సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥
🌻 219. 'మహాభోగా' 🌻
అనిర్వచనీయమైన, అమితమైన సుఖము, సౌకర్యము, గము, ధనము కలది శ్రీమాత అని అర్థము. భోగమనగా మనస్సు, ఇంద్రియములు, శరీరము పొందు ఆనందము. వీనికి కావలసినది సుఖము, సౌఖ్యము. అందులకు వలసినది ధనము. పంచ భూతములతో కూడిన సృష్టియందు పంచేంద్రియముల ద్వారా, శరీరముద్వారా సౌఖ్యమును పొందుట మానసిక కక్ష్యలో జీవుడు కోరు స్థితి. శరీరములేనిదే భోగము లేదు.
శరీరమున్నను, ఇంద్రియములు లేనివారు భోగించలేరు. ఇంద్రియ స్పర్శయే భోగము. మంచి శబ్దము, చక్కని దృశ్యము, సువాసనలు, రుచికరమగు అన్నపానీయములు, శీతోష్ణస్పర్శ, అవి యింద్రియముల నుండి, పంచ భూతముల నుండి, పంచతన్మాత్రల నుండి లభించును. భోగములను దేహేంద్రియముల ద్వారా అనుభవించుటకు మనస్సుండ వలెను. మనో బుద్ధి కక్ష్యలోనికి దిగనిదే జీవునికీ భోగముండదు.
భోగమానందము కొఱకే పిల్లలా నందించుటకు తల్లిదండ్రులు రక రకములుగ ప్రయత్నించుదురు. అట్లే జీవులానందము కొఱకు శ్రీమాత సృష్టియందెన్నియో ఆకర్షణలు సృష్టించినది. జీవులు భోగించుచు ఆనందించు చుండగతానునూ ఆనందించును. అందులకే ఆమె మహాభోగ.
భోగము లేర్పరచుట, అనుభవించుటకు దేహాదుల నేర్పరచుట, జీవులకు భోగానందము కలిగించుట, వారి రూపమున తాను కూడ భోగించుట చేయుచు నుండును.
భోగ జీవనమునకు శాస్త్రమునందెట్టి అభ్యంతరము తెలుపబడలేదు. ధర్మయుక్తమగు భోగము రాజయోగులు సహిత మనుభవింతురు. భోగము యోగమున కంతరాయము కాదు.
యోగ భోగములు వైభవమే అని ఆచరించి చూపినవారు శ్రీకృష్ణుడు, జనకుడు ఆదిగా గల యోగులు. రోగమునకు దారితీయు భోగము, ధర్మ సమ్మతము గాని భోగము వర్ణనీయములు. శ్రీమాత అందించు భోగము వైభవమునకే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 219 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mahā-bhogā महा-भोगा (219) 🌻
She is the embodiment of immeasurable happiness. All that prevails in this universe is wealth for Her, as She presides over the universe.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
25 Feb 2021
No comments:
Post a Comment