🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 26 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని మూడవ పాత్ర : సృష్టికర్త (త్రిమూర్తిత్వము) - 4 🌻
97. ఆభావము యొక్క ఆవిష్కామైన సృష్టి, మిథ్య ద్వారా ఉన్నట్లు కనిపించుచున్నది.
98.అభావము యొక్క అసంఖ్యాక రూపముల వ్యక్తీకరణమే సృష్టి.
99. అనంత సర్వమ్, అయిన భగవంతునిలో, విలాసము (చిద్విలాసము) తరంగములవలె చలించుటకు పూర్వము, సర్వములో అంతర్నిహితమైయున్న అభావమున్నూ, అభావమునుండి ఆవిర్భవించిన సృష్టి యున్నూ ఒకేసారి బయటికి పొడుచుకురాగా , పరాత్పరస్థితిలో అభావముగా అంతర్నిహితమైయున్న చైతన్యము.
క్రమక్రమముగా భగవంతుని చైతన్యము గా ఆవిర్భవించి, సర్వమ్ నుండి పుట్టిన సృష్టికి తానే కర్తననెడి అనుభవమును భగవంతునికి కలుగజేసినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
27 Aug 2020
No comments:
Post a Comment