🌹. శివగీత - 44 / 𝓣𝓱𝓮 𝓢𝓲𝓿𝓪 - 𝓖𝓲𝓽𝓪 - 44 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
షష్ట మాధ్యాయము
🌻. విభూతి యోగము - 8 🌻
ఏషోస్మి దేవః ప్రదిశో పి సర్వాః
పూర్వో హాయ్ జాతో స్మ్రుహమేవ గర్భే
అహం మి జాత శ్చ జనిష్య మాణః
ప్రత్యగ్జ నాస్తి ష్టతి సర్వతో ముఖః 46
విశ్వత శ్చక్షు రుత విశ్వతో ముఖో
విశ్వతో బాహు రుత విశ్వాత స్సాత్,
సంబాహుభ్యా సమతి సం పత త్రై
ర్ద్యావాభూమీ జనయన్ దేవ ఏకః 47
వాలాగ్రమాత్రం హృదయస్య మధ్యే
విశ్వేదేవం జాతవేదం వరేణ్యమ్
మామాత్మ స్థం యేను పవ్యంతి ధీరా
స్తేషాం శాంతి శ్శాశ్వతీ నే త రేషామ్ 48
అహం యోని మది తిష్టామి చైకో
మయేదం పూర్ణం పంచ విధం చ సర్వమ్,
మా మీశానం పురుషం దేవ మిత్ధం
విచార్య మాణం శాంతి మత్యంత మేతి 49
ప్రాణే ష్వంత ర్మన సో లింగ మాహు
ర్మస్మిన్న శనాయా చ తృష్ణా క్షమాచ
తృష్ణాం ఛి త్వా హేతుజాలస్య మూలం
బుద్ధ్యా చిత్తం స్థాపయిత్వా మయీహ 50
దిశలను బుట్టినవాడును, జనన మందు వాడును, పుట్టబోవు వాడును, వృద్ధి చెందిన వాడును, (పెద్ద - జ్యేష్టుడు) సర్వతోముకుండును నేనే.
లోకములను రక్షించువాడును, విశ్వమే చక్షువులగను, ముఖములుగను, బాహువులుగను, పాదములుగాను కలవాడును, భూ:- భువః- స్వర్గాదుల స్రష్టను నేనే,
పోగా నిఖిలజన హృదయంబుల తో వాలాగ్ర మాత్రమగు ప్రకాశ స్వరూపముగా నుండు నన్ను ప్రపంచమునకు ప్రభువుగాను, ముఖ్యునిగాను, ఆత్మస్థితునిగాను ఎవ్వరైతే తెలిసికొందురో అట్టి వారలకే శాశ్వతమగు శాంతి కలుగును. ఇతరులకు కలుగనేరదు.
నే నొక్కడినే సమస్తములకు కారణభూతుండనై అయిదు ప్రాకారములుగా నిఖిల లోకమంతటిని సృష్టించి సర్వాంతర్యామినై యుండెదను.
ఈ విధముగా న్నీశ్వరునిగా తెలిసికొని, పురాణ పురుషునిగాను, మహాదేవునిగాను పరిశీలించువాడు మిగుల శాంతి చెందును.
ఆకలి దప్పికలకు ఓర్పునకేది పుట్టుకయో అట్టి ప్రాణములోని యాత్మకు కారణభూతుడిగా నన్ను వ్యావహరింతురు. అట్టి నాయందు మనస్సును కేంద్రీకరింపచేసి ఎవ్వరైతే ధ్యానించుచు భజింతురో అటువంటి వారలకే శాశ్వత శాంతి లభించును. ఇతరులకు కలుగదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 𝓣𝓱𝓮 𝓢𝓲𝓿𝓪 - 𝓖𝓲𝓽𝓪 - 44 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 06 :
🌻 Vibhooti Yoga - 8 🌻
I am the lord who is born within directions (space and time),
I'm the one being born, I'm the one who is still inside the womb, I'm the old aged one, and I am the one who has faces everywhere.
I'm the protector of the worlds. All faces are my faces, all eyes are my eyes, all limbs are my limbs. I am the creator of BhuBhuvahSuvar kind of worlds.
Moreover people who realize me as the one dwelling in the hearts of all as a divine light, as the master and leader of all creation; such a kind of Jiva only can attain permanent peace called liberation, Others can not! I alone remain as the cause behind the creation and dwell as the inner soul of all.
In this way one who knows me as Eswara, primordial being, Mahadeva, and enquires into me such a one gains liberation. The Prana which is the cause of all sensations like hunger, thirst etc. such a Prana is also I alone.
One who meditates on me, and worships me such a one gains final bestitude as eternal peace. Others do not gain that.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
27 Aug 2020
No comments:
Post a Comment