భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 211


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 211 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. వ్యాసమహర్షి - 3 🌻


15. భారతయుద్ధం గురించి సంజయుడుఊ రోజూ ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చుని అతడికి అర్థమయ్యేటట్లు చెప్పగలిగే విద్యనుకూడా సంజయుడికి వ్యాసుడే ఇచ్చాడు.

16. దివారాత్ర పర్యంతములు, రహస్యప్రకార భాషణములు, ఇతరుల మనోవృత్తుల్లోని భావాలు, అంటే యుద్ధరంగంలో అర్జునుడికి కృష్ణుడేమి బోధిస్తాడో, అవి, మనోగతాభిప్రాయాలు మొదలైనవన్నీ తెలుసుకుని చెప్పే శక్తిని సంజయుడికి ఇచ్చాడు వ్యాసుడు.

17. అంతే కాక అతి శీఘ్రగమనము, శస్త్రాస్తముల వలన ఏమీ బాధలేకుండా ఉండటమూ సంజయుడికి ఇచ్చాడు. అందుకే ధృతరాష్ట్రుడికి అంత స్పష్టంగా యుద్ధం గురించి వివరించగలిగాడు. వ్యాస భగవానుడు త్రికాలవేది. మహాభారతాన్ని ఎందుకు వ్రాసాడంటే, ఆయన ఆ సంఘటనల ముందువెనుకలు తెలిసినవాడు.

18. మహాభారత ఘట్టాలు చూచినవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సంఘటనను అనేకమంది చూచారు. ఎవరు ఎవరిని చంపారు, ఎవరు ఎప్పుడు పుట్టారు అనే సమాచారం చాలామందిదగ్గర ఉంది. మరి ఆయ్న ఒక్కడే ఎందుకు వ్రాయాలి? అంటే, ఆ జీవులెవరో, ఆ పూర్వ చరిత్రలేమిటో, వాళ్ళ పుణ్యవిశేషాలేమిటో, ఎందుకు ఈ సంఘటనలు జరిగినవో, వాటివెనుక ఉండే రహస్యాలేమిటో అవన్నీ తెలిసున్నాడాయన.

19. ప్రతి సంఘటన, ప్రతీజీవి యొక్క మూలకారణాలు తెలిసినవాడు కాబట్టే ఆయనే ‘మహాభారతం’ వ్రాసాడు. ఆయన ఒక్కడే భారతం చెప్పగలిగినవాడు. ‘పంచమవేదం’ అని దానికి పేరు. మూడు సంవత్సరాలలో ఆయన భారతాన్ని వ్రాసాడట.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


17 Jan 2021

No comments:

Post a Comment