17-JANUARY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 612 / Bhagavad-Gita - 612 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 234, 235 / Vishnu Sahasranama Contemplation - 234, 235🌹
3) 🌹 Daily Wisdom - 31🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 165🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 186 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 5 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 182 / Sri Lalita Chaitanya Vijnanam - 182 🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 523 / Bhagavad-Gita - 523🌹
10) 🌹.అత్యున్నత భావ చైతన్యమే దైవం 🌹*
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀

11) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 126🌹  
12) 🌹. శివ మహా పురాణము - 326 🌹 
13) 🌹 Light On The Path - 79🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 211🌹 
15) 🌹 Seeds Of Consciousness - 275 🌹   
16) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 150🌹
17) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 06 / Lalitha Sahasra Namavali - 06🌹 
18) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 06 / Sri Vishnu Sahasranama - 06 🌹
19) 🌹. శ్రీమద్భగవద్గీత - 2 / Bhagavad-Gita - 2🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 612 / Bhagavad-Gita - 612 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 29 🌴*

29. బుద్దేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రీవిధం శ్రుణు |
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ||

🌷. తాత్పర్యం : 
ఓ ధనంజయా! ఇక త్రిగుణముల ననుసరించి యున్న వివిధములైన బుద్ధి మరియు నిశ్చయములను విశదముగా నా నుండి ఆలకింపుము.

🌷. భాష్యము :
జ్ఞానము, జ్ఞానలక్ష్యము, జ్ఞాత యనెడి మూడు అంశములను త్రిగుణముల ననుసరించి వివరించిన పిమ్మట శ్రీకృష్ణభగవానుడు కర్త యొక్క బుద్ధి మరియు నిశ్చయములను అదే విధముగా వివరింపనున్నాడు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 612 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 29 🌴*

29. buddher bhedaṁ dhṛteś caiva guṇatas tri-vidhaṁ śṛṇu
procyamānam aśeṣeṇa pṛthaktvena dhanañ-jaya

🌷 Translation : 
O winner of wealth, now please listen as I tell you in detail of the different kinds of understanding and determination, according to the three modes of material nature.

🌹 Purport :
Now after explaining knowledge, the object of knowledge, and the knower, in three different divisions according to the modes of material nature, the Lord is explaining the intelligence and determination of the worker in the same way.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 234, 235 / Vishnu Sahasranama Contemplation - 234, 235 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻234. అనిలః, अनिलः, Anilaḥ🌻*

*ఓం అనిలాయ నమః | ॐ अनिलाय नमः | OM Anilāya namaḥ*

అనిలోఽనిలయో యతః అనాదానాదననాదాహ్యనాదిత్వాదుతానిలః నిల శబ్దము నిలయవాచకము. నిలయము లేని విష్ణువు అనిలః అనబడును. అనిలయః ఎవనికి నిశ్చితమగు నివాసస్థానము లేదో ఎవడు సర్వవ్యాపియో అట్టివాడు. అనాదిత్వాత్ అనిలః ఎవనికి ఆది లేదో అట్టివాడు అని కూడా చెప్పవచ్చును. న విద్యతే నిలః ఆదానం యస్య ఎవనిని అనుభవముచేత తప్ప గ్రహించుటకు వీలుపడదో అట్టివాడు. అనిః అస్య అస్తిః ప్రాణులను తమ తమ వ్యాపారములందు ప్రవర్తింపజేయువాడు అని కూడా అర్థము. ఈ వివరణలన్నియును వాయు రూపుడైన విష్ణుని గురించి తెలియజేయుచున్నవి.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 234🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻234. Anilaḥ🌻*

*OM Anilāya namaḥ*

Anilo’nilayo yataḥ anādānādananādāhyanāditvādutānilaḥ / अनिलोऽनिलयो यतः अनादानादननादाह्यनादित्वादुतानिलः Nila indicates a place of rest or dwelling. The One without a permanent resting place and who is all pervading is Anilaḥ.

Anilayaḥ / अनिलयः The One without a permanent residence. Anāditvāt anilaḥ / अनादित्वात् अनिलः The One who has no beginning. Na vidyate nilaḥ ādānaṃ yasya / न विद्यते निलः आदानं यस्य The One who cannot be understood without being experienced. Aniḥ asya astiḥ / अनिः अस्य अस्तिः The One who sustains all beings. All these indicate Lord Viṣṇu in the form of Air.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 6
Nirbhinnānyasya carmāṇi lokapālo’nilo’viṣat,
Prāṇenāṃśena saṃsparśaṃ yenāsau pratipadyate. (16)

:: श्रीमद्भागवत - तृतीयस्कन्धे, षष्ठोऽध्यायः ::
निर्भिन्नान्यस्य चर्माणि लोकपालोऽनिलोऽविषत् ।
प्राणेनांशेन संस्पर्शं येनासौ प्रतिपद्यते ॥ १६ ॥

When there was a manifestation of skin separated from the gigantic form, Anila, the deity directing the wind, entered with partial touch, and thus the living entities can realize tactile knowledge.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
आवर्तनो निवृत्तात्मा संवृतस्संप्रमर्दनः ।
अहसंवर्तको वह्निरनिलो धरणीधरः ॥ २५ ॥

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతస్సంప్రమర్దనః ।
అహసంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ ౨౫ ॥

Āvartano nivr̥ttātmā saṃvr̥tassaṃpramardanaḥ ।
Ahasaṃvartako vahniranilo dharaṇīdharaḥ ॥ 25 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 235 / Vishnu Sahasranama Contemplation - 235🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻235. ధరణీధరః, धरणीधरः, Dharaṇīdharaḥ🌻*

*ఓం ధరణీధరాయ నమః | ॐ धरणीधराय नमः | OM Dharaṇīdharāya namaḥ*

వరాహశేషాదిఙ్మత్తేభాదిరూపేణ కేశవః ।
ధరణీం ధరతీత్యేష ధర్ణీధర ఉచ్యతే ॥

వరాహ, ఆదిశేష, దిగ్గజాది రూపములతో ఈ భూమిని ధరించు విష్ణువు ధరణీధరుడు.

:: పోతన భాగవతము - పఞ్చమ స్కంధము, ద్వితీయాశ్వాసము ::
చ. జలజభవాదిదేవ మునిసన్నుత తీర్థపదాంబుజాత! ని
     ర్మల నవరత్న నూపురవిరాజిత! కౌస్థుభ భూషణాంగ! యు
     జ్జ్వల తులసీ కురంగ మదవాసన వాసిత దివ్యదేహ! శ్రీ
     నిలయ శరీర! కృష్ణ! ధరణీధర! భాను శశాంకలోచనా!

బ్రహ్మ మొదలయిన దేవతలూ, ఋషులూ స్తుతించేవి, పుణ్య తీర్థాలవలె పవిత్రమైనవీ అయిన పాదపద్మాలు కలవాడవూ, నవరత్నాలతో ప్రకాశించే కాలి అందెలు గలవాడవూ, కౌస్తుభమణిని భూషణంగా ధరించినవాడవూ, వెల్లివిరిసే తులసీదళాల పరిమళాలూ, కస్తూరీ సుగంధాలూ, గుబాళించే దివ్యదేహం కలవాడవూ, లక్ష్మీదేవికి నివాసమయిన వక్షఃస్థలం కలవాడవూ, భూభారాన్ని వహించేవాడవూ, సూర్యచంద్రులే కన్నులుగా కలవాడవూ అయిన శ్రీకృష్ణా! నీకు నమస్కారం.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 235🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻235. Dharaṇīdharaḥ🌻*

*OM Dharaṇīdharāya namaḥ*

Varāhaśeṣādiṅmattebhādirūpeṇa keśavaḥ,
Dharaṇīṃ dharatītyeṣa dharṇīdhara ucyate.

वराहशेषादिङ्मत्तेभादिरूपेण केशवः ।
धरणीं धरतीत्येष धर्णीधर उच्यते ॥

He bears the Earth in the form of Varāha, Ādiśeṣa and the eight elephants sustaining the cardinal points of the world.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 13
Daṃṣṭrāgrakoṭayā bhagavaṃstvayā dhr̥tā virājate bhūdhara bhū sabhūdharā,
Yathā vanānniḥ sarato datā dhr̥tā mataṅgajendrasya sapannapadminī. (41)

:: श्रीमद्भागवते तृतीय स्कन्धे, त्रयोदशोऽध्यायः ::
दंष्ट्राग्रकोटया भगवंस्त्वया धृता विराजते भूधर भू सभूधरा ।
यथा वनान्निः सरतो दता धृता मतङ्गजेन्द्रस्य सपन्नपद्मिनी ॥ ४१ ॥

O lifter of the earth, the earth with its mountains, which You have lifted with Your tusks, is situated as beautifully as a lotus flower with leaves sustained by an infuriated elephant just coming out of the water.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
आवर्तनो निवृत्तात्मा संवृतस्संप्रमर्दनः ।
अहसंवर्तको वह्निरनिलो धरणीधरः ॥ २५ ॥

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతస్సంప్రమర్దనః ।
అహసంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ ౨౫ ॥

Āvartano nivr̥ttātmā saṃvr̥tassaṃpramardanaḥ ।
Ahasaṃvartako vahniranilo dharaṇīdharaḥ ॥ 25 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 31 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 31. The Being of Reality 🌻*

The Being of Reality consists in Experience, uncontradicted by transcendence and untrammelled by modification. In this One Whole all appearances get fused, and they vanish into it. 

This Reality-Experience is one and attributeless, true to itself which is Alone, above thought, and above every partial aspect of being, but including all, none of which can be complete without getting itself merged in the fully real, which is the Absolute. 

This Being can only be One, because experience is always a Whole, and because dissatisfaction is the effect of a faith in all independent pluralities and external relations which endlessly contradict themselves. The Absolute is experienced as the same Illimitable Immensity, even if it is approached in millions of ways. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 165 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 95 🌻*

కాబట్టి నిజానికి పురుషుడు త్రివిధంబులు. క్షర, అక్షర పురుషోత్తములు. ఏ స్థితిలో ఉన్నా పురుషుడే. పురుషుడన్న స్థితికి ఏం భేదంలేదు. పురము నందు ఉన్నవాడెవడో, అధిష్ఠానముగా వాడే పురుషుడు. ఇది పురుషునికి అర్థం. అంతే కానీ, స్త్రీ పురుషులని అర్థం కాదు. 

పురము అంటే, అర్థం ఏమిటి, ఎనిమిది శరీరాలు పురములు. ఎనిమిది జగత్తులు పురములే. ఎనిమిది వ్యవహారములు పురములే. కాబట్టి, ఆయా వ్యవహారములయందు అధిష్ఠానముగా ఉన్నటువంటి, విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యక్‌ ఆత్మ విరాట్‌ హిరణ్యగర్భ పరమాత్మలనే సాక్షిస్వరూపములన్నీ పురుషుడే. 

వీటినన్నింటినీ క్రోడీకరిస్తే క్షరపురుషుడు అనేటటుంవంటి జీవుడు, అక్షరపురుషుడు అనేటటుంవంటి బ్రహ్మము పురుషోత్తముడు అనేటటువంటి పరమాత్మగా మనం సిద్ధాంతీకరించాము.
      
కాబట్టి, ఈ స్థితి భేదాన్ని బట్టి, భావన భేదాన్ని బట్టి, నిర్ణయభేదాన్ని బట్టి, నిర్వచనం ఇచ్చారే తప్ప, ప్రత్యేకంగా దానివల్ల స్థూలంగా వచ్చేటటువంటి, మార్పేమీ లేదు. 

జీవన శైలిలో వచ్చేటటుంవంటి మార్పేమీ లేదు. అంటే అన్నం తినేవాడు అన్నం మానేస్తేనో, అన్నం తింటేనో, లేదంటే కొండగుహలలో ఉన్నవాడు జనారణ్యంలోకి వస్తేనో, జనారణ్యంలో ఉన్నవాడు కొండగుహలలోకి వెళ్తేనో, లేదా నిరంతరాయంగా రోజుకి 16 సార్లు స్నానం చేయడం వల్లనో, ఇలా భౌతికమైనటువంటి విధులలో మార్పులు చేసినంత మాత్రమున ఈ వివేకము సాధించబడింది అని చెప్పడానికి అవకాశం లేదు. 

కానీ ఇలాంటివి అన్నీ కూడా నీలో ఉన్నటువంటి మాలిన్య సంగ్రహాన్ని వదిలించుకోవడానికి ఉపయోగపడే సహకారి కాగలదు. అందుకని సాధనకి పరిమితులు చెప్పబడినాయి. యమనియమాది అష్టాంగ యోగ సాధనలో... యమం, నియమం చాలా ముఖ్యమైనది.

ఇవాళ ఎంతోమంది ఆత్మ జ్ఞానమనీ, బ్రహ్మజ్ఞానమనీ, విచారణ చేసేటటువంటి వారు కానీ, ఆత్మసిద్ధులని, ఆత్మనిష్ఠులనీ, ఆత్మోపరతులని, ఆత్మోపబ్ధిని పొందామని, తత్వదర్శిలమని పేరుపొందిన వారిలో ఇట్టి యమ నియమాలు గోచరించుట లేదు అనేది పెద్దల వ్యాక్యము. ఎందువల్ల? ఏ రకమైనటువంటి యమనియమాలను పాటించడు. ఏ రకమైన విధినియమాలను పాటించడు. 

ఏ రకమైనటువంటి శాస్త్రోచిత కర్మలను చేయడు. ఏ రకమైన ధర్మార్థమైనటు వంటి, ప్రయోజన శీలమైనటువంటి, జీవనము చేయడు. కానీ, ఆత్మనిష్ఠుడు అని అంటాడు. ఉండకూడదా? ఉండవచ్చు...! కొండకచో.. ఇటువంటి జీవన్ముక్తులు కూడా ఉండవచ్చు. బ్రహ్మ నిష్ఠులు కూడా ఉండవచ్చు. కాని వారు అత్యంత అరుదుగా ఉన్నారు.

        భగవాన్‌ రమణులు ఏమీ చేయలేదు కదండీ! అనేటటువంటి వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటాము. కానీ, వారికున్నటువంటి సహజనిర్వికల్ప సమాధినిష్ఠ మరి అందరికీ లేదు కదండీ! వారి స్థితిననుసరించి, వారి వ్యవహారం ఉంటుంది. జీవన్ముక్తులు ఇలాగే ఉండాలి అనే నియమం లేదు. జగత్‌ వ్యవహార శైలిని బట్టి వారుండరు. వారు ఉండవలసిన రీతిగా వారుంటారు. 

ఎట్లా ఉంటే, లోక కళ్యాణం సాధ్యమౌతుందో, అట్లా ఆ అవతారుడు, అట్లా ఆ జీవన్ముక్తుడు ఉంటాడు. ఆ స్థితికి వచ్చేవరకూ సర్వసామాన్య నియమములను సర్వసామాన్య ధర్మములను మొక్షార్దియై ఆచరించవలెను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 5 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 2. సుదర్శన చక్రము - 2 🌻*

ఎన్నిమార్లు దర్శించిననూ దర్శింపబడు వస్తువు ఒకటే గనుక జ్ఞానము మరలనట్లే దర్శింపబడును. పుస్తకములు నశించిననూ, ఆ పుస్తకములను మొదట వ్రాసిన జ్ఞానము ఎన్ని మార్లెనను ఆ జ్ఞానము వ్రాయగలదు. 

ఆ జ్ఞానమండలమే వేదము. దానికి నాశము లేదు. ఏ వస్తునైనను పరిపూర్ణతతో వృత్తాకారము వహించును. కాలము మండలాత్మకము. దూరము మండలాత్మకము. జ్ఞానమునకు శిశువు కాలము. కాలమునకు శిశువు దూరము. 

ఈ రెండింటి జతయే బ్రహ్మాండము. అది సృష్టికి ముందు వృత్తాకారము (360 డిగ్రీలు), సృష్టి జరుగుటలో అండాకారము (365 డిగ్రీలు) సృష్టి బిడ్డలగు గోళములు అండాకారములు. వాని గమన మార్గములు కూడ అండాకారములు. గోళ మందలి జీవులు కూడా తొలుత అండాకారములే. పిదప దిస్వభావములైన అండాకారములు జనించినవి (బుధుడు - బుద్ధి).  

తరువాత అండము నుండి రెండు భిన్న భావములైన డిప్పలు అవతరించినవి. (శుక్రుడు, కుజుడు), సాశనములు, అనశనములు. విడిపోయిన ఈ రెండు డిప్పలు. అండమును పూరించుటకు యత్నము జరుగుచుండును. సృష్టికాండ సాగుటకు సగభాగము నుండి ప్రాణశక్తి సూర్యకిరణముల రూపము లగును. 

రెండవ సగభాగము చంద్ర కిరణముల రూపముగ వ్యక్తమగుచు గర్భధారణము నొనరించుచూ దేహములను కల్పించు చున్నవి. ఈ రెండు భాగములను స్త్రీ, పురుష అంశలుగా ఎంచబడు చున్నవి. 

దేవలోకము, పితృలోకములుగ కూడ తెలియబడుచున్నవి. సూర్య చంద్రాదులుగ కూడ తెలియబడుచున్నవి. సూర్యుడు వృషభముగను, చంద్రుడు గోవుగను, భూమి దూడగను గుప్తవిద్యలలో వర్ణింప బడినవి.

ఈ సందర్భముననే ఒకటి మూడగుచున్నదని చెప్పబడినది. అందు ఒకటి నిత్యము. రెండవది అమృత మయము. మూడవది భ్రాంతి మూలకము. సూర్యుని చుట్టునూ భూమి తిరుగుదారి నిత్యము. భూమి చుట్టునూ సూర్యుడు తిరుగు చున్నట్లు కనిపించు దారి భ్రాంతి చక్రము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 186 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
178

Avadhoota Swamy described to King Yadu what he learned from the pigeons. “There was a lovely pigeon couple in a forest. They lived in harmony for a long time. In course of time, they also had a few baby pigeons. They began bringing up their children with a lot of love and affection. Birds look very beautiful as babies.

 They are just about to grow wings and they sound really cute. These parent pigeons, with a lot of love for the children, would undertake any amount of hard work to go out and bring food from the forests to feed their children. This became a regular practice.

A hunter noticed that the parent pigeons go out to the forest, bring back food and feed the baby birds. One day, he cast a net and captured the baby birds that were barely able to fly. 

The mother pigeon who brought food back for the kids found the nest empty and experienced unbearable sorrow. Wailing, from her attachment with the kids, the mother pigeon who set out to search for her children found the children in the hunter’s net a little distance away. 

Anxious and eager to save her children, the pigeon flew towards the net and got stuck in it. After a little while, the male pigeon who came searching found the female pigeon and the baby pigeons caught in the net.

 Filled with sorrow, in an attempt to save them, the male pigeon also got stuck in the net. The hunter who was observing all this from behind a tree was very pleased thinking, “My hunt today has been successful. I am going to have a sumptuous meal”. Gleefully, he threw the net containing the birds over his shoulder and took it home.
See, what attachment led to. 

One should not think that taking care of family is the ultimate goal of human life. One should let go of attachments, otherwise downfall is certain. One will have to face great sorrow like the family or birds did. The mother bird died seeing the baby birds. The male bird saw the female bird and followed. 

The entire family was gone due to a small attachment. If the parent birds used reasoning and avoided getting stuck in the net by understanding that there was no way to save the little birds, they would have at least lived and perhaps had more baby birds down the line. That is why, one must let go of attachments, otherwise downfall is certain. 

He will have to experience great sorrow like the family of birds did. King Yadu, listen, I learned that he who lives with attachment to worldly life will perish one day”.

Did you see the downfall that attachment brought? That is why, one should inculcate dispassion and pursue liberation and salvation. 

One must continue his efforts through his spiritual practice and be able to visualize the inner self. This story is so wonderful.

Next, python. Everything is determined by time. In this age, desire crosses limits and turns into greed. Let us talk about this next.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.అత్యున్నత భావ చైతన్యమే దైవం 🌹*
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀*
📚. ప్రసాద్‌ భరద్వాజ. 

‘అది నిజమేనేమో! లేకపోతే, అందరూ అలాగే ఎందుకంటారు?’’అనే అనుమానం వెంటనే మీలో కలుగుతుంది. అంతగా మీరు ఇతరుల భావనపై ఆధారపడతారు. దానివల్ల మీరు మీ అంతర్వాణిని పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది. అప్పుడు మీరు దానిని మళ్ళీ కనుక్కోవలసి వస్తుంది. 

ఎందుకంటే, కేవలం అంతర్వాణి ద్వారా మాత్రమే చాలా విలువైన, అత్యంత సుందరమైన, పరమ పవిత్రమైన వాటిని మీరు అనుభూతి చెందగలరు. 

కాబట్టి, మీరు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడడం మాని, మీ అంతర్వాణిపై దృష్టి సారించండి. అప్పుడు అది మీకు ఏదో చెప్పాలని చూస్తుంది. దానిని చెప్పనివ్వండి. పరిపూర్ణ విశ్వాసంతో దానిని మీరు పూర్తిగా నమ్మండి. అలా నమ్మడం ద్వారా మీరు దానిని పోషించినట్లవుతుంది. అప్పుడే అది మీలో చాలా చక్కగా ఎదుగుతూ బలపడుతుంది.

తర్కబద్ధంగా ఆలోచిస్తూ, ఎప్పుడూ అనుమానించే తత్వంతోపాటు, పాశ్చాత్య తాత్విక ఆలోచనాధోరణిపై గట్టి పట్టున్న వివేకానందుడు ‘దేవుడు లేడని నేను నిరూపించగలను’ అన్నాడు. నిరక్షరాస్యుడు, విద్యావిహీనుడైన రామకృష్ణ పరమహంసతో. వెంటనే ఆయన ‘‘సరే నిరూపించు’’ అన్నారు.

వెంటనే వివేకానందుడు అనేక తర్కబద్ధమైన ఉదాహరణలతో తన వాదనను వినిపించాడు. వాటిని విన్న రామకృష్ణ పరమహంస ‘‘నువ్వు చెప్పినవన్నీ కేవలం వాదనలే. నాకు అత్యంత ప్రామాణికమైన నా అంతర్వాణి నాతో ‘దేవుడున్నాడు’అంటోంది. మరి నీ అంతర్వాణి ఏమంటోంది?’’ అన్నారు.

‘‘దేవుడున్నాడా, లేడా’’అనే విషయంపై అనేక పుస్తకాలు చదివి, అనేక వాదోపవాదాలు చేసిన వివేకానందుడు తన అంతర్వాణి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే ‘‘నాకు తెలియదు’’అన్నాడు వివేకానందుడు. 

‘‘నీ వాదనలు చాలా చక్కగా ఉన్నాయి. నాకు చాలా నచ్చాయి. ఇదేమీ చర్చకాదు. కానీ, దేవుడున్నాడని మాత్రం నా అంతర్వాణి నాకు చాలా స్పష్టంగాచెప్తోంది. దానిని నేను నిరూపించలేను. కానీ, నీకు కావాలంటే దానిని చూపించగలను’’అన్నాడు రామకృష్ణ పరమహంస.

ఇంతవరకు తనతో ‘‘దేవుడిని చూపించగలను’’ అని చెప్పిన వ్యక్తి ఎవరూ లేరని ఆలోచనలోపడిన వివేకానందుని ఒక్క తోపుతో కింద పడేసిన రామకృష్ణ పరమహంస అతని గుండెలపై కాలుపెట్టి గట్టిగా నొక్కాడు. వెంటనే ఏదో శక్తి అతనిలోకి ప్రవహించడంతో వివేకానందునికి ఏదో మైకం కమ్మినట్లైంది. 

మూడు గంటల తరువాత కళ్ళు తెరిచిన వివేకానందునికి కొత్తగా ఏదో నిర్మలమైన, ప్రశాంతమైన, పరమానందం తనలో పొంగి ప్రవహిస్తున్నట్లు తెలిసింది. అప్పుడు రామకృష్ణ పరమహంస అతనితో ‘ఇప్పుడు చెప్పు. దేవుడున్నట్లా, లేనట్లా?’’అన్నాడు. వెంటనే వివేకానందుడు ఆయన పాదాలపై పడి ‘దేవుడున్నాడు’ అన్నాడు.

కాబట్టి, దేవుడు ఒక వ్యక్తి కాదు. అత్యున్నత శ్రేయోభావ చైతన్యమే దేవుడు. అది మీ ఇంట్లో మీకున్న సౌకర్యం లాంటిది. ఇంకా చెప్పాలంటే, ‘‘ఈ ప్రపంచం నాది, నేనే ఈ ప్రపంచం. ఇక్కడ నేను పరదేశిని కాదు, గ్రహాంతరవాసిని కాదు. నేను, ఈ విశ్వం విడివిడిగా లేము. నేనే ఈ విశ్వం, ఈ విశ్వమే నేను’’ అనే అత్యున్నత అస్తిత్వ భావానుభవమే ‘దేవుడు’.

మీ అంతర్వాణి పనిచేసేందుకు మీరు పూర్తిగా అంగీకరించినప్పుడు మాత్రమే ఆ అనుభవం మీకు దక్కుతుంది. కాబట్టి, వెంటనే దానిని అంగీకరించడం ప్రారంభించండి. అలాగే, దానికి మీరు ఇవ్వగల అవకాశాలన్నీ ఇవ్వండి. అంతేకానీ, బాహ్య అధికారుల అభిప్రాయాల కోసం మీరు ఎప్పుడూ ఎదురు చూడకండి.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 182 / Sri Lalitha Chaitanya Vijnanam - 182 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |*
*నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖*

*🌻 182. 'నిష్క్రియా' 🌻*

ఏ విధమగు క్రియలూ లేనిది శ్రీమాత అని అర్థము.

శుద్ధ చైతన్యముగ శ్రీమాత నిష్క్రియ. ఆమెకు నిర్వర్తించవలసిన కర్తవ్యములు లేవు. చేయవలసినవి లేవు. చేయకూడనివి లేవు. చేయ వలసినవి ఉన్నప్పుడే, చేయకూడనివి కూడ ఉండును. అవి ద్వంద్వములు. వీనినే విధి, నిషేధ క్రియలందురు. అనగా చేయవలసినవి, చేయకూడనివి. శ్రీమాతకు కారణమూ లేదు. కర్తృత్వమూ లేదు. 

సృష్టి ఆమెనుండి ఏర్పడిన ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తుల ఆధారముగ ఏర్పడుచున్నది. ఆమెనుండి ఏర్పడిన వానినుండి కర్తృత్వము, కారణము లేర్పడుచున్నవి. అందువలన ఆమె నిష్క్రియ,
నిష్కారలు. అది సున్నితమూ, సూక్ష్మమూ అయిన అవగాహన, ఉదాహరణలతో దీనినవగాహన చేసుకొనవచ్చును. 

1. మంచి గంధము ఉన్నచోట సువాసన వ్యాపించుచుండును. గంధము వ్యాపింపజేయు కార్యముండుండదు. తానుండుటయే గాని, సువాసనలు వ్యాపింపజేయు కార్యము తనకు లేదు. 

2. అయస్కాంతమున్నది. పరిసరమందలి ఇనుపముక్కలు దానివలన, దాని సాన్నిధ్యమున అయస్కాంతీకరణము చెందు చుండును. కానీ అయస్కాంతము, అయస్కాంతీకరణము

3. చేయవలెనని ప్రయత్నము చేయదు. అ కర్తృత్వము అయస్కాంతమునకు లేదు. దీపపు కాంతిలో జీవలు కార్యక్రమములను నిర్వర్తింతురు. కొందరు సత్కార్యములను చేయుదురు. కొందరు దుష్కార్యములను చేయుదురు. 

పై విధములగు కార్యములకు దీపపు కాంతి కారణము కాదు. దీపమున్నచోట చేరి లలితా సహస్రనామ పారాయణ చేయవచ్చును. మద్యపానమూ చేయవచ్చును. 

ఈ వైవిధ్యములకు దీపము కారణము కాదు. దీపము ఉండుట తప్ప ఏమియూ చేయుట లేదు. శ్రీమాత మసలో చైతస్యమువలె ఉన్నది. చైతన్యమాధారముగనే జీవులు తమ తమ కార్యక్రమములను నిర్వర్తించుకొను చున్నారు. కార్యముల వైవిధ్యముతో శ్రీమాతకు సంబంధము లేదు. 

ఉదయముననే మేల్కాంచిన జీవులు చైతన్యవంతులు అగుచున్నారు. అటుపైన వారి వారి స్వభావములనుండి వారి వారి క్రియలూ, కారణములూ ఏర్పడుచున్నవి. 

చైతన్యము లేనిదే స్వభావముల కాధారము లేదు. కార్యకారణములు స్వభావమునకు సంబంధించినవే గాని వారి యందలి చైతన్యమునకు సంబంధించినవి కావు. సృష్టి నిర్మాణము ఎందులకు జరుగుచున్నది? జీవులు కోరు కొనుటవలన జరుగుచున్నది. 

జీవులు అసంపూర్ణులు. పరిపూర్ణతకై ప్రయత్నించుచుందురు. జ్ఞానము, అజ్ఞానముతో కూడిన కార్యములు చేయుచు, అనుభవమును గడించుచు, పరిణామము చెందుచు నుందురు. వారి కోరిక మేరకు ప్రకృతి పురుషులు సృష్టి నిర్మాణమునకు తమ సాన్నిధ్యము నందించుచున్నారు. వారికి కర్తృత్వము లేదు. వారుండుట వలన సమస్త సృష్టి ఏర్పడి, వృద్ధి చెంది, అంతమగు చుండును.

ఇంతలో కొందరు జీవులు పరిపూర్ణు లగుదురు. మిగిలిన వారికొఱకు మరల సృష్టి ఏర్పాటు గావింపబడును. ఇట్లు అనంత కోట్ల జీవులు తరించుటకు అనంతముగ సృష్టి ఏర్పడుట, వృద్ధి చెందుట, లయమగుట విరుగచున్నది. ఈ మొత్తమునకు శ్రీమాత వెండితెర వంటిది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 182 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Niṣkriyā निष्क्रिया (182) 🌻*

She does not get involved in actions. She is the kinetic energy and vimarśa form of the Brahman or Śiva and as such She cannot be without action. As discussed earlier, Brahman is the combination of static and kinetic energies. It is obvious that kinetic energy is always associated with action.  

But, if one looks at this nāma from the angle of nirguṇa Brahman (the formless form) She does not get involved in action, as the Brahman does not get associated with actions but acts only as a witness.

Secondly, only the physical body is subjected to actions and such actions may be good or bad. Depending on such actions, karma-s accrue to the soul. Chāndogya Upaniṣad (VIII.xii.1) says, that one without a physical body is not affected by good or evil actions. Karmas affect only the physical body.  

The Upaniṣad points out that a Self-realized person though has a gross body, he does not take cognizance of his body as he does not consider himself different from the Brahman. For such persons, their actions do not create karma-s.

Kṛṣṇa explains this in Bhagavad Gīta (III.17). “He, who takes delight in the self alone and is gratified with Self, and is contended in the self, has no duty.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 523 / Bhagavad-Gita - 523 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 06 🌴*

06. న తద్ భాసయతే సూర్యో న శశాఙ్కో న పావక: |
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ||

🌷. తాత్పర్యం : 
అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచేగాని లేదా అగ్ని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరినవారు తిరిగి ఈ భౌతిక జగమునకు మరలిరారు.

🌷. భాష్యము :
కృష్ణలోకముగా (గోలోకబృందావనము) తెలియబడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ధామము (ఆధ్యాత్మికజగము) ఇచ్చట వర్ణింపబడినది.

ఆధ్యాత్మికలోకములన్నియును స్వయంప్రకాశమానములు కనుక ఆధ్యాత్మికజగత్తు నందు సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని, విద్యుత్తుల అవసరము లేదు. 

ఈ విశ్వములో సూర్యుడొక్కడే స్వయం ప్రకాశమానుడు. కాని ఆధ్యాత్మిక జగత్తులోని లోకములన్నియు స్వయం ప్రకాశమానములే. వైకుంఠలోకములుగా పిలువబడు ఆ లోకముల ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతి యనబడు తేజోమయ ఆకాశమును రూపొందించును. 

వాస్తవమునకు ఆ కాంతి కృష్ణలోకమైన గోలోకబృందావనము నుండియే బయల్వెడలుచున్నది. ఆ తేజపు అతికొద్దిభాగము మహత్తత్త్వముచే (భౌతికజగము) కప్పుబడినను మిగిలిన భాగమంతయు వైకుంఠములని పిలువబడు ఆధ్యాత్మికలోకములచే నిండియుండును. ఆ లోకములలో ముఖ్యమైనదే గోలోకబృందావనము.

అంధకారబంధురమైన ఈ భౌతికజగము నందున్నంత కాలము జీవుడు బద్ధజీవనమును గడిపినను, మిథ్యా సంసార వృక్షమును ఖండించుట ద్వారా ఆధ్యాత్మికలోకమును చేరినంతనే ముక్తుడగును. అటు పిమ్మట అతడు ఈ భౌతికజగమునకు తిరిగివచ్చు అవకాశమే లేదు.

 బద్ధజీవనమున జీవుడు తనను తాను భౌతికజగమునకు ప్రభువుగా తలచినను, ముక్తస్థితిలో మాత్రము ఆధ్యాత్మికజగమును చేరి శ్రీకృష్ణ భగవానునికి సహచరుడై నిత్యానందమును, నిత్యజీవనమును, సంపూర్ణజ్ఞానమును పొందును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 523 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 15 - Purushothama Yoga - 06 🌴*

06. na tad bhāsayate sūryo
na śaśāṅko na pāvakaḥ
yad gatvā na nivartante
tad dhāma paramaṁ mama

🌷 Translation : 
That supreme abode of Mine is not illumined by the sun or moon, nor by fire or electricity. Those who reach it never return to this material world.

🌹 Purport :
The spiritual world, the abode of the Supreme Personality of Godhead, Kṛṣṇa – which is known as Kṛṣṇaloka, Goloka Vṛndāvana – is described here. In the spiritual sky there is no need of sunshine, moonshine, fire or electricity, because all the planets are self-luminous. We have only one planet in this universe, the sun, which is self-luminous, but all the planets in the spiritual sky are self-luminous.

The shining effulgence of all those planets (called Vaikuṇṭhas) constitutes the shining sky known as the brahma-jyotir. Actually, the effulgence is emanating from the planet of Kṛṣṇa, Goloka Vṛndāvana. 

Part of that shining effulgence is covered by the mahat-tattva, the material world. Other than this, the major portion of that shining sky is full of spiritual planets, which are called Vaikuṇṭhas, chief of which is Goloka Vṛndāvana.

As long as a living entity is in this dark material world, he is in conditional life, but as soon as he reaches the spiritual sky by cutting through the false, perverted tree of this material world, he becomes liberated. Then there is no chance of his coming back here. 

In his conditional life, the living entity considers himself to be the lord of this material world, but in his liberated state he enters into the spiritual kingdom and becomes an associate of the Supreme Lord. There he enjoys eternal bliss, eternal life, and full knowledge.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -126 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 11

*🍀. 9. యోగి - కర్మ నిర్వహణము - ఆత్మశుద్ధి గల యోగులు సంగము లేక కర్మ నిర్వర్తింతురు. కర్మ నిర్వహణము శరీరము చేత, యింద్రియముల చేత, మనసు చేత నిర్వర్తింప చేయుచున్నను, యోగమున నిలచియే చేయుదురు. శరీరము, యింద్రియములు, మనసు ఈ మూడింటిని కలిపి దేహ మందురు. దానిని ధరించినవాడు మానవుడు. బుద్ధియందు దైవస్మరణమున నుండుటచే దైవముతో యోగము చెంది యుండును. దైవముతో యోగము చెందుట వలన కర్మల యందు సంగము లేక నిర్వర్తించుట ఏర్పడును. మననము వలన మానవుని బుద్ధి దైవముతో యోగము చెందియుండును. అట్టి వాడు యోగయుక్తుడు. 🍀*
 
11. కాయేన మనసా బుద్ద్యా కేవలై రింద్రియై రపి |
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్యా 2 2 త్మ శుద్ధయే || 11

ఆత్మశుద్ధి గల యోగులు సంగము లేక కర్మ నిర్వర్తింతురు. కర్మ నిర్వహణము శరీరము చేత, యింద్రియముల చేత, మనసు చేత నిర్వర్తింప చేయుచున్నను, యోగమున నిలచియే చేయుదురు. శరీరము, యింద్రియములు, మనసు ఈ మూడింటిని కలిపి దేహ మందురు. దానిని ధరించినవాడు మానవుడు. 

మానవుడు, అతని దేహము అను వర్గీకరణము అవగాహన నిచ్చును. సదవగాహన గల మానవుడు బుద్ధియందుండి మనసు, యింద్రియములు, శరీరమును తన వాహనముగ వినియోగించుచు కర్మల నాచరించును. 

అట్లాచరించు వాడు బుద్ధియందు దైవస్మరణమున నుండుటచే దైవముతో యోగము చెంది యుండును. దైవముతో యోగము చెందుట వలన కర్మల యందు
సంగము లేక నిర్వర్తించుట ఏర్పడును. కేవలము సంగము లేక కర్మలను నిర్వర్తించుట సాధ్యము కాదు. 

బుద్ధి సంగము దైవముతో నున్నపుడు కర్మముతో నుండదు. అందులకే ముందు శ్లోకము నందు మననము తెలుపబడినది. బ్రహ్మమును స్మరించుచు యుండుటయే యిచ్చట తెలిపిన మననము. మననము వలన మానవుని బుద్ధి దైవముతో యోగము చెందియుండును. 

అట్టి వాడు యోగయుక్తుడు. యోగయుక్తుడు క్రమముగ జితేంద్రియు డగునని, జయింపబడిన మనసు గల వాడగునని, కల్మషములు తొలగిన వాడగునని, సర్వభూతముల యందలి ఆత్మ తత్వము నెరిగిన వాడగునని, కర్మలయందు సంగమము కూడ తొలగిన వాడగునని 6,7,8,9 శ్లోకములందు తెలుపబడినది. 

పాఠకులకు అదే విషయమును మరల మరల తెలియపర్చుట ముఖ్యము. 'చర్విత చర్వణము' అనునది సాధన మార్గమున అతిముఖ్యము. తెలిసిన దానినే మరల మరల తెలియ చెప్పుట బోధన మగును. 

పై విధముగ నేర్పడుటకు కారణము కర్మ జ్ఞాన యోగ మందలి సూత్రములను క్రమముగ ఆచరించుటే. అట్లాచరించని వానికి ఈ స్థితి ఏర్పడదు. ఈ అధ్యాయమున ప్రత్యేకముగ తెలుప బడిన సూత్రము కోరిక, ద్వేషములను విసర్జించుట, మననము హృదయమున చేయుచు నుండుట, అందరి యందలి ఈశ్వరుని గుర్తించుట. 

వీటికారణమున నీటి బిందువులు అంటని తామరాకు వలె కర్మఫలము లంటని యోగి ఏర్పడును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 326 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
82. అధ్యాయము - 37

*🌻. యజ్ఞ విధ్వంసము - 2 🌻*

వేగముగా వచ్చుచున్న చక్రమును చూచి వీరుడు, బలశాలియగు క్షేత్రపాలుడు దానికి ఎదురేగి, దానిని వెంటనే మ్రింగివేసెను(19) శత్రు నగరమును జయించు విష్ణువు తన చక్రము నాతడు మ్రింగివేయుటను గనెను. ఇంతలో అతడు నోటిని అధికముగా విడదీసి ఆ చక్రమును బయటకు గ్రక్కెను(20) మహానుభవుడు, జగత్తునకు ఏకైక రక్షకుడునగు విష్ణువు తన చక్రమును స్వీకరించి మిక్కిలి కోపించెను. మహాబలుడగు విస్ణువు క్రుద్ధుడై అనేక ఆయుధములను, అస్త్రములను ధరించి వీరులగు ఆ గణములతో యుద్దమును చేసెను(21)

విష్ణవు భయంకరమగు పరాక్రమమును ప్రదర్శించుచూ, అనేక ఆయుధములను ప్రయోగించి, వారితో సంకులమగు మహా యుద్ధమును చేసెను(22) అపుడు భైరవుడు మొదలగు వారు మిక్కిలి కోపించి గొప్ప తేజస్సు గలవారై అనేక అస్త్రములను ప్రయోగించుచూ, ఆయనతో యుద్ధమును చేసిరి(23) ఇట్లు వారు యుద్దమును చేయుచుండుటను గాంచి సాటిలేని తేజస్సు గల విష్ణువు వెనుకకు మరలి వచ్చి వారిని ఎదుర్కొని స్వయముగా వరితో యుద్ధమును చేసెను(24) అపుడు మహా తేజశ్శాలి, లక్ష్మీపతి అగు విష్ణుభగవానుడు క్రోధమును పొంది చక్రమును చేతబట్టి ఆ వీరభద్రునితో యుద్ధమును చేసెను(25)

ఓ మహర్షీ! మహావీరుడగు వీరభద్రుడు, శేషశాయియగు విష్ణువు అనేక అస్త్రములను ధరించి, శరీరమునకు గగుర్పాటుకలిగించే అతి భయంకరమగు యుద్ధమునుచేసిరి(26) దేవదేవుడగు ఆ విష్ణువు యొక్క యోగబలముచే భయంకారాకారులు, శంఖుమును చక్రమును గదను చేతులయందు ధరించినవారునగు విష్ణుగణములు లెక్కలేనంతమంది పుట్టిరి(27).విష్ణువుతో సమమగు బలము గలవారు, అనక ఆయుధములను ధరించిన వారు అగు ఆ విష్ణువుగణములు కూడా తేజశ్శాలియగు ఆ వీరభద్రునితో యుద్ధమును చేసిరి(28). వీరుడగు వీరభద్రుడు శివప్రభుని స్మరించి, నారాయణునితో సమమగు తేజస్సుగల వారినందరినీ శూలముతో సంహరించి భస్మము చేసెను(29)

అపుడు మహాబలుడగు వీరభద్రుడు యుద్ధరంగమునందు త్రిశూలముతో ఆ విష్ణువును వక్షస్థ్సలమునందు లీలగా పొడిచెను(30). ఓ మహర్షీ! అపుడు పురుషోత్తముడగు విష్ణువు ఆ శూలఘాతముచే గాయపడినవాడై, వెనువెంటనే స్పృహను గోల్పోయి భూమిపై బడెను(31). అపుడు ప్రలయాకాలగ్నివలె ప్రకాశించునది, ముల్లోకములను తగలబెట్టునది, తీవ్రమైనది, వీరులకు గూడ భయమును గొల్పునది అగు తేజస్సు యజ్ఞము నుండి ఉద్భవించెను(32) పురుషోత్తముడు, లక్ష్మీపతి అగు ఆ విష్ణువు ప్రభుడు మరల లేచి, క్రోధముచే ఎర్రనైన నేత్రముల గలవాడై చక్రమును చేతబట్టి వీరభద్రునిపై దాడి చేయుటకు సంసిద్ధుడాయెను(33)

  దైన్యములేని మనస్సు గలవాడు, శివప్రభునిస్వరూప భూతుడు అగు వీరభద్రుడు మిక్కిలి భయంకరమైనది, ప్రలయకాలయందలి సూర్యునితో సమమగు కాంతి గలది అగు ఆ విష్ణువ యొక్క చక్రమును స్తంభింపజేసెను(34) ఓ మహర్షీ! హరియెక్కచేతియందలిచక్రము మాయాధీశుడు, మహాప్రభువు అగు శంభుని ప్రభావముచే నిశ్చిత్తముగా స్తంభింప చేయబడి కదలకుండెను(35) 

అపుడు తేజశ్శాలి, గణాధీశుడు అగు ఆ వీరభద్రునిచే స్తంభింపచేయబడిన విష్ణువు పర్వతము వలె కదలిక లేకుండగా నిలబడెను(36) ఓ నారద! వీరభద్రనిచే స్తభింపజేయబడిన విష్ణువు ఆ స్తంభన శక్తిన నిర్వీర్యము చేయుట కొరకై భృగు మహర్షిని పిలువగోరెను(37) ఓ మహర్షీ! ఇంతలో స్తంభననుండి విడుదలపొందిన లక్ష్మీపతి శార్‌ఙ్గమని ప్రసిద్ధిగాంచిన తన ధనస్సును , బాణములను క్రోథముతో చేబట్టెను(38)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 79 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 6 - THE 9th RULE
*🌻 9. Desire only that which is within you. - The only light that can be shed upon the Path - 1 🌻*

315. Originally we had a most beautiful statement of philosophy – the one philosophy that lies behind all religions. When the Gospel story, which was meant as an allegory, was degraded into a pseudo-historical account of the life of a man the religion became incomprehensible.

Consequently all the texts which really refer to this higher side of things have been distorted, and of course, they will not fit in with the truth which lies behind the idea. Because Christianity has forgotten much of its own original teaching, in these days it is customary to deny that it could ever have possessed any esoteric teaching. 

The spiritual man has the Gnosis, and therefore understands that all the incidents related therein – the birth, the initiation, the illumination, and the ascension happened not once only in one place, but are steps in the spiritual life of every man as he progresses.

316. Modern orthodoxy still bases its beliefs on the ignorant faith of the undeveloped multitude, and persists in disowning what now remains of its once magnificent heritage, in the shape of a few priceless fragments of the Gnostic teaching. Having lost the higher interpretation it makes a desperate effort to present the lower one in a comprehensible form, but that cannot be done. 

Students of Theosophy have the knowledge which enables them to interpret all these strange doctrines, and to see sense and beauty even in the crude utterances of the street preacher, because they understand what he would mean if only he knew a little more about his subject.

317. So what we are to desire is that which is within ourselves all the time; we shall not find it elsewhere. This very same idea was presented to us long ages ago in ancient Egypt. There they centred all their ideas of religion in “the hidden light” and “the hidden work”.

“The hidden light” was the Light that is in every man, and “the hidden work” was that which would enable him to manifest it, to bring it out in himself and then to help its development in others. 

That was the cardinal point of their creed – that the Light is there, however much it may be overlaid: and however hopeless it may appear, our work is to withdraw the veils and let the Light shine forth.

318. People often make the mistake of looking for it elsewhere. They say: “We want the Masters to help us; we want the Masters to raise us.” 

But I say, with the greatest reverence and respect, the Master cannot do that, the Logos Himself cannot do it. The Master can tell us how we may raise ourselves. The process is exactly analogous to the development of strength in the muscle. 

No one can do that for another, but if he has the knowledge he can tell him how to do it for himself, and that is all the help one can have from outside. Another person can tell us that he followed certain rules and exercises and found that they brought good results. 

The Master or the advanced pupil can also undoubtedly pour upon us force which makes our work easier, but that is all. It is the same all the way through. If we do not feel within us the power to respond to the beauty and glory of nature, that beauty and glory will pass us by. If we cannot see God within ourselves, it is useless to look for Him outside. 

When we have realized ourselves as part of Him, then will the God within respond to the God without, and we shall begin to be really useful in His work, which, after all, is our chief object in life.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 211 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. వ్యాసమహర్షి - 3 🌻*

15. భారతయుద్ధం గురించి సంజయుడుఊ రోజూ ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చుని అతడికి అర్థమయ్యేటట్లు చెప్పగలిగే విద్యనుకూడా సంజయుడికి వ్యాసుడే ఇచ్చాడు. 

16. దివారాత్ర పర్యంతములు, రహస్యప్రకార భాషణములు, ఇతరుల మనోవృత్తుల్లోని భావాలు, అంటే యుద్ధరంగంలో అర్జునుడికి కృష్ణుడేమి బోధిస్తాడో, అవి, మనోగతాభిప్రాయాలు మొదలైనవన్నీ తెలుసుకుని చెప్పే శక్తిని సంజయుడికి ఇచ్చాడు వ్యాసుడు. 

17. అంతే కాక అతి శీఘ్రగమనము, శస్త్రాస్తముల వలన ఏమీ బాధలేకుండా ఉండటమూ సంజయుడికి ఇచ్చాడు. అందుకే ధృతరాష్ట్రుడికి అంత స్పష్టంగా యుద్ధం గురించి వివరించగలిగాడు. వ్యాస భగవానుడు త్రికాలవేది. మహాభారతాన్ని ఎందుకు వ్రాసాడంటే, ఆయన ఆ సంఘటనల ముందువెనుకలు తెలిసినవాడు. 

18. మహాభారత ఘట్టాలు చూచినవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సంఘటనను అనేకమంది చూచారు. ఎవరు ఎవరిని చంపారు, ఎవరు ఎప్పుడు పుట్టారు అనే సమాచారం చాలామందిదగ్గర ఉంది. మరి ఆయ్న ఒక్కడే ఎందుకు వ్రాయాలి? అంటే, ఆ జీవులెవరో, ఆ పూర్వ చరిత్రలేమిటో, వాళ్ళ పుణ్యవిశేషాలేమిటో, ఎందుకు ఈ సంఘటనలు జరిగినవో, వాటివెనుక ఉండే రహస్యాలేమిటో అవన్నీ తెలిసున్నాడాయన. 

19. ప్రతి సంఘటన, ప్రతీజీవి యొక్క మూలకారణాలు తెలిసినవాడు కాబట్టే ఆయనే ‘మహాభారతం’ వ్రాసాడు. ఆయన ఒక్కడే భారతం చెప్పగలిగినవాడు. ‘పంచమవేదం’ అని దానికి పేరు. మూడు సంవత్సరాలలో ఆయన భారతాన్ని వ్రాసాడట.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 275 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 124. The absence of 'I am' is not experienced by 'someone'; it has to be understood in such a manner that the experiencer and the experience are one. 🌻*

You are so deeply rooted in duality that you always feel that there must be 'someone' who will experience nothingness, the void, space or the absence of 'I am'. 

It is impossible for the mind to conceive of a state of non-duality because it can function only in a dual or subject-object mode. Thus, obviously, the mind has to stop or you have to transcend the mind, and for that to happen you have to come to the 'I am', which is the point from where the mind begins. 

When you abide in the 'I am', a moment comes when it disappears and then the experiencer and the experience merge and what remains is your true natural state, beyond words or description.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 150 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 29 🌻*

*🌷. ఐక్య అస్తిత్వము - సత్య గోళం - 2 🌷*

598. తజల్లీ=దివ్యతేజస్సు,నూర్, ఈశ్వరీయ ప్రకాశము.
జమాలీ = (సత్య సుందరుడు) పరమ రూపవంతుడు , భగవద్విశేషము
జలాలీ=పరమ తేజోవంతుడు,(భగవద్విశేషము) , పరాక్రమవంతుడు.

599. తజల్లీ-ఎల్-జమాలీ:- (ఐక్య అస్తిత్వము) పరాత్పర స్థితిలో ఇది మొదటి హద్దు దీనిని లాహూత్ అందురు. ఇది జ్ఞేయ అస్తిత్వము వలన ఉపయోగింప బడినప్పుడు, అతనికి "ఫనా""బకా" ల యొక్క అనుభవము నిచ్చును. ఈ స్థితి- ఆధ్యాత్మిక మార్గమందలి ఇతర అవస్థలవలెనే, మనోబుద్ధులకు అతీతమైయుండును అనిర్వచనీయము.

600. ఒకనిలోనే ప్రేమికుడు- ప్రియతముడు
ఆలమ్-ఏ-హాహుత్ లో ఏక కాలమందే ప్రేమికుడు ప్రియతముడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 6 / Sri Lalita Sahasranamavali - Meaning - 6 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀 6. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా |
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా ‖ 6 ‖ 🍀*

17) వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : 
ముఖమనెడు మన్మథుని శుభమైన నివాసమునకు తోరణమువలె ఒప్పు కనుబొమలు కలిగినది.

18) వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా : 
ముఖదీప్తి అనెడు సంపదప్రథమైన స్రోతస్సునందు కదలాడుచున్న చేపలవలె ఒప్పుచుండు కన్నులు కలిగినది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 6 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 6. vadanasmara-māṅgalya-gṛhatoraṇa-cillikā |*
*vaktralakṣmī-parīvāha-calanmīnābha-locanā || 6 || 🌻*

17 ) Vadana smara mangalya griha thorana chillaka -  
She who has beautiful eyelids which look like the ornaments to her face which is like cupids home

18 ) Vakthra lakshmi - parivaha - chalan meenabha lochana -   
She who has beautiful eyes which look like fish in the pond of her face

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 6 / Sri Vishnu Sahasra Namavali - 6 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻* 

*భరణి నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🍀 6. అప్రమేయో హృషీకేశః* *పద్మనాభోఽమరప్రభుః |*
*విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ‖ 6 ‖ 🍀*

🍀 46) అప్రమేయ: - 
ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.

🍀 47) హృషీకేశ: - 
ఇంద్రియములకు ప్రభువు.

🍀 48) పద్మనాభ: - 
నాభియందు పద్మము గలవాడు.

🍀 49) అమరప్రభు: - 
దేవతలకు ప్రభువైనవాడు.

🍀 50) విశ్వకర్మా - 
విశ్వరచన చేయగల్గినవాడు.

🍀 51) మను: - 
మననము(ఆలోచన) చేయువాడు.

🍀 52) త్వష్టా - 
ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.

🍀 53) స్థవిష్ఠ: - 
అతిశయ స్థూలమైన వాడు.

🍀 54) స్థవిరోధ్రువ: - 
సనాతనుడు, శాశ్వతుడైనవాడు. కాలముతో మార్పు చెందక, ఒకే తీరున, స్థిరముగా ఉండెడివాడు 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 6 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka For Bharani 2nd Padam*

*🌻 aprameyō hṛṣīkeśaḥ* *padmanābhōmaraprabhuḥ |*
*viśvakarmā manusvtaṣṭā* *sthaviṣṭhassthavirō dhruvaḥ || 6 || 🌻*

🌻 46) Aprameya – 
The Lord Who is Beyond Rules, Regulations and Definitions

🌻 47) Hrishikesha – 
The Lord of Senses

🌻 48) Padmanabha – 
The Lord Who has a Lotus (From Which the World Evolved) Growing on his Belly

🌻 49) Amara Prabhu – 
The Lord of Immortals

🌻 50) Vishwa-Karma – 
The Creator of the Universe

🌻 51) Manu – 
The Lord Who Thinks (Worries) of Everything

🌻 52) Twashta – 
The Lord Who Makes Huge Things Small

🌻 53) Sthavishtha – 
The Supremely Gross

🌻 54) Sthaviro-Dhruva – 
The Lord Who is Ancient and Permanent

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 2 /Bhagavad-Gita - 2 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 2 🌴

సంజయ ఉవాచ :
2. దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూడం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||

🌷. తాత్పర్యం :
సంజయుడు పలికెను: ఓ రాజా! పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను.

🌷. భాష్యము: 
ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మికదృష్టి సైతము లోపించెను. ధర్మవిషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతడు ఎరిగియుండెను. పుట్టుక నుండియు ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒడంబడికకు లాలేరని అతడు నిశ్చయముగా తెలిసియుండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై యుండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతము చేసికొనగలిగెను. 

కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజాను ఉత్సాహపరచనెంచి, పవిత్రస్థలముచే పవిత్రులైన అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరుగబోదని ఆశ్వాసము నొసగెను. పాండవసేనాబలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజ్జస్థితిని ఎరుకపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతియైన ద్రోణాచార్యుని చెంతకు చేరేనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పెర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రత ననుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసివచ్చెను. కనుకననే రాజకీయవేత్త యనుటకు అతడు చక్కగా తగియున్నాడు. కాని పాండవ సేనా వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగపరచలేకపోయెను.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 BhagavadGita As it is - 2 🌹
✍️. Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

🌴 Chapter 1 - Vishada Yoga - 2 🌴

2. sañjaya uvāca : 
dṛṣṭvā tu pāṇḍavānīkaṁ vyūḍhaṁ duryodhanas tadā ācāryam upasaṅgamya rājā vacanam abravīt

🌷 TRANSLATION: 
Sañjaya said: O King, after looking over the army arranged in military formation by the sons of Pāṇḍu, King Duryodhana went to his teacher and spoke the following words.

🌷 PURPORT: 
Dhṛtarāṣṭra was blind from birth. Unfortunately, he was also bereft of spiritual vision. He knew very well that his sons were equally blind in the matter of religion, and he was sure that they could never reach an understanding with the Pāṇḍavas, who were all pious since birth. Still he was doubtful about the influence of the place of pilgrimage, and Sañjaya could understand his motive in asking about the situation on the battlefield.

Sañjaya wanted, therefore, to encourage the despondent king and thus assured him that his sons were not going to make any sort of compromise under the influence of the holy place. Sañjaya therefore informed the king that his son, Duryodhana, after seeing the military force of the Pāṇḍavas, at once went to the commander in chief, Droṇācārya, to inform him of the real position.

Although Duryodhana is mentioned as the king, he still had to go to the commander on account of the seriousness of the situation. He was therefore quite fit to be a politician. But Duryodhana’s diplomatic veneer could not disguise the fear he felt when he saw the military arrangement of the Pāṇḍavas.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
Facebook group....

https://www.facebook.com/groups/1044423582726375/?ref=share

Join and Share శ్రీ లలితా చైతన్య విజ్ఞానం
Sri Lalitha Chaitanya Vijnanam

http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ 


Join and share.....
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation  

www.facebook.com/groups/vishnusahasranamatatwa/

Join and Share శ్రీమద్భగవద్గీత Bhagavad-Gita 
www.facebook.com/groups/bhagavadgeetha/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment