శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 219 / Sri Lalitha Chaitanya Vijnanam - 219

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 219 / Sri Lalitha Chaitanya Vijnanam - 219 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥

🌻 219. 'మహాభోగా' 🌻

అనిర్వచనీయమైన, అమితమైన సుఖము, సౌకర్యము, గము, ధనము కలది శ్రీమాత అని అర్థము. భోగమనగా మనస్సు, ఇంద్రియములు, శరీరము పొందు ఆనందము. వీనికి కావలసినది సుఖము, సౌఖ్యము. అందులకు వలసినది ధనము. పంచ భూతములతో కూడిన సృష్టియందు పంచేంద్రియముల ద్వారా, శరీరముద్వారా సౌఖ్యమును పొందుట మానసిక కక్ష్యలో జీవుడు కోరు స్థితి. శరీరములేనిదే భోగము లేదు.

శరీరమున్నను, ఇంద్రియములు లేనివారు భోగించలేరు. ఇంద్రియ స్పర్శయే భోగము. మంచి శబ్దము, చక్కని దృశ్యము, సువాసనలు, రుచికరమగు అన్నపానీయములు, శీతోష్ణస్పర్శ, అవి యింద్రియముల నుండి, పంచ భూతముల నుండి, పంచతన్మాత్రల నుండి లభించును. భోగములను దేహేంద్రియముల ద్వారా అనుభవించుటకు మనస్సుండ వలెను. మనో బుద్ధి కక్ష్యలోనికి దిగనిదే జీవునికీ భోగముండదు.

భోగమానందము కొఱకే పిల్లలా నందించుటకు తల్లిదండ్రులు రక రకములుగ ప్రయత్నించుదురు. అట్లే జీవులానందము కొఱకు శ్రీమాత సృష్టియందెన్నియో ఆకర్షణలు సృష్టించినది. జీవులు భోగించుచు ఆనందించు చుండగతానునూ ఆనందించును. అందులకే ఆమె మహాభోగ.

భోగము లేర్పరచుట, అనుభవించుటకు దేహాదుల నేర్పరచుట, జీవులకు భోగానందము కలిగించుట, వారి రూపమున తాను కూడ భోగించుట చేయుచు నుండును.

భోగ జీవనమునకు శాస్త్రమునందెట్టి అభ్యంతరము తెలుపబడలేదు. ధర్మయుక్తమగు భోగము రాజయోగులు సహిత మనుభవింతురు. భోగము యోగమున కంతరాయము కాదు.

యోగ భోగములు వైభవమే అని ఆచరించి చూపినవారు శ్రీకృష్ణుడు, జనకుడు ఆదిగా గల యోగులు. రోగమునకు దారితీయు భోగము, ధర్మ సమ్మతము గాని భోగము వర్ణనీయములు. శ్రీమాత అందించు భోగము వైభవమునకే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 219 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Mahā-bhogā महा-भोगा (219) 🌻

She is the embodiment of immeasurable happiness. All that prevails in this universe is wealth for Her, as She presides over the universe.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

25 Feb 2021

విజయానికి సంకేతం నిర్భయం

🌹. విజయానికి సంకేతం నిర్భయం 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

‘ఒకడు కొండ అంచున ఉన్న కనుమ దారిలో నడుస్తున్నాడు. మెల్లమెల్లగా చీకటి పడుతోంది. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న అతను కాలుజారి లోయలో పడిపోతూ చేతికి దొరికిన కొండ అంచునే ఉన్న చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని వేలాడుతూ కిందకు చూడగా ఎక్కడో పాతాళంలో ఉన్న అగాధం అతనికి లీలగా కనిపించింది కానీ, అతని కాళ్ళకిందనే ఉన్న పెద్ద బండరాయి మాత్రం అతనికి కనిపించలేదు.

వెంటనే అతను భయంతో ఆ చెట్టుకొమ్మను ఇంకా గట్టిగా పట్టుకుని ఎవరైనా సహాయం చేస్తారేమో అనే ఆశతో ‘‘రక్షించండి, రక్షించండి’’అని గట్టిగా అరిచాడు. కానీ, అతనిని రక్షించేందుకు అక్కడ ఎవరూ లేరు. అతని మాటలు మాత్రం ఆ లోయనుంచి ప్రతిధ్వనించాయి. అతని చేతులు మండి పోతుండడంతో పట్టు జారిపోతోంది.

వేరే దారిలేక, లేని శక్తిని కూడగట్టుకుని అనుక్షణం నరకయాతన పడుతూ ఆ రాత్రంతా అతను అలా ఆ చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతూనే ఉన్నాడు. మొత్తానికి తెల్లారింది. ఆ వెలుగులో అతను మళ్ళీ కిందకు చూడగా అతని కాళ్ళకు ఆరు అంగుళాల కిందనే ఉన్న పెద్ద బండరాయి అతనికి కనిపించింది. వెంటనే అతను దానిపై దిగి ఊపిరి పీల్చకున్నాడు.’’

కాబట్టి, నాకున్న అనుభవం మేరకు భయం లోతు కేవలం ఆరు అంగుళాలు మించి ఉండదని నేను మీకు స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు చెట్టుకొమ్మనే పట్టుకుని రాత్రంతా అవస్థపడుతూ వేలాడాలా లేక దాన్ని వదిలేసి మీ కాళ్ళపై మీరు నిలబడాలా అనేది మీ ఇష్టం. అది మీ చేతుల్లోనే ఉంది. నిజానికి భయపడేందుకు ఏమీలేదు. కాబట్టి, దేనికీ భయపడకండి.

నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా తెలిసినది వదులుకుని, తెలియని దానిలోకి ప్రవేశించినపుడే భయం బయలుదేరుతుంది. అట్లా భయపడకుండా కొత్తదాన్ని కూడా ఆహ్వానించడమే అంటే అందులో ప్రవేశించడమే ధైర్యం. కనుక తెలిసిన దాన్ని వదులుకునేందుకు, తెలియని దానిలోనికి వెళ్లేందుకు ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారే నిర్భయస్తులు, దైర్యవంతులు ఇట్లా వారిని ఏవిధంగా నైనా పిలుచుకోవచ్చు.

కాని అందరూ అంటే చాలామంది తెలిసిన దానిని వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే పూర్తిగా తెలిసిన దానిలో భద్రత కనిపిస్తుంది ఇదిగో ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది. ఇది నిశ్చయంగా తెలుస్తుంది.

కనుక దీన్ని చేయడానికే ఇష్టపడుతారు కానీ ఫలితమేమి వస్తుందో తెలియక పోతే దాన్ని నిర్భయంగా చేయడానికి చాలామంది జంకుతారు. ఈ జంకడమే భయం.

జీవన్మరణాల మధ్య వేలాడే స్థితి ఏర్పడినపుడు గతం ఏమాత్రం గుర్తుకురాదు. భవిష్యత్తు పైన ఏలాంటి కోరికా ఉండదు. దీనినే వర్తమానం అంటారు. ఈ వర్తమానాన్ని జాగ్రత్త ఆలోచించి మెలిగితే గతం గురించి బాధ ఉండదు. భవిష్యత్తు గురించీ బెంగ ఉండదు.

ధైర్యంగా నిశ్చయంగా ముందుకు అడుగువేయలా వద్దా అనే సంశయాన్ని వీడండి. ధైర్యమెప్పుడూ విజయాన్ని కలుగ చేస్తుంది. కనుక ధైర్యంగా ముందుకు వెళ్లండి. దేనికీ భయపడకండి.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹

25 Feb 2021

దేవాపి మహర్షి బోధనలు - 42

🌹. దేవాపి మహర్షి బోధనలు - 42 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 29. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 2 🌻

ఒకరోజు, నేనిట్లే నా ఉపన్యాసము ముగిసిన పిదప డంబమును ప్రదర్శించుచుండగా, ఆమె నా దగ్గరకు వచ్చి కన్నులలో కళ్ళు పెట్టి సూటిగ చూచుచూ యిట్లనెను.

“భగవంతుని సామ్రాజ్యము చేరుటకు, ఆయన అంతఃపురమున ప్రవేశించుటకు 12 ద్వారములు కలవని నీవెప్పటికైనను గమనించినచో నేను సంతోషింతును. ప్రపంచమున అన్ని జాతుల వారునూ, అన్ని మతముల వారునూ ఏదో ఒక ద్వారము గుండా దైవగృహ ప్రవేశము చేయగలరు.

అందరునూ నీవు తెలుపు ద్వారము ననే ప్రవేశింతురని అనుకొనుట పసితనము. నీవు చేయు ప్రసంగము లన్నియూ బజారులో ఎలుగెత్తి అరచుట వంటివి. అంతకు మించిన

విలువ వాటికి లేదు.

దైవము ఎన్నియో రకములుగ జీవులను తన దరి జేర్చుకొనునని నీకు తెలియుట ముఖ్యము.” మా వంట మనిషి తీక్షణమైన చూపులతో ఇట్లు పలుకగా ఆ చూపుల నుండి నేను నా గురుదేవులు దేవాది మహర్షి సాన్నిధ్యమును అనుభవించితిని.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

25 Feb 2021

వివేక చూడామణి - 31 / Viveka Chudamani - 31

🌹. వివేక చూడామణి - 31 / Viveka Chudamani - 31 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు

🍀. త్రిగుణాలు - 1 🍀

117. సత్వ గుణము స్వచ్ఛమైన నీరు వంటిది. అయినప్పటికి అది రాజస, తామస గుణాలతో కలసినప్పుడు మార్పులకు లోనగును. సత్వ గుణములో ఆత్మ వ్యక్తమవుతుంది. అది ఎలా అంటే సూర్య కిరణము ప్రాపంచిక వస్తు సముదాయము పై వ్యక్తమైనట్లు.

118. ఇతర గుణములతో కూడిన సత్వ గుణము యమ, నియమాలు, గర్వము మొదలగునవి లేకపోయినప్పటికి; నమ్మకము, భక్తి, విముక్తికై కోరిక దైవిక లక్షణాలు మరియు అసత్యాలకు దూరముగా ఉండుట అను లక్షణాలు కలిగి ఉంటారు.

119. స్వచ్ఛమైన సత్వగుణము యొక్క లక్షణములు; సంతోషము, ఆత్మ దర్శనము, ఉన్నతమైన శాంతి, తృప్తి, ఆనందము మరియు దివ్యాత్మల ఎడల భక్తి మొదలగు వాటి వలన సాధకుడు అంతములేని ఆనందమును సదా అనుభవించుచుండును.

120. సత్వ, రజో, తమో గుణములతో కూడిన ఆత్మ యొక్క ఈ తాత్కాలిక శరీరముతో పోల్చిన స్వచ్ఛమైన సత్వ గుణము యొక్క లక్షణములు; గాడ నిద్ర దాని ప్రత్యేకత. ఆ స్థితిలో మనస్సు యొక్క అన్ని చర్యలు అంతమైపోవును.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 31 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 Three Gunas - 1 🌻

117. Pure Sattva is (clear) like water, yet in conjunction with Rajas and Tamas it makes for transmigration. The reality of the Atman becomes reflected in Sattva and like the sun reveals the entire world of matter.

118. The traits of mixed Sattva are an utter absence of pride etc., and Niyama, Yama, etc., as well as faith, devotion, yearning for Liberation, the divine tendencies and turning away from the unreal.

119. The traits of pure Sattva are cheerfulness, the realisation of one’s own Self, supreme peace, contentment, bliss, and steady devotion to the Atman, by which the aspirant enjoys bliss everlasting.

120. This Undifferentiated, spoken of as the compound of the three Gunas, is the causal body of the soul. Profound sleep is its special state, in which the functions of the mind and all its organs are suspended.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

25 Feb 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 308, 309 / Vishnu Sahasranama Contemplation - 308, 309

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 308/ Vishnu Sahasranama Contemplation - 308 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻308. ఇష్టః, इष्टः, Iṣṭaḥ🌻

ఓం ఇష్టాయ నమః | ॐ इष्टाय नमः | OM Iṣṭāya namaḥ

ఇష్టః, इष्टः, Iṣṭaḥ

పరమానందాత్మకత్వాత్ ప్రియ ఇష్ట ఇతీర్యతే ।
యజ్ఞేన పూజిత ఇతి వా తథా హరి రుచ్యతే ॥

పరమానందరూపుడు కావున ఎల్లరకును విష్ణువు ప్రియమైనవాడు కావున ఇష్టః అని పిలువబడును. లేదా యజ్ఞములందు పూజింపబడువాడు కావున విష్ణువు ఇష్టః.

:: శ్రీమద్రామాయణే బాలకాండే అష్టాదశస్సర్గః ::

తేషామపి మహాతేజా రామస్సత్యపరాక్రమః ।
ఇష్టః సర్వస్య లోకస్య శాశాంక ఇవ నిర్మలః ॥ 25 ॥

రఘువంశజులలో మహాతేజశ్శాలియైన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమముగలవాడు. సమస్తప్రజలకును పూర్ణచంద్రునివలె ఆహ్లాదకరుడు లేదా ప్రియమైనవాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 308🌹

📚. Prasad Bharadwaj

🌻308. Iṣṭaḥ🌻

OM Iṣṭāya namaḥ

Paramānaṃdātmakatvāt priya iṣṭa itīryate,
Yajñena pūjita iti vā tathā hari rucyate.

परमानंदात्मकत्वात् प्रिय इष्ट इतीर्यते ।
यज्ञेन पूजित इति वा तथा हरि रुच्यते ॥

One who is dear to all because He is of the nature of supreme bliss. Or one who is worshiped in iṣṭi or yajña i.e., sacrifice.

Śrīmad Rāmāyaṇa - Book 1, Chapter 18

Teṣāmapi mahātejā rāmassatyaparākramaḥ,
Iṣṭaḥ sarvasya lokasya śāśāṃka iva nirmalaḥ. (25)

:: श्रीमद्रामायणे बालकांडे अष्टादशस्सर्गः ::

तेषामपि महातेजा रामस्सत्यपराक्रमः ।
इष्टः सर्वस्य लोकस्य शाशांक इव निर्मलः ॥ २५ ॥

Among all of them, Rāma stood out with his supreme radiance and true valor. He endeared everyone like a spotless moon.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 309/ Vishnu Sahasranama Contemplation - 309🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 309. అవిశిష్టః, अविशिष्टः, Aviśiṣṭaḥ 🌻

ఓం అవిశిష్టాయ నమః | ॐ अविशिष्टाय नमः | OM Aviśiṣṭāya namaḥ

అవిశిష్టః, अविशिष्टः, Aviśiṣṭaḥ

అవిశిష్టః అసమస్తానామంతర్యామితయా హరిః. సర్వేషాం అంతర్యామిత్వేన - అవిశిష్టః ఎల్ల ప్రాణులకును ఎల్ల పదార్థములకును అంతర్యామి అనగా లోపలగా ఉండుచు వానిని తమ తమ వ్యాపారములందు ప్రవర్తిల్లజేయుచూ అదుపులోనుంచువాడు కావున హరి అవిశిష్టుడు. ఏ భేదమును లేక అంతటను సమరూపముతో నుండువాడు.

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::

వ.కావున విషయంబులఁ జిక్కువడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబు గాదు, రమ్యమయ్యును బహుతర ప్రయాస గమ్యమని తలంచితిరేనిఁ జెప్పెద, సర్వభూతాత్మకుండైన సర్వ దిక్కాల సిద్ధుండై బ్రహ్మ కడపలగాఁ గల చరాచర స్థూల సూక్ష్మజీవసంఘంబు లందును, నభోవాయుకుంభినీ సలిల తేజంబు లనియెడు మహాభూతంబులయందును, భూతవికారంబు లయిన ఘటపటాదుల యందును,

గుణసామ్యం బయిన ప్రధానమందును, గుణవ్యతిరేకం బైన మహత్తత్త్వాదియందును, రజస్సత్త్వతమోగుణంబుల యందును భగవంతుం డవ్యయుం డీశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మ మనియెడు వాచకశబ్దంబులు గల్గి కేవలానుభవానంద స్వరూపకుండు నవి కల్పితుండు ననిర్దేశ్యుండై వ్యాప్యవ్యాపకరూపంబులం జేసి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయు నయి నిర్దేశింపదగి వికల్పితుండై యుండుఁ, దత్కారణంబున నాసుర భావంబు విడిచి సర్వ భూతంబులందును దయాసుహృద్భావంబులు గల్గిన నధోఽక్షజుండు సంతసించు, ననంతు డాద్యుండు హరి సంతసించిన నలభ్యం బెయ్యదియు లేదు, జనార్దనచరణ సరసీరుహ యుగళస్మరణ సుధారస పానపరవశుల మైతిమేని మనకు దైవవశంబున నాకాంక్షితంబులై, సిద్ధించు ధర్మార్థకామంబులు, కాంక్షితంబై సిద్ధించు మోక్షం బననేల? త్రివర్గంబును నాత్మవిద్యయుం దర్కదండనీతి జీవికాదు లన్నియుఁ ద్రైగుణ్య విషయంబు లయిన వేదంబుల వలనం బ్రతిపాద్యంబులు, నిస్త్రైగుణ్యలక్షణంబునం బరమ పురుషుండైన హరికి నాత్మసమర్పణంబు సేయుట మేలు, పరమాత్మ తత్త్వజ్ఞానోదయంబునం జేసి స్వపరభ్రాంతి సేయక పురుషుండు యోగావధూతత్త్వంబున నాత్మ వికల్పభేదంబునం గలలోఁ గన్న విశేషంబుల భంగిం దథ్యం బనక మిథ్యయని తలంచు నని మఱియుఁ బ్రహ్లాదుం డిట్లనియె. (217)

స్నేహితులారా! కోరికలలో కామంతో చిక్కుకొన్న రాక్షసులకు హరిభజన అలవడదు. అలాగని, ఇష్టమైనప్పటికీ చాలా ప్రయాసపడాలి అనుకుంటారేమో! కాదు. వినండి. అన్ని ప్రాణుల మనస్సులలోనూ, అన్నిదిక్కులలోనూ భగవంతుడు ఉన్నాడు. బ్రహ్మయే పరాకాష్ఠగా ఉన్నటువంటి ఈ లోకంలో కన్పించునట్టి, కంటికి కన్పించనట్టి చిన్న పెద్ద జీవకోటిలోనూ; ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని - అనే పంచభూతాలలోనూ, వీటిల్లోనుంచి పుట్టినటువంటి కుండ, గుడ్డ లాంటి సమస్త వస్తువులలోనూ, ఆ దేవుడు ఉన్నాడు. గుణాలు నిండి ఉన్న మూలప్రకృతిలోనూ త్రిగుణాలకు అతీతమైన మహత్తత్త్వంలోనూ, రజోగుణం, సత్త్వగుణం, తమోగుణం అనే గుణత్రయంలోనూ, భగవంతుడు ఉన్నాడు. అలా ఉన్న ఆ స్వామి ఈశ్వరుడనీ, పరమాత్మ అనీ, పరబ్రహ్మ అనీ రకరకాలుగా పిలువబడతాడు.

ఆ పరమేశ్వరుడు అనుభవంచేత మాత్రమే మనం తెలుసుకొనగలిగే ఆనంద స్వరూపుడు. ఆయనకు ఎటువంటి మార్పూ ఉండదు. ఇటువంటిదని నిరూపింపదగిన రూపం ఉండదు. ఆ ప్రభువు సత్త్వం, రజస్తమోగుణాలు నిండిన తన దివ్యమైన మాయచేత, అదృశ్యమైన శక్తితో వ్యాపించునట్టి, వ్యాపింపజేయునట్టి రూపాలతో కనుపించువాడూ, చూచువాడూ, అనుభవింపదగినవాడూ, అనుభవించువాడూ తానే అయి స్పష్టాస్పష్టమైన రూపంతో ఉంటాడు.

ఈ కారణం వల్ల మానవుడు రాక్షస భావమును విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీదా దయా దాక్షిణ్యాలు కలిగి ఉండాలి. అలా ఉంటే భగవంతుడు మెచ్చుకొంటాడు. భగవంతుడు మెచ్చుకొంటే మనకు లభించనిదేదీ ఉండాదు. ఆ శ్రీహరి చరణకమల స్మరణమనే అమృతరసం త్రాగి పరవశులం కాగలిగితే మనకు ఆ దేవుని దయవల్ల కోరకుండానే ధర్మ, అర్థ, కామాలు లభిస్తాయి. ఇక మనం కాంక్షించే మోక్షం లభిస్తుంది అని వేరే చెప్పాలా?

ధర్మం, అర్థం, కామం, వేదాంతం, తర్కం, దండనీతి - ఇలాంటి జీవితావసర విషయాలన్నీ త్రిగుణాత్మకాలైన వేదలలో ప్రతిపాదింప బడ్డయి. నిస్స్వార్థంతో, ఎటువంటి కోరికా లేకుండా త్రిగుణాతీతుడైన శ్రీహరికి హృదయమును సమర్పించడం మంచిది. పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకున్న మానవుడు తాను వేరనీ, మరొకరు వేరనీ భేదభావం పాటించడు. అటువంటి వ్యక్తి మహాయోగిలాగా ఆత్మ తత్త్వం గ్రహిస్తాడు. కలలో విషయాలు ఎలా నిజం కావో అలగే ఈ లోకం కూడా నిజం కాదనే తెలుసుకుంటాడు - అని చెప్పి ప్రహ్లాదుడు ఇంకా ఇలా అన్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 309🌹

📚. Prasad Bharadwaj

🌻 309. Aviśiṣṭaḥ 🌻

OM Aviśiṣṭāya namaḥ

Aviśiṣṭaḥ asamastānāmaṃtaryāmitayā hariḥ / अविशिष्टः असमस्तानामंतर्यामितया हरिः. Sarveṣāṃ aṃtaryāmitvena - aviśiṣṭaḥ / सर्वेषां अंतर्यामित्वेन - अविशिष्टः. Since He is the antaryāmī, the inner pervasive ruler regulating the actions, Lord Hari is called Aviśiṣṭaḥ. He pervades everything without differentiating.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 6
Parāvarēṣu bhūtēṣu brahmāntasthāvarādiṣu,
Bhautikēṣu vikārēṣu bhūtēṣvatha mahatsu ca. (20)
Guṇēṣu guṇasāmyē ca guṇavyatikarē tathā,
Ēka ēva parō hyātmā bhagavānīśvarō’vyayaḥ. (21)
Pratyagātmasvarūpēṇā dr̥iśyarūpēṇā ca svayam,
Vyāpyavyāpakanirdēśyō hyanirdēśyō’vikalpitaḥ. (22)
Kēvalānubhavānanda svarūpaḥ paramēśvaraḥ,
Māyayāntarhitaiśvarya īyatē guṇasargayā. (23)

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे षष्ठोऽध्यायः ::
परावरेषु भूतेषु ब्रह्मान्तस्थावरादिषु ।
भौतिकेषु विकारेषु भूतेष्वथ महत्सु च ॥ २० ॥
गुणेषु गुणसाम्ये च गुणव्यतिकरे तथा ।
एक एव परो ह्यात्मा भगवानीश्वरोऽव्ययः ॥ २१ ॥
प्रत्यगात्मस्वरूपेणा दृश्यरूपेणा च स्वयम् ।
व्याप्यव्यापकनिर्देश्यो ह्यनिर्देश्योऽविकल्पितः ॥ २२ ॥
केवलानुभवानन्द स्वरूपः परमेश्वरः ।
माययान्तर्हितैश्वर्य ईयते गुणसर्गया ॥ २३ ॥

The Supreme God, the supreme controller, who is infallible and indefatigable, is present in different forms of life, from the inert living beings such as the plants to Brahmā, the foremost created living being. He is also present in the varieties of material creations and in the material elements, the total material energy and the modes of material nature as well as the unmanifested material nature and the false ego. Although He is one, He is present everywhere, and He is also the transcendental Supersoul, the cause of all causes, who is present as the observer in the cores of the hearts of all living entities. He is indicated as that which is pervaded and as the all-pervading Supersoul, but actually He cannot be indicated. He is changeless and undivided. He is simply perceived as the supreme sac-cid-ānanda. Being covered by the curtain of the external energy, to the atheist He appears nonexistent.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

25 Feb 2021

25-FEB-2021 MORNING

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 649 / Bhagavad-Gita - 649🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 308, 309 / Vishnu Sahasranama Contemplation - 308, 309🌹
3) 🌹 Daily Wisdom - 68 🌹
4) 🌹. వివేక చూడామణి - 31🌹
5) 🌹Viveka Chudamani - 31 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 42🌹
7)  🌹.విజయానికి సంకేతం నిర్భయం .. 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 219 / Sri Lalita Chaitanya Vijnanam - 219🌹 
9) 🌹 శ్రీమద్భగవద్గీత - 560 / Bhagavad-Gita - 560🌹 
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 649 / Bhagavad-Gita - 649 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 66 🌴*

66. సర్వధర్మాన్ పరిత్యజ 
మామేకం శరణం వ్రజ |
అహం త్వాం సర్వపాపేభ్యో 
మోక్ష్యయిష్యామి మా శుచ: ||

🌷. తాత్పర్యం : 
సర్వవిధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. నిన్ను సర్వపఫలముల నుండి నేను ముక్తిని గావింతును. భయము నొందకుము.

🌷. భాష్యము :
పరబ్రహ్మజ్ఞానము, పరమాత్మజ్ఞానము, వర్ణాశ్రమధర్మజ్ఞానము, సన్న్యాసాశ్రమ జ్ఞానము, అసంగత్వము, శమదమాదులు, ధ్యానము మొదలగువానికి సంబంధించిన జ్ఞానము, ధర్మవిధానములను దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఇంతవరకు వివరించియున్నాడు. 

ధర్మవిధానములను పలువిధములుగా సైతము అతడు వర్ణించియుండెను. ఇక ఇప్పుడు గీతాజ్ఞానమును సంగ్రహపరచుచు తాను ఇంతవరకు వివరించియున్న ధర్మవిధానముల నన్నింటిని విడిచి, కేవలము తనకు శరణము నొందుమని అర్జునినితో శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు. 

శ్రీకృష్ణభగవానుడు తానే స్వయముగా రక్షణము నొసగుదునని ప్రతిజ్ఞ చేసియున్నందున అట్టి శరణాగతి అర్జునుని తప్పక సర్వవిధములైన పాపఫలముల నుండి ముక్తుని చేయగలదు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 649 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 66 🌴*

66. sarva-dharmān parityajya
mām ekaṁ śaraṇaṁ vraja
ahaṁ tvāṁ sarva-pāpebhyo
mokṣayiṣyāmi mā śucaḥ

🌷 Translation : 
Abandon all varieties of religion and just surrender unto Me. I shall deliver you from all sinful reactions. Do not fear.

🌹 Purport :
The Lord has described various kinds of knowledge and processes of religion – knowledge of the Supreme Brahman, knowledge of the Supersoul, knowledge of the different types of orders and statuses of social life, knowledge of the renounced order of life, knowledge of nonattachment, sense and mind control, meditation, etc. He has described in so many ways different types of religion. 

Now, in summarizing Bhagavad-gītā, the Lord says that Arjuna should give up all the processes that have been explained to him; he should simply surrender to Kṛṣṇa. That surrender will save him from all kinds of sinful reactions, for the Lord personally promises to protect him.

In the Seventh Chapter it was said that only one who has become free from all sinful reactions can take to the worship of Lord Kṛṣṇa. Thus one may think that unless he is free from all sinful reactions he cannot take to the surrendering process. 

To such doubts it is here said that even if one is not free from all sinful reactions, simply by the process of surrendering to Śrī Kṛṣṇa he is automatically freed. There is no need of strenuous effort to free oneself from sinful reactions. One should unhesitatingly accept Kṛṣṇa as the supreme savior of all living entities. With faith and love, one should surrender unto Him.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 308, 309 / Vishnu Sahasranama Contemplation - 308, 309 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻308. ఇష్టః, इष्टः, Iṣṭaḥ🌻*

*ఓం ఇష్టాయ నమః | ॐ इष्टाय नमः | OM Iṣṭāya namaḥ*

ఇష్టః, इष्टः, Iṣṭaḥ

పరమానందాత్మకత్వాత్ ప్రియ ఇష్ట ఇతీర్యతే ।
యజ్ఞేన పూజిత ఇతి వా తథా హరి రుచ్యతే ॥

పరమానందరూపుడు కావున ఎల్లరకును విష్ణువు ప్రియమైనవాడు కావున ఇష్టః అని పిలువబడును. లేదా యజ్ఞములందు పూజింపబడువాడు కావున విష్ణువు ఇష్టః.

:: శ్రీమద్రామాయణే బాలకాండే అష్టాదశస్సర్గః ::
తేషామపి మహాతేజా రామస్సత్యపరాక్రమః ।
ఇష్టః సర్వస్య లోకస్య శాశాంక ఇవ నిర్మలః ॥ 25 ॥

రఘువంశజులలో మహాతేజశ్శాలియైన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమముగలవాడు. సమస్తప్రజలకును పూర్ణచంద్రునివలె ఆహ్లాదకరుడు లేదా ప్రియమైనవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 308🌹*
📚. Prasad Bharadwaj 

*🌻308. Iṣṭaḥ🌻*

*OM Iṣṭāya namaḥ*

Paramānaṃdātmakatvāt priya iṣṭa itīryate,
Yajñena pūjita iti vā tathā hari rucyate.

परमानंदात्मकत्वात् प्रिय इष्ट इतीर्यते ।

यज्ञेन पूजित इति वा तथा हरि रुच्यते ॥

One who is dear to all because He is of the nature of supreme bliss. Or one who is worshiped in iṣṭi or yajña i.e., sacrifice.

Śrīmad Rāmāyaṇa - Book 1, Chapter 18
Teṣāmapi mahātejā rāmassatyaparākramaḥ,
Iṣṭaḥ sarvasya lokasya śāśāṃka iva nirmalaḥ. (25)

:: श्रीमद्रामायणे बालकांडे अष्टादशस्सर्गः ::
तेषामपि महातेजा रामस्सत्यपराक्रमः ।
इष्टः सर्वस्य लोकस्य शाशांक इव निर्मलः ॥ २५ ॥

Among all of them, Rāma stood out with his supreme radiance and true valor. He endeared everyone like a spotless moon.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 309/ Vishnu Sahasranama Contemplation - 309🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 309. అవిశిష్టః, अविशिष्टः, Aviśiṣṭaḥ 🌻*

*ఓం అవిశిష్టాయ నమః | ॐ अविशिष्टाय नमः | OM Aviśiṣṭāya namaḥ*

అవిశిష్టః, अविशिष्टः, Aviśiṣṭaḥ

అవిశిష్టః అసమస్తానామంతర్యామితయా హరిః. సర్వేషాం అంతర్యామిత్వేన - అవిశిష్టః ఎల్ల ప్రాణులకును ఎల్ల పదార్థములకును అంతర్యామి అనగా లోపలగా ఉండుచు వానిని తమ తమ వ్యాపారములందు ప్రవర్తిల్లజేయుచూ అదుపులోనుంచువాడు కావున హరి అవిశిష్టుడు. ఏ భేదమును లేక అంతటను సమరూపముతో నుండువాడు.

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::
వ.కావున విషయంబులఁ జిక్కువడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబు గాదు, రమ్యమయ్యును బహుతర ప్రయాస గమ్యమని తలంచితిరేనిఁ జెప్పెద, సర్వభూతాత్మకుండైన సర్వ దిక్కాల సిద్ధుండై బ్రహ్మ కడపలగాఁ గల చరాచర స్థూల సూక్ష్మజీవసంఘంబు లందును, నభోవాయుకుంభినీ సలిల తేజంబు లనియెడు మహాభూతంబులయందును, భూతవికారంబు లయిన ఘటపటాదుల యందును,
గుణసామ్యం బయిన ప్రధానమందును, గుణవ్యతిరేకం బైన మహత్తత్త్వాదియందును, రజస్సత్త్వతమోగుణంబుల యందును భగవంతుం డవ్యయుం డీశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మ మనియెడు వాచకశబ్దంబులు గల్గి కేవలానుభవానంద స్వరూపకుండు నవి కల్పితుండు ననిర్దేశ్యుండై వ్యాప్యవ్యాపకరూపంబులం జేసి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయు నయి నిర్దేశింపదగి వికల్పితుండై యుండుఁ, దత్కారణంబున నాసుర భావంబు విడిచి సర్వ భూతంబులందును దయాసుహృద్భావంబులు గల్గిన నధోఽక్షజుండు సంతసించు, ననంతు డాద్యుండు హరి సంతసించిన నలభ్యం బెయ్యదియు లేదు, జనార్దనచరణ సరసీరుహ యుగళస్మరణ సుధారస పానపరవశుల మైతిమేని మనకు దైవవశంబున నాకాంక్షితంబులై, సిద్ధించు ధర్మార్థకామంబులు, కాంక్షితంబై సిద్ధించు మోక్షం బననేల? త్రివర్గంబును నాత్మవిద్యయుం దర్కదండనీతి జీవికాదు లన్నియుఁ ద్రైగుణ్య విషయంబు లయిన వేదంబుల వలనం బ్రతిపాద్యంబులు, నిస్త్రైగుణ్యలక్షణంబునం బరమ పురుషుండైన హరికి నాత్మసమర్పణంబు సేయుట మేలు, పరమాత్మ తత్త్వజ్ఞానోదయంబునం జేసి స్వపరభ్రాంతి సేయక పురుషుండు యోగావధూతత్త్వంబున నాత్మ వికల్పభేదంబునం గలలోఁ గన్న విశేషంబుల భంగిం దథ్యం బనక మిథ్యయని తలంచు నని మఱియుఁ బ్రహ్లాదుం డిట్లనియె. (217)

స్నేహితులారా! కోరికలలో కామంతో చిక్కుకొన్న రాక్షసులకు హరిభజన అలవడదు. అలాగని, ఇష్టమైనప్పటికీ చాలా ప్రయాసపడాలి అనుకుంటారేమో! కాదు. వినండి. అన్ని ప్రాణుల మనస్సులలోనూ, అన్నిదిక్కులలోనూ భగవంతుడు ఉన్నాడు. బ్రహ్మయే పరాకాష్ఠగా ఉన్నటువంటి ఈ లోకంలో కన్పించునట్టి, కంటికి కన్పించనట్టి చిన్న పెద్ద జీవకోటిలోనూ; ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని - అనే పంచభూతాలలోనూ, వీటిల్లోనుంచి పుట్టినటువంటి కుండ, గుడ్డ లాంటి సమస్త వస్తువులలోనూ, ఆ దేవుడు ఉన్నాడు. గుణాలు నిండి ఉన్న మూలప్రకృతిలోనూ త్రిగుణాలకు అతీతమైన మహత్తత్త్వంలోనూ, రజోగుణం, సత్త్వగుణం, తమోగుణం అనే గుణత్రయంలోనూ, భగవంతుడు ఉన్నాడు. అలా ఉన్న ఆ స్వామి ఈశ్వరుడనీ, పరమాత్మ అనీ, పరబ్రహ్మ అనీ రకరకాలుగా పిలువబడతాడు.

ఆ పరమేశ్వరుడు అనుభవంచేత మాత్రమే మనం తెలుసుకొనగలిగే ఆనంద స్వరూపుడు. ఆయనకు ఎటువంటి మార్పూ ఉండదు. ఇటువంటిదని నిరూపింపదగిన రూపం ఉండదు. ఆ ప్రభువు సత్త్వం, రజస్తమోగుణాలు నిండిన తన దివ్యమైన మాయచేత, అదృశ్యమైన శక్తితో వ్యాపించునట్టి, వ్యాపింపజేయునట్టి రూపాలతో కనుపించువాడూ, చూచువాడూ, అనుభవింపదగినవాడూ, అనుభవించువాడూ తానే అయి స్పష్టాస్పష్టమైన రూపంతో ఉంటాడు.

ఈ కారణం వల్ల మానవుడు రాక్షస భావమును విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీదా దయా దాక్షిణ్యాలు కలిగి ఉండాలి. అలా ఉంటే భగవంతుడు మెచ్చుకొంటాడు. భగవంతుడు మెచ్చుకొంటే మనకు లభించనిదేదీ ఉండాదు. ఆ శ్రీహరి చరణకమల స్మరణమనే అమృతరసం త్రాగి పరవశులం కాగలిగితే మనకు ఆ దేవుని దయవల్ల కోరకుండానే ధర్మ, అర్థ, కామాలు లభిస్తాయి. ఇక మనం కాంక్షించే మోక్షం లభిస్తుంది అని వేరే చెప్పాలా?

ధర్మం, అర్థం, కామం, వేదాంతం, తర్కం, దండనీతి - ఇలాంటి జీవితావసర విషయాలన్నీ త్రిగుణాత్మకాలైన వేదలలో ప్రతిపాదింప బడ్డయి. నిస్స్వార్థంతో, ఎటువంటి కోరికా లేకుండా త్రిగుణాతీతుడైన శ్రీహరికి హృదయమును సమర్పించడం మంచిది. పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకున్న మానవుడు తాను వేరనీ, మరొకరు వేరనీ భేదభావం పాటించడు. అటువంటి వ్యక్తి మహాయోగిలాగా ఆత్మ తత్త్వం గ్రహిస్తాడు. కలలో విషయాలు ఎలా నిజం కావో అలగే ఈ లోకం కూడా నిజం కాదనే తెలుసుకుంటాడు - అని చెప్పి ప్రహ్లాదుడు ఇంకా ఇలా అన్నాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 309🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 309. Aviśiṣṭaḥ 🌻*

*OM Aviśiṣṭāya namaḥ*

Aviśiṣṭaḥ asamastānāmaṃtaryāmitayā hariḥ / अविशिष्टः असमस्तानामंतर्यामितया हरिः. Sarveṣāṃ aṃtaryāmitvena - aviśiṣṭaḥ / सर्वेषां अंतर्यामित्वेन - अविशिष्टः. Since He is the antaryāmī, the inner pervasive ruler regulating the actions, Lord Hari is called Aviśiṣṭaḥ. He pervades everything without differentiating.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 6
Parāvarēṣu bhūtēṣu brahmāntasthāvarādiṣu,
Bhautikēṣu vikārēṣu bhūtēṣvatha mahatsu ca. (20)
Guṇēṣu guṇasāmyē ca guṇavyatikarē tathā,
Ēka ēva parō hyātmā bhagavānīśvarō’vyayaḥ. (21)
Pratyagātmasvarūpēṇā dr̥iśyarūpēṇā ca svayam,
Vyāpyavyāpakanirdēśyō hyanirdēśyō’vikalpitaḥ. (22)
Kēvalānubhavānanda svarūpaḥ paramēśvaraḥ,
Māyayāntarhitaiśvarya īyatē guṇasargayā. (23)

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे षष्ठोऽध्यायः ::
परावरेषु भूतेषु ब्रह्मान्तस्थावरादिषु ।
भौतिकेषु विकारेषु भूतेष्वथ महत्सु च ॥ २० ॥
गुणेषु गुणसाम्ये च गुणव्यतिकरे तथा ।
एक एव परो ह्यात्मा भगवानीश्वरोऽव्ययः ॥ २१ ॥
प्रत्यगात्मस्वरूपेणा दृश्यरूपेणा च स्वयम् ।
व्याप्यव्यापकनिर्देश्यो ह्यनिर्देश्योऽविकल्पितः ॥ २२ ॥
केवलानुभवानन्द स्वरूपः परमेश्वरः ।
माययान्तर्हितैश्वर्य ईयते गुणसर्गया ॥ २३ ॥

The Supreme God, the supreme controller, who is infallible and indefatigable, is present in different forms of life, from the inert living beings such as the plants to Brahmā, the foremost created living being. He is also present in the varieties of material creations and in the material elements, the total material energy and the modes of material nature as well as the unmanifested material nature and the false ego. Although He is one, He is present everywhere, and He is also the transcendental Supersoul, the cause of all causes, who is present as the observer in the cores of the hearts of all living entities. He is indicated as that which is pervaded and as the all-pervading Supersoul, but actually He cannot be indicated. He is changeless and undivided. He is simply perceived as the supreme sac-cid-ānanda. Being covered by the curtain of the external energy, to the atheist He appears nonexistent.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 68 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 8. Every Activity is a Psychological Function 🌻*

The Cosmic Sacrifice of the Purusha Sukta is an indication to us of the way in which a ritual can become a spiritual meditation, or a spiritual meditation itself can be interpreted as a magnificent ritual. 

The Brahmanas of the Veda, ritual-ridden as they have been, are brought to a point of contemplative apotheosis in the Aranyakas and the Upanishads, and here it is that every kind of action is identified with a form of sacrifice and action made a part of inward contemplation, so that action becomes a process of thought, rather than a movement of the limbs of the body. Every activity is a psychological function; it is not just a physical process. 

This is what we have to understand when we convert action into a contemplation. The originally Existent Being thought an Idea, a Being inseparable from Consciousness. The Purusha Sukta tells us that God became all the Cosmos—purusha evedam sarvam, and the created beings contemplated God as the Original Sacrifice.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 31 / Viveka Chudamani - 31🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*

*🍀. త్రిగుణాలు - 1 🍀*

117. సత్వ గుణము స్వచ్ఛమైన నీరు వంటిది. అయినప్పటికి అది రాజస, తామస గుణాలతో కలసినప్పుడు మార్పులకు లోనగును. సత్వ గుణములో ఆత్మ వ్యక్తమవుతుంది. అది ఎలా అంటే సూర్య కిరణము ప్రాపంచిక వస్తు సముదాయము పై వ్యక్తమైనట్లు.

118. ఇతర గుణములతో కూడిన సత్వ గుణము యమ, నియమాలు, గర్వము మొదలగునవి లేకపోయినప్పటికి; నమ్మకము, భక్తి, విముక్తికై కోరిక దైవిక లక్షణాలు మరియు అసత్యాలకు దూరముగా ఉండుట అను లక్షణాలు కలిగి ఉంటారు.

119. స్వచ్ఛమైన సత్వగుణము యొక్క లక్షణములు; సంతోషము, ఆత్మ దర్శనము, ఉన్నతమైన శాంతి, తృప్తి, ఆనందము మరియు దివ్యాత్మల ఎడల భక్తి మొదలగు వాటి వలన సాధకుడు అంతములేని ఆనందమును సదా అనుభవించుచుండును.

120. సత్వ, రజో, తమో గుణములతో కూడిన ఆత్మ యొక్క ఈ తాత్కాలిక శరీరముతో పోల్చిన స్వచ్ఛమైన సత్వ గుణము యొక్క లక్షణములు; గాడ నిద్ర దాని ప్రత్యేకత. ఆ స్థితిలో మనస్సు యొక్క అన్ని చర్యలు అంతమైపోవును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 31 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 Three Gunas - 1 🌻*

117. Pure Sattva is (clear) like water, yet in conjunction with Rajas and Tamas it makes for transmigration. The reality of the Atman becomes reflected in Sattva and like the sun reveals the entire world of matter.

118. The traits of mixed Sattva are an utter absence of pride etc., and Niyama, Yama, etc., as well as faith, devotion, yearning for Liberation, the divine tendencies and turning away from the unreal.

119. The traits of pure Sattva are cheerfulness, the realisation of one’s own Self, supreme peace, contentment, bliss, and steady devotion to the Atman, by which the aspirant enjoys bliss everlasting.

120. This Undifferentiated, spoken of as the compound of the three Gunas, is the causal body of the soul. Profound sleep is its special state, in which the functions of the mind and all its organs are suspended.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 42 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 29. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 2 🌻*

ఒకరోజు, నేనిట్లే నా ఉపన్యాసము ముగిసిన పిదప డంబమును ప్రదర్శించుచుండగా, ఆమె నా దగ్గరకు వచ్చి కన్నులలో కళ్ళు పెట్టి సూటిగ చూచుచూ యిట్లనెను.

“భగవంతుని సామ్రాజ్యము చేరుటకు, ఆయన అంతఃపురమున ప్రవేశించుటకు 12 ద్వారములు కలవని నీవెప్పటికైనను గమనించినచో నేను సంతోషింతును. ప్రపంచమున అన్ని జాతుల వారునూ, అన్ని మతముల వారునూ ఏదో ఒక ద్వారము గుండా దైవగృహ ప్రవేశము చేయగలరు. 

అందరునూ నీవు తెలుపు ద్వారము ననే ప్రవేశింతురని అనుకొనుట పసితనము. నీవు చేయు ప్రసంగము లన్నియూ బజారులో ఎలుగెత్తి అరచుట వంటివి. అంతకు మించిన విలువ వాటికి లేదు. 

దైవము ఎన్నియో రకములుగ జీవులను తన దరి జేర్చుకొనునని నీకు తెలియుట ముఖ్యము.” మా వంట మనిషి తీక్షణమైన చూపులతో ఇట్లు పలుకగా ఆ చూపుల నుండి నేను నా గురుదేవులు దేవాది మహర్షి సాన్నిధ్యమును అనుభవించితిని. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విజయానికి సంకేతం నిర్భయం 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

‘ఒకడు కొండ అంచున ఉన్న కనుమ దారిలో నడుస్తున్నాడు. మెల్లమెల్లగా చీకటి పడుతోంది. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న అతను కాలుజారి లోయలో పడిపోతూ చేతికి దొరికిన కొండ అంచునే ఉన్న చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని వేలాడుతూ కిందకు చూడగా ఎక్కడో పాతాళంలో ఉన్న అగాధం అతనికి లీలగా కనిపించింది కానీ, అతని కాళ్ళకిందనే ఉన్న పెద్ద బండరాయి మాత్రం అతనికి కనిపించలేదు. 

వెంటనే అతను భయంతో ఆ చెట్టుకొమ్మను ఇంకా గట్టిగా పట్టుకుని ఎవరైనా సహాయం చేస్తారేమో అనే ఆశతో ‘‘రక్షించండి, రక్షించండి’’అని గట్టిగా అరిచాడు. కానీ, అతనిని రక్షించేందుకు అక్కడ ఎవరూ లేరు. అతని మాటలు మాత్రం ఆ లోయనుంచి ప్రతిధ్వనించాయి. అతని చేతులు మండి పోతుండడంతో పట్టు జారిపోతోంది. 

వేరే దారిలేక, లేని శక్తిని కూడగట్టుకుని అనుక్షణం నరకయాతన పడుతూ ఆ రాత్రంతా అతను అలా ఆ చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతూనే ఉన్నాడు. మొత్తానికి తెల్లారింది. ఆ వెలుగులో అతను మళ్ళీ కిందకు చూడగా అతని కాళ్ళకు ఆరు అంగుళాల కిందనే ఉన్న పెద్ద బండరాయి అతనికి కనిపించింది. వెంటనే అతను దానిపై దిగి ఊపిరి పీల్చకున్నాడు.’’

కాబట్టి, నాకున్న అనుభవం మేరకు భయం లోతు కేవలం ఆరు అంగుళాలు మించి ఉండదని నేను మీకు స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు చెట్టుకొమ్మనే పట్టుకుని రాత్రంతా అవస్థపడుతూ వేలాడాలా లేక దాన్ని వదిలేసి మీ కాళ్ళపై మీరు నిలబడాలా అనేది మీ ఇష్టం. అది మీ చేతుల్లోనే ఉంది. నిజానికి భయపడేందుకు ఏమీలేదు. కాబట్టి, దేనికీ భయపడకండి.
***

నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా తెలిసినది వదులుకుని, తెలియని దానిలోకి ప్రవేశించినపుడే భయం బయలుదేరుతుంది. అట్లా భయపడకుండా కొత్తదాన్ని కూడా ఆహ్వానించడమే అంటే అందులో ప్రవేశించడమే ధైర్యం. కనుక తెలిసిన దాన్ని వదులుకునేందుకు, తెలియని దానిలోనికి వెళ్లేందుకు ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారే నిర్భయస్తులు, దైర్యవంతులు ఇట్లా వారిని ఏవిధంగా నైనా పిలుచుకోవచ్చు.

కాని అందరూ అంటే చాలామంది తెలిసిన దానిని వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే పూర్తిగా తెలిసిన దానిలో భద్రత కనిపిస్తుంది ఇదిగో ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది. ఇది నిశ్చయంగా తెలుస్తుంది. 

కనుక దీన్ని చేయడానికే ఇష్టపడుతారు కానీ ఫలితమేమి వస్తుందో తెలియక పోతే దాన్ని నిర్భయంగా చేయడానికి చాలామంది జంకుతారు. ఈ జంకడమే భయం. 

జీవన్మరణాల మధ్య వేలాడే స్థితి ఏర్పడినపుడు గతం ఏమాత్రం గుర్తుకురాదు. భవిష్యత్తు పైన ఏలాంటి కోరికా ఉండదు. దీనినే వర్తమానం అంటారు. ఈ వర్తమానాన్ని జాగ్రత్త ఆలోచించి మెలిగితే గతం గురించి బాధ ఉండదు. భవిష్యత్తు గురించీ బెంగ ఉండదు. 

ధైర్యంగా నిశ్చయంగా ముందుకు అడుగువేయలా వద్దా అనే సంశయాన్ని వీడండి. ధైర్యమెప్పుడూ విజయాన్ని కలుగ చేస్తుంది. కనుక ధైర్యంగా ముందుకు వెళ్లండి. దేనికీ భయపడకండి.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 219 / Sri Lalitha Chaitanya Vijnanam - 219 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।*
*మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥*

*🌻 219. 'మహాభోగా' 🌻*

అనిర్వచనీయమైన, అమితమైన సుఖము, సౌకర్యము, గము, ధనము కలది శ్రీమాత అని అర్థము. భోగమనగా మనస్సు, ఇంద్రియములు, శరీరము పొందు ఆనందము. వీనికి కావలసినది సుఖము, సౌఖ్యము. అందులకు వలసినది ధనము. పంచ భూతములతో కూడిన సృష్టియందు పంచేంద్రియముల ద్వారా, శరీరముద్వారా సౌఖ్యమును పొందుట మానసిక కక్ష్యలో జీవుడు కోరు స్థితి. శరీరములేనిదే భోగము లేదు. 

శరీరమున్నను, ఇంద్రియములు లేనివారు భోగించలేరు. ఇంద్రియ స్పర్శయే భోగము. మంచి శబ్దము, చక్కని దృశ్యము, సువాసనలు, రుచికరమగు అన్నపానీయములు, శీతోష్ణస్పర్శ, అవి యింద్రియముల నుండి, పంచ భూతముల నుండి, పంచతన్మాత్రల నుండి లభించును. భోగములను దేహేంద్రియముల ద్వారా అనుభవించుటకు మనస్సుండ వలెను. మనో బుద్ధి కక్ష్యలోనికి దిగనిదే జీవునికీ భోగముండదు. 

భోగమానందము కొఱకే పిల్లలా నందించుటకు తల్లిదండ్రులు రక రకములుగ ప్రయత్నించుదురు. అట్లే జీవులానందము కొఱకు శ్రీమాత సృష్టియందెన్నియో ఆకర్షణలు సృష్టించినది. జీవులు భోగించుచు ఆనందించు చుండగతానునూ ఆనందించును. అందులకే ఆమె మహాభోగ. 

భోగము లేర్పరచుట, అనుభవించుటకు దేహాదుల నేర్పరచుట, జీవులకు భోగానందము కలిగించుట, వారి రూపమున తాను కూడ భోగించుట చేయుచు నుండును. 

భోగ జీవనమునకు శాస్త్రమునందెట్టి అభ్యంతరము తెలుపబడలేదు. ధర్మయుక్తమగు భోగము రాజయోగులు సహిత మనుభవింతురు. భోగము యోగమున కంతరాయము కాదు. 

యోగ భోగములు వైభవమే అని ఆచరించి చూపినవారు శ్రీకృష్ణుడు, జనకుడు ఆదిగా గల యోగులు. రోగమునకు దారితీయు భోగము, ధర్మ సమ్మతము గాని భోగము వర్ణనీయములు. శ్రీమాత అందించు భోగము వైభవమునకే.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 219 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Mahā-bhogā महा-भोगा (219) 🌻*

She is the embodiment of immeasurable happiness. All that prevails in this universe is wealth for Her, as She presides over the universe.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 560 / Bhagavad-Gita - 560 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 23 🌴*

23. య: శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారత: |
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ||

🌷. తాత్పర్యం : 
శాస్త్రవిధులను త్యజించి తోచిన రీతిని వర్తించువాడు పూర్ణత్వమును గాని, సుఖమును గాని, పరమగతిని గాని పొందజాలడు.

🌷. భాష్యము :
పూర్వము వివరించినట్లు మానవుల యందలి వివిధవర్ణములకు, ఆశ్రమములకు పలువిధములైన శాస్త్రవిధులు (శాస్త్రనిర్దేశములు) ఒసగబడియున్నవి. ప్రతియొక్కరు ఆ విధినియమములను తప్పక అనుసరింపవలెను. ఒకవేళ మనుజుడు వాటిని పాటింపక కామము, లోభము, కోరికల ననుసరించి తోచినరీతిలో వర్తించినచో జీవితమున ఎన్నడును పూర్ణత్వము నొందలేడు. 

అనగా మనుజుడు ఈ విషయముల నన్నింటిని సిద్దాంతరీతి తెలిసినను, తన జీవితమున వాటిని అమలుపరచక పోయినచో నరాధమునిగా తెలియబడగలడు. మానవజన్మ యందు జీవుడు బుద్ధిమంతుడై ఉన్నతపదమును పొందుటకు ఒసగబడిన విధినియమములను అనుసరింపవలసియున్నది. 

అతడు వాటిని అనుసరింపనిచో తనను తాను పతనము కావించుకొనగలడు. ఒకవేళ అతడు విధినియమములను మరియు ధర్మనియమములను పాటించినను అంత్యమున శ్రీకృష్ణభగవానుని అవగాహన చేసికొనెడి స్థితికి అరుదెంచినచో అతని జ్ఞానము వ్యర్థమే కాగలదు. 

భగవానుని అస్తిత్వమును అంగీకరించినను, ఆ పరమపురుషుని భక్తియుతసేవలో నిలువనిచో అతని యత్నములన్నియు వృథాయే కాగలవు. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిభావానాస్థితికి మరియు భక్తియోగస్థాయికి క్రమముగా ఎదగవలెను. ఆ సమయముననే మరియు ఆ స్థితియందే మనుజుడు అత్యున్నత పూర్ణత్వమును పొందును గాని అన్యథా కాదు.

ఇచ్చట “కామారత:” యని పదము మిగుల ప్రధానమైనది. తెలిసియే నియమములకు ఉల్లంఘించువాడు కామమునందు వర్తించునవాడగును. 

తాను చేయునది నిషిద్దమని తెలిసియు అతడు అట్లే వర్తించును. అట్టి వర్తనమే యథేష్టాచరణ మనబడును. తప్పక చేయవలసియున్న కార్యములను సైతము చేయకుండుట చేతనే అతడు చపలుడు లేదా చంచలుడని పిలువబడును. అట్టివారు దేవదేవునిచే తప్పక శిక్షింపబడుదురు. 

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 560 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 23 🌴*

23. yaḥ śāstra-vidhim utsṛjya
vartate kāma-kārataḥ
na sa siddhim avāpnoti
na sukhaṁ na parāṁ gatim

🌷 Translation : 
He who discards scriptural injunctions and acts according to his own whims attains neither perfection, nor happiness, nor the supreme destination.

🌹 Purport :
As described before, the śāstra-vidhi, or the direction of the śāstra, is given to the different castes and orders of human society. Everyone is expected to follow these rules and regulations. If one does not follow them and acts whimsically according to his lust, greed and desire, then he never will be perfect in his life. 

In other words, a man may theoretically know all these things, but if he does not apply them in his own life, then he is to be known as the lowest of mankind. In the human form of life, a living entity is expected to be sane and to follow the regulations given for elevating his life to the highest platform, but if he does not follow them, then he degrades himself. But even if he follows the rules and regulations and moral principles and ultimately does not come to the stage of understanding the Supreme Lord, then all his knowledge becomes spoiled. 

And even if he accepts the existence of God, if he does not engage himself in the service of the Lord his attempts are spoiled. Therefore one should gradually raise himself to the platform of Kṛṣṇa consciousness and devotional service; it is then and there that he can attain the highest perfectional stage, not otherwise.

The word kāma-kārataḥ is very significant. A person who knowingly violates the rules acts in lust. He knows that this is forbidden, but still he acts. This is called acting whimsically. He knows that this should be done, but still he does not do it; therefore he is called whimsical. Such persons are destined to be condemned by the Supreme Lord. Such persons cannot have the perfection which is meant for the human life. 

The human life is especially meant for purifying one’s existence, and one who does not follow the rules and regulations cannot purify himself, nor can he attain the real stage of happiness.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹