విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 306, 307 / Vishnu Sahasranama Contemplation - 306, 307

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 306 / Vishnu Sahasranama Contemplation - 306 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 306. సహస్రజిత్‌, सहस्रजित्‌, Sahasrajit 🌻

ఓం సహస్రజితే నమః | ॐ सहस्रजिते नमः | OM Sahasrajite namaḥ

సహస్రజిత్‌, सहस्रजित्‌, Sahasrajit

సురారీణాం సహస్రాణి యుద్ధే జయతి యో హరిః ।
స సహస్రజిదిత్యుక్తో విష్ణుర్భాగతోత్తమైః ॥

యుద్ధమునందు సురారుల అనగా దేవతల శత్రువులైన రాక్షసుల సహస్రములను జయించును గావున విష్ణువు సహస్రజిత్‌.

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము::వ.ఇట్లు కేవల పురుషరూపంబును మృగరూపంబునుం గాని నరసింహ రూపంబున రేయునుం బవలునుంగాని సంధ్యాసమయంబున, నంతరంగంబును బహిరంగంబునుం గాని సభాద్వారంబున, గగనంబునుం భూమియునుం గాని యూరుమధ్యంబునఁ, బ్రాణసహితంబులును బ్రాణరహితంబులును గాని నఖంబులం ద్రైలోక్యజన హృదయ భల్లుండయిన దైత్యమల్లుని వధియుంచి మహాధన కీలాభీల దర్శనుండును, గరాళవదనుండును లేలిహానభీషణ జిహ్వుండును శోణిత పంకాంకిత కేసరుండునై ప్రేవులు కంఠమాలికలుగా ధరించి కుంభి కుంభ విదళనంబును సేసి చనుదెంచు పంచాననంబునుంబోలె దనుజకుంజర హృదయకమల విదళంబుచేసి తదీయ రక్తసిక్తంబులైన నఖంబులు సంధ్యారాగ రక్తచంద్రరేఖల చెలువు వహింప సహింపక లేచి తన కట్టెదుర నాయుధంబు లెత్తుకొని తత్తరంబున రణంబునకు రక్కసులం బెక్కుసహస్రంబులం జక్రాదిక నిర్వక్ర సాధనంబుల నొక్కనిఁ జిక్కకుండం జక్కడిచె, ని వ్విధంబున. (299)

ఈ విధంగా కేవలం నరరూపమూ, కేవలం మృగరూపమూ కానటువంటి నరసింహరూపంతో, రాత్రీ పగలు కాని సంధ్యాసమయంలో, గృహమునకు లోపలా వెలుపలా కాని ద్వారమధ్యంలో, ఆకాశమూ భూమి కానటువంటి ఊరూ ప్రదేశంలో, ప్రాణసహితాలూ, ప్రాణరహితాలూ కాని గోళ్ళతో బ్రహ్మ ఇచ్చిన వరనియమాలకు భంగం లేకుండగా ముల్లోకాలకూ గుండెగాలమైన రాక్షసరాజును వధించాడు నరసింహస్వామి.

ఉగ్రస్వరూపంతో ఆయన దావానల జ్వాల లాగా దర్శనమిస్తున్నాడు. ఆ నరహరి ముఖం భయంకరంగా ఉన్నది. చాచిన నాలుక నాగేంద్రునిలా భీకరంగా ఉన్నది. మెడజూలు నెత్తురుతో తడిసి ఎర్రబడింది. ఆ స్వామి రాక్షసుని ప్రేవులు కంఠమాలికలుగా ధరించి ఉన్నాడు. దానవుని హృదయకమలం చీల్చివేసిన నరసింహస్వామి మత్తేభ కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజంలాగా విరాజిల్లుతున్నాడు. రక్తంతో తడిసిన ఆయన నఖాలు సంధ్యారాగరంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ రూపం చూచి కోపం పట్టలేక వేలకొలదీ అసుర వీరులు ఆయుధాలతో దానవాంతకుని పైకి దండెత్తి వచ్చారు. నరసింహస్వామి వచ్చిన వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో పెక్కువేల రక్కసులను ఒక్కడినీ విడువకుండా వధించివేశాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 306🌹

📚. Prasad Bharadwaj

🌻 306. Sahasrajit 🌻

OM Sahasrajite namaḥ

Surārīṇāṃ sahasrāṇi yuddhe jayati yo hariḥ,
Sa sahasrajidityukto viṣṇurbhāgatottamaiḥ.

सुरारीणां सहस्राणि युद्धे जयति यो हरिः ।
स सहस्रजिदित्युक्तो विष्णुर्भागतोत्तमैः ॥

Since Lord Viṣṇu is always victorious over innumerable enemies of Devas in battle, He is Sahasrajit.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 8

Nakhāṅkurotpāṭitahr̥tsaroruhaṃ visr̥jya tasyānucarānudāyudhān,
Ahansamastānnakhaśastrapāṇirbhirdordaṇḍayūtho’nupathānsahasraśaḥ. (31)

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे अष्टमोऽध्यायः ::

नखाङ्कुरोत्पाटितहृत्सरोरुहं विसृज्य तस्यानुचरानुदायुधान् ।
अहन्समस्तान्नखशस्त्रपाणिर्भिर्दोर्दण्डयूथोऽनुपथान्सहस्रशः ॥ ३१ ॥

With many, many arms, He (Lord Nr̥siṃha) first uprooted Hiraṇyakaśipu's heart and then threw him aside and turned toward the demon's soldiers. These soldiers had come in thousands to fight with Him with raised weapons and were very faithful followers of Hiraṇyakaśipu, but Lord Nṛsiḿhadeva killed all of them merely with the ends of His nails.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ || ౩౩ ||

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 307/ Vishnu Sahasranama Contemplation - 307🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻307. అనన్తజిత్‌, अनन्तजित्‌, Anantajit🌻

ఓం అనన్తజితే నమః | ॐ अनन्तजिते नमः | OM Anantajite namaḥ

అనన్తజిత్‌, अनन्तजित्‌, Anantajit

యుద్ధక్రీడాదిషు హరిః సర్వత్రాచింత్యశక్తిమాన్ ।
సర్వభూతాని జయతీత్యనంతజిదితీర్యతే ॥

ఊహించుటకు సైతము అలవికాని శక్తి కలవాడు కావున యుద్ధక్రీడాదులయందు అనంతములగు, సమస్తములగు భూతములను జయించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 307🌹

📚. Prasad Bharadwaj

🌻307. Anantajit🌻

OM Anantajite namaḥ

Yuddhakrīḍādiṣu hariḥ sarvatrāciṃtyaśaktimān,
Sarvabhūtāni jayatītyanaṃtajiditīryate.

युद्धक्रीडादिषु हरिः सर्वत्राचिंत्यशक्तिमान् ।
सर्वभूतानि जयतीत्यनंतजिदितीर्यते ॥

By His unimaginable power, He excelled all creatures in battle or sport all the times.

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 16

Ajita jitaḥ samamatibhiḥ sādhubhirbhavānˈjitātmabhirbhavatā,
Vijitāste’pi ca bhajatāmakāmātmanāṃ ya ātmado’tikaruṇāḥ. (34)

:: श्रीमद्भागवते षष्टस्कन्धे षोडशोऽध्यायः ::

अजित जितः सममतिभिः साधुभिर्भवान्‌जितात्मभिर्भवता ।
विजितास्तेऽपि च भजतामकामात्मनां य आत्मदोऽतिकरुणाः ॥ ३४ ॥

O unconquerable Lord, although You cannot be conquered by anyone, You are certainly conquered by devotees who have control of the mind and senses. They can keep You under their control because You are causelessly merciful to devotees who desire no material profit from You. Indeed, You give Yourself to them, and because of this You also have full control over Your devotees.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ || ౩౩ ||

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

24 Feb 2021

వివేక చూడామణి - 30 / Viveka Chudamani - 30

🌹. వివేక చూడామణి - 30 / Viveka Chudamani - 30 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అరిషడ్‌ వర్గాలు - 2 🍀

114. విద్యావంతులు, బుద్ధిమంతులైన వారు కూడా మరియు తెలివిగల స్థిరమైన ఆత్మ జ్ఞానము కలవారు కూడా తామస గుణానికి బందీలై, ఆత్మను గూర్చి ఎంత వివరించినను అర్థము చేసుకొన లేకున్నారు. వారు కేవలము భ్రమకు లోనై అదే నిజమని భావించి, ఆ భ్రమలకు బందీలై ఉన్నారు. ఆహా! ఎంత శక్తివంతమైనది ఈ బద్ధకముతో కూడిన తామస శక్తి.

115. తగిన నిర్ణయ శక్తి లేకపోయినా, లేక వ్యతిరేఖమైన నిర్ణయ శక్తి ఉన్నా అందుకు ఖచ్చితమైన నమ్మకము అవసరము. ఏ విధమైన అనుమానము ఉన్నా ఈ వ్యక్త శక్తి మరియు బహిర్గత శక్తి అంతము లేని కష్టాలను కలిగిస్తుంది.

116. తెలియని తనము, ఉత్సాహము లేకపోవుట, అలసట, నిద్ర, వ్యతిరేఖ భావన, జఢత్వము అనునవి తామస గుణములు. వీటికి బందీలైనవాడు దేనిని సాధించలేడు. కేవలము మత్తులో ఉండి, రాయివలె ఉండిపోతాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 30 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 The Six Evil Atributes - 2 🌻

114. Even wise and learned men and men who are clever and adept in the vision of the exceedingly subtle Atman, are overpowered by Tamas and do not understand the Atman, even though clearly explained in various ways. What is simply superimposed by delusion, they consider as true, and attach themselves to its effects. Alas ! How powerful is the great Avriti Shakti of dreadful Tamas !

115. Absence of the right judgment, or contrary judgment, want of definite belief and doubt –these certainly never desert one who has any connection with this veiling power, and then the projecting power gives ceaseless trouble.

116. Ignorance, lassitude, dullness, sleep, inadvertence, stupidity, etc., are attributes of Tamas. One tied to these does not comprehend anything, but remains like one asleep or like a stock or stone.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

24 Feb 2021

దేవాపి మహర్షి బోధనలు - 41

🌹. దేవాపి మహర్షి బోధనలు - 41 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 29. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 1 🌻

15 సంవత్సరముల వయస్సున ఆయన నాకు దర్శనమిడి నప్పుడు ఆయన విలువ నాకంతగా తెలియలేదు. గత 35 సంవత్సరములుగా నాయందు వికాస మేర్పడుచున్న కొలదీ నా గురుదేవుని విస్తీర్ణము పెరుగుచునే యున్నది. ఆయన మావంటి వారిచే కొలువ బడువాడు కాడని, కొలతల కందనివాడని తెలిసి, నా చిన్నతనము' తెలిసికొంటిని. అయన సాన్నిధ్యమే నాకు సమస్తము.

నా చిన్నతనమున నా కత్యంత సన్నిహితురాలు మా గృహ మందలి వంటమనిషి. ఆమె నన్ను కంటికి రెప్పవలె కాపాడు చుండెడిది. నన్ను గౌరవించుచునే నాకెన్నియో విషయములు తెలుపుచుండెడిది.

నా శారీరక, మానసిక అభివృద్ధికి ఆమె ఎంతయో తోడ్పడినది. ఆమె ఎందులకు నాయందు ప్రత్యేక వాత్సల్యము చూపెడిదో నాకప్పటికి అవగాహన కాలేదు. నేను చిరు ప్రాయము నుండియే అనగా 18 సం||ల ప్రాయము నుండియే మత బోధనలను చేయుచుంటిని.

మా వంటమనిషి నేను చేయు బోధనలకు కూడా స్నేహపూర్వకముగా వచ్చుచుండెడిది. బోధనలను ఆవేశముగ నిర్వర్తించి, యింటికివచ్చి, మా వంటమనిషితో గర్వముగా పలుకు చుండెడిదానను. ఆమె చిరునవ్వుతో అన్నిటికినీ తలయూపు చుండెడిది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

24 Feb 2021

సత్యానికి సదా నిర్భయమే

🌹. సత్యానికి సదా నిర్భయమే 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

దేవుణ్ణి వదలాలంటే చాలా భయంగా ఉందన్నావు. బండరాయి లాంటి ఆ దేవుడి కింద నీ భయాన్ని అణచిపెట్టావు. ఆ బండరాయిని తొలగించిన వెంటనే నీ భయం అదృశ్యమవుతుంది. అప్పుడు దేవుడు కేవలం కల్పన అని తెలుస్తుంది. ఏ ప్రార్థనలు పనిచెయ్యవు. దానితో దేవుడిపై ఉన్న నమ్మకం పోతుంది. ఒకసారి నమ్మకం పోతే అది మళ్ళీ తిరిగిరాదు.

కాబట్టి, భయం కలిగినప్పుడు దానిని ఎదుర్కోవాలో కానీ, దానిపై దేవుడి ముసుగు వేసినంత మాత్రాన ఆ భయం పోదు. ఎందుకంటే, అనుమానం వాస్తవం, నమ్మకం కట్టుకథ. సత్యం ముందు ఏ కట్టుకథ నిలబడలేదు. దానితో దేవుడు మీకు కేవలం ఒక కల్పనగానే మిగిలిపోతాడు. దానిని మీరెప్పటికీ మరువలేరు.

తెలిసిన సత్యాన్ని మర్చిపోవడం అసంభవం. అది దాని గుణాలలో ఒకటి. కాబట్టి, దానిని మీరు గుర్తుంచుకోవలసిన అవసరం లేదు. కానీ, అబద్ధాలను మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేకపోతే, వాటిని మీరు మర్చిపోవచ్చు.

సత్యానికి అలవాటుపడ్డ మనిషికన్నా అబద్ధాలకు అలవాటుపడ్డ మనిషికి చాలా జ్ఞాపకశక్తి అవసరం. ఎందుకంటే, సత్యానికి అలవాటుపడ్డ మనిషికి జ్ఞాపకశక్తితో పనిలేదు. మీరు ఎప్పుడూ సత్యాన్ని మాత్రమే చెప్పే పక్షంలో దానిని గుర్తుంచుకోవలసిన అవసరం ఏమాత్రం లేదు.

కానీ, మీరు అబద్ధాలు మాత్రమే చెప్పే పక్షంలో వాటిని మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, మీరు చాలా మందికి చాలా అబద్ధాలు చెప్తారు. ఎవరికి ఏ అబద్ధం చెప్పేరో మీకు గుర్తుండాలి కదా! లేకపోతే, కొంప మునుగుతుంది. పైగా, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది.

అలా అనేక అబద్ధాలు పుట్టుకొస్తూనే ఉంటా యి. సత్యానిది ఎప్పుడూ బ్రహ్మచర్యమే. ఎందుకంటే, అది పెళ్ళిచేసుకోలేదు. అందుకే దానికి పిల్లలు లేరు. కానీ, అబద్ధం బ్రహ్మచారి కాదు. అందుకే అది అనేక అబద్ధాలను పుట్టిస్తుంది. ఎందుకంటే, దానికి కుటుంబ నియంత్రణపై నమ్మకం లేదు.

మతాచార్యులు, రాజకీయ నాయకులు మిమ్మల్ని మనస్తత్వపరమైన నిరంతర బానిసలుగా చేసేందుకు సృష్టించిన దేవుడు కేవలం ఒక కల్పన అని మీకు అర్థమైన వెంటనే దేవుడంటే మీకున్న భయాలన్నీ పోతాయి.

అందుకే మీరెప్పుడూ భయపడుతూ ఉండాలనే వారు కోరుకుంటారు. లేకపోతే, మీరు వారికి చాలా ప్రమాదకారులుగా కనిపిస్తారు. కాబట్టి, మీరు ఆత్మగౌరవం ఏమాత్రం లేనివారుగా, భయపడుతూ లొంగిపోయేందుకు సిద్ధపడే పిరికివారుగా ఉండాలి లేదా నిర్భయులుగా ఉండాలి.

మీరు నిర్భయులైతే దేనికీ తల వంచని తిరుగుబాటు వీరుడవుతారు. దానిని మీరు నివారించలేరు. కాబట్టి, మీరు విశ్వాసమున్న వ్యక్తిగా ఉండాలి లేదా తిరుగుబాటు స్ఫూర్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. మతాచార్యులు, రాజకీయ నాయకులు మీరు తిరుగుబాటు స్ఫూర్తి కలిగిన వ్యక్తిగా ఉండాలనుకోరు.

ఎందుకంటే, మీ తిరుగుబాటు స్ఫూర్తి క్రైస్తవం, జుడాయిజం, మహమ్మదీయం, హిందూత్వాలతో మీ మనసును బలవంతంగా నిబద్ధీకరించే వారి స్వార్థ ప్రయోజనాలను ప్రశ్నిస్తుంది, వ్యతిరేకిస్తుంది. అందుకే వారు మీ అంతర్గతంలో మీరు ఎప్పుడూ వణుకుతూ ఉండేలా చేస్తారు. అదే వారి శక్తి. దానిని కోరుకునే వారికి కాల్పనిక దేవుడు చక్కగా ఉపయోగపడతాడు.

ఒకవేళ మీకు దేవుడిపై భయభక్తులుంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తారు, ఆయన పవిత్ర గ్రంథాన్ని చదువుతారు, ఆయన అవతార పురుషులు చెప్పినది చేస్తారు. అలా మీరు ఆయనను, ఆయన ప్రతినిధులను అనుసరించక తప్పదు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹

24 Feb 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 218 / Sri Lalitha Chaitanya Vijnanam - 218

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 218 / Sri Lalitha Chaitanya Vijnanam - 218 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖

🌻 218. 'మహారతి:' 🌻

అమితమైన రతి కలిగినది శ్రీమాత అని అర్థము.

మహేశ్వరుడు మహా యోగి. మహా తపస్వి. యోగులకు, తపస్వి జనులకు అతడే పరమగురువు. సృష్టియందు మొట్టమొదటగ తపస్సును ప్రారంభించినవా డతడే. సతతము పరతత్త్వమున లగ్నమై యున్న చేతస్కుడు మహాదేవుడు. అగ్ని శిఖవలె అతని చేతన మంతయూ ఊర్ధ్వమున కుండును.

అతని చేతన సృష్టియందు ప్రసరింప చేయవలెనన్నచో ఊర్ధ్వమార్గమున నున్న చేతనను ఇతర దిక్కులకు ప్రసరింప చేయవలెను కదా! అట్టి సమర్థత సృష్టియం దెవ్వరికినీ లేదు.

కాని శ్రీమాత కూడ తపస్వినియే యగుట చేత తన దీర్ఘకాల తపస్సు ద్వారా మహాదేవుని మెప్పించినది. మహాదేవుని సృష్టికామునిగ, మహాకామునిగ మరల్చినది. ఆమె కామేశ్వరియై మహాదేవునితో చేరి సర్వలోక సృష్టి నిర్మాణము గావించినది.

ఆమెకు సహకరించుచు మట్టి యందు కూడ నుండుటకు మహాదేవు డంగీకరించెను. ఎచ్చట శ్రీమాత యున్నదో, యుండునో అచ్చట శివుడు కూడ యుండును.

ఎచ్చట శివుడుండునో అచ్చట శ్రీమాత కూడ యుండును. ఒకరు లేక ఒకరు వుండుట యను ప్రశ్నయే లేదు. పరమునందైనను పదార్థము నందైననూ ఇరువురునూ యుందురు. రతి అను పదమునకు ఇది పరాకాష్ఠ. అందులకే ఆమె మహారతి.

శ్రీదేవి తన భక్తుల యెడల కూడ అట్టి అనురక్తియే కలిగి యుండి వారిని వీడక రక్షించుచుండును. శ్రీదేవి భక్తులు కూడ ఆమె యందు కల ప్రీతిచే సృష్టియం దేవిషయమును పట్టించుకొనరు.

ఇతర విషయములందు వారికి ప్రీతి యుండదు. సమస్తము నందును శ్రీమాత మాహాత్మ్యమును, వైభవమును దర్శించుచు ఆమెనే ఉపాసించుచూ అన్య చింతనలు లేక అభియుక్తులై యుందురు. వారికే మహారతి అను పదమునకు అర్థము తెలియును. రతి యనగా అనన్యమైన ఆసక్తియే గాని కేవలము పాశవిక కామము మాత్రమే కాదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 218 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Mahā-ratiḥ महा-रतिः (218) 🌻

She gives immense happiness and delight to Her devotees. (rati means pleasure, enjoyment, delight in, fondness for).

This is possible because She has that kind of potential energy, full of happiness and delight. After all, She is the incarnation of auspiciousness. Her form, Her radiance, Her qualities, Her supreme care (being Śrī Mātā or the divine mother) all these lead to happiness when one cogitates Her sincerely.

There is also another reason for this. Śiva is known for His auspiciousness. His wife is also full of auspiciousness as She is always with Him. 998th nāma of this Sahasranāma is Śrī Śiva meaning auspiciousness. Nāma 53 is Śiva.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

24 Feb 2021

శ్రీ శివ మహా పురాణము - 357

🌹 . శ్రీ శివ మహా పురాణము - 357 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

92. అధ్యాయము - 04

🌻. దేవి దేవతలనోదార్చుట - 3 🌻

శివుడు ఈ తీరున కాముకుని వలె విరహ దుఃఖముతో నిండిన పలుకులను పలుకుచూ, కాముకుల ప్రవృత్తిని లోకమునకు ప్రదర్శించువాడై లీలను ప్రకటించెను (39). పరాజయము లేని ఆ పరమేశ్వరుడు యథార్థముగా వికారము గలవాడు, దీనుడు కాదు. శివస్వామి పరిపూర్ణుడు, మాయను వశము చేసుకున్న సర్వేశ్వరుడు (40).

ఆయనకు మోహముతో గాని, కామముగాని ప్రయోజనమేమున్నది? మాయ యొక్క లేపము లేని ఆ ప్రభువునకు వికారము కలుగట యెట్లు సంభవము?(41). ఆ రుద్ర ప్రభుడు నన్ను వివాహమాడ వలెనని తీవ్రమగు కోర్కెను కలిగి యున్నాడు. ఓ దేవతలారా! నేను మేనా హిమవంతుల గృహములో భూమిపై అవతరించవలెనని కూడా ఆయన కోరుచున్నాడు (42).

ఈ కారణముచే నేను రుద్రనకు సంతోషమును కలిగించుట కొరకై లోకపు పోకడననుసరించి హిమవంతుని భార్యయగు మేన యందు అవతరించెదను (43). నేను భక్తితో ఘోరమగు తపస్సును చేసి రుద్రునకు ప్రియురాలనై దేవతల కార్యమును చేసెదను. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు (44).

మీరందరు మీమీ గృహములకు వెళ్లి, నిత్యము శివుని ఆరాధించుడు. ఆయన దయచే దుఃఖములన్నియూ నశించుననుటలో సందేహము లేదు (45). నేను దయానిధియగు ఆయన దయచే ఆయనకు భార్యనై ఆ కారణముగా నేను ముల్లోకములలో నమస్కరింపదగిన దానను, పూజింపదగిన దానను కాగలను. ఆయన కృపచే సర్వమంగళములు సంపన్నము కాగలవు (46).

బ్రహ్మ ఇట్లు పలికెను -

కుమారా! ఆ జగన్మాత ఇట్లు పలికి, దేవతలు చూచుచుండగా అంతర్ధానమై, శీఘ్రముగా తన లోకమును చేరెను (47). విష్ణువు మొదలగు దేవతలు, మరియు మునులు అందరు ఆమె వెళ్లిన దిక్కువైపు నమస్కారము చేసి తమ తమ స్థానములకు వెళ్లిరి (48).

ఓ మహర్షీ! దుర్గాదేవి యొక్క పుణ్యచరిత్రను నీకీతీరున వర్ణించి చెప్పితిని. ఇది మానవులకు సర్వదా సుఖమును, భక్తిని, ముక్తిని ఈయగలదు (49). ఎవడైతే దీనిని నిత్యము వినునో, స్థిరచిత్తముతో వినిపించునో, లేదా పఠించునో, లేక పఠింపజేయునో, అట్టివాడు సర్వకామనలను పొందును (50).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మూడవది యగు పార్వతీ ఖండములో దేవతల నోదార్చుట అనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

24 Feb 2021

గీతోపనిషత్తు -157

🌹. గీతోపనిషత్తు -157 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 7

🍀 7 - 1. ఆత్మ తత్వము - స్వభావముపై స్వామిత్వము సాధించినవాడు ప్రశాంతు డగును. అట్టివాడు చలి - వేడిమి, సుఖము - దుఃఖము, ప్రశంస - అవమానములను సమదృష్టితో దర్శించగలడు. పరమాత్మను చేరుటకు సమర్థుడగును. ఆత్మయనగ పరమాత్మ. ఆత్మ యనగ జీవాత్మ. జీవాత్మయే ప్రత్యగాత్మ. అతడు బుద్ధియందున్నపుడు, చిత్తమునం దున్నపుడు, స్వభావము నందున్నపుడు, యింద్రియములం దున్నపుడు, కర్మేంద్రియములం దున్నపుడు కూడ తానే యున్నట్లు భావించును. నేను అను ప్రత్యగాత్మ శరీరమున యింద్రియముల యందు, స్వభావమునందు, బుద్ధియందు సంస్కారమును బట్టి, చేయు పనులను బట్టి యుండును. ఉత్తమ సంస్కార మున్నపుడు ఆత్మ బుద్ధియందుండి ప్రపంచమున మనస్సు, యింద్రియములు, శరీరము సౌకర్యముగ (వాహనముగ) వినియోగించును. కేవలము ఆలోచనాపరుడుగ నున్నపుడు స్వభావములోనికి సంసరణము చెంది సగటు మానవ ప్రజ్ఞగ యుండును. అపుడు “నేను” అనియే భావించును. 🍀

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |
శోతోష్ణ సుఖదు:ఖేషు తథా మానావమానయోః || 7

స్వభావముపై స్వామిత్వము సాధించినవాడు ప్రశాంతు డగును. అట్టివాడు చలి - వేడిమి, సుఖము - దుఃఖము, ప్రశంస - అవమానములను సమదృష్టితో దర్శించగలడు. పరమాత్మను చేరుటకు సమర్థుడగును. ఆత్మయనగ పరమాత్మ. ఆత్మ యనగ జీవాత్మ. జీవాత్మయే ప్రత్యగాత్మ. అతడు బుద్ధియందున్నపుడు, చిత్తమునం దున్నపుడు, స్వభావము నందున్నపుడు, యింద్రియములం దున్నపుడు, కర్మేంద్రియములం దున్నపుడు కూడ తానే యున్నట్లు భావించును.

ఇట్లు తాను నడచుచున్నానని భావించినపుడు తాను అనగా శరీరమని అర్థము. చూచు చున్నపుడు, విను చున్నపుడు, తినుచున్నపుడు, తానే చూచు చున్నానని, విను చున్నానని, తినుచున్నానని భావించును. అపుడు తాను యింద్రియములందున్న "నేను." అట్లే భావించు చున్నపుడు భావములన్నియు స్వభావము నుండి వచ్చును గనుక, అచ్చట నున్న నేను మనస్సుయందున్న నేను. అదే విధముగ బుద్ధి యందున్నపుడు కూడ “నేను” అనియే భావించును. అపుడు ఆత్మ బుద్ధితో కూడియున్నదని తెలియవలెను.

ఇట్లు నేను అను ప్రత్యగాత్మ శరీరమున యింద్రియముల యందు, స్వభావమునందు, బుద్ధియందు సంస్కారమును బట్టి, చేయు పనులను బట్టి యుండును. ఉత్తమ సంస్కారమున్నపుడు ఆత్మ బుద్ధియందుండి ప్రపంచమున మనస్సు, యింద్రియములు,

శరీరము సౌకర్యముగ (వాహనముగ) వినియోగించును. కేవలము ఆలోచనాపరుడుగ నున్నపుడు స్వభావములోనికి సంసరణము చెంది సగటు మానవ ప్రజ్ఞగ యుండును. అపుడు “నేను” అనియే భావించును. మరింత దిగజారినపుడు కేవలము తినుట, వినుట, చూచుట, స్పర్శించుట యిత్యాది పానీయాదులు యిమిడి, అనగా యింద్రియముల యందు యిమిడి యుండిపోవును. ఇట్టివారు మానవ రూపముననే యున్నను పశువులతో సమానమై యుందురు.

కేవలము శరీరమే తా మనుకొనువారు దాని పోషణము కొరకు మాత్రము జీవించువారు మానవులలో అందరికన్న చిన్నవారు. ఇన్ని స్థితులలోనికి ఆత్మయే అవరోహణము చెందుచున్నది. జీవాత్మ బుద్ధిలో యుండవచ్చును. స్వభావములో (మనస్సులో) నుండవచ్చును. ఇంద్రియములలో నుండవచ్చును. శరీరములోనికి కూడ దిగవచ్చును. ఇవి యన్నియు తాను ప్రవేశించు వ్యూహములు. గృహముల వంటివి. ఇవియన్నియు కాక తా నున్నాడు. తాను అహర్నిశలు పై స్థితులలో నిలుచుచుపోయినచో తన నిజస్థితి మరచును.

తాను శరీరమునం దున్నాడు కాని శరీరము తాను కాదు అని తెలియవలెను. తాను ప్రపంచమును యింద్రియములద్వారా అనుభవించుచున్నాను కాని తాను యింద్రియములు కాదు. తాను మనస్సుద్వారా స్వభావమునుండి వెలువడుచున్న భావనలయందు ప్రవేశించుచున్నాడు. కాని తన భావములే తాను కాదు. తాను బుద్ధియను కక్ష్యనుండి ప్రకాశించుచున్నాడు. ఆ ప్రకాశమునకు కూడ తానే ఆధారము. తా నాధారముగనే తన ప్రకాశమున్నది. అట్లే తా నాధారముగనే తన భావములు, కోరికలు, శరీరము ఉన్నవి. ఇవి యన్నియు కాక తా నెట్లున్నాడు? నేను, తాను అని మనము పదే పదే పలుకు పదమునకు అర్థమేమి? తాను ప్రవేశించు కక్ష్యలు తాను కాదు గదా!

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

23 Feb 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 179

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 179 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 1 🌻

679. అవతార పురుషుడు :-

భగవంతుడు భగవంతునిగను మానవునిగను తనను ఏకకాలమందే ప్రతివారిలో ప్రతి దానిలో చూచును.

680. భగవంతుడు సరాసరి మానవుడై మానవుల xxx మానవ జీవితమును గడుపుచు యీ అయిదుగురు సద్గురువుల ద్వారా సర్వోన్నతునిగా లేక, పురాణ పురుషునిగా తన దివ్య స్థాయిని అనుభూతి నొందును.

681. పారమార్థికముగా సర్వము భగవంతుడే అతడు ప్రతి దానిలో ప్రతి వారిలో ఉన్నాడు. అవతరించిన భగవంతుడు సర్వము తానే గాక ,ప్రతి దానిలో ప్రతి వారిలో ఉండుటయే గాక, నిజముగా ప్రతి వస్తువు ప్రతి మానవుడు తానే 'అగు'చున్నాడు విశ్వరూపుడగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

24 Feb 2021

24-FEB-2021 EVENING

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 157🌹  
11) 🌹. శివ మహా పురాణము - 355🌹 
12) 🌹 Light On The Path - 107🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 239🌹 
14) 🌹 Seeds Of Consciousness - 304🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 179 🌹
16) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 006 🌹*
AUDIO - VIDEO
17) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 34 / Lalitha Sahasra Namavali - 34🌹 
18) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 34 / Sri Vishnu Sahasranama - 34🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -157 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 7

*🍀 7 - 1. ఆత్మ తత్వము - స్వభావముపై స్వామిత్వము సాధించినవాడు ప్రశాంతు డగును. అట్టివాడు చలి - వేడిమి, సుఖము - దుఃఖము, ప్రశంస - అవమానములను సమదృష్టితో దర్శించగలడు. పరమాత్మను చేరుటకు సమర్థుడగును. ఆత్మయనగ పరమాత్మ. ఆత్మ యనగ జీవాత్మ. జీవాత్మయే ప్రత్యగాత్మ. అతడు బుద్ధియందున్నపుడు, చిత్తమునం దున్నపుడు, స్వభావము నందున్నపుడు, యింద్రియములం దున్నపుడు, కర్మేంద్రియములం దున్నపుడు కూడ తానే యున్నట్లు భావించును. నేను అను ప్రత్యగాత్మ శరీరమున యింద్రియముల యందు, స్వభావమునందు, బుద్ధియందు సంస్కారమును బట్టి, చేయు పనులను బట్టి యుండును. ఉత్తమ సంస్కార మున్నపుడు ఆత్మ బుద్ధియందుండి ప్రపంచమున మనస్సు, యింద్రియములు, శరీరము సౌకర్యముగ (వాహనముగ) వినియోగించును. కేవలము ఆలోచనాపరుడుగ నున్నపుడు స్వభావములోనికి సంసరణము చెంది సగటు మానవ ప్రజ్ఞగ యుండును. అపుడు “నేను” అనియే భావించును. 🍀*

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |
శోతోష్ణ సుఖదు:ఖేషు తథా మానావమానయోః || 7

స్వభావముపై స్వామిత్వము సాధించినవాడు ప్రశాంతు డగును. అట్టివాడు చలి - వేడిమి, సుఖము - దుఃఖము, ప్రశంస - అవమానములను సమదృష్టితో దర్శించగలడు. పరమాత్మను చేరుటకు సమర్థుడగును. ఆత్మయనగ పరమాత్మ. ఆత్మ యనగ జీవాత్మ. జీవాత్మయే ప్రత్యగాత్మ. అతడు బుద్ధియందున్నపుడు, చిత్తమునం దున్నపుడు, స్వభావము నందున్నపుడు, యింద్రియములం దున్నపుడు, కర్మేంద్రియములం దున్నపుడు కూడ తానే యున్నట్లు భావించును. 

ఇట్లు తాను నడచుచున్నానని భావించినపుడు తాను అనగా శరీరమని అర్థము. చూచు చున్నపుడు, విను చున్నపుడు, తినుచున్నపుడు, తానే చూచు చున్నానని, విను చున్నానని, తినుచున్నానని భావించును. అపుడు తాను యింద్రియములందున్న "నేను." అట్లే భావించు చున్నపుడు భావములన్నియు స్వభావము నుండి వచ్చును గనుక, అచ్చట నున్న నేను మనస్సుయందున్న నేను. అదే విధముగ బుద్ధి యందున్నపుడు కూడ “నేను” అనియే భావించును. అపుడు ఆత్మ బుద్ధితో కూడియున్నదని తెలియవలెను.

ఇట్లు నేను అను ప్రత్యగాత్మ శరీరమున యింద్రియముల యందు, స్వభావమునందు, బుద్ధియందు సంస్కారమును బట్టి, చేయు పనులను బట్టి యుండును. ఉత్తమ సంస్కారమున్నపుడు ఆత్మ బుద్ధియందుండి ప్రపంచమున మనస్సు, యింద్రియములు,
శరీరము సౌకర్యముగ (వాహనముగ) వినియోగించును. కేవలము ఆలోచనాపరుడుగ నున్నపుడు స్వభావములోనికి సంసరణము చెంది సగటు మానవ ప్రజ్ఞగ యుండును. అపుడు “నేను” అనియే భావించును. మరింత దిగజారినపుడు కేవలము తినుట, వినుట, చూచుట, స్పర్శించుట యిత్యాది పానీయాదులు యిమిడి, అనగా యింద్రియముల యందు యిమిడి యుండిపోవును. ఇట్టివారు మానవ రూపముననే యున్నను పశువులతో సమానమై యుందురు. 

కేవలము శరీరమే తా మనుకొనువారు దాని పోషణము కొరకు మాత్రము జీవించువారు మానవులలో అందరికన్న చిన్నవారు. ఇన్ని స్థితులలోనికి ఆత్మయే అవరోహణము చెందుచున్నది. జీవాత్మ బుద్ధిలో యుండవచ్చును. స్వభావములో (మనస్సులో) నుండవచ్చును. ఇంద్రియములలో నుండవచ్చును. శరీరములోనికి కూడ దిగవచ్చును. ఇవి యన్నియు తాను ప్రవేశించు వ్యూహములు. గృహముల వంటివి. ఇవియన్నియు కాక తా నున్నాడు. తాను అహర్నిశలు పై స్థితులలో నిలుచుచుపోయినచో తన నిజస్థితి మరచును.

తాను శరీరమునం దున్నాడు కాని శరీరము తాను కాదు అని తెలియవలెను. తాను ప్రపంచమును యింద్రియములద్వారా అనుభవించుచున్నాను కాని తాను యింద్రియములు కాదు. తాను మనస్సుద్వారా స్వభావమునుండి వెలువడుచున్న భావనలయందు ప్రవేశించుచున్నాడు. కాని తన భావములే తాను కాదు. తాను బుద్ధియను కక్ష్యనుండి ప్రకాశించుచున్నాడు. ఆ ప్రకాశమునకు కూడ తానే ఆధారము. తా నాధారముగనే తన ప్రకాశమున్నది. అట్లే తా నాధారముగనే తన భావములు, కోరికలు, శరీరము ఉన్నవి. ఇవి యన్నియు కాక తా నెట్లున్నాడు? నేను, తాను అని మనము పదే పదే పలుకు పదమునకు అర్థమేమి? తాను ప్రవేశించు కక్ష్యలు తాను కాదు గదా! 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 357 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
92. అధ్యాయము - 04

*🌻. దేవి దేవతలనోదార్చుట - 3 🌻*

శివుడు ఈ తీరున కాముకుని వలె విరహ దుఃఖముతో నిండిన పలుకులను పలుకుచూ, కాముకుల ప్రవృత్తిని లోకమునకు ప్రదర్శించువాడై లీలను ప్రకటించెను (39). పరాజయము లేని ఆ పరమేశ్వరుడు యథార్థముగా వికారము గలవాడు, దీనుడు కాదు. శివస్వామి పరిపూర్ణుడు, మాయను వశము చేసుకున్న సర్వేశ్వరుడు (40). 

ఆయనకు మోహముతో గాని, కామముగాని ప్రయోజనమేమున్నది? మాయ యొక్క లేపము లేని ఆ ప్రభువునకు వికారము కలుగట యెట్లు సంభవము?(41). ఆ రుద్ర ప్రభుడు నన్ను వివాహమాడ వలెనని తీవ్రమగు కోర్కెను కలిగి యున్నాడు. ఓ దేవతలారా! నేను మేనా హిమవంతుల గృహములో భూమిపై అవతరించవలెనని కూడా ఆయన కోరుచున్నాడు (42).

ఈ కారణముచే నేను రుద్రనకు సంతోషమును కలిగించుట కొరకై లోకపు పోకడననుసరించి హిమవంతుని భార్యయగు మేన యందు అవతరించెదను (43). నేను భక్తితో ఘోరమగు తపస్సును చేసి రుద్రునకు ప్రియురాలనై దేవతల కార్యమును చేసెదను. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు (44). 

మీరందరు మీమీ గృహములకు వెళ్లి, నిత్యము శివుని ఆరాధించుడు. ఆయన దయచే దుఃఖములన్నియూ నశించుననుటలో సందేహము లేదు (45). నేను దయానిధియగు ఆయన దయచే ఆయనకు భార్యనై ఆ కారణముగా నేను ముల్లోకములలో నమస్కరింపదగిన దానను, పూజింపదగిన దానను కాగలను. ఆయన కృపచే సర్వమంగళములు సంపన్నము కాగలవు (46).

బ్రహ్మ ఇట్లు పలికెను -

కుమారా! ఆ జగన్మాత ఇట్లు పలికి, దేవతలు చూచుచుండగా అంతర్ధానమై, శీఘ్రముగా తన లోకమును చేరెను (47). విష్ణువు మొదలగు దేవతలు, మరియు మునులు అందరు ఆమె వెళ్లిన దిక్కువైపు నమస్కారము చేసి తమ తమ స్థానములకు వెళ్లిరి (48). 

ఓ మహర్షీ! దుర్గాదేవి యొక్క పుణ్యచరిత్రను నీకీతీరున వర్ణించి చెప్పితిని. ఇది మానవులకు సర్వదా సుఖమును, భక్తిని, ముక్తిని ఈయగలదు (49). ఎవడైతే దీనిని నిత్యము వినునో, స్థిరచిత్తముతో వినిపించునో, లేదా పఠించునో, లేక పఠింపజేయునో, అట్టివాడు సర్వకామనలను పొందును (50).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మూడవది యగు పార్వతీ ఖండములో దేవతల నోదార్చుట అనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 179 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 1 🌻*

679. అవతార పురుషుడు :-
భగవంతుడు భగవంతునిగను మానవునిగను తనను ఏకకాలమందే ప్రతివారిలో ప్రతి దానిలో చూచును.

680. భగవంతుడు సరాసరి మానవుడై మానవుల xxx మానవ జీవితమును గడుపుచు యీ అయిదుగురు సద్గురువుల ద్వారా సర్వోన్నతునిగా లేక, పురాణ పురుషునిగా తన దివ్య స్థాయిని అనుభూతి నొందును.

681. పారమార్థికముగా సర్వము భగవంతుడే అతడు ప్రతి దానిలో ప్రతి వారిలో ఉన్నాడు. అవతరించిన భగవంతుడు సర్వము తానే గాక ,ప్రతి దానిలో ప్రతి వారిలో ఉండుటయే గాక, నిజముగా ప్రతి వస్తువు ప్రతి మానవుడు తానే 'అగు'చున్నాడు విశ్వరూపుడగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 304 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 153. The 'I am' itself is the world, go to the source and find out how it appeared and when. 🌻*

As your understanding of the knowledge 'I am' becomes clear you realize that everything rests on the 'I am'. It is the very basis of the world that you see around you. Prior to the arrival of the knowledge 'I am' or during deep sleep you never knew or know about the existence of any world at all. 

The 'I am' is at the very beginning, so you have to go back to it and not only go back but spend a considerable amount of time there, only then will you come to know how it came to be.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్గీత యథాతథం - 1 - 006 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 6 🌻*

06. యుధామన్యుశ్చ విక్రాంత
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్‌ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథా: ||

తాత్పర్యము : పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలియైన ఉత్తమౌజుడూ, సుభద్రా తనయుడు, ద్రౌపది కుమారులును అందున్నారు. ఈ వీరులందరును మహారథులు.

భాష్యము : లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

24-FEB-2021 MORNING

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 648 / Bhagavad-Gita - 648🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 306, 307 / Vishnu Sahasranama Contemplation - 306, 307🌹
3) 🌹 Daily Wisdom - 67 🌹
4) 🌹. వివేక చూడామణి - 30🌹
5) 🌹Viveka Chudamani - 30 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 41🌹
7)  🌹.సత్యానికి సదా నిర్భయమే .. 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 218 / Sri Lalita Chaitanya Vijnanam - 218🌹 
9) 🌹 శ్రీమద్భగవద్గీత - 559 / Bhagavad-Gita - 559🌹 
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 648 / Bhagavad-Gita - 648 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 65 🌴*

65. మన్మనా భవ మద్భక్తో 
మద్యాజీ మాం నమస్కురు |
మావేవైష్యసి సత్యం తే 
ప్రతిజానే ప్రియోసిమే ||

🌷. తాత్పర్యం : 
సర్వదా నన్నే చింతింపుము. నా భక్తుడవగుము. నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కారము గావింపుము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియమిత్రుడవగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను.

🌷. భాష్యము :
ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానుని శుద్ధభక్తుడై అతనినే చింతించుచు అతని కొరకే కర్మ నొనరించుట గుహ్యతమమైన జ్ఞానమై యున్నది. అనగా ఎవ్వరును కృత్రిమ ధ్యానపరులు కాకూడదు. శ్రీకృష్ణుని గూర్చి సదా చింతించగలిగే అవకాశము కలుగు రీతిలో జీవితమును ప్రతియొక్కరు మలచుకొనవలెను. దైనందిన కర్మలన్నియును కృష్ణునితో సంబంధము కలిగియుండునట్లుగా వారు చూచుకొనవలెను. 

ఇరువదినాలుగు గంటలు కృష్ణుని తప్ప అన్యమును చింతింపలేని విధముగా వారు జీవితమును ఏర్పాటు చేసికొనవలెను. అటువంటి శుద్ధమగు కృష్ణభక్తిభావనలో నిమగ్నుడైనవాడు తన ధామమును నిక్కముగా చేరగలడని శ్రీకృష్ణుడు వాగ్దానమొసగుచున్నాడు. అచ్చట అతడు శ్రీకృష్ణుని సన్నిహిత సాహచర్యమున నియుక్తుడు కాగలడు. 

అర్జునుడు శ్రీకృష్ణభగవానునికి ప్రియమిత్రుడైనందునే అతనికి ఈ గుహ్యతమజ్ఞానము ఉపదేశింపబడినది. అర్జునుని మార్గము ననుసరించు ప్రతివారును శ్రీకృష్ణునకు ప్రియమిత్రులై అర్జునుని వలె పూర్ణత్వము నొందగలరు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 648 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 65 🌴*

65. man-manā bhava mad-bhakto
mad-yājī māṁ namaskuru
mām evaiṣyasi satyaṁ te
pratijāne priyo ’si me

🌷 Translation : 
Always think of Me, become My devotee, worship Me and offer your homage unto Me. Thus you will come to Me without fail. I promise you this because you are My very dear friend.

🌹 Purport :
The most confidential part of knowledge is that one should become a pure devotee of Kṛṣṇa and always think of Him and act for Him. One should not become an official meditator. Life should be so molded that one will always have the chance to think of Kṛṣṇa. One should always act in such a way that all his daily activities are in connection with Kṛṣṇa.

He should arrange his life in such a way that throughout the twenty-four hours he cannot but think of Kṛṣṇa. And the Lord’s promise is that anyone who is in such pure Kṛṣṇa consciousness will certainly return to the abode of Kṛṣṇa, where he will be engaged in the association of Kṛṣṇa face to face. 

This most confidential part of knowledge is spoken to Arjuna because he is the dear friend of Kṛṣṇa. Everyone who follows the path of Arjuna can become a dear friend to Kṛṣṇa and obtain the same perfection as Arjuna.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 306, 307 / Vishnu Sahasranama Contemplation - 306, 307 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 306. సహస్రజిత్‌, सहस्रजित्‌, Sahasrajit 🌻*

*ఓం సహస్రజితే నమః | ॐ सहस्रजिते नमः | OM Sahasrajite namaḥ*

సహస్రజిత్‌, सहस्रजित्‌, Sahasrajit

సురారీణాం సహస్రాణి యుద్ధే జయతి యో హరిః ।
స సహస్రజిదిత్యుక్తో విష్ణుర్భాగతోత్తమైః ॥

యుద్ధమునందు సురారుల అనగా దేవతల శత్రువులైన రాక్షసుల సహస్రములను జయించును గావున విష్ణువు సహస్రజిత్‌.

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము::వ.ఇట్లు కేవల పురుషరూపంబును మృగరూపంబునుం గాని నరసింహ రూపంబున రేయునుం బవలునుంగాని సంధ్యాసమయంబున, నంతరంగంబును బహిరంగంబునుం గాని సభాద్వారంబున, గగనంబునుం భూమియునుం గాని యూరుమధ్యంబునఁ, బ్రాణసహితంబులును బ్రాణరహితంబులును గాని నఖంబులం ద్రైలోక్యజన హృదయ భల్లుండయిన దైత్యమల్లుని వధియుంచి మహాధన కీలాభీల దర్శనుండును, గరాళవదనుండును లేలిహానభీషణ జిహ్వుండును శోణిత పంకాంకిత కేసరుండునై ప్రేవులు కంఠమాలికలుగా ధరించి కుంభి కుంభ విదళనంబును సేసి చనుదెంచు పంచాననంబునుంబోలె దనుజకుంజర హృదయకమల విదళంబుచేసి తదీయ రక్తసిక్తంబులైన నఖంబులు సంధ్యారాగ రక్తచంద్రరేఖల చెలువు వహింప సహింపక లేచి తన కట్టెదుర నాయుధంబు లెత్తుకొని తత్తరంబున రణంబునకు రక్కసులం బెక్కుసహస్రంబులం జక్రాదిక నిర్వక్ర సాధనంబుల నొక్కనిఁ జిక్కకుండం జక్కడిచె, ని వ్విధంబున. (299)

ఈ విధంగా కేవలం నరరూపమూ, కేవలం మృగరూపమూ కానటువంటి నరసింహరూపంతో, రాత్రీ పగలు కాని సంధ్యాసమయంలో, గృహమునకు లోపలా వెలుపలా కాని ద్వారమధ్యంలో, ఆకాశమూ భూమి కానటువంటి ఊరూ ప్రదేశంలో, ప్రాణసహితాలూ, ప్రాణరహితాలూ కాని గోళ్ళతో బ్రహ్మ ఇచ్చిన వరనియమాలకు భంగం లేకుండగా ముల్లోకాలకూ గుండెగాలమైన రాక్షసరాజును వధించాడు నరసింహస్వామి.

ఉగ్రస్వరూపంతో ఆయన దావానల జ్వాల లాగా దర్శనమిస్తున్నాడు. ఆ నరహరి ముఖం భయంకరంగా ఉన్నది. చాచిన నాలుక నాగేంద్రునిలా భీకరంగా ఉన్నది. మెడజూలు నెత్తురుతో తడిసి ఎర్రబడింది. ఆ స్వామి రాక్షసుని ప్రేవులు కంఠమాలికలుగా ధరించి ఉన్నాడు. దానవుని హృదయకమలం చీల్చివేసిన నరసింహస్వామి మత్తేభ కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజంలాగా విరాజిల్లుతున్నాడు. రక్తంతో తడిసిన ఆయన నఖాలు సంధ్యారాగరంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ రూపం చూచి కోపం పట్టలేక వేలకొలదీ అసుర వీరులు ఆయుధాలతో దానవాంతకుని పైకి దండెత్తి వచ్చారు. నరసింహస్వామి వచ్చిన వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో పెక్కువేల రక్కసులను ఒక్కడినీ విడువకుండా వధించివేశాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 306🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 306. Sahasrajit 🌻*

*OM Sahasrajite namaḥ*

Surārīṇāṃ sahasrāṇi yuddhe jayati yo hariḥ,
Sa sahasrajidityukto viṣṇurbhāgatottamaiḥ.

सुरारीणां सहस्राणि युद्धे जयति यो हरिः ।
स सहस्रजिदित्युक्तो विष्णुर्भागतोत्तमैः ॥

Since Lord Viṣṇu is always victorious over innumerable enemies of Devas in battle, He is Sahasrajit.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 8
Nakhāṅkurotpāṭitahr̥tsaroruhaṃ visr̥jya tasyānucarānudāyudhān,
Ahansamastānnakhaśastrapāṇirbhirdordaṇḍayūtho’nupathānsahasraśaḥ. (31)

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे अष्टमोऽध्यायः ::
नखाङ्कुरोत्पाटितहृत्सरोरुहं विसृज्य तस्यानुचरानुदायुधान् ।
अहन्समस्तान्नखशस्त्रपाणिर्भिर्दोर्दण्डयूथोऽनुपथान्सहस्रशः ॥ ३१ ॥

With many, many arms, He (Lord Nr̥siṃha) first uprooted Hiraṇyakaśipu's heart and then threw him aside and turned toward the demon's soldiers. These soldiers had come in thousands to fight with Him with raised weapons and were very faithful followers of Hiraṇyakaśipu, but Lord Nṛsiḿhadeva killed all of them merely with the ends of His nails.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥
యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ || ౩౩ ||

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 307/ Vishnu Sahasranama Contemplation - 307🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻307. అనన్తజిత్‌, अनन्तजित्‌, Anantajit🌻*

*ఓం అనన్తజితే నమః | ॐ अनन्तजिते नमः | OM Anantajite namaḥ*

అనన్తజిత్‌, अनन्तजित्‌, Anantajit

యుద్ధక్రీడాదిషు హరిః సర్వత్రాచింత్యశక్తిమాన్ ।
సర్వభూతాని జయతీత్యనంతజిదితీర్యతే ॥

ఊహించుటకు సైతము అలవికాని శక్తి కలవాడు కావున యుద్ధక్రీడాదులయందు అనంతములగు, సమస్తములగు భూతములను జయించును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 307🌹*
📚. Prasad Bharadwaj 

*🌻307. Anantajit🌻*

*OM Anantajite namaḥ*

Yuddhakrīḍādiṣu hariḥ sarvatrāciṃtyaśaktimān,
Sarvabhūtāni jayatītyanaṃtajiditīryate.

युद्धक्रीडादिषु हरिः सर्वत्राचिंत्यशक्तिमान् ।
सर्वभूतानि जयतीत्यनंतजिदितीर्यते ॥

By His unimaginable power, He excelled all creatures in battle or sport all the times.

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 16
Ajita jitaḥ samamatibhiḥ sādhubhirbhavānˈjitātmabhirbhavatā,
Vijitāste’pi ca bhajatāmakāmātmanāṃ ya ātmado’tikaruṇāḥ. (34)

:: श्रीमद्भागवते षष्टस्कन्धे षोडशोऽध्यायः ::
अजित जितः सममतिभिः साधुभिर्भवान्‌जितात्मभिर्भवता ।
विजितास्तेऽपि च भजतामकामात्मनां य आत्मदोऽतिकरुणाः ॥ ३४ ॥

O unconquerable Lord, although You cannot be conquered by anyone, You are certainly conquered by devotees who have control of the mind and senses. They can keep You under their control because You are causelessly merciful to devotees who desire no material profit from You. Indeed, You give Yourself to them, and because of this You also have full control over Your devotees.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥
యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ || ౩౩ ||

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 67 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 7. Happiness 🌻*

There is a notion in the minds of people that happiness arises on account of the contact of the mind with desirable objects. That this is not true, is a great point that is made out here. 

Happiness does not merely arise on account of the contact of the mind with an object which is desirable. The desirability of the object is, again, a condition of the mind. It is a perception of the mind in the contour of the object, of certain characters which are necessitated by the mind. 

The mind is a pattern of consciousness. You may call it a focused form of consciousness, a shape taken by consciousness, something like the shape the waters of the ocean may take in the surge of the waves. A particular arrangement of consciousness in space and time may be said to be a mind, whether it is a human mind or otherwise.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 30 / Viveka Chudamani - 30🌹*
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀. అరిషడ్‌ వర్గాలు - 2 🍀*

114. విద్యావంతులు, బుద్ధిమంతులైన వారు కూడా మరియు తెలివిగల స్థిరమైన ఆత్మ జ్ఞానము కలవారు కూడా తామస గుణానికి బందీలై, ఆత్మను గూర్చి ఎంత వివరించినను అర్థము చేసుకొన లేకున్నారు. వారు కేవలము భ్రమకు లోనై అదే నిజమని భావించి, ఆ భ్రమలకు బందీలై ఉన్నారు. ఆహా! ఎంత శక్తివంతమైనది ఈ బద్ధకముతో కూడిన తామస శక్తి.

115. తగిన నిర్ణయ శక్తి లేకపోయినా, లేక వ్యతిరేఖమైన నిర్ణయ శక్తి ఉన్నా అందుకు ఖచ్చితమైన నమ్మకము అవసరము. ఏ విధమైన అనుమానము ఉన్నా ఈ వ్యక్త శక్తి మరియు బహిర్గత శక్తి అంతము లేని కష్టాలను కలిగిస్తుంది.

116. తెలియని తనము, ఉత్సాహము లేకపోవుట, అలసట, నిద్ర, వ్యతిరేఖ భావన, జఢత్వము అనునవి తామస గుణములు. వీటికి బందీలైనవాడు దేనిని సాధించలేడు. కేవలము మత్తులో ఉండి, రాయివలె ఉండిపోతాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 30 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 The Six Evil Atributes - 2 🌻*

114. Even wise and learned men and men who are clever and adept in the vision of the exceedingly subtle Atman, are overpowered by Tamas and do not understand the Atman, even though clearly explained in various ways. What is simply superimposed by delusion, they consider as true, and attach themselves to its effects. Alas ! How powerful is the great Avriti Shakti of dreadful Tamas !

115. Absence of the right judgment, or contrary judgment, want of definite belief and doubt –these certainly never desert one who has any connection with this veiling power, and then the projecting power gives ceaseless trouble.

116. Ignorance, lassitude, dullness, sleep, inadvertence, stupidity, etc., are attributes of Tamas. One tied to these does not comprehend anything, but remains like one asleep or like a stock or stone.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 41 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 29. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 1 🌻*

15 సంవత్సరముల వయస్సున ఆయన నాకు దర్శనమిడి నప్పుడు ఆయన విలువ నాకంతగా తెలియలేదు. గత 35 సంవత్సరములుగా నాయందు వికాస మేర్పడుచున్న కొలదీ నా గురుదేవుని విస్తీర్ణము పెరుగుచునే యున్నది. ఆయన మావంటి వారిచే కొలువ బడువాడు కాడని, కొలతల కందనివాడని తెలిసి, నా చిన్నతనము' తెలిసికొంటిని. అయన సాన్నిధ్యమే నాకు సమస్తము.

నా చిన్నతనమున నా కత్యంత సన్నిహితురాలు మా గృహ మందలి వంటమనిషి. ఆమె నన్ను కంటికి రెప్పవలె కాపాడు చుండెడిది. నన్ను గౌరవించుచునే నాకెన్నియో విషయములు తెలుపుచుండెడిది. 

నా శారీరక, మానసిక అభివృద్ధికి ఆమె ఎంతయో తోడ్పడినది. ఆమె ఎందులకు నాయందు ప్రత్యేక వాత్సల్యము చూపెడిదో నాకప్పటికి అవగాహన కాలేదు. నేను చిరు ప్రాయము నుండియే అనగా 18 సం||ల ప్రాయము నుండియే మత బోధనలను చేయుచుంటిని. 

మా వంటమనిషి నేను చేయు బోధనలకు కూడా స్నేహపూర్వకముగా వచ్చుచుండెడిది. బోధనలను ఆవేశముగ నిర్వర్తించి, యింటికివచ్చి, మా వంటమనిషితో గర్వముగా పలుకు చుండెడిదానను. ఆమె చిరునవ్వుతో అన్నిటికినీ తలయూపు చుండెడిది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సత్యానికి సదా నిర్భయమే 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

దేవుణ్ణి వదలాలంటే చాలా భయంగా ఉందన్నావు. బండరాయి లాంటి ఆ దేవుడి కింద నీ భయాన్ని అణచిపెట్టావు. ఆ బండరాయిని తొలగించిన వెంటనే నీ భయం అదృశ్యమవుతుంది. అప్పుడు దేవుడు కేవలం కల్పన అని తెలుస్తుంది. ఏ ప్రార్థనలు పనిచెయ్యవు. దానితో దేవుడిపై ఉన్న నమ్మకం పోతుంది. ఒకసారి నమ్మకం పోతే అది మళ్ళీ తిరిగిరాదు. 

కాబట్టి, భయం కలిగినప్పుడు దానిని ఎదుర్కోవాలో కానీ, దానిపై దేవుడి ముసుగు వేసినంత మాత్రాన ఆ భయం పోదు. ఎందుకంటే, అనుమానం వాస్తవం, నమ్మకం కట్టుకథ. సత్యం ముందు ఏ కట్టుకథ నిలబడలేదు. దానితో దేవుడు మీకు కేవలం ఒక కల్పనగానే మిగిలిపోతాడు. దానిని మీరెప్పటికీ మరువలేరు.

తెలిసిన సత్యాన్ని మర్చిపోవడం అసంభవం. అది దాని గుణాలలో ఒకటి. కాబట్టి, దానిని మీరు గుర్తుంచుకోవలసిన అవసరం లేదు. కానీ, అబద్ధాలను మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేకపోతే, వాటిని మీరు మర్చిపోవచ్చు. 

సత్యానికి అలవాటుపడ్డ మనిషికన్నా అబద్ధాలకు అలవాటుపడ్డ మనిషికి చాలా జ్ఞాపకశక్తి అవసరం. ఎందుకంటే, సత్యానికి అలవాటుపడ్డ మనిషికి జ్ఞాపకశక్తితో పనిలేదు. మీరు ఎప్పుడూ సత్యాన్ని మాత్రమే చెప్పే పక్షంలో దానిని గుర్తుంచుకోవలసిన అవసరం ఏమాత్రం లేదు. 

కానీ, మీరు అబద్ధాలు మాత్రమే చెప్పే పక్షంలో వాటిని మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, మీరు చాలా మందికి చాలా అబద్ధాలు చెప్తారు. ఎవరికి ఏ అబద్ధం చెప్పేరో మీకు గుర్తుండాలి కదా! లేకపోతే, కొంప మునుగుతుంది. పైగా, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. 

అలా అనేక అబద్ధాలు పుట్టుకొస్తూనే ఉంటా యి. సత్యానిది ఎప్పుడూ బ్రహ్మచర్యమే. ఎందుకంటే, అది పెళ్ళిచేసుకోలేదు. అందుకే దానికి పిల్లలు లేరు. కానీ, అబద్ధం బ్రహ్మచారి కాదు. అందుకే అది అనేక అబద్ధాలను పుట్టిస్తుంది. ఎందుకంటే, దానికి కుటుంబ నియంత్రణపై నమ్మకం లేదు.

మతాచార్యులు, రాజకీయ నాయకులు మిమ్మల్ని మనస్తత్వపరమైన నిరంతర బానిసలుగా చేసేందుకు సృష్టించిన దేవుడు కేవలం ఒక కల్పన అని మీకు అర్థమైన వెంటనే దేవుడంటే మీకున్న భయాలన్నీ పోతాయి. 

అందుకే మీరెప్పుడూ భయపడుతూ ఉండాలనే వారు కోరుకుంటారు. లేకపోతే, మీరు వారికి చాలా ప్రమాదకారులుగా కనిపిస్తారు. కాబట్టి, మీరు ఆత్మగౌరవం ఏమాత్రం లేనివారుగా, భయపడుతూ లొంగిపోయేందుకు సిద్ధపడే పిరికివారుగా ఉండాలి లేదా నిర్భయులుగా ఉండాలి.

మీరు నిర్భయులైతే దేనికీ తల వంచని తిరుగుబాటు వీరుడవుతారు. దానిని మీరు నివారించలేరు. కాబట్టి, మీరు విశ్వాసమున్న వ్యక్తిగా ఉండాలి లేదా తిరుగుబాటు స్ఫూర్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. మతాచార్యులు, రాజకీయ నాయకులు మీరు తిరుగుబాటు స్ఫూర్తి కలిగిన వ్యక్తిగా ఉండాలనుకోరు.

ఎందుకంటే, మీ తిరుగుబాటు స్ఫూర్తి క్రైస్తవం, జుడాయిజం, మహమ్మదీయం, హిందూత్వాలతో మీ మనసును బలవంతంగా నిబద్ధీకరించే వారి స్వార్థ ప్రయోజనాలను ప్రశ్నిస్తుంది, వ్యతిరేకిస్తుంది. అందుకే వారు మీ అంతర్గతంలో మీరు ఎప్పుడూ వణుకుతూ ఉండేలా చేస్తారు. అదే వారి శక్తి. దానిని కోరుకునే వారికి కాల్పనిక దేవుడు చక్కగా ఉపయోగపడతాడు. 

ఒకవేళ మీకు దేవుడిపై భయభక్తులుంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తారు, ఆయన పవిత్ర గ్రంథాన్ని చదువుతారు, ఆయన అవతార పురుషులు చెప్పినది చేస్తారు. అలా మీరు ఆయనను, ఆయన ప్రతినిధులను అనుసరించక తప్పదు.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 218 / Sri Lalitha Chaitanya Vijnanam - 218 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |*
*మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖*

*🌻 218. 'మహారతి:' 🌻*

అమితమైన రతి కలిగినది శ్రీమాత అని అర్థము.
మహేశ్వరుడు మహా యోగి. మహా తపస్వి. యోగులకు, తపస్వి జనులకు అతడే పరమగురువు. సృష్టియందు మొట్టమొదటగ తపస్సును ప్రారంభించినవా డతడే. సతతము పరతత్త్వమున లగ్నమై యున్న చేతస్కుడు మహాదేవుడు. అగ్ని శిఖవలె అతని చేతన మంతయూ ఊర్ధ్వమున కుండును. 

అతని చేతన సృష్టియందు ప్రసరింప చేయవలెనన్నచో ఊర్ధ్వమార్గమున నున్న చేతనను ఇతర దిక్కులకు ప్రసరింప చేయవలెను కదా! అట్టి సమర్థత సృష్టియం దెవ్వరికినీ లేదు. 

కాని శ్రీమాత కూడ తపస్వినియే యగుట చేత తన దీర్ఘకాల తపస్సు ద్వారా మహాదేవుని మెప్పించినది. మహాదేవుని సృష్టికామునిగ, మహాకామునిగ మరల్చినది. ఆమె కామేశ్వరియై మహాదేవునితో చేరి సర్వలోక సృష్టి నిర్మాణము గావించినది. 

ఆమెకు సహకరించుచు మట్టి యందు కూడ నుండుటకు మహాదేవు డంగీకరించెను. ఎచ్చట శ్రీమాత యున్నదో, యుండునో అచ్చట శివుడు కూడ యుండును. 

ఎచ్చట శివుడుండునో అచ్చట శ్రీమాత కూడ యుండును. ఒకరు లేక ఒకరు వుండుట యను ప్రశ్నయే లేదు. పరమునందైనను పదార్థము నందైననూ ఇరువురునూ యుందురు. రతి అను పదమునకు ఇది పరాకాష్ఠ. అందులకే ఆమె మహారతి. 

శ్రీదేవి తన భక్తుల యెడల కూడ అట్టి అనురక్తియే కలిగి యుండి వారిని వీడక రక్షించుచుండును. శ్రీదేవి భక్తులు కూడ ఆమె యందు కల ప్రీతిచే సృష్టియం దేవిషయమును పట్టించుకొనరు.

ఇతర విషయములందు వారికి ప్రీతి యుండదు. సమస్తము నందును శ్రీమాత మాహాత్మ్యమును, వైభవమును దర్శించుచు ఆమెనే ఉపాసించుచూ అన్య చింతనలు లేక అభియుక్తులై యుందురు. వారికే మహారతి అను పదమునకు అర్థము తెలియును. రతి యనగా అనన్యమైన ఆసక్తియే గాని కేవలము పాశవిక కామము మాత్రమే కాదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 218 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Mahā-ratiḥ महा-रतिः (218) 🌻*

She gives immense happiness and delight to Her devotees. (rati means pleasure, enjoyment, delight in, fondness for). 

This is possible because She has that kind of potential energy, full of happiness and delight. After all, She is the incarnation of auspiciousness. Her form, Her radiance, Her qualities, Her supreme care (being Śrī Mātā or the divine mother) all these lead to happiness when one cogitates Her sincerely.  

There is also another reason for this. Śiva is known for His auspiciousness. His wife is also full of auspiciousness as She is always with Him. 998th nāma of this Sahasranāma is Śrī Śiva meaning auspiciousness. Nāma 53 is Śiva.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 559 / Bhagavad-Gita - 559 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 22 🌴*

22. ఏతైర్విముక్త: కొన్తేయ తమోద్వారైస్త్రిభిర్నర: |
ఆచరత్యాత్మన: శ్రేయస్తతో యాతి పరాం గతిమ్ ||

🌷. తాత్పర్యం : 
ఓ కుంతీపుత్రా! ఈ మూడు నరకద్వారముల నుండి తప్పించుకొనినవాడు ఆత్మానుభూతికి అనుకూలములైన కార్యముల నొనరించి క్రమముగా పరమగతిని పొందగలడు.

🌷. భాష్యము :
కామము, క్రోధము, లోభము అనెడి ఈ మువ్వురు మానవశత్రువుల యెడ ప్రతివారును జాగరూకులై యుండవలెను. ఈ మూడింటి నుండి ఎంతగా బయటపడినచో మనుజుని అస్తిత్వము అంతగా పవిత్రము కాగలదు. 

పిదప అతడు వేదములందు నిర్దేశింపబడిన విధినియమములను పాటించుటచే అతడు క్రమముగా ఆత్మానుభవస్థాయిని చేరగలడు. అతడు మిగుల అదృష్టవంతుడైనచో అట్టి సాధనచే కృష్ణభక్తిరసభావనకు చేరగలడు. అంతట జయము అతనికి నిశ్చయము కాగలదు. మనుజుడు పవిత్రుడగుటకు చేయవలసిన క్రియ, ప్రతిక్రియ మార్గములు వేదవాజ్మయమున విశదముగా వివరింపబడినవి. 

కామము, క్రోధము, లోభము అనువానిని త్యజించుట పైననే సమస్తవిధానము ఆధారపడియున్నది. కామాది త్రిగుణములను త్యజించుటనెడి ఈ పధ్ధతిని అనుసరించుట ద్వారా మనుజుడు ఆత్మానుభవపు అత్యున్నతస్థాయికి ఎదగగలడు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 559 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 22 🌴*

22. etair vimuktaḥ kaunteya
tamo-dvārais tribhir naraḥ
ācaraty ātmanaḥ śreyas
tato yāti parāṁ gatim

🌷 Translation : 
The man who has escaped these three gates of hell, O son of Kuntī, performs acts conducive to self-realization and thus gradually attains the supreme destination

🌹 Purport :
One should be very careful of these three enemies to human life: lust, anger and greed. The more a person is freed from lust, anger and greed, the more his existence becomes pure. Then he can follow the rules and regulations enjoined in the Vedic literature. By following the regulative principles of human life, one gradually raises himself to the platform of spiritual realization. If one is so fortunate, by such practice, to rise to the platform of Kṛṣṇa consciousness, then success is guaranteed for him. In the Vedic literature, the ways of action and reaction are prescribed to enable one to come to the stage of purification. The whole method is based on giving up lust, greed and anger. 

By cultivating knowledge of this process, one can be elevated to the highest position of self-realization; this self-realization is perfected in devotional service. In that devotional service, the liberation of the conditioned soul is guaranteed. Therefore, according to the Vedic system, there are instituted the four orders of life and the four statuses of life, called the caste system and the spiritual order system. 

There are different rules and regulations for different castes or divisions of society, and if a person is able to follow them, he will be automatically raised to the highest platform of spiritual realization. Then he can have liberation without a doubt.