🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 37 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 1 🌻
ఒకవేళ చెప్పినా “తద్దూరే, తన్నైదూరే” అంటే దానికంటే దూరం లేదు, దాని కంటే దగ్గర లేదు .
“తన్నైజతి” దానికెంతో ప్రయాణం చేసినా కూడా దొరకదు. అసలు ప్రయాణమే చెయ్యకుండా కూడా దొరుకుతుంది. ఇలాంటి పద్ధతిలో ఆత్మవస్తువు గురించి చెప్పడం జరుగుతుంది. ఇది నిత్యవస్తువు అంటే.
మరి ఎప్పుడూ వుంది ఎప్పుడూ లేదు. ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది ఎప్పుడూ ప్రకాశించదు. ఇలాంటి తత్ భిన్న వ్యతిరేక లక్షణాలని ఒకేచోట ప్రతిపాదిస్తూ ఆత్మ గురించి చెప్పబడుతూ వుంటుంది.
మరి ఈ విధంగా ఒకేసారి చెప్పినప్పుడు సరియైనటువంటి విధానం అందుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆత్మానుభూతి పొందినటువంటి మహానుభావులు ఎవరైతే వుంటారో, వారు మాత్రమే ఆత్మను గురించి చక్కగా బోధించ గలుగుతారు. అందుచేతనే ఆత్మతత్వమును బోధించువారు అరుదుగానుందురు.
మీరొక కోటిమంది గురువులని - జీవితంలో ‘గురువు’ అన్నవాళ్ళ అందరి దగ్గరికీ వెళ్ళారనుకోండి, గురువులందరూ గురువులే. ఎవరూ కాదనలేరు. కానీ ఇందులో అనేక రకాలైనటువంటి గురువులు వున్నారని ముందే చెప్పుకున్నాం కదా. వాళ్ళందరిలో కూడా ఒకానొకడు మాత్రమే కేవలము ఆత్మానుభూతిని గురించి మాత్రమే పాఠం చెప్పేటటువంటి వాడు వుంటాడు.
వాడి దగ్గర మిగిలిన అంశాలను స్పృశించారనుకోండి, ఏం ప్రయోజనం లేదు.వాళ్ళ దగ్గర ఆ షాపులో అవి దొరకవనమాట. వజ్రాల షాపుకెళ్ళి ఏమండీ కందిపప్పు ఇస్తారా, పెసరపప్పు ఇస్తారా అంటే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. మా దగ్గర అటువంటివిలేవండి. ఆ స్టాక్ లేవు మా దగ్గర అంటారు.
అట్లాగే ఆత్మానుభూతి, ఆత్మోపదేశము, ఆత్మనిష్ఠ, ఆత్మసాక్షాత్కార జ్ఞానము - జ్ఞానమార్గమునకు సంబంధించినటు వంటి బోధావిధిని అనుసరించేటటు వంటి వాళ్ళు ఎవరైతే వున్నారో, వాళ్ళని మీరు ఎన్ని సంవత్సరాలు ఆశ్రయించినా, ఎన్ని రకాలుగా స్పృశించినా, ఏ కాలంలో అయినాసరే వాళ్ళు కేవలము జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమె బోధిస్తారు.
మిగిలిన అంశాలు వాళ్ళ దగ్గర ప్రయోజనం లేదు. భగవద్గీత కూడా ఏం చెప్తోంది ”జ్ఞానినస్ తత్వదర్శినః”. జ్ఞాని అని చెప్పాలి అంటే అతడు తత్వదర్శియై వుండాలి.
తద్వి ప్రణిపాతేన పరి ప్రణ్నేన సేవయా ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వ దర్శినః”
అనే శ్లోకంలో వుంటుందనమాట ఇది. ఇది మీరు అనుసరించి ఆశ్రయించేవాడు కూడా పరిప్రశ్నతో ఆశ్రయించాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ #సద్గురువిద్యాసాగర్
27 Aug 2020
No comments:
Post a Comment