11) 🌹. శివ మహా పురాణము - 355🌹
12) 🌹 Light On The Path - 107🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 239🌹
14) 🌹 Seeds Of Consciousness - 304🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 179 🌹
16) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 006 🌹*
AUDIO - VIDEO
17) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 34 / Lalitha Sahasra Namavali - 34🌹
18) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 34 / Sri Vishnu Sahasranama - 34🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -157 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 7
*🍀 7 - 1. ఆత్మ తత్వము - స్వభావముపై స్వామిత్వము సాధించినవాడు ప్రశాంతు డగును. అట్టివాడు చలి - వేడిమి, సుఖము - దుఃఖము, ప్రశంస - అవమానములను సమదృష్టితో దర్శించగలడు. పరమాత్మను చేరుటకు సమర్థుడగును. ఆత్మయనగ పరమాత్మ. ఆత్మ యనగ జీవాత్మ. జీవాత్మయే ప్రత్యగాత్మ. అతడు బుద్ధియందున్నపుడు, చిత్తమునం దున్నపుడు, స్వభావము నందున్నపుడు, యింద్రియములం దున్నపుడు, కర్మేంద్రియములం దున్నపుడు కూడ తానే యున్నట్లు భావించును. నేను అను ప్రత్యగాత్మ శరీరమున యింద్రియముల యందు, స్వభావమునందు, బుద్ధియందు సంస్కారమును బట్టి, చేయు పనులను బట్టి యుండును. ఉత్తమ సంస్కార మున్నపుడు ఆత్మ బుద్ధియందుండి ప్రపంచమున మనస్సు, యింద్రియములు, శరీరము సౌకర్యముగ (వాహనముగ) వినియోగించును. కేవలము ఆలోచనాపరుడుగ నున్నపుడు స్వభావములోనికి సంసరణము చెంది సగటు మానవ ప్రజ్ఞగ యుండును. అపుడు “నేను” అనియే భావించును. 🍀*
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |
శోతోష్ణ సుఖదు:ఖేషు తథా మానావమానయోః || 7
స్వభావముపై స్వామిత్వము సాధించినవాడు ప్రశాంతు డగును. అట్టివాడు చలి - వేడిమి, సుఖము - దుఃఖము, ప్రశంస - అవమానములను సమదృష్టితో దర్శించగలడు. పరమాత్మను చేరుటకు సమర్థుడగును. ఆత్మయనగ పరమాత్మ. ఆత్మ యనగ జీవాత్మ. జీవాత్మయే ప్రత్యగాత్మ. అతడు బుద్ధియందున్నపుడు, చిత్తమునం దున్నపుడు, స్వభావము నందున్నపుడు, యింద్రియములం దున్నపుడు, కర్మేంద్రియములం దున్నపుడు కూడ తానే యున్నట్లు భావించును.
ఇట్లు తాను నడచుచున్నానని భావించినపుడు తాను అనగా శరీరమని అర్థము. చూచు చున్నపుడు, విను చున్నపుడు, తినుచున్నపుడు, తానే చూచు చున్నానని, విను చున్నానని, తినుచున్నానని భావించును. అపుడు తాను యింద్రియములందున్న "నేను." అట్లే భావించు చున్నపుడు భావములన్నియు స్వభావము నుండి వచ్చును గనుక, అచ్చట నున్న నేను మనస్సుయందున్న నేను. అదే విధముగ బుద్ధి యందున్నపుడు కూడ “నేను” అనియే భావించును. అపుడు ఆత్మ బుద్ధితో కూడియున్నదని తెలియవలెను.
ఇట్లు నేను అను ప్రత్యగాత్మ శరీరమున యింద్రియముల యందు, స్వభావమునందు, బుద్ధియందు సంస్కారమును బట్టి, చేయు పనులను బట్టి యుండును. ఉత్తమ సంస్కారమున్నపుడు ఆత్మ బుద్ధియందుండి ప్రపంచమున మనస్సు, యింద్రియములు,
శరీరము సౌకర్యముగ (వాహనముగ) వినియోగించును. కేవలము ఆలోచనాపరుడుగ నున్నపుడు స్వభావములోనికి సంసరణము చెంది సగటు మానవ ప్రజ్ఞగ యుండును. అపుడు “నేను” అనియే భావించును. మరింత దిగజారినపుడు కేవలము తినుట, వినుట, చూచుట, స్పర్శించుట యిత్యాది పానీయాదులు యిమిడి, అనగా యింద్రియముల యందు యిమిడి యుండిపోవును. ఇట్టివారు మానవ రూపముననే యున్నను పశువులతో సమానమై యుందురు.
కేవలము శరీరమే తా మనుకొనువారు దాని పోషణము కొరకు మాత్రము జీవించువారు మానవులలో అందరికన్న చిన్నవారు. ఇన్ని స్థితులలోనికి ఆత్మయే అవరోహణము చెందుచున్నది. జీవాత్మ బుద్ధిలో యుండవచ్చును. స్వభావములో (మనస్సులో) నుండవచ్చును. ఇంద్రియములలో నుండవచ్చును. శరీరములోనికి కూడ దిగవచ్చును. ఇవి యన్నియు తాను ప్రవేశించు వ్యూహములు. గృహముల వంటివి. ఇవియన్నియు కాక తా నున్నాడు. తాను అహర్నిశలు పై స్థితులలో నిలుచుచుపోయినచో తన నిజస్థితి మరచును.
తాను శరీరమునం దున్నాడు కాని శరీరము తాను కాదు అని తెలియవలెను. తాను ప్రపంచమును యింద్రియములద్వారా అనుభవించుచున్నాను కాని తాను యింద్రియములు కాదు. తాను మనస్సుద్వారా స్వభావమునుండి వెలువడుచున్న భావనలయందు ప్రవేశించుచున్నాడు. కాని తన భావములే తాను కాదు. తాను బుద్ధియను కక్ష్యనుండి ప్రకాశించుచున్నాడు. ఆ ప్రకాశమునకు కూడ తానే ఆధారము. తా నాధారముగనే తన ప్రకాశమున్నది. అట్లే తా నాధారముగనే తన భావములు, కోరికలు, శరీరము ఉన్నవి. ఇవి యన్నియు కాక తా నెట్లున్నాడు? నేను, తాను అని మనము పదే పదే పలుకు పదమునకు అర్థమేమి? తాను ప్రవేశించు కక్ష్యలు తాను కాదు గదా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 357 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
92. అధ్యాయము - 04
*🌻. దేవి దేవతలనోదార్చుట - 3 🌻*
శివుడు ఈ తీరున కాముకుని వలె విరహ దుఃఖముతో నిండిన పలుకులను పలుకుచూ, కాముకుల ప్రవృత్తిని లోకమునకు ప్రదర్శించువాడై లీలను ప్రకటించెను (39). పరాజయము లేని ఆ పరమేశ్వరుడు యథార్థముగా వికారము గలవాడు, దీనుడు కాదు. శివస్వామి పరిపూర్ణుడు, మాయను వశము చేసుకున్న సర్వేశ్వరుడు (40).
ఆయనకు మోహముతో గాని, కామముగాని ప్రయోజనమేమున్నది? మాయ యొక్క లేపము లేని ఆ ప్రభువునకు వికారము కలుగట యెట్లు సంభవము?(41). ఆ రుద్ర ప్రభుడు నన్ను వివాహమాడ వలెనని తీవ్రమగు కోర్కెను కలిగి యున్నాడు. ఓ దేవతలారా! నేను మేనా హిమవంతుల గృహములో భూమిపై అవతరించవలెనని కూడా ఆయన కోరుచున్నాడు (42).
ఈ కారణముచే నేను రుద్రనకు సంతోషమును కలిగించుట కొరకై లోకపు పోకడననుసరించి హిమవంతుని భార్యయగు మేన యందు అవతరించెదను (43). నేను భక్తితో ఘోరమగు తపస్సును చేసి రుద్రునకు ప్రియురాలనై దేవతల కార్యమును చేసెదను. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు (44).
మీరందరు మీమీ గృహములకు వెళ్లి, నిత్యము శివుని ఆరాధించుడు. ఆయన దయచే దుఃఖములన్నియూ నశించుననుటలో సందేహము లేదు (45). నేను దయానిధియగు ఆయన దయచే ఆయనకు భార్యనై ఆ కారణముగా నేను ముల్లోకములలో నమస్కరింపదగిన దానను, పూజింపదగిన దానను కాగలను. ఆయన కృపచే సర్వమంగళములు సంపన్నము కాగలవు (46).
బ్రహ్మ ఇట్లు పలికెను -
కుమారా! ఆ జగన్మాత ఇట్లు పలికి, దేవతలు చూచుచుండగా అంతర్ధానమై, శీఘ్రముగా తన లోకమును చేరెను (47). విష్ణువు మొదలగు దేవతలు, మరియు మునులు అందరు ఆమె వెళ్లిన దిక్కువైపు నమస్కారము చేసి తమ తమ స్థానములకు వెళ్లిరి (48).
ఓ మహర్షీ! దుర్గాదేవి యొక్క పుణ్యచరిత్రను నీకీతీరున వర్ణించి చెప్పితిని. ఇది మానవులకు సర్వదా సుఖమును, భక్తిని, ముక్తిని ఈయగలదు (49). ఎవడైతే దీనిని నిత్యము వినునో, స్థిరచిత్తముతో వినిపించునో, లేదా పఠించునో, లేక పఠింపజేయునో, అట్టివాడు సర్వకామనలను పొందును (50).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మూడవది యగు పార్వతీ ఖండములో దేవతల నోదార్చుట అనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 179 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 1 🌻*
679. అవతార పురుషుడు :-
భగవంతుడు భగవంతునిగను మానవునిగను తనను ఏకకాలమందే ప్రతివారిలో ప్రతి దానిలో చూచును.
680. భగవంతుడు సరాసరి మానవుడై మానవుల xxx మానవ జీవితమును గడుపుచు యీ అయిదుగురు సద్గురువుల ద్వారా సర్వోన్నతునిగా లేక, పురాణ పురుషునిగా తన దివ్య స్థాయిని అనుభూతి నొందును.
681. పారమార్థికముగా సర్వము భగవంతుడే అతడు ప్రతి దానిలో ప్రతి వారిలో ఉన్నాడు. అవతరించిన భగవంతుడు సర్వము తానే గాక ,ప్రతి దానిలో ప్రతి వారిలో ఉండుటయే గాక, నిజముగా ప్రతి వస్తువు ప్రతి మానవుడు తానే 'అగు'చున్నాడు విశ్వరూపుడగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 304 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 153. The 'I am' itself is the world, go to the source and find out how it appeared and when. 🌻*
As your understanding of the knowledge 'I am' becomes clear you realize that everything rests on the 'I am'. It is the very basis of the world that you see around you. Prior to the arrival of the knowledge 'I am' or during deep sleep you never knew or know about the existence of any world at all.
The 'I am' is at the very beginning, so you have to go back to it and not only go back but spend a considerable amount of time there, only then will you come to know how it came to be.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్గీత యథాతథం - 1 - 006 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 6 🌻*
06. యుధామన్యుశ్చ విక్రాంత
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథా: ||
తాత్పర్యము : పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలియైన ఉత్తమౌజుడూ, సుభద్రా తనయుడు, ద్రౌపది కుమారులును అందున్నారు. ఈ వీరులందరును మహారథులు.
భాష్యము : లేదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment