Showing posts with label ఆధ్యాత్మిక సాధన. Show all posts
Showing posts with label ఆధ్యాత్మిక సాధన. Show all posts

సిద్ధకుంజికా స్తోత్రం / सिद्धकुञ्जिका स्तोत्रम्


🌹. సిద్ధకుంజికా స్తోత్రం / सिद्धकुञ्जिका स्तोत्रम् 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

సకల దుఃఖాలను తొలగించి, అనేక శుభాలు కలిగించి, సిద్ధిని కలిగించే స్తోత్రము సిద్ధ కుంజికా స్తోత్రము. ఈ స్తోత్రము చదవటం వల్ల అపమృత్యుదోషం ఉండదు.
--  సద్గురు పండిత శ్రీరామశర్మ ఆచార్య

ఓం అస్య శ్రీకుంజికాస్తోత్రమంత్రస్య సదాశివ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీత్రిగుణాత్మికా దేవతా, ఓం ఐం బీజం, ఓం హ్రీం శక్తిః, ఓం క్లీం కీలకమ్,
మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః |


శివ ఉవాచ –

శృణు దేవి ప్రవక్ష్యామి కుంజికాస్తోత్రముత్తమమ్ |
యేన మంత్రప్రభావేణ చండీజాపః శుభో భవేత్ || ౧ ||

న కవచం నార్గలాస్తోత్రం కీలకం న రహస్యకమ్ |
న సూక్తం నాపి ధ్యానం చ న న్యాసో న చ వార్చనమ్ || ౨ ||

కుంజికాపాఠమాత్రేణ దుర్గాపాఠఫలం లభేత్ |
అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభమ్ || ౩ ||

గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి |
మారణం మోహనం వశ్యం స్తంభనోచ్చాటనాదికమ్ |
పాఠమాత్రేణ సంసిద్ధ్యేత్ కుంజికాస్తోత్రముత్తమమ్ || ౪ ||


అథ మంత్రః |

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే |

ఓం గ్లౌం హుం క్లీం జూం సః జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల
ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే జ్వల హం సం లం క్షం ఫట్ స్వాహా || ౫ ||


ఇతి మంత్రః |


నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్దిని |
నమః కైటభహారిణ్యై నమస్తే మహిషార్దిని || ౬ ||

నమస్తే శుంభహంత్ర్యై చ నిశుంభాసురఘాతిని |
జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధం కురుష్వ మే || ౭ ||

ఐంకారీ సృష్టిరూపాయై హ్రీంకారీ ప్రతిపాలికా |
క్లీంకారీ కామరూపిణ్యై బీజరూపే నమోఽస్తు తే || ౮ ||

చాముండా చండఘాతీ చ యైకారీ వరదాయినీ |
విచ్చే చాభయదా నిత్యం నమస్తే మంత్రరూపిణి || ౯ ||

ధాం ధీం ధూం ధూర్జటేః పత్నీ వాం వీం వూం వాగధీశ్వరీ |
క్రాం క్రీం క్రూం కాలికా దేవి శాం శీం శూం మే శుభం కురు || ౧౦ ||

హుం హుం హుంకారరూపిణ్యై జం జం జం జంభనాదినీ |
భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే భవాన్యై తే నమో నమః || ౧౧ ||


అం కం చం టం తం పం యం శం వీం దుం ఐం వీం హం క్షం |
ధిజాగ్రం ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహా || ౧౨ ||


పాం పీం పూం పార్వతీ పూర్ణా ఖాం ఖీం ఖూం ఖేచరీ తథా |
సాం సీం సూం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధిం కురుష్వ మే || ౧౩ ||


కుంజికాయై నమో నమః |

ఇదం తు కుంజికాస్తోత్రం మంత్రజాగర్తిహేతవే |
అభక్తే నైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతి || ౧౪ ||

యస్తు కుంజికయా దేవి హీనాం సప్తశతీం పఠేత్ |
న తస్య జాయతే సిద్ధిరరణ్యే రోదనం యథా || ౧౫ ||

ఇతి శ్రీరుద్రయామలే గౌరీతంత్రే శివపార్వతీసంవాదే కుంజికాస్తోత్రం సంపూర్ణమ్ |


🌹. सिद्धकुञ्जिका स्तोत्रम् 🌹

ओं अस्य श्रीकुञ्जिकास्तोत्रमन्त्रस्य सदाशिव ऋषिः, अनुष्टुप् छन्दः, श्रीत्रिगुणात्मिका देवता, ओं ऐं बीजं, ओं ह्रीं शक्तिः, ओं क्लीं कीलकम्, मम सर्वाभीष्टसिद्ध्यर्थे जपे विनियोगः ।

शिव उवाच –

शृणु देवि प्रवक्ष्यामि कुञ्जिकास्तोत्रमुत्तमम् ।
येन मन्त्रप्रभावेण चण्डीजापः शुभो भवेत् ॥ १ ॥

न कवचं नार्गलास्तोत्रं कीलकं न रहस्यकम् ।
न सूक्तं नापि ध्यानम् च न न्यासो न च वार्चनम् ॥ २ ॥

कुञ्जिकापाठमात्रेण दुर्गापाठफलं लभेत् ।
अति गुह्यतरं देवि देवानामपि दुर्लभम् ॥ ३ ॥

गोपनीयं प्रयत्नेन स्वयोनिरिव पार्वति ।
मारणं मोहनं वश्यं स्तम्भनोच्चाटनादिकम् ।
पाठमात्रेण संसिद्ध्येत् कुञ्जिकास्तोत्रमुत्तमम् ॥ ४ ॥


अथ मन्त्रः ।

ओं ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ।
ओं ग्लौं हुं क्लीं जूं सः ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल
ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ज्वल हं सं लं क्षं फट् स्वाहा ॥ ५ ॥



इति मन्त्रः ।

नमस्ते रुद्ररूपिण्यै नमस्ते मधुमर्दिनि ।
नमः कैटभहारिण्यै नमस्ते महिषार्दिनि ॥ ६ ॥

नमस्ते शुम्भहन्त्र्यै च निशुम्भासुरघातिनि ।
जाग्रतं हि महादेवि जपं सिद्धं कुरुष्व मे ॥ ७ ॥

ऐङ्कारी सृष्टिरूपायै ह्रीङ्कारी प्रतिपालिका ।
क्लीङ्कारी कामरूपिण्यै बीजरूपे नमोऽस्तु ते ॥ ८ ॥

चामुण्डा चण्डघाती च यैकारी वरदायिनी ।
विच्चे चाभयदा नित्यं नमस्ते मन्त्ररूपिणि ॥ ९ ॥

धां धीं धूं धूर्जटेः पत्नी वां वीं वूं वागधीश्वरी ।
क्रां क्रीं क्रूं कालिका देवि शां शीं शूं मे शुभं कुरु ॥ १० ॥

हुं हुं हुङ्काररूपिण्यै जं जं जं जम्भनादिनी ।
भ्रां भ्रीं भ्रूं भैरवी भद्रे भवान्यै ते नमो नमः ॥ ११ ॥

अं कं चं टं तं पं यं शं वीं दुं ऐं वीं हं क्षं ।
धिजाग्रं धिजाग्रं त्रोटय त्रोटय दीप्तं कुरु कुरु स्वाहा ॥ १२ ॥

पां पीं पूं पार्वती पूर्णा खां खीं खूं खेचरी तथा ।
सां सीं सूं सप्तशती देव्या मन्त्रसिद्धिं कुरुष्व मे ॥ १३ ॥


कुञ्जिकायै नमो नमः ।


इदं तु कुञ्जिकास्तोत्रं मन्त्रजागर्तिहेतवे ।
अभक्ते नैव दातव्यं गोपितं रक्ष पार्वति ॥ १४ ॥

यस्तु कुञ्जिकया देवि हीनां सप्तशतीं पठेत् ।
न तस्य जायते सिद्धिररण्ये रोदनं यथा ॥ १५ ॥


इति श्रीरुद्रयामले गौरीतन्त्रे शिवपार्वतीसंवादे कुञ्जिकास्तोत्रं सम्पूर्णम् ।

🌹🌹🌹🌹🌹


22 Sep 2020

'ఆరా' ను లాకింగ్ ఎలా చేసుకోవాలి - ప్రక్రియ (How to lock Aura)



🌹   'ఆరా' ను లాకింగ్ ఎలా చేసుకోవాలి - ప్రక్రియ   🌹

మాస్టర్ల సందేశం

📚. ప్రసాద్ భరద్వాజ

దేవతల ఫోటోల చుట్టూతా ఒక వెలుగు ఉంటుంది.‌ దానినే 'ఆరా' (దివ్య ప్రకాశం) అంటారు. అలాగే ప్రతి మనిషి చుట్టూ.. జంతువు చుట్టూ.. వృక్షం చుట్టూ.. పర్వతం చుట్టూ.. ఇంటి చుట్టూ.. ఆలయం - చర్చి- మసీదు - గురుద్వారాల-మందిరాల చుట్టూ ఎంతో కొంత 'ఆరా' ఉంటుంది.

✨. ఈ "ఆరా" ను మన సంకల్పంతో మనం "Lock (లాక్)" చేయవచ్చు! మీ చుట్టూ మీరు "లాక్" చేసుకోవచ్చు! 12 సంవత్సరాల లోపు మీ పిల్లల చుట్టూ మీరు "లాక్" చేయవచ్చు! మీ ఇంటి చుట్టూ కూడా మీరు "ఆరా" ను లాక్ చేయవచ్చు! ఇతరుల చుట్టూ.. ఇతర నిర్మాణాల చుట్టూ.. "లాక్" చేయడానికి ప్రయత్నిస్తే. మీ "ఆరా" లాకింగ్ వ్యర్థమవుతుంది!

✨. మీ "ఆరా" ను మీ సంకల్పంతో Lock చేయడానికి ముందు మీ చుట్టూ మీరు మీ నఖశిఖ పర్యంతం(తల నుండి పాదాల దాకా) ఎంతోకొంత "ఆరా"

(వెలుగు) ను ఊహించండి! ఒక అడుగు నుండి10 అడుగుల వరకు మీ ఆలోచనా స్థాయితో మీ "ఆరా" ను మీరు మీ చుట్టూ ఊహించండి గుండ్రంగా!

✨. ఇలా మూడు సార్లు మీ "ఆరా" పరిధి చుట్టూ మీ మనస్సును గుండ్రంగా తిప్పండి! Clockwise అంటే.. కుడి నుండి ఎడమకు త్రిప్పండి!

✨. "సంకల్పం:" -

ఈ నా ఆరా పరిధిలోకి ఏ దుష్ట వైరస్ అయినా.. కరోనా వైరస్ అయినా.. ఏ జబ్బు అయినా కూడా నా యొక్క అనుమతి లేకుండా ప్రవేశించడానికి ఏమాత్రం వీలు లేకుండా నేను నా "ఆరా" ను Lock లాక్ చేస్తున్నాను!

✨. అలాగే ఏ "నిమ్న స్థాయి చైతన్యం" కూడా నా "ఆరా" పరిధిలోకి ప్రవేశించకుండా నేను నా "ఆరా" ను Lock చేస్తున్నాను.

✨. అయితే ఏ "ఉన్నతస్థాయి చైతన్యం" అయినా.. ధ్యాన- జ్ఞాన సందేశాలు అయినా.. ప్రేరణలు అయినా నా యొక్క "ఆరా" పరిధి లోకి ప్రవేశించడానికి నేను అనుమతి ఇస్తున్నాను!

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భక్తిసందేశాలు

19 Sep 2020

Light Is Consciousness - The dance of Earth and Venus

 🌹   Light Is Consciousness - The dance of Earth and Venus   🌹

The dance of Earth and Venus forms a Pentagram (pentagonal) relationship from the perspective of Earth.

Search for "Orbital Resonance" for scientific investigation of this phenomena.

As the Earth goes around the Sun 8 times, Venus goes around the Sun 13 times, and traces out the pretty mathematical curve shown here.

It’s called the "Pentagram of Venus", because it has 5 ‘lobes’ where Venus makes its closest approach to Earth. At each closest approach, Venus move backwards compared to its usual motion across the sky: this is called retrograde motion.

The Earth orbits the Sun once every 365.256 days.

Venus orbits the Sun once every 224.701 days. 

So, Venus orbits the Sun in 224.701 / 365.256 ≈ 0.615187 Earth years.

And here’s the cool coincidence: 8/13 ≈ 0.615385

That’s pretty close! So in 8 Earth years, Venus goes around the Sun almost 13 times. Actually, it goes around 13.004 times.

During this 8-year cycle, Venus gets as close as possible to the Earth about 13 – 8 = 5 times.

And each time it does, Venus moves to a new lobe of the pentagram of Venus! This new lobe is 8 – 5 = 3

When Venus gets as close as possible to us, we see it directly in front of the Sun. This is called an inferior conjunction.

So, every 8 years there are about 5 inferior conjunctions of Venus.

3, 5, 8, 13 are consecutive Fibonacci numbers.

As you may have heard, ratios of consecutive Fibonacci numbers give the best approximations to the golden ratio φ = (√5 – 1)/2.

This number actually plays a role in celestial mechanics: the Kolmogorov–Arnol’d–Moser theorem says two systems vibrating with frequencies having a ratio equal to φ are especially stable against disruption by resonances, because this number is hard to approximate well by rationals... The entire solar system is forming mathematical rose curves such as epicycloids, hypotrochoids and so on.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం

15 Sep 2020

జ్ఞానులు మహా భక్తులు ఉత్తములకే కష్టాలు ఎందుకు వస్తాయి.?

జ్ఞానులు మహా భక్తులు ఉత్తములకే కష్టాలు ఎందుకు వస్తాయి.?

✍️. డా. పీ. ఎల్. ఎన్.ప్రసాద్
📚. ప్రసాద్ భరద్వాజ



మానవుడికి అతడి మొత్తం జన్మ ల రూపం సంచిత కర్మ.అందు లో ఒక జన్మ కి కేటాయించిన కర్మ ప్రారబ్ధ కర్మ. మనకు సందేహం వస్తుంది మనకి ఇంకా ఎన్ని జన్మలున్నాయి ..అని..గతం లోని కర్మ ల కారణం గా , ఆ కర్మలన్నీ తీరి పోవడానికి మరొక 100 జన్మలు అవసరం అవుతాయని అనుకుందాము.అతడి కర్మలను బట్టి .ఈ రాబోయే జన్మల సంఖ్య ఒక్కో మానవుడికి ఒక్కో విధంగా ఉంటుంది..రాబోయే జన్మ ల సంఖ్య లెక్క ఇప్పటి వరకు నిర్ధారించబడింది..ఆంటే. ఇప్పటి వరకు ఉన్న రుణాలు కొన్ని నిర్ధారితం జన్మలలో తీరుతాయి అని అర్ధం...ఆంటే  
అది Bank loan Installment భాషలో ఇన్నిEMI లు
ఉన్నాయి అని అర్ధం. ఇక నుండి మనం కొత్త కర్మలు లేదా కొత్త రుణాలు చేయకపోతే.!

వ్యాధులు బాధలు కష్టాలు. శత్రుత్వాలు అప్పులు అన్నీ కర్మ ఋణాలే. ఇవన్నీ సహజంగా కాలగతి లో సమయాన్ని అనుసరించి వచ్చి , తీరిపోతాయి. వీటిని భరించలేక మనం చేసే ప్రయత్నాల వలన కర్మలు అనుభవించవలసిన కాలం పెరిగి , ఆంటే మన జన్మ ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది..ఆంటే EMI లు పెరుగుతాయి.

భగవంతుడిని కానీ మరో దేవతలని కానీ ప్రత్యేకించి ప్రార్ధించి కొన్ని వ్యాధులు కొన్ని కర్మలని సమయం కన్నా ముందే పోగొట్టుకోవలనే తీవ్ర ప్రయత్నం వలన , ఆ కర్మలు ప్రస్తుత జన్మ లో అదృశ్యం అయి , తిరిగి వచ్చే జన్మ లో. నిర్ధారత సమయం వరకు వేధిస్తాయి..

ఈ కారణంగా నే జ్ఞానులు. యోగులు. ఉత్తములు. కర్మలను త్వరగా అనుభవించేయాలని చూస్తారు..ఇంక ఎన్నాళ్ళు మరో జన్మ ? "ఇంక జన్మ వద్దు మోక్షం కావాలి " అనుకునే వారికి ఒక చిత్రం జరుగుతుంది..

ఈ ఉత్తములు తమ కోరిక కి అనుగుణం గా , వారు మోక్షానికి వెళ్లి పోవడానికి , వారికి రాబోయే జన్మలన్నింటి కర్మలని ఇప్పుడే ఆనుగ్రహిస్తారు..లేదా రాబోయే జన్మల సంఖ్య తగ్గుతుంది..ఆంటే Bank భాషలో మీ కోరిక ప్రకారం మీ EMI లు తగ్గాయి..అప్పుడు జరిగే పరిణామం ఏమిటి ?

విపరీతం. గా వ్యాధులు అవమానాలు తిరస్కారాలు అప్పులు, ఇంత బయట దుర్భర స్థితి ఏర్పడుతుంది. మీరు గమనించండి..ప్రపంచం లో మహాత్ములందరికీ ఇదే స్థితి.. త్వరగా మోక్షం ఇప్పించు ప్రభు..అని వేడుకున్నారు.. వీరు భగవంతుడిని నిరంతరం భగవంతుడిని మనస్సులో నిలిపుకుని. ఆ వేదనలు అనుభవించారు. సక్కుబాయి తుకారామ్ ,మీరా. ఏసక్రీస్తు ఎవరైనా ఇలాగే కర్మలు త్వరగా అనుభవించారు..మీరు. "ఈ కష్టాలు బాధలు అనుభవించడం మా వల్ల కాదు " అన్నారో. మీ జన్మల EMI లు పెరిగిపోతాయి. మహాత్ములు భక్తులు యోగులు ఎక్కువగా కష్టాలు పడ టా నికి కారణం ఇదే..
🌹 🌹 🌹 🌹 🌹

W͢a͢t͢c͢h͢ Y͢o͢u͢r͢ A͢t͢t͢i͢t͢u͢d͢e͢


🌹  Watch Your Attitude  🌹
Akhand Jyoti, March 1941

✍️. Pandit Sri Rama Sarma Acharya
📚. Prasad Bharadwaj

🔵 To most of us the hardships, adversities and challenges of life seem to be intractable like gigantic mountains, dreadful like wild giants, and frightening like impenetrable darkness. But this is all subject to how we take them. In reality nothing is so hard or to tackle; it is mostly our delusion that regards it so and suffers the pains and fears.

🔴 Just change your attitude and you will find hope, courage and enthusiasm in all circumstances. Don’t lose your morale that you failed in your repeated attempts. Don’t worry. There are many other avenues. Look at them. There is no dead-end to trying harder again with better preparation. Move ahead. You just have to try your level best in transacting your duties. Every sincere effort is a step towards the goal; if not today, tomorrow you will succeed. This is the law of Nature. There is always certain consequence, some result of every action. Don’t feel helpless. Don’t count upon other’s support. No one really would have the capacity to help you if you can’t help yourself. Never blame anyone for anything wrong or harmful happening to you. Because no one can rule over you and make you suffer. You alone are the friend and the enemy of yourself. The circumstances around you are in fact your own creation. They are neither supportive nor obstructive in reality; this all depends upon your own attitude, how you accept and make use of them.

🔵 Refine your attitude, your thinking and your aspirations and let virtuous instincts awaken in yourself. It is the accumulation of the inscriptions of positive thinking and good actions over several lives that awaken devotion in the human self.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భక్తిసందేశాలు

03.Sep.2020

𝓐𝓖𝓔𝓝𝓣𝓢 𝓞𝓕 𝓣𝓗𝓔 𝓕𝓤𝓣𝓤𝓡𝓔





🌹 AGENTS OF THE FUTURE 🌹

Prasad Bharadwaj

All who love and serve their fellow humans are agents of a spiritual future – one where the human spirit is evolving towards ever greater cooperation, sharing and unity.

In every interaction, these servers ask one simple question of themselves – how can I bring this future closer? When asked sincerely, and motivated by pure goodwill, it can impact any and every situation.

Every moment, every event, every conversation becomes meaningful and significant. The magnetic power of the future is drawn into the present, and service of all kinds is energised.

The future depends on the willingness of more and more people to recognise their responsibility for creating it, and to commit themselves to asking this question.

They then become agents of the future, and accelerate its birth.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం

02 Sep 2020


ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు నియమాలు...




🌹. ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు నియమాలు... 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

1. ప్రకృతి యొక్క మొదటి నియమం...

ఒక వేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది. అదేవిధంగా మనసును మంచి మరియు ఆధ్యాత్మిక ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి.

2. ప్రకృతి యొక్క రెండవ నియమం...

ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానినే పంచుకోగలరు. సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు. దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు. జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు. భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు. భయస్తులు భయాన్నే పంచగలరు.

3. ప్రకృతి యొక్క మూడవ నియమం...

మీకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే...
భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి.
ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది.
మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి.
ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది.
నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది.
అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది.
దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది.
సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది...

🌹 మానవుడు కోల్పోయిన వాస్తవిక జ్ఞానము 🌹

🌹 మానవుడు  కోల్పోయిన వాస్తవిక జ్ఞానము 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🍃 ఉనికి (జీవుల కర్మ భూమి) 🍃

సూర్యుడు (Sun)
బుధుడు (Mercury)
శుక్రుడు (Venus)
భూమి (Earth)
కుజుడు (Mars)
గురువు (Jupiter)
శని (Saturn)
ఇంద్రుడు (Uranus)
వరుణుడు (Neptune)

ఇది మన సౌరమండలము (Solar System) .

Google లో ఒకసారి వాటి స్ధితి గతులను ప్రశ్నించండి, పరిశీలించండి.  మీ ఉనికిని Google Maps యందు పరిశీలించండి.

ఆ తర్వాత, పాలపుంత యందు (MilkyWay) మన సౌర కుటుంబము (Solar System), మన భూమి  యెుక్క ఉనికిని ప్రశ్నించి పరిశీలించండి.

ఆ తర్వాత,  నక్షత్రవీధి (Galaxy) యందు మన పాలపుంత, మన సౌర కుటుంబము మరియు మన భుామి యెుక్క ఉనికిని ప్రశ్నించి పరిశీలించండి.

ఆ తర్వాత, విశ్వము (Universe) యందు మన నక్షత్రవీధి (Galaxy),  మన పాలపుంత, మన సౌర కుటుంబము మరియు మన భుామి యెుక్క ఉనికిని ప్రశ్నించి పరిశీలించండి.

ఆ తర్వాత,  బ్రహ్మాండము (Cosmos) యందు మన విశ్వము (Universe), మన నక్షత్రవీధి (Galaxy),  మన పాలపుంత, మన సౌర కుటుంబము మరియు మన భుామి యెుక్క ఉనికిని ప్రశ్నించి పరిశీలించండి.

ఇప్పుడు ప్రశ్నించుకోండి,  ఇంత జ్యామితి బద్ధమైనటువంటి, గణిత బద్ధమైనటువంటి క్లిష్టమైనటువంటి బ్రహ్మాండ రచన ఎవరి మేధాశక్తితో జరుగుతోంది?

గురుత్వాకర్షణ శక్తి, ప్రాణశక్తి, జ్ఞానశక్తి, మానసిక శక్తి,  ఆలోచనా శక్తి ఇవన్ని పంచభూతములైనటువంటి ఆకాశము, గాలి, అగ్ని, భూమి, నీరు మరియు గ్రహముల యెుక్క కారకత్వము వలన జీవరాశులకు సంభవించుచున్నవి. వీటియందు ఏ ఒక్కటి కొరవడినా మనము నివసించెడు భూమి గతుల యందు ఊహించనటు వంటి మార్పులు సంభవించి ప్రకృతి ప్రళయాలకు దారితీయును.

ధర్మము (Law of Friction and Law of Action) నిర్దేశింపబడి, గ్రహములుకాని, పంచభూతములుకాని పనిచేయుచున్నవి.

కాలము అనునది ఒక అనిత్యమైన,  అస్ధిరమైన (Variable) పరిమాణం (Dimension).

ఒక్కొక్క గ్రహమునకు రేయింబగళ్ళు యెుక్క కాలనిర్ణయము,  అవి సూర్యుని చుట్టూ తిరిగే కాలాన్ని బట్టి మారుతూవుంటుంది. అందుచేత కాలము అస్ధిరమైనటువంటి పరిమాణం!

మెుదలు, మన భూమి యొక్క అగణిత పరిభ్రమణాన్ని,  జ్ఞాని, శాస్త్రజ్ఞుడు,  మహా శక్తివంతుడైనటువంటి దేవుడు పెద్దపెద్ద పర్వతముల (Mountain Ranges)  సంస్ధాపనచేత (Installation)  భూమి యొక్క పరిభ్రమణాన్ని ఆయన పరిపూర్ణంగా జ్యామితి (Geometrical) పరచెను. ఆవిధముగా ఆయన భూమి మీద జీవరాశి యొక్క మనుగడకు నాంది పలికారు.

పైన తెలిపినటువంటి సౌర మండలాలు కోటానుకోట్లు ఈ విశ్వమంతా వ్యాపించి యున్నవి. మరి వీటి స్థితిగతులు,  జీవరాశికి ఖర్మనాపాదించుటకు ప్రతి సౌరమండలముయందుండెడు గ్రహముల కారకత్వము (Authorship), వాటి  ఆవశ్యకత,  ఇంతటిని పరిపూర్ణముగా జ్యామితిపరుచుటకు కావలసిన యుక్తి, శక్తి కలవాడై,  దైవము ఈ సమస్త విశ్వమును నడుపుచున్నాడు!

రూపరహితుడైన తను, మాయను (సృష్టి, స్ధితి, లయములు) కార్య, కారణ, కాలమనెడి పరిమాణములాధారంగా జగత్కళ్యాణమును సాధించుచుండును!
తన స్ధిరమైన (Static or Absolute) ఉనికినుండి యుక్తి, శక్తి అనెడి అస్ధిరత్వాల(Variable)  సం-యెాగముతో ఇచ్ఛా, జ్ఞాన, క్రీయా శక్తుల ద్వారా శాశ్వతసమయమందు (Time Immortal) చరాచర జగత్తును స్పృశించుచుండును.
ఈ పరిణామక్రమములో, కల్పములయందు జరిగిన, జరుగుచున్న, జరుగబోయెడి రూపాంతరములు కొన్ని పాక్షికస్పృహతో కూడినివై (Partial Consciousness) ఆ తదుపరి తన పూర్తిస్పృహ (Full Consciousness)  యెుక్క అధ్భుతమైనటువంటి సూక్ష్మవిశ్వము తాలూకు నమూనా మనిషి-మానవజాతి!

ఈ మనిషి అనే రూపముయందు తన స్ధిరమైనటువంటి రూపరహిత ఉనికి (SOUL) మరియు అస్ధిరత్వాలైనటువంటి శక్తియుక్తుల సంయెాగముద్వారా, జీవత్వమును (Third Value)  కారణమనెడి పరిమాణముద్వారా సిధ్దింపజేయుచుండును.

కొత్తదనము, పాతదనము యెుక్క త్యాగము (Collapse or Sacrifice) వల్ల సిద్ధించుచుండును. స్ధిరమైన తను అస్ధిరత్వాల సంయెాగము చేత ప్రతి క్షణము రూపాంతరము చెందుచుండును(Reproduction)!
తనున్నానటువంటి ఉనికిని స్పందన-ప్రతిస్పందన అనెడి చర్యయందు తెలియజేయుచుండును!


🌺జీవి గర్వము (False Ego)🌺

గాఢ నిద్రయందు జీవుల శ్వాసనిశ్వాసలు నియంత్రించెడి శక్తియుక్తులు, జీవి ప్రమేయము లేకుండుగనే జరుగుచున్నవి!

ఎవరి ఉత్తర్వులమేరకు,  పై చర్య జరుగుచున్నది?

శక్తి-యుక్తి స్వతంత్ర పరిమాణములు (Separate Entities from Life)  అనుటకు నిదర్శనముగా, మెలుకువతోడనే "గాఢంగా నిద్రపోయాను" అన్న అనుభవమును విశదపరుచున్నది ఎవరు,  ప్రశ్నించుకోగలరు?

జీవత్వమన్నది శక్తి-యుక్తుల సంయెాగానుభవమే!

మూడవ విలువైనటువంటి "జీవము" ద్వారా ఒక నిర్ధిష్టమైనటువంటి కట్టబాటు, యెాగము ద్వారా తన్నుతానెరుంగుట ఒక విలాసము!

మరి ఈ అహంకారమనెడి తప్పుడు స్పందన మనిషికి ఎటునుంచి దాపురించినది?

ఇంకొక ఉదాహరణ......

శారీరక స్పందనల వల్ల  స్త్రీ, పురుష సంయెాగముతో జనించెడు బిడ్డ యెుక్క పోషణ, రచన, తల్లి గర్భముయందు ఎవరు నియంత్రిస్తున్నారు?
ఆ రచన యందు తల్లిదండ్రుల పాత్ర కొసమెరుపైనా లేదు!
పోనీ జీవోత్పత్తికి తయారయ్యెడి శుక్రశోణితాలు తల్లిదండ్రులు ఆధీనము నందున్నవా? లేవు!

మరి ఈ అహంకారమనెడి తప్పుడు స్పందన మనిషికి ఎటునుంచి దాపురించినది?

ప్రారబ్ధముననుసరించి,  యుగధర్మమున అభివృద్ధి పేరిట రూపాంతరము చెందుచున్నటువంటి మానవుని శక్తి-యుక్తులు,  బాహ్య ప్రకృతికి కాని, అంతర్ప్రకృతికి గాని దైవము యెుక్క సృజనాత్మకతకు అద్దం పట్టేదిలా ఉండడమే జీవము యెుక్క అత్యున్నతమైనటువంటి నైతిక పరిణామం!

చిత్రవిచత్రమైనటువంటి అశ్రేస్కరమైనటువంటి కోరికల వలయాలయందు గ్రహముల కారకత్వము చేత మనిషి తన్ను తాను గొప్పగా కీర్తించుకుంటున్నాడు! తద్వారా,  యుగధర్మములకు భాధ్యుడైనాడు!

వ్యాఖ్య: 1

ఒక్కటి తెలుసుకో,  భగవంతుడి కార్యములయందు
స్వేచ్ఛ.
జ్ఞానము.
అందము.
ఆనందము.
పరమార్థము (Life Supporting, Nature Supporting). 
కాలప్రమాణము యందు శాశ్వతము.
ఒకదానిననుసరించి ఒకటుంటుంది!

దేహమే నేననెడి భావన - దేహాత్మ
జీవమనెడి భావన - జీవాత్మ.
సాంఘికముగా జీవులయెడ జీవమును గౌరవించెడు స్ధాయి - మహాత్మ
అన్నిటియందు "నేను" ను స్మరించు స్ధాయి -  పరమాత్మ
పై విధముగా రూపాంతరము చెందినటువంటి ఆత్మను పరమాత్మ స్ధాయికి చేర్చుటయే మనిషి యెుక్క ఖార్మిక కర్తవ్యము!
ఇంతకు మించిన జీవన ధర్మము ఇంకేముంటుంది?

కల్పాంతరములయందు, ఆధ్యాత్మికత (Spirituality) యందు పురోగతి సాధించినటువంటి ఉత్తమ మానవతావర్గానికి చెందినటువంటి మహనీయులు తమ శక్తి-యుక్తులను తపస్సు ద్వారా భగవంతుడి కల్పనాశక్తి మేరకు అనుసంధానపరచి, భగవంతుడి (Static Omni Potent) విశ్వకళ్యాణ ఆలోచనా తరంగములను "వేదము" (Sacred Thoughts) ల ద్వారా గ్రహించి జీవకోటి కళ్యానమునకు దోహదపడి శాశ్వత ఉనికిని సంపాదించుకొనిరి!

వ్యాఖ్య: 2

ఆదిఆద్యంతములు లేని ఇంత బ్రహ్మాండ రచన అంత గణితబధ్ధమై పరిపూర్ణమైన నమూనాగా గోచరిస్తూవుంటే, జీవుడేమిటి భగవంతుడి భౌతిక రచనాసామర్ధ్యాన్ని  బాహ్యమునందే అర్ధము చేసుకోలేకున్నాడే,  ఇంక వీడు(జీవుడు) లోపలికి ప్రయాణము చేసి తన్నుతాతెలుసుకొని భగవంతుడి ఆలోచనా దృక్పధము యందు భాగస్వామెప్పుడయ్యేడు!

విశ్వం యెుక్క పుట్టుక,  విశ్వము యందు జరుగుచున్నటు వంటి సమస్త విలాసము, శృతి తప్పక,  గతి తప్పక ప్రకృతీసమేతముగా రూపాంతరము,  భగవంతుడి "వేదతరంగముల" (Sacred Thoughts) ద్వారానే జరుగుచున్నది.

జీవుడిగా మనము ఆయన ఆదేశాలమేరకు బ్రతకడం తప్ప ఇంకే విధమైనటువంటి అధిక వైపరీత్య చదువుల దోరణితో అభివృధ్ది యందు తప్పిదము జరిగినపుడు, భగవంతుడి ఆలోచనా తరంగముల ద్వారా సహజీవనం సాగిస్తున్నటువంటి మన భూమి-ప్రకృతి యందు అగణిత తరంగముల ఉత్పత్తి పెరిగి జీవుని మనుగడయందు లోపమేర్పడును! లోపములను క్రమబధ్దీకరించే నైపుణ్యమును జీవుడు తిరిగి భగవంతుని ఆలోచనా తరంగములనుంచియే (వేదము)  గ్రహించవలసియుంది!

భగవంతుడు సృష్టించిన రచనను అర్ధం చేసుకొని (వాస్తవిక విద్య), మానవుడు అభ్యున్నతిని సాధించవలెను.

🌺||సర్వేజన సుఖినోభవంతు,  లోకాసమస్తా సుఖినోభవంతు||🌺
🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹