గీతోపనిషత్తు ( Gītōpaniṣattu)




🌹 1. మనోవిజయము - మనసు వ్యాకులము చెందకుండటయే స్థితిప్రజ్ఞత్వము 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 1 📚

భగవంతుని మొట్టమొదటి శాసనము కశ్మలమును వీడమని. ''కుతస్త్వా కశ్మలమ్‌ ఇదమ్‌'' అని శ్రీకృష్ణుని ప్రశ్నించుచు తన దివ్యోపదేశమును అందించినాడు.

శ్రీభగవా నువాచ :
*కుతస్త్వా కశ్మల మిదం విషమే సముపస్థితమ్‌ |*
*అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున || 2*

కశ్మలం అనగా మనో వ్యాకులత్వము. అది మోహముచే కలుగును. దాని వలన శోకమేర్పడును. పిరికితన మావరించును.

మనస్సు మలినము చెందినదై సమస్తమును గజిబిజి చేయును. అనాచార్యము నాదరించుట జరుగును. స్వర్గము అనగా సువర్గము. అనగా వైభవము నుండి పద్రోయును. అపకీర్తిని కట్టబెట్టును. ఎట్టి విపత్కర పరిస్థితుల యందును మనసు వ్యాకులము చెందకుండటయే స్థితి ప్రజ్ఞత్వము.

భాగవతుల జీవితమున దీనిని ప్రస్పుటముగ గమనించ వచ్చును. సులభముగ, త్వరితగతిని మనసు చెదరువారు బలహీనులు. వారిచే ఎట్టి ఘనకార్యములు నిర్వర్తింపబడవు.

''అనార్యము, నరకము, అపకీర్తి కట్టబెట్టు మనోవ్యాకులము నిన్నెట్లా వరించినది?'' అని భగవంతుడు అర్జునుని (నరుని అనగా మనలను) ప్రశ్నించుచున్నాడు.

మనోవ్యాకులము నుండి విముక్తి చెందుటకు మార్గమును బోధించుచున్నాడు. కనుకనే భగవద్గీతకు మనో విజయమని కూడ పేరు కలదు.
🌹 🌹 🌹 🌹 🌹

10.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹2. మేలుకొలుపు - కర్తవ్యము నందు నిలబడు 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 2 📚

ఎట్టి పరిస్థితుల యందును క్లైబ్యమును పొందవలదని, హృదయ దౌర్బల్యము వలదని, అది క్షుద్రమైనదని, కర్తవ్యము

నందు నిలబడుమని, పారిపోవలదని, భగవానుడు మరియొక శాసనము చేయుచున్నాడు.

క్లైబ్యం మాస్మగమó పార్థ నైతత్త్వ య్యుపపద్యతే |

క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిషస పరంతప || 3

నరుడు సహజముగ తేజోవంతుడు. కావున క్రీనీడలు లేక చీకట్లు క్రమ్ముటకు అవకాశములేదు. ఎంత నల్లమబ్బు

అయినను తాత్కాలికమే కాని సూర్యునివలె శాశ్వతము కాదు.

తాత్కాలికమగు సంఘటనల యందు తన సహజత్వమును కోల్పోవుట అజ్ఞానము. 

అర్జునుడు సహజముగ తేజోవంతుడు. పరాక్రమవంతుడు. పరంతపుడు అనగా శత్రువులను తపింప చేయువాడు మరియు పరమును గూర్చి తపించువాడు. అనగా దైవమును గూర్చి తపించువాడు. అట్టి తపము కారణముగ లోపల, బయట శత్రువులు జయింపబడుదురు. దైవము అనగా విశ్వ వ్యాప్తమైన తేజము.

దానిని గూర్చి తపించువానికి ధైర్యమెట్లు కలుగగలదు. దాని నుండి విడివడుట, తాత్కాలిక సన్నివేశమునకు ముడిబడుట కారణముగ అధైర్యము, మనో దుర్బలత్వము కలుగును. దైవమును ఆశ్రయించుటయే అట్టి సమయమున పరిష్కారము.

''పరంతపుడవైన ఓ నరుడ! కర్తవ్యమున మేల్కొనుము. క్షుద్రమైన హృదయ దౌర్బల్యమును వీడుము. అధైర్యమును పొందకుము. ఇది నీకు తగదు'' అని భగవానుడు శాసించు చున్నాడు.

గమనిక : ఈ శ్లోకమున భగవానుడు నరుని 'పరంతపుడని' సంబోధించుటలో గంభీరార్థము కలదు.
🌹 🌹 🌹 🌹 🌹

11.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹 3. శరణాగతి - నిన్ను శరణు పొందితిని అని అర్జునుడు ప్రార్థించెను. తరించెను. 🌹
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 3 📚
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మనోవ్యాకులతను చెందినవాడు, మోహమున పడినవాడు, పిరికితనముచే భయము ఆవహించిన వాడు , శోకతప్త హృదయమును దుర్బలత్వమునకు తాకట్టు పెట్టిన వాడు, అవగాహన యందు తికమక గలవాడు, కర్తవ్యమును గ్రహింప లేనివాడు, విచక్షణను కోల్పోయిన వాడు, ధర్మ విషయమున సందేహము కలిగి సంకటమున పడినవాడు, అట్టి విషమస్థితి నుంచి బైట పడుటకు తెలిసిన వారిని ఆశ్రయించవలెను. 

ఈ ఉపాయమును గీత నిస్సందేహముగ స్థాపించుచున్నది. గీతోపాయమును అందుకొనిన బుద్ధిమంతునకు తన గీత మారగలదు.

కార్పణ్య దోషోపహతస్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాం |

యచ్ఛ్రేయ స్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే 

శిష్యస్తే-హం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌ || 7

అర్జునుడు కోరుటయే అతనికి తరణోపాయమును చూపినది.

నేను నీకు శిష్యుడను, నన్నాజ్ఞాపింపుము, నిన్ను శరణు పొందితిని అని అర్జునుడు ప్రార్థించెను. తరించెను.

మనము కూడ క్లిష్ట సమయముల యందు పఠింపవలసిన ఏకైక మంత్ర మిదియే. 

భగవంతుని సంబోధించుచూ '' నేను నీ శిష్యుడను, నిన్ను శరణాగతి చెందితిని, నన్ను శాసింపుము'' అని మరల మరల ప్రార్థింపవలెను. ఈ ప్రార్థన ఎంత ఆర్తితో చేసినచో అంత పరిష్కారము దొరుకుటకు వీలుపును. అర్జునుడు తానేమి చేయవలెనో తెలియగోరు చున్నాడు. చేసిపెట్టమని అడుగుట లేదు.

సోమరితనము కలిగినవాడు గురువు తనకు చేసిపెట్ట వలెనని ఎదురు చూచుచుండును. దారి చూపుటయే గురువు వంతుకాని నడచుట శిష్యుని వంతుయే. ఇట్టి గురుశిష్య సంప్రదాయమును అందించిన ఉత్తమమైన సంప్రదాయము మనది.

శరణాగతి చెందిన శిష్యునకు గురువు బోధ చేయుటకు ఉన్ముఖుడగును. ఉపాయమును చూపిన గురువుయందు సందేహము పుట్ట కూడదు. సందేహమున్నచో గురువునే అడిగి పరిష్కరించు కొనవలెను గాని, ఇతరులతో చర్చించుట, సంప్రదించుట నీచము.

అర్జునుడు కర్తవ్యమును సంపూర్ణముగ నెరుగుటకు శ్రీకృష్ణుని మరల మరల ప్రశ్నించెను. అది పరిప్రశ్నమే. ''పరిప్రశ్నము చేయు శిష్యునియందు సద్గురువునకు వాత్సల్యము హెచ్చగును. పరిప్రశ్నము లేక గురువును ప్రశ్నింపరాదు.

పరిప్రశ్నము చేసినపుడు సద్గురువైనచో కోపము రాదు. గురువునకు కొన్ని అర్హతలు కలవు. సద్గురువు తపస్వి అయి వుండవలెను. తనను తాను తెలిసినవాడై వుండవలెను. ధర్మము నాచరించువాడై యుండవలెను.

ఈ గురుశిష్య సంబంధము అత్యంత పవిత్రము. దీనిని నిర్మలముగ నుంచుకొనుట శ్రేయస్కరము. క్లుప్తముగ నుంచుకొనుట మరియు శ్రేయస్కరము. బజారు కెక్కించుట

కుసంస్కారము.

🌹 🌹 🌹 🌹 🌹

13.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹 4. తృష్ణ - తృప్తి - బాహ్యసంపద, ఆధిపత్యము, మనుష్యునికి శాంతి నియ్యజాలవు. శాంతముగ నుండువానికి మాత్రమే అవి విభూతులుగ యుండును 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 8, 9, 10 📚

ప్రపంచమున నున్న సమస్తమైన ప్రతికూల శక్తులను అణచి వేసినను, దేవతలపై ఆధిపత్యమును సంపాదించినను, సమస్త సంపదలను పొందినను, పదవులను ఆక్రమించినను, ఇవి ఏవియును మనుష్యుని మానసిక అశాంతిని తొలగింపలేవని భగవద్గీత బోధించుచున్నది.

న హి ప్రపశ్యామి మమాపనుద్యా ద్యచ్ఛోక ముచ్ఛోషణ మింద్రియాణామ్‌ |
అవాప్య భూమా వసపత్న మృద్ధం రాజ్యం సురాణా మపి చాధిపత్యమ్‌ || 8

సంజయ ఉవాచ :

ఏవ ముక్త్వా హృషీకేశం గుడకేశó పరంతపó |
న యోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవ హ || 9

త మువాచ హృషీకేశó ప్రహస న్నివ భారత |
సేన యో రుభయోర్మధ్యే విషీదంత మిదం వచó || 10

''నహిః ప్రపశ్యామి మాం అపనుద్యాత్‌ శోకం, ఉచ్ఛోషణమ్‌'' (2-8) అని అర్జునుడు పలికినాడు.

అర్జునుడు మహావీరుడు. అతని నామమే వైభవోపేత సంపదను సూచించును. ఇంద్రునితో సమానముగ భూమిపై వైభవముల ననుభవించినాడు. ఇంద్రుని సింహాసనమున కూడ 5 సంవత్సరముల పాటు ఇంద్రునితో కలసి ఆసీనుడైనాడు.

స్వర్గలోకసుఖములను అన్నింని అనుభవించినాడు. మహావీరుడని పేరు పొందినాడు. సుందర రూపునిగ శ్లాఫిుంపబడినాడు. 

ఇహ లోకమున అతను పొందని విజయము గాని, సౌఖ్యము గాని లేదు. అట్టివాడు 'ఉచ్ఛోషణం' అనగా మిగుల తాపము కలుగ చేయున్టి 'శోకం' అనగా దుóఖమును ఏ విధముగా పోగొట్టుకొనవలెనో? తెలియజాలక దీనుడై యుద్ధమున నిలబడి యున్నాడు. ఏది దుóఖమును పోగొట్టగలదో దానిని తెలియకున్నానని భగవానునితో పలికినాడు.

పదవులు, బాహ్యసంపద, ఆధిపత్యము ఇత్యాదివి, మనుష్యునికి శాంతి నియ్యజాలవనియు, శాంతముగ నుండువానికి మాత్రమే అవి విభూతులుగ యుండుననియు గీత యందలి ఈ శ్లోకము ద్వారా తెలియనగును. హిరణ్యకశిపుడు, రావణుడు, అర్జునుని మించిన పరాక్రమవంతులు. వారు స్వర్గమును కూడ ఆక్రమించినారు. అయినప్పికిని శాంతి కలుగలేదు.

బహిః కరణములద్వారా ప్రపంచమున సాధించబడునది ఏదియు అంతరంగమున శాంతిని స్థాపించలేదు. కేవలము అంతఃకరణ శుద్ధిచే పొందు ఆత్మానుభూతియే శాంతిని, తృప్తిని ఇచ్చును.

అంతః తృప్తిలేని వానికి బాహ్యపుష్టి, తుష్టి నియ్యజాలవు.

ఈ విషయమున ప్రాచీనులు ఎఱుక కలిగి నిర్మలము, నిరాడంబరము లగు జీవితము నేర్పరచుకొనినారు. నవీన యుగమున రజోగుణ దోషమున మానవుడు అంతులేని దాహమున పినాడు. తృప్తిని వదలి తృష్ణతో ఆరాటపడుచు తిరుగాడుచు అమూల్యమైన జీవనమును వ్యర్థము గావించు కొనుచున్నాడు. 

ప్రాచీనులకన్న తనకెక్కువ తెలుసను గర్వమున పడినాడు. ఎక్కువ తెలిసి జీవితమున తక్కువ సుఖపుట మరింత మూర్ఖత్వము. 

భగవద్గీత యందు ఈ శ్లోకమున, శ్లోకము యొక్క నిజస్వరూపము చక్కగ ప్రతిపాదింపబడినది. పరిశుద్ధ జీవనము, నిర్మలమైన మనస్సు, విశాల హృదయము, ఇత్యాది సద్గుణములను సాధించుకున్న వాడు అదృష్టవంతుడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

14.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹 5. నిజమైన తెలివి - కర్తవ్యమునందు, దైవమునందు, ప్రస్తుతమునందు మేల్కొనడమే నిజమైన తెలివి. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 5 📚

శోకింపదగని విషయములకై శోకించుట, శోకింపదగిన విషయములకై శోకింపకుండుట, జరిగిపోయిన విషయములను గూర్చి ఆలోచించుట, ప్రస్తుతమును మరచుట అను నాలుగు విధములుగా తెలివిగల మానవుడు కూడ తన జీవితమును చిక్కుపరచుకొను చున్నాడు.

శ్రీభగవా నువాచ 😘

అశోచ్యా నన్వశోచ స్త్వం ప్రజ్ఞావాదాం శ్చ భాషసే |

గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || 11 

నష్టము, తనవారి మరణము, అపజయము, అసళిలికర్యము, అపనింద, యిత్యాది విషయములందు తెలివైన మానవుడు కూడ శోకించుట చూచుచున్నాము. 

భగవానుని దృష్టిలో అవి శోకనీయమైన అంశములు కానేకావు. కాలము జీవితమున ద్వంద్వముగా సన్నివేశముల నందించుచుండును. కీర్తిని అనుసరించి అపకీర్తి, జయమును అనుసరించి అపజయము, లాభము ననుసరించి నష్టము, సళిలికర్యము ననుసరించి అసళిలికర్యము, జననము ననుసరించి మరణము వుండుట సృష్టి ధర్మము. వీని గురించి శోకించుట తగదని గీతావాక్యము. కాలానుగతములై యివి వచ్చి-పోవు చుండును.

శోకింపదగిన ముఖ్య విషయము ఒకి కలదు. ధర్మము ననుసరించ నపుడు శోకించవలెను. అది రాబోవు శోకములకు కారణము గనుక. అధర్మము నాచరించునపుడు శోకించవలెను. అదియునూ రాబోవు శోకలములకు హేతువు గనుక. వివేకము గల మానవుడు దీక్ష బూనవలసినది ధర్మము ననుసరించుట యందు. మనోవాక్కాయ కర్మలు ధర్మము ననుసరించునపుడు మానవుడు శోకించుటకు తావు లేదు.

ధర్మము కర్తవ్యము రూపమున ఎప్పికప్పుడు గోచరిస్తూ వుంటుంది. కర్తవ్యము కాలము రూపమున ప్రస్తుతింప బడుచుండును. ప్రస్తుత మందించు కర్తవ్యమును ధర్మముతో ననుసరించుటయేగాని, మరియొక మార్గము యోగజీవనమున లేదు.

జరిగిపోయిన విషయములను గూర్చి నెమరువేసుకొని దుóఖించుట మిక్కిలి అవివేకము. అర్జునునకు ప్రస్తుత కర్తవ్యము ధర్మయుద్ధము చేయుట. దానిని వదలి, మిథ్యావాదము చేయుట కర్తవ్య విముఖత్వమే.

కర్తవ్యమునందు, దైవమునందు, ప్రస్తుతమునందు మేల్కొనమని గీతావాక్యము శాసించు చున్నది. అదియే నిజమైన తెలివి.
🌹 🌹 🌹 🌹 🌹

15.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹 6. దివ్యజ్ఞానము - సూక్ష్మ లోకముల జ్ఞాన అవగాహన కలిగిన జీవుడు శాశ్వతుడే. సూక్ష్మస్థితుల అవగాహనము, దర్శనమే దివ్య జ్ఞానము. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 6 📚

ఈ సృష్టియందు ఏ వస్తువుగాని ఒకప్పుడు లేకుండ ఇప్పుడు వుండుట సంభవింపదు. అట్లే ఇప్పుడుండి ఇకముందు ఉండకపోవుట కూడ సంభవింపదు.

ఎప్పుడునూ అన్నియును వుండి యున్నవే కాని ఒకప్పుడు లేనివి కావు. ఒకే వస్తువు స్థితి మార్పులు చెందుచున్నప్పుడు ఆ వస్తువునకు అంతకు ముందు స్థితి లేకుండుట. క్రొత్త స్థితి ఏర్పడుట, అదియును మరల మారుట ఒక రసాయనికచర్యగ జరుగుచుండును. ఈ స్థితి మార్పు నిత్యము జరుగు చుండుటచే వుండుట, లేకుండుటగ వస్తువులు గాని, జీవులు గాని కనిపించు చుందురు. 

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమో జనాధిపాః |
నచైవ న భవిష్యామ స్వర్వే వయ మతó పరమ్‌ || 12

దేహినో-స్మిన్‌ యథా దేహే కౌమారం యøవనం జరా |
తథా దేహాంతరప్రాప్తిó ధీర స్తత్రన ముహ్యతి || 13

బాలకుడు యువకుడైనపుడు ఇట్టి మార్పే జరుగుచున్నది. బాలకుడు లేకుండుట యువకు డుండుటగ ఒకే జీవుడు ప్రస్తుతింపబడి యున్నాడు. అటులనే యువకుడు మధ్య వయస్కుడు, వృద్ధు అగుట, మరణించుట కూడ గమనించు చున్నాము. మరణించినవాడే మరల పుట్టుచున్నాడని తెలియుటకు సూక్ష్మలోకముల అవగాహనము, దర్శనము కలిగి యుండవలెను.

అది తెలిసినవాడు జీవుడు శాశ్వతుడనియు, సూక్ష్మ స్థూల స్థితులు పొందుచుండుననియు తెలియగలడు. కేవలము స్థూల స్థితులు మాత్రమే తెలిసిన వారికి పూర్ణజ్ఞానము లేక తికమక పడుచుందురు. సూక్ష్మ స్థితులు కూడ తెలిసినవాడే, తెలిసినవాడు.

సూక్ష్మస్థితి యందుండుట కూడ తెలిసినవాడు కావున శ్రీకృష్ణుడు స్థూలమున మరణించిన వాడిని సైతము సూక్ష్మ లోకములలో గుర్తించి కొనితెచ్చి తల్లికి, గురువునకు, బ్రాహ్మణునకు, జ్ఞానము నందించినాడు. సూక్ష్మస్థితుల అవగాహనము, దర్శనమే దివ్య జ్ఞానము. యోగము ఆ స్థితుల నందుటకు మార్గము. అట్టి యోగమునకు అధిషాసన దైవము శ్రీకృష్ణుడే. అందుచే అర్జునునకు స్థూల, సూక్ష్మ స్థితులను, జీవులకు జరుగు స్థితి మార్పులను బోధించి యోగమున ప్రవేశపెట్టెను.

17.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹 7. ఓర్పు - వచ్చి పోవునవి - ఓర్పుగల వానికి సమస్తము అధీనమున నుండును. ఓర్పు లేనివాడు దుఃఖితుడు అగును. ఓర్పుతో తాను చైతన్య స్వరూపుడనని మరల మరల గుర్తు తెచ్చుకొనవలెను. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 14 📚

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః |

ఆగమాపాయినో-నిత్యా స్తాం స్తితిక్షస్వ భారత || 14

వెండితెరపై పాత్రధారులు వచ్చిపోవుచుందురు. వివిధములైన సంభాషణములు వారి నడుమ జరుగుచుండును. సన్నివేశములు నిరంతరము సాగుచుండును. సమస్య లేర్పడుచుండును.

మరియు పరిష్కరింప బడుచుండును. సుఖ పూరితములు, దుఃఖ పూరితములు, ఉద్రేక పూరితములు, రాగద్వేష పూరితములు మరెన్నెన్నియో సమస్యలు వచ్చిపోవు చుండును. అనంతముగా పాత్రధారులు వచ్చిపోవుచుందురు. దృశ్యములు వచ్చిపోవు చుండును. సన్నివేశములు వచ్చిపోవు చుందురు.

వెండితెరపై వచ్చిపోవుచున్న సమస్త దృశ్యములకు వెండి తెరయే ఆధారము. ఎన్ని విషయములు వచ్చిపోవుచున్నను వెండి తెర వెండితెరగానే యుండునుగాని, స్థితి మార్పు చెందదు.

పళిలిరాణికము, సాంఫిుకము, జానపదము అగు ఎన్ని చిత్రములు తెరపై ప్రదర్శింపబడినను, వాని వాసన లేక ప్రభావము వెండితెర కుండదు. సినిమాహాలులోని వెండితెర విందే సృష్టిలోని చైతన్యము.

చైతన్యము ఆధారముగా లోకములు, లోకులు ఏర్పడుదురు. వారి నడుమ సన్నివేశములు కాలము రూపమున ఏర్పడుచుండును. ఇందేదియు చైతన్యము నంటదు. సృష్టిలోని ఈ చైతన్యమునే దైవమందురు. 

దాని నాశ్రయించుటచేత జీవులు కూడ సమస్యల కతీతముగ ప్రశాంతముగ జీవించనగును. దాని నాశ్రయించుటకే వివిధ మార్గములు.

సృష్టియందలి ఈ చైతన్యము త్రిగుణాత్మకముగ ఏర్పడినపుడు లోకములు, లోకులు, సన్నివేశ ములు ఏర్పడును. అనగా సినిమా యుండును.

శుద్ధచైతన్యముగా నున్నపుడు సినిమా లేక వెండితెర యుండును. సినిమా వేయబడు నపుడు కూడ వెండితెర ఉన్నప్పటికీ అందలి సన్నివేశములను, సమస్యలను చూచువారికి వెండితెర మరపునకు వచ్చును. వెండి తెర గుర్తున్నవారికి సన్నివేశములన్నియు వచ్చిపోవునవి వలె కనుపించును.

సుఖము - దుఃఖము; సళిలికర్యము- అసళిలికర్యము; లాభము-నష్టము; ధనము-పేదరికము; జననము-మరణము; రాత్రి-పగలు మొదలగునవన్నియు వచ్చిపోవునవియే. 

శ్రీకృష్ణుడు అట్టి చైతన్య స్వరూపుడు కనుక ఈ సృష్టి యందలి సమస్తము వచ్చిపోవునవియే అనియు, '' నేను'' అను చైతన్యము శాశ్వత మనియు, అట్టి శాశ్వత ప్రజ్ఞయందు నిలబడిన వానికి మొత్తము సృష్టి అంతయు ఒక సినిమా కథనం వలె ఆనందము నందించు ననియు బోధించెను. అనిత్యములు మరియు వచ్చిపోవు విషయముల యందు ఓర్పు వహించమని బోధించెను.

ఓర్పుగల వానికి సమస్తము అధీనమున నుండును. ఓర్పు లేనివాడు దుఃఖితుడు అగును. 

సృష్టి యందలి సమస్త విజయములకును ఓర్పు ప్రధానమని భగవానుడు బోధించెను. ''తితిక్షస్వ భారత'' - ఓ భారతీయుడ! ఓర్పు వహించుము! అని గీత నిర్దేశించుచున్నది.

ఓర్పుతో తాను చైతన్య స్వరూపుడనని మరల మరల గుర్తు తెచ్చుకొనవలెను. అట్లు గుర్తు తెచ్చుకొనుట వలన జీవితము నందలి సమస్తమైన సన్నివేశములు వచ్చిపోవునవియే అని తెలియగలదు. ఈ అభ్యాసము వలననే ఎవనికైనను తెలియుట యుండును గాని, చదువుట, వినుట వలన మాత్రము కాదు.

ఓర్పును మించిన గుణము లేదని, దానిని ముందు పొందుమని గీతోపనిషత్తు ప్రప్రథంమముగా బోధించుచున్నది.

ఓర్పు వలననే శ్రీరాముడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు, నలుడు ఇత్యాది దివ్యాంశ సంభూతులు లోకము లన్నిటిని జయించగల్గిరి.

ఓర్పు మనిషిని మహాత్మునిగ మార్పు ఉత్ప్రేరకము. ఎన్ని సద్గుణము లున్నప్పటికిని ఓర్పు లేనిచో అవి రాణించవు.

🌹 🌹 🌹 🌹 🌹


18.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. 8. అమృతత్వమునకు అర్హత - వ్యధ చెందని మనసు కలవాడు అమృతత్వ స్థితిని పొందుటకు అర్హుడు - దానికై త్రిగుణములకు అతీతముగ నుండు స్థితిని అభ్యాసవశమున స్థిరపరచుకొన వలెను. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 15 📚

యం హి న వ్యథంయన్త్యేతే పురుషం పురుషర్షభ |
సమదుóఖ సుఖం ధీరం సో-మృతత్వాయ కల్పతే || 15

వ్యధ చెందని మనసు కలవాడు అమృతత్వ స్థితిని పొందుటకు అర్హుడని గీత బోధించుచున్నది. త్రిగుణాత్మకమైన సృష్టియందు అవస్థితి చెందినటువిం మానవ ప్రజ్ఞకు వ్యధ సహజము. ప్రతి మానవుడు సహజముగ వజ్రచైతన్యవంతుడై ఉన్నప్పటికీ చైతన్యము త్రిగుణముల యందు బంధింపబడి నప్పుడు వ్యధ కవకాశమేర్పడును. 

మరికొంత అవస్థితి చెంది ఇంద్రియముల యందు అనగా ఇంద్రియార్థముల ననుసరించు స్థితియందు బంధింపబడినపుడు అట్టి వ్యధ తీవ్రత చెందును.

సత్యవంతుడైన మానవ ప్రజ్ఞ మేల్కాంచగనే చైతన్యవంతునిగ ఏర్పడును. చైతన్యవంతమైన మానవప్రజ్ఞ త్రిగుణముల లోనికి, ఇంద్రియముల లోనికి ప్రవేశించుట తప్పనిసరి. అట్టి ప్రవేశమున తన సహజ స్థితిని మరచినచో మాయ ఆవరణమున చిక్కును. అనగా ప్రజ్ఞ త్రిగుణాత్మక మగును. 

త్రిగుణాత్మక మగు తన ప్రజ్ఞను త్రిగుణములకు అతీతముగ కూడ అభ్యాసవశమున స్థిరపరచుకొన వచ్చును. త్రిగుణములలోనికి మరియు ఇంద్రియముల లోనికి అవతరణము చెందుచున్న చైతన్యము తన సహజ స్థితిని కోల్పోనవసరము లేదు. 

సూర్యుని కిరణము గ్రహగోళాదులను చేరునపుడు సూర్యుని వదలి, గ్రహములను చేరుటలేదు కదా!

సూర్యకిరణము వ్యాపనము చెందుచున్నట్లుగ మనకు తెలియును.

కిరణము సూర్యుని యొద్దనూ ఉన్నది. మరియు ఏడు గోళముల వద్దకూ ఏక కాలమున చేరుచున్నది. అట్లే మానవచైతన్యము కూడ ఏకకాలమున సప్తకోశములనూ వ్యాపించి యుండ గలదు.

అట్టి వ్యాపనమును అభ్యాసము చేయు పురుషుడు శ్రేష్ఠుడు. 

మోక్షమునకు అర్హత కలిగి యున్నవాడు. మోక్షమునందు సహజముగ నున్నవాడు. పురుషుడు అను పదమును ఉపయోగించుటలో భగవానుని యొక్క రహస్య సూచన కూడ ఒకటి ఇక్కడ గమనింపదగి యున్నది. ఏడంతస్తుల పురమున ప్రవేశించి, ఏడంతస్తులనూ వ్యాపించి యున్న ప్రజ్ఞవు నీవు సుమా! అని తెలుపుటకే ''పురుషమ్‌'', ''పురుషర్షభ'' అని పలికినాడు.

జీవిమున వ్యధ చెందువారు తమ్ము తాము మరచినవారనియు, సత్యాన్వేషణమున ఓర్పు వహించి తనను తాను గుర్తుకు తెచ్చుకొనుచు వ్యధ చెందక జీవించువారే అమృతత్త్వమునకు తగిన వారనియు గీతోపనిషత్తు బోధించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹


19.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. 9. ఉన్నది పోదు - లేనిది రాదు - సృష్టి యందలి ప్రతివస్తువూ స్థూలముగ గాని, సూక్ష్మముగగాని శాశ్వతముగ ఉండి యుండును. 🌹 

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 16, 17 📚

సృష్టిలో లేనిది భావమునకే రాదు. ఉన్నది భావమునకు రాకపోదు. అందుకే చమత్కారముగా ''సృష్టిలో లేనిదంటూ లేదు'' అని అంటారు. లేనిది భావనకే రాదు. భావనలోకి వచ్చినది ఉండకుండ పోదు. 

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః | ఉభయోరపి దృష్టో-ంత స్త్వనయో స్తత్త్వదర్శిభిః || 16
అవినాశి తు తద్విద్ధి యేన సర్వ మిదం తతమ్‌ | వినాశ మవ్యయ స్యాస్య న కశ్చి త్కర్తు మర›తి || 17

అందుకే దైవము లేనుట తెలివి తక్కువ. లేనిచో భావమునం దెట్లేర్పడును? లేనిది భావమునకు రాదు కదా ! ఉన్నది మనకి కనప నప్పుడు లేదందుము. మనకు కనపడనిది లేదనుట పసితనము. 

దయ్యములు ఉన్నవా? అను ప్రశ్న వచ్చినపుడు కూడ సమాధాన మిదియే. లేనిది భావించము కదా! మనకు తెలిసిన విషయము లన్నియు ఉన్నవియే. కానిచో కొందరికి ఉండవచ్చు.

కొందరికి ఉండకపోవచ్చు. ఉండుట, లేకుండుట, గ్రహించువాని స్థితిని బట్టి ఉండును. కొందరికి సూక్ష్మ లోకములున్నవి. వాని అనుభూతి కూడ ఉన్నది. కొందరికి లేదు. 

అనుభూతి లేనివారు లేవందురు. అనుభూతి కలుగనంత వరకు లేదన్నది వారికి సత్యము కాని, శాశ్వత సత్యము కాదు.

అటులనే ఏదియైునను ఒకప్పుడుండుట, మరియొకప్పుడు ఉండ కుండుట ఉండదు. మన తాత ముత్తాతలు, మన ముందు

తరముల వారు, ముందు యుగముల వారు ఉన్నారా అను ప్రశ్నకు సమాధానము ఉన్నారనియే! 

ఉండుట కేవలము భౌతికము కాదని తెలియవలెను. సృష్టి యందలి ప్రతివస్తువూ స్థూలముగ గాని, సూక్ష్మముగగాని శాశ్వతముగ ఉండి యుండును. స్థూలమున అగుపించినపుడు ఉన్నదను కొనుట, అగుపించనపుడు లేదను కొనుట అవివేకము.

దశరథుని అంత్యక్రియల అనంతరము ఇపుడు దశరథుండు లేు కదా! కావున రాజ్యము చేపట్టుము అని పలికిన మంత్రి జాబాలికి రాముడు ఇచ్చిన సమాధానము ఈ

సూత్రము ననుసరించియే యుండును.

నిజమునకు సృష్టియందు పుట్టునది, పోవునది ఏమియు లేదు. స్థూలముగ అగుపించినపుడు సృష్టినదందుము, సూక్ష్మస్థితి చెందినపుడు పోయినదందుము. ఇది పరిమితమైన అవగాహనము. ప్రళయమున కూడ లోకములు, లోకేశులు, లోకస్థులు బీజప్రాయముగ నుండి సృష్టి ఆరంభమున దివ్య సంకల్పము నుండి మరల పూర్వ పద్ధతినే దిగివచ్చుచుందురు. కావున ఉన్నది లేకపోలేదు.

లేనిది ఎప్పికినీ లేదు. జీవుల ప్రళయమున దైవము నందుండు టయే ఉండునుగాని, కరగిపోవుట, కలయుట లేదు. అట్లగుపించును. 

అందువలన తెలిసినవారు ఈ సమస్తమును ఎప్పుడునూ ఉన్నదిగను, శాశ్వతముగను భావింతురు. కాలచక్రమున సూక్ష్మము నుండి స్థూలమునకు, స్థూలము నుండి సూక్ష్మమునకు వచ్చిపోవుచుండును గాని, అసలు లేకుండుట ఉండదని వారి జ్ఞానము.

గ్రహమునకు గ్రహమునకూ మధ్య గల చోటు యందు ఏమియు లేదని ఇటీవలి వరకు శాస్త్రజ్ఞులు అనుచుండిరి. అది అంతయు దైవముతో నిండియున్నదని ఆత్మజ్ఞానులు తెలుపుదురు. 

ఈ శతాబ్దమున చోటంతయూ శాన్యము కాదని, పూర్ణమని శాస్త్రజ్ఞులు తెలుసుకొనుచున్నారు. అటులనే సూక్ష్మ లోకముల వికాసము లేనివారు, దివ్య శరీరధారులైన మహర్షులు, పరమ గురువులు, దేవతలు లేరనుచుందురు. క్రమ వికాసమున వీరందరు ఉన్నారని ఒప్పుకొనక తప్పదు.

పదార్థమయ ప్రపంచము కూడ లేకపోవుట లేదని గమనించవలెను. వేదాంతులు పదార్థమును, పరమార్థమును రెండు విషయములుగ తెలుపుచు ఒకటి నిరాకరించి, రెండవ దానిని ఆదరింతురు. నిజమునకు అవి రెండును ఒకిటియే!

పరమార్థము స్థూలస్థితి చెందినపుడు పదార్థమగును. పదార్థము సూక్ష్మత చెందినపుడు పరమార్థ మగును. ఒకియే స్థితి భేదముచే రెండుగా అగుపించును గాని రెండు లేవు. మంచుగడ్డ అగుచున్నది మరల నీరగు చున్నది అని తెలియవలెను.

గీతోపనిషత్తునందు స్థాపింపబడిన అత్యంత ప్రధానమైన మూల సూత్రములలో ఈ సూత్ర మొకటి. ఈ సూత్రమును గూర్చి బాగుగ ధ్యానము చేయవలసిన అవసరము విద్యార్థులకు కలదు.
🌹 🌹 🌹 🌹 🌹


20.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. 10. మార్పు - మహత్మ్యము - 
నేను అను ఈ ప్రజ్ఞ గుణాతీతము, కాలాతీతము కూడ! దీనినుండి సమస్త భావములు, కాలానుసారముగ వృద్ధి చెంది, ప్రవర్తించి, ఈ నేనను ప్రజ్ఞలో మరల కలియుచున్నవి. 
🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 18, 19, 20, 21 📚

ఈ సృష్టి మొత్తమును పరిశీలించి చూచినచో సమస్తమును మార్పు చెందుచున్నట్లు గోచరించును. మార్పు చెందు ఈ సమస్తమునకు మార్పు చెందని ఒక కేంద్రము కలదు. అది మార్పు చెందువానిలో మార్పు చెందక యుండును. అది ఆధారముగా సమస్తమును ఉద్భవించి, వృద్ధిపొంది, లయమగు చున్నది. 

ఉద్భవము, వృద్ధి, లయము, మరల ఉద్భవము, అనంతముగా సాగుచుండును. లయమైనపుడు వృద్ధిపొందిన విషయము సూక్ష్మమై ఈ కేంద్రమునందు యిమిడి యుండును. మరల కాలము ననుసరించి ఉద్భవించుట, వృద్ధిపొందుట జరుగుచున్నది. 

అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తా: శరీరిణ: |
అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత || 18

య ఏనం వేత్తి హన్తారాం యశ్చైనం మన్యతే హతం |
భౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే || 19

న జాయతే మ్రియతే వా కదాచిన్
నాయం భూత్వా భవితా వా న భూయ: |

అజో నిత్య: శాశ్వతోయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే || 20

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
కథం స పరుష: పార్థ కం ఘాతయతి హన్తి కం || 21

ఉదాహరణకు మనలో బాల్యము నుండి వృద్ధాప్యము వరకు అనుదినము మార్పులు జరుగుచునే యున్నప్పటికీ దైనందినముగ ఆ మార్పులను మనము గమనించము. 

కారణమేమన సహజముగా మార్పు చెందని ఆ కేంద్ర ప్రజ్ఞయే మనము. మనమాధారముగా అనేక భావములు కలిగినవి. ఆ భావములు మార్పు కూడ చెందినవి. భాషణములు కూడ అట్లే! ఎన్నెన్నో భావములు, భాషణములు, చేతలు, వాియందు ఎన్నెన్నో మార్పులు! ఇన్ని యందు ' నేనున్నా''నను ప్రజ్ఞకు ఏ మార్పూలేదు.

ఈ ప్రజ్ఞ గుణాతీతము, కాలాతీతము కూడ! దీనినుండి సమస్త భావములు, కాలానుసారముగ వృద్ధి చెంది, ప్రవర్తించి, ఈ నేనను ప్రజ్ఞలో మరల కలియుచున్నవి. 

ఈ ప్రజ్ఞనే ఆత్మ యందురు. అది నిత్యముగను, నాశరహితముగను, కొలతలకు అతీతముగను, జనన మరణముల కతీతముగను ఉండును.

ఉండుటయే దీని సహజ లక్షణము. దీనినుండి పుట్టిన వానికి చంపుట, చచ్చుట ఇత్యాది లక్షణము లుండును. ఇది మాత్రము శాశ్వతముగ నుండును. 

కావుననే భీష్మాదులు మరణించినను, మరణించుట అనగా ఆ మరణము వారి దేహములకు, భావములకే గాని, వారికి కాదని, వారింతకు ముందు కలరని, ఇక ముందును ఉందురని భగవానుడు తెలిపెను. వారిని దేహములుగా కాక దేహులుగా అనగా దేహములను ధరించిన వారిగా చూడుమని జ్ఞానదృష్టి కల్పించబూనెను.

దేహములు నిత్యము కావనియు, దేహులు నిత్యులనియు, చంపకుండినను దేహములు కాలక్రమమున మరణించుననియు,

అట్టి దేహములు ధర్మ యుద్ధమున మరణించుటచే అందలి ప్రజ్ఞలకు ఉత్తమ సంస్కారములు కలుగుననియు, కావున యుద్ధము చేయుమనియు భగవానుడు బోధించినాడు.

ఇందొక మహోపదేశము కలదు. ''దేహి నిత్యుడు కావున దేహమును ధర్మాచరణమునకై వినియోగించుచు, అట్టి ఆచరణమున వలసినచో మరణించుటకైనను మానవుడు వెనుతీయరాదని'' ఉపదేశము.

ధర్మము ఎటు పోయినను మనము ఉండవలె ననుకొనుట కాక, మనకేమైనను ధర్మము నిలబెట్టుట గీత ప్రతిపాదించు ముఖ్యమైన సూత్రము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


21.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹 11. యోగవిద్య - అభ్యాసము - తాను శరీరము కాదని, శరీరము తాను ధరించిన వస్త్రమని, తెలియుటయే జ్ఞానము. దానిని సాధించే మార్గమే యోగవిద్య. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 22 📚

చినిగిన, చివికిన బట్టలను విడచి, క్రొత్త బట్టలు వేసుకొనుట బుద్ధి. వాటినే సర్దుబాటు చేసుకొనుట లోభత్వము. అది మోహము నుండి జనించును. శరీరములు కూడ వస్త్రముల వలె చివుకుట, చినుగుట జరుగును. అప్పుడు వానిని వదలి క్రొత్తవి ధరించుటకు సంసిద్ధత కావలెను. అది జ్ఞానము వలన కలుగును.

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరో-పరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ || 22 

తాను శరీరము కాదని, శరీరము తాను ధరించిన వస్త్రమని, ధర్మముతో కూడిన అర్థకామములను తాననుభవించుటకు ప్రకృతిచే ఈయబడిన వాహనమని, చినిగినచో మరియొక క్రొత్త వస్త్రము ప్రకృతి ఇచ్చునని తెలియుటయే ఈ జ్ఞానము.

వస్త్రములు మార్చినవాడు తాను మారుచున్నానని అనుకొనుట లేదు. 

పూర్వవస్త్రములలో తానెట్లుండెనో తనకు జ్ఞప్తి యున్నది. అటులనే దేహములు మార్చినను, అంతకు ముందు దేహములో తానెట్లుండెనో తెలియు విద్య కలదు, అది యోగవిద్య.

అది తెలిసినవారు దేహములను మార్చుట వస్త్రములను మార్చునంత సులభముగా చేయుదురు. ఈ విద్య కోల్పోవుటచే బికారుల వలె చివికినవి, చిరిగినవి అయిన వస్త్రములను పట్టుకొని అజ్ఞానమున జీవులు వ్రేలాడుచున్నారని గీత ఘోషించుచున్నది. 

పాత బట్టలు వదలవలె నన్నచో క్రొత్త బట్టలున్నవను దృఢ విశ్వాస మేర్పడవలెను కదా! అట్లేర్పడుటకు నిర్దిష్టమైన, క్రమబద్ధమైన అభ్యాసము కలదు. అదియే యోగ విద్యాభ్యాసము. అట్టి విద్యను బోధించు యోగ శాస్త్రమే గీత.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


------------------------------------ x ------------------------------------



🌹 12. ఆత్మ - ఆత్మ దర్శనమునకు నిర్దిష్టమైన సాధనా మార్గము కలదు. అదియే యోగవిద్య. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 23, 24, 25, 📚

ఆత్మతత్వము నెరిగిన వారికే ఆత్మను గూర్చి పూర్ణమైన అవగాహన యుండును. ఎరుగుట యనగా అనుభవ పూర్వకముగా నెరుగుట. బోధనా పూర్వకముగ కాదు. బోధనా పూర్వకముగ ఆత్మను గూర్చి తెలుపుట కేవలము సమాచారము నందించుటయే.

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతó || 23

అచ్ఛేద్యో-య మదాహ్యోయ మక్లేద్యో-శోష్య ఏవ చ |
నిత్య స్సర్వగత స్థా ్సణు రచలో-యం సనాతనó || 24

అవ్యక్తో-య మచింత్యో-య మవికార్యో-య ముచ్యతే |
తస్మా దేవం విదిత్వైనం నానుశోచితు మర›సి || 25

ఆత్మ దర్శనమునకు నిర్దిష్టమైన సాధనా మార్గము కలదు. అదియే యోగవిద్య. అట్టి యోగవిద్యను ప్రతిపాదించు ప్రపంచ గ్రంథంము భగవద్గీత యొక్కియే! 

ఆత్మ స్వరూపుడైన శ్రీ కృష్ణ భగవానుడు రెండవ అధ్యాయమున ఆత్మతత్త్వమును ప్రతిపాదించినాడు. అటుపైన

ఆత్మదర్శనము జరుగుటకు వలసిన సోపానము లేర్పరచినాడు.

ఆచరణ పూర్వకముగా భగవద్గీతను అందించటం జరిగింది.

అనుసరించుటయే సజ్జనుని కర్తవ్యము.

''ఆత్మ'' ఆయుధముచే ఛేదింపబడనిది. అగ్నిచే దహించబడనిది. నీటిచే తడప బడనిది. గాలిచే ఎండిప బడజాలదు. ఆత్మ నిత్యము. అంతా వ్యాపించి యున్నది. స్థిరమైనది. చలనము లేనిది. తుది, మొదలు లేనిది.

''ఆత్మ'' ఇంద్రియములకు గోచరము కాదు. మనస్సుచే చింతింప శక్యము కాదు. ఇట్లు ఆత్మను గూర్చి వివరించినపుడు పాఠకునకు అది సమాచారమే గాని, అనుభవపూర్వకము కాదు.

దానిని అనుభూతి చెందుటకే ''భగవద్గీత'' యను యోగ శాస్త్రమును భగవానుడే జాతి కందించినాడు. ఆచరణమే దీనికి ప్రధాన సూత్రము.

------------------------------------ x ------------------------------------



🌹.  13. ఆత్మ - అద్భుతము - ఆశ్చర్యము  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 29 📚

ఆశ్చర్యవ త్పశ్యతి కశ్చి దేన
మాశ్చర్యవ ద్వదతి తథైవ చాన్యó |

ఆశ్చర్యవ చ్చైన మన్య శ్శృణోతి
శ్రుత్వా ప్యేనం వేద నచైవ కశ్చిత్‌ || 29

ఆత్మను గూర్చి చెప్పుచున్ననూ, వినుచున్ననూ, చదువు చున్ననూ, అట్లెన్నిసార్లు ఒనర్చిననూ ఆత్మాను భవము కలుగదు. ఆచరణ పూర్వక మైనచో అనుభూతమై పూర్ణముగ తెలియును. లేనిచో గాలిని మూట కట్టుకొనినట్లు ఎప్పికప్పుడు దానిని గూర్చిన భ్రాంతియే మిగులును.

సృష్టియందు అన్నికన్నా

అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది 'ఆత్మ' ఒక్కటియే! ఇంద్రియ నిగ్రహము, బాహ్య విషయముల యెడ నైరాశ్యము మరియు వైరాగ్యము, చిత్త నైర్మల్యము, అంతర్ముఖ తపస్సు సాధించిన ధీరునికే ఆత్మదర్శనము కలుగును. అట్టి వాడు

దుర్లభుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

26 Aug 2020

------------------------------------ x ------------------------------------





🌹   14. అశోకత్వము - అవ్యక్తముగ నున్నది వ్యక్తమైనపుడు పుట్టినదనుకొనుట, వ్యక్తమైనది అవ్యక్తమును జేరునపుడు చచ్చినదను కొనుట అజ్ఞానము.   🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚.   గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 30   📚

దేహీ నిత్య మవధ్యో-యం దేహే సర్వస్య భారత | తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి || 30 

సృష్టి సమస్తమూ ఒక దిశగా వ్యక్తమగుచుండగా, మరియొక దిశగా అవ్యక్తమును చేరుచూ మరల వ్యక్తమగుచుండును. వ్యక్తము కానపుడు సూత్రప్రాయముగను, వ్యక్తమగునపుడు రూపాత్మకముగను ఒకే తత్త్వము నిలచియున్నది. 

చోటులోని కనపని నీరు వర్షమైనప్పుడు వ్యక్తముగను, భూమికి చేరి ప్రవహించునపుడు 'నది' యగును. ఉత్తర దక్షిణ ధృవములందు కఠినమైన మంచుగడ్డ యగును. సూర్యరశ్మిచే మరల క్రమశః చోటును చేరును. మరల అవ్యక్త మగును. కాలక్రమమున మరల వర్షముగ వ్యక్తమగును.

సృష్టిలోని సమస్త వస్తువులూ అట్టివే. వ్యక్తావ్యక్తముగ చక్ర భ్రమణమున అగుపించుచూ అదృశ్యమగుచూ, నిరంతరమూ వుండును. 

ఈ ధర్మమును తెలిసినవాడు దేనికిని శోకింపడు. అతనికి జననము - మరణము అనునవి మిథ్యా పదములే. కనుక జీవుల పుట్టుకయందు ఉత్సాహము, మరణము నందు దుఃఖము వానికి కలుగవు. 

పుట్టునవి - చచ్చునవి అని ఏమియూ లేవు. శాశ్వత దర్శన మొక్కటే యుండును. దానియందతడు ఉపస్థితుడై యుండును. 

ఇట్టి దర్శనము మాత్రమే సమస్త శోకముల నుండి జీవుని తరింప జేయగలదని 'గీతోపనిషత్తు' బోధించు చున్నది.
🌹 🌹 🌹 🌹 🌹


------------------------------------ x ------------------------------------


🌹. 15. ధర్మము - ధర్మాచరణమున మరణించిననూ తనకిష్టమే ననియు, అధర్మా చరణమున జీవించుట హేయమనియు నిష్కర్షగ గీతోపనిషత్తు బోధించుచున్నది. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 33 - 37 📚

ఈ ప్రపంచమున నిరపాయముగ జీవించుటకు, నశింప కుండుటకు ధర్మ మొక్కటే పట్టుకొమ్మ. భారతీయ వాఙ్మయము సమస్తమునూ ధర్మాచరణనే బోధించును.

అథం చేత్త్వ మిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తతó స్వధర్మం కీర్తిం చ హిత్వా పాప మవాప్స్యసి || 33

అకీర్తిం చాపి భూతాని కథంయిష్యంతి తే-వ్యయామ్‌ |
సంభావితస్య చాకీర్తి ర్మరణా దతిరిచ్యతే || 34

భయాద్రణా దుపరతం మన్యంతే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్‌ ||35

అవాచ్యవాదాంశ్చ బప˙న్‌ వదిష్యంతి తవాహితాః |
నిందంత స్తవ సామర్థ్యం తతో దుóఖతరం ను కిమ్‌ || 36

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్‌ |
తస్మా దుత్తిషస కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయó || 37

గీతోపనిషత్తు కూడ ధర్మపరిపాలనముననే పరిపూర్ణముగ సమర్థించును. ఎవరి ధర్మము వారు పరిపాలించినపుడు సంఘము సుభిక్షమగును.

'కలి' ప్రభావమున ప్రతియొక్కరు స్వధర్మమును నిర్లక్ష్యము చేయుట జరుగుచున్నది. ఎవరు ఏ పనినైననూ చేయవచ్చునను అవగాహన కలిప్రభావమే.

కుక్క పని గాడిద చేయరాదు. గాడిద పని గుర్రము చేయరాదు. ఏనుగు పని ఎలుక చేయరాదు. ఆవు పని పిల్లి చేయరాదు - అని ఎవరునూ తెలుపనక్కరలేదు కదా! 

అట్లే క్షత్రియుడు బ్రాహ్మణుని పని, బ్రాహ్మణుడు వైశ్యుల పని, వైశ్యులు క్షత్రియుల పని యిట్లు కలగాపులకముగా అందరునూ అన్ని పనులూ చేయుట ధర్మమును వెక్కిరించుటయే.

అర్జునుడు క్షత్రియుడగుట వలన ధర్మ రక్షణకై యుద్ధము చేయుట అతని కర్తవ్యము. వేదాంతివలె తత్త్వమును పలుకుట అసమంజసము. అతని తత్త్వము కూడ మిడిమిడి జ్ఞానమే.

తాను చేయవలసిన పని చేయుటకు అసళిలికర్యముగ నుండుట వలన మరియొక మార్గమును చూసుకొనువాడు, అపకీర్తి పాలగుటయేగాక, పాపమును పొంది నశింపగలడు. 

ధర్మ ప్రవర్తనమున మరణించిననూ, జయించి బ్రతికిననూ అట్టి జీవుడు ముక్తుడై యుండును. అధర్మమును ఆచరించువాడు, ఆచరించుచూ జీవించువాడు శవము కన్నా హీనమని ధర్మము బోధించుచున్నది.

ధర్మాచరణమున మరణించిననూ తనకిష్టమే ననియు, అధర్మా చరణమున జీవించుట హేయమనియు నిష్కర్షగ గీతోపనిషత్తు బోధించుచున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

28 Aug 2020

------------------------------------ x ------------------------------------



🌹. గీతోపనిషత్ - 16. భయము - భదత్ర : -- ఎంత స్వల్పమైననూ, అతి చిన్న దైననూ ఏదో నొక ధర్మమును దైనందినముగ ఆచరించిన జీవునకు ఎంత పెద్ద భయమైననూ నివారణమగును., 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 40 📚

నేహాభిక్రమనాశో-స్తి ప్రత్యవాయో న విద్యతే |

స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌ || 40

మానవ జీవితమున ప్రస్తుత కాలమున భద్రత లోపించినది. భయమావరించినది. ప్రాథమిక విద్య నేర్చు పసివాని నుండి పరిపాలనము చేయు పరిపాలకుని వరకూ ఎవరును నిర్భీతిగా జీవించుట లేదు. 

పిల్లలకు చదువు భయము, యువకులకు వృత్తి - ఉద్యోగ భయము, మధ్య వయస్కులకు అభివృద్ధిని గూర్చి భయము, అధికారులకు పదవీ భయము, ధనకాముకులకు ధన భయము, కీర్తి కాముకులకు అపకీర్తి భయము, అందరికీ అనారోగ్య భయము, జీవితమంతా భయం భయం. ఇవికాక, హత్యలు, మారణ హోమాలు, అభద్రత, వివిధమగు ప్రమాదాలు, యిన్ని యందు దినమొక గండముగ జీవితము సాగుచున్నది. నిస్సహాయుడైన మానవుడు కలియుగము కదాయని, సమస్తమును సరిపెట్టు కొనుచున్నాడు. 

భౌగోళికముగా యిప్పుడు భూమికి చక్రవర్తి భయమను పిశాచమే. అది కారణముగా భద్రత ఎండమావిగ భావించబడుతూ యున్నది. కానీ, భద్రపథమును భగవద్గీత సూక్ష్మముగ తెలిపియున్నది. ఆ పథము శాశ్వతముగా భయమును నివారించును. 

ఎంత స్వల్పమైననూ, అతి చిన్న దైననూ ఏదో నొక ధర్మమును దైనందినముగ ఆచరించిన జీవునకు ఎంత పెద్ద భయమైననూ నివారణమగును. నిరంతరత్వము, శ్రద్ధాభక్తులు, ఒక ధర్మము ననుసరించుటలో ప్రాప్తించిన జీవునకు సమస్త భయమూ పాపంచలగును. 

కలియుగము కటిక చీకటిది. కటిక చీకటిలో చిన్న దీపము కూడ చక్కని వెలుగునిచ్చి దారి చూపును. అట్లే నిరంతరమూ నిర్వర్తింప బడుచున్న చిన్న ధర్మము ఎంతపెద్ద భయము నుండైనా రక్షించగలదు.

''స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌''

అని భగవానుడు వాగ్దానము చేసెను. 

దీనిని విశ్వసించి ధర్మమాచరించు జీవునకు భయపడుటకు తావుండదు. భయంకరమగు భయమును అతి స్వల్పమైన ధర్మాచరణ మాలంబనముగా దాటుడు. ఇట్లు మార్గమును సుభద్రము చేసుకొనుడు.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

29.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. 17. గీతోపనిషత్తు - వ్యవసాయము - బుద్ధిని పరిపరి విధములుగ పోనీయక తెలిసిన విషయములందు నిర్దిష్టముగ నియమించి ఆచరించడమే ఆధ్యాత్మిక వ్యవసాయము 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 41 📚

భారతదేశమున పండితులెందరో కలరు. చాలామందికి చాలా విషయములు తెలియును. వేదాంతము మొదలుకొని నీతికథల వరకును అందరూ అన్నియూ చెప్పగలరు. 

బోధకులకు, గురువులకు, మహాత్ములకు లోటులేని పుణ్యభూమి. సనాతనమైన దేవాలయములు, ఆధ్యాత్మికతను పెంపొందించు ఆశ్రమములు లెక్కకు మిక్కుటములు. అన్ని సమస్యలకూ పరిష్కారములు తెలుపగలిగిన మేధాసంపత్తి తగు మాత్రము గలదు. 

41. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్ద |
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్దయో వ్యవసాయినామ్ ||

ఈ మార్గమున ఉన్నవారు స్థిరప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగియుందురు. ఓ కురునందనా! స్థిర ప్రయోజనము లేనివారి బుద్ధి అనేక విధములుగా నుండును.

ఇంత జ్ఞానము కలిగియున్ననూ భరతజాతి యింతటి దుస్థితి యందు వుండుటకు కారణమేమి? పేదరికము, అనాగరికత, దురాచారము యింత విజృంభణము చేయుటకు కారణమేమి? భారతదేశమున రాణించలేని భారతీయులు, విదేశములలో రాణించుటకు కారణమేమి?

ఇన్నింటికీ కారణ మొక్కటియే. మనకు చాలా విషయములు తెలియును. కాని, వాటిని ఆచరించు స్పూర్తి లేదు. అన్నమెట్లు వండుకొని తినవలెనో బాగుగ తెలిసి, వండుకొనుటకు బద్ధకించు జాడ్యము జాతిని పీడించుచున్నది. ఆచరణ శూన్యతయే కారణముగ సమస్త జ్ఞానము అక్కరకు రాకుండ యున్నది.

వ్యవసాయము తెలిసియూ చేయని రైతునకు ధాన్యమెట్లు లభింపదో, తెలిసిన విషయము లాచరించని వానికి నిష్కృతి లేదు. 

బుద్ధిని పరిపరి విధములుగ పోనీయక తెలిసిన విషయములందు నిర్దిష్టముగ నియమించి ఆచరించమని గీతోపనిషత్తు నిర్దేశించుచున్నది. ఈ సూత్ర మంగీకరింపని వానికి జీవితము ఒక ఎడారి!
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

30.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹  18. గీతోపనిషత్ - అనర్హుడు - మనస్సుచే మోసగింపబడిన వారు దైవ ధ్యానమును చేయలేరు. రసానుభూతిని పొందలేరు.  🌹

భోగైశ్వర్యప్రసక్తానం తయాపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధి: సమాధౌ న విధీయతే || 44

భగవంతుడు రస స్వరూపుడు. రసాస్వాదనము చేయుటకే జీవనము. అదియే వైభవము. అట్టి వైభవమును పొందుటకు ఈ క్రిందివారనర్హులని భగవానుడు బోధించుచున్నాడు.

1) కర్మఫలములం దాసక్తి గలవాడు,
2) పుణ్యము కొరకు మంచిపని చేయువాడు,
3) కోరికలతో నిండిన మనస్సు కలవాడు,
4) భోగములయం దాసక్తి కలవాడు,
5) జ్ఞాన సముపార్జన చేయనివాడు,
6) ఐశ్వర్యములను సంపాదించుటకు ప్రయాస పువాడు,
7) తెలిసినదానిని ఆచరించనివాడు. 

పైవారందరూ వారి మనస్సుచే మోసగింపబడినవారు. వారు దైవ ధ్యానమును చేయలేరు. రసానుభూతిని పొందలేరు.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

31.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹  19. గీతోపనిషత్ - తుదిమెట్టు : సత్వగుణము నిత్య సత్యముగ నుండుట, అనగా రజస్సును, తమస్సును అధిష్టించి యుండు వాడే త్రిగుణములు దాటిన వాడగును. అతనికే పూర్ణమైన రసానుభూతి అందిన ఫలము. ఇతరులకు అందని ద్రాక్ష పండే!  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 45 📚

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్‌ || 45

మానవ జీవితము త్రిగుణములతో అల్లబడి నిర్వర్తింప బడుచున్నది. కొంత తవు రజోగుణము పని చేయుచుండగ విజృంభించి పనిచేయుట యుండును. 

అటుపైన తమోగుణ మావరించి కాళ్ళు బారజాపుకొని యుండుట, అనారోగ్యము పొందుట, విశ్రాంతిని కోరుట యుండును. చేయుట, చేయకపోవుట అను రెండు స్తంభముల మధ్య తిరుగాడుచూ జీవుడు క్షణ కాలము, రెండు గుణములను తనయందిముడ్చుకొను సత్వగుణమును అతి స్వల్పముగ రుచిగొనును. 

సత్వగుణ రుచి నిజమైన ఆనందమును కలిగించి అట్టి ఆనందము కొరకై అన్వేషించుట జరుగు చుండును. ఈ అన్వేషణముననే కాలము వ్యయమగు చుండును. రజస్సు, తమస్సు అనే గుణములు మనస్సున ద్వంద్వములున్నంత కాలము జీవుని యిటు నటు లాగుచుండును. సత్వగుణము ద్వంద్వముల కతీతమైనది. అందు రజస్సు - తమస్సు యిమిడి అదృశ్యమగును. 

జీవితము ద్వంద్వముల క్రీయని గుర్తించిన జీవుడు, అవి కాలానుగుణముగ వచ్చిపోవు చుండునని తెలుసుకొన్నాడు. ప్రజ్ఞ మనస్సు యందు గాక, బుద్ధి యందు స్థిరపడును. 

అప్పుడు సత్వగుణము నిత్య సత్యముగ నుండును. అనగా రజస్సును, తమస్సును అధిష్టించి యుండును. అట్టి వాడే త్రిగుణములు దాటిన వాడగును. అతనికే పూర్ణమైన రసానుభూతి అందిన ఫలము. ఇతరులకు అందని ద్రాక్ష పండే!

''నిస్త్రగుణ్యో భవ అర్జునా'' అని కృష్ణు సుతిమెత్తగ అర్జునుని హెచ్చరించుటకు కారణమిదియే. నిత్య సత్యమే పరిపూర్ణ జీవనానుభూతికి ప్రాతిపదిక.

వేదములు కూడ త్రిగుణాత్మకములైన విషయములనే తెలుపుచున్నవి కాని, తదతీతమైన స్థితికి లేదనియు, యోగవిద్య ఒక్కియే పరిష్కారమనియు భగవానుడు స్పష్టముగా తెలిపియున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

01.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹   20. గీతోపనిషత్తు - ఆచరణ - ఆచరణము లేని జిజ్ఞాస జీవుని భ్రష్టుని చేయగలదు. ఆచరణములోనే సమస్తమూ అనుభవమునకు వచ్చును.  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 46 📚

వేదమపారము. జ్ఞానమునూ అపారమే. తెలియవలసినది ఎప్పుడునూ యుండును. తెలిసిన దానిని ఆచరించుట అను మార్గమున మరికొంత తెలియుట యుండును. 

యావానర్థ ఉదపానే సర్వత: సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత: || 46

ఈ మార్గమున తెలియుటలో అనుభవము వుండును. అనుభూతి యుండును. మరియూ తెలిసినది అక్కరకు వచ్చును. ఊరికే తెలుసుకొనుట వలన ఉపయోగము లేదు. అది అక్కరకు రాదు. అనుభూతి నీయదు. అనుభవమూ కలుగదు. ఆచరణము లేని జిజ్ఞాస జీవుని భ్రష్టుని చేయగలదు. ఆచరణములోనే సమస్తమూ అనుభవమునకు వచ్చును.

ఊరకే తెలుసు కొనుట వలన మెదడు వాచి, తెలిసిన వాడనను అహంకారము బలిసి జీవుడు భ్రష్టుడగును. బ్రహ్మమును తెలిసిన వారందరూ ఆచరణ పూర్వకముగా నెగ్గిన వారే. బోధనలను వినుట వలన, గ్రంథంములను పఠించుట వలన, తెలియునది పుస్తక విజ్ఞానమే. 

ఆచరించు వారిదే అసలు విజ్ఞానము. తెలుసుకొనుట, తెలిసినది ఆచరించుట అనునవి అనుశ్యాతముగ ఉఛ్వాస నిశ్వాసములవలె సాగుట క్షేమము. అది తెలిసిన వారే తెలిసినవారని, యితరులు మిధ్యాచారులని

భగవంతుడు బోధించి యున్నాడు.

భారతీయులకిదియే ప్రస్తుత కర్తవ్యము. 

ఉదాహరణకు, దాహము కలిగిన వానికి బావి కనపి నప్పుడు, అందుండి తనకు వలసిన జలములను గ్రోలి తృప్తి చెందుట క్షేమము. 

అంతియేకాని, అసలా బావియందు ఎంత నీరున్నది? దినమున కెంత ఊరుచున్నది? ఎంతమంది ప్రతి దినమూ త్రాగినచో బావి ఎండక యుండును? అను జిజ్ఞాసలో పినచో, గొంతెండి చనిపోవుటయేయుండును. చదివిన వారందరూ తెలిసినవారు కారనియు, రామకృష్ణ - వివేకానందుల వలె ఆచరించినవారే తెలిసినవారని తెలియవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

02 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹   21. గీతోపనిషత్తు - కర్మాధికారము - అధికారము లేని ఫలముల యందే అమితాసక్తి మానవ మేధస్సు కనబరచును కాని, తన అధికారములోని కర్తవ్యమును మాత్రము నిర్వర్తించము. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 47 📚

ఎన్ని జన్మలెత్తిననూ, ఎంత మేధస్సును పెంచుకొనిననూ, ఎన్ని గ్రంథంములు చదివిననూ, ఎన్ని విజయములు పొందిననూ, ఎంత ధనము, కీర్తి సంపాదించిననూ మానవుడు ఎందులకో జీవితమున ప్రాథమిక సూత్రముల ననుసరించుట లేదు.

భారత దేశమున వేలాది సంవత్సరములుగా సగటు భారతీయునికి భగవానుడు తెలిపిన ఈ క్రింది సూత్రము తెలియును కానీ ఆచరింపము. ముమ్మాటికి ఆచరింపము. అందువలనే జీవన విభూతి లేదు. 

కర్మణ్యేవాధికార స్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫల హేతుర్భూ ర్మా తే సంగో-స్త్వకర్మణి || 47

సూ|| ''కర్మ చేయుట యందే నీకధికారము కలదు గాని, ఫలముల యందు నీ కెప్పుడూ అధికారము లేదు.''

ఈ సూత్రము విననివారు లేరు. అంగీకరించి, అనుసరించు వారునూ లేరు! ఇంతకన్న జీవితమున మాయ ఏమి కలదు? కేవలము ఫలము కొరకే ప్రాకులాడు జాతికి నిష్కృతి లేదేమో!!అను నిస్పృహ కలుగక తప్పదు.

అధికారము లేని ఫలముల యందే అమితాసక్తి మానవ మేధస్సు కనబరచును కాని, తన అధికారములోని కర్తవ్యమును మాత్రము నిర్వర్తించము. 

ఇది ఏమి లీల! రోగికి ఔషధము చేదుగా నుండును. అందు వలననే ఔషధము స్వీకరింపక మానవుడు మరల మరల మరణించుచున్నాడు.

కేవలము కర్తవ్యము నందు ఆసక్తి కలిగి ఫలితము నందు అనాసక్తత కలుగ వలెనన్నచో రెండే రెండు ఉపాయములు గలవు.

ఒకటి - యోగేశ్వరుల జీవిత చరిత్రలను పఠించి, స్ఫూర్తి చెంది, అట్లు జీవించుటకు ప్రయత్నించుట; 

రెండవది - మన మధ్య తిరుగాడుచున్న యోగులను గుర్తించి ప్రత్యక్షముగ పై తెలిపిన సూత్రమును దర్శించి, తద్వారా స్ఫూర్తి చెంది, అట్లు జీవించుటకు ప్రయత్నించుట. ఇతరములైన మార్గములు కష్టతరములు. 

ఇట్టి ప్రాథంమిక సూత్రమును మరచి, పండితులు గీతా పారాయణమునకు కూడ ఫలితమును నుడివిరి. ఫలిత మాశింపక కర్తవ్యమును ఆచరింపుమని లేదా నిర్వర్తింపుమని బోధించు గ్రంథంరాజమునకే పండితులు పంగ నామములు పెట్టిరి. వీరు 'కలి' చే నియమింపబడిన వారే కాని, తెలిసినవారు కారని తెలియుచున్నది కదా ! 

నిజముగ జీవితమును పండించు కొనదలచినచో భగవద్గీత యందలి ఈ ఒక్క వాక్యము చాలును.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


03.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹  22. గీతోపనిషత్తు - కర్మ సూత్రము - మనము చేయు పనులు పదిమందికి పనికి వచ్చునట్లు చేసినచో బంధస్థితి నుంచి మోక్షస్థితి వైపు మార్గమున మలుపు రాగలదు.  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 48, 49  📚

చేయు పనుల ద్వారా మనలను మనమే బంధించుకొనుట

ఏమి తెలివి? తెలివైన వాడిననుకొనువాడు కూడ తన తెలివితోనే తన జీవితమును చిక్కుపోచుకొను చున్నాడు కదా! వీరు కొరమాలిన తెలివికలవారే కాని, నిజమైన తెలివిగలవారు కారు.

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే || 48

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ద్ధనంజయ |
బుద్ధౌ శరణ మన్విచ్ఛ కృపణాః ఫలహేతవః || 49

ఒక పని చేయునప్పుడు, దాని నుండి పుట్టు పనులను, చిక్కులను, కష్ట-నష్టములను పూర్తిగ బేరీజు వేసుకొనవలెను. ప్రస్తుతమునకు సరలికర్యముగ నున్నదని, లాభము కలుగుచున్నదని, జయము చేకూరునని, చేయుపనులు అటుపై వికించగలవు. 

పెద్దలు యిచ్చిన నానుడిలో ముఖ్యమైన దేమనగా - ''పాపము చేయు నపుడు చమ్మగ నుండును. ఫలితము లనుభవించునపుడు చేదుగా నుండును.''

కరుడుకట్టిన స్వార్థముతో తనకు లాభించునని ప్రతి మానవుడు దాని తరంగముల ప్రభావము తెలియక ఉరుకులు పరుగులు వేయుచూ యితరులను దోచుకొనుచున్నాడు. మానవుడు రాక్షసుడై హద్దూ-పద్దూ లేక భూమి సంపదను, వృక్ష సంపదను, జంతు సంపదను దోచుకొనుచున్నాడు.

ఎక్కువ దిగుబడికై వృక్షములు మరియు జంతువుల జన్యువులను కూడ రసాయనక చర్యలతో ఒత్తి కలిగించుచున్నాడు. ఇది అంతయూ తనయొక్క మేలునకే అనుకొని చేయుచున్నాడు. చేయు పనులనుండి పుట్టబోవు మహత్తర మైన విపత్తులను గమనించుటయే లేదు.

పంచభూతముల సమన్వయమును కూడ భంగపరచుటకు సిద్దపడిన మానవుడు, ఈనాడు తాను చేసిన పనికి కలుగు ఫలిత మెట్లుండునోనని భయ భ్రాంతుడై జీవించుచున్నాడు. 

మంచుపర్వతములు కరుగునని, సముద్రములు పొంగునని, అగ్నిపర్వతములు బ్రద్దలగునని, అనివార్యమైన రోగములు ప్రబలునని, జీవనపు అల్లిక చెడిపోవు చున్నదని దుఃఖ పడుచున్న మానవుడు ఈ విపత్కర పరిస్థితికి తానే కారణమని తెలుసుకొనవలెను. 

తన స్వార్థచింతన తగ్గించు కొని పరహితము పెంచుకొనినచో జీవన విధానమున మార్పు ఏర్పడి పరిష్కారము లభింప గలదు. 

ఈనాటి మానవుని తెలివి ఆత్మహత్య గావించుకొను వాని తెలివిది. శాస్త్ర విజ్ఞానము పెరుగుదల, సంస్కారముల

తరుగుదల కారణముగ అతి వేగముగ ప్రమాదము వైపు పరుగిడుచున్నాడు. 

మనము చేయుపనులు పదిమందికి పనికి వచ్చునట్లు చేసినచో బంధస్థితి నుంచి మోక్షస్థితి వైపు మార్గమున మలుపు రాగలదు.

ప్రతి జీవియు తన జీవన నిర్మాణ పథంమున ఎప్పటికప్పుడు

జీవితముపై తన స్వామిత్వమును పరికించుచుండవలెను. అట్లు కానిచో వృత్తి, కుటుంబము, సంఘము, అతనిని బంధించగలవు. 

జీవితము ముందుకు సాగుచున్న కొలది, బాధ్యతలు పెరిగిననూ మనసున బంధము పెరుగరాదు. బంధములు పెంచుకొను

మార్గము చావుతెలివి. 

ఉదా : మంచి గదిని నిర్మాణము చేసుకొను వాడు తన చుట్టునూ ఇటుకపై ఇటుక పేర్చుకొనుచూ నలువైపులా గోడను నిర్మించుకొనినచో బయటకు పోవు దారిలేక తను నిర్మించిన గదియే నిర్గమశాన్యమగు దుర్గమై తాను సమాధి చెందుటకు కారణమగును.

ప్రతివ్యక్తియూ ఈనాడు తన పెరుగుదల రూపమున ఈషణ

త్రయమున విపరీతముగ బంధించుకొనుచూ తన గోరీని తానే

నిర్మాణము చేసుకొనుచున్నాడు. అంతియేకాదు, తనంత తెలివిగ యితరులు గోరీలు కట్టుకొన కూడదని పోీపుచూ అందమైన గోరీని నిర్మాణము చేసుకొను చున్నాడు. జీవితమును ఒక కారాగారముగ నిర్మించుకొనుటగా కాక, రాకపోకలు గల ఒక గృహముగ నేర్పాటు చేసుకొనుటకు వలసిన సూత్రమునే భగవానుడు- 

''మాకర్మ ఫలహేతుర్భూ'' అని హెచ్చరించి యున్నాడు. చిన్నతనముననే ఈ ఎరుక కలిగినచో జీవిత మానందమయ మగుటకు అవకాశముండును. తిమింగలముచే పట్టబడిన తరువాత తెలిసినచో బంధమోచనము కష్టతరము.

ఎవరైననూ వచ్చి రక్షించవలసినదే కాని, తనను తాను రక్షించుకొనలేు. అట్టి వానికి గజేంద్రుడు చేసిన ప్రార్థనయే శరణ్యము.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

04.Sep.2020

------------------------------------ x ------------------------------------





🌹  23. గీతోపనిషత్తు - కర్తవ్యము - పాప - పుణ్యములు. 
ధర్మమును కర్తవ్యము రూపమున అనుసరించుటయే బుద్ధియుక్తమగు జీవనము. అట్టి జీవనమున ఫలాసక్తి లేకుండుట కౌశలముతో గూడిన కర్మయోగము
 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 50 📚

బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ || 50 ||

బుద్ధిలోకములో నుండి పనిచేయు వాడు పుణ్య కర్మలని, పాప కర్మలని విభజించి ఫలితములనుద్దేశించి పనులు చేయడు. ఆ భావమును విసర్జించి తన కర్తవ్యమును నిర్వర్తించును.

ఫలితములపై ఆశ లేనివానికి పుణ్యపాపముల విభజన వుండదు. అతనికి కర్తవ్యము మాత్రముండును. కర్తవ్యమును మాత్రమే ఉద్దేశించుకొనుచు వివేకముతో పనిచేయు వానిని కర్మఫలములు బంధించవు.

పుణ్యపాపముల విభజనము మనోలోకములకు సంబంధించినది. బుద్ధిలోకములకు సంబంధించినది కాదు. బుద్ధి లోకమున కర్తవ్యము ధర్మ సంరక్షణము ననుసరించి యున్నది. ధర్మ రక్షణమునకై కృష్ణు 'ఆయుధము పట్టను' అను మాటను ప్రక్కన పెట్టి భీష్ముని పైకి సుదర్శనముతో దుమికెను. ఆడిన మాట తప్పను అని భీష్మించి భీష్ముడు పెళ్ళిని, సంతతిని నిరాకరించి కురు వంశమునకు నష్టము కలిగించెను. సత్యవతీదేవి వేడుకొనినను వినలేదు. 

ధర్మమును కర్తవ్యము రూపమున అనుసరించుటయే బుద్ధియుక్తమగు జీవనము. అట్టి జీవనమున ఫలాసక్తి లేకుండుట కౌశలముతో గూడిన కర్మయోగ మగును.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

05.Sep.2020

------------------------------------ x ------------------------------------




🌹  24. గీతోపనిషత్తు - మనీషి - నిర్మలమైన బుద్ధి ఏర్పడవలె నన్నచో సతతము లోపల, వెలుపల ఆత్మానుసంధానము చేసుకొను చుండవలెను. దీనిని దైవయోగము అందురు.  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 51, 52, 53 📚

బుద్ధితో యోగించి, ఫలములను త్యజించి, కర్తవ్యమును నిర్వర్తించు యోగికి నిస్సంగము ఏర్పడగలదు. అతనికి కర్తవ్యము యుండును గాని, వ్యక్తిగతమగు ఆశయములు, గమ్యములు వుండవు. 

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ || 51 ||

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ || 52 ||

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి || 53 ||

అనగా తాను, తన కర్తవ్యము మాత్రమే యుండును. మరణించ కూడదని యుండదు. పుట్టకూడదని కూడ యుండదు. మరణించకూడదని, పుట్టకూడదని, పుణ్య కర్మలను ఆచరించు వారు కళాసక్తితో ఆచరించు వారే తప్ప వారికి పుట్టని, చావని స్థితి కలుగనేరదు. శ్రీకృష్ణు తెలిపిన యోగజీవులు ఎట్టి సిద్ధుల కొరకును ప్రయత్నింపరు.

అమరత్వము కొరకు, బ్రహ్మత్వము కొరకు ప్రయత్నముండదు. ఉండుటయే యుండును. కర్తవ్యముండును. వారికి నిస్సంగము పరిపూర్తి యగుటచే కోరకయే సమస్తమును లభించగలదు. 

వారి చేతలయందు కళాసక్తి లేదు

గనుక బంధము నుండి విడువబడిన వారలై యుందురు. బంధము లేక యుండుటయే పరమ పథంము. అట్టి వారు శరీరము నందు కూడ యుందురు. శరీరము వారిని బంధింపదు. ఎటు చూచినను ఫలమునందు ఆసక్తిలేని కర్తవ్య కర్మమే శ్రేయోదాయకమని భగవంతుడు బోధించుచున్నాడు.

బుద్ధి, మోహమును, మాయను, అజ్ఞానమును విసర్జించి, తాను అను వెలుగుగా నున్నప్పుడు నిర్మలమైన బుద్ధి అని తెలియ బడుచున్నది. నిర్మలమైన బుద్ధి ఏర్పడవలె నన్నచో సతతము లోపల, వెలుపల ఆత్మానుసంధానము చేసుకొను చుండవలెను. దీనిని దైవయోగము అందురు. 

అనగా బుద్ధిని దైవముతో జత పరచుట. ఇది నిరంతరము సాగినప్పుడు బుద్ధి నిర్మలమగును. అట్టి బుద్ధితోనే నిష్కామముగ కర్మల నాచరించిన జనన మరణ రూప బంధమునుండి కూడ జీవుడు విడుదలను పొందును అని భగవానుడు చెప్పియున్నాడు. 

అట్టి బుద్ధియే ధర్మముతో కూడిన కర్తవ్యములను సతతము నిర్వర్తించగలదు. అట్టి నిర్వర్తనమే కర్మలయందు కౌశలము అని తెలిపి యున్నాడు.

బుద్ధి, ఆత్మయందు యోగించగ, అట్టి బుద్ధితో యోగించిన మనస్సు కర్మలను క్షేమముగను, కౌశలముగను నిర్వర్తించ గలదని అర్థము. యోగము చెందని మనస్సు కౌశలముగ కర్మలను నిర్వర్తించుట జరుగదు. 

అట్టి మనస్సే కౌశలము పేరున కుటిలత్వము ననుసరించును. కావున బుద్ధిని సదా ఆత్మతో అనుసంధానము చేయవలెను. అట్టి బుద్ధి క్రమశః నిర్మలమగును. చీకిటిని దాటిన బుద్ధిగా వెలుగొందును. అనగా మాయా వర్ణమును దాటి యుండును. అట్లు దాటి యుండుటకు కారణము ఆత్మానుసంధానమే. 

అట్టి బుద్ధి కర్మలను సహజముగనే నిర్లిప్తముగను, బంధములు కలిగించని విధముగను, నిర్వర్తించుచుండును. ఏది వినినను, ఏది చూచినను వికారము చెందదు. చలనము లేని ఇట్టి బుద్ధిని పొందుట కర్తవ్యమని భగవానుడు బోధించుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

07.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹  25. గీతోపనిషత్తు - స్థితప్రజ్ఞుడు - కర్తవ్యమును కామమును ఎప్పటికప్పుడు బుద్ధితో విచక్షణ చేసి కర్తవ్యమునే నిర్వర్తించు వాడు స్థితప్రజ్ఞుడు.  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 54, 55  📚

ఆత్మ ధ్యానమునందు స్థిరమైన స్థితిగొన్న బుద్ధి, స్థిరబుద్ధి.

అట్టి బుద్ధి కలవాడు స్థితప్రజ్ఞుడు. అనగా స్థిరమైన ప్రజ్ఞ కలవాడు. సన్నివేశములను బట్టి అతని ప్రజ్ఞ కలత చెందదు. మోహము కలిగిననే కదా కలత చెందుట! 

అర్జున ఉవాచ :
స్థితప్రఙ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ || 54 ||

శ్రీభగవానువాచ |
ప్రజహాతి యదా కామాన్సర్వాన్పార్థ మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రఙ్ఞస్తదోచ్యతే || 55 ||

ఆత్మజ్ఞాన రతునికి మోహముండదు గనుక కలత కూడ నుండదు. అతడు ముక్త జీవి. అతని గుణ గణములు శ్రీకృష్ణుడు ఉదహరించుచున్నాడు.

1. సమస్తములైన కామములను బొత్తిగ వదలి వేసినవాడు స్థితప్రజ్ఞుడు. కర్తవ్యమే గాని కామము లేని స్థితి ఇది. కర్తవ్యమును కామమును ఎప్పటికప్పుడు బుద్ధితో విచక్షణ చేసి కర్తవ్యమునే నిర్వర్తించువాడు స్థిరప్రజ్ఞ కలవాడు. 

ఇష్టాయిష్టములు, లాభనష్టములు, సౌకర్య, అసౌకర్యములు, జయాపజయములు, బేరీజు వేసుకొని పనిచేయువారు కామమునకు లోబడినవారు కాని కర్తవ్యమునకు కాదు.

2. సతతము తన ప్రజ్ఞను దైవీప్రజ్ఞతో అనుసంధానము చేసి తృప్తితో జీవించువాడు స్థితప్రజ్ఞుడు. ఈ రెండవ గుణము నాశ్రయించి, మొదటి గుణమును పొందవలెను.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

08.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹   26. గీతోపనిషత్తు - స్థితప్రజ్ఞుడు  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 56 📚

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |

వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే || 56 ||

స్థితప్రజ్ఞుని బుద్ధి కష్టములందు కలత చెందదు. సుఖముల యందు ప్రత్యేకమైన ఆసక్తి చూపదు. సన్నివేశముల యందు భయపడడు. ఇతరుల ప్రవర్తన వలన క్రోధము చెందదు. అతని మనస్సు సహజముగ మౌనముగ నుండును. (ఆత్మ మననము చేత మౌనము వహించి యుండును.)

పై ఐదు గుణములు ఎవని ప్రవర్తనమున గోచరించునో అతడు స్థితప్రజ్ఞుడుగ తెలియబడు చున్నాడని భగవానుడు బోధించు చున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

09.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹   27. గీతోపనిషత్తు - స్థిత పజ్ఞ్రుని లక్షణములు - విషయముల యందు అనురక్తి చెందని వాడు స్థితప్రజ్ఞుడని తెలియవలెను.  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 57   📚

ఏ విషయమునందు ప్రత్యేకమైన అనురాగము లేనివాడు, అట్టి కారణముగ అశుభ విషయములను పొందినపుడు ద్వేషము పొందని వాడు, శుభ విషయములు పొందినపుడు అందు అనురక్తి చెందని వాడు స్థితప్రజ్ఞుడని తెలియవలెను. శుభాశుభ విషయములు వచ్చి పోవుచుండును. 

యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్ |
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా || 57 || 

సమస్త సన్నివేశములు కూడ కాల ప్రభావమున ఒకింత సేపు వుండి అటుపై లేకపోవును. అట్టి వాని యందు ఆసక్తి కలిగి యుండుట లేక అనాసక్తి కలిగియుండుట తెలియనితనమే. 

తాత్కాలిక విషయముల యందు రసానుభూతి కూడ తాత్కాలికమే కనుక అట్టి జ్ఞానమును కలిగి వాని యందు తాత్కాలికముగ ప్రతి స్పందించి మరచువాడు స్థితప్రజ్ఞుడు.

స్థితప్రజ్ఞ అను బుద్ధి శాశ్వత విషయమైన ఆత్మ తత్త్వము నందు రతి గొని వుండుట వలన చిల్లర విషయముల యందు ఆసక్తిగాని, అనాసక్తి గాని యుండదు. ధనవంతునికి ఒక పావులా పోయినను, ఒక పావులా వచ్చినను తే ఉండదు కదా!
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

10.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹   28. గీతోపనిషత్తు - స్థిర చిత్తము - మానవుడు లోక అవసరమును బట్టి బహిర్గతుడగుట, అవసరము లేనపుడు అంతర్గతుడగుట తాబేలు వలే నేర్చు కొనవలెను.  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 58 📚వల్ల 

యదా సంహరతే చాయం కూర్మో‌உంగానీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా || 58 ||

తాబేలు ఆధ్యాత్మిక సాధకునకు చక్కని సందేశ మిచ్చుచున్నది. 

పరిస్థితులను బట్టి తాబేలు తన సర్వాంగములను తనలోనికి ఉపసంహరించుకొని అనుకూల పరిస్థితులు ఏర్పడి నపుడు మరల అంగములను విస్తరించును. పురోగమనము, తిరోగమనము తెలిసిన ప్రజ్ఞ- తాబేలు ప్రజ్ఞ.

మానవుడు కూడ నట్లే పురోగమనము, తిరోగమనము తెలిసి యుండవలెను. కాలము, దేశము ననుసరించి అనుకూల సమయమున మనస్సు, ఇంద్రియములు, శరీరమును ఉపకరణములుగ బహిర్గతుడవ వలెను. కర్తవ్యము నిర్దేశింపబడని సమయములందు అంతర్గతుడవ వలెను. అవసరమును బట్టి బహిర్గతుడగుట, అవసరము లేనపుడు అంతర్గతుడగుట నేర్చు కొనవలెను.

ఇంద్రియార్థముల వెంటబడు ఇంద్రియ ప్రజ్ఞను ఉపసంహరించుకొనుట వలననే చిత్తము స్థిరమగును. ఇచట దోషము ఇంద్రియముల యందు లేదు. సాధకుని యందే యున్నది.

సాధకుడు తిరోగమనమును సంకల్పించినంతనే ఇంద్రియముల నుండి, మనస్సు నుండి, బుద్ధిలోనికి ప్రజ్ఞ మరలగలదు. అట్లు మరల్చుకొనుటకు దైవచింతన చక్కని ఉపాయము. దైవస్మరణమున నిలచినచో ఇంద్రియార్థముల వెంట ఇంద్రియములు పరుగెత్తవు. 

అపుడు ప్రజ్ఞ చంచలము గాక నిలచును. కర్తవ్యమును బట్టి ప్రజ్ఞను బహిర్ముఖము చేయవచ్చును. ఈ కారణముగ తాబేలు బొమ్మను చూచుట- పై సందేశమును గుర్తు తెచ్చుకొనుట సాధకునకు ఉపకరించును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

11.Sep.2020

------------------------------------ x ------------------------------------

🌹  29.  గీతోపనిషత్తు - ఆత్మ చింతన - ఆత్మ తత్త్వమును గూర్చి వినుట, మననము చేయుట బాగుగ సాగినచో నిత్యానిత్య వస్తు వివేక మేర్పడి ఆత్మజ్ఞానము నందు రుచి కలుగును.  🌹



✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 59 📚

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః |

రసవర్జం రసో‌உప్యస్య పరం దృష్ట్వా నివర్తతే || 59 || 

దైవచింతన లేక ఆత్మచింతన దీర్ఘకాలము జరిగిన వానికి విషయ చింతన తొలగుటయే కాక క్రమశః వాని వాసన కూడ తొలగి పోగలదు. దైవమును నమ్ముట వేరు, దైవము నచ్చుట వేరు. నచ్చినపుడే మనస్సునకు ఆసక్తి కలుగును.

అట్టి ఆసక్తి వలన మనస్సు దైవమునందే రమించుటకు పదే పదే కోరుకొనుచుండును. అనురక్తి దైవము పైకి మరలక అది హెచ్చు చుండును. ప్రబల మగుచుండును. అది కారణముగ తాత్కాలిక సుఖ సంతోషముల కన్న శాశ్వత సంతోషము నందు రుచి కలుగుటచే విషయ వాసనలయందు కూడ క్రమశః ఆసక్తి తొలగిపోవును.

ఇంద్రియార్థముల వెంట తీరుబడి లేక తిరుగువాడు ఎట్లు ప్రవర్తించునో అట్లే తీరుబడి లేని దైవచింతన యందు మనస్సు పాదుకొని ఇంద్రియార్థముల యందు కూడ దైవమునే గుర్తించుట జరుగుచుండును. 

ప్రకృతి దైవీప్రకృతిగ గోచరించును. తన ప్రకృతి దైవీప్రకృతి కాగ సమస్తము నందలి దైవమునే చూచుచు స్థిరమతియైు యుండును. అతనిని దైవము తప్ప మరి ఇతరములు ఆకర్షించవు. అట్టి వాడు 'స్థితప్రజ్ఞుని' భగవంతుడు తెలుపుచున్నాడు.

జీవుడు ఆహారమును అనేక రకములుగ స్వీకరించుచున్నాడు. కేవలము భోజనమే ఆహారము అనుకొనరాదు. పంచేంద్రియముల నుండి, మనస్సు నుండి (అనగా భావము నుండి) రక రకములైన విషయములను తన లోపలికి మనిషి స్వీకరించుచున్నాడు. ఈ ప్రవృత్తి కూడ ఆహారమే. ఇక్కడ ఆహారము వాసనాపరముగ నుండును. 

ఈ వాసనలు జన్మ జన్మలలో జీవుడు ప్రోగుచేసుకొని తనతో తెచ్చుకొను చుండును. మాలిన్య పదార్థములను ప్రోగుచేసుకొని తెచ్చుకొను జంతువువలె జీవుని మనస్సు ఈ వాసనలను కూడ శుభవాసనలతో పాటు కొని తెచ్చుకొనును. ఈ ఆహారమును విసర్జించుట నిజమైన నిరాహార దీక్ష.

ఉదాహరణకు భోజనమును గూర్చిన ఆసక్తి భుజించని సందర్భములలో ఉండినచో అది వాసన యగును. భార్య లేని సమయములో భర్తకు భోగాసక్తి యుండుట వాసన యగును. ఇట్లే ధనము గూర్చి, ఇతర చిల్లర విషయముల గూర్చి అవి లేని సందర్భమున భావించుట వాసనయే. ఈ వాసనలు కూడ ఆహారముగ సంకేతింపబడినవి.

వీటి యందు రతి చెందిన వాడు సతతము అశుద్ధ ఆహారమును భావముచే స్వీకరించుచుండును. వీని విసర్జన సులభమైన విషయము కాదు. ఆత్మ విచార మొక్కటియే పరిష్కారము. 

ఆత్మ తత్త్వమును గూర్చి వినుట, మననము చేయుట బాగుగ సాగినచో నిత్యానిత్య వస్తువివేక మేర్పడి ఆత్మజ్ఞానము నందు రుచి కలుగును.

ఆ జ్ఞానము అగ్నిది. అగ్ని సమక్షమున ఏదియును నిలువక అగ్నిలో లయమగును. ఆ విధముగ వాసన లంతమొందును. అట్టి వాడు ఇంద్రియార్థ విషయములను స్వీకరింపనట్టి దేహము కలవాడై యుండును. అతడు స్థితప్రజ్ఞుడు. అంతే నిరాహారి.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

12.Sep.2020

------------------------------------ x ------------------------------------




🌹  30. గీతోపనిషత్తు - ఇందియ్రములు - సౌలభ్యము - ప్రమాదము - ఇంద్రియార్థములందు బాగుగ రుచిగొని జీవుడు బహిర్గతుడిగ వుండి పోయెను. ఆత్మసాధన మార్గమున జీవుడు ఇపుడు తిరోగమనము నేర్వవలెను.  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 60  📚

ఇంద్రియ నిర్మాణము సృష్టి నిర్మాణ మహా యజ్ఞమున అత్యంత ప్రాధాన్యము గలదు. సృష్టి నిర్మాణమున జీవులకు దేహము లేర్పరచి, ఆ దేహములందు జీవుని ప్రతిష్టాపన చేసి, దేహము ద్వారా సృష్టి వైభవమును అనుభవింపచేయుట సృష్టి సంకల్పములో నొక భాగము. 

యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః |

ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః || 60 || 

జీవుని దైవము నుండి ప్రత్యగాత్మక వ్యక్తము చేయుట ఒక మహత్తర ఘట్టము. ఏకము, అనేకమగుట

ఒక యజ్ఞముగ సాగినది. జీవులేర్పడిన వెనుక వారికి దేహము లేర్పరచుట మరియొక మహత్తర యజ్ఞము. 

జీవులకు, దేహములకు పరస్పరత్వ మేర్పరచి జీవ చైతన్యమును ఇంద్రియముల ద్వారా బాహ్యమునకు ప్రకింపచేయుట ఒక రసవత్తర ఘట్టము. ఇదియే భాగవతమున ప్రచేతసుల కథగా వివరింపబడినది. జీవుని బహిర్గతుని చేయుటకు బృహత్తర ప్రయత్నము జరిగినది. 

అందులకు ఇంద్రియము లేర్పరచి, ఇంద్రియముల ద్వారా జీవుని ఆకర్షింపబడు విషయము లేర్పరచవలసి వచ్చెను. క్రమశః జీవుడు ఇంద్రియముల నుండి బహిర్గతుడగుట నేర్చెను.

ఇంద్రియార్థములందు బాగుగ రుచిగొని బహిర్గతుడిగ వుండి పోయెను. అందువలన భగవానుడు ఇంద్రియములు జీవుని బలాత్కారముగ లాగుచున్నవని తెలుపుచున్నాడు. ఇంద్రియ నిర్మాణము అందుకొరకే. 

ఆత్మసాధన మార్గమున జీవుడు ఇపుడు తిరోగమనము నేర్వవలెను. తిరోగమనము మాత్రమే నేర్చిన చాలదు. తిరోగమనము తెలియకున్న సృష్టి వ్యూహమున చిక్కును. ఇదియే అభిమన్యుడు పద్మవ్యూహమున చిక్కుట. అట్లు చిక్కువాడు నశించును. 

ఈ ఇంద్రియ వ్యాపారము నుండి బయల్పడుటకు కూడ మరల మహత్తర ప్రయత్నమే చేయవలెనని భగవానుని హెచ్చరిక.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

14 Sep 2020

------------------------------------ x ------------------------------------





🌹   31. గీతోపనిషత్తు - మత్సరత్వము - ప్రజ్ఞను సుప్రతిష్టము చేయుటకు ధర్మాచరణము దైవారాధనమని తెలియవలెను. దైవమును చింతించువాడు స్థితప్రజ్ఞుడగును. విషయములను చింతించువాడు సంసారి యగును  🌹

ఇంద్రియములను ఇంద్రియార్థముల వెంట పరిగెత్తకుండ నియమించుటకు భగవానుడొక ఉపాయమును తెలుపుచున్నాడు. 

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా || 61 ||

ధ్యాయతో విషయాన్పుంసః సంగస్తేషూపజాయతే |
సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధో‌உభిజాయతే || 62 ||

క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్స్మృతివిభ్రమః |
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి || 63 ||

అది ఏమన దైవమునందు చిత్తమునకు రుచి ఏర్పరచుటయే. మనస్సు రుచిని కోరును. రుచించు విధముగ మనస్సునకు దైవము నందించవలెను. అపుడు మనస్సు దైవమున రుచి గొనును. 

ఈ ఉపాయము తెలిసిన ఋషులు వివిధములైన రుచి మార్గముల నేర్పరచిరి. భజనము, సంకీర్తనము, పూజనము, శ్రవణము, అభిషేకములు, హోమములు, స్తోత్రములు మొదలగు వేలాది పద్ధతులను అందించుటలో ఋషులుద్దేశించిన దేమనిన, అందు జీవునకేది రుచించునో దాని ద్వారమున దైవమును రుచిగొని దైవాసక్తుగునని. 

ఒక్కసారి దైవమునందాసక్తి ఏర్పడినచో అది ధర్మమునం దాసక్తిగ కూడ నేర్పడి క్రమశః ఇంద్రియముల నుండి తరింపు ఏర్పడును. 'మత్పరుడవై' యుండుము, అని భగవానుడు బోధించుటలో చక్కని ఉపాయము కలదు.

ప్రజ్ఞను సుప్రతిషసము చేయుటకు ధర్మాచరణము దైవారాధనమని తెలియవలెను. దైవమును చింతించువాడు స్థితప్రజ్ఞు డగును. విషయములను చింతించువాడు సంసారి యగును. దైవమునందాసక్తి దైవమును కోరును. 

ప్రాపంచిక విషయములందాసక్తి వివిధ విషయములను కోరును. కోరిక తీరినచో మదము పెరుగును. తీరనిచో కోపము పెరుగును. రెండు విధములుగ అవివేకమావరించును. అవివేకము కారణముగ మోపు కలుగును. మోపు కారణముగ బుద్ధి నాశనము సంభవించును. అట్టివాడు సమ్మోహితుడై నశించును. ఈ విధముగ విషయవాంఛ పతనమును గావించును. కర్తవ్యమును మరచి కోరికను పెంచు కొనువారికి ఇట్టి వినాశము తప్పదని భగవంతుని హెచ్చరిక.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

15 Sep 2020

------------------------------------ x ------------------------------------





🌹 32. గీతోపనిషత్తు - ప్రసాదము - ప్రసాదమనగా మనో నిర్మలత్వము. మనో నిర్మలత్వమును పొందుటకు మనస్సు స్వాధీనము కావలెను. మనస్సు స్వాధీనమగుటకు రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించవలెను. దానికి మార్గం “నిర్వర్తించుచున్న కార్యము నందు కర్తవ్యమునే దర్శింపుము. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 64  📚

రాగద్వేష వియుకైస్తు విషయా నింద్రియై శ్చరన్ |
ఆత్మవశ్యై ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి || 64

ప్రసాదమనగా మనో నిర్మలత్వము. మనో నిర్మలత్వమును పొందుటకు మనస్సు స్వాధీనము కావలెను. మనస్సు స్వాధీనమగుటకు రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించవలెను.

ద్వంద్వముల నధిగమించిన మనస్సుతో ఇంద్రియముల నుండి ప్రవర్తించు మానవుడు మనో నిర్మలత్వమును పొందుచున్నాడు. ప్రసాద స్వీకరణము అనగా సాధారణముగ కట్టె పొంగళి, చక్రపొంగళి, చిత్రాన్నము ఇత్యాది ఆహార పదార్థములను పూజాది కార్యక్రమములు జరిగిన తరువాత భుజించుట అని భావింతురు. 

కేవలము భుజించుటే అయినచో అది భోజనమగును. భోజనమునకు, ప్రసాద స్వీకరణకు వ్యత్యాసము కలదు. నిర్మలమైన మనస్సు గలవాని ప్రసాద స్వీకరణము విశిష్టముగ నుండును. అతడు రుచియందు రాగముగాని, రుచి లేకపోవుట యందు ద్వేషము గాని భావింపక, రుచియందు యుక్తుడై యుండక ప్రశాంతము, నిర్మలము అగు మనస్సుతో అందించిన ప్రసాద మును బ్రహ్మమని భావన చేయుచు, బ్రహ్మమునకు సమర్పణగా ఇంద్రియముల ద్వారమున గైకొనును. ఇట్లే మిగిలిన ఇంద్రియ వ్యాపారము లందు కూడ ప్రవర్తించును. ఇట్లు ప్రవర్తించువాని మనో నిర్మలత్వము ఇంద్రియార్థముల కారణమున చెడదు. ప్రశాంతత చెదరదు. 

అట్లుకాక ప్రసాదములో ఉప్పెక్కువయిన దనియు, కార మెక్కువైనదనియు, పోపు తక్కువైనదనియు ప్రసంగించువారు నిర్మలచిత్తులు కాలేరు. కారణమేమన ఇంద్రియార్థముల యందు గల రాగ ద్వేషములు. ఇట్టి రాగ ద్వేషములు సన్నివేశములయందు, ఇతర జీవులయందు, కర్తవ్యముల యందు, కార్యముల యందు గోచరింప జేయువాడు ప్రశాంతతను పొందలేడు. మనో నిర్మ లత్వము ఎండమావివలె మురిపించునుగాని అనుభూతికి అందదు.

భగవానుడు మనో నిర్మలత్వమును పొందుటకు ఒక ఉపాయమును సూటిగా సూచించు చున్నాడు. అది యేమన “నిర్వర్తించుచున్న కార్యము నందు కర్తవ్యమునే దర్శింపుము. రాగ ద్వేపములను ప్రతిబింబింప కుండును." "రాగద్వేష వియుకై:" అని తెలుపుట ఇందులకే. అట్టివానికే మనసు స్వాధీనము కాగలదు. అట్టివాడు కర్మల యందున్నను నిర్మలత్వము కోల్పోవును. చేయు పనులలో కర్తవ్యము నుండి కామ ముద్భవించినచో అది రాగద్వేషములకు, కామక్రోధములకు, లోభమోహములకు, ఈర్ష్య అసూయలకు దారితీయును. అట్టివానికి మనస్సు వశము కాదు. జీవితమను ప్రసాదమును అనుభవించలేడు.

ప్రసాదమును అనుభవించు వాడే దేహమును గూడ ఒక రాజు ప్రాసాదముగ అనుభవింపగలడు. పై శ్లోకమున రాగద్వేష విముక్తుడగుట, అట్టి మనస్సుతో ఇంద్రియ ద్వారమున కర్మలను నిర్వర్తించుట, తత్కారణముగ మనస్సు స్వాధీనమగుట, అట్టి స్వాధీనమైన మనస్సు నిర్మలత్వమును, శాంతిని పొందుట సోపానములుగ తెలుపబడినది. ఇది ఉత్కృష్టమైన సాధనాంశము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

19 Sep 2020

------------------------------------ x ------------------------------------




🌹  33. గీతోపనిషత్ - ప్రసాద స్థితి - రాగద్వేషాది ద్వంద్వములు లేక దీర్ఘకాలము కర్తవ్యమును నిర్వర్తించు వానికి ఈ నిర్మల స్థితి ఏర్పడును. అదియే ప్రసాద స్థితి  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 65 📚


65. ప్రసాదే సర్వదు:ఖానాం హాని రస్యోపజాయతే |

ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి: పర్యవతిష్ఠతి


బుద్ధిమంతుడగు సాధకుడు సధ్రంథములందు వాడిన పదములను శ్రద్ధాభక్తులతో, పరిశీలనా దృష్టితో గ్రహించుట నేర్వవలెను. అపుడే గ్రంథస్థ విషయము నందలి లోతులు లేక రహస్యములు బయల్పడగలవు. ఈ దృష్టి శ్రద్ధాళువుల కుండును. 

కావున గ్రంథ పఠనమునకు శ్రద్ధ అత్యంత అవసరము. ఉదాహరణకు పై శ్లోకమున ప్రసాదము స్వీకరించుటచే సర్వ దుఃఖములు నశించుననియు, ప్రసన్నమైన మనస్సు కలుగుననియు, అట్టి మనస్సు బుద్ధియందు స్థిరపడుననియు తెలుపబడి యున్నది. ఇది కారణముగ భగవత్కార్యముల యందు ప్రసాదము నకు విశేష స్థాన మేర్పడినది. 

నిజమునకు ప్రసాదమనగా తిండి పదార్థము కాదు. ప్రశస్తమైన మనో నిర్మలత్వము. పూజ, అభిషేకము, హోమము మొదలగు దైవారాధన కార్యములను సత్వగుణ ప్రధాన ముగ నిర్వర్తించు వానికి ఏర్పడు స్థితి “ప్రసాద స్థితి."

అతడు పై కార్యములను సత్వగుణ ప్రధానముగ నిర్వర్తించుటచే అందలి ఫలితముగ మనో నిర్మలత్వమును పొందుచున్నాడు. అట్టి మనో నిర్మలత్వము కారణముగ వృద్ధి గావింపబడిన అతని చేతస్సు బుద్ధియందు స్థిరపడుచున్నది. అది ప్రసాద ఫలితము. 

కేవలము 'పొట్ట నిండ ప్రసాదము మెక్కువానికి ఈ స్థితి కలుగదు. వారు మరియొక ప్రసాద భక్తులు. భగవంతుడు తెలిపిన ప్రసాదము సామాన్యు లెరిగిన ప్రసాదము కాదని తెలియవలెను. పూజాది కార్యక్రమములను డంబాచారముగ, కీర్తికొరకు నిర్వర్తించువారు రజోగుణ దోషము కలిగిన వారు. 

వీరు ఎన్ని పూజలు నిర్వర్తించి నప్పటికిని మనశ్శాంతి కొరవడును. ఆరాటములు, తత్సంబంధిత వికారములు, వారి ప్రవర్తనల యందు గోచరించుచుండును. వారి నుండి అనుస్యూతము అశాంతి ప్రసరించుచుండును. 

శాస్త్ర విధుల నుల్లంఘించి, పూజాది క్రతువులను తమ ఇష్టము వచ్చినట్లు చేయువారు తమోగుణ దోషము కలవారు. వీరు చేయు క్రతువులు వీరినే బంధించగలవు. దుష్పలితములు గూడ ఏర్పడగలవు. యజ్ఞార్థ కర్మలు, దైవకార్యములు మనోనిర్మలత్వమును చేకూర్చ వలెను. అదియే ప్రసాద స్థితి. 

తెలుగువారు "సాద, సీద” అను పదములను వాడుచుందురు. ఒక వ్యక్తి నుద్దేశించి అతడు సాద, సీద మనిషి అని అనుచుందురు. నిజమునకు వారీ ఉద్దేశ్యము స్పష్టత, ముక్కుసూటితనము కలవాడని తెలుపుటకు పై పదములు వాడుదురు. 

సాద అన్న పదము స్పష్టతకు సంకేతమైనచో ప్రసాద అను పదము ప్రశస్తమైన స్పష్టత అని తెలియవలెను. అట్లే సీద అను పదమును ప్రసీదగా భావించ వలెను. ఇట్టి పరిశీలనా బుద్ధి చదువరు లేర్పరచుకొందురు గాక !

ప్రసాద స్థితి వలన సర్వదు:ఖములు నశించుట సహజము. ప్రసాద మనగా మనో నిర్మలత్వము అని ఇదివరకే తెలుపబడినది. రాగద్వేషాది ద్వంద్వములు లేక దీర్ఘకాలము కర్తవ్యమును నిర్వర్తించు వానికి ఈ నిర్మల స్థితి ఏర్పడునని కూడ ఇదివరకే తెలుపబడినది. రాగద్వేష విముక్తునకు మాత్రమే కదా ప్రసాదస్థితి.

ద్వంద్వములతో ముడి తెగినవానికి కర్తవ్యమే ఉండును గాని, దాని ఫలితము లిట్లుండవలెనని ఆశయ ముండదు. ఇది భగవానుని ముఖ్యమైన బోధ. “నీ ధర్మమును నీవు నిర్వర్తింపుము. ధర్మ నిర్వహణ యందు ప్రశాంతత యున్నది. అట్టి ప్రశాంతత ఫలితములను కోరినపుడు లేదు. 

జయము, అపజయము నీ కనవసరము. కర్తవ్య నిర్వహణమే నీవంతు.” అని అర్జునునకు మరల మరల బోధించినాడు కదా. జీవుని మనస్సు కర్తవ్యము నందే నిమగ్నమై నపుడు "ఇట్లు జరుగవలెను. ఇట్లు జరుగరాదు" అను భావములందు చిక్కుకొన నపుడు అతనికి దుఃఖ కారణమే లేదు. కావున దుఃఖమే లేదు. 

అట్టి నిర్మలత్వము నొందిన మనస్సు మిక్కుటముగ, శీఘ్రముగ బుద్ధియను వెలుగునందు నిలచును. 64, 65 శ్లోకములు జీవచైతన్యము ఇంద్రియార్థముల నుండి బుద్ధిని చేరు సోపాన మును వివరించుచున్నవి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

20 Sep 2020

------------------------------------ x ------------------------------------




🌹 34. గీతోపనిషత్తు - చిత్త శుద్ధి - కామ ప్రేరితుడు గాక కర్తవ్య ప్రేరితుడై జీవించుట ఉపాయము. అట్లు జీవించు వానిని ద్వందములంటవు. మనస్సు నిర్మలమగును. అట్టి మనస్సు బుద్ధి యందు స్థిరపడు అర్హతను పొందును. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 66  📚 

ప్రజ్ఞ బుద్ధియందు స్థిరపడుటయే బుద్ధియోగము. అట్లు బుద్ధియందు నిలబడవలెనన్నచో మనస్సు నిర్మలము కావలయును. మనస్సు నిర్మలము కావలెనన్నచో ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు తగులుకొని యుండరాదు. 

నాస్తి బుద్ధి రయుక్తస్య న చాయుక్తస్య భావనా |

న చాభావయతః శాంతి రశాంతస్య కుతః సుఖమ్ || 66

తగులు కొనక యుండుటకు సాధకుడు ద్వంద్వ భావముల నుండి బయల్పడు వలెను. సృష్టి యందలి ద్వంద్వములు జీవుని బంధించునని తెలుసుకొని ద్వంద్వముల యందు ఉదాసీనుడుగా నుండుట, కర్తవ్యము నందు ఉన్ముఖుడై యుండుట నిరంతరము సాధన సాగవలెను. ఇది యొక్కటియే ఇంద్రియముల యందు చిత్తము తగులు కొనక శుద్ధిగ ఉండుటకు ఉపాయము. మరియొక మార్గము లేదు. 

ద్వంద్వములు మనసున ఉన్నంతకాలము అవి రాగద్వేషములుగ పని చేయుచునే యుండును. అది కారణముగ మనస్సు నందలి ప్రజ్ఞ బుద్ధి లోనికి ఊర్థ్వగతి చెందకపోగా జీవించు వానిని ద్వంద్వము ఇంద్రియములలోనికి అధోగతి చెందగలదు. కావుననే కర్మకు కర్తవ్యమే ప్రధానముగాని కామము కాదు. 

కామ ప్రేరితుడుగాక కర్తవ్య ప్రేరితుడై జీవించుట భగవంతుడందించు చున్న ఉపాయము. అట్లు జీవించు వానిని ద్వందములంటవు. మనస్సు నిర్మలమగును. అట్టి మనస్సు బుద్ధి యందు స్థిరపడు అర్హతను పొందును. 

ఇట్లు రాగద్వేష విముక్తుడు కాని వానికి సుఖశాంతులు ఉండజాలవు. కామము ప్రధానము కాగా ఇంద్రియ ద్వారమున మనస్సు పరిపరి విధముల పరిగెత్తుచు అలసిపోవుటయే గాని సుఖశాంతులెట్లు దొరుక గలవు? 

నిజమునకు సుఖశాంతులను కోరుట కూడ కామమే. కోరినంత మాత్రమున సుఖశాంతులు జీవునకు కలుగవు. వాటికై యత్నించుట కూడ నిష్ప్రయోజనము. వానిని పొందుటకు కోరికను తీవ్రము, తీవ్రతరము చేయుట ఉపాయము కాదు.

వానిని పొందవలెనన్నచో జీవుడు నిరంతరము తనను కర్తన్య నిర్వహణ నుందు నియమించుకొను చుండవలెను. కర్తవ్య నిర్వహణము చేయువానికి పుట్టలు పుట్టలుగ భావములు జనింపవు. కామ ప్రవృత్తి కర్తవ్య ప్రవృత్తిగ మారును. 

అట్టి కర్తవ్యోన్మోఖునకు కామము లేకుండుట వలన కర్మఫలములపై కూడ ఆసక్తి యుండదు. దీర్ఘ కాలము కర్తవ్యమునే ఆచరించు చుండుటవలన చిత్తశుద్ధి ఏర్పడి సుఖశాంతులు ఆవరించగలవు. మరియొక మార్గము లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

21 Sep 2020

------------------------------------ x ------------------------------------




🌹 35. గీతోపనిషత్తు - అంకుశము - ఇంద్రియములను, మనస్సును అధిష్టించి మానవ ప్రజ్ఞ జీవనయానము వైభవోపేతముగా నిర్వర్తించ దలచుకొన్నచో కర్తవ్యమను అంకుశముతో మనసును నడిపించవలెను. లేనిచో ప్రజ్ఞ హరింపబడును 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 67 📚

ఇంద్రియాణాం హి చరతాం యన్మనో నువిధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయు క్నావ మివాంభసి || 67

నీటియందు తేలు నావ గాలిని బట్టి పోవుచుండును. గాలి వాలును బట్టి నావ పలుదిక్కులకు ఈడ్వబడు చుండును కదా! అట్టు పలు విధములుగ ఈడ్యబడుట నావకు ప్రయాణ మెటు కాగలదు? 

ముక్కుతాడు వేయని ఎద్దు చేలయందుబడి పంటను విధ్యంసము చేయుచు, చిందులు వేయుచు తినినంత తిని, మిగిలినది పాదములతో త్రొక్కుతూ స్వైర విహారము చేయును. అట్టి ఎద్దు పొలమున కెట్టు ఉపయోగపడ గలదు? 

కళ్ళెములేని గుజ్జములతో గూడిన రథము, గుజ్జములెటు లాగినచో అటుపోవును. తత్కారణముగ రథము నశించునుకదా ! శిక్షణము, మావటి లేని మదపుటేనుగు అపాయకరము కదా!

అట్లే రాగద్వేషముల ననుసరించుచు, ఇంద్రియముల ద్యారా ఇంద్రియార్థముల కొరకై పరుగెత్తు మనస్సు మనుజుని హరించును.

నావ పయనించవలె నన్నచో తెరచాప, చుక్కాని ఏర్పరచవలెను. ఎద్దు ఉపయోగపడవలె నన్నచో ముక్కుకు తాడు బిగించి, శిక్షణ నిచ్చి అరక కట్టించవలెను. గుర్రములు ప్రయాణమునకు వినియోగ పడవలెనన్నచో కళ్ళకు గంతలు కట్టి, కళ్ళెము వేసి పగ్గములు పట్టి నడిపించవలెను. మదపుటేనుగు బలము వినియోగ పడవలెనన్నచో అంకుశముతో మావటివాడు అధిష్టించి యుండవలెను. 

అట్లే ఇంద్రియములను, మనస్సును అధిష్టించి మానవ ప్రజ్ఞ జీవనయానము వైభవోపేతముగా నిర్వర్తించ దలచుకొన్నచో కర్తవ్యమను అంకుశముతో మనసును నడిపించవలెను. లేనిచో ప్రజ్ఞ హరింపబడునని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


------------------------------------ x ------------------------------------




🌹 36. గీతోపనిషత్తు - హెచ్చరిక - జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కేవలము కర్తవ్యమునకే వినియోగింపబడుటచే విషయాసక్తి గొనక అప్రమత్తములై చురుకుగ ఉండగలవు. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 68 📚

పొరబడని, హెచ్చుతగ్గులు లేని స్థిరమైన జ్ఞానము వలయునా? అట్టి జ్ఞానమును ప్రతిష్ఠింప జేయుటకు ఉత్సహించుచున్నావా? అట్లయినచో నీ పంచేంద్రియముల వినియోగము పరిశీలింపుము. 

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్ణేభ్య స్తస్య ప్రజా ప్రతిష్ఠితా || 68

వాక్కు, కర్మేంద్రియముల వినియోగమును కూడ పరిశీలింపుము. వానిని కర్తవ్యమునకే వినియోగించుట, ఇతర సమయముల యందు విశ్రాంతి నిచ్చుట అను దీక్షను స్వీకరింపుము.

జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కేవలము కర్తవ్యమునకే వినియోగింపబడుటచే విషయాసక్తి గొనక అప్రమత్తములై చురుకుగ ఉండగలవు. కర్తవ్యము గోచరించినపుడెల్ల ప్రతి స్పందించగలవు. లేనిచో విశ్రమించ గలవు. విషయానురక్తి అను వ్యాధిని కర్తవ్యమను ఔషధముతో పరిపూర్ణముగ నిర్మూలించుము.

ఇట్లు ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను సర్వవిధముల

నిగ్రహించ వచ్చును. భగవంతుడు పై శ్లోకమున “సర్వశః" అను పదమును వాడినాడు, అనగా సర్వ విధముల పరిపూర్ణముగ ఒకించుక కూడ విషయాసక్తి లేకుండగ నిర్మూలించినవే జ్ఞానము స్థిరపడును. 

నావ ఎంత కట్టుదిట్టముగ నున్నను చిన్న రంధ్రము కారణముగ మునిగి పోవును గదా! నీటి కుండకు ఎంత చిన్న చిల్లు పడినను నీరు కారిపోవును కదా! 

అట్లే జ్ఞానము సుప్రతిష్టమై యుండవలెనన్నచో విషయాసక్తి యను రంధ్రమునకు తావీయరాదు సుమా! అని భగవానుడు హెచ్చరించు చున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹

Whatsapp Group 
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group 
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

23 Sep 2020

------------------------------------ x ------------------------------------




🌹 37. గీతోపనిషత్తు - చీకటి , వెలుగు - సంయమమనగా ఇంద్రియములు మనస్సునందు, మనస్సు బుద్ధి యందు, బుద్ధి నేను అను ప్రజ్ఞ యందు ఇమిడి యుండుట. అట్టివాడు “జాగర్తి”గ నుండును. అనగా మేలుకొని ఉండును. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 69 📚


యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి |
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః || 69

మునులకు, యోగులకు ఈ జగత్తున కనబడునది సామాన్యులకు కనపడదు. సామాన్యులకు గోచరించినది సంయమ ముగల యోగులకు గోచరించదు. యోగులకు, మునులకు విశ్వ మంతయు వ్యాపించి ఉన్న ఒకే ఒక చైతన్యము గోచరించును. 

ఆ మహాచైతన్యమే పెక్కు విధములుగా ఎట్లు నర్తించుచున్నదో గోచరించును. వైవిధ్యము గల ఆ నర్తనము యొక్క వైభవమును దర్శించుచు వారానందింతురు. వారియందు స్వ-పర భేదములు గాని, సంఘము నందలి స్థితిగతులు గాని, జీవులయందలి భేదములు గాని భాసింపవు. 

ఉదాహరణకు ఒక మనిషి ఎట్టి విలువైన వస్త్రములు ధరించెనో, ఎటువంటి ఆభరణములు ధరించెనో, అతని రూపురేఖ లెట్లున్నవో యోగి గమనించడు. ఎదురుగా నిలబడిన జీవమును, జీవచైతన్యమును మాత్రమే దర్శించును. జాతి మత కుల లింగ భేదములు గోచరింపవు. 

సమాన్యులకు జాతి మత కుల లింగ భేదములు గోచరించును, ఆకారములు, వాని వికారములు గోచరించును. వస్త్రాభరణములు యొక్క విలువ గోచరించును. ఎదుటివారి తప్పులు గోచరించును. 

సంఘమున గల ఇంద్రియార్థములు గోచరించును. మరెన్నెన్నో చిల్లర విషయములు గోచరించును. కాని యోగులకు గోచరించు జీవచైతన్యము, దాని వెలుగు, వైభవములు సామాన్యులకు గోచరించవు.

పై విధముగ యోగులకు గోచరించునవి జీవులకు గోచరించకుండుట యోగుల పగలు, జీవులు రాత్రియని భగవంతుడు చమత్కారముగ తెలిపినాడు. అట్లే జీవులు చూచు లౌకిక విషయములు యోగుల దృష్టిని ఆకర్షించవు. గనుక జీవుల పగలు యోగులకు రాత్రి అనికూడ తెలిపినాడు.

మునులు, యోగులు, ఆత్మ సంయమము చెందిన వారిని, దర్శన జ్ఞానము కలిగివారిని, సతతము మననము నందుండు వానిని కూడ భగవానుడు ఈ శ్లోకమున తెలియజెప్పినాడు.

సంయమమనగా ఇంద్రియములు మనస్సునందు, మనస్సు బుద్ధి యందు, బుద్ధి నేను అను ప్రజ్ఞ యందు ఇమిడి యుండుట. అట్టివాడు “జాగర్తి”గ నుండును. అనగా మేలుకొని ఉండును. 

“పశ్యతః' అనగా సమస్తమునందు మేలుకొని యున్న దానిని మెలకువతో దర్శించు చుండును. 'ముని' అనగా దర్శించిన దానిని అదే సమయమున మననము చేయుచుండును. అట్టివాని దృష్టికి చీకటి లేదు. అనగా కనపడకుండుట లేదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


Whatsapp Group 
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group 
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

24 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹 38. గీతోపనిషత్తు - కామస్వరూపం - శాంతిని పొంది బుద్ధియందు స్థిరపడిన వానిని మరి ఏ భోగ్య విషయములు మరింత శాంతిని, తృప్తిని కలిగింప జాలవు. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 70  📚

ఆపూర్యమాణ మచలం ప్రతిష్ఠమ్

సముద్ర మాపః ప్రవిశంతి యద్వత్ |

తద్వత్కామా యం ప్రవిశంతి సర్వే

స శాంతి మాప్నోతి న కామ కామీ || 70


సముద్ర దర్శనము శుభకరమని పెద్దలు తెలుపుదురు. సృష్టియందు సముద్రమునకు ఒక విశిష్ట స్థానమున్నది. సముద్రమునందు నదుల నుండి, వాగుల నుండి, వర్షపాతము నుండి ఎంత జలము చేరినను సముద్రము పొంగదు. ఇదియొక విశిష్టస్థితి. ఎన్ని విషయములు సముద్రమున చేరినను సముద్రమట్లే యుండును.

దానియందు సమస్తము ఇముడును. ఇతరములు వచ్చి చేరుట వలన సముద్రము ఎల్లలు దాటదు. దానికి స్థిరమైన హద్దుమీరని ఉనికి కలదు. అది పూర్ణమైనది. అనగా నింపుటకు అవకాశము లేనిది. నిండి యున్నది గనుక నింపుటకు వీలుపడదు.

అట్లే శాంతిని పొందీ బుద్ధియందు స్థిరపడిన వానిని మరియే భోగ్య విషయములు మరింత శాంతిని, తృప్తిని కలిగింప జాలవు. 

అతడు శాంతిగను తృప్తిగ నుండుటచే భోగ్య విషయములు మరింత శాంతిని, తృప్తిని ఇచ్చుట జరుగదు. నిండిన సముద్రమున మరింత నీరు చేర్చిన ఎట్లు పొంగదో శాంతి, తృప్తితో నిండిన మనస్సు మరి యే ఇతర విషయములకు పొంగదు.

సముద్రము నుండి సూర్య కిరణములు జలములను ఊర్ధ్వగతికి కొనిపోయి నను సముద్రమింకదు. అట్లే విషయలేమి కారణముగ శాంతుని చిత్తము క్రుంగదు. పొంగుట-క్రుంగుట సముద్రమునకు, శాంతచిత్తునకు లేవు. 

ఇదియే బ్రహ్మానంద స్థితి. బుల్లి బుల్లి కోరికల యందు జీవిత మంతయు సతమతమగు వానికి ఈ స్థితి దుర్లభము. ఊహించుటకైననూ వీలుపడనిది. భగవానుడీ విధముగ తన నిజస్థితిని అర్జునునికి సూచన ప్రాయముగ తెలిపినాడు. 

ప్రస్తుతము అర్జునుడున్న పరిస్థితికి భగవంతుడందించిన ఉదాహరణము అగ్రాహ్యము (బొత్తిగా అర్థము కాని విషయము). అయినను బీజప్రాయముగ అత్యుత్తమ విషయమును శిష్యునియందు ఆవిష్కరించుట సద్గురువు యొక్క దూరదృష్టి మరియు కరుణ అని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


26 Sep 2020

------------------------------------ x ------------------------------------




🌹   39. గీతోపనిషత్తు - శాంతి సూత్రము - కర్తవ్యమనగా చేయవలసిన పని. కామ మనగా చేయదలచిన పని. తాను తలచిన పనులు చేయుటకాక, వలసిన పనులను చేయుట ముఖ్యము. ఇవి ఆరోహణ క్రమమునకు గడప వంటివి.  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.   గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 71   📚

ఏ మనుజుడైతే రాగద్వేషములను విడుచునో, ఎవడైతే విషయముల యందు ఆసక్తి విడుచునో, మమకారమును అహంకారమును విడుచునో అట్టివాడు శాంతిని పొందునని భగవానుడు ఈ శ్లోకమున తెలుపుచున్నాడు. ఇందు నాలుగు స్థితులను వివరించుచున్నాడు.

విహాయ కామాన్ య స్సర్వాన్ పుమాం శ్ఛరతి నిస్స్పృహః |
నిర్మమో నిరహంకారః స శాంతి మధిగచ్ఛతి || 71 

ఇందు మొదటిది కామ విసర్జనము. సర్వమతముల యందు, సర్వశాస్త్రముల యందు కామమును విసర్జింపుమని తెలుపబడుచునే యుండును. కర్తవ్యము ననుసరించుట వలన మాత్రమే కామము విసర్జించుటకు వీలుపడునని తెలియవలెను. 

కర్తవ్యమనగా చేయవలసిన పని. కామ మనగా చేయదలచిన పని. తాను తలచిన పనులు చేయుటకాక, వలసిన పనులను చేయుట ముఖ్యము. ఇవి ఆరోహణ క్రమమునకు గడప వంటివి. 

అట్లు కర్తవ్యమును మాత్రమే చేయ దీక్ష పూనిన వానికి మార్గమున అనేకానేక విషయములు కన్పట్టుచుండును. అందనురక్తి కొన్నవాడు కర్తవ్య విముఖుడు కాగలడు.

విషయానురక్తుడు కర్తవ్యపాలనము చేయలేడు. అందుచే విషయాసక్తిని విసర్జించుచు, కర్తవ్యము నిర్వర్తించుచు సాగిపోవలెను. అటు పైన సాధకునకు మమకార మను అవరోధమేర్పడును. నాది అను భావమే మమకారము. తన శరీరము, తన వారు, తన సంపద అనునవి మమకార స్థానములు. 

తనది అనుకొనినదంతయు నిజమునకు దైవమునదే అని భావించుట సాధనగ సాగవలెను. శరీరమునకు, తనను ఆశ్రయించిన వారికి, తన చుట్టూ ఏర్పడిన సంపదకు యజమాని దైవమే యనియు, తాను కేవలము ధర్మకర్త అనియు భావింప వలెను. ధర్మకర్తయనగా వాని యందు తన ధర్మము నిర్వర్తించుటే గాని యాజమాన్యము కాదు. ఇట్టి భావనను థిరపరుచుకున్నవానికే మమకారమను పొర తెగును.

అహంకారము వర్ణించుట తుది మెట్టు. కర్తవ్యమును చేకొని కామమును వర్ణించుట, కర్తవ్య పాలనమున ఆకర్షణీయమగు విషయముల యందు అనురక్తిని వర్ణించుట, "తనది” అను భావమును వర్ణించుట అను మూడు సోపానములను అధిరోహించిన సాధకుడు “తాను” అను భావమును కూడ వర్ణించుట తుది మెట్టు.

నిజమునకు తానులేడు. తానుగ దైవమే యున్నాడు. కాని తా నున్నాడననుకొను చున్నాడు. అట్లనుకొనుటయే అహంకారము. 

తనకొక ప్రత్యేక అస్థిత్వము లేదు. దైవమే జీవుడుగా నుండగ, జీవుడు తానున్నాడను కొనుటయే మొదటి మాయావరణము. బంగారము లేక ఉంగరము లేదు. మట్టి లేక కుండ లేదు. సముద్రము లేక కెరటము లేదు. దైవము లేక జీవుడు లేడు. ఈ జ్ఞానము పూర్ణ జ్ఞానమునకు తుది మెట్టు. దీని నధిరోహించుటకు "తా నుండుట అనగా నేమి?" అను అంశముపై విచారణ తీవ్రముగ సాగవలెను. 

సమాధానము దర్శించినపుడు అహంకారము నశించును. నిరహంకారి యగును. అతనిది స్థిరమైన శాంతి. అహంకారికి శాంతి లేదు. మమకారికి అసలు లేదు. 

విషయానురక్తునకు బొత్తిగ శాంతి లేదు. కాముకునకు అశాంతి స్థిరముగ నుండును. ఈ నాలుగ సోపానములు అధిరోహింప జేయుటకే పదునెనిమిది అధ్యాయముల గీతోపదేశము. 

ఈ సోపానముల నధిరోహించుటనే ఉపనిషత్తులు సూచించుచున్నవి. యోగవిద్య బోధించుచున్నది. బ్రహ్మవిద్య ఘోషించుచున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


27 Sep 2020

------------------------------------ x ------------------------------------




🌹. 40. గీతోపనిషత్తు - బ్రహ్మ నిర్వాణము - అంతటిలో నిండిన తత్త్వమును బ్రహ్మము అందురు. ఈ తత్త్వమును దర్శించిన వాని స్థితి బ్రాహ్మీ స్థితి. ఇది పొందినవానికి తాను కానిది ఏమియు కనపడదు. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 72 📚

ఇది సాంఖ్యయోగమను అధ్యాయమునకు చిట్టచివరి శ్లోకము. ఈ శ్లోకమున భగవంతుడు అంతకుముందు శ్లోకములలో వివరించిన సోపాన క్రమమునకు గమ్యమును నిర్వర్తించు చున్నాడు.

ఏషా బ్రాహ్మీస్థితి: పార్థ ! నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాం స్యా మంతకాలే పి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి || 72

అర్జునుడు ప్రజ్ఞయందు స్థితి గొన్నవాని లక్షణములను గూర్చి నాలుగు ప్రశ్నలు శ్రద్ధాభక్తులతో శ్రీకృష్ణుని అడిగెను. 

స్థితప్రజ్ఞుని లక్షణము లేవి? అతడేమి పలుకును? ఏ రీతిగ నుండును? ఎట్లు సంచరించును? అనునవి ఆ ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికిని సమాధానములు వివరించుచు శ్రీకృష్ణుడు క్రమశః 71వ శ్లోకము చేరునప్పటికి నిరహంకార స్థితిని ఆవిష్కరించెను. 

నిరహంకార స్థితి చేరినవారికి సమస్తము వ్యాపించియున్న తత్వమే తానుగా నున్నదనియు, మరియు సమస్త జగత్తు అదియే నిండియున్నదనియు తెలియును. 

అంతటిలో నిండియున్నది, అన్నిటియందు నిండినది, తనయందు కూడ నిండియుండుటచే తాను, ఇతరము అను భేదము నశించును. 

అంతటిలో నిండిన తత్త్వమును బ్రహ్మము అందురు. ఈ తత్త్వమును దర్శించిన వాని స్థితి బ్రాహ్మీ స్థితి. ఇది పొందినవానికి తాను కానిది ఏమియు కనపడదు. 

తానే సమస్తమై యుండుటచే మరియు సమస్తమే తానుగ నుండుటచే మరియొకటి లేని స్థితి ప్రాప్తించుటచే మోహము, అంత్య కాలము అనునవి కూడ లేకుండును. 

మరియొకటి లేని స్థితిని గూర్చి భగవానుడు భాషణము చేయుచున్నాడు. ఇదియొక అద్భుతమైన స్థితి. అనిర్వచనీయమైన స్థితి. అంతకుముందున్నవి అపుడుండవు. అంతకుముందు గోచరించిన సత్యములు కూడ నుండవు. 

స్వప్నమున అనేకానేక రూపములను, సన్నివేశములను, భావములను అనుభూతి చెందుచున్న జీవుడు మేల్కాంచినపుడు స్వప్నము లోని విశేషములన్నియు, మేల్కాంచినపుడు ఎట్లు లేవో, అట్లే బ్రహ్మమునందు మేల్కాంచినవానికి ఈ సమస్త సృష్టియు, అందలి జీవులు, లోకములు స్వప్నమని తెలిసి నవ్వు కొనగలడు. అతని ఆనందమునకు అవధులు లేవు. అదియే బ్రహ్మానందము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

------------------------------------ x ------------------------------------




🌹.   గీతోపనిషత్తు - 41  🌹

🍀 చేయుట - నేర్చుట - ఆవశ్యకత - జీవితమున ప్రశాంతత, సుఖశాంతులు, తృప్తి, మంచితనము, ఆనందము ముఖ్యము. 🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - కర్మయోగము - 01 📚

1. ప్రాథమిక కర్మ సూత్రములు (1 నుండి 6శ్లో|| )

“పనులు చేయుచు నేర్చుకొనవలెనా? నేర్చుకొనుచు చేయవలెనా?" రెండునూ ఒకటే. సామాన్య జీవితమున జీవుడు లేచినది మొదలు ఏదియో ఒకటి చేయుట తప్పనిసరి. దంతధావనము, స్నానము, వస్త్రధారణము, భోజనము, సంఘమున ఏదియో ఒక పని, విలాసము, విశ్రాంతి తప్పనిసరి పనులు. చేయుట తప్పనిసరి యైనప్పుడు చేయుచు నేర్చుకొనవచ్చును. 

అర్జున ఉవాచ :

1. జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధి ర్జనార్ధన |

తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ||

2. వ్యామిశ్రేణీవ వాక్యేన బుద్దిం మోహయసీవ మే |

తదేకం వద నిశ్చత్య యేన శ్రేయో హ మాప్నుయామ్ ||

3. శ్రీ భగవా నువాచ :

లోకే2 స్మిన్ ద్వివిధా నిష్ణా పురా ప్రోక్తా మయా నఘ |

జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ||

4. న కర్మణా మనారంభా నైష్కర్మ్యం పురుషో2 శ్నుతే |

న చ సన్న్యసనా దేవ సిద్ధిం సమధిగచ్ఛతి ||

5. న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్ |

కార్య తే హ్యవశః కర్మ సర్వ: ప్రకృతిజైరుణైః ||

6. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |

ఇంద్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచార స్స ఉచ్యతే |


🌷.చేయుట - నేర్చుట : 🌷

నేర్చుకొనుటకు చేయుటను ఆపనక్కరలేదు. ఇది కృష్ణుని మతము. చేయుచు నేర్చుకొనుట తెలివి. చేయుచు నేర్చుకొనుట అనినను, నేర్చుకొనుచు చేయుట అనినను ఒకటే. నేర్చుకొనని వాని చేతలలో నిపుణత పెరగదు. కౌశలము పెరగదు. కావున పనులు కుశలముగా జరుగవు. అడ్డంకులు వచ్చును. లోపల, బయట ఘర్షణము పెరుగును. పనులు చేయుట యందు నిపుణత పెరగవలెనన్నచో ఎట్లు చేయవలెనో కూడ నేర్చుకొను చుండవలెను. నేర్చుకొనకుండ చేయువాడు దుఃఖపడును. నేర్చుకొనుచు చేయువాడు సుఖపడును.

ఒక పనినిగాని, ఒక వృత్తినిగాని, వ్యాపారమునుగాని, ఉద్యోగముగాని, సంఘ సేవ గాని, స్వాధ్యాయముగాని, తపస్సు గాని చేయువాడు ప్రతిదినము ముందు రోజు కన్న బాగుగ చేయుటకు పూనుకొనవలెను. 

ప్రతి పని పెద్దది కాని, చిన్నది కాని నిన్నటి కన్న ఈ రోజు ఇంకొంచెము బాగుగ చేయుటకు నేర్పుకావలెను. చేయుట వలన కూడ నేర్చుకొన వచ్చును. నేర్చుకొనుచు చేయవచ్చును. చేయుచు, ఎట్లు నేర్వవలెనో భగవంతుడు తెలిపిన విషయమును కర్మయోగ మనిరి.

చేయక ఊరక నేర్చుకొనుట, చేయుచు నేర్చుకొనకుండుట నిష్ప్రయోజనము. చాలమంది ఈ ఉపాయము తెలియక నేర్చు కొనుటకు చేయుట నాపుదురు. చేయనివాని జ్ఞానము అనుభవైక జ్ఞానము కాదు కదా! 

అట్టివారు మిథ్యాచారులుగ, మూర్ఖులుగ దిగజారుదురు. శరీరమును, యింద్రియములను, మనసును నియోగించుటకే దైవమందించినాడు. వానిని వినియోగింపక పోవుట ఎవని తరము కాదు. వానిని నియమించి సద్వినియోగము చేయుట కర్తవ్యము. అందువలన వాటిని అరికట్టక, దమింపక నియమించి వినియోగించుట నిజమైన యోగము. ఎట్లు నియమించి వినియోగించవలెనో ఈ అధ్యాయమున(కర్మ యోగమున) దైవము తెలుపుచున్నాడు.


🌷.ఆవశ్యకత: 🌷

కర్మల నెట్లు ఆచరించవలెనో, ఎట్లాచరించినచో చేయు కర్మల నుండి బంధము లేర్పడవో భగవానుడు కర్మయోగమున తెలియపరచు చున్నాడు. తాను తెలిపిన విధముగ సృష్టిలో కర్మల నాచరించుచు ముక్తసంగులై జీవించుచున్న వారిని కూడ కర్మయోగమున దైవము పేర్కొనినాడు. కర్మ స్వరూప స్వభావములను ఎరుగక తెలిసినవారు కూడ పొరపాట్లు చేయుట జరుగుచున్నది. 

కర్మ నిర్వర్తించు విధానము విద్యాభ్యాస కాలముననే తెలుసుకుని అట్లాచరించుటకు యుద్యుక్తుడైన వాడు జీవితమను రంగస్థలమున ప్రవేశించుటకు, కౌశలముగ వర్తించుటకు, తదనుభూతిని నిత్యమును అనుభవించుటకు అర్హత కల్గి యుండును. 

ఈ విద్య మృగ్యమగుటచే ఆధునిక మానవుడు ఎన్ని సౌకర్యములు కలిగి యున్నప్పటికిన్ని దుఃఖము చెందుచునే యున్నాడు. ఘర్షణ పడుచునే యున్నాడు. తీవ్రమైన విరోధములకు, రోగములకు గురియగు చున్నాడు.

జీవితమున ప్రశాంతత, సుఖశాంతులు, తృప్తి, మంచితనము, ఆనందము ముఖ్యము. వీటికి పదవులతోగాని, సంపదతో గాని, గొప్పదనముతో గాని, అధికారముతో గాని సంబంధము లేదు. అవి కలిగినచో కర్మయోగి వైభవము కలిగిన వాడగుచున్నాడు గాని వాని కొఱకై ప్రత్యేక ప్రయత్నముండదు. 

కర్మయోగ మనగా కర్మ లెట్లు నిర్వర్తించవలెనో అను విధానముతో అనుసంధానము చెంది జీవించుట. ఆ విధానమును భగవంతుడు చక్కగ విశద పరచినాడు. 

ప్రాథమికమగు కర్మయోగ సూత్రములను అనుసరించనివారు జీవితమున నేల విడచి సాము చేసిన వారగుదురు. వారు చతికిల పడక తప్పదు. మిథ్యాచారులై తమను తాము మోసము చేసుకొనుచు, ప్రపంచమును దూషించుచు గమ్యము లేక అందినదల్ల సంగ్రహించుచు జీవింతురు.

కర్మయోగ సూత్రములను పునాదిగా నేర్పరచుకొనని జీవనము పునాదిలేని ఇల్లువలె స్థిరత్వము లేక, ఎపుడు కూలునో యను భయముతో జీవించుట యుండును. 

ఆలస్యమైనది అని తలపక దీక్షతో ఈ సూత్రములను పాటించుటకు ప్రయత్నించు వాడు ప్రశాంత జీవనమునకు, భక్తి జ్ఞాన వైరాగ్యములకు అర్హత పొందును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


30 Sep 2020

------------------------------------ x ------------------------------------





🌹. గీతోపనిషత్తు - 42 🌹

🍀 2. శ్రద్ధ - భక్తి - ప్రతిదినము కర్మల నాచరించువాడు సంగము లేక ఆచరించినచో అతడు ఉత్తమ కర్మిష్ఠిగ నుండగలడు. 🍀 

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.   కర్మయోగము - 07  📚


7. యస్యింద్రియాణి మనసా నియమ్యారభతేఖర్జున |

కర్మేంద్రియై: కర్మయోగ మసక్త స్ప విశిష్యతే ||


తమను తాము కర్మలయందు బంధించుకొనక జీవించు విధానము శ్రీకృష్ణుడు ఈ క్రింది విధముగ తెలుపుచున్నాడు. వీనిని శ్రద్ధతో అధ్యయనము చేసి అనుసరించిన వానికి జీవితము ఒక క్రీడగ సాగును. అట్లు కానిచో జీవితమున బంధము తప్పదు.

అసక్తస్స, ఆరభతే, కర్మయోగమ్ : ప్రతిదినము కర్మల నాచరించువాడు సంగము లేక ఆచరించినచో అతడు ఉత్తమ కర్మిష్ఠిగ నుండగలడు. సంగము లేక కర్మలాచరించుట యనగ, తన కర్తవ్యమును తను శ్రద్ధా భక్తులతో నిర్వర్తించుట. ఫలితములవైపు మనస్సును పోనీయకుండుట. అనగా తినునపుడు, మాటాడునపుడు, పనులు చేయుచున్నపుడు వానియందు పరిపూర్ణమైన శ్రద్ధ, భక్తి ఉండవలెను. 

వానిని నిర్వర్తించు తీరు తెలుసుకొని అట్లే నిర్వర్తించుచు నుండవలెను. ఎక్కువ తక్కువలు చేయరాదు. ఫలితముల వైపుకు మనస్సును పోనీయరాదు. 

విద్యార్థులకు విద్యయందు శ్రద్ధ ఉండవలెను గాని మార్కుల యందు గాదు. పని చేయువాడు పనియందు శ్రద్ధగాని నెలసరి భత్యమునందు కాదు. ఇట్లు సమస్తమునందు శ్రద్ధాపూరిత కర్తవ్య నిర్వహణమే కాని, ఇతరము లందు ఆసక్తి జనింపరాదు. 

ప్రస్తుత మెప్పుడును కర్తవ్యమునే బోధించుచుండును. దానిని గ్రహించి నిర్వర్తించుటే మార్గము. చిన్నతనము నుండి ఈ పద్ధతి నభ్యసించినచో మనిషి కర్మ నిర్వహణమున శ్రేష్ఠముగ నిలచియుండును. (3-7)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


WhatsApp, Telegram, Facebook groups:


02 Oct 2020

------------------------------------ x ------------------------------------




🌹. గీతోపనిషత్తు - 43 🌹

🍀 3. నియత కర్మ - తన పని తాను చేయుట, అదికూడ శ్రద్ధతో చేయుట ముఖ్యము. తనది కాని పని తాను చేయుటవలన జీవుడు బద్ధుడగును. 🍀 

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. కర్మయోగము - 08 📚

8. నియతం కురు కర్మ త్వం కర్మజ్యాయో హ్యకర్మణః |

శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ద్యే దకర్మణః ||

నియమింపబడిన కర్మను మాత్రమే చేయుట రెండవ సూత్రము. తన పని తాను చేయుట, అదికూడ శ్రద్ధతో చేయుట ముఖ్యము. తనది కాని పని తాను చేయుటవలన జీవుడు బద్ధుడగును. తన పని ఏమో తాను తెలుసుకొని హద్దులు మీరక నిర్వర్తించవలెను. 

తన పనిలో లోపములు లేకుండ నిర్వర్తించుటే తనకు ముఖ్యము. ఇతరుల పనులలో జొరబడుట, వారి పనుల లోని లోటుపాటులను చర్చించుట, విమర్శించుట తగదు.

అట్లు చేయువారికి తమ పనులను నిర్వర్తించుకొను సామర్థ్యము తగ్గును. శ్రద్ధ తగ్గును గనుక సామర్థ్యము తగ్గును. ఇతరుల పనులలో తలదూర్చువారు వడ్రంగము పనిచేయుటకు పూనుకొనిన కోతివలె దుఃఖపడుదురు. 

తమకు నియమించిన పని చేయకపోవుట వలన జీవనయాత్ర కుంటుపడును. అందుచేత దైవము ఏకాగ్రతతో, నియంత్రిత పని నియమముతో, శ్రద్ధతో ఆచరింపుమని రెండవ ఆదేశము చేసినాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


03 Oct 2020

------------------------------------ x ------------------------------------





🌹.   గీతోపనిషత్తు - 44    🌹

🍀  4. సమాచరణము - సంగము లేక, నియత కర్మను లోకహితముగ ఒనర్చుట వలన జీవుడు బంధింపబడుటకు ఎట్టి అవకాశమును ఉండదు.  🍀 

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



📚.   కర్మయోగము - 09   📚


యజ్ఞార్థం కురు కర్మాణి : నియమితమైన కర్మను శ్రద్ధాభక్తులతో సంగము విడిచి చేయవలెనని తెలిపిన శ్రీకృష్ణుడు, చేయు కర్మ యజ్ఞార్థమై యుండవలెనని మూడవ సూత్రమున పలికినాడు. అనగా కర్మము లోకహితార్థముగ చేయుమని అర్థము. లోకహితమే తన హితము. అందుచేత కర్మమునకు ప్రాణసమానమైన లక్షణము పరహితము. 


9. యజ్ఞాం త్కర్మణా న్యత్ర లోకో యం కర్మబంధనః |

తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ స్సమాచర ||


లోకమునకు హితము కానిది తనకు కూడ హితము కాదు. ఇది తెలిసి కర్మల నాచరించవలెను. సంఘద్రోహము, దేశద్రోహము, జీవద్రోహము చేయు కర్మల నుండి బంధము కలుగును. ఇతర జీవులకు అహితము, హింస కలుగు పనులు చేయరాదు. 

మనస్సున ప్రధానముగ పరహితమే గోచరించవలెను. చేయు పనులందు పరహితమే ప్రతిబింబించవలెను.

సంగము లేక, నియత కర్మను లోకహితముగ ఒనర్చుట వలన జీవుడు బంధింపబడుటకు ఎట్టి అవకాశమును ఉండదు. అట్టివాడు సమాచరుడై యుండును. అనగా ఆచరణమున సమత్వము కలిగి యుండును. (3-9)


సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


04 Oct 2020

------------------------------------ x ------------------------------------





🌹.   గీతోపనిషత్తు - 45   🌹

🍀 45. ఉపదేశము - యజ్ఞములు చేయుచు వృద్ధిని పొందుడు.” బ్రహ్మదేవుడు యజ్ఞమును చేసి వృద్ధిని పొంది ముక్తుడుగా దైవమందు నిలచినాడు. మీరును అట్లే యజ్ఞార్థముగా జీవించుచు నా వలెనే వృద్ధి పొందుడు అని ఉపదేశమిచ్చినాడు. 🍀 

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.   కర్మయోగము - 10     📚

సహ యజ్ఞా: ప్రజా స్పృష్ట్యా పురోవాచ ప్రజాపతిః |

అనేన ప్రసవిష్యధ్వ మేష వో? స్విష్టకామధుక్ || 10

యజేన ప్రసవిష్యధ్వం :

బ్రహ్మదేవుడు సృష్టించినపుడు జీవులు, లోకములు, లోక పాలకులు ఏర్పడిరి. అవ్యక్తమైన తత్త్వము నుండి బ్రహ్మదేవుడు వాహికగ సమస్తము కొనిరాబడినది. బ్రహ్మదేవుడు పై కార్యమెందులకు చేసినాడు? దాని వలన అతనికేమి ప్రయోజనము? వ్యక్తి గతముగ ఏ ప్రయోజనము లేదు. 

సృష్టి నిర్మాణము ఒక బృహత్తర పథకము. అట్టి కార్యములు నిర్వర్తించుట వలన బ్రహ్మదేవునకు ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనము లేదు. చతుర్ముఖ బ్రహ్మ స్థితికి (అస్తిత్వమునకు) కారణము సంకల్పము. సంకల్పము అవ్యక్తమగు బ్రహ్మమునుండి పుట్టి బ్రహ్మ నేర్పరచుకొన్నది. 

ఆ సంకల్పము ననుసరించి బ్రహ్మదేవు నేర్పరచుకొని అతని నుండి కోటానుకోట్ల జీవులుగాను, సప్తలోకములుగాను, అందలి అంతర్లోకములుగాను, లోకపాలకులుగాను, ప్రకృతి శక్తులుగాను, కాలము దేశములుగాను, శబ్దముగాను వర్ణముగాను, అంకెలుగాను, రూపములు గాను ఏర్పడినది. ఆ దివ్యసంకల్పమును అనుసరించి వ్యక్తిగత ప్రయోజనములను చూడక అత్యంత బాధ్యతాయుతమైనటు వంటి కార్యమును బ్రహ్మదేవుడు నిర్వర్తించినాడు. 

అందు బ్రహ్మ దేవునకు ఎట్టి కామము లేదు. సంగము లేదు. మోహము లేదు. లోభముగూడ లేదు. ఇట్లు నిర్వర్తించు కార్యమునే యజ్ఞ మనిరి. పై విధముగ నిర్వర్తించుటచే సమస్త సృష్టికిని చతుర్ముఖ బ్రహ్మ

ఆరాధ్యుడైనాడు. అట్టి బ్రహ్మ చేసిన ఉపదేశమొకటి గలదు. 

అదియే "యజేన ప్రసవిష్యధ్వం" అనగా "యజ్ఞములు చేయుచు వృద్ధిని పొందుడు.” బ్రహ్మదేవుడు యజ్ఞమును చేసి వృద్ధిని పొంది ముక్తుడుగా

దైవమందు నిలచినాడు. మీరును అట్లే యజ్ఞార్థముగా జీవించుచు నా వలెనే వృద్ధి పొందుడు అని ఉపదేశమిచ్చినాడు. 

బుద్ధిమంతులైన వారు ఈ విషయమును గ్రహించి తదనుగుణ్యముగ జీవితమును క్రమశః మలచుకొనవలెను. తాను నిర్వర్తించి తద్వారా వృద్ధి పొంది అనుభవ పూర్వకముగ అందించిన ఉపదేశమిది. సృష్టికి చతుర్ముఖ బ్రహ్మ ప్రథమస్థానమున నుండుట కిదియే ఉపాయము. 

కావున యజ్ఞార్థ కర్మము మనసునకు పట్టునట్లుగ అవగాహన చేసుకొనవలెను. అటుపై ఆచరించవలెను. అట్లు కానిచో బంధములు తప్పవు. (3-10)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


05 Oct 2020

------------------------------------ x ------------------------------------





🌹.   గీతోపనిషత్తు - 46   🌹

🍀  6. ఆరాధనము - దేవతలను ఆరాధించుట యనగా మానవుడు గూడ దేవతల వలె పరహిత ధర్మమునకు తన జీవితమును సమర్పించవలెను. 🍀 


✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



📚.   కర్మయోగము - 11   📚


11. దేవా న్భావయతానేన తే దేవా భావయంతు నః |

పరస్పరం భావయంత: శ్రేయః పర మవాప్స్యథ || 11


శ్రేయః పర మవాప్యుథ :

దేవతలు మానవులకు సహాయము చేయగలరు. దేవతలకు ప్రీతి కలిగించు మార్గము యజ్ఞార్థ జీవనమే. దేవతలు సంతుష్టులైనచో మానవులకు సంతుష్టిని, వృద్ధిని యొసగుదురు. మానవుల వృద్ధికి సహకరింతురు. దేవతలను ఆరాధించుట యనగా మానవుడు గూడ దేవతలవలె పరహిత ధర్మమునకు తన జీవితమును సమర్పించవలెను. 

దేవతలట్లే సమర్పించుటచే సృష్టి ప్రణాళిక నెరిగి సృష్టిని నిర్వహణము చేయుచున్నారు. తమవలెనే ఏ మానవుడు పరహిత కార్యములకు సమర్పణ చెందునో అట్టి మానవుడు దేవతల ఆశీర్వచనము పొందును.

శ్రీకృష్ణుడు తెలిపిన భగవధారాధనము యిదియే. స్తుతి కొరకు, స్ఫూర్తి కొరకు ఆరాధనములు సలిపినను పరహితము సలుపని జీవితము జీవులకు హితముగా నుండనేరదు. 

దేవతారాధనమనగా పరహితధర్మము నాచరించుట. స్వహితమును ఆశింపకుండుట. ఇది సర్వ శ్రేయోదాయకము. పరమ శ్రేయోదాయకము. పరమ శ్రేయస్సు దీని వలననే కలుగునని “శ్రేయః పర మవాప్యుథ" అని పలికినాడు. 

నందగోపుడు వర్షాదులు కురియుటకై ఇంద్రుని ఆరాధించవలెనని సంకల్పించినాడు. బాలకృష్ణుని అడుగగా, ఇంద్రుని ఆరాధన పూజాది కార్యక్రమములుగా కాక, తోటిజీవుల శ్రేయస్సుగా కర్మ నాచరింపుమని బాలకృష్ణుడు తెలిపినాడు. 

భగవద్గీతలో శ్రీకృష్ణుడిచ్చిన పరమోత్కృష్టమైన ధర్మమిది. అతడు దేవతా ప్రీతికై యజ్ఞ యాగములను, పూజాభిషేకములను, హోమములను తనకుగా తాను ఎన్నడును నిర్వర్తించలేదు. నిర్వర్తిస్తున్న వారిని గౌతమ బుద్ధునివలె ఖండించలేదు. తనను సలహా అడిగినవారికి మాత్రము దేవతారాధన మనగా పరహిత జీవనమే అని తెలియజెప్పినాడు. 

దైవమొక్కడే. అతని కార్యమునే దేవతలు చేయుచున్నారు. వారు నిష్కాములు. జీవులు గూడ దేవతలను మార్గదర్శకులుగ నెంచు కొని, ఆ మార్గమునే నడచినచో దివ్యత్వము పొందగలరు. 

దేవతలను, గురువులను మార్గదర్శకులుగా భావించుట, గౌరవించుట, పూజించుట తగుమాత్రముగ జరుగుచుండవలెను. అవియే ప్రధాన కార్యములైనచో ముక్తజీవనము దుర్లభము. పరమ శ్రేయస్సునకు పరహితమే పరమధర్మమని శ్రీకృష్ణుడు, శ్రీరాముడు నిర్వర్తించి బోధించినారు. 

అదియే సనాతన ధర్మమార్గము. జీవుల శ్రేయస్సే దైవారాధనముగ సాగుట కృష్ణుడు తెలిపిన కర్మబంధ విమోచన మార్గము. (3-11)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


06 Oct 2020

------------------------------------ x ------------------------------------






🌹.   గీతోపనిషత్తు - 47   🌹

🍀   7. పరహితము - లభించిన భోగ భాగ్యములు ఇతరుల శ్రేయస్సు కొరకు వినియోగించు వాడు బుద్ధిమంతుడు. తనకు తానే అనుభవించు వాడు మూర్ఖుడు.   🍀 

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.   కర్మయోగము - 12   📚


12. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః |

తైత్తా నప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః || 12


యః అప్రదాయః, సహస్తేన ఏవః :

పరహిత కార్యములను నిర్వర్తించుచు తద్వారా దేవతల ప్రీతి నందిన వాడు భోగ్యమగు అనేక విషయములను వారి యనుగ్రహముగ పొందు చుండును. అట్లు విశేషములైన భోగములను గూడ అనుగ్రహింప బడును. అనుగ్రహింప బడిన భోగ్య విషయములు తనకు తానే అనుభవించుట దొంగతనము. అట్టి దొంగ మరల పతనము చెందగలడు.

లభించిన భోగ భాగ్యములు ఇతరుల శ్రేయస్సు కొరకు వినియోగించు వాడు బుద్ధిమంతుడు. తనకు తానే అనుభవించు వాడు మూర్ఖుడు. అట్టి మూర్ఖుడు తన ప్రవర్తనము ద్వారా తానే పతనము చెందుచుండును. తాను పరహిత కార్యము లొనర్చుటచే దేవతానుగ్రహము పొందినవాడు. దేవతలు అనుగ్రహించుటకు కారణము తనయందు పరహిత బుద్ధి యున్నదని. 

భోగ్యవిషయము లభ్యముకాగానే, పరహిత ధర్మము మరచుట కృతఘ్నత్వమగును. అందించిన ప్రతి భోగ్యవిషయమును పరహితమునకే సమర్పించుట వృద్ధికి కారణమగును. అట్లు కానిచో వృద్ధి యాగును. పతనము ప్రారంభమగును.

పరహిత బోధనలు విన్న పేద బ్రాహ్మణుడొకడు తనకుగల రెండు అంగవస్త్రములలో ఒక దానిని గౌతమబుద్ధునకు సమర్పించెను. ఆనందముతో ఏకవస్త్రము ధరించి బాటను పోవుచున్న పేద బ్రాహ్మణుని చూసి, ఆదేశపు రాజు, విషయము తెలుసుకొని బ్రాహ్మణునకు పది అంగవస్త్రముల జంటను అందించినాడు. లభ్యమైన పది అంగవస్త్రముల జంటలను బ్రాహ్మణుడు మరల దానము చేసి ఏకవస్త్రుడుగ నిలచి అమితానందము పొందినాడు. 

పై విషయము తెలిసిన రాజు బ్రాహ్మణునియందు మిక్కిలి సంతసించి ధన కనకములు, ధాన్యము బ్రాహ్మణున కందించినాడు.

అవియును గూడ మండలము రోజులలో ఇతరుల శ్రేయస్సునకు వినియోగించి మరల ఏకవస్త్రుడుగ చరించసాగినాడు. ఈ విషయము తెలిసిన రాజు ఆనందభరితుడై, బ్రాహ్మణునకు సస్యశ్యామలమైన అగ్రహారము నిచ్చినాడు. 

అగ్రహారమునంతను బౌద్ధసన్యాసులకు ఆశ్రమముగ నేర్పరచి పేద బ్రాహ్మణుడు పరమానందభరితుడై బుద్ధుని సాన్నిధ్యము పొందినాడు. రాజు మిక్కుటముగ ఆనందము పొంది పరహితమార్గమున పరిపూర్ణముగ నడచుటకు సంకల్పించి, దీక్షగ లోకహితమును ఆచరించి రాజర్షియై దైవసాన్నిధ్యమున నిలచినాడు. 

ఇట్లు తనదగ్గర ఉన్నటువంటి విద్యగాని, తెలివిగాని, శక్తిగాని, ధనాదులుగాని ఇతరుల శ్రేయస్సు కొరకై వినియోగించు వాడు సృష్టియందు నిజమైన రాజుగ నిలచును. అట్లు జీవించని వారు ఎప్పుడును పేదలే. పేదలేగాదు దొంగలు కూడ అని కృష్ణుడు కర్మానుష్ఠాన రహస్యమును తెలిపినాడు. (3-12)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్ 


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


07 Oct 2020

------------------------------------ x ------------------------------------





🌹.   గీతోపనిషత్తు - 48   🌹

🍀   8. మోక్షము - బంధము - తన శ్రేయస్సు కన్న ఇతరుల శ్రేయస్సు మిన్నగ యుండడుటయే పవిత్రతకు కారణము. అదియే భగవానుని ఆదేశము  🍀 

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



📚.   కర్మయోగము - 13   📚


కర్మానుష్ఠాన మార్గమున మలినముల నుండి విముక్తి చెందుటకు భగవానుడీ సూత్రము పలికినాడు. ఇతరులకు పెట్టి తాను తినువాడు పవిత్రుడగును. తనకు తాను తినువాడు అపవిత్రుడగును. ఇది సృష్టి ధర్మము. 


🌻 13. యజ్ఞశిష్టాశిన స్సన్తో ముచ్యంతే సర్వకిల్బిషైః |

భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మ కారణాత్ || 13 🌻


వ్యాపారము చేయువాడు తన సంస్థ యందలి సమస్త కార్యవర్గమునకు జీతభత్యములను ఏర్పరచి, ప్రభుత్వమునకు ఈయవలసినది, సంఘమునకు ఈయవలసినది ఇచ్చి, కుటుంబ సభ్యులకు కూడ అందించవలసినది అందించి, అటుపైన తననుగూర్చి భావించవలెను. అట్లు చేసినచో యజ్ఞమున మిగిలిన అవశిష్టమును భుజించినవాడగును. అందరి పరితృప్తి తరువాత తన తృప్తి. 

అందుచేత అతని యందు తన శ్రేయస్సు కన్న ఇతరుల శ్రేయస్సు మిన్నగ యుండును. అదియే పవిత్రతకు కారణము. అదే విధముగ ఒక అధికారి, ఒక యజమాని తన ఆశ్రయములో (లేక పరిధిలో) నున్నవారి క్షేమమును నిర్వర్తించి అటు పైన తనను గూర్చి అలోచింపవలెను. ఇది ధర్మము.

అందరికన్న ముందుగ భోజనము చేయుట, అందరికన్న ముందుగ తాను పొందుట, ముందుగ అనుభవించుట మొదలగున వన్నియు అపవిత్రమగు కార్యములు. పోటీపడి ఇతరుల కన్న తాను ముందు పొందవలెనను భావనతో జీవించువాడు, మానసికముగ బంధితుడు. అతడు యావజ్జీవ బంధితుడే. ఈ విషయము తెలియక ఆధునిక యుగమున పోటీలు ఎక్కువ అయినవి. తత్కారణముగ అశాంతి ఎక్కువైనది. 

తత్కారణముగ ఘర్షణలు, హత్యలు, మారణ హోమములు జరుగుచున్నవి. తోటి వారి శ్రేయస్సును గమనించని వాడు నరపశువేగాని నరుడు కాదు. నరపతి కాదలచినచో లోక హితమునకై పాటుపడవలెను గాని పశువువలె కుమ్ము లాడుచు, దౌర్జన్యముతో దోచుచు భోగించువాడు భయంకరముగ బంధింప బడును.

తెలిసి నిర్వర్తించిన వారికి కర్మలు మోక్ష కారణము. తెలియక నిర్వర్తించు వారికి కర్మలు బంధకారణము. మోక్షము పేరున మోహపడిన జీవులు ఎన్నో రకములుగ ఇతర ఉపాయముల నాలోచింతురు. కర్మ మార్గమున మోక్షము సులభమని తెలిసినవారు తమ వంతు కర్మను యజ్ఞార్థముగ నిర్వర్తింతురు.

ఒక మనిషి పవిత్రతకు, అపవిత్రతకు మూలకారణము అతని కర్మానుష్ఠాన విధానముననే యున్నది. కర్మను జీవ శ్రేయోదాయకముగ నిర్వర్తించిన పవిత్రుడగుచు అగ్నిహోత్రునివలె ప్రకాశించును. లేనిచో అంధకారమున పడును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


08 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.  గీతోపనిషత్తు - 49  🌹

🍀  9. ధర్మచక్రము - మరణము గాని, సృష్టిలయము గాని జీవునికి ముక్తస్థితి ప్రసాదింపలేవు. అనుభవ పూర్వకముగ ధర్మమే గతియని తెలిసి నిరహంకారుడై దాని ననుసరించిన వాడే ముక్తమార్గమున మరల ప్రయాణము సాగించగలడు.  🍀 

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  కర్మయోగము - 16    📚


ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ తీహ యః |

అఘాయు రింద్రియారామో మోఘం పార్థ స జీవతి || 16


1. ఏవం ప్రవర్తితం చక్రం :

సృష్టి చక్రమున ధర్మచక్ర మొకటి యున్నది. ఆ ధర్మ చక్రమున నిలచినవారు బ్రహ్మము నందు నిలచి అక్షరులై దీపించు చున్నారు. ఆ ధర్మ చక్ర మిట్లున్నది.

2. బ్రహ్మము నుండి వేదము పుట్టును. వేదము నుండి సృష్టి పుట్టును. సృష్టితో పాటు సృష్టి ధర్మమునూ పుట్టుకను సృష్టి ధర్మము ననుసరించుచు ఏర్పడును. అదియే సృష్టికర్మ. పై సమస్తమును యజ్ఞార్థమే. సృష్టియందలి జీవులు గూడ అదే యజ్ఞార్థ ధర్మమును అనుసరించుచు మరల బ్రహ్మమును చేరుదురు.

3. ధర్మ మాధారముగ ఈ చక్రము తిరుగుచుండును. ఈ చక్రము ననుసరించి ఎవరు జీవింతురో వారు బ్రహ్మము నుండి దిగివచ్చినవారై, సృష్టి వైభవమును అనుభవించుచు మరల బ్రహ్మమును చేరుదురు. అనుసరింపని వారు ధర్మచక్రము నుండి విడివడుటచే బంధముల చిక్కుకొని దుఃఖముల ననుభవించు చున్నారు. 

ధర్మచక్రమును వీడినవారు మనస్సు, ఇంద్రియములు, శరీరమునందు బంధింపబడి భోగములయందు చిక్కుకొని ఎడతెరపి లేక నానావిధ యోనుల యందు జన్మ మెత్తుచున్నారు. వీరందరు సృష్టి ప్రయాణమున రైలుబండి దిగినవారివలె గమ్యము చేరక ప్రయాణమాగి వ్యర్థముగ జీవించుచున్న వారిగ తెలియ వలెను. 

సృష్టి చక్రమునగల ధర్మచక్రము వృత్తాకారపు రైలుమార్గము వంటిది. ఈ మార్గమున రైలుబండి నెక్కిన జీవులు ధర్మమును ఆచరించుచు ప్రయాణము సాగించుచుండవలెను. ప్రయాణమునకు నియమములు వేద మేర్పరచిన శాశ్వత ధర్మములే. వానిని అనుసరించనివారు ఈ రైలుబండి నుండి దింపివేయ బడుదురు. 

అది కారణముగ ప్రయాణమాగును. మరల ప్రయాణము సాగించవలె నన్నచో ధర్మనియమములను అనుష్ఠానము చేయ వలసిన బుద్ధి ఏర్పరచుకొనవలెను. లేనిచో వ్యర్థజీవనము సాగుచుండును. సృష్ట్యంతమున వీరు లయము చెందినను మరల బ్రహ్మమునుండి దిగివచ్చినపుడు అదే స్వభావముతో, అదే విధమైన అధర్మ ప్రవర్తనముతో మరల బంధింపబడుదురు. 

మరణము గాని, సృష్టిలయము గాని జీవునికి ముక్తస్థితి ప్రసాదింపలేవు. అనుభవపూర్వకముగ ధర్మమే గతియని తెలిసి నిరహంకారుడై దాని ననుసరించినవాడే ముక్తమార్గమున మరల ప్రయాణము సాగించగలడు. ధర్మమునకు ప్రమాణము వేదము. వేదమునకు ప్రమాణము ఋషులు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్ 


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


09 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.   గీతోపనిషత్తు - 50   🌹


🍀  10 అసకత - సమాచరణము - నిష్కామ కర్మమే మోక్షమునకు మార్గమని, అట్లు నిర్వర్తించినవానికి మోక్షము అరచేతి యందుండునని, ఇది తన శాసనమని, అనుపానముగ ఫలాపేక్షలేక, కర్మాచరణము అనునిత్యము జరుగవలెనని తెలుపుచున్నాడు.  🍀 


✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



📚. కర్మయోగము - 19 📚


ఆసక్తి లేక కర్మ లాచరించిన వానికి పరమపదము లభించగలదని ఈ సూత్రము తెలుపుచున్నది. ఆసక్తి లేక కర్మ లెట్టాచరించగలరు? ఆసక్తి లేనివా డేపనియు చేయడే! దీని రహస్యమేమి? భగవంతుడు గీతయందు పలుమార్లు "అసక్తః" అని పలుకుతుంటాడు. 


19 . తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |

అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః || 19 ||


ఈ పలికిన అసక్తత ఫలములకు సంబంధించినది. పనికి సంబంధించినది కాదు. పనిచేయు వానికి పనియందే ఆసక్తి యుండవలెను గాని ఫలమునందు కాదు.

ఫలము నందాసక్తత యున్నవానికి పని యందు శ్రద్ధ చెడును. పని యందు శ్రద్ధ యున్న వానికి పనియే సౌఖ్యము నిచ్చును. ఫలములు పొందుట, పొందక పోవుట అతనిని బాధించవు. పని యందు సక్తుడవు కమ్ము, ఫలముల యందసక్తుడవు కమ్ము. 

ఇచ్చట పని యనగా పరహితముతో కూడినది అని మరల మరల చెప్పనక్కరలేదు. నియత కర్మను అనగా చేయవలసిన కర్మను ఫలముల యందాసక్తి లేక యజ్ఞార్థముగ ఆచరించవలెనని భగవానుడు పలుకుతునే యున్నాడు. 

నిజమునకు ఫలముల యందాసక్తి లేకుండ కర్మ నాచరించవలెనని ఈ అధ్యాయమున 7వ శ్లోకము నందు, 9వ శ్లోకమునందు పలికినాడు. అట్లాచరించినచో పరమును లేక దైవమును పొందవచ్చని వాగ్దానము చేయుచున్నాడు. 

నిష్కామ కర్మమే మోక్షమునకు మార్గమని, అట్లు నిర్వర్తించినవానికి మోక్షము అరచేతి యందుండునని, ఇది తన శాసనమని తెలిపినాడు.

పై శాసనమునకు అనుపానముగ ఫలాపేక్షలేక, కర్మా చరణము అనునిత్యము జరుగవలెనని తెలుపు చున్నాడు. “సతతం” అని పలుకుటలో ఫలాసక్తి శాశ్వతముగ విసర్జించ బడవలెనని తెలుపుచున్నాడు.

ఫలాసక్తి లేనిచో ఏ కార్యమైనను చేయవచ్చునా? అను సందేహమును గూడ నివృత్తి చేయుటకై “కార్యం కర్మ"ను ప్రస్తావించి నాడు. అనగా తాను చేయవలసినపని ఫలాసక్తి లేక ఎల్లపుడు చేయవలెనని. ఫలాసక్తి లేక చేయవలసిన పని చేయువాడు ఎట్లైనా చేయవచ్చునా? అను సందేహమును నివారించుటకు "సమాచర” అని తెలిపినాడు. 

సమాచరణ మనగా సమ్యక్ ఆచరణము. సమ్యక్ ఆచరణ మనగా ఎక్కువ తక్కువలు లేక నిర్వర్తించుట. అనగా కర్మ నిర్వర్తనము ఒక నిర్మల ప్రవాహమువలె సాగవలెనుగాని ఒడుదొడుకులతో కాదని యర్థము. మార్గమున ఒడుదొడుకులున్నను ప్రవాహ వేగమునకు ఒడుదొడుకులు అవసరము లేదు.

కొన్ని దినములు విపరీతముగ పనిచేయుట, కొన్ని దినములు చతికిల పడుటగా కర్మ జరుగరాదు. జరుగు కర్మయందు, వేగము నందు ఒక నిశ్చలత యుండవలెను. 

భూమి, ఇతర గ్రహములు చరించు విధానము సమాచర అను పదమునకు తగినట్లుగ నుండును. వృక్షముల యొక్క పెరుగుదల యందు గూడ ఈ లక్షణములు చూడవచ్చును. సమాచరణము సృష్టి ప్రవాహమునకు ముఖ్య లక్షణము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


Facebook, WhatsApp, Telegram groups:

https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


10 Oct 2020

------------------------------------ x ------------------------------------






🌹.   గీతోపనిషత్తు - 50   🌹

🍀 10 అసక్తత - సమాచరణము - నిష్కామ కర్మమే మోక్షమునకు మార్గమని, అట్లు నిర్వర్తించినవానికి మోక్షము అరచేతి యందుండునని, ఇది తన శాసనమని, అనుపానముగ ఫలాపేక్షలేక, కర్మాచరణము అనునిత్యము జరుగవలెనని తెలుపుచున్నాడు. 🍀 

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.   కర్మయోగము - 19   📚

ఆసక్తి లేక కర్మ లాచరించిన వానికి పరమపదము లభించగలదని ఈ సూత్రము తెలుపుచున్నది. ఆసక్తి లేక కర్మ లెట్టాచరించగలరు? ఆసక్తి లేనివా డేపనియు చేయడే! దీని రహస్యమేమి? భగవంతుడు గీతయందు పలుమార్లు "అసక్తః" అని పలుకుతుంటాడు. 


19 . తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |

అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః || 19 ||


ఈ పలికిన అసక్తత ఫలములకు సంబంధించినది. పనికి సంబంధించినది కాదు. పనిచేయు వానికి పనియందే ఆసక్తి యుండవలెను గాని ఫలమునందు కాదు.

ఫలము నందాసక్తత యున్నవానికి పని యందు శ్రద్ధ చెడును. పని యందు శ్రద్ధ యున్న వానికి పనియే సౌఖ్యము నిచ్చును. ఫలములు పొందుట, పొందక పోవుట అతనిని బాధించవు. పని యందు సక్తుడవు కమ్ము, ఫలముల యందసక్తుడవు కమ్ము. 

ఇచ్చట పని యనగా పరహితముతో కూడినది అని మరల మరల చెప్పనక్కరలేదు. నియత కర్మను అనగా చేయవలసిన కర్మను ఫలముల యందాసక్తి లేక యజ్ఞార్థముగ ఆచరించవలెనని భగవానుడు పలుకుతునే యున్నాడు. 

నిజమునకు ఫలముల యందాసక్తి లేకుండ కర్మ నాచరించవలెనని ఈ అధ్యాయమున 7వ శ్లోకము నందు, 9వ శ్లోకమునందు పలికినాడు. అట్లాచరించినచో పరమును లేక దైవమును పొందవచ్చని వాగ్దానము చేయుచున్నాడు. 

నిష్కామ కర్మమే మోక్షమునకు మార్గమని, అట్లు నిర్వర్తించినవానికి మోక్షము అరచేతి యందుండునని, ఇది తన శాసనమని తెలిపినాడు.

పై శాసనమునకు అనుపానముగ ఫలాపేక్షలేక, కర్మా చరణము అనునిత్యము జరుగవలెనని తెలుపు చున్నాడు. “సతతం” అని పలుకుటలో ఫలాసక్తి శాశ్వతముగ విసర్జించ బడవలెనని తెలుపుచున్నాడు.

ఫలాసక్తి లేనిచో ఏ కార్యమైనను చేయవచ్చునా? అను సందేహమును గూడ నివృత్తి చేయుటకై “కార్యం కర్మ"ను ప్రస్తావించి నాడు. అనగా తాను చేయవలసినపని ఫలాసక్తి లేక ఎల్లపుడు చేయవలెనని. ఫలాసక్తి లేక చేయవలసిన పని చేయువాడు ఎట్లైనా చేయవచ్చునా? అను సందేహమును నివారించుటకు "సమాచర” అని తెలిపినాడు. 

సమాచరణ మనగా సమ్యక్ ఆచరణము. సమ్యక్ ఆచరణ మనగా ఎక్కువ తక్కువలు లేక నిర్వర్తించుట. అనగా కర్మ నిర్వర్తనము ఒక నిర్మల ప్రవాహమువలె సాగవలెనుగాని ఒడుదొడుకులతో కాదని యర్థము. మార్గమున ఒడుదొడుకులున్నను ప్రవాహ వేగమునకు ఒడుదొడుకులు అవసరము లేదు.

కొన్ని దినములు విపరీతముగ పనిచేయుట, కొన్ని దినములు చతికిల పడుటగా కర్మ జరుగరాదు. జరుగు కర్మయందు, వేగము నందు ఒక నిశ్చలత యుండవలెను. భూమి, ఇతర గ్రహములు చరించు విధానము సమాచర అను పదమునకు తగినట్లుగ నుండును. 

వృక్షముల యొక్క పెరుగుదల యందు గూడ ఈ లక్షణములు చూడవచ్చును. సమాచరణము సృష్టి ప్రవాహమునకు ముఖ్య లక్షణము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


11 Oct 2020

------------------------------------ x ------------------------------------





🌹.  గీతోపనిషత్తు - 51  🌹

🍀  11. సంఘ శ్రేయస్సు - కృష్ణుని కర్మ సిద్ధాంతమున అసక్తత, నియతకర్మ, సమాచరణము, యజ్ఞార్థ జీవనములతో పాటు సంఘమున స్ఫూర్తిదాయకముతో గూడ నుండవలెనని తెలుపుచున్నది  🍀 

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  కర్మయోగము - 20  📚

20. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః |
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్కర్తుమర్హసి || 20 ||

కర్మమంతయు సంఘముతో ముడిపడి యున్నది. సంఘము నడుచుటకు కర్మము ప్రధానము. వివిధములైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారముల ద్వారా ప్రతివారును సంఘమునకు తోడ్పాటు చేయుచు సంఘము నుండి లభించిన దానిని పొందుతూ జీవించుట జరుగుచున్నది. 

సంఘమునకు శ్రేయోదాయకమైన కార్యముల నొనర్చుట ద్వారా సంఘమున జీవించుటకు జీవుడర్హత పొందుచున్నాడు. వివిధ పద్ధతులలో సంఘమునకు జీవుల సేవ లభ్యమగును. 

సంఘమునకు తోడ్పాటు చేయు ఆశయముతోనే సంఘమున పనిచేయవలెను. అట్లు పనిచేయు వారిని సంఘము సహజముగ మన్నించును, గౌరవించును, ఆదరించును కూడ. 

ఇట్లు సంఘమున ఆదరణము పొందినవారు, గౌరవము పొందినవారు, ఇతరులు కూడ అదే మార్గమున ప్రవర్తించుటకు స్పూర్తిని కలిగింతురు.

అందువలన కృష్ణుని కర్మ సిద్ధాంతమున అసక్తత, నియత కర్మ, సమాచరణము, యజ్ఞార్థ జీవనములతో పాటు సంఘమున స్ఫూర్తిదాయకముతో గూడ నుండవలెనని తెలుపుచున్నది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#చైతన్యవిజ్ఞానం #ChaitanyaVijnanam #PrasadBhardwaj #గీతోపనిషత్తు #సద్గురుపార్వతీకుమార్ 


12 Oct 2020

------------------------------------ x ------------------------------------






🌹. గీతోపనిషత్తు - 52 🌹

🍀   12. పెద్దలు - ప్రమాణములు - తమను అనుకరించు వారు ఎవరికైతే యుందురో వారికి కర్మ నిర్వహణము నందు ఒక అదనపు బాధ్యత ఏర్పడును. అదికారణముగ గుర్తింపు పొందిన పెద్దవారి కర్మనిర్వహణ విధానము ప్రమాణముగ నుండవలెను   🍀 

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.   కర్మయోగము - 21, 22, 23, 24   📚

21. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః |
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే || 21 ||


22. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి || 22 ||


23. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః || 23 ||


24. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ |
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః || 24 ||


యద్యదాచరతి శ్రేష్ఠ :

లోకమున పెద్దలు ఏమి చేయుచున్నారో గమనించి ఇతరులు కూడ వారి ననుకరింతురు. అందువలన పెద్దవారుగా గమనింపబడువారికి కర్మ నిర్వహణమున ఎక్కువ బాధ్యత గలదు. 

తమను అనుకరించు వారు ఎవరికైతే యుందురో వారికి కర్మ నిర్వహణము నందు ఒక అదనపు బాధ్యత ఏర్పడును. తల్లిదండ్రులను పిల్లలు అనుకరింతురు. ఉపాధ్యాయులను విద్యార్థులనుకరింతురు. గురువులను శిష్యులనుకరింతురు. వివిధ రంగములలో ఉత్తమ శ్రేణికి చెందినవారిని ఆయా రంగములలో పనిచేయువా రనుకరింతురు. 

అందువలన అనుకరింపబడు వారికి అనుకరించు వారి యెడల బాధ్యత యున్నది. అదికారణముగ గుర్తింపు పొందిన పెద్ద వారు వారి కర్మనిర్వహణ విధానము ప్రమాణముగ నుండవలెను.

అనుకరించువారు అనునిత్యము తాము ప్రమాణముగ నేర్పరచుకున్న పెద్దవారిని అనుసరింతురు. వారు పొగత్రాగినచో వీరును త్రాగుదురు. వారికి అపరిశుభ్రపు అలవాట్లు ఉన్నచో వీరును అట్లే యుందురు. వారసత్యము లాడినచో వీరును ఆడుదురు. వారు బాధ్యతా రహితముగ ప్రవర్తించినచో, వీరును అట్లే చేయుదురు. వారేమి చేసిన వీరును అట్లే చేయుటకు ప్రయత్నింతురు. అందువలన ప్రత్యేకముగ వారి కవసరము లేకపోయినప్పటికిని, చిన్నవారి మేలుకోరి పెద్దవారు కొన్ని కొన్ని విషయములలో మార్గదర్శకులై ప్రవర్తించవలసి యుండును.

నిజమునకు శ్రీకృష్ణునకు సాందీపని యొద్ద చేరి విద్య నభ్యసించు అవసరము లేదు. అయినను ఇతరుల శ్రేయస్సు కోరి అట్లాచరించెను. వివాహముతో పనిలేదు. అయినను సంఘ మర్యాదలు పాటించి వివాహమాడి సంతతిని కనెను. యుద్ధము చేయవలసిన పని అసలేలేదు. అయినను క్షత్రియ జన్మ మెత్తుట వలన యుద్ధమునందు పాల్గొనెను. శ్రీరాముని జీవితము గూడ చాల విషయములలో అట్లే నిర్వర్తింపబడినది. 

శ్రీరాముని ఆదర్శముగ గొనిన భారతీయులు సర్వసామాన్యముగ ఏకపత్నీ వ్రతమును ఆచరించుదురు. భారతీయ సంప్రదాయమున నేటికిని ఈ భావము అధికముగ అనుసరింపబడు చున్నది. ఒక స్త్రీ కి ఒక పురుషుడు. ఒక పురుషునకు ఒక స్త్రీ. ఈ సంప్రదాయము కేవలము భరతభూమియందే ఇంకను నిలచియున్నది. భరత సంప్రదాయమునకు వెన్నెముకగ నిలచిన ఋషులందరును ముక్తసంగులే. వారికీ ప్రపంచమున ఏమియును అవసరము లేదు. పంచభూతములు వారి వశమై యుండును. 

అయినప్పటికిన్ని ఇతర జీవులకు ప్రామాణికముగ నుండవలెనను బాధ్యతాయుత భావముతో వారు వివాహ మాడిరి. గృహస్థు జీవితమును నిర్వర్తించి చూపిరి. సంఘమున ఉద్యోగ వృత్తి వ్యాపారములను కూడ నిర్వర్తించిరి. అట్లు కానిచో సంఘధర్మము దెబ్బతినును. ఈ యంశము ననుసరించియే ఏసుక్రీస్తు, బుద్ధుడు మొదలగు మహాత్ములను గూడ భరతధర్మము పరిపూర్ణ మానవునిగ పరిగణించలేదు. 

ఈ మహాత్ములను అనుకరించువారు కూడ వారివలె వివాహమాడక, కోరికలను అణగదొక్కుకొని సతమత మగుచున్నారు. పశ్చిమ దేశములలో మతాధికారులు లైంగిక చర్యలకు పాటుపడుచు నేరగ్రస్తులగుట ఆధునిక కాలమున గమనించబడుచునే యున్నది. గదా! సాధారణ మానవులను మనస్సులో నుంచుకొని వారికి అనుకరణీయముగ నుండు శ్రేష్ఠమగు మార్గమును పెద్దలు నిర్వర్తించుట శ్రీకృష్ణుని కర్మ సిద్ధాంతమున మరియొక ముఖ్య లక్షణము. 

ప్రస్తుత కాలమున దేశనాయకులు, మతాధికారులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, వైద్యులు, అగ్రశ్రేణి వ్యాపారస్తులు, అధికారులు పనిచేయు విధానము బాధ్యతారహితముగ యున్నది. అదికారణముగనే జనబాహుళ్యము గూడ బాధ్యత తప్పినది. క్రమ శిక్షణ తరిగినది. శ్రద్ధ లోపించినది. బాధ్యతలయందు పోటీ పడుటగా కాక హక్కులయందు పోటీపడు మ్లేచ్చ ధర్మము భరత భూమిని కూడ కబళించినది. ఇట్టి స్థితికి పెద్దలే కర్తలు. పెద్దలే బాధ్యులు. వీరు జనులను చెడగొట్టిన వారగుచున్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


13 Oct 2020

------------------------------------ x ------------------------------------

------------------------------------ x ------------------------------------




No comments:

Post a Comment