవాసుర మనుష్యసహిత మగు ఈ జగత్తు అంతుయు భగవంతు డగు విష్ణుయొక్క స్వరూపమే. ఈ సత్యముయొక్క ప్రభావముచే ఈతని దుష్టరోగము లన్నియు నశించుగాక.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 94 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. పరాశర మహర్షి - 13 🌻*
72. ఓకసారి బ్రహ్మ, మైత్రేయాది మహర్షులు పరాశరుని, “జీవబ్రహ్మాంశ” లక్షణములను గురించి వివరంగా చెప్పమన్నారు.
73. ఆయన జ్యోతిషశాస్త్రం చెప్పాడు. మనుష్యుల్లో కలిగిన జీవబ్రహ్మాంశ భేదములు జ్యోతిషశాస్త్రంద్వారా తెలుసుకోవాలి. జీవుడికి – అంటే కర్మచేత ఈ శరీరాన్ని పొందినటువంటి జీవత్వానికి – శుభాశుభములు దగ్గరలోనే ఉంటాయి. ఈ కర్మలన్నిటికీ అతీతంగా స్వతంత్రంగా ప్రకాశించే వస్తువులో బ్రహ్మయే ఉంది.
74. అది అంతర్యామిగా. జీవుడియొక్క పరిణామదశలయందు భావనచేసి, మనో బుద్ధి చిత్తాహంకారములతో దేహాత్మభావన కలిగిన మనుష్యులు ఏయే సమయాల్లో ఆత్మదర్శన హేతువయినటువంటి ధర్మార్థాలను ఆచరించాలో; కామాన్ని వదిలిపెట్టి, నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని ఎలాచేరాలో ఆ మార్గాన్ని బోధించటమే జ్యోతిషశాస్త్రబోధలో పరాశరమహర్షి ఉద్దేశ్యం.
75. జీవబ్రహ్మాంశ భేదములెలా తెలుసుకోవాలి? అంటే దానికి సమాధానంగా జ్యోతిషశాస్త్రం చెప్పాడు. అంతే కాని, భౌతికజీవనంలోని క్షణికమైన శుభాశుభాలు తెలుసుకోవటానికి చెప్పలేదు. దీనివల్ల జీవబ్రహ్మాంశభేదం తెలుస్తుంది. దానివల్ల శుభాశుభములు కూడా కలుగుతాయి.
76. ఇప్పుడీ అర్థంలో జీవాంశ ఏది, బ్రహ్మాంశ ఏది, ఈ జాతకుడిలో? బ్రహ్మాంశ అంటే జ్ఞానాంశ. తరుణోపాయం వెతుక్కునేటటువంటి మార్గంలో ఈతడి ప్రస్తుతస్థితి ఎటువంటిదనే విచారణలో ఉన్నటువంటిది బ్రహ్మాంశ.
77. జీవాంశ అంటే, దానికి ఇతడు చేయవలసిన తపస్సు. తపస్సా! యోగమా! భక్తా! ఇతడికి ఏది ఉత్తమమో, ఇతడి కులాచారం, సంస్కారాలనుబట్టి ఎటువంటిదయితే బాగుంటుంది? ఏ దైవాన్ని ఆరాధించాలి? ఎటువంటి ధర్మాన్ని ఆచరించాలి? ఇతడికి యోగ్యమైనటువంటి మోక్షోపాయం ఏది? అని, ఆ బ్రహ్మాంశనుగురించి ఈ స్థితిని తెలుసుకున్న జ్యోతిష్యుడు ఈ జీవాంశకు కర్తవ్యబోధ చెయ్యాలి. ఆ పరిణామదశలు తెలుసుకోవడం కోసమే జ్యోతిషశాస్త్రమని పరాశరుడి ఉద్దేశ్యం.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 24 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴*
STANZA VI
*🌻 The Final Battle - 1 🌻*
47. The hour had struck. Time began to flow in its designated channel. People were searching for those who were nearer and dearer to their Hearts.
Many united in groups, forming societies knitted together by a single idea or aspiration. The idea of good or evil was that connecting link around which communities were organized. Humanity had made the Final Choice — in favour of Good.
Evil therefore decided to change this Progress of Evolutionary Movement towards the Light, and to lay decisive battle against the idea of Peace. Thus began a series of global wars.
48. The Fireflies died, unable to withstand the attacks on their perishable bodies. But the Immortal Souls departed heavenward and, once again robed in human skins, returned to the Earth with strength derived from the Immortal Fires.
They resumed the battle the darkness had imposed on them. Stars were supporting their chosen ones, unceasingly strengthening their Hearts with the currents of Love.
Aglow with the thought of Good and Light, the Loving Hearts of the Fireflies were being immersed into pitch darkness, where their mission was to
sow the Seeds of Love.
The gloom of ignorance again and again erected solid walls of misunderstanding between the Bearers of Light and dormant consciousnesses. Evil knew that he could still find a great number of willing servants among the slumbering souls.
49. The Titans entered the battle. Giants suckled by the darkness were trying to slay these Good Titans, which had been raised by Mother Earth herself. But while in contact with the Earth they seemed invincible, drawing tremendous strength from native soil. The battle raged on.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 43 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
నేను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయలవరకు చరిత్ర అంతమవుతుంది. తరువాత కాలంలో ఈ ఖండం మహ్మదీయుల పరమవుతుంది. శ్వేతముఖులు (తెల్లవాళ్ళు) భారత రాజ్యాన్ని ఏలతారు.
పల్నాటి సీమలో నరులు వచ్చి ఆకులు తిని జీవిస్తారు. మొగలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమయిన రీతిగా, జనాన్ని నశింపచేస్తుంది.
వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది. ఆ వృత్తిలోని వారు, వివాహాలు చేసుకుని కాపురాలు చేస్తారు. గురువులు ఆడంబరంగా బతుకుతారు.
కుటుంబంలో సఖ్యత వుండదు. తల్లీ, తండ్రీ, పిల్లల మధ్య వాత్సల్యాలు వుండవు. ఒకరిమీద మరొకరికి నమ్మకం నశిస్తుంది. నా రాకకు ముందుగా, నా భక్తులు వారి శక్త్యానుసారము నా ధర్మ పరిపాలనకు అంకురార్పణలు చేస్తారు’’ అని సిద్ధయ్యకు వివిరించారు బ్రహ్మేంద్రస్వామి.
*🌻. కర్నూలు నవాబుకు స్వామివారు కాలజ్ఞానము బోధించుట 🌻*
క్రోధ నామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి, సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీర భోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన ఒక గొప్ప నక్షత్రం ఉద్భవించి, అందరికీ కనిపిస్తుంది.
చండి పర్వతం, ఆలంపూర్ మొదలైన స్థాలములలో ఉత్పాతాలు పుడతాయి. ఈ ప్రాంతంలో పాలెగాళ్ళు, తమలో తాము ఘర్ఘణ పడి, చెడి అడవుల పాలై భ్రష్టులై పోతారు. నలు దిక్కుల యందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.
అమావాస్య రోజున పూర్ణచంద్రుని చూసి జనులు నశిస్తారు. కార్తీకం నిజమని నా మహిమను తలచుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది.
తూర్పున శిరస్సు, పడమర తోకగా, తోక వెడల్పుగా ఇరువది బారల పొడవుగల నల్లని ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజులకు అందరికీ కన్పిస్తుంది. ఆకాశం ఎర్రబడి, ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి.
ఈశ్వరమ్మను. రంగరాజునకిచ్చి వివాహం చేసేనాటికి కందిమల్లయ్య పల్లె నవరత్న మండపాలతో పన్నెండు ఆమడల పట్నమవుతుంది. నా భక్తులు యావన్మంది యిక్కడకు వచ్చి కళ్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం’’
ఈ కాల జ్ఞానం విన్న తరువాత నవాబు, స్వామివారికి అనేక బహుమతులను అందజేశాడు. ఆ బహుమతులను బ్రహ్మగారి మఠంలోనే వుంచారు.
కొన్ని రోజుల తరువాత కొంతమంది దొంగలు ఈ వస్తువులను ఏ విధంగా అయినా దోచుకోవాలని అక్కడికి వచ్చారు. ఆ రాత్రి మఠంలో ప్రవేశించి ఆ వస్తువులను పట్టుకున్నారు. అంతే! వారికి కండరములు స్వాధీనంలో లేకుండా అయిపోయాయి. ఎంత ప్రయత్నించినా మాట కూడా మాట్లాడలేకపోయారు. భయంతో అలాగే నిలబడి చూడటం తప్ప వేరే ఏమీ చేయలేకపోయారు.
వారిని పట్టుకున్నారు ఆశ్రమవాసులు. ఇది తెలిసి అక్కడికి వచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి. వారిని చూసినా, ఆయన కోపం తెచ్చుకోలేదు. పైగా వారికి తగిన బోధ చేయాలని నిర్ణయించుకుని, వారికీ సైతం కాలజ్ఞానాన్ని ఉపదేశించారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. అద్భుత సృష్టి - 15 🌹*
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌟. యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్ 🌟*
శరీరంలో ప్రతి కణంలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి.
ప్రతి క్రోమోజోమ్ లో DNA Strands - ప్రోగులు ఉంటాయి. మొదటి క్రోమోజోమ్ అయిన మాస్టర్ సెల్ లోని
క్రోమోజోమ్స్ నే *"యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్"* అంటారు.
💫. ఈ క్రోమోజోమ్స అన్నీ X,Y ఆకారంలో ఉండి పెయిర్స్ గా ఉంటాయి. ఒక్క క్రోమోజోమ్ ని కనుక ఆక్టివేట్ చేస్తే మిగిలినవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇవన్నీ మార్ఫోజెనిటిక్ ఫీల్డ్ లో ఉంటాయి.
ఈ యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్ మానవుని యొక్క దినచర్యను నిర్దేశిస్తాయి.
ఈ యూత్ వైటాలిటీక్రోమోజోమ్స్ లోనే షాడో DNA అనే తంతులు (ప్రోగులు) ఉంటాయి. ఈ షాడో DNA లోనే మానవుని యొక్క సమస్త సమాచారం జ్ఞానం దాగి ఉంటుంది.
🌟 *షాడో DNA Strands (DNA ప్రోగులు)*
మాస్టర్ సెల్ ని మనం కలిగి ఉన్నాం. ఈ మాస్టర్ సెల్ వలనే మనం భగవంతుని జీవిగా గుర్తించబడ్డాం( భగవంతుని ప్రతిరూపాలు). మాస్టర్ సెల్ లోని క్రోమోజోమ్స్ లో DNA ఉంటుంది,ఈ DNA 2ప్రోగులు యాక్టివ్ గానూ 10 ప్రోగులు నిద్రాణస్థితిలో ఉన్నాయి. ఈ నిద్రాణమైన DNA నే *"షాడో DNA"* అంటారు.
💫. ఈ నిద్రాణమై ఉన్న షాడో DNA లోనే మానవుని యొక్క జన్మాంతర జ్ఞానం మరి శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి.
💫. మానవుని యొక్క పరిణామక్రమంలో ప్రతికూల జ్ఞాపకాలు (నెగిటివ్ ఫీలింగ్స్) చేరటం వలన ఇవి అన్నీ DNA లో భాగంగా మారిపోయాయి. ఇవి అన్నీ వివిధ వ్యాధుల రూపంలో బయటకు వస్తాయి.
అలాగే ఎన్నో జన్మల నుండి తెచ్చుకున్న కర్మలు, ఎన్నో లోకాల యొక్క జ్ఞానం ఈ షాడో DNA లోనే దాగి ఉంటుంది. మనం మన 12 ప్రోగులను జాగృత పరచాలంటే వీటిని క్లియర్ చేసి, జ్ఞానాన్ని అభివృద్ధి పరచవలసి ఉంటుంది. దీనినే *"DNA యాక్టివేషన్"* అన్నారు.
💫. ఈ DNA యాక్టివేషన్ లో క్లీనింగ్ తర్వాత 2ప్రోగుల DNA.. 12 ప్రోగుల DNA గా మార్పు చెందుతుంది.
ఇది 16 దశలలో జరుగుతుంది. ఈ దశలలో DNA తంతులలోకి రెయిన్ బో లైట్ వస్తుంది. దీని ద్వారా క్రోమోజోమ్స్ చివరలకు క్యాపింగ్ ఏర్పడతాయి. వీటినే *"టెలిమియర్ క్యాపింగ్"* అంటారు. ఇది అంతా కూడా *"లా ఆఫ్ టైమ్"* ప్రకారం మూలం యొక్క పూర్తి అంగీకారంతో జరుగుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 159 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 6. The ‘I am’ is, it’s ever fresh, all else is inference, when the ‘I am’ goes all that remains is the Absolute. 🌻*
This sense of ‘being’ is always there, fresh as ever, it doesn’t leave you, it’s always available. At whatever stage you are in your life it has stuck to you unchanged.
Circumstances, relationships, people, ideas and so forth everything else has been changing and is inferential but the ‘I am’ remained and has stood throughout this turbulence.
And what would happen when this ‘I am’ goes? What would remain? The hint is now more emphatic on something beyond the ‘I am’, the Absolute.
🌹 🌹🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 37 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 1 🌻*
ఒకవేళ చెప్పినా “తద్దూరే, తన్నైదూరే” అంటే దానికంటే దూరం లేదు, దాని కంటే దగ్గర లేదు .
“తన్నైజతి” దానికెంతో ప్రయాణం చేసినా కూడా దొరకదు. అసలు ప్రయాణమే చెయ్యకుండా కూడా దొరుకుతుంది. ఇలాంటి పద్ధతిలో ఆత్మవస్తువు గురించి చెప్పడం జరుగుతుంది. ఇది నిత్యవస్తువు అంటే.
మరి ఎప్పుడూ వుంది ఎప్పుడూ లేదు. ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది ఎప్పుడూ ప్రకాశించదు. ఇలాంటి తత్ భిన్న వ్యతిరేక లక్షణాలని ఒకేచోట ప్రతిపాదిస్తూ ఆత్మ గురించి చెప్పబడుతూ వుంటుంది.
మరి ఈ విధంగా ఒకేసారి చెప్పినప్పుడు సరియైనటువంటి విధానం అందుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆత్మానుభూతి పొందినటువంటి మహానుభావులు ఎవరైతే వుంటారో, వారు మాత్రమే ఆత్మను గురించి చక్కగా బోధించ గలుగుతారు. అందుచేతనే ఆత్మతత్వమును బోధించువారు అరుదుగానుందురు.
మీరొక కోటిమంది గురువులని - జీవితంలో ‘గురువు’ అన్నవాళ్ళ అందరి దగ్గరికీ వెళ్ళారనుకోండి, గురువులందరూ గురువులే. ఎవరూ కాదనలేరు. కానీ ఇందులో అనేక రకాలైనటువంటి గురువులు వున్నారని ముందే చెప్పుకున్నాం కదా. వాళ్ళందరిలో కూడా ఒకానొకడు మాత్రమే కేవలము ఆత్మానుభూతిని గురించి మాత్రమే పాఠం చెప్పేటటువంటి వాడు వుంటాడు.
వాడి దగ్గర మిగిలిన అంశాలను స్పృశించారనుకోండి, ఏం ప్రయోజనం లేదు.వాళ్ళ దగ్గర ఆ షాపులో అవి దొరకవనమాట. వజ్రాల షాపుకెళ్ళి ఏమండీ కందిపప్పు ఇస్తారా, పెసరపప్పు ఇస్తారా అంటే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. మా దగ్గర అటువంటివిలేవండి. ఆ స్టాక్ లేవు మా దగ్గర అంటారు.
అట్లాగే ఆత్మానుభూతి, ఆత్మోపదేశము, ఆత్మనిష్ఠ, ఆత్మసాక్షాత్కార జ్ఞానము - జ్ఞానమార్గమునకు సంబంధించినటు వంటి బోధావిధిని అనుసరించేటటు వంటి వాళ్ళు ఎవరైతే వున్నారో, వాళ్ళని మీరు ఎన్ని సంవత్సరాలు ఆశ్రయించినా, ఎన్ని రకాలుగా స్పృశించినా, ఏ కాలంలో అయినాసరే వాళ్ళు కేవలము జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమె బోధిస్తారు.
మిగిలిన అంశాలు వాళ్ళ దగ్గర ప్రయోజనం లేదు. భగవద్గీత కూడా ఏం చెప్తోంది ”జ్ఞానినస్ తత్వదర్శినః”. జ్ఞాని అని చెప్పాలి అంటే అతడు తత్వదర్శియై వుండాలి.
తద్వి ప్రణిపాతేన పరి ప్రణ్నేన సేవయా ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వ దర్శినః”
అనే శ్లోకంలో వుంటుందనమాట ఇది. ఇది మీరు అనుసరించి ఆశ్రయించేవాడు కూడా పరిప్రశ్నతో ఆశ్రయించాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 14. అశోకత్వము - అవ్యక్తముగ నున్నది వ్యక్తమైనపుడు పుట్టినదనుకొనుట, వ్యక్తమైనది అవ్యక్తమును జేరునపుడు చచ్చినదను కొనుట అజ్ఞానము. 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 30 📚*
దేహీ నిత్య మవధ్యో-యం దేహే సర్వస్య భారత |
తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి || 30
సృష్టి సమస్తమూ ఒక దిశగా వ్యక్తమగుచుండగా, మరియొక దిశగా అవ్యక్తమును చేరుచూ మరల వ్యక్తమగుచుండును. వ్యక్తము కానపుడు సూత్రప్రాయముగను, వ్యక్తమగునపుడు రూపాత్మకముగను ఒకే తత్త్వము నిలచియున్నది.
చోటులోని కనపని నీరు వర్షమైనప్పుడు వ్యక్తముగను, భూమికి చేరి ప్రవహించునపుడు 'నది' యగును. ఉత్తర దక్షిణ ధృవములందు కఠినమైన మంచుగడ్డ యగును. సూర్యరశ్మిచే మరల క్రమశః చోటును చేరును. మరల అవ్యక్త మగును. కాలక్రమమున మరల వర్షముగ వ్యక్తమగును.
సృష్టిలోని సమస్త వస్తువులూ అట్టివే. వ్యక్తావ్యక్తముగ చక్ర భ్రమణమున అగుపించుచూ అదృశ్యమగుచూ, నిరంతరమూ వుండును.
ఈ ధర్మమును తెలిసినవాడు దేనికిని శోకింపడు. అతనికి జననము - మరణము అనునవి మిథ్యా పదములే. కనుక జీవుల పుట్టుకయందు ఉత్సాహము, మరణము నందు దుఃఖము వానికి కలుగవు.
పుట్టునవి - చచ్చునవి అని ఏమియూ లేవు. శాశ్వత దర్శన మొక్కటే యుండును. దానియందతడు ఉపస్థితుడై యుండును.
ఇట్టి దర్శనము మాత్రమే సమస్త శోకముల నుండి జీవుని తరింప జేయగలదని 'గీతోపనిషత్తు' బోధించు చున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹