✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అరిషడ్ వర్గాలు - 2 🍀
114. విద్యావంతులు, బుద్ధిమంతులైన వారు కూడా మరియు తెలివిగల స్థిరమైన ఆత్మ జ్ఞానము కలవారు కూడా తామస గుణానికి బందీలై, ఆత్మను గూర్చి ఎంత వివరించినను అర్థము చేసుకొన లేకున్నారు. వారు కేవలము భ్రమకు లోనై అదే నిజమని భావించి, ఆ భ్రమలకు బందీలై ఉన్నారు. ఆహా! ఎంత శక్తివంతమైనది ఈ బద్ధకముతో కూడిన తామస శక్తి.
115. తగిన నిర్ణయ శక్తి లేకపోయినా, లేక వ్యతిరేఖమైన నిర్ణయ శక్తి ఉన్నా అందుకు ఖచ్చితమైన నమ్మకము అవసరము. ఏ విధమైన అనుమానము ఉన్నా ఈ వ్యక్త శక్తి మరియు బహిర్గత శక్తి అంతము లేని కష్టాలను కలిగిస్తుంది.
116. తెలియని తనము, ఉత్సాహము లేకపోవుట, అలసట, నిద్ర, వ్యతిరేఖ భావన, జఢత్వము అనునవి తామస గుణములు. వీటికి బందీలైనవాడు దేనిని సాధించలేడు. కేవలము మత్తులో ఉండి, రాయివలె ఉండిపోతాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 30 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 The Six Evil Atributes - 2 🌻
114. Even wise and learned men and men who are clever and adept in the vision of the exceedingly subtle Atman, are overpowered by Tamas and do not understand the Atman, even though clearly explained in various ways. What is simply superimposed by delusion, they consider as true, and attach themselves to its effects. Alas ! How powerful is the great Avriti Shakti of dreadful Tamas !
115. Absence of the right judgment, or contrary judgment, want of definite belief and doubt –these certainly never desert one who has any connection with this veiling power, and then the projecting power gives ceaseless trouble.
116. Ignorance, lassitude, dullness, sleep, inadvertence, stupidity, etc., are attributes of Tamas. One tied to these does not comprehend anything, but remains like one asleep or like a stock or stone.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
24 Feb 2021
No comments:
Post a Comment