భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 149


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 149 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 28 🌻

🌷. ఐక్య అస్తిత్వము - సత్య గోళం 🌷


597. సత్య భువన మందలి భగవంతుడు తొలిసారిగా తన ఏకత్వ మందు ఎరుక గలవాడు అయ్యెను. అనేకత్వం లో గల ఏకత్వ మందు ఎరుక గల ఏకత్వము కలవాడు అయ్యను.

.

మహర్షుల భావన ప్రకారం, పరాత్పరస్థితిలో గుప్తమైన పరమనిథి ఉండెను .అది తనను తాను తెలిసి కొన గోరెను.ఇట్లు తనలో ఒక వాంఛ కలిగిన తక్షణమే, తాను ఒక మహా తేజస్సు గా ఎరుకను పొందెను ఈ మహా తేజస్సులో సమస్త సృష్టియు ,దాని ఆవిష్కరములను అంతర్నిహితములై యుండెను.

"భగవంతుడు నా తేజస్సును సృష్టించెను. నా తేజస్సులో నుండి ఈ విశ్వం ఉనికిని పొందెను."

భగవంతుని జ్ఞానము లో అద్వైత స్వరూపముతో సహా ఇది పరమ సౌందర్య లక్షణము(సర్వం సుందరం)

ఇచ్చట భగవంతునకు- సృష్టికి గల సంబంధము ప్రేమికునకు-ప్రియునకు గల సంబంధం వంటిది .

ఇచ్చట భగవంతుడు ప్రేమికుడు, మహర్షి ప్రియ తమ్ముడు. భగవంతుడిచ్చట తన యందు సృష్టి యందు ఎరుక గలవాడు అయ్యను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


16 Jan 2021

No comments:

Post a Comment