🌹 . శ్రీ శివ మహా పురాణము - 207 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
45. అధ్యాయము - 20
🌻. శివుడు కైలాసమునకు వెళ్లుట - 6 🌻
క్వచిత్కైలాస కుధరసుస్థానేషు మహేశ్వరః | విజహార గణౖః ప్రీత్యా వివిధేషు విహారవిత్|| 55
ఇత్థం రుద్రస్వరూపోsసౌ శంకరః పరమేశ్వరః | అకార్షీత్స్వగిరౌ లీలా నానా యోగివరోsపి యః || 56
నీత్వా కాలం కియంతం సోsపత్నీకః పరమేశ్వరః | పశ్చాదవాప స్వపత్నీం దక్షపత్నీ సముద్భవామ్ || 57
విజహార తయా సత్యా దక్షపుత్ర్యా మహేశ్వరః | సుఖీ బభూవ దేవర్షే లోకాచార పరాయణః || 58
విహారమునెరింగిన మహేశ్వరుడు ఒకప్పుడు కైలాస పర్వతప్రదేశముల యందు గణములతో కూడి ప్రీతితో విహరించెడివాడు (55).
శంకర పరమేశ్వరుడు యోగి శ్రేష్ఠుడే అయినా, ఈ తీరున రుద్ర రూపుడై తన పర్వతమునందు అనేక లీలలను చేసెను (56).
ఆ పరమేశ్వరుడు భార్య లేకుండగా కొంతకాలమును గడిపి, తరునాత దక్షుని కుమార్తెను వివాహమాడెను (57).
ఓ దేవర్షీ! మహేశ్వరుడు దక్షపుత్రియగు ఆ సతీదేవితో గూడి లోకాచారములను అనుష్ఠించుచూ సుఖియై విహరించెను (58).
ఇత్థం రుద్రావతారస్తే వర్ణి తోsయం మునీశ్వర| కైలాస గమనం చాస్య సఖిత్వాన్నిదిపస్య హి || 59
తదంతర్గత లీలాపి వర్ణితా జ్ఞాన వర్థినీ | ఇహాముత్ర చ యా నిత్యం సర్వకామఫలప్రదా || 60
ఇమాం కథాం పఠేద్యస్తు శృణుయాద్వా సమాహితః | ఇహ భుక్తిం సమాసాద్య లభేన్ముక్తిం పరత్ర సః || 61
ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే కైలాసోపాఖ్యానే శివస్య కైలాసగమనం నామ వింశోsధ్యాయః (20).
ఓ మహర్షీ! నీకు ఈ తీరున రుద్రావతారమును, కుబేరుని మైత్రి కారణము వలన శివుడు కైలాసమునకు వెళ్లుటను వర్ణించితిని (59).
ఈ గాథలో అంతర్గతముగా నున్న లీలలను కూడ వర్ణించితిని. ఈ గాథ జ్ఞానమును వృద్ధి పొందించును. ఇహ పరములయందు నిత్యము కోర్కెలనన్నిటినీ ఈడేర్చును (60).
ఎవరైతే ఈ కథను శ్రద్ధతో పఠించెదరో, లేదా వినెదరో, వారు ఇహలోకములో భుక్తిని పొంది, పరలోకములో ముక్తిని పొందెదరు (61).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు మొదటి ఖండములో కైలాసోపాఖ్యానములో శివుడు కైలాసమునకు వెళ్లుట అనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).
శ్రీ కృష్ణార్పణమస్తు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
27 Aug 2020
No comments:
Post a Comment