సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖
🌻 182. 'నిష్క్రియా' 🌻
ఏ విధమగు క్రియలూ లేనిది శ్రీమాత అని అర్థము.
శుద్ధ చైతన్యముగ శ్రీమాత నిష్క్రియ. ఆమెకు నిర్వర్తించవలసిన కర్తవ్యములు లేవు. చేయవలసినవి లేవు. చేయకూడనివి లేవు. చేయ వలసినవి ఉన్నప్పుడే, చేయకూడనివి కూడ ఉండును. అవి ద్వంద్వములు. వీనినే విధి, నిషేధ క్రియలందురు. అనగా చేయవలసినవి, చేయకూడనివి. శ్రీమాతకు కారణమూ లేదు. కర్తృత్వమూ లేదు.
సృష్టి ఆమెనుండి ఏర్పడిన ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తుల ఆధారముగ ఏర్పడుచున్నది. ఆమెనుండి ఏర్పడిన వానినుండి కర్తృత్వము, కారణము లేర్పడుచున్నవి. అందువలన ఆమె నిష్క్రియ,
నిష్కారలు. అది సున్నితమూ, సూక్ష్మమూ అయిన అవగాహన, ఉదాహరణలతో దీనినవగాహన చేసుకొనవచ్చును.
1. మంచి గంధము ఉన్నచోట సువాసన వ్యాపించుచుండును. గంధము వ్యాపింపజేయు కార్యముండుండదు. తానుండుటయే గాని, సువాసనలు వ్యాపింపజేయు కార్యము తనకు లేదు.
2. అయస్కాంతమున్నది. పరిసరమందలి ఇనుపముక్కలు దానివలన, దాని సాన్నిధ్యమున అయస్కాంతీకరణము చెందు చుండును. కానీ అయస్కాంతము, అయస్కాంతీకరణము
3. చేయవలెనని ప్రయత్నము చేయదు. అ కర్తృత్వము అయస్కాంతమునకు లేదు. దీపపు కాంతిలో జీవలు కార్యక్రమములను నిర్వర్తింతురు. కొందరు సత్కార్యములను చేయుదురు. కొందరు దుష్కార్యములను చేయుదురు.
పై విధములగు కార్యములకు దీపపు కాంతి కారణము కాదు. దీపమున్నచోట చేరి లలితా సహస్రనామ పారాయణ చేయవచ్చును. మద్యపానమూ చేయవచ్చును.
ఈ వైవిధ్యములకు దీపము కారణము కాదు. దీపము ఉండుట తప్ప ఏమియూ చేయుట లేదు. శ్రీమాత మసలో చైతస్యమువలె ఉన్నది. చైతన్యమాధారముగనే జీవులు తమ తమ కార్యక్రమములను నిర్వర్తించుకొను చున్నారు. కార్యముల వైవిధ్యముతో శ్రీమాతకు సంబంధము లేదు.
ఉదయముననే మేల్కాంచిన జీవులు చైతన్యవంతులు అగుచున్నారు. అటుపైన వారి వారి స్వభావములనుండి వారి వారి క్రియలూ, కారణములూ ఏర్పడుచున్నవి.
చైతన్యము లేనిదే స్వభావముల కాధారము లేదు. కార్యకారణములు స్వభావమునకు సంబంధించినవే గాని వారి యందలి చైతన్యమునకు సంబంధించినవి కావు. సృష్టి నిర్మాణము ఎందులకు జరుగుచున్నది? జీవులు కోరు కొనుటవలన జరుగుచున్నది.
జీవులు అసంపూర్ణులు. పరిపూర్ణతకై ప్రయత్నించుచుందురు. జ్ఞానము, అజ్ఞానముతో కూడిన కార్యములు చేయుచు, అనుభవమును గడించుచు, పరిణామము చెందుచు నుందురు. వారి కోరిక మేరకు ప్రకృతి పురుషులు సృష్టి నిర్మాణమునకు తమ సాన్నిధ్యము నందించుచున్నారు. వారికి కర్తృత్వము లేదు. వారుండుట వలన సమస్త సృష్టి ఏర్పడి, వృద్ధి చెంది, అంతమగు చుండును.
ఇంతలో కొందరు జీవులు పరిపూర్ణు లగుదురు. మిగిలిన వారికొఱకు మరల సృష్టి ఏర్పాటు గావింపబడును. ఇట్లు అనంత కోట్ల జీవులు తరించుటకు అనంతముగ సృష్టి ఏర్పడుట, వృద్ధి చెందుట, లయమగుట విరుగచున్నది. ఈ మొత్తమునకు శ్రీమాత వెండితెర వంటిది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 182 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Niṣkriyā निष्क्रिया (182) 🌻
She does not get involved in actions. She is the kinetic energy and vimarśa form of the Brahman or Śiva and as such She cannot be without action. As discussed earlier, Brahman is the combination of static and kinetic energies. It is obvious that kinetic energy is always associated with action.
But, if one looks at this nāma from the angle of nirguṇa Brahman (the formless form) She does not get involved in action, as the Brahman does not get associated with actions but acts only as a witness.
Secondly, only the physical body is subjected to actions and such actions may be good or bad. Depending on such actions, karma-s accrue to the soul. Chāndogya Upaniṣad (VIII.xii.1) says, that one without a physical body is not affected by good or evil actions. Karmas affect only the physical body.
The Upaniṣad points out that a Self-realized person though has a gross body, he does not take cognizance of his body as he does not consider himself different from the Brahman. For such persons, their actions do not create karma-s.
Kṛṣṇa explains this in Bhagavad Gīta (III.17). “He, who takes delight in the self alone and is gratified with Self, and is contended in the self, has no duty.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
17 Jan 2021
No comments:
Post a Comment