సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ (Sant Jñānēśvar Maharāj)

 


🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 1 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
సేకరణ. ప్రసాద్ భరద్వాజ


🍀. అభంగ్ - 1 🍀

దేవాచియే ద్వారీ ఉభా క్షణభరీ !

తేణే ముక్తి చారీ సాధియేల్యా!!

హరిముఖీమణా హరి ముఖే మణా !

పుణ్యాచీ గణనా కోణ్ కరీ!!

అసోని సంసారీ జిఎవేగు కరీ!

వేదశాస్త్రి ఉభారీ బాహ్యా సదా!!

జ్ఞానదేవ మణే వ్యాసాచియే ఖుణే!

ద్వారకేచే రాణే పాండవా ఘరీ!!

భావము :

దేవుని ద్వారమున క్షణ కాలము నిలబడిన వారికి నాలుగు విధములైన ముక్తులు సాధ్యము కాగలవు. హరి అని నోటితో పలుకుము. 

హరి హరి అని పలికిన వారికి లభించిన పుణ్యము లెక్కించుట ఎవ్వరి తరము కాదు. సంసారములోనే ఉండి హరి ప్రాప్తికై మనసును త్వర పర్చవలెనని వేద శాస్త్రాలన్ని సదా చేతులెత్తి ఘోషిస్తున్నాయి. ఇది వ్యాసుడు తెలిపిన గుర్తు (మర్మము). కావున ద్వారకకు రాజు అయిన శ్రీ కృష్ణుడు పాండవుల ఇంటిలో ఉండిరని జ్ఞానదేవులు తెలుపుచున్నారు.

🌻. నామ సుధ -1 🌻

దేవుని ద్వారము శాంతికి నిలయము

నిలచిన అక్కడ ఒక క్షణ కాలము

నాలుగు ముక్తులు వారికి సాధ్యము

హరి నామములో మహిమ అనంతము

హరియని నోటితో గానము చేయుము

హరిహరియని నోటితో గానము చేయుము. 

అగణిత పుణ్యము అయ్యేను ప్రాప్తము

లెక్కించడము ఎవ్వరితరము

సంసారములో సాగు చుండుము

హరి ప్రాప్తికై వేగిరపడుము. 

వేద శాస్త్రముల ఘోషను వినుము

నిలబడి చేతులెత్తినవి కనుగొనుము

జ్ఞాన దేవుని వచనము వినుము

వ్యాసుడు తెలిపిన మర్మము కనుము

ద్వారక రాజు వచ్చిరి చూడుము

పాండవులింటిలో ఉండిరి స్థిరము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


10 Dec 2020

------------------------------------ x ------------------------------------



------------------------------------ x ------------------------------------




No comments:

Post a Comment