భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 149

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 149 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 28 🌻

🌷. ఐక్య అస్తిత్వము - సత్య గోళం 🌷

597. సత్య భువన మందలి భగవంతుడు తొలిసారిగా తన ఏకత్వ మందు ఎరుక గలవాడు అయ్యెను. అనేకత్వం లో గల ఏకత్వ మందు ఎరుక గల ఏకత్వము కలవాడు అయ్యను.

.

మహర్షుల భావన ప్రకారం, పరాత్పరస్థితిలో గుప్తమైన పరమనిథి ఉండెను .అది తనను తాను తెలిసి కొన గోరెను.ఇట్లు తనలో ఒక వాంఛ కలిగిన తక్షణమే, తాను ఒక మహా తేజస్సు గా ఎరుకను పొందెను ఈ మహా తేజస్సులో సమస్త సృష్టియు ,దాని ఆవిష్కరములను అంతర్నిహితములై యుండెను.

"భగవంతుడు నా తేజస్సును సృష్టించెను. నా తేజస్సులో నుండి ఈ విశ్వం ఉనికిని పొందెను."

భగవంతుని జ్ఞానము లో అద్వైత స్వరూపముతో సహా ఇది పరమ సౌందర్య లక్షణము(సర్వం సుందరం)

ఇచ్చట భగవంతునకు- సృష్టికి గల సంబంధము ప్రేమికునకు-ప్రియునకు గల సంబంధం వంటిది .

ఇచ్చట భగవంతుడు ప్రేమికుడు, మహర్షి ప్రియ తమ్ముడు. భగవంతుడిచ్చట తన యందు సృష్టి యందు ఎరుక గలవాడు అయ్యను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 210

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 210 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. వ్యాసమహర్షి - 2 🌻

8. పాండురాజు చనిపోయినప్పుడు కుంతీదేవి దుఃఖపడుతుంటే, ఆమెను వ్యాసుడు ఓదారుస్తూ ఒక్కటేమాట చెప్పాడట, “అమ్మా! కాలంయొక్క స్వరూపం బాగా తెలిసినవాళ్ళు, ఎప్పుడూ కూడా భవిష్యత్తు కంటే గడచిన కాలమే మంచిదని అనుకుంటూ ఉంటారు. ఈ ఒక్కమాట గుర్తుపెట్టుకో! గడిచిపోయినకాలంలో ఉన్నటువంటి సుఖసంపదలను తలచుకోని శాంతిని పొందు.

9. వర్తమానకాలంలో, భవిష్యత్తులో ఎటువంటి ఆశలూ పెట్టుకోవద్దు” అని చెప్పాడు. ఎలాంటి వేదతత్త్వమూ ఆయన చెప్పలేదు. జీవితంలోని సత్యం చెప్పాడు. ఎందుకు చెపుతున్నాడీ విషయం అంటే, అందులో భవిష్యత్తు సూచన ఉంది.

10. పాండవులు పుట్టారు బాగున్నారు అని సంతోషిస్తే, భర్త పోయాడు. వీళ్ళు ఎలా ఉంటారో చెప్పలేము. రాబోయేది మహాభారత యుద్ధం. గొప్పమార్పు ఉంది. అది అందరినీ తీసుకెళ్ళి సముద్రంలో కలుపుతుంది, ఎవరినీ ఉంచదు.

11. వీళ్ళిక్కడ సుఖపడటానికే పుట్టలేదు. కాబట్టి భవిష్యత్తులోకూడా సుఖము ఆశించవద్దని ఆమెకి వ్యాసుడు చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం, అందరికీ అంతో ఇంతో వర్తిస్తుంది.

12. ఓదార్పు మాటలు సత్యంతో ఉండాలి అబద్ధపు వాగ్దానాలు ఉండకూడదు. అసత్యమయినటువంటి ఆశ, కల్పన దోషయుక్తం. “ఉన్నది ఇదే, యథార్థమని అనుకో. ఇంతకన్న బావుంటే అదృష్టవంతుడివి” అని చెప్పటమే మేలు. కఠినంగా ఉన్నప్పటికీ అదే సత్యం.

13. అత్యుత్తమమయినదేమిటంటే, ఉన్నది యథార్థంగా ఉన్నట్లుగానే గ్రహించి, తపోబలంతో వైముఖ్యం పొందటం. ప్రపంచంవైపు చూడక ధీరుడు తపస్సును ఆశ్రయిస్తాడు. తపస్సులో పెరుగుతాడు.

14. తపస్సు లేని దుఃఖభూయిష్టమైన జన్మ నశిస్తుంది. క్రమక్రమంగా అతడియొక్క తేజస్సు తగ్గిపోతుంది. ఆత్మగౌరవం, మనోబలం నశించి ఇంకా క్షీణదశకు వెళ్ళిపోతుంది మనిషి జీవితం. తపోబలంలో మనిషి ఉన్నతుడవుతాడు. అందుకే తపస్సుకు అంత ప్రాధాన్యం.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2021

శ్రీ శివ మహా పురాణము - 325

🌹 . శ్రీ శివ మహా పురాణము - 325 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

82. అధ్యాయము - 37

🌻. యజ్ఞ విధ్వంసము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను

అపుడు మహాబలుడగు ఆ వీరభద్రుడు విష్ణువుతోడి యుద్ధమునందు అపదలన్నిటినీ వనివారించు శంకరుని మనస్సులో స్మరించి(1) దివ్యమగు రథమునధిష్ఠించెను. శత్రువులనందరినీ సంహరించే ఆ వీరభద్రుడు గొప్ప అస్త్రమును తీసుకొని సింహ నాదమును చేసెను(2) విష్ణువు కూడా పాంచ జన్యమను పేరుగల, గొప్ప శబ్ధమును చేసే తన మహాశంఖమును, తనవారికి ఆనందమును కలుగు చేయుచున్నాడాయన్నట్లు, మ్రోగించెను(3) ఆ శంఖ నాదమును విని, పూర్వములో యుద్ధమునండి పారిపోయిన దేవతలు కూడ వేగముగా మరలి వచ్చిరి(4)

సైన్య సమేతులగు లోకపాలురు ఇంద్రునితో గూడి సింహనాదమును చేసి వీరభద్రుని గణములతో యుద్ధమును చేసిరి(5) సింహనాదములను చేయుచున్న గణములకు, లోకపాలురకు భయమును గొల్పు సంకుల సమరము జరిగెను(6) ఇంద్రుడు నందితో యుద్ధమును చేసెను. అగ్ని విష్ణు గణములు, మరియు కుబేరుడు బలశాలియగు కూష్మాండపతితో యుద్ధమును చేసిరి(7) అపుడు ఇంద్రుడు వంద ధారలు గల వజ్రముతో నందని కొట్టగా, నంది ఇంద్రుని త్రిశూలముతో వక్షస్థ్సలమునందు కొట్టెను(8)

బలవంతులగు నంది, ఇంద్రుడు ఇద్దరు ఒకరినొకరు జయించు కోరిక గలవారైన, అనేక విధములుగా ఒకరినొకరి కొట్టుకొనుచూ, పట్టుదలతో యుద్దమును చేసిరి(9) మిక్కిలి కోపము గల అగ్ని అశ్మయను గణాధిపతిని శక్తితో కొట్టెను. ఆయన కూడ అగ్నిని వేగముగా వంద ధారలు గల శూలముతో పొడిచెను(10). శివలోకములోని గణములలో అగ్రేసరుడగు వీరుడు ఆనందముతో మహాదేవును స్మరించుచూ, యమునితో సంకుల సమరమునుచేసెను(11) మిక్కలి బలశాలియగు చండుడు నైర్‌ఋతికి ఎదురేగి, పరమాస్త్రములతో అతనిని కొట్టి, పరిహసించుచూ, యుద్దమును చేసెను(12)

వీరుడు, మహాబలుడునగు ముండుడు గన గొప్ప శక్తిచే ముల్లోకములను విస్మయపరుచుచున్నాడా యన్నట్లు వరుణునితో యుద్ధమును చేసెను(13).వాయువు గొప్ప శక్తిగల తన తన అస్త్రముతో భృంగిని కొట్టగా, ప్రతాపశాలియగు భృంగి వాయువును త్రిశూలముతో కొట్టెను(14)

బలవంతుడు, వీరుడునగు కూష్మాంండపతి మనస్సులో మహేశ్వరుని ధ్యానించి, కుబేరునితో యుద్ధమును చేసెను(15). యోగినీ గణములతో కూడియున్న బహాబలుడగు భైరవీ నాయకుడు దేవతలనందరినీ చీల్చి రక్తమును త్రాగెను. ఆదృశ్యము అద్భుతముగ నుండెను(16) మరియు ఆ యుద్ధములో క్షేత్రపాలుడు, ఋభుక్షుడు, కాళి ఆ దేవతలను అధిక సంఖ్యలో చీల్చి రక్తమును త్రాగిరి. (17). అపుడు మహా తేజస్వి, శత్రు సంహారకుడునగు విష్ణువు వారితో యుద్ధమును చేసెను. ఆయన పది దిక్కులను కాల్చి వేయుచున్నాడా యన్నట్లు చక్రమును ప్రయెగించెను(18)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2021

గీతోపనిషత్తు -125

🌹. గీతోపనిషత్తు -125 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 10

🍀. 8. తామరాకు - నీటి బిందువు - బ్రహ్మమునకు సమర్పితముగ, సంగము విడచి కర్మల నెవరైతే నాచరింతురో, అట్టివారిని పాప మంటదు. నీటి బొట్లు ఎన్ని పడినను, తామరాకు నంటవు కదా! కర్మము లన్నియు వచ్చి పోవునవే. తానాధారముగ అనేకానేక కర్మలు వచ్చి, నిర్వర్తింపబడి పోవుచునుండును. కర్మల ననుసరించి బుద్ధి పోరాదు. బుద్ధి ననుసరించి మనస్సుండ వలెను. కర్మలు నిర్వర్తింప బడుచున్నను, బుద్ధిని దైవముపై నిలపిన, కర్మలు జరిగి పోవుట, తాను దైవముతో నుండుట జరుగును. ఆ బంధము పటిష్ఠమైనచో నిర్వర్తించు కర్మలయందు ఫలాసక్తి యుండదు. దైవమునం దాసక్తి చెందిన బుద్ధి, ఫలముల యందాసక్తి కలిగి యుండదు. అట్టి వానిని కర్మ లంటవు. 🍀

10. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్యా కరోతి యః |
లిప్యతే న స పాపేన పద్మపత్ర వివాంభసా || 10

బ్రహ్మమునకు సమర్పితముగ, సంగము విడచి కర్మల నెవరైతే నాచరింతురో, అట్టివారిని పాప మంటదు. నీటి బొట్లు ఎన్ని పడినను, తామరాకు నంటవు కదా! ఉషా సమయమున మంచుబిందువులు తామరాకుల పై పడుట, ఆ బిందువులు సూర్యరశ్మికి ముత్యములవలె ప్రకాశించుట చూచి మనస్సంతయు ఆహ్లాదము చెందును.

అట్లే బ్రహ్మమునకు సమర్పితము చేసిన మనసుతో కర్మ లాచరించు వారు, వాని ఫలముల యందు ఆసక్తి లేకుండుటచే చేయు పనులు ఆహ్లాదము కలిగించుచు నుండును. ఆసక్తి ఫలముల యందు కలిగినచో ఆహ్లాదము లేకపోగా మనసు ప్రపంచమున కంటును.

నీటి బిందువు తామరాకుపై నున్నను, తామరాకునకు దానిపై ఆసక్తి లేదు. అట్లే కర్మలను మనసు ద్వారా ఆచరించు వాడు ఫలములయం దాసక్తి లేక ఆచరించినచో అతనిని ఆ కర్మలు బంధించవు. అంటను కూడ నంటవు. నీటి బిందువులు ప్రతి నిత్యము తామరాకుపై రాలుచు నుండును. ఆకునుండి జాలు వారుచు పోవుచునుండును.

ఈ విషయమున తామరాకు సాక్షీ

భూతముగ నుండునే గాని రాలిపోవుచున్న బిందువులను గూర్చి బాధపడదు. కర్మము లన్నియు వచ్చి పోవునవే. తానాధారముగ అనేకానేక కర్మలు వచ్చి, నిర్వర్తింపబడి పోవుచునుండును.

తామరాకు నీటి బిందువుల ననుసరించనట్లే, కర్మల ననుసరించి బుద్ధి పోరాదు. బుద్ధి ననుసరించి మనస్సుండవలెను. కర్మలు నిర్వర్తింపబడుచున్నను, బుద్ధిని దైవముపై నిలపిన, కర్మలు జరిగి పోవుట, తాను దైవముతో నుండుట జరుగును.

“బుద్ధిః కర్మాను సారిణి " అను నానుడి కలదు. సామాన్యుల బుద్ధి కర్మల ననుస రించుచు పోవును. అపుడతడు కర్మబద్ధుడగును. బుద్ధిని దైవముతో జోడించి, మన స్సేంద్రియ దేహములతో కర్మలను నిర్వర్తించుట వలన ఆనంద ముండును గాని బంధ ముండదు.

ముందు శ్లోకమున మననము ద్వారా దైవముతో సంబంధము ఏర్పరచుకొనుట తెలుపబడినది. ఆ బంధము పటిష్ఠమైనచో నిర్వర్తించు కర్మల యందు ఫలాసక్తి యుండదు. దైవము నందాసక్తి చెందిన బుద్ధి, ఫలములయం దాసక్తి కలిగి యుండదు. అట్టి వానిని కర్మ లంటవు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 5 / Sri Lalita Sahasranamavali - Meaning - 5

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 5 / Sri Lalita Sahasranamavali - Meaning - 5 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 5. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా |
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా ‖ 5 ‖ 🍀

15) అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా :
అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది.

16) ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా :
ముఖము అనెడి చంద్రునియందు మచ్చవలె ఒప్పెడు కస్తురి బొట్టును కలిగినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 5 🌹

📚. Prasad Bharadwaj

🌻 5. aṣṭamīcandra-vibhrāja-dalikasthala-śobhitā |
mukhacandra-kalaṅkābha-mṛganābhi-viśeṣakā || 5 || 🌻

15 ) Ashtami chandra vibhraja - dhalika sthala shobhitha -
She who has a beautiful forehead like the half moon (visible on eighth day from new moon)

16 ) Muka chandra kalankabha mriganabhi viseshaka -
She who has the thilaka(dot) of Musk in her forehead which is like the black shadow in the moon

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 181 / Sri Lalitha Chaitanya Vijnanam - 181

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 181 / Sri Lalitha Chaitanya Vijnanam - 181 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖

🌻 181. 'మృత్యుమథనీ'🌻

భక్తుల యొక్క మృత్యువును నాశనము చేయునది శ్రీదేవి అని అర్థము.

మృత్యువును నాశనము చేయుట అనగా “నేను మరణింతును” అను అజ్ఞానపూరిత భావమును నశింపజేయును. దేహములు విడచుట మరణము కాదు. అది విరామమే. దుస్తులను మార్చుట వంటిది దేహములను విడచుట. నేను మరణింతును అన్న భావన జీవుని చిత్తవృత్తియందు పటిష్ఠమై యున్నది. అందువల్ల మరణానుభూతి కలుగును.

మహాభక్తులూ, పరమభక్తులూ కూడ దేహమును వదలి నారు కదా! తెలిసినవానికీ, తెలియనివానికీ కూడ మరణము లేదు. తెలియనివాడు తన భావనచేత మరణము ననుభవించును. తెలిసిన వాడు మరణమును మార్పుగా గ్రహించును.

మరణమనగా మార్పే అని సనత్సుజాతుడు ధృతరాష్ట్రునకు బోధించెను. లేని మరణము ఉన్నదనుకొని జీవుడు భయబ్రాంతుడగు చున్నాడు. మానవుని జీవితమంతయూ లేనివి ఉన్నట్లుగా ఊహించుచునే సాగిపోవును. అట్లే మరణము కూడ. ఇట్టి అజ్ఞాన నిర్మూలనము జ్ఞానానుభూతిచే కలుగును. అట్టి జ్ఞానమును అందించునది శ్రీదేవి అని అర్థము.

అంతియేకాని చివికి, చినిగిపోయి, కుళ్ళు కంపు కొట్టుచున్న దేహముననే ఉంచునని కాదు అర్థము. మృత్యుమథనీ అనగా “మృత్యువు” అను భావమును భక్తుల యందు నశింపజేయును.

రామ కృష్ణాదులకైననూ దేహవిసర్గన తప్పలేదు. వారు జ్ఞానులు కనుక మరణము ననుభవింపలేదు. అట్లే యోగులు, భక్తులు, సిద్ధులు కూడ. మృత్యువు రాకూడదని ప్రార్థన చేయరాదు. మృత్యు అనుభూతి లేక జ్ఞానానుభూతియే యొసంగమని ప్రార్థించవలెను.

“మృత్యోర్ము!” అనగా మృత్యుబంధము నుండి విడిపింపుమని అర్థము. బంధము లన్నియూ భావ బంధములే. మృత్యుభావ బంధమునుండి విడిపింపుమని మృత్యుంజయ మంత్రార్థము. 'మృత్యుమథనీ' అనిన కూడ అదే అర్థము.

మృత్యువు మూడు దశలలో ఉండునని తెలుపుదురు. ఒకటి భౌతికము. ఇది భౌతిక శరీరమును విడచుట, రెండవది సూక్ష్మము. ఇది సూక్ష్మ దేహమును వదలునపుడు కలుగునది. అప్పుడు ఇంద్రియ లోకములకు సంబంధించిన బంధములు తెగును. మూడవది కారణము. ఈ మృత్యువు కారణ శరీరమును విడచునపుడు కలుగునది. అట్టి వానికి భావబంధములు కూడ ఉండవు.

భావ బంధములు విసర్జించుట, ఇంద్రియ బంధములు విసర్జించుట, భౌతిక బంధములు విసర్జించుట, ఎవనికి జరుగునో అతడు మూడు మృత్యువులు దాటినవాడై, ముక్తుడై జీవించును, అట్టివానికి శరీరము లున్నప్పటికీ అతడు ముక్తుడే.

అది ఉన్ననూ లేకున్ననూ అతని కొకటియే.

మరియొక మాట. మృత్యువు దేహమునకు గాని జీవునకు కాదు. జీవాత్మ భావన పొందినవానికి, దేహాత్మ భావన సడలును. అపుడిక మృత్యువు లేదు. దేహమనగా కారణ, సూక్ష్మ, భౌతిక దేహములు కూడను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 181 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Mṛtyu-mathanī मृत्यु-मथनी (181) 🌻

She destroys the death of Her devotees. Mṛtyu means death. Only someone without death alone can give the boon of deathlessness.

Death also means rebirth. She does not allow Her devotees to be reborn. This means that She destroys the karma-s of Her devotees.

Devotee does not mean a person who performs rituals. One who is able to identify himself with Her is called a devotee and this stage can be attained only by perpetual meditation.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2021

దేవాపి మహర్షి బోధనలు - 4

🌹. దేవాపి మహర్షి బోధనలు - 4 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 2. సుదర్శన చక్రము - 1 🌻

మానవుడు జ్ఞానమార్జించుచూ చేసిన దర్శనములలో సుదర్శన చక్రము ప్రాముఖ్యము వహించును. జ్ఞానమునకు సంబంధించిన సంకేతములలో చక్రము స్వయం సంపూర్ణమైనది.

భారతీయులు, ఈజిప్టు, గ్రీసు, ఛాల్జియా దేశములవారు గుప్త జ్ఞానమును ఆర్జించు కొనునప్పుడు దర్శించిన జ్ఞానమునకు కొన్ని సంకేతముల నేర్పరచుకొనిరి. భారతీయ వాజ్ఞయమున ఈ చక్రమును వృత్తమని పేర్కొనిరి. వృత్తమనగా సమస్తము అని అర్థము. దీనినే పూర్ణమనియు జ్ఞానమనియు కూడ వ్యవహరింతురు.

ఒక జీవియొక్క వృత్తము కాని, ఒక కాలము యొక్క వృత్తముగాని, సర్వజీవుల సర్వ కాలముల వృత్తము కాని, ఈ సమస్తమును వృత్తముగ దర్శించినారు. జ్ఞానమునకు చిహ్నముగా పూర్ణమునకు సంబంధించిన గణితము వేదమున ఇట్లు వివరించినాడు.

పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ

పూర్ణమేవా వశిష్యతే

దీని తాత్పర్యమేమనగా సున్నలో నుండి సున్న తీసివేసినచో సున్నయే మిగిలి యుండును. అనగా సంకల్పమనబడు కేంద్రము ద్వారా పరతత్వము నుండి ఎన్ని బ్రహ్మాండాకాశములు తీసినను, పరతత్వము తరుగదు.

ఒక్కొక్క బ్రహ్మాండము నుండి ఒక్కొక్క సూర్యుడు, నవగ్రహములు పుట్టి పెరిగి అందులో కలసిపోవు చుండును. ఒక్కొక్క భూమిపై గల ఒక్కొక్క వృత్తాకారమగు జ్ఞానము ఇంకొకరికి సంక్రమించినను మిగులుచునే యుండును.

అనగా గురువు తన భావ వృత్తములో వున్న దంతయును శిష్యునకు తీసి ఇచ్చిన తర్వాత కూడా తన భావవృత్తము అట్లే యుండును. జీవులు పరంపరగా నార్జించుకొను జ్ఞాన వృత్తము, ఆ జీవులు మరణించిన తర్వాత కూడ నుండును. మానవజాతి నశించిన తర్వాత కూడ ఈ జ్ఞానమట్లే యుండును. మరల పుట్టిన భూగోళముపై మరల మానవులచే దర్శించబడును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2021

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 164

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 164 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 94 🌻

ఇది సవ్యమైనటువంటి పద్ధతేనా? ఇది సరైన పద్ధతేనా? అనిటటువంటి విచారణ చేసుకోవల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమండీ, మా అల్లుడు గారికి, సరైన ఉద్యోగం ఇప్పించండి, ఏమండీ, మా అల్లుడుగారి బుద్ధి సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఏమండీ మా అమ్మాయిని సరిగ్గా చూసుకునేటట్లు చూడండి.

ఏమండీ! నన్ను మా ఆయన సరిగ్గా చూసుకునేటట్లు చూడండి. ఏమండీ! మా పిల్లలూ సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఏమండీ! మా మనవళ్ళూ సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఇలా ఎన్ని రకాలుగా ఏ పేరుతో పిలిచి కోరుతూ ఉన్నప్పటికీ, ఈ కోరికలన్నీ ఒకే ఒక కోరికలోకి వెళ్ళిపోతున్నాయి, ఏమిటది? పాహిమాం.

అయితే, ప్రాధమికమైనటువంటి బాల్యదశలో ఇది అవసరం. ఎందుకంటే, అక్కడ ఉచితానుచితములు తెలియనటువంటి అవస్థ కాబట్టి, బాల్యావస్థ యందు భక్తియనే పునాది, విశ్వాసము ఏర్పడ వలసినటువంటి అగత్యమున్నది కాబట్టి, బాల్యము నందే ఈశ్వరానురక్తత ఏర్పడవలసినటువంటి అవసరము ఉన్నది కాబట్టి, బాల్యావస్థ దాటే వరకూ ఈ భక్తిని ఆశ్రయించాలి. పాహిమాం అని ఆర్తితో వేడుకునేటటువంటి లక్షణాన్ని పొందాలి. నిరంతరాయంగా ఈ ఆర్తిని తహని నిలబెట్టుకోవాలి. భక్తి విశ్వాసాలు నిలబెట్టుకోవాలి. ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నించాలి.

కానీ.. చాలా ముఖ్యమైనటువంటిది ఈ ‘కానీ’. చిత్తశుద్ధి లేకుండా ఆత్మవస్తువు యొక్క లక్షణాలను గుర్తించకుండా అంధుడు ఏనుగును నిర్ణయించినట్లుగా నిర్ణయించ పూనుకుని ఉంటే, అప్పుడు ఎప్పటికీ, సమగ్రమైనటువంటి వివేకాన్ని, విజ్ఞానాన్ని పొందలేడు. ఎందువల్ల? ఆ పరమాత్మ అందరి శరీర మధ్యభాగములందున్నాడు.

సర్వభూతస్థమాత్మానాం హృద్దేశోర్జున తిష్ఠతి - ఇలాంటి ప్రయోగాలతో భగవద్గీత యందు తన అధికారిత్వాన్ని, తన అధిష్ఠాన స్థితిని, తన ఆశ్రయాన్ని, తన సర్వాధార స్థితిని, పరమాత్ముడు తెలియజెప్పి ఉన్నాడు. ఎక్కడున్నావయ్యా? అని అర్జునుడు పదే పదే అడుగుతాడు.

ప్రతి యోగంలో కూడా అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. మన తరఫున. మన ప్రశ్నలన్నింటికి కూడా పరమాత్ముడు సమాధానాలు తీరుస్తూ ఉంటాడు. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వ్యాసభగవానుడు ఆ సమాధానాలన్నీ ఇస్తూ ఉన్నాడు భగవానుడి ముఖం నుంచి. ఏమని చెబుతున్నాడు? పైగా?

అంగుష్ఠ మాత్ర ఏవ పురుషః నాయనా! సర్వ జీవుల హృదయాకాశమునందు వారి వారి బొటన వేలు ఎంతుందో అంతమేరకు ప్రకాశాన్ని కలిగి ఉన్నాను. ఏమిటండీ, ఈ బొటన వేలు వ్యవహారం? ఏం మిగిలిన వేళ్ళు చెప్పవచ్చు కదా! అంగుష్ఠ మాత్ర ఏవ పురుషః - ఇది ఒక సంజ్ఞా రూపకమైనటువంటి బోధ. ఐదు వేళ్ళు ఉన్నప్పటికి, అంగుష్ఠం లేకపోతే మిగిలిన వాటి వల్ల ప్రయోజనం లేదు.

కాబట్టి, అంగుష్ఠం యొక్క ప్రాధాన్యతను నిర్ణయిస్తూ అట్టి ప్రధాన వస్తువుగా నీలో పురుషుడున్నాడు. వాడు లేకపోతే మిగిలినవి ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. అనేటటువంటి సంజ్ఞారూపకమైనటువంటి బోధ. ఇంకొకటి కూడా ఉంది. దీనిని ప్రమాణంగా స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అది కొద్దిగా అసయంజసమని అనిపిస్తుంది నాకు.

ఎందుకని అంటే, ప్రకాశమునకు ప్రమాణం ఎలా చెబుతాము? స్వయం ప్రకాశమునకు ప్రమాణం ఎలా చెబుతాం? ఆత్మ నాలుగు స్థితులందున్నట్లుగా తోస్తున్నది. జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ ఇంకా దేనికి జోడిస్తే ఆ ఆత్మ. పుణ్యాత్మ, పాపాత్మ, వ్యవహారాత్మ. దేనికి జోడిస్తే అదైపోతుంది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 232, 233 / Vishnu Sahasranama Contemplation - 232, 233

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 232 / Vishnu Sahasranama Contemplation - 232🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻232. అహః సంవర్తకః, अहः संवर्तकः, Ahaḥ saṃvartakaḥ🌻

ఓం అహః సంవర్తకాయ నమః | ॐ अहः संवर्तकाय नमः | OM Ahaḥ saṃvartakāya namaḥ

అహః సంవర్తకః, अहः संवर्तकः, Ahaḥ saṃvartakaḥ

సూర్యో హి భగవాన్ విష్ణుః సమ్యగహ్నాం ప్రవర్తనాత్ ।
అహస్సంవర్తక ఇతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

సూర్యరూపేణ అహాని సమ్యక్ వర్తయతి సూర్య రూపమున తాను పగళ్ళను లెస్సగా వర్తింపజేయుచున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 232🌹

📚. Prasad Bharadwaj

🌻232. Ahaḥ saṃvartakaḥ🌻

OM Ahaḥ saṃvartakāya namaḥ

Sūryo hi bhagavān viṣṇuḥ samyagahnāṃ pravartanāt,
Ahassaṃvartaka iti procyate vibudhottamaiḥ.

सूर्यो हि भगवान् विष्णुः सम्यगह्नां प्रवर्तनात् ।
अहस्संवर्तक इति प्रोच्यते विबुधोत्तमैः ॥

Sūryarūpeṇa ahāni samyak vartayati / सूर्यरूपेण अहानि सम्यक् वर्तयति The Lord, who as the Sun, regulates the succession of day and night.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

आवर्तनो निवृत्तात्मा संवृतस्संप्रमर्दनः ।
अहसंवर्तको वह्निरनिलो धरणीधरः ॥ २५ ॥

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతస్సంప్రమర్దనః ।
అహసంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ ౨౫ ॥

Āvartano nivr̥ttātmā saṃvr̥tassaṃpramardanaḥ ।
Ahasaṃvartako vahniranilo dharaṇīdharaḥ ॥ 25 ॥

🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 233 / Vishnu Sahasranama Contemplation - 233🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻233. వహ్నిః, वह्निः, Vahniḥ🌻

ఓం వహ్నయే నమః | ॐ वह्नये नमः | OM Vahnaye namaḥ

హవిషాం వహనాద్ వహ్నిః యజ్ఞములందలి అగ్నిహోత్రుని రూపమున హవిస్సును దేవతలకై వహించుకొనిపోవువాడు.

:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::

అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ ।
మన్త్రోఽహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్ ॥ 16 ॥

అగ్నిష్టోమాదిరూప క్రతువును నేనే, యజ్ఞము నేనే, పితృదేవతలకిచ్చు అన్నము నేనే, ఔషధము నేనే, మంత్రమును నేనే, అగ్ని నేనే, హోమకర్మమున్ను నేనే అయియున్నాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 233🌹

📚. Prasad Bharadwaj

🌻233. Vahniḥ🌻

OM Vahnaye namaḥ

Haviṣāṃ vahanād vahniḥ / हविषां वहनाद् वह्निः One who as sacrificial fire carries the offerings made to Devas.

Śrīmad Bhagavad Gīta - Chapter 9

Ahaṃ kraturahaṃ yajñaḥ svadhāhamahamauṣadham,
Mantro’hamahamevājyamahamagnirahaṃ hutam. (16)

:: श्रीमद्भगवद्गीत - राजविद्या राजगुह्य योग ::

अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् ।
मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥ १६ ॥

I am the rite, the sacrifice, the oblation to ancestors, the medicinal herb, the holy chant, the melted butter, the sacred fire and the offering.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

आवर्तनो निवृत्तात्मा संवृतस्संप्रमर्दनः ।
अहसंवर्तको वह्निरनिलो धरणीधरः ॥ २५ ॥

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతస్సంప్రమర్దనః ।
అహసంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ ౨౫ ॥

Āvartano nivr̥ttātmā saṃvr̥tassaṃpramardanaḥ ।
Ahasaṃvartako vahniranilo dharaṇīdharaḥ ॥ 25 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2021

16-JANUARY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 611 / Bhagavad-Gita - 611 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 232, 233 / Vishnu Sahasranama Contemplation - 232, 233🌹
3) 🌹 Daily Wisdom - 30🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 164🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 185 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 4 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 181 / Sri Lalita Chaitanya Vijnanam - 181 🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 522 / Bhagavad-Gita - 522🌹

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 125🌹  
11) 🌹. శివ మహా పురాణము - 325 🌹 
12) 🌹 Light On The Path - 78🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 210🌹 
14) 🌹 Seeds Of Consciousness - 274 🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 149🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 05 / Lalitha Sahasra Namavali - 05🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 05 / Sri Vishnu Sahasranama - 05 🌹
18) 🌹. శ్రీమద్భగవద్గీత - 1 / Bhagavad-Gita - 1🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 611 / Bhagavad-Gita - 611 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 28 🌴*

28. ఆయుక్త: ప్రాకృత: స్తబ్ధ: శఠో నైష్కృతికోలస: |
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ||

🌷. తాత్పర్యం : 
భౌతికాసక్తుడును, మొండితనము కలవాడును, మోసము చేయువాడును, ఇతరులను అవమానించుటయందు దక్షుడును, సోమరియును, సదా చింతాక్రాంతుడును, వృథా కాలవ్యయమును చేయువాడునునై సదా శాస్త్ర నిర్దేశములకు విరుద్ధముగా కర్మనొనరించువాడు తమోగుణకర్తయని చెప్పబడును.

🌷. భాష్యము :
ఎటువంటి కర్మము చేయదగినదో, ఎటువంటి కర్మము చేయరానిదో శాస్త్రనిర్దేశములందు మనము గాంచవచ్చును. అటువంటి శాస్త్రనిర్దేశములను లెక్కజేయనివారు చేయరానటువంటి కర్మ యందే నియుక్తులగుచు సాధారణముగా భౌతికాసక్తులై యుందురు. వారు ప్రకృతి త్రిగుణముల ననుసరించియే వర్తింతురు గాని శాస్త్రనియమముల ననుసరించి కాదు. అట్టి కర్తలు మృదుద్వాభావులై యుండక సాధారణముగా మోసకారులు మరియు ఇతరులను అవమానపరచుట యందు దక్షులై యుందురు. 

సోమరులై యుండు అట్టివారు చేయవలసిన పని ఉన్నప్పటికిని దానిని సక్రమముగా ఒనరింపక తరువాత చేయుదుమని ప్రక్కకు పెట్టుదురు. తత్కారణముగా వారు చింతాక్రాంతులై యుందురు. కాలవిలంబనము చేయుటలో వారు అత్యంత దక్షులై యుండి గంటలో చేయవలసిన కార్యమును సంవత్సరముల తరబడి ఒనరింతురు. అటువంటి కర్తలు తమోగుణమునందు నిలిచినట్టివారు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 611 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 28 🌴*

28. ayuktaḥ prākṛtaḥ stabdhaḥ śaṭho naiṣkṛtiko ’lasaḥ
viṣādī dīrgha-sūtrī ca kartā tāmasa ucyate

🌷 Translation : 
The worker who is always engaged in work against the injunctions of the scripture, who is materialistic, obstinate, cheating and expert in insulting others, and who is lazy, always morose and procrastinating is said to be a worker in the mode of ignorance.

🌹 Purport :
In the scriptural injunctions we find what sort of work should be performed and what sort of work should not be performed. Those who do not care for those injunctions engage in work not to be done, and such persons are generally materialistic. 

They work according to the modes of nature, not according to the injunctions of the scripture. Such workers are not very gentle, and generally they are always cunning and expert in insulting others. 

They are very lazy; even though they have some duty, they do not do it properly, and they put it aside to be done later on. Therefore they appear to be morose. They procrastinate; anything which can be done in an hour they drag on for years. Such workers are situated in the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 232, 233 / Vishnu Sahasranama Contemplation - 232, 233 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻232. అహః సంవర్తకః, अहः संवर्तकः, Ahaḥ saṃvartakaḥ🌻*

*ఓం అహః సంవర్తకాయ నమః | ॐ अहः संवर्तकाय नमः | OM Ahaḥ saṃvartakāya namaḥ*

అహః సంవర్తకః, अहः संवर्तकः, Ahaḥ saṃvartakaḥ
సూర్యో హి భగవాన్ విష్ణుః సమ్యగహ్నాం ప్రవర్తనాత్ ।
అహస్సంవర్తక ఇతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

సూర్యరూపేణ అహాని సమ్యక్ వర్తయతి సూర్య రూపమున తాను పగళ్ళను లెస్సగా వర్తింపజేయుచున్నాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 232🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻232. Ahaḥ saṃvartakaḥ🌻*

*OM Ahaḥ saṃvartakāya namaḥ*

Sūryo hi bhagavān viṣṇuḥ samyagahnāṃ pravartanāt,
Ahassaṃvartaka iti procyate vibudhottamaiḥ.

सूर्यो हि भगवान् विष्णुः सम्यगह्नां प्रवर्तनात् ।
अहस्संवर्तक इति प्रोच्यते विबुधोत्तमैः ॥

Sūryarūpeṇa ahāni samyak vartayati / सूर्यरूपेण अहानि सम्यक् वर्तयति The Lord, who as the Sun, regulates the succession of day and night.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
आवर्तनो निवृत्तात्मा संवृतस्संप्रमर्दनः ।
अहसंवर्तको वह्निरनिलो धरणीधरः ॥ २५ ॥

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతస్సంప్రమర్దనః ।
అహసంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ ౨౫ ॥

Āvartano nivr̥ttātmā saṃvr̥tassaṃpramardanaḥ ।
Ahasaṃvartako vahniranilo dharaṇīdharaḥ ॥ 25 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 233 / Vishnu Sahasranama Contemplation - 233🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻233. వహ్నిః, वह्निः, Vahniḥ🌻*

*ఓం వహ్నయే నమః | ॐ वह्नये नमः | OM Vahnaye namaḥ*

హవిషాం వహనాద్ వహ్నిః యజ్ఞములందలి అగ్నిహోత్రుని రూపమున హవిస్సును దేవతలకై వహించుకొనిపోవువాడు.

:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ ।
మన్త్రోఽహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్ ॥ 16 ॥

అగ్నిష్టోమాదిరూప క్రతువును నేనే, యజ్ఞము నేనే, పితృదేవతలకిచ్చు అన్నము నేనే, ఔషధము నేనే, మంత్రమును నేనే, అగ్ని నేనే, హోమకర్మమున్ను నేనే అయియున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 233🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻233. Vahniḥ🌻*

*OM Vahnaye namaḥ*

Haviṣāṃ vahanād vahniḥ / हविषां वहनाद् वह्निः One who as sacrificial fire carries the offerings made to Devas.

Śrīmad Bhagavad Gīta - Chapter 9
Ahaṃ kraturahaṃ yajñaḥ svadhāhamahamauṣadham,
Mantro’hamahamevājyamahamagnirahaṃ hutam. (16)

:: श्रीमद्भगवद्गीत - राजविद्या राजगुह्य योग ::
अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् ।
मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥ १६ ॥

I am the rite, the sacrifice, the oblation to ancestors, the medicinal herb, the holy chant, the melted butter, the sacred fire and the offering.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
आवर्तनो निवृत्तात्मा संवृतस्संप्रमर्दनः ।
अहसंवर्तको वह्निरनिलो धरणीधरः ॥ २५ ॥

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతస్సంప్రమర్దనః ।
అహసంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ ౨౫ ॥

Āvartano nivr̥ttātmā saṃvr̥tassaṃpramardanaḥ ।
Ahasaṃvartako vahniranilo dharaṇīdharaḥ ॥ 25 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 30 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 30. The Self is Imperishable 🌻*

The ordinary man of the world has his mind and senses turned extrovert. Childish, he runs after external pleasures and walks into the net of death which pervades all created things. 

The wise, however, knowing the Immortal, seek not that Eternal Being among things fleeting here. Some blessed one turns his gaze inward and beholds the glorious light of the Self. This Self is dearer than the dearest of things, this Self is nearer than the nearest. 

If one would speak of anything else than the Self as dear, he would certainly lose what he holds as dear. One should adore the Self alone as dear. He who adores the Self alone as dear does not lose what he holds as dear. The Self is Imperishable. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 164 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 94 🌻*

ఇది సవ్యమైనటువంటి పద్ధతేనా? ఇది సరైన పద్ధతేనా? అనిటటువంటి విచారణ చేసుకోవల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమండీ, మా అల్లుడు గారికి, సరైన ఉద్యోగం ఇప్పించండి, ఏమండీ, మా అల్లుడుగారి బుద్ధి సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఏమండీ మా అమ్మాయిని సరిగ్గా చూసుకునేటట్లు చూడండి. 

ఏమండీ! నన్ను మా ఆయన సరిగ్గా చూసుకునేటట్లు చూడండి. ఏమండీ! మా పిల్లలూ సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఏమండీ! మా మనవళ్ళూ సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఇలా ఎన్ని రకాలుగా ఏ పేరుతో పిలిచి కోరుతూ ఉన్నప్పటికీ, ఈ కోరికలన్నీ ఒకే ఒక కోరికలోకి వెళ్ళిపోతున్నాయి, ఏమిటది? పాహిమాం.
        
అయితే, ప్రాధమికమైనటువంటి బాల్యదశలో ఇది అవసరం. ఎందుకంటే, అక్కడ ఉచితానుచితములు తెలియనటువంటి అవస్థ కాబట్టి, బాల్యావస్థ యందు భక్తియనే పునాది, విశ్వాసము ఏర్పడ వలసినటువంటి అగత్యమున్నది కాబట్టి, బాల్యము నందే ఈశ్వరానురక్తత ఏర్పడవలసినటువంటి అవసరము ఉన్నది కాబట్టి, బాల్యావస్థ దాటే వరకూ ఈ భక్తిని ఆశ్రయించాలి. పాహిమాం అని ఆర్తితో వేడుకునేటటువంటి లక్షణాన్ని పొందాలి. నిరంతరాయంగా ఈ ఆర్తిని తహని నిలబెట్టుకోవాలి. భక్తి విశ్వాసాలు నిలబెట్టుకోవాలి. ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నించాలి.

 కానీ.. చాలా ముఖ్యమైనటువంటిది ఈ ‘కానీ’. చిత్తశుద్ధి లేకుండా ఆత్మవస్తువు యొక్క లక్షణాలను గుర్తించకుండా అంధుడు ఏనుగును నిర్ణయించినట్లుగా నిర్ణయించ పూనుకుని ఉంటే, అప్పుడు ఎప్పటికీ, సమగ్రమైనటువంటి వివేకాన్ని, విజ్ఞానాన్ని పొందలేడు. ఎందువల్ల? ఆ పరమాత్మ అందరి శరీర మధ్యభాగములందున్నాడు.
        
సర్వభూతస్థమాత్మానాం హృద్దేశోర్జున తిష్ఠతి - ఇలాంటి ప్రయోగాలతో భగవద్గీత యందు తన అధికారిత్వాన్ని, తన అధిష్ఠాన స్థితిని, తన ఆశ్రయాన్ని, తన సర్వాధార స్థితిని, పరమాత్ముడు తెలియజెప్పి ఉన్నాడు. ఎక్కడున్నావయ్యా? అని అర్జునుడు పదే పదే అడుగుతాడు. 

ప్రతి యోగంలో కూడా అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. మన తరఫున. మన ప్రశ్నలన్నింటికి కూడా పరమాత్ముడు సమాధానాలు తీరుస్తూ ఉంటాడు. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వ్యాసభగవానుడు ఆ సమాధానాలన్నీ ఇస్తూ ఉన్నాడు భగవానుడి ముఖం నుంచి. ఏమని చెబుతున్నాడు? పైగా? 

అంగుష్ఠ మాత్ర ఏవ పురుషః నాయనా! సర్వ జీవుల హృదయాకాశమునందు వారి వారి బొటన వేలు ఎంతుందో అంతమేరకు ప్రకాశాన్ని కలిగి ఉన్నాను. ఏమిటండీ, ఈ బొటన వేలు వ్యవహారం? ఏం మిగిలిన వేళ్ళు చెప్పవచ్చు కదా! అంగుష్ఠ మాత్ర ఏవ పురుషః - ఇది ఒక సంజ్ఞా రూపకమైనటువంటి బోధ. ఐదు వేళ్ళు ఉన్నప్పటికి, అంగుష్ఠం లేకపోతే మిగిలిన వాటి వల్ల ప్రయోజనం లేదు.

        కాబట్టి, అంగుష్ఠం యొక్క ప్రాధాన్యతను నిర్ణయిస్తూ అట్టి ప్రధాన వస్తువుగా నీలో పురుషుడున్నాడు. వాడు లేకపోతే మిగిలినవి ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. అనేటటువంటి సంజ్ఞారూపకమైనటువంటి బోధ. ఇంకొకటి కూడా ఉంది. దీనిని ప్రమాణంగా స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అది కొద్దిగా అసయంజసమని అనిపిస్తుంది నాకు. 

ఎందుకని అంటే, ప్రకాశమునకు ప్రమాణం ఎలా చెబుతాము? స్వయం ప్రకాశమునకు ప్రమాణం ఎలా చెబుతాం? ఆత్మ నాలుగు స్థితులందున్నట్లుగా తోస్తున్నది. జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ ఇంకా దేనికి జోడిస్తే ఆ ఆత్మ. పుణ్యాత్మ, పాపాత్మ, వ్యవహారాత్మ. దేనికి జోడిస్తే అదైపోతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 4 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 2. సుదర్శన చక్రము - 1 🌻*

మానవుడు జ్ఞానమార్జించుచూ చేసిన దర్శనములలో సుదర్శన చక్రము ప్రాముఖ్యము వహించును. జ్ఞానమునకు సంబంధించిన సంకేతములలో చక్రము స్వయం సంపూర్ణమైనది. 

భారతీయులు, ఈజిప్టు, గ్రీసు, ఛాల్జియా దేశములవారు గుప్త జ్ఞానమును ఆర్జించు కొనునప్పుడు దర్శించిన జ్ఞానమునకు కొన్ని సంకేతముల నేర్పరచుకొనిరి. భారతీయ వాజ్ఞయమున ఈ చక్రమును వృత్తమని పేర్కొనిరి. వృత్తమనగా సమస్తము అని అర్థము. దీనినే పూర్ణమనియు జ్ఞానమనియు కూడ వ్యవహరింతురు. 

ఒక జీవియొక్క వృత్తము కాని, ఒక కాలము యొక్క వృత్తముగాని, సర్వజీవుల సర్వ కాలముల వృత్తము కాని, ఈ సమస్తమును వృత్తముగ దర్శించినారు. జ్ఞానమునకు చిహ్నముగా పూర్ణమునకు సంబంధించిన గణితము వేదమున ఇట్లు వివరించినాడు. 

పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ
పూర్ణమేవా వశిష్యతే 

దీని తాత్పర్యమేమనగా సున్నలో నుండి సున్న తీసివేసినచో సున్నయే మిగిలి యుండును. అనగా సంకల్పమనబడు కేంద్రము ద్వారా పరతత్వము నుండి ఎన్ని బ్రహ్మాండాకాశములు తీసినను, పరతత్వము తరుగదు. 

ఒక్కొక్క బ్రహ్మాండము నుండి ఒక్కొక్క సూర్యుడు, నవగ్రహములు పుట్టి పెరిగి అందులో కలసిపోవు చుండును. ఒక్కొక్క భూమిపై గల ఒక్కొక్క వృత్తాకారమగు జ్ఞానము ఇంకొకరికి సంక్రమించినను మిగులుచునే యుండును. 

అనగా గురువు తన భావ వృత్తములో వున్న దంతయును శిష్యునకు తీసి ఇచ్చిన తర్వాత కూడా తన భావవృత్తము అట్లే యుండును. జీవులు పరంపరగా నార్జించుకొను జ్ఞాన వృత్తము, ఆ జీవులు మరణించిన తర్వాత కూడ నుండును. మానవజాతి నశించిన తర్వాత కూడ ఈ జ్ఞానమట్లే యుండును. మరల పుట్టిన భూగోళముపై మరల మానవులచే దర్శించబడును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 185 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
177

Avadhoota Swamy described to Yadu what he learned from Suryanarayana Swamy thus, “Sun, without touching the water, turns the water into vapor and passes them to the clouds. When time comes, he showers rains. Similarly, a seeker of Yoga should consume through his senses. 

He should donate to the needy. Even though the sun appears in various water pots as multiple suns, in reality, there is only one sun. In the same manner, the seeker of Yoga should realize that even though Atman appears as multiple bodies, there is only one Paramatman. 

He should be an embodiment of knowledge like Sun. He must look after the welfare of those who seek refuge in him. He must give them the alms of knowledge and enable them to perform their duty.

When one always does his duty like the Sun, the entire universe will cooperate with him. Sun is always doing his duty. The Sun always does his duty, whether it is in the morning, or the afternoon or the evening.

 He is so useful to people. He remains untainted and untouched by everything. The Sun taught us all these things. With him that constantly does his duty like the Sun and follows his Dharma, the entire universe will cooperate. Remember this very well.

Next, pigeons. We see a lot of pigeons on the street. There are a lot of pigeons in India. But, some pigeons look very different, we will talk about that later. If great souls say something, they say it out of experience. 

They don’t just say something randomly. You should never take what is said lightly or dismiss it, but you must put it into action. Great souls give us words of wisdom. There is a good reason behind what they are saying. We should never ignore what is being said. That is when we can get out of difficulties. The journey of life proceeds smoothly. We gain the mental strength to face difficulties.

If a great soul says, “Being overly friendly is not good. Talking too much is not good” you must stop doing those (being over-friendly or talking too much). However great the person is, he must put these into action, otherwise, he will subject himself to difficulties. They get into such difficulties that they may not be able to rise from them. As an example, Avadhoota Swamy told King Yadu what he learned from pigeons.

What is this? What can you learn from pigeons? How interesting? Sometimes we ignore the words that come from great souls. We think, “What do they know? They just speak from their experience. Our experience and our difficulties are different. Times are different now. Their experiences were from a long time back. What is the use talking about them now”. 

But here, the incarnation of the Supreme, the Parabrahman Lord Dattatreya, appearing in the form of an Avadhoota is talking to King Yadu about learning each object, from each substance, from each living being, about the method of learning. Let us look at what Avadhoota Swamy is saying to King Yadu.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 181 / Sri Lalitha Chaitanya Vijnanam - 181 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |*
*నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖*

*🌻 181. 'మృత్యుమథనీ'🌻*

భక్తుల యొక్క మృత్యువును నాశనము చేయునది శ్రీదేవి అని అర్థము.

మృత్యువును నాశనము చేయుట అనగా “నేను మరణింతును” అను అజ్ఞానపూరిత భావమును నశింపజేయును. దేహములు విడచుట మరణము కాదు. అది విరామమే. దుస్తులను మార్చుట వంటిది దేహములను విడచుట. నేను మరణింతును అన్న భావన జీవుని చిత్తవృత్తియందు పటిష్ఠమై యున్నది. అందువల్ల మరణానుభూతి కలుగును. 

మహాభక్తులూ, పరమభక్తులూ కూడ దేహమును వదలి నారు కదా! తెలిసినవానికీ, తెలియనివానికీ కూడ మరణము లేదు. తెలియనివాడు తన భావనచేత మరణము ననుభవించును. తెలిసిన వాడు మరణమును మార్పుగా గ్రహించును. 

మరణమనగా మార్పే అని సనత్సుజాతుడు ధృతరాష్ట్రునకు బోధించెను. లేని మరణము ఉన్నదనుకొని జీవుడు భయబ్రాంతుడగు చున్నాడు. మానవుని జీవితమంతయూ లేనివి ఉన్నట్లుగా ఊహించుచునే సాగిపోవును. అట్లే మరణము కూడ. ఇట్టి అజ్ఞాన నిర్మూలనము జ్ఞానానుభూతిచే కలుగును. అట్టి జ్ఞానమును అందించునది శ్రీదేవి అని అర్థము. 

అంతియేకాని చివికి, చినిగిపోయి, కుళ్ళు కంపు కొట్టుచున్న దేహముననే ఉంచునని కాదు అర్థము. మృత్యుమథనీ అనగా “మృత్యువు” అను భావమును భక్తుల యందు నశింపజేయును.

రామ కృష్ణాదులకైననూ దేహవిసర్గన తప్పలేదు. వారు జ్ఞానులు కనుక మరణము ననుభవింపలేదు. అట్లే యోగులు, భక్తులు, సిద్ధులు కూడ. మృత్యువు రాకూడదని ప్రార్థన చేయరాదు. మృత్యు అనుభూతి లేక జ్ఞానానుభూతియే యొసంగమని ప్రార్థించవలెను.

 “మృత్యోర్ము!” అనగా మృత్యుబంధము నుండి విడిపింపుమని అర్థము. బంధము లన్నియూ భావ బంధములే. మృత్యుభావ బంధమునుండి విడిపింపుమని మృత్యుంజయ మంత్రార్థము. 'మృత్యుమథనీ' అనిన కూడ అదే అర్థము.

మృత్యువు మూడు దశలలో ఉండునని తెలుపుదురు. ఒకటి భౌతికము. ఇది భౌతిక శరీరమును విడచుట, రెండవది సూక్ష్మము. ఇది సూక్ష్మ దేహమును వదలునపుడు కలుగునది. అప్పుడు ఇంద్రియ లోకములకు సంబంధించిన బంధములు తెగును. మూడవది కారణము. ఈ మృత్యువు కారణ శరీరమును విడచునపుడు కలుగునది. అట్టి వానికి భావబంధములు కూడ ఉండవు. 

భావ బంధములు విసర్జించుట, ఇంద్రియ బంధములు విసర్జించుట, భౌతిక బంధములు విసర్జించుట, ఎవనికి జరుగునో అతడు మూడు మృత్యువులు దాటినవాడై, ముక్తుడై జీవించును, అట్టివానికి శరీరము లున్నప్పటికీ అతడు ముక్తుడే. 

అది ఉన్ననూ లేకున్ననూ అతని కొకటియే.
మరియొక మాట. మృత్యువు దేహమునకు గాని జీవునకు కాదు. జీవాత్మ భావన పొందినవానికి, దేహాత్మ భావన సడలును. అపుడిక మృత్యువు లేదు. దేహమనగా కారణ, సూక్ష్మ, భౌతిక దేహములు కూడను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 181 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Mṛtyu-mathanī मृत्यु-मथनी (181) 🌻*

She destroys the death of Her devotees. Mṛtyu means death. Only someone without death alone can give the boon of deathlessness.  

Death also means rebirth. She does not allow Her devotees to be reborn. This means that She destroys the karma-s of Her devotees.  

Devotee does not mean a person who performs rituals. One who is able to identify himself with Her is called a devotee and this stage can be attained only by perpetual meditation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 522 / Bhagavad-Gita - 522 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 05 🌴*

05. నిర్మానమోహా జితసఙ్గదోషా
ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామా: |
ద్వన్ద్వైర్విముక్తా: సుఖదుఃఖసంఙ్ఞైర్
గచ్చన్త్యమూఢా: పదమవ్యయమ్ తత్ ||

🌷. తాత్పర్యం : 
మిథ్యాహంకారము, భ్రాంతి, దుస్సాంగత్యముల నుండి విడివడినవారును, శాశ్వతత్వమును అవగతము చేసికొనినవారును, కామవర్జితులును, సుఖదుఃఖములనెడి ద్వంద్వముల నుండి బయటపడినవారును, భ్రాంతిరహితులై ఏ విధముగా పరమపురుషుని శరణువేడవలెనో తెలిసినవారును అగు మనుజులు అట్టి అవ్యయపదమును పొందగలరు

🌷. భాష్యము :
కృష్ణలోకముగా (గోలోకబృందావనము) తెలియబడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ధామము (ఆధ్యాత్మికజగము) ఇచ్చట వర్ణింపబడినది. ఆధ్యాత్మికలోకములన్నియును స్వయంప్రకాశమానములు కనుక ఆధ్యాత్మికజగత్తు నందు సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని, విద్యుత్తుల అవసరము లేదు. ఈ విశ్వములో సూర్యుడొక్కడే స్వయం ప్రకాశమానుడు. 

కాని ఆధ్యాత్మికజగత్తులోని లోకములన్నియు స్వయం ప్రకాశమానములే. వైకుంఠలోకములుగా పిలువబడు ఆ లోకముల ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతి యనబడు తేజోమయ ఆకాశమును రూపొందించును.

 వాస్తవమునకు ఆ కాంతి కృష్ణలోకమైన గోలోకబృందావనము నుండియే బయల్వెడలుచున్నది. ఆ తేజపు అతికొద్దిభాగము మహత్తత్త్వముచే (భౌతికజగము) కప్పుబడినను మిగిలిన భాగమంతయు వైకుంఠములని పిలువబడు ఆధ్యాత్మికలోకములచే నిండియుండును. ఆ లోకములలో ముఖ్యమైనదే గోలోకబృందావనము.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 522 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 15 - Purushothama Yoga - 05 🌴*

05. nirmāna-mohā jita-saṅga-doṣā
adhyātma-nityā vinivṛtta-kāmāḥ
dvandvair vimuktāḥ sukha-duḥkha-saṁjñair
gacchanty amūḍhāḥ padam avyayaṁ tat

🌷 Translation : 
Those who are free from false prestige, illusion and false association, who understand the eternal, who are done with material lust, who are freed from the dualities of happiness and distress, and who, unbewildered, know how to surrender unto the Supreme Person attain to that eternal kingdom.

🌹 Purport :
The surrendering process is described here very nicely. The first qualification is that one should not be deluded by pride. 

Because the conditioned soul is puffed up, thinking himself the lord of material nature, it is very difficult for him to surrender unto the Supreme Personality of Godhead. 

One should know by the cultivation of real knowledge that he is not lord of material nature; the Supreme Personality of Godhead is the Lord. When one is free from delusion caused by pride, he can begin the process of surrender. For one who is always expecting some honor in this material world, it is not possible to surrender to the Supreme Person. 

Pride is due to illusion, for although one comes here, stays for a brief time and then goes away, he has the foolish notion that he is the lord of the world. He thus makes all things complicated, and he is always in trouble. The whole world moves under this impression. 

People are considering the land, this earth, to belong to human society, and they have divided the land under the false impression that they are the proprietors. 

One has to get out of this false notion that human society is the proprietor of this world. When one is freed from such a false notion, he becomes free from all the false associations caused by familial, social and national affections. 

These faulty associations bind one to this material world. After this stage, one has to develop spiritual knowledge. One has to cultivate knowledge of what is actually his own and what is actually not his own. 

And when one has an understanding of things as they are, he becomes free from all dual conceptions such as happiness and distress, pleasure and pain. 

He becomes full in knowledge; then it is possible for him to surrender to the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -125 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 10

*🍀. 8. తామరాకు - నీటి బిందువు - బ్రహ్మమునకు సమర్పితముగ, సంగము విడచి కర్మల నెవరైతే నాచరింతురో, అట్టివారిని పాప మంటదు. నీటి బొట్లు ఎన్ని పడినను, తామరాకు నంటవు కదా! కర్మము లన్నియు వచ్చి పోవునవే. తానాధారముగ అనేకానేక కర్మలు వచ్చి, నిర్వర్తింపబడి పోవుచునుండును. కర్మల ననుసరించి బుద్ధి పోరాదు. బుద్ధి ననుసరించి మనస్సుండ వలెను. కర్మలు నిర్వర్తింప బడుచున్నను, బుద్ధిని దైవముపై నిలపిన, కర్మలు జరిగి పోవుట, తాను దైవముతో నుండుట జరుగును. ఆ బంధము పటిష్ఠమైనచో నిర్వర్తించు కర్మలయందు ఫలాసక్తి యుండదు. దైవమునం దాసక్తి చెందిన బుద్ధి, ఫలముల యందాసక్తి కలిగి యుండదు. అట్టి వానిని కర్మ లంటవు. 🍀*

10. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్యా కరోతి యః |
లిప్యతే న స పాపేన పద్మపత్ర వివాంభసా || 10

బ్రహ్మమునకు సమర్పితముగ, సంగము విడచి కర్మల నెవరైతే నాచరింతురో, అట్టివారిని పాప మంటదు. నీటి బొట్లు ఎన్ని పడినను, తామరాకు నంటవు కదా! ఉషా సమయమున మంచుబిందువులు తామరాకుల పై పడుట, ఆ బిందువులు సూర్యరశ్మికి ముత్యములవలె ప్రకాశించుట చూచి మనస్సంతయు ఆహ్లాదము చెందును. 

అట్లే బ్రహ్మమునకు సమర్పితము చేసిన మనసుతో కర్మ లాచరించు వారు, వాని ఫలముల యందు ఆసక్తి లేకుండుటచే చేయు పనులు ఆహ్లాదము కలిగించుచు నుండును. ఆసక్తి ఫలముల యందు కలిగినచో ఆహ్లాదము లేకపోగా మనసు ప్రపంచమున కంటును. 

నీటి బిందువు తామరాకుపై నున్నను, తామరాకునకు దానిపై ఆసక్తి లేదు. అట్లే కర్మలను మనసు ద్వారా ఆచరించు వాడు ఫలములయం దాసక్తి లేక ఆచరించినచో అతనిని ఆ కర్మలు బంధించవు. అంటను కూడ నంటవు. నీటి బిందువులు ప్రతి నిత్యము తామరాకుపై రాలుచు నుండును. ఆకునుండి జాలు వారుచు పోవుచునుండును. 

ఈ విషయమున తామరాకు సాక్షీ
భూతముగ నుండునే గాని రాలిపోవుచున్న బిందువులను గూర్చి బాధపడదు. కర్మము లన్నియు వచ్చి పోవునవే. తానాధారముగ అనేకానేక కర్మలు వచ్చి, నిర్వర్తింపబడి పోవుచునుండును. 

తామరాకు నీటి బిందువుల ననుసరించనట్లే, కర్మల ననుసరించి బుద్ధి పోరాదు. బుద్ధి ననుసరించి మనస్సుండవలెను. కర్మలు నిర్వర్తింపబడుచున్నను, బుద్ధిని దైవముపై నిలపిన, కర్మలు జరిగి పోవుట, తాను దైవముతో నుండుట జరుగును. 

“బుద్ధిః కర్మాను సారిణి " అను నానుడి కలదు. సామాన్యుల బుద్ధి కర్మల ననుస రించుచు పోవును. అపుడతడు కర్మబద్ధుడగును. బుద్ధిని దైవముతో జోడించి, మన స్సేంద్రియ దేహములతో కర్మలను నిర్వర్తించుట వలన ఆనంద ముండును గాని బంధ ముండదు.

ముందు శ్లోకమున మననము ద్వారా దైవముతో సంబంధము ఏర్పరచుకొనుట తెలుపబడినది. ఆ బంధము పటిష్ఠమైనచో నిర్వర్తించు కర్మల యందు ఫలాసక్తి యుండదు. దైవము నందాసక్తి చెందిన బుద్ధి, ఫలములయం దాసక్తి కలిగి యుండదు. అట్టి వానిని కర్మ లంటవు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 325 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
82. అధ్యాయము - 37

*🌻. యజ్ఞ విధ్వంసము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను

అపుడు మహాబలుడగు ఆ వీరభద్రుడు విష్ణువుతోడి యుద్ధమునందు అపదలన్నిటినీ వనివారించు శంకరుని మనస్సులో స్మరించి(1) దివ్యమగు రథమునధిష్ఠించెను. శత్రువులనందరినీ సంహరించే ఆ వీరభద్రుడు గొప్ప అస్త్రమును తీసుకొని సింహ నాదమును చేసెను(2) విష్ణువు కూడా పాంచ జన్యమను పేరుగల, గొప్ప శబ్ధమును చేసే తన మహాశంఖమును, తనవారికి ఆనందమును కలుగు చేయుచున్నాడాయన్నట్లు, మ్రోగించెను(3) ఆ శంఖ నాదమును విని, పూర్వములో యుద్ధమునండి పారిపోయిన దేవతలు కూడ వేగముగా మరలి వచ్చిరి(4)

సైన్య సమేతులగు లోకపాలురు ఇంద్రునితో గూడి సింహనాదమును చేసి వీరభద్రుని గణములతో యుద్ధమును చేసిరి(5) సింహనాదములను చేయుచున్న గణములకు, లోకపాలురకు భయమును గొల్పు సంకుల సమరము జరిగెను(6) ఇంద్రుడు నందితో యుద్ధమును చేసెను. అగ్ని విష్ణు గణములు, మరియు కుబేరుడు బలశాలియగు కూష్మాండపతితో యుద్ధమును చేసిరి(7) అపుడు ఇంద్రుడు వంద ధారలు గల వజ్రముతో నందని కొట్టగా, నంది ఇంద్రుని త్రిశూలముతో వక్షస్థ్సలమునందు కొట్టెను(8)

బలవంతులగు నంది, ఇంద్రుడు ఇద్దరు ఒకరినొకరు జయించు కోరిక గలవారైన, అనేక విధములుగా ఒకరినొకరి కొట్టుకొనుచూ, పట్టుదలతో యుద్దమును చేసిరి(9) మిక్కిలి కోపము గల అగ్ని అశ్మయను గణాధిపతిని శక్తితో కొట్టెను. ఆయన కూడ అగ్నిని వేగముగా వంద ధారలు గల శూలముతో పొడిచెను(10). శివలోకములోని గణములలో అగ్రేసరుడగు వీరుడు ఆనందముతో మహాదేవును స్మరించుచూ, యమునితో సంకుల సమరమునుచేసెను(11) మిక్కలి బలశాలియగు చండుడు నైర్‌ఋతికి ఎదురేగి, పరమాస్త్రములతో అతనిని కొట్టి, పరిహసించుచూ, యుద్దమును చేసెను(12)

వీరుడు, మహాబలుడునగు ముండుడు గన గొప్ప శక్తిచే ముల్లోకములను విస్మయపరుచుచున్నాడా యన్నట్లు వరుణునితో యుద్ధమును చేసెను(13).వాయువు గొప్ప శక్తిగల తన తన అస్త్రముతో భృంగిని కొట్టగా, ప్రతాపశాలియగు భృంగి వాయువును త్రిశూలముతో కొట్టెను(14)

బలవంతుడు, వీరుడునగు కూష్మాంండపతి మనస్సులో మహేశ్వరుని ధ్యానించి, కుబేరునితో యుద్ధమును చేసెను(15). యోగినీ గణములతో కూడియున్న బహాబలుడగు భైరవీ నాయకుడు దేవతలనందరినీ చీల్చి రక్తమును త్రాగెను. ఆదృశ్యము అద్భుతముగ నుండెను(16) మరియు ఆ యుద్ధములో క్షేత్రపాలుడు, ఋభుక్షుడు, కాళి ఆ దేవతలను అధిక సంఖ్యలో చీల్చి రక్తమును త్రాగిరి. (17). అపుడు మహా తేజస్వి, శత్రు సంహారకుడునగు విష్ణువు వారితో యుద్ధమును చేసెను. ఆయన పది దిక్కులను కాల్చి వేయుచున్నాడా యన్నట్లు చక్రమును ప్రయెగించెను(18)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 78 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 6 - THE 7th RULE
*🌻 7. Kill out the hunger for growth - Grow unconsciously, but eagerly anxious to open soul - 2 🌻*

305. C.W.L. – As far as we have gone in this book we have had the negative side of things before us. We have been told to kill out certain desires, but now we come to the positive side and learn what we may, and indeed must, desire. It may strike us as curious that we should be told to desire anything. 

Those who have studied the Indian books will remember that this is a point on which even the Upanishads differ. One Upanishad deprecates desire of all kinds; it argues that even to desire the right must be avoided, because we must be absolutely without any preference for this or for that. 

Another of those great scriptures directs that we must have the desire for progress, and says that when all other desires are conquered but the desire for the growth of the soul then there is for a man no more possibility of grief. 

We can reconcile those two statements if we take the first one to mean that if we have the desire to cooperate in even the higher work of the world as a separate self, thinking of ourselves and of the great things we can do, there is still a tinge of the idea of separation; 

but if we are able to think of ourselves as a part of humanity and as earning our advance on behalf of the humanity of which we are a part, and there is no longer any thought of self, then we have raised and purified our desire into an aspiration which is altogether desirable. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 210 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. వ్యాసమహర్షి - 2 🌻*

8. పాండురాజు చనిపోయినప్పుడు కుంతీదేవి దుఃఖపడుతుంటే, ఆమెను వ్యాసుడు ఓదారుస్తూ ఒక్కటేమాట చెప్పాడట, “అమ్మా! కాలంయొక్క స్వరూపం బాగా తెలిసినవాళ్ళు, ఎప్పుడూ కూడా భవిష్యత్తు కంటే గడచిన కాలమే మంచిదని అనుకుంటూ ఉంటారు. ఈ ఒక్కమాట గుర్తుపెట్టుకో! గడిచిపోయినకాలంలో ఉన్నటువంటి సుఖసంపదలను తలచుకోని శాంతిని పొందు. 

9. వర్తమానకాలంలో, భవిష్యత్తులో ఎటువంటి ఆశలూ పెట్టుకోవద్దు” అని చెప్పాడు. ఎలాంటి వేదతత్త్వమూ ఆయన చెప్పలేదు. జీవితంలోని సత్యం చెప్పాడు. ఎందుకు చెపుతున్నాడీ విషయం అంటే, అందులో భవిష్యత్తు సూచన ఉంది. 

10. పాండవులు పుట్టారు బాగున్నారు అని సంతోషిస్తే, భర్త పోయాడు. వీళ్ళు ఎలా ఉంటారో చెప్పలేము. రాబోయేది మహాభారత యుద్ధం. గొప్పమార్పు ఉంది. అది అందరినీ తీసుకెళ్ళి సముద్రంలో కలుపుతుంది, ఎవరినీ ఉంచదు. 

11. వీళ్ళిక్కడ సుఖపడటానికే పుట్టలేదు. కాబట్టి భవిష్యత్తులోకూడా సుఖము ఆశించవద్దని ఆమెకి వ్యాసుడు చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం, అందరికీ అంతో ఇంతో వర్తిస్తుంది. 

12. ఓదార్పు మాటలు సత్యంతో ఉండాలి అబద్ధపు వాగ్దానాలు ఉండకూడదు. అసత్యమయినటువంటి ఆశ, కల్పన దోషయుక్తం. “ఉన్నది ఇదే, యథార్థమని అనుకో. ఇంతకన్న బావుంటే అదృష్టవంతుడివి” అని చెప్పటమే మేలు. కఠినంగా ఉన్నప్పటికీ అదే సత్యం.

13. అత్యుత్తమమయినదేమిటంటే, ఉన్నది యథార్థంగా ఉన్నట్లుగానే గ్రహించి, తపోబలంతో వైముఖ్యం పొందటం. ప్రపంచంవైపు చూడక ధీరుడు తపస్సును ఆశ్రయిస్తాడు. తపస్సులో పెరుగుతాడు. 

14. తపస్సు లేని దుఃఖభూయిష్టమైన జన్మ నశిస్తుంది. క్రమక్రమంగా అతడియొక్క తేజస్సు తగ్గిపోతుంది. ఆత్మగౌరవం, మనోబలం నశించి ఇంకా క్షీణదశకు వెళ్ళిపోతుంది మనిషి జీవితం. తపోబలంలో మనిషి ఉన్నతుడవుతాడు. అందుకే తపస్సుకు అంత ప్రాధాన్యం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 274 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 123. Once the 'I am' goes, what remains is the Original which is unconditioned, without attributes or identity. This is called 'Parabrahma', or the Absolute. 🌻*

The departure of the 'I am', marks the end of all concepts, or 'the illusion'. You are no longer a conditioned individual but stand as the Original - and the Original has no attributes or identity. 

How could the formless, nameless infinite have any attributes or identity? It is the very basis. All that we see with attributes or identity have only appeared on it, which again are based on the fundamental primordial concept or illusion 'I am'. 

Since the only means of communication we have is words or language, this infinite has been called the 'Parabrahman' or the Absolute.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 149 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 28 🌻*

*🌷. ఐక్య అస్తిత్వము - సత్య గోళం 🌷*

597. సత్య భువన మందలి భగవంతుడు తొలిసారిగా తన ఏకత్వ మందు ఎరుక గలవాడు అయ్యెను. అనేకత్వం లో గల ఏకత్వ మందు ఎరుక గల ఏకత్వము కలవాడు అయ్యను. 
.
మహర్షుల భావన ప్రకారం, పరాత్పరస్థితిలో గుప్తమైన పరమనిథి ఉండెను .అది తనను తాను తెలిసి కొన గోరెను.ఇట్లు తనలో ఒక వాంఛ కలిగిన తక్షణమే, తాను ఒక మహా తేజస్సు గా ఎరుకను పొందెను ఈ మహా తేజస్సులో సమస్త సృష్టియు ,దాని ఆవిష్కరములను అంతర్నిహితములై యుండెను.

"భగవంతుడు నా తేజస్సును సృష్టించెను. నా తేజస్సులో నుండి ఈ విశ్వం ఉనికిని పొందెను."

భగవంతుని జ్ఞానము లో అద్వైత స్వరూపముతో సహా ఇది పరమ సౌందర్య లక్షణము(సర్వం సుందరం)
ఇచ్చట భగవంతునకు- సృష్టికి గల సంబంధము ప్రేమికునకు-ప్రియునకు గల సంబంధం వంటిది .

ఇచ్చట భగవంతుడు ప్రేమికుడు, మహర్షి ప్రియ తమ్ముడు. భగవంతుడిచ్చట తన యందు సృష్టి యందు ఎరుక గలవాడు అయ్యను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 5 / Sri Lalita Sahasranamavali - Meaning - 5 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀 5. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా |*
*ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా ‖ 5 ‖ 🍀*

15) అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా : 
అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది.

16) ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా : 
ముఖము అనెడి చంద్రునియందు మచ్చవలె ఒప్పెడు కస్తురి బొట్టును కలిగినది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 5 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 5. aṣṭamīcandra-vibhrāja-dalikasthala-śobhitā |*
*mukhacandra-kalaṅkābha-mṛganābhi-viśeṣakā || 5 || 🌻*

15 ) Ashtami chandra vibhraja - dhalika sthala shobhitha -   
She who has a beautiful forehead like the half moon (visible on eighth day from new moon)

16 ) Muka chandra kalankabha mriganabhi viseshaka -   
She who has the thilaka(dot) of Musk in her forehead which is like the black shadow in the moon

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 5 / Sri Vishnu Sahasra Namavali - 5 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻* 

*భరణి నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🍀 5. స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః |*
*అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ‖ 5 ‖ 🍀*

🍀 37) స్వయంభూ : - 
తనంతట తానే ఉద్భవించిన వాడు.

🍀 38) శంభు: - 
సర్వశ్రేయములకు మూలపురుషుడు.

🍀 39) ఆదిత్య: - 
సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు.

🍀 40) పుష్కరాక్ష: - 
పద్మముల వంటి కన్నులు గలవాడు.

🍀 41) మహాస్వన: - 
గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.

🍀 42) అనాదినిధన: - 
ఆద్యంతములు లేని వాడు.

🍀 43) ధాతా - 
నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు.

🍀 44) విధాతా - 
కర్మఫలముల నందించువాడు.

🍀 45) ధాతురుత్తమ: - 
సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు.

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Vishnu Sahasra Namavali - 5 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka For Bharani 1st Padam*

*🌻 5. Svayaṁbhūḥ śaṁbhurādityaḥ puṣkarākṣō mahāsvanaḥ |*
*anādinidhanō dhātā vidhātā dhāturuttamaḥ || 5 || 🌻*

🌻 37) Swayambhu – 
The Lord Who Manifests from Himself

🌻 38) Shambhu – 
The Bestower of Happiness

🌻 39) Aditya – 
The Sun or The son of Aditi

🌻 40) Pushkaraksha – 
The Lord Who has Lotus Like Eyes

🌻 41) Mahaswana – 
The Lord Who has a Thundering Voice

🌻 42) Anadinidhana – 
The Lord Without Origin or End

🌻 43) Dhata – 
The Lord Who Supports All Fields of Experience

🌻 44) Vidhata – 
The Lord Who Creates All Actions and Their Results

🌻 45) Dhaturuttama – 
The Lord Who is Greater than the Creator (Brahma)

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita - 1🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 1 🌴

1. ధృతరాష్ట్ర ఉవాచ :
   ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ: | మామకా: పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||

🌷. తాత్పర్యం :
ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?

🌷. భాష్యము :
శ్రీమద్భగవద్గీత విస్తారముగా ప్రకటింపబడు ఆస్తిక విజ్ఞానశాస్త్రము. అది గీతామహాత్మ్యము నందు సంగ్రహించబడినది. భగవద్గీతను కృష్ణభక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసికొనుటకు యత్నించవలెనని దాని యందు తెలుపబడినది.

గీతను అర్జునుడు శ్రీకృష్ణభగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసికొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురుశిష్యపరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసికొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేదజ్ఞానమును, ప్రపంచామునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందు గల విషయమునే గాక అన్యత్రా గోచరించని విషయములను సైతము పాటకుడు భగవద్గీత యందు గాంచగలడు. అదియే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత.

పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణభగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రమై విరాజిల్లుచున్నది.

మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర, సంజయ సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్త్వశాస్త్రమునకు మూలసిద్ధాంతములై యున్నవి. అనాదియైన వేదకాలము నుండియు తీర్థస్థలముగా ప్రసిద్ధినొందిన కురుక్షేత్రమునందు ఈ తత్త్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది.ఈ భూమిపై శ్రీకృష్ణభగవానుడు స్వయముగా ప్రత్యక్షమైనప్పుడు మానవాళి నిర్దేశనార్థము దీనిని పలికెను.
కురుక్షేత్రరణరంగమున శ్రీకృష్ణభగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రమను(ధర్మాచారములు నిర్వహింపబడు స్థలము) పదము ప్రాధాన్యత సంతరించుకొన్నది.

కౌరవుల తండ్రియైన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశామును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై యుండెను. కనుకనే తన సందేహమున అతడు “వారు ఏమి చేసిరి?” అని కార్యదర్శియైన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలెనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యము కలదు.

జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంచింపలేదు. అదియును గాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలియగోరెను. కాని దేవతలకు సైతము పూజనీయస్థానముగా వేదములలో తెలుపబడియున్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధపరిణామముపై స్థలప్రభావమును గూర్చి అతడు మిగుల భీతినొందెను. సస్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండుసుతులకు అది అనుకూల ప్రభావమును చూపునని అతడెరిగి యుండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను. కనుకనే యుద్ధరంగమందలి పరిస్తితిని గూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని అడిగెను.

పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమునకు చెందినవారు. కాని కేవలము తన పుత్రులనే కురుసంతానముగా పలికి పాండుసంతానమును వంశము నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనస్సును విశదపరచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవుల యెడ ధృతరాష్ట్రునికి గల సంబంధము దీని ద్వారా ఎవరైననను అవగతము చేసికొనవచ్చును.

పంటపొలము నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి, ధర్మపితయైన శ్రీకృష్ణభగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రమగు కురుక్షేత్రము నుండి కలుపుమొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు, యధిష్టరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్టుతులు కాగాలరనియు ఆది నుండియే ఈ విధముగా ఊహించబడినది. చారిత్రిక మరియు వైదిక ప్రాముఖ్యమే గాక “ధర్మక్షేత్రము” మరియు “కురుక్షేత్రము” అనేది పదములకు గల విశేషార్థమిదియే.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 BhagavadGita as it is - 1 🌹
✍️. Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

🌴 Chapter 1 - Vishada Yoga - 1 🌴

1. dhṛtarāṣṭra uvāca :
dharma-kṣetre kuru-kṣetre samavetā yuyutsavaḥ
māmakāḥ pāṇḍavāś caiva kim akurvata sañjaya

🌷Translation :
Dhṛtarāṣṭra said: O Sañjaya, after my sons and the sons of Pāṇḍu assembled in the place of pilgrimage at Kurukṣetra, desiring to fight, what did they do?

🌷Purport :
Bhagavad-gītā is the widely read theistic science summarized in the Gītā-māhātmya (Glorification of the Gītā). 

There it says that one should read Bhagavad-gītā very scrutinizingly with the help of a person who is a devotee of Śrī Kṛṣṇa and try to understand it without personally motivated interpretations.

The example of clear understanding is there in the Bhagavad-gītā itself, in the way the teaching is understood by Arjuna, who heard the Gītā directly from the Lord. If someone is fortunate enough to understand the Bhagavad-gītā in that line of disciplic succession, without motivated interpretation, then he surpasses all studies of Vedic wisdom, and all scriptures of the world. One will find in the Bhagavad-gītā all that is contained in other scriptures, but the reader will also find things which are not to be found elsewhere.

That is the specific standard of the Gītā. It is the perfect theistic science because it is directly spoken by the Supreme Personality of Godhead, Lord Śrī Kṛṣṇa.

The topics discussed by Dhṛtarāṣṭra and Sañjaya, as described in the Mahābhārata, form the basic principle for this great philosophy.

It is understood that this philosophy evolved on the Battlefield of Kurukṣetra, which is a sacred place of pilgrimage from the immemorial time of the Vedic age. It was spoken by the Lord when He was present personally on this planet for the guidance of mankind.

The word dharma-kṣetra (a place where religious rituals are performed) is significant because, on the Battlefield of Kurukṣetra, the Supreme Personality of Godhead was present on the side of Arjuna. Dhṛtarāṣṭra, the father of the Kurus, was highly doubtful about the possibility of his sons’ ultimate victory.

In his doubt, he inquired from his secretary Sañjaya, “What did they do?” He was confident that both his sons and the sons of his younger brother Pāṇḍu were assembled in that Field of Kurukṣetra for a determined engagement of the war. Still, his inquiry is significant. He did not want a compromise between the cousins and brothers, and he wanted to be sure of the fate of his sons on the battlefield.

Because the battle was arranged to be fought at Kurukṣetra, which is mentioned elsewhere in the Vedas as a place of worship – even for the denizens of heaven – Dhṛtarāṣṭra became very fearful about the influence of the holy place on the outcome of the battle.

He knew very well that this would influence Arjuna and the sons of Pāṇḍu favorably, because by nature they were all virtuous. Sañjaya was a student of Vyāsa, and therefore, by the mercy of Vyāsa, Sañjaya was able to envision the Battlefield of Kurukṣetra even while he was in the room of Dhṛtarāṣṭra. And so, Dhṛtarāṣṭra asked him about the situation on the battlefield.

Both the Pāṇḍavas and the sons of Dhṛtarāṣṭra belong to the same family, but Dhṛtarāṣṭra’s mind is disclosed herein. He deliberately claimed only his sons as Kurus, and he separated the sons of Pāṇḍu from the family heritage.

One can thus understand the specific position of Dhṛtarāṣṭra in his relationship with his nephews, the sons of Pāṇḍu. As in the paddy field the unnecessary plants are taken out, so it is expected from the very beginning of these topics that in the religious field of Kurukṣetra, where the father of religion, Śrī Kṛṣṇa, was present, the unwanted plants like Dhṛtarāṣṭra’s son Duryodhana and others would be wiped out and the thoroughly religious persons, headed by Yudhiṣṭhira, would be established by the Lord.

This is the significance of the words dharma-kṣetre and kuru-kṣetre, apart from their historical and Vedic importance.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹