Showing posts with label శివ లింగాలు Shivalings. Show all posts
Showing posts with label శివ లింగాలు Shivalings. Show all posts

"నమామి సోమేశ్వరం స్వతంత్రం ఉమాపతిం తం విజయం నమామి" "Namami Someswaram Umapathim Tum Vijayam Namami" Shiva Song (YT Short)


https://youtube.com/shorts/tT_zpKy9l2g

🌹 నమామి సోమేశ్వరం స్వతంత్రం ఉమాపతిం తం విజయం నమామి Namami Someswaram Umapathim Tum Vijayam Namami Shiva Song 🌹

ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


"శ్రీ కంఠ లోకేశ శ్రీ కాళహస్తిసా చిద్రూప కారుణ్య కల్పద్రుమా" Sri Kalahastiswara Shiv (a devotional YT Short)


https://youtube.com/shorts/nFq5JW30Aak

🌹 శ్రీ కంఠ లోకేశ శ్రీ కాళహస్తిసా చిద్రూప కారుణ్య కల్పద్రుమా
Sri Kalahastiswara Shiva 🌹


ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2083598042426666



శివలింగముల విశేషాలు - శివాభిషేకం ప్రాముఖ్యత Shiva Lingam - Importance of Shiva Abhishekam




🌹 శివలింగముల విశేషాలు - శివాభిషేకం ప్రాముఖ్యత 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Special Features of Shiva Lingam - Importance of Shiva Abhishekam 🌹
Prasad Bharadwaja


మొట్టమొదట అన్నిటికన్నా గొప్పదయినా లింగమును స్వయంభూ లింగము అని పిలుస్తారు. ఆ లింగమును ఒకరు ప్రతిష్ఠ చేయరు. తనంత తాను వెలుస్తుంది. శ్రీశైలాది క్షేత్రములు ఇందుకు ఉదాహరణ.

రెండవది దివ్య లింగములు ఇవి దేవతలు ప్రతిష్ఠ చేసినవి. కుమారస్వామి ప్రతిష్ట చేసిన సామర్లకోటలోని కుమారారామం ఇందుకు ఉదాహరణ.

మూడవది మానుష లింగములు. ఇవి మనుష్యులు ప్రతిష్ఠ చేసినవి. తరువాత ఆర్ష లింగములు. ఇవి మహర్షులు ప్రతిష్ఠ చేసినవి. రాక్షస లింగములు. రాక్షసులు ప్రతిష్ఠ చేసినవి. దైవిక లింగములు వాటంతట అవి ఏర్పడతాయి. అరకువేలీలోని బుర్రా గుహలలో పైనుండి నీటి బిందువులు క్రిందపడతాయి. కొండ ఉపరితలం ఎక్కడో పైన ఉంటుంది. పైనుండి నీటి బిందువు ఒకేచోట బయలుదేరి క్రింద ఒకేచోట పడుతుంది. ఆ నీటి బిందువు పడినప్పుడల్లా క్రింద ఉన్న భూమి కొద్దికొద్దిగా పైకి లేస్తూ శివలింగంగా మారిపోతుంది. ఇది క్రమక్రమంగా పెరిగి చివరకు ఎక్కడి నుండి నీరు పడుతోందో ఆ ప్రదేశమును తాకి ఇంక నీరు పడకుండా ఆపేస్తుంది. అలా అది మర్రిచెట్టు ఊడలా పెరిగిపోతుంది. దీనిని దైవిక లింగం అంటారు. బాణ లింగములు అని ఉంటాయి. అవి నర్మదానది ప్రవాహము ఒరిపిడి చేత ఏర్పడతాయి.

లింగము అరూపరూపి. ఉపాసనలో లింగోపాసన ఒక మెట్టు పైన ఉంటుంది. మీకు శివలింగమును చూపించి ఆ శివలింగం ఎటువైపు చూస్తోంది అని అడిగినట్లయితే దానికి సమాధానం చెప్పడం తేలికయిన విషయం కాదు. యథార్థమునకు మీరు శివాలయంలోపల కూర్చుని శివలింగమునాకు అభిషేకం చేయడం కన్నా రుద్రాధ్యాయంతో అర్చక స్వాములు అభిషేకం చేస్తుండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరిస్తే దానివలన మీరు ఎక్కువ ప్రయోజనమును పొందుతారు.

శివలింగంలో తూర్పుకు చూస్తున్న దానిని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుకు అధిష్ఠానంగా ఉంటుంది. దీనివలన అజ్ఞానం కలుగుతుంది.

దక్షిణమునకు చూసే ముఖమును అఘోర ముఖము అంటారు. ఇది అగ్నిహోత్రమును శాస్తిస్తుంది. అది అగ్నిహోత్రంగా ఉంటుంది లయం చేస్తుంది. ఇది మీ అజ్ఞానమును దహించేస్తూ జ్ఞానమును కూడా ఇస్తుంది.

పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని సద్యోజాత ముఖం అంటారు. పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్ళు విభూతి, పళ్ళరసములు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు పరమేశ్వరుని అనుగ్రహం కలిగేస్తూ ఉంటుంది. అది భూసంబంధంగా ఉంటుంది. అది సృష్టికి కారణం అవుతుంది. అపమృత్యువు వస్తుందేమోనని భయంగా ఉంది అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. పీడకలలు వస్తున్నాయని చెప్తే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. హనుమ శివాంశ. అందువల్ల ఈ రెండు క్రియలె చెప్తారు. వర్షములు పడకపోతే శివలింగామునకు అభిషేకం చేయడం వల్ల వామదేవ ముఖం తడిసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన వర్షములు పడతాయి.

పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది. దానిని ఈశానముఖం అంటారు. దీనిని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపియై ఉంటుంది. ఇదే మోక్షమును కటాక్షిస్తుంది.

ఈ అయిదు ముఖములతో శివ స్వరూపం లింగ రూపంలో పంచభూతములను శాసిస్తోంది. సృష్టి స్థితి లయ అజ్ఞాన మోక్షములకు కారకం అవుతుంది. సమస్త ఫలితములను ఇస్తుంది. కాబట్టి శివలింగం చల్లబడడం ఊరంతా చల్లగా ఉండడమే.

అసలు లింగమునకు బాహ్యమునందు ఏమీ లేదు. బ్రహ్మాండములన్నీ లింగాకృతిలోనే ఉన్నాయి. లింగమునకు పూజ చేస్తే సమస్త లోకములకు పూజ జరిగినట్లే.

🌹 🌹 🌹 🌹 🌹


వివిధ శివ లింగాభిషేకాలు - వాటి ఫలితాలు Various Shiva Linga Abhishekams - Their Results




🌹 వివిధ శివ లింగాభిషేకాలు - వాటి ఫలితాలు 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Various Shiva Linga Abhishekams - Their Results 🌹
Prasad Bharadwaja


'త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం ఏకబిల్వం శివార్పణం' Shiv Ling Ashtakam (A Devotional YT Short)



https://youtube.com/shorts/RocUUHj53EM


🌹 త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం ఏకబిల్వం శివార్పణం
Shiv Ling Ashtakam
🌹


ప్రసాద్‌ భరధ్వాజ

తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


జయ లింగేశ్వర స్వామి పంచామృత స్నానం / Jaya Lingeshvara Swamy Panchamrutha Abhishek (a devotional YT video)



https://youtube.com/shorts/nPIZGE741AU


🌹 జయ లింగేశ్వర స్వామి పంచామృత స్నానం
Jaya Lingeshvara Swamy Panchamrutha Abhishek 🌹


ప్రసాద్‌ భరధ్వాజ


Like, Subscribe and Share

తప్పకుండా వీక్షించండి


🌹🌹🌹🌹🌹


శివలింగాభిషేకం - వివిధ ఫలితాలు Shivalingabhishekam - Various Phalas/results


🌹.శివలింగాభిషేకం - వివిధ ఫలితాలు🌹


🙏🙏🕉🙏🙏☘️🙏🙏🕉🙏🙏


1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.

3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును

4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.

5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును

6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.

7 .మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును

8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.

10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.

11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.

14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.

15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.

16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును

17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.

శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నాన్ని మెత్తగా రుబ్బి దాంతో లింగాకారానికి లేపనంలాగా రాస్తారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

18 మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలవ్యాదులు నయమగును.

19 కస్తురి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తి యోగం కలుగును.

20 పసుపు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంగళ ప్రదమగును శుభకార్యాలు జరుగును.

🌹 🌹 🌹 🌹 🌹


01 Mar 2022

మహిమాన్విత 108 లింగాలు - 108 Shivalingas


*🌹. మహిమాన్విత 108 లింగాలు 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఈ రోజు 108 నామాలు ఒకసారి చదువుకోండి 🍀*

1. ఓం లింగాయ నమః
2. ఓం శివ లింగాయనమః
3. ఓం శంబు లింగాయనమః
4. ఓం ఆధిగణార్చిత లింగాయనమః
5. ఓం అక్షయ లింగాయనమః
6. ఓం అనంత లింగాయనమః
7. ఓం ఆత్మ లింగాయనమః
8. ఓం అమరనాదేశ్వర లింగాయనమః
9. ఓం అమర లింగాయనమః
10. ఓం అగస్థేశ్వర లింగాయనమః

11. ఓం అచలేశ్వర లింగాయనమః
12. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః
13. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః
14. ఓం అపూర్వ లింగాయనమః
15. ఓం అగ్ని లింగాయనమః
16. ఓం వాయు లింగాయనమః
17. ఓం జల లింగాయనమః
18. ఓం గగన లింగాయనమః
19. ఓం పృథ్వి లింగాయనమః
20. ఓం పంచభూతేశ్వర లింగాయనమః

21. ఓం పంచముఖేశ్వర లింగాయనమః
22. ఓం ప్రణవ లింగాయనమః
23. ఓం పగడ లింగాయనమః
24. ఓం పశుపతి లింగాయనమః
25. ఓం పీత మణి మయ లింగాయనమః
26. ఓం పద్మ రాగ లింగాయనమః
27. ఓం పరమాత్మక లింగాయనమః
28. ఓం సంగమేశ్వర లింగాయనమః
29. ఓం స్పటిక లింగాయనమః
30. ఓం సప్త ముఖేశ్వర లింగాయనమః

31. ఓం సువర్ణ లింగాయనమః
32. ఓం సుందరేశ్వర లింగాయనమః
33. ఓం శృంగేశ్వర లింగాయనమః
34. ఓం సోమనాథేశ్వర లింగాయనమః
35. ఓం సిధేశ్వర లింగాయనమః
36. ఓం కపిలేశ్వర లింగాయనమః
37. ఓం కాపర్డేశ్వర లింగాయనమః
38. ఓం కేదారేశ్వర లింగాయనమః
39. ఓం కళాత్మక లింగాయనమః
40. ఓం కుంభేశ్వర లింగాయనమః

41. ఓం కైలాస నాదేశ్వర లింగాయనమః
42. ఓం కోటేశ్వర లింగాయనమః
43. ఓం వజ్ర లింగాయనమః
44. ఓం వైడుర్య లింగాయనమః
45. ఓం వైద్య నాదేశ్వర లింగాయనమః
46. ఓం వేద లింగాయనమః
47. ఓం యోగ లింగాయనమః
48. ఓం వృద్ధ లింగాయనమః
49. ఓం హిరణ్య లింగాయనమః
50. ఓం హనుమతీశ్వర లింగాయనమః

51. ఓం విరూపాక్షేశ్వర లింగాయనమః
52. ఓం వీరభద్రేశ్వర లింగాయనమః
53. ఓం భాను లింగాయనమః
54. ఓం భవ్య లింగాయనమః
55. ఓం భార్గవ లింగాయనమః
56. ఓం భస్మ లింగాయనమః
57. ఓం భిందు లింగాయనమః
58. ఓం బిమేశ్వర లింగాయనమః
59. ఓం భీమ శంకర లింగాయనమః
60. ఓం బృహీశ్వర లింగాయనమః

61. ఓం క్షిరారామ లింగాయనమః
62. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయనమః
63. ఓం మహానంది ఈశ్వర లింగాయనమః
64. ఓం మహా రుద్ర లింగాయనమః
65. ఓం మల్లికార్జున లింగాయనమః
66. ఓం మహా కాళేశ్వర లింగాయనమః
67. ఓం మల్లీశ్వర లింగాయనమః
68. ఓం మంజునాథ లింగాయనమః
69. ఓం మరకత లింగాయనమః
70. ఓం మహేశ్వర లింగాయనమః

71. ఓం మహా దేవ లింగాయనమః
72. ఓం మణికంధరేశ్వర లింగాయనమః
73. ఓం మార్కండేయ లింగాయనమః
74. ఓం మాడిణ్యేశ్వర లింగాయనమః
75. ఓం ముక్తేశ్వర లింగాయనమః
76. ఓం మృతింజేయ లింగాయనమః
77. ఓం రామేశ్వర లింగాయనమః
78. ఓం రామనాథేశ్వర లింగాయనమః
79. ఓం రస లింగాయనమః
80. ఓం రత్నలింగాయనమః

81. ఓం రజిత లింగాయనమః
82. ఓం రాతి లింగాయనమః
83. ఓం గోకర్ణాఈశ్వర లింగాయనమః
84. ఓం గోమేధిక లింగాయనమః
85. ఓం నాగేశ్వర లింగాయనమః
86. ఓం ఓంకారేశ్వర లింగాయనమః
87. ఓం ఇంద్ర నిల మణి లింగాయనమః
88. ఓం శరవణ లింగాయనమః
89. భృగువేశ్వర లింగాయనమః
90. ఓం నీలకంటేశ్వర లింగాయనమః

91. ఓం చౌడేశ్వర లింగాయనమః
92. ఓం ధర్మ లింగాయనమః
93. ఓం జోతిర్ లింగాయనమః
94. ఓం సైకత లింగాయనమః
95. ఓం చంద్రమౌలీశ్వర లింగాయనమః
96. ఓం జ్వాలా లింగాయనమః
97. ఓం ధ్యాన లింగాయనమః
98. ఓం పుష్యా రాగ లింగాయ నమః
99. ఓం నందికేశ్వర లింగాయ నమః
100. ఓం అభయ లింగాయ నమః
101. ఓం సహస్ర లింగాయ నమః
102. ఓం ఏకాంబరేశ్వర లింగాయనమః
103. ఓం సాలగ్రామ లింగాయనమః
104. ఓం శరభ లింగాయనమః
105. ఓం విశ్వేశ్వర లింగాయనమః
106. ఓం పథక నాశన లింగాయనమః
107. ఓం మోక్ష లింగాయనమః
108. ఓం విశ్వరాధ్య లింగాయనమః.
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/


01 Mar 2022