శ్రీ లలితా సహస్ర నామములు - 41 / Sri Lalita Sahasranamavali - Meaning - 41

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 41 / Sri Lalita Sahasranamavali - Meaning - 41 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 41. భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా ।
భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ॥ 41 ॥ 🍀

🍀 112. భవానీ -
భవుని భార్య.

🍀 113. భావనాగమ్యా -
భావన చేత పొంద శక్యము గానిది.

🍀 114. భవారణ్య కుఠారికా -
సంసారమనెడు అడవికి గండ్రగొడ్డలి వంటిది.

🍀 115. భద్రప్రియా - 
శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది.

🍀 116. భద్రమూర్తిః - 
శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది.

🍀 117. భక్త సౌభాగ్యదాయినీ - 
భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 41 🌹

📚. Prasad Bharadwaj

🌻 41. bhavānī bhāvanāgamyā bhavāraṇya-kuṭhārikā |
bhadrapriyā bhadramūrtir bhakta-saubhāgyadāyinī || 41 || 🌻

🌻 112 ) Bhavani -
She who gives life to the routine life of human beings or She who is the consort of Lord Shiva

🌻 113 ) Bhavana gamya -
She who can be attained by thinking

🌻 114 ) Bhavarany kudariga -
She who is like the axe used to cut the miserable life of the world

🌻 115 ) Bhadra priya -
She who is interested in doing good to her devotees

🌻 116 ) Bhadra moorthy -
She who is personification of all that is good

🌻 117 ) Bhaktha sowbhagya dhayini -
She who gives all good and luck to her devotees

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

04 Mar 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 186

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 186 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 8 🌻

భగవత్ కార్యాలయము :-

699. ఈ కార్యాలయము నుండి ఒక్క అవతార పురుషుడు మాత్రమే స్వయం ప్రకటితుడై తాను, రక్షకుడననియు, ప్రవక్తననియు, మోచకుడననియు, దేవుని కుమారుడననియు, అవతారముననియు, రసూల్ ననియు, బుద్ధుడననియు ఎలుగెత్తి తనని తాను ప్రకటించుకొనును.

700. అవతార పురుషుడు అనంతమగు దివ్య చైతన్యమును, అపరిమితమగు ఈశ్వరీయ అహమును (నేను భగవంతుడను) సార్వభౌమిక మనస్సును, విశ్వమయ దేహమును స్థూల, సూక్ష్మ, కారణ దేహములను కలిగి యుండును. (సప్త ఉపాధులు)

------------------------------------

Notes:- పందొమ్మిదవ (1894) శతాబ్దాములో భగవంతుని "మెహర్ బాబా" స్వరూపములో భూమికి దింపిన పంచ సద్గురువులు:- 1. హజరుద్దీన్ బాబా, 2. హజరత్ సా ఈ బాబా, 3. ఉపాసనీ మహరాజు, 4. నారాయణ మహరాజు, 5. హజరత్ బాబాజాన్.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

04 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 245

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 245 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గౌరముఖ మహర్షి - 3 🌻

10. “ఎటువంటివారికైనా పితృసర్గమును గురుంచి సమస్తమూ వివరించడం సాధ్యమేకాదు. అన్నిలోకాలలో అంతమంది ఉన్నారు. ప్రధానంగా అందరిచే పూజ్యతపొందేటటువంటి పితృదేవతలు కొందరున్నారు.

11. వసు, సాధ్య, రుద్ర, ఆదిత్య, అశ్వేమరుద్రులు(అశ్వినులు, మరుత్తులు, ఋషులు) – అంటే వాళ్ళు ఋషులని అర్థం. వసురుద్రులందరికీ, సమానంగా – ప్రతీవారికీ సమానమైన ఆరాధన చేయాల్సిన – పితృదేవతలు అని పేరు.

12. అలా లోకాలలోంచి వెళ్ళి ఉత్తమలోకాలలో శాశ్వతంగా ఉంటారని అర్థం. అంతేకాక ఆ ఋషులందరూ వాళ్ళ కీర్తిచేతపుట్టిన వాళ్ళసంతానము. అంటే ఏ ఋషులసంతానంలో పుట్టిన వాళ్ళున్నారో వాళ్ళు ఆ ఋషులను ఆరాధించాలి. వసురుద్రాదులను పూజించాలి.

13. వసిష్ఠ బ్రహ్మపితరులైన అగ్నిష్వాత్తాదులు, బ్రహ్మక్షత్రియ వైశ్యులకు పూజనీయులు. అంటే ఈ మూడు వర్ణములవాళ్ళు ఎవరైతే పితృకార్యాలునిర్వహిస్తారో, వాళ్ళందరూ సామాన్యంగా అందరిచేత ఆరాధించ బడేటటువంటి దేవతలను ఆరాధించవలసిందే” అన్నాడు మార్కండేయుడు.

14. “ఎవరికైనా పితృసర్గం పూర్తిగా దొరకటం సులభంకాదు; దానిని సంక్షోభంలో పెట్టరాదు” అన్నాడు. తరువాత వాళ్ళకు ఎప్పుడు పూజచేయాలో చెప్పాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

04 Mar 2021

శ్రీ శివ మహా పురాణము - 364

🌹 . శ్రీ శివ మహా పురాణము - 364 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

95. అధ్యాయము - 07

🌻. పార్వతి బాల్యము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహా తేజస్వినియగు ఆమె అపుడు మేన యెదుట కుమార్తెయై జన్మించి లోకపు పోకడననుసరించి రోదించెను (1). ఓ మహర్షీ! ఆమె పరుండిన మంచము చుట్టూ వ్యాపించిన ఆమె యొక్క గొప్ప తేజస్సుచే, రాత్రియందు కూడా అచటి దీపములు వెనువెంటనే వెలవెలబోయినవి (2). ఇంటియందలి స్త్రీలందరు ఆమె ఏడ్చుటను వినిరి. ఆ ఏడుపు మనోహరముగ నుండెను. వారు తొందరగా అచటకు వచ్చి, ప్రేమతో ఆనందముతో పులకించిరి (3). అపుడు దేవ కార్యమును సిద్ధింపజేసే, సుఖకరము శుభకరమునగు ఆ పార్వతి పుట్టుటను గూర్చి హిమవంతుని అంతఃపుర పరిచారకుడు ఆ రాజునకు శీఘ్రమే తెలిపెను (4).

ఆ పర్వత రాజునకు కుమార్తె జన్మించినదను శుభవార్తను చెప్పిన ఆ అంతఃపురపరిచారకునకు తన శ్వేతచ్ఛత్రమును దానము చేయుట విడ్డూరమనిపించలేదు (5). ఆ శైలరాజు పురోహితునితో, బ్రాహ్మణులతో గూడి ఆనందముతో అచటకు వెళ్లి గొప్ప కాంతులతో శోభిల్లుచున్న ఆ కుమార్తెను చూచెను (6).

నల్లకలువ రేకుల వలె శ్యామలవర్ణము గలది, గొప్ప కాంతులతో మనస్సును రంజింపజేయునది అగు అట్టి కన్యను చూచి ఆ పర్వత రాజు మిక్కిలి ఆనందించెను (7). అచటనున్న పురుషులు, స్త్రీలు, అందరు పౌరులు కూడ ఆనందించిరి. అపుడు గొప్ప ఉత్సవము జరిగెను. అనేక వాద్యములు మ్రోగించబడినవి (8).

మంగల గానములు పాడబడెను. వారాంగనలు నాట్యమును చేసిరి. హిమవంతుడు జాతకర్మను చేసి బ్రాహ్మణులకు దానమునిచ్చెను (9). అపుడు హిమవంతుడు సింహద్వారము వద్దకు వచ్చి, గొప్ప ఉత్సవమును చేసెను. ఆయన ప్రసన్నమగు మనస్సు గలవాడై భిక్షుకులకు ధనము నిచ్చెను (10).

ఓ సుబుద్ధీ! హిమవంతుడు శుభముహూర్తమునందు మునులతో గూడి ఆమెకు కాళి మొదలగు సుఖకరమగు పేర్లను పెట్టెను (11). అపుడాయన మిక్కిలి ఆదరముతో బ్రాహ్మణులకు దానమునిచ్చెను. మరియు వివిధ గానకచేరిలతో గూడిన ఉత్సవమును చేయించెను (12).

ఆ హిమవంతుడు అనేక పుత్రులు గలవాడైననూభార్యతో గూడి ఈ తీరున పెద్ద ఉత్సవమును చేసి, ఆ కాళిని మరల మరల చూచుచూ, ఆనందమును పొందెను (13). సుందరమగు అంగములతో చూడ చక్కనైన ఆ దేవి అచట ప్రతి దినము సుందరమగు శుక్ల పక్షచంద్ర బింబము వలె పెరుగజొచ్చెను (14).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

04 Feb 2021

గీతోపనిషత్తు -164

🌹. గీతోపనిషత్తు -164 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 9

🍀 9. యోగ సూత్రములు - తొమ్మిది రకముల మనుష్యులను గూర్చి ఈ శ్లోకము తెలుపుచు, అట్టివా రందరియందు యోగి సమభావన కలిగియుండవలెనని శ్రీ కృష్ణుడు బోధించుచున్నాడు. వారెవరనగ 1. సుకృత్ : అనగా ప్రతిఫలము కోరక ఉపకారము చేయువారు. 2. మిత్ర : ఉపకారమునకు ప్రత్యుపకారము చేయువారు. 3. అరి : : శత్రువు. 4. ఉదాసీన : తటస్థుడు 5. మధ్యస్థ : మధ్యవర్తి 6. ద్వేష్య : ద్వేషింప దగినవారు. 7. బంధు : బంధువు 8. సాధు : సాధువు 9. పాపేశు : పాపులు. పై తెలిపిన తొమ్మిది వర్గముల వారి యందును సమ భావము గలవాడే శ్రేష్ఠియగు యోగియని దైవము తెలుపుచున్నాడు. 🍀

సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు |
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే ||9

యోగసాధకునకు ఆత్మసంయమము కలుగుటకు మరి కొన్ని సద్విషయములు సూచింప బడినవి. అవి పై శ్లోకమున తెలుపబడినవి.

అందు మొదటిది వివిధములగు మనుజులను సంఘమున కలియుచుండుట సామాన్యముగ జరుగుచునే యుండును. అందు తొమ్మిది రకముల మనుష్యులను గూర్చి ఈ శ్లోకము తెలుపుచు, అట్టివా రందరియందు యోగి సమభావన కలిగియుండవలెనని శ్రీ కృష్ణుడు బోధించుచున్నాడు. వారెవరనగ

1. సుకృత్ : అనగా ప్రతిఫలము కోరక ఉపకారము చేయువారు.

2. మిత్ర : ఉపకారమునకు ప్రత్యుపకారము చేయువారు.

3. అరి : : శత్రువు.

4. ఉదాసీన : తటస్థుడు

5. మధ్యస్థ : మధ్యవర్తి

6. ద్వేష్య : ద్వేషింప దగినవారు.

7. బంధు : బంధువు

8. సాధు : సాధువు

9. పాపేశు : పాపులు.

పై తెలిపిన తొమ్మిది వర్గముల వారియందును సమ భావము గలవాడే శ్రేష్ఠియగు యోగియని దైవము తెలుపుచున్నాడు.

ప్రస్తుత కాలమున యోగమను పదమును విరివిగ వాడుట జరుగుచున్నది. భగవంతుని దృష్టిలో ఆత్మసంయమ యోగము పొందుటకు యోగసాధకునికి వలసిన లక్షణములు దైవము వివరించినాడు. అవి యన్నియు మరియొక్క మారు పునస్మరణ

చేయుట ఉత్తమము. అవి ఈ విధముగ నున్నవి.

1. ఫలముల నాసించక కర్తవ్య కర్మ నిర్వర్తించుట.

2. సంకల్పములను సన్యసించుట.

3. బంధము లేక కర్మను నిర్వర్తించుట,

4. శమము కలిగియుండుట.

5. శీతోష్ణములను, సుఖదుఃఖములను, మానావమానము లను తటస్థుడై గమనించుట.

6. జ్ఞానమును ఆచరణమున విజ్ఞానముగ అమలు పరచుట.

7. నిలకడ, నిశ్చలత్వము కలిగియుండుట.

8. నిగ్రహింపబడిన ఇంద్రియములు కలిగియుండుట.

9. మట్టి, లోహము, బంగారము ఇట్టి వానియందు సమ దృష్టి యుండుట.

ముందు తెలిపిన తొమ్మిది వర్గముల వారియందు సమ దర్శన ముండుట.

10. పై తెలిపిన పది సూత్రములు పాటించుటకు యోగ సాధకుడు సంసిద్ధుడు కావలెను. అట్టి సంసిద్ధత లేనపుడు ధ్యానమున కుపక్ష మించుట అవివేకమని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

04 Mar 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 226, 227, 228 / Sri Lalitha Chaitanya Vijnanam - 226, 227, 228

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 226, 227, 228 / Sri Lalitha Chaitanya Vijnanam - 226 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

🍀 56. మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా ।
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా ॥ 56 ॥🍀

🌻 226, 227, 228. 'మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా'' 🌻

సర్వతంత్రములకు, సర్వమంత్రములకు, సర్వయంత్రములకు మూలము శ్రీమాత అని అర్థము.

దేవీ తంత్రము, మంత్రము, యంత్రము కన్న మించిన యంత్రాదులు గాని, తంత్రాదులుగాని లేవు. మంత్రము లన్నియూ బీజాక్షర శబ్దముల కూర్పు. యంత్రములన్నియూ మంత్ర శక్తిని

అవతరింప జేయుటకు వలసిన సాధనములు.

తంత్రము లన్నియూ విధానములు. శాస్త్ర విధానముగ శబ్దములను ఉచ్చరించుచూ, యంత్రముల లోనికి ఆహ్వానించుచూ చేయు పూజా విధానము తంత్రము. శ్రీదేవి చైతన్యము శబ్ద రూపముగను, వర్ణ రూపముగను ప్రకటింపబడుచు రకరకములగు శక్తులను అవతరింపజేయును.

యంత్రములోనికి వాని నాహ్వానము చేయుట వలన యంత్రములు శక్తివంతములై పరిసరములను ప్రభావితము చేయును.

శాస్తోక్తమగు ఈ విధానమును తెనుగున తంతు అందురు. తంత్రము యొక్క వికృత పదమే తంతు. తంత్ర విధానమునకు నిష్ఠ, నియమము చాల ప్రధానము. తంత్ర విధానమున యంత్రములను పూజించు నపుడు తత్సంబంధిత చైతన్యము యంత్రమున ఆవరించును.

అందువలన యంత్రములను పవిత్రముగ భావించవలెను. అవి దైవీ స్వరూపములు. వానిని శుచియైన ప్రదేశమున నుంచుకొనుట, శుచిగ పూజ చేయుట, ఉపచారములు చేయుట, నైవేద్యములు పెట్టుట శాస్త్ర విధానముగ జరుగవలెను. అట్లు నిర్వర్తించిననే వాని ప్రభావము

ఆశీర్వచనముగ అందును.

యంత్రములను గృహములందు ఉంచు కొనుటకు చాల నిష్ఠ, నియమము లవసరము. నిత్యపూజ, నైవేద్యము కనీస నియమము. శుచి, శుభ్రత అత్యంత ప్రధానము. శాస్తోక్తముగ

చెయ్యనిచో యంత్ర పూజలు వికటింప గలవు. ఉచ్చారణ, ఉపచారము విధి విధానముగ జరుపవలెను. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు శాస్త్ర విధానమే ప్రమాణమని తెలిపినాడు.

ఈ విషయమున నిర్లక్ష్యము రజస్తమో గుణములను ప్రకోపింపజేసి, దుష్ఫలితములను దుఃఖములను కలిగింపగలవు. ఇది పెద్దల నాహ్వానించి అగౌరవించుట వంటిది. దైవీశక్తులు, మూర్తులు పెద్దలకన్న పెద్దవారగుటచే వారిని శ్రద్ధాభక్తులచే సంతుష్టులను గావించుకొనవలెను గాని అహంకార పూరితులై గొప్పలకు చేయరాదు.

యంత్రములకు సరళ రూపములే విగ్రహములు. విగ్రహముల ఆరాధనకూడ నియమనిష్ఠలతో సాగవలెను. విగ్రహారాధన విషయమున నియమ నిష్ఠలు కూడ సరళమే. భక్తి శ్రద్ధలు మాత్రము సమానమే. క్రియాహీనము, మంత్రహీనము అయినను భక్తిహీనము కానిచో విగ్రహారాధన కొంత అనుకూలించగలదు.

ప్రస్తుతకాలమున శిక్షణ పొందక, అర్హతలను అందుకొనక చేయు యంత్ర తంత్ర పూజలు రజస్తమో గుణములనే పెంపొందింప జేయు చున్నవి. కలియుగమున మానవులు షోడశోపచార పూజ క్లుప్తముగ నిత్యము నిర్వర్తించినచో చాలునని శ్రీకృష్ణుడు ఉద్ధవున కుపదేశించెను.

శ్రీదేవి మంత్రము ముందు నామములలో తెలుపబడినది. ఆమే షోడశి, ఈ మంత్రమును స్వీకరించుటకు శిష్యున కర్హత యుండవలెను. గురువు సిద్ధుడై యుండవలెను. సర్వమంత్రములకు మూల మంత్రమది.

అట్లే శ్రీ యంత్రము సర్వ యంత్రములకు మూలము. తంత్రము సర్వస్వతంత్ర తంత్రము. అనగా ఇతర తంత్రముల వలె మరే తంత్రముపై ఆధారపడినది కాదు.

శ్రీవిద్యతో సాటియైన విద్య శ్రీచక్రముతో సాటియైన యంత్రము కలదని చెప్పు వాడు మూఢబుద్ధి యని తంత్ర శాస్త్రము పేర్కొనును. శ్రీదేవి సాటి లేనిది. ఆమెయే మహామంత్రా, మహాయంత్రా, మహాతంత్రా మరియు సర్వమంత్రాత్మికా, సర్వ యంత్రాత్మకా, సర్వ తంత్రాత్మికా.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 226, 227, 228 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Mahā-tantrā महा-तन्त्रा (226) 🌻

Tantra is a way of worship. She Herself is the great tantra or all tantra-s lead to Her.

🌻. Mahā-mantrā महा-मन्त्रा (227) 🌻

She is the embodiment of all mantra-s. All mantra-s originate from the fifty one alphabets of Sanskrit. These fifty one letters are worn around Her neck in the form of a garland and all the mantra-s originate from this garland. This nāma could also mean Her Pañcadśi and ṣodaśī mantra-s, that are considered supreme amongst all mantra-s.

🌻 Mahā-yantrā महा-यन्त्रा (228) 🌻

Two interpretations are possible for this nāma. Mahā-yantr could mean Śrī cakrā in the midst of which She lives. Śrī cakrā is considered as the Supreme of all yantra-s, hence mahā-yantra. Secondly, Her form Itself represents Śrī cakrā.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

04 Mar 2021

ఎరుకతో ఉన్న స్వేచ్ఛలో నియంత్రణ విచ్ఛలవిడితనం రెండూ ఉండవు

🌹. ఎరుకతో ఉన్న స్వేచ్ఛలో నియంత్రణ విచ్ఛలవిడితనం రెండూ ఉండవు 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

మీలో వేడి ఉంటే, భయం కూడా ఉంటుంది. అప్పుడు మీరు ఏదో ఒకటి చెయ్యక తప్పదు. అందుకే నియంత్రించు కోవడమనే విష ప్రయోగంతో ఎవరిని వారే చంపుకుంటారు.

‘‘ఎప్పటికీ హాయిగా జీవించకూడదు’’ అనేది నియంత్రణలో ఉన్నవారికి తెలిసే ఏకైక జీవిత పరిష్కారం. కాబట్టి, బుద్ధ విగ్రహంలా ఉండండి. అప్పుడు మీరు క్రమశిక్షణ పొందిన సహనశీలిగా నటించగలరు. కానీ నేను ఇక్కడ బోధించేది అది కాదు. విచ్చలవిడి తనాన్ని విడిచి పెట్టినట్లే నియంత్రణను కూడా మీరు విడిచి పెట్టాలంటాను. అంటే మీరు చిక్కులో పడినట్లే.

ఎందుకంటే, విచ్చలవిడితనం, నియంత్రణలలో ఏదో ఒక దానిని మాత్రమే మీరు ఎంచుకోగలరు. ఎలాగంటే, ‘‘నియంత్రణను వదిలి విచ్చలవిడిగాను, విచ్చలవిడిని విడిచిపెట్టి నియంత్రణలోను ఉండొచ్చు’’ కదా!’’ అని మీరు అడగవచ్చు. నిజమే.

కానీ, మీరు ఎరుకలో ఉన్నట్లైతే నియంత్రణ, విచ్చలవిడితనాలు రెండూ మీ నుంచి వాటంతటవే తొలగిపోతాయి. ఎందుకంటే, అవి రెండూ ఒకే విషయానికి సంబంధించిన రెండు అంశాలు. ఎరుకలో ఉంటే వాటి అవసరముండదు.

పద్దెనిమిదేళ్ళ కుర్రాడు ఒకరోజు తన తండ్రితో ‘‘ఇంతకాలం మీ నియంత్రణలో నలిగిపోయాను. నా వయసు కుర్రాళ్ళందరూ చక్కగా తాగుతూ, అమ్మాయిలతో తిరుగుతూ హాయిగా ఆనందిస్తున్నారు. నేను కూడా అలాంటి సాహసాలుచేసి, వాటి అనుభూతిని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నా. అందుకే ఇల్లు విడిచి వెళ్తున్నా. నన్ను ఆపేందుకు ప్రయత్నించకండి. వెళ్ళొస్తా’’ అన్నాడు. వెంటనే అతని తండ్రి ‘‘ఉండరా బాబూ! నేను కూడా నీతో వస్తాను. ఇంత కాలం నేనుకూడా నా తల్లిదండ్రుల నియంత్రణలో అలాంటి సాహసాలు చెయ్యలేదు’’ అన్నాడు కొడుకుతో.

నియంత్రించ బడిన వారందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. వారు లోలోపల రగిలిపోతూ, విచ్చలవిడిగా తిరిగే అవకాశం కోసం నిరంతరం నిరీక్షిస్తూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితిని సరిగా అర్థంచేసుకోవాలి. అందరూ తమకు తాముగా ఉంటూనే, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను మనస్ఫూర్తిగా అంగీకరించేందుకు, అనుభవించేందుకు, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

అయితే మీరు ఎప్పుడూ పరిపూర్ణ చైతన్యంతో కూడిన ఎరుకతో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు ఎప్పుడూ ఆత్మస్మృతిలోనే ఉండాలి. ఇదే మీరు ఎప్పుడూ గుర్తుంచు కోవలసిన ముఖ్య విషయం. మిమ్మల్ని మీరు ఎప్పుడూ మరచిపోకూడదు.

అలాగే మీరు ఎప్పుడూ మీ ఉనికి అంతర్గత కేంద్రంనుంచే ముందుకు కదలాలి. మీరుచేసే పనులన్నీ అక్కడినుంచే జరగాలి. అప్పుడు మీరుచేసే ప్రతి పని ధర్మమవుతుంది.

ఎరుక చేసే పనులలో ఒకటి ధర్మం. పైపైన మీరు చేసే పని పైకి పాప కార్యంలా కనిపించక పోవచ్చు. అందువల్ల అది సమాజానికి నచ్చవచ్చు. సమాజం మిమ్మల్ని కీర్తించవచ్చు. అయినా అది పాపకార్యమే. ఎందుకంటే, మీకు తెలుసు ఆ పని చేసినందువల్ల అనవసరంగా మీరు మీ జీవితాన్ని కోల్పోయారని.

అందువల్ల మీలో మీరు మిమ్మల్ని నిందించుకుంటూనే ఉంటారు. కాబట్టి, మీలో మీరు సంతోషంగా ఉండలేరు.

సమాజం మిమ్మల్ని కీర్తించడంలో అర్థమేముంది, అందువల్ల మీకు దక్కేదేముంది? అన్నీ సొల్లుకబుర్లే.

వాటి కోసం, మీ చుట్టూ ఉన్న మూర్ఖుల మెప్పు కోసం మీరు మీ జీవితంతో పాటు దివ్యత్వాన్ని కూడా కోల్పోయారు. అందువల్ల అవి ముఖ్యవిషయాలు ఎలా అవుతాయి? జీవితాన్ని మీ అంతర్గత కేంద్రం నుంచి జీవించడం ప్రారంభించండి. ధ్యానమంటే అదే.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹

04 Mar 2021

దేవాపి మహర్షి బోధనలు - 49

🌹. దేవాపి మహర్షి బోధనలు - 49 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 33. మహర్షి దేవాపి సాన్నిధ్యము -1 🌻

అప్పుడా దివ్యవాణి యిట్లనెను :

“బుద్ధిమంతు లెవరునూ తొందరపాటు నిర్ణయములు చేయరు. తొందరపాటుతనము పతనకారణము. నీవు దైవవశమున ఒక వరము కలిగియున్నావు. దూరశ్రవణము నీకేర్పడి యున్నది. మేము తెలుపు విషయములు, వ్రాయగోరు గ్రంథములు విశేషమైనటు వంటివి. సామాన్యములు కావు. భ్రాంతికారకములసలే కావు.

ఈ మహత్కార్యము వలన జీవునిగ నీకు ఉద్దరణమే కలుగును." దివ్యవాణి ఇట్లు పలికినప్పటికీ నా నిరాదరణ ధోరణి మారలేదు. పలికిన పురుషునియొక్క ధ్వని స్పష్టముగను సూటిగనూ యున్నది.

అది నా గురుదేవుని కంఠధ్వని కాదని స్పష్టముగ తెలియుచున్నది. ఆ అవ్యక్తపురుషుడు మూడు వారముల తరువాత అదేరోజున మరల కలియుదునని తెలిపి, అదృశ్యమాయెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

04 Mar 2021

వివేక చూడామణి - 38 / Viveka Chudamani - 38

🌹. వివేక చూడామణి - 38 / Viveka Chudamani - 38 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు

🍀. ఆత్మ స్వభావము - 6 🍀

139. ఆత్మ చుట్టూ వలయాలుగా ఆవరించి ఉన్న ఈ అధికమైన అజ్ఞాన ప్రభావములు ఆత్మను తెలుసుకొనుటకు దాని ప్రకాశమును గుర్తించుటకు అడ్డుగా ఉండి, ఆత్మ యొక్క ఔన్నత్యమును అనంత జ్ఞానమును గ్రహించలేక మరియు ఆత్మను మించినది వేరొకటి లేదని, అది విభజించుటకు వీలులేని శాశ్వత సత్యమని తెలుసుకొన లేకున్నారు. రాహువు సూర్యుని చుట్టివేసినప్పుడు సూర్య కిరణముల కాంతి అవ్యక్తమైనట్లు, రాహువు తొలగినపుడు సూర్య కాంతి ప్రజ్వరిల్లుతుంది కాదా! అట్లే అజ్ఞానము తొలగిన ఆత్మ వ్యక్తమవుతుంది.

140. ఆత్మ అనాత్మల భేదములు గుర్తించలేక సాధకుడు ఆత్మ చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానమును తెలుసుకొనలేక, తన శరీరమే ఆత్మ అని భావించు చున్నాడు. ఆత్మ స్వచ్ఛమైన ప్రకాశముతో ప్రజ్వరిల్లుతున్నప్పటికి అజ్ఞానము వలన గుర్తించలేకున్నాడు. అట్టి స్థితిలో రాజస గుణము యొక్క గొప్ప శక్తి ఆత్మకు అడ్డుగా ఉన్న కామ క్రోధాలను జయించవలసి ఉంటుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 38 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 Nature of Soul - 6 🌻

138. One who is overpowered by ignorance mistakes a thing for what it is not; It is the absence of discrimination that causes one to mistake a snake for a rope, and great dangers overtake him when he seizes it through that wrong notion. Hence, listen, my friend, it is the mistaking of transitory things as real that constitutes bondage.

139. This veiling power (Avriti), which preponderates in ignorance, covers the Self, whose glories are infinite and which manifests Itself through the power of knowledge, indivisible, eternal and one without a second –as Rahu does the orb of the sun.

140. When his own Self, endowed with the purest splendour, is hidden from view, a man through ignorance falsely identifies himself with this body, which is the non-Self. And then the great power of rajas called the projecting power sorely afflicts him through the binding fetters of lust, anger, etc.,

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

04 Mar 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 322, 323/ Vishnu Sahasranama Contemplation - 322, 323

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 322, 323/ Vishnu Sahasranama Contemplation - 322, 323 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻322. వాసవాఽనుజః, वासवाऽनुजः, Vāsavā’nujaḥ🌻

ఓం వాసవాఽనుజాయ నమః | ॐ वासवाऽनुजाय नमः | OM Vāsavā’nujāya namaḥ

వాసవాఽనుజః, वासवाऽनुजः, Vāsavā’nujaḥ

అదిత్యాం కశ్యపాజ్జాతో వాసవస్యానుజో యతః ।
తతస్స వాసవానుజ ఇతి విద్వద్భిరుచ్యతే ॥

అదితియందు కశ్యపునకు కుమారుడుగా వామనరూపమున వాసవునకు అనగా ఇంద్రునకు తరువాత అనుజునిగా జన్మించెనుగావున వాసవాఽనుజః.

:: పోతన భాగవతము - పంచమ స్కంధము, ద్వితీయాశ్వాసము ::

సీ. ఆ క్రింద సుతలంబు నందు మహాపుణ్యుఁడగు విరోచనపుత్త్రుఁడైన యట్టి
బలిచక్రవర్తి యా పాకశాసనునకు ముద మొసంగఁగఁ గోరి, యదితిగర్భ
మున వామనాకృతిఁ బుట్టి యంతటఁ ద్రివిక్రమ రూపమునను లోకత్రయంబు
నాక్రమించిన దానవారాతిచేత ముందటన యీఁబడిన యింద్రత్వ మిట్లు
ఆ. గలుగువాఁడు పుణ్యకర్మసంధానుండు, హరిపదాంబుజార్చ నాభిలాషుఁ
డగుచుఁ శ్రీరమేశు నారాధనము సేయు, చుండు నెపుడు నతిమహోత్సవమున. (112)

'వితలం' క్రింద 'సుతలం' ఉన్నది. సుతలంలో బలిచక్రవర్తి ఉన్నాడు. అతడు పుణ్యవంతుడయిన విరోచనుని కుమారుడు. శ్రీమన్నారాయణుడు ఇంద్రుడిని సంతోషపెట్టాలనుకొని అదితిగర్భంలో వామనుడై జన్మించాడు. త్రివిక్రమరూపం ప్రదర్శించి ముల్లోకాలనూ ఆక్రమించాడు. చివరకు విష్ణువు బలిచక్రవర్తికి సుతలంలో ఇంద్రత్వం అనుగ్రహించాడు. ఆ బలిచక్రవర్తి ఎన్నో పుణ్యకర్మలు చేశాడు. శ్రీహరి పాదపద్మాలను సేవించవలెననే అభిలాష కలవాడు. అతడు ఎంతో ఉత్సాహంతో లక్ష్మీశుడయిన శ్రీమన్నారాయణున్ని ఆరాధిస్తుంటాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 322🌹

📚. Prasad Bharadwaj

🌻322. Vāsavā’nujaḥ🌻

OM Vāsavā’nujāya namaḥ

Adityāṃ kaśyapājjāto vāsavasyānujo yataḥ,
Tatassa vāsavānuja iti vidvadbhirucyate.

अदित्यां कश्यपाज्जातो वासवस्यानुजो यतः ।
ततस्स वासवानुज इति विद्वद्भिरुच्यते ॥

Born as the anuja or younger brother of Vāsava i.e., Indra to Aditi by Kaśyapa. Hence Vāsavā’nujaḥ.

Śrīmad Bhāgavata - Canto 5, Chapter 24

Tatō’dhastātsutalē udāraśravāḥ puṇyaślōkō virōcanātmajō balirbhagavatā mahēndrasya priyaṃ cikīrṣamāṇēnāditērlabdhakāyō bhūtvā vaṭuvāmanarūpēṇa parākṣiptalōkatrayō bhagavadanukampayaiva punaḥ pravēśita indrādiṣvavidyamānayā susamr̥iddhayā śriyābhijuṣṭaḥ svadharmēṇārādhayaṃstamēva bhagavantamārādhanīyamapagatasādhvasa āstē’dhunāpi. (18)

:: श्रीमद्भागवत पञ्चमस्कन्धे चतुर्विंशोऽध्यायः ::

ततोऽधस्तात्सुतले उदारश्रवाः पुण्यश्लोको विरोचनात्मजो बलिर्भगवता महेन्द्रस्य प्रियं चिकीर्षमाणेनादितेर्लब्धकायो भूत्वा वटुवामनरूपेण पराक्षिप्तलोकत्रयो भगवदनुकम्पयैव पुनः प्रवेशित इन्द्रादिष्वविद्यमानया सुसमृद्धया श्रियाभिजुष्टः स्वधर्मेणाराधयंस्तमेव भगवन्तमाराधनीयमपगतसाध्वस आस्तेऽधुनापि ॥ १८ ॥

Below the plane Vitala is another plane known as Sutala where the great son of Mahārāja Virocana, Bali Mahārāja, who is celebrated as the most pious king, resides even now. For the welfare of Indra, the King of heaven, Lord Viṣṇu appeared in the form of a dwarf brahmacārī as the son of Aditi and tricked Bali Mahārāja by begging for only three paces of land but taking all the three worlds. Being very pleased with Bali Mahārāja for giving all his possessions, the Lord returned his kingdom and made him richer than the opulent King Indra. Even now, Bali Mahārāja engages in devotional service by worshiping the Lord Viṣṇu in the plane of Sutala.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः ।
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥

Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ ।
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 323 / Vishnu Sahasranama Contemplation - 323🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻323. అపాంనిధిః, अपांनिधिः, Apāṃnidhiḥ🌻

ఓం అపాంనిధయే నమః | ॐ अपांनिधये नमः | OM Apāṃnidhaye namaḥ

అపాంనిధిః, अपांनिधिः, Apāṃnidhiḥ

అపో యత్ర నిధీంయంతే సోఽపాంనిధి రితీర్యతే ।
సరసామస్మి సాగర ఇతి గీతాసమీరణాత్ ॥

ఆపః అనగా జలములు ఎందు ఉంచబడునో అట్టి నిధి అయిన సముద్రములు విష్ణుని విభూతియే!

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::

పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ ।
సేనానీనామహం స్కన్దస్సరసామస్మి సాగరః ॥ 24 ॥

ఓ అర్జునా! పురోహితులలో శ్రేష్టుడగు బృహస్పతినిగా నన్నెరుంగుము. మరియు నేను సేనానాయకులలో కుమారస్వామియు (స్కందుడు), సరస్సులలో సముద్రమును అయియున్నాను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 323🌹

📚. Prasad Bharadwaj

🌻323. Apāṃnidhiḥ🌻

OM Apāṃnidhaye namaḥ

Apo yatra nidhīṃyaṃte so’pāṃnidhi ritīryate,
Sarasāmasmi sāgara iti gītāsamīraṇāt.

अपो यत्र निधींयंते सोऽपांनिधि रितीर्यते ।
सरसामस्मि सागर इति गीतासमीरणात् ॥

The nidhi or repository of Āpaḥ i.e., waters is the great ocean. Oceans are manifestation of Lord Viṣṇu and hence He is Apāṃnidhiḥ.

Śrīmad Bhagavad Gīta - Chapter 10

Purodhasāṃ ca mukhyaṃ māṃ viddhi pārtha br̥haspatim,
Senānīnāmahaṃ skandassarasāmasmi sāgaraḥ. (24)

:: श्रीमद्भगवद्गीत - विभूति योग ::

पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् ।
सेनानीनामहं स्कन्दस्सरसामस्मि सागरः ॥ २४ ॥

O son of Pr̥thā! Know Me to be Br̥haspati, the foremost among the priests of kings. Among commanders of armies I am Skanda (Kumāra Svāmi); among large expanses of water, I am the ocean.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः ।
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥

Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ ।
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

04 Mar 2021

4-MARCH-2021 EVENING

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 164🌹  
11) 🌹. శివ మహా పురాణము - 362🌹 
12) 🌹 Light On The Path - 114🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 246🌹 
14) 🌹 Seeds Of Consciousness - 311🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 186🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 41 / Lalitha Sahasra Namavali - 41🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 41 / Sri Vishnu Sahasranama - 41🌹
18) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 013 🌹*
AUDIO - VIDEO 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -164 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 9

*🍀 9. యోగ సూత్రములు - తొమ్మిది రకముల మనుష్యులను గూర్చి ఈ శ్లోకము తెలుపుచు, అట్టివా రందరియందు యోగి సమభావన కలిగియుండవలెనని శ్రీ కృష్ణుడు బోధించుచున్నాడు. వారెవరనగ 1. సుకృత్ : అనగా ప్రతిఫలము కోరక ఉపకారము చేయువారు. 2. మిత్ర : ఉపకారమునకు ప్రత్యుపకారము చేయువారు. 3. అరి : : శత్రువు. 4. ఉదాసీన : తటస్థుడు 5. మధ్యస్థ : మధ్యవర్తి 6. ద్వేష్య : ద్వేషింప దగినవారు. 7. బంధు : బంధువు 8. సాధు : సాధువు 9. పాపేశు : పాపులు. పై తెలిపిన తొమ్మిది వర్గముల వారి యందును సమ భావము గలవాడే శ్రేష్ఠియగు యోగియని దైవము తెలుపుచున్నాడు. 🍀*

సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు |
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే ||9

యోగసాధకునకు ఆత్మసంయమము కలుగుటకు మరి కొన్ని సద్విషయములు సూచింప బడినవి. అవి పై శ్లోకమున తెలుపబడినవి. 

అందు మొదటిది వివిధములగు మనుజులను సంఘమున కలియుచుండుట సామాన్యముగ జరుగుచునే యుండును. అందు తొమ్మిది రకముల మనుష్యులను గూర్చి ఈ శ్లోకము తెలుపుచు, అట్టివా రందరియందు యోగి సమభావన కలిగియుండవలెనని శ్రీ కృష్ణుడు బోధించుచున్నాడు. వారెవరనగ 

1. సుకృత్ : అనగా ప్రతిఫలము కోరక ఉపకారము చేయువారు.
2. మిత్ర : ఉపకారమునకు ప్రత్యుపకారము చేయువారు.
3. అరి : : శత్రువు.
4. ఉదాసీన : తటస్థుడు 
5. మధ్యస్థ : మధ్యవర్తి
6. ద్వేష్య : ద్వేషింప దగినవారు.
7. బంధు : బంధువు
8. సాధు : సాధువు
9. పాపేశు : పాపులు.
 
పై తెలిపిన తొమ్మిది వర్గముల వారియందును సమ భావము గలవాడే శ్రేష్ఠియగు యోగియని దైవము తెలుపుచున్నాడు. 

ప్రస్తుత కాలమున యోగమను పదమును విరివిగ వాడుట జరుగుచున్నది. భగవంతుని దృష్టిలో ఆత్మసంయమ యోగము పొందుటకు యోగసాధకునికి వలసిన లక్షణములు దైవము వివరించినాడు. అవి యన్నియు మరియొక్క మారు పునస్మరణ
చేయుట ఉత్తమము. అవి ఈ విధముగ నున్నవి. 

1. ఫలముల నాసించక కర్తవ్య కర్మ నిర్వర్తించుట. 
2. సంకల్పములను సన్యసించుట.
3. బంధము లేక కర్మను నిర్వర్తించుట,  
4. శమము కలిగియుండుట.
5. శీతోష్ణములను, సుఖదుఃఖములను, మానావమానము లను తటస్థుడై గమనించుట.
6. జ్ఞానమును ఆచరణమున విజ్ఞానముగ అమలు పరచుట.
7. నిలకడ, నిశ్చలత్వము కలిగియుండుట.
8. నిగ్రహింపబడిన ఇంద్రియములు కలిగియుండుట.
9. మట్టి, లోహము, బంగారము ఇట్టి వానియందు సమ దృష్టి యుండుట.
ముందు తెలిపిన తొమ్మిది వర్గముల వారియందు సమ దర్శన ముండుట.
10. పై తెలిపిన పది సూత్రములు పాటించుటకు యోగ సాధకుడు సంసిద్ధుడు కావలెను. అట్టి సంసిద్ధత లేనపుడు ధ్యానమున కుపక్ష మించుట అవివేకమని తెలియవలెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 364 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
95. అధ్యాయము - 07

*🌻. పార్వతి బాల్యము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహా తేజస్వినియగు ఆమె అపుడు మేన యెదుట కుమార్తెయై జన్మించి లోకపు పోకడననుసరించి రోదించెను (1). ఓ మహర్షీ! ఆమె పరుండిన మంచము చుట్టూ వ్యాపించిన ఆమె యొక్క గొప్ప తేజస్సుచే, రాత్రియందు కూడా అచటి దీపములు వెనువెంటనే వెలవెలబోయినవి (2). ఇంటియందలి స్త్రీలందరు ఆమె ఏడ్చుటను వినిరి. ఆ ఏడుపు మనోహరముగ నుండెను. వారు తొందరగా అచటకు వచ్చి, ప్రేమతో ఆనందముతో పులకించిరి (3). అపుడు దేవ కార్యమును సిద్ధింపజేసే, సుఖకరము శుభకరమునగు ఆ పార్వతి పుట్టుటను గూర్చి హిమవంతుని అంతఃపుర పరిచారకుడు ఆ రాజునకు శీఘ్రమే తెలిపెను (4).

ఆ పర్వత రాజునకు కుమార్తె జన్మించినదను శుభవార్తను చెప్పిన ఆ అంతఃపురపరిచారకునకు తన శ్వేతచ్ఛత్రమును దానము చేయుట విడ్డూరమనిపించలేదు (5). ఆ శైలరాజు పురోహితునితో, బ్రాహ్మణులతో గూడి ఆనందముతో అచటకు వెళ్లి గొప్ప కాంతులతో శోభిల్లుచున్న ఆ కుమార్తెను చూచెను (6). 

నల్లకలువ రేకుల వలె శ్యామలవర్ణము గలది, గొప్ప కాంతులతో మనస్సును రంజింపజేయునది అగు అట్టి కన్యను చూచి ఆ పర్వత రాజు మిక్కిలి ఆనందించెను (7). అచటనున్న పురుషులు, స్త్రీలు, అందరు పౌరులు కూడ ఆనందించిరి. అపుడు గొప్ప ఉత్సవము జరిగెను. అనేక వాద్యములు మ్రోగించబడినవి (8).

మంగల గానములు పాడబడెను. వారాంగనలు నాట్యమును చేసిరి. హిమవంతుడు జాతకర్మను చేసి బ్రాహ్మణులకు దానమునిచ్చెను (9). అపుడు హిమవంతుడు సింహద్వారము వద్దకు వచ్చి, గొప్ప ఉత్సవమును చేసెను. ఆయన ప్రసన్నమగు మనస్సు గలవాడై భిక్షుకులకు ధనము నిచ్చెను (10). 

ఓ సుబుద్ధీ! హిమవంతుడు శుభముహూర్తమునందు మునులతో గూడి ఆమెకు కాళి మొదలగు సుఖకరమగు పేర్లను పెట్టెను (11). అపుడాయన మిక్కిలి ఆదరముతో బ్రాహ్మణులకు దానమునిచ్చెను. మరియు వివిధ గానకచేరిలతో గూడిన ఉత్సవమును చేయించెను (12).

ఆ హిమవంతుడు అనేక పుత్రులు గలవాడైననూభార్యతో గూడి ఈ తీరున పెద్ద ఉత్సవమును చేసి, ఆ కాళిని మరల మరల చూచుచూ, ఆనందమును పొందెను (13). సుందరమగు అంగములతో చూడ చక్కనైన ఆ దేవి అచట ప్రతి దినము సుందరమగు శుక్ల పక్షచంద్ర బింబము వలె పెరుగజొచ్చెను (14). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 114 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 7 🌻*

434. The divine fragment is the Monad, which is reproduced in the triple spirit on the nirvanic plane. There atma is threefold, and it puts down one of its powers into the buddhic and another into the mental plane. It contains the possibilities of the Logos, but is at first quite incapable of expressing them. 

Atma pouring itself forth appears in Manas as the individualizing principle, the “I”-making faculty that gives rise to individuality in time, as the opposite to Eternity. It draws round it matter to express itself on the upper manasic plane, and thus creates as its vehicle the causal body, which lasts .throughout the long series of human incarnations. That is the body created with pain, by means of which the man purposes to develop.

435. Think of Atma as pouring itself forth on to the third plane downwards, the manasic plane. It draws around itself matter of the highest level of that plane, and forms the causal body. That body is then its vehicle for the expression of the manasic aspect of itself on that plane. It is manas working through the causal body. 

This manas becomes dual in incarnation. It reaches down into the lower levels of the mental plane, and forms there a vehicle – the lower manas – which in turn builds the astral body. In its turn that provides the force which builds the etheric and physical bodies. 

Each body on its own plane is a means for gathering experience, which when suitable is handed on to that which formed the vehicle; so after the personal incarnation is over the lower manas hands on to the causal body all the experience that it has gained, and the personality perishes. The causal body takes whatever experiences are of a nature to help its growth, and they remain with it through all its future incarnations.

436. The causal body also has a relation to what is above it. What happens on the inner or upper side of that vehicle is the passing on into the third aspect of atma of the essence of all experiences which may have entered into it; what is thus poured into the manasic aspect of atma renders it capable of acting without the causal body – that is, without a permanent vehicle which limits it.

437. The student who thinks this out, will find that it will throw light on the perishing of the individuality. The same idea appears in the Hindu and Buddhist scriptures. The causal body is the individuality,, that which persists throughout the cycle of incarnation. It comes into existence at a certain period of- time; it has to perish at another period. 

It is born and it dies. As the Gita says: “Certain is death for the born.”1 (1 Op. cit., II, 27.) This is true not only in the outer world, but in the widest sense; as there is birth of the causal body, so must it perish. It is the thing which the divine fragment has built for himself with much pain.

It is the “I” to the disciple. In some the “I” is thought of as even lower, in the personality, but this is the “I” which has to be reached at the beginning of the Path. It is finally transcended at the close of the Arhat stage of growth, at the real liberation. 

Up to that time it is diminishing and changing in character as the Arhat grows. It will ultimately be found to be a defective I”, not the real “I” at all, but at this stage of human evolution any attempt to describe its future condition would be misleading.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 245 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. గౌరముఖ మహర్షి - 3 🌻*

10. “ఎటువంటివారికైనా పితృసర్గమును గురుంచి సమస్తమూ వివరించడం సాధ్యమేకాదు. అన్నిలోకాలలో అంతమంది ఉన్నారు. ప్రధానంగా అందరిచే పూజ్యతపొందేటటువంటి పితృదేవతలు కొందరున్నారు. 

11. వసు, సాధ్య, రుద్ర, ఆదిత్య, అశ్వేమరుద్రులు(అశ్వినులు, మరుత్తులు, ఋషులు) – అంటే వాళ్ళు ఋషులని అర్థం. వసురుద్రులందరికీ, సమానంగా – ప్రతీవారికీ సమానమైన ఆరాధన చేయాల్సిన – పితృదేవతలు అని పేరు. 

12. అలా లోకాలలోంచి వెళ్ళి ఉత్తమలోకాలలో శాశ్వతంగా ఉంటారని అర్థం. అంతేకాక ఆ ఋషులందరూ వాళ్ళ కీర్తిచేతపుట్టిన వాళ్ళసంతానము. అంటే ఏ ఋషులసంతానంలో పుట్టిన వాళ్ళున్నారో వాళ్ళు ఆ ఋషులను ఆరాధించాలి. వసురుద్రాదులను పూజించాలి. 

13. వసిష్ఠ బ్రహ్మపితరులైన అగ్నిష్వాత్తాదులు, బ్రహ్మక్షత్రియ వైశ్యులకు పూజనీయులు. అంటే ఈ మూడు వర్ణములవాళ్ళు ఎవరైతే పితృకార్యాలునిర్వహిస్తారో, వాళ్ళందరూ సామాన్యంగా అందరిచేత ఆరాధించ బడేటటువంటి దేవతలను ఆరాధించవలసిందే” అన్నాడు మార్కండేయుడు.

14. “ఎవరికైనా పితృసర్గం పూర్తిగా దొరకటం సులభంకాదు; దానిని సంక్షోభంలో పెట్టరాదు” అన్నాడు. తరువాత వాళ్ళకు ఎప్పుడు పూజచేయాలో చెప్పాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 311 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 160. The 'I am' in you came from the 'I am' in your parents, but only then could they be called parents! 🌻*

The fact that the 'I am' came from the 'I am' in your parents, or that your parents created you is the usual, conventional understanding. But just think of it the other way around, your parents could be called 'parents' only after your arrival, not before that! 

Before that they were just a couple, prospective parents, but not parents yet, until your arrival. Looking at it in this manner, in a way, you have created the 'parents'. So who created whom? Yet we talk of all this being the reality! Is it?

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness 
www.facebook.com/groups/dailysatsangwisdom/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 186 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 8 🌻*

భగవత్ కార్యాలయము :-
699. ఈ కార్యాలయము నుండి ఒక్క అవతార పురుషుడు మాత్రమే స్వయం ప్రకటితుడై తాను, రక్షకుడననియు, ప్రవక్తననియు, మోచకుడననియు, దేవుని కుమారుడననియు, అవతారముననియు, రసూల్ ననియు, బుద్ధుడననియు ఎలుగెత్తి తనని తాను ప్రకటించుకొనును.

700. అవతార పురుషుడు అనంతమగు దివ్య చైతన్యమును, అపరిమితమగు ఈశ్వరీయ అహమును (నేను భగవంతుడను) సార్వభౌమిక మనస్సును, విశ్వమయ దేహమును స్థూల, సూక్ష్మ, కారణ దేహములను కలిగి యుండును. (సప్త ఉపాధులు)
------------------------------------
Notes:- పందొమ్మిదవ (1894) శతాబ్దాములో భగవంతుని "మెహర్ బాబా" స్వరూపములో భూమికి దింపిన పంచ సద్గురువులు:- 1. హజరుద్దీన్ బాబా, 2. హజరత్ సా ఈ బాబా, 3. ఉపాసనీ మహరాజు, 4. నారాయణ మహరాజు, 5. హజరత్ బాబాజాన్.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 41 / Sri Lalita Sahasranamavali - Meaning - 41 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 41. భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా ।*
*భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ॥ 41 ॥ 🍀*

🍀 112. భవానీ - 
భవుని భార్య.

🍀 113. భావనాగమ్యా - 
భావన చేత పొంద శక్యము గానిది.

🍀 114. భవారణ్య కుఠారికా - 
సంసారమనెడు అడవికి గండ్రగొడ్డలి వంటిది.

🍀 115. భద్రప్రియా - శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది.

🍀 116. భద్రమూర్తిః - శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది.

🍀 117. భక్త సౌభాగ్యదాయినీ - భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 41 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 41. bhavānī bhāvanāgamyā bhavāraṇya-kuṭhārikā |*
*bhadrapriyā bhadramūrtir bhakta-saubhāgyadāyinī || 41 || 🌻*

🌻 112 ) Bhavani -   
She who gives life to the routine life of human beings or She who is the consort of Lord Shiva

🌻 113 ) Bhavana gamya -   
She who can be attained by thinking

🌻 114 ) Bhavarany kudariga -   
She who is like the axe used to cut the miserable life of the world

🌻 115 ) Bhadra priya -   
She who is interested in doing good to her devotees

🌻 116 ) Bhadra moorthy -   
She who is personification of all that is good

🌻 117 ) Bhaktha sowbhagya dhayini -   
She who gives all good and luck to her devotees

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 41 / Sri Vishnu Sahasra Namavali - 41 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*సింహరాశి- పుబ్బ నక్షత్ర 1వ పాద శ్లోకం*

*🍀 41. ఉద్భవ క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః।*
*కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః॥ 🍀*

🍀 373) ఉద్బవ: - 
ప్రపంచసృష్టికి ఉపాదానమైనవాడు.

🍀 374) క్షోభణ: - 
సృష్టికాలమందు కల్లోలము కల్గించువాడు.

🍀 375) దేవ: - 
క్రీడించువాడు.

🍀 376) శ్రీ గర్భ: - 
సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు.

🍀 377) పరమేశ్వర: - 
ఉత్కృష్ట మైనవాడు.

🍀 378) కరణమ్ - 
జగదుత్పత్తికి సాధనము అయినవాడు.

🍀 379) కారణమ్ - 
జగత్తునకు కారణమైనవాడు.

🍀 380) కర్తా - 
సమస్త కార్యములకు కర్తయైనవాడు.

🍀 381) వికర్తా - 
విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు.

🍀 382) గహన: - 
గ్రహించ శక్యముగానివాడు.

🍀 383) గుహ: - 
వ్యక్తము కానివాడు. కప్పబడినవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 41 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Simha Rasi, Pubba 1st Padam*

*🌻 41. udbhavaḥ, kṣōbhaṇō devaḥ śrīgarbhaḥ parameśvaraḥ |*
*karaṇaṁ kāraṇaṁ kartā vikartā gahanō guhaḥ || 41 || 🌻*

🌻 373. Udbhavaḥ: 
One who is the material cause of creation.

🌻 374. Kṣōbhaṇaḥ: 
One who at the time of creation entered into the Purusha and Prakriti and caused agitation.

🌻 375. Devaḥ: 
'Divyati' means sports oneself through creation and other cosmic activities.

🌻 376. Śrīgarbhaḥ: 
One in whose abdomen (Garbha) Shri or His unique manifestation as Samsara has its existence.

🌻 377. Parameśvaraḥ: 
'Parama' means the supreme. 'Ishvarah' means one who hold sway over all beings.

🌻 378. Karaṇam: 
He who is the most important factor in the generation of this universe.

🌻 379. Kāraṇam: 
The Cause – He who causes others to act.

🌻 380. Kartā: 
One who is free and is therefore one's own master.

🌻 381. Vikartā: 
One who makes this unique universe.

🌻 382. Gahanaḥ: 
One whose nature, greatness and actions cannot be known by anybody.

🌻 383. Guhaḥ: 
One who hides one's own nature with the help of His power of Maya.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్గీత యథాతథం - 1 - 013 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 13 🌻*

13
తత: శంఖాశ్చ భేర్యశ్చ
పణవానకగోముఖా:
సహసైవాభ్యహన్యంత
స శబ్దస్తుములో భవత్‌ ||

తాత్పర్యము : 
అటు పిమ్మట శంఖములు, పణవానకములు, భేరులు, కొమ్ములు ఆదివి అన్నియు ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతి భీకరముగా నుండెను.

భాష్యము : 
లేదు..

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

4-MARCH-2021 MORNING

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 656 / Bhagavad-Gita - 656🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 322, 323 / Vishnu Sahasranama Contemplation - 322, 323🌹
3) 🌹 Daily Wisdom - 75🌹
4) 🌹. వివేక చూడామణి - 38🌹
5) 🌹Viveka Chudamani - 38🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 49🌹
7)  🌹.ఎరుకతో ఉన్న స్వేచ్ఛలో నియంత్రణ విచ్ఛలవిడితనం రెండూ ఉండవు 🌹 
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 226 / Sri Lalita Chaitanya Vijnanam - 226🌹 
9) 🌹 శ్రీమద్భగవద్గీత - 567 / Bhagavad-Gita - 567🌹 
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 656 / Bhagavad-Gita - 656 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 73 🌴*

73. నష్టో మోహ: స్మృతిర్లబ్ధా 
త్వత్ప్రసాదాన్మయాచ్యుత |
స్థితోస్మి గతసన్దేహ: 
కరిష్యే వచనం తవ ||

🌷. తాత్పర్యం : 
అర్జునుడు పలికెను : ఓ అచ్యుతా! నా మోహము ఇప్పుడు నశించినది. నీ కరుణచే నా స్మృతిని తిరిగి పొందితిని. ఇప్పుడు నేను స్థిరుడును, సందేహరహితుడును అయి నీ ఆజ్ఞానుసారమును వర్తించుటకు సిద్ధముగా నున్నాను.

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము వర్తించుటయే జీవుని (అర్జునుని) సహజస్థితియై యున్నది. అతడట్లు నియమబద్ధముగా వర్తించుటకే నిర్దేశింపబడినాడు. 

జీవుని నిజమైన స్థితి శ్రీకృష్ణుని నిత్యదాసత్వమే యని చైతన్యమహాప్రభువు కూడా తెలిపియున్నారు. ఈ సిద్ధాంతము మరచియే జీవుడు భౌతికప్రకృతిచే బద్ధుడగుచున్నాడు. కాని అతడు ఆ భగవానుని సేవలో నిమగ్నుడగుట ద్వారా ముక్తుడు కాగలడు. జీవుని సహజస్థితి దాసత్వమే గనుక అతడు మాయనో లేదా దేవదేవుడైన శ్రీకృష్ణునో సదా సేవింపవలసివచ్చును. 

ఒకవేళ అతడు శ్రీకృష్ణభగవానుని సేవించినచో తన సహజస్థితియందు నిలువగలడు. కాని భౌతికశక్తియైన మాయను సేవింపదలచినచో నిక్కముగా బంధములో చిక్కుబడగలడు. భ్రాంతి యందు భౌతికజగమున సేవను గూర్చుచు అతడు ఇచ్చాకామములచే బద్ధుడైనను తనను తాను జగత్తుకు అధినేతయైనట్లు భావించును. 

అట్టి భావనయే భ్రాంతి యనబడును. కాని మనుజుడు ముక్తుడైనపుడు అట్టి భ్రాంతి నశించి, ఆ దేవదేవుని కోరికల ననుసరించి వర్తించుటకు స్వచ్చందముగా శరణాగతుడగును. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 656 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 73 🌴*

73. arjuna uvāca
naṣṭo mohaḥ smṛtir labdhā
tvat-prasādān mayācyuta
sthito ’smi gata-sandehaḥ
kariṣye vacanaṁ tava

🌷 Translation : 
Arjuna said: My dear Kṛṣṇa, O infallible one, my illusion is now gone. I have regained my memory by Your mercy. I am now firm and free from doubt and am prepared to act according to Your instructions.

🌹 Purport :
The constitutional position of a living entity, represented by Arjuna, is that he has to act according to the order of the Supreme Lord. He is meant for self-discipline. 

Śrī Caitanya Mahāprabhu says that the actual position of the living entity is that of eternal servant of the Supreme Lord. Forgetting this principle, the living entity becomes conditioned by material nature, but in serving the Supreme Lord he becomes the liberated servant of God. 

The living entity’s constitutional position is to be a servitor; he has to serve either the illusory māyā or the Supreme Lord. If he serves the Supreme Lord he is in his normal condition, but if he prefers to serve the illusory, external energy, then certainly he will be in bondage. In illusion the living entity is serving in this material world. 

He is bound by his lust and desires, yet he thinks of himself as the master of the world. This is called illusion. When a person is liberated, his illusion is over, and he voluntarily surrenders unto the Supreme to act according to His desires.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 322, 323/ Vishnu Sahasranama Contemplation - 322, 323 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻322. వాసవాఽనుజః, वासवाऽनुजः, Vāsavā’nujaḥ🌻*

*ఓం వాసవాఽనుజాయ నమః | ॐ वासवाऽनुजाय नमः | OM Vāsavā’nujāya namaḥ*

వాసవాఽనుజః, वासवाऽनुजः, Vāsavā’nujaḥ

అదిత్యాం కశ్యపాజ్జాతో వాసవస్యానుజో యతః ।
తతస్స వాసవానుజ ఇతి విద్వద్భిరుచ్యతే ॥

అదితియందు కశ్యపునకు కుమారుడుగా వామనరూపమున వాసవునకు అనగా ఇంద్రునకు తరువాత అనుజునిగా జన్మించెనుగావున వాసవాఽనుజః.

:: పోతన భాగవతము - పంచమ స్కంధము, ద్వితీయాశ్వాసము ::
సీ. ఆ క్రింద సుతలంబు నందు మహాపుణ్యుఁడగు విరోచనపుత్త్రుఁడైన యట్టి
బలిచక్రవర్తి యా పాకశాసనునకు ముద మొసంగఁగఁ గోరి, యదితిగర్భ
మున వామనాకృతిఁ బుట్టి యంతటఁ ద్రివిక్రమ రూపమునను లోకత్రయంబు
నాక్రమించిన దానవారాతిచేత ముందటన యీఁబడిన యింద్రత్వ మిట్లు
ఆ. గలుగువాఁడు పుణ్యకర్మసంధానుండు, హరిపదాంబుజార్చ నాభిలాషుఁ
డగుచుఁ శ్రీరమేశు నారాధనము సేయు, చుండు నెపుడు నతిమహోత్సవమున. (112)

'వితలం' క్రింద 'సుతలం' ఉన్నది. సుతలంలో బలిచక్రవర్తి ఉన్నాడు. అతడు పుణ్యవంతుడయిన విరోచనుని కుమారుడు. శ్రీమన్నారాయణుడు ఇంద్రుడిని సంతోషపెట్టాలనుకొని అదితిగర్భంలో వామనుడై జన్మించాడు. త్రివిక్రమరూపం ప్రదర్శించి ముల్లోకాలనూ ఆక్రమించాడు. చివరకు విష్ణువు బలిచక్రవర్తికి సుతలంలో ఇంద్రత్వం అనుగ్రహించాడు. ఆ బలిచక్రవర్తి ఎన్నో పుణ్యకర్మలు చేశాడు. శ్రీహరి పాదపద్మాలను సేవించవలెననే అభిలాష కలవాడు. అతడు ఎంతో ఉత్సాహంతో లక్ష్మీశుడయిన శ్రీమన్నారాయణున్ని ఆరాధిస్తుంటాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 322🌹*
📚. Prasad Bharadwaj 

*🌻322. Vāsavā’nujaḥ🌻*

*OM Vāsavā’nujāya namaḥ*

Adityāṃ kaśyapājjāto vāsavasyānujo yataḥ,
Tatassa vāsavānuja iti vidvadbhirucyate.

अदित्यां कश्यपाज्जातो वासवस्यानुजो यतः ।
ततस्स वासवानुज इति विद्वद्भिरुच्यते ॥

Born as the anuja or younger brother of Vāsava i.e., Indra to Aditi by Kaśyapa. Hence Vāsavā’nujaḥ.

Śrīmad Bhāgavata - Canto 5, Chapter 24
Tatō’dhastātsutalē udāraśravāḥ puṇyaślōkō virōcanātmajō balirbhagavatā mahēndrasya priyaṃ cikīrṣamāṇēnāditērlabdhakāyō bhūtvā vaṭuvāmanarūpēṇa parākṣiptalōkatrayō bhagavadanukampayaiva punaḥ pravēśita indrādiṣvavidyamānayā susamr̥iddhayā śriyābhijuṣṭaḥ svadharmēṇārādhayaṃstamēva bhagavantamārādhanīyamapagatasādhvasa āstē’dhunāpi. (18)

:: श्रीमद्भागवत पञ्चमस्कन्धे चतुर्विंशोऽध्यायः ::
ततोऽधस्तात्सुतले उदारश्रवाः पुण्यश्लोको विरोचनात्मजो बलिर्भगवता महेन्द्रस्य प्रियं चिकीर्षमाणेनादितेर्लब्धकायो भूत्वा वटुवामनरूपेण पराक्षिप्तलोकत्रयो भगवदनुकम्पयैव पुनः प्रवेशित इन्द्रादिष्वविद्यमानया सुसमृद्धया श्रियाभिजुष्टः स्वधर्मेणाराधयंस्तमेव भगवन्तमाराधनीयमपगतसाध्वस आस्तेऽधुनापि ॥ १८ ॥

Below the plane Vitala is another plane known as Sutala where the great son of Mahārāja Virocana, Bali Mahārāja, who is celebrated as the most pious king, resides even now. For the welfare of Indra, the King of heaven, Lord Viṣṇu appeared in the form of a dwarf brahmacārī as the son of Aditi and tricked Bali Mahārāja by begging for only three paces of land but taking all the three worlds. Being very pleased with Bali Mahārāja for giving all his possessions, the Lord returned his kingdom and made him richer than the opulent King Indra. Even now, Bali Mahārāja engages in devotional service by worshiping the Lord Viṣṇu in the plane of Sutala.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः ।
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥

Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ ।
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 323 / Vishnu Sahasranama Contemplation - 323🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻323. అపాంనిధిః, अपांनिधिः, Apāṃnidhiḥ🌻*

*ఓం అపాంనిధయే నమః | ॐ अपांनिधये नमः | OM Apāṃnidhaye namaḥ*

అపాంనిధిః, अपांनिधिः, Apāṃnidhiḥ

అపో యత్ర నిధీంయంతే సోఽపాంనిధి రితీర్యతే ।
సరసామస్మి సాగర ఇతి గీతాసమీరణాత్ ॥

ఆపః అనగా జలములు ఎందు ఉంచబడునో అట్టి నిధి అయిన సముద్రములు విష్ణుని విభూతియే!

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ ।
సేనానీనామహం స్కన్దస్సరసామస్మి సాగరః ॥ 24 ॥

ఓ అర్జునా! పురోహితులలో శ్రేష్టుడగు బృహస్పతినిగా నన్నెరుంగుము. మరియు నేను సేనానాయకులలో కుమారస్వామియు (స్కందుడు), సరస్సులలో సముద్రమును అయియున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 323🌹*
📚. Prasad Bharadwaj 

*🌻323. Apāṃnidhiḥ🌻*

*OM Apāṃnidhaye namaḥ*

Apo yatra nidhīṃyaṃte so’pāṃnidhi ritīryate,
Sarasāmasmi sāgara iti gītāsamīraṇāt.

अपो यत्र निधींयंते सोऽपांनिधि रितीर्यते ।
सरसामस्मि सागर इति गीतासमीरणात् ॥

The nidhi or repository of Āpaḥ i.e., waters is the great ocean. Oceans are manifestation of Lord Viṣṇu and hence He is Apāṃnidhiḥ.

Śrīmad Bhagavad Gīta - Chapter 10
Purodhasāṃ ca mukhyaṃ māṃ viddhi pārtha br̥haspatim,
Senānīnāmahaṃ skandassarasāmasmi sāgaraḥ. (24)

:: श्रीमद्भगवद्गीत - विभूति योग ::
पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् ।
सेनानीनामहं स्कन्दस्सरसामस्मि सागरः ॥ २४ ॥

O son of Pr̥thā! Know Me to be Br̥haspati, the foremost among the priests of kings. Among commanders of armies I am Skanda (Kumāra Svāmi); among large expanses of water, I am the ocean.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः ।
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥

Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ ।
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 75 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 15. The Absolute is Transcendent Being 🌻*

The mind of the cosmos, which is called the Cosmic Mind in usual parlance, is regarded here as an evolute, and not the original Being. The Absolute is Transcendent Being, and not a mind thinking. It is not even a causal state. Even the causal state is supposed to be posterior to the Absolute. We never associate the Absolute with the world. 

The Brahman of the Upanishad, or the Absolute of philosophy, is the assertion of Being which is unrelated to creation. And, when we have to associate God with creation, we have a new word altogether for it. Ishvara is the word we use in the language of the Vedanta. Such words do not occur in the Upanishads. They are all to be found in the later Vedanta, but they are assumed here. 

In the Samkhya and the Vedanta cosmological descriptions, we have certain grades mentioned of the coming out of the effect from the cause. Everything was hidden, though not expressed. Everything was in a universal causal state. That is called Prakriti in the Samkhya language.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
join and Share 
🌹. Daily satsang Wisdom 🌹
https://t.me/Seeds_Of_Consciousness 
www.facebook.com/groups/dailysatsangwisdom/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 38 / Viveka Chudamani - 38🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*

*🍀. ఆత్మ స్వభావము - 6 🍀*

139. ఆత్మ చుట్టూ వలయాలుగా ఆవరించి ఉన్న ఈ అధికమైన అజ్ఞాన ప్రభావములు ఆత్మను తెలుసుకొనుటకు దాని ప్రకాశమును గుర్తించుటకు అడ్డుగా ఉండి, ఆత్మ యొక్క ఔన్నత్యమును అనంత జ్ఞానమును గ్రహించలేక మరియు ఆత్మను మించినది వేరొకటి లేదని, అది విభజించుటకు వీలులేని శాశ్వత సత్యమని తెలుసుకొన లేకున్నారు. రాహువు సూర్యుని చుట్టివేసినప్పుడు సూర్య కిరణముల కాంతి అవ్యక్తమైనట్లు, రాహువు తొలగినపుడు సూర్య కాంతి ప్రజ్వరిల్లుతుంది కాదా! అట్లే అజ్ఞానము తొలగిన ఆత్మ వ్యక్తమవుతుంది.

140. ఆత్మ అనాత్మల భేదములు గుర్తించలేక సాధకుడు ఆత్మ చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానమును తెలుసుకొనలేక, తన శరీరమే ఆత్మ అని భావించు చున్నాడు. ఆత్మ స్వచ్ఛమైన ప్రకాశముతో ప్రజ్వరిల్లుతున్నప్పటికి అజ్ఞానము వలన గుర్తించలేకున్నాడు. అట్టి స్థితిలో రాజస గుణము యొక్క గొప్ప శక్తి ఆత్మకు అడ్డుగా ఉన్న కామ క్రోధాలను జయించవలసి ఉంటుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 38 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 Nature of Soul - 6 🌻*

138. One who is overpowered by ignorance mistakes a thing for what it is not; It is the absence of discrimination that causes one to mistake a snake for a rope, and great dangers overtake him when he seizes it through that wrong notion. Hence, listen, my friend, it is the mistaking of transitory things as real that constitutes bondage.

139. This veiling power (Avriti), which preponderates in ignorance, covers the Self, whose glories are infinite and which manifests Itself through the power of knowledge, indivisible, eternal and one without a second –as Rahu does the orb of the sun.

140. When his own Self, endowed with the purest splendour, is hidden from view, a man through ignorance falsely identifies himself with this body, which is the non-Self. And then the great power of rajas called the projecting power sorely afflicts him through the binding fetters of lust, anger, etc.,

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
Join and Share 
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 49 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 33. మహర్షి దేవాపి సాన్నిధ్యము -1 🌻*

అప్పుడా దివ్యవాణి యిట్లనెను :
“బుద్ధిమంతు లెవరునూ తొందరపాటు నిర్ణయములు చేయరు. తొందరపాటుతనము పతనకారణము. నీవు దైవవశమున ఒక వరము కలిగియున్నావు. దూరశ్రవణము నీకేర్పడి యున్నది. మేము తెలుపు విషయములు, వ్రాయగోరు గ్రంథములు విశేషమైనటు వంటివి. సామాన్యములు కావు. భ్రాంతికారకములసలే కావు. 

ఈ మహత్కార్యము వలన జీవునిగ నీకు ఉద్దరణమే కలుగును." దివ్యవాణి ఇట్లు పలికినప్పటికీ నా నిరాదరణ ధోరణి మారలేదు. పలికిన పురుషునియొక్క ధ్వని స్పష్టముగను సూటిగనూ యున్నది. 

అది నా గురుదేవుని కంఠధ్వని కాదని స్పష్టముగ తెలియుచున్నది. ఆ అవ్యక్తపురుషుడు మూడు వారముల తరువాత అదేరోజున మరల కలియుదునని తెలిపి, అదృశ్యమాయెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.ఎరుకతో ఉన్న స్వేచ్ఛలో నియంత్రణ విచ్ఛలవిడితనం రెండూ ఉండవు 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

మీలో వేడి ఉంటే, భయం కూడా ఉంటుంది. అప్పుడు మీరు ఏదో ఒకటి చెయ్యక తప్పదు. అందుకే నియంత్రించు కోవడమనే విష ప్రయోగంతో ఎవరిని వారే చంపుకుంటారు.

‘‘ఎప్పటికీ హాయిగా జీవించకూడదు’’ అనేది నియంత్రణలో ఉన్నవారికి తెలిసే ఏకైక జీవిత పరిష్కారం. కాబట్టి, బుద్ధ విగ్రహంలా ఉండండి. అప్పుడు మీరు క్రమశిక్షణ పొందిన సహనశీలిగా నటించగలరు. కానీ నేను ఇక్కడ బోధించేది అది కాదు. విచ్చలవిడి తనాన్ని విడిచి పెట్టినట్లే నియంత్రణను కూడా మీరు విడిచి పెట్టాలంటాను. అంటే మీరు చిక్కులో పడినట్లే. 

ఎందుకంటే, విచ్చలవిడితనం, నియంత్రణలలో ఏదో ఒక దానిని మాత్రమే మీరు ఎంచుకోగలరు. ఎలాగంటే, ‘‘నియంత్రణను వదిలి విచ్చలవిడిగాను, విచ్చలవిడిని విడిచిపెట్టి నియంత్రణలోను ఉండొచ్చు’’ కదా!’’ అని మీరు అడగవచ్చు. నిజమే. 

కానీ, మీరు ఎరుకలో ఉన్నట్లైతే నియంత్రణ, విచ్చలవిడితనాలు రెండూ మీ నుంచి వాటంతటవే తొలగిపోతాయి. ఎందుకంటే, అవి రెండూ ఒకే విషయానికి సంబంధించిన రెండు అంశాలు. ఎరుకలో ఉంటే వాటి అవసరముండదు.

పద్దెనిమిదేళ్ళ కుర్రాడు ఒకరోజు తన తండ్రితో ‘‘ఇంతకాలం మీ నియంత్రణలో నలిగిపోయాను. నా వయసు కుర్రాళ్ళందరూ చక్కగా తాగుతూ, అమ్మాయిలతో తిరుగుతూ హాయిగా ఆనందిస్తున్నారు. నేను కూడా అలాంటి సాహసాలుచేసి, వాటి అనుభూతిని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నా. అందుకే ఇల్లు విడిచి వెళ్తున్నా. నన్ను ఆపేందుకు ప్రయత్నించకండి. వెళ్ళొస్తా’’ అన్నాడు. వెంటనే అతని తండ్రి ‘‘ఉండరా బాబూ! నేను కూడా నీతో వస్తాను. ఇంత కాలం నేనుకూడా నా తల్లిదండ్రుల నియంత్రణలో అలాంటి సాహసాలు చెయ్యలేదు’’ అన్నాడు కొడుకుతో.

నియంత్రించ బడిన వారందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. వారు లోలోపల రగిలిపోతూ, విచ్చలవిడిగా తిరిగే అవకాశం కోసం నిరంతరం నిరీక్షిస్తూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితిని సరిగా అర్థంచేసుకోవాలి. అందరూ తమకు తాముగా ఉంటూనే, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను మనస్ఫూర్తిగా అంగీకరించేందుకు, అనుభవించేందుకు, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. 

అయితే మీరు ఎప్పుడూ పరిపూర్ణ చైతన్యంతో కూడిన ఎరుకతో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు ఎప్పుడూ ఆత్మస్మృతిలోనే ఉండాలి. ఇదే మీరు ఎప్పుడూ గుర్తుంచు కోవలసిన ముఖ్య విషయం. మిమ్మల్ని మీరు ఎప్పుడూ మరచిపోకూడదు. 

అలాగే మీరు ఎప్పుడూ మీ ఉనికి అంతర్గత కేంద్రంనుంచే ముందుకు కదలాలి. మీరుచేసే పనులన్నీ అక్కడినుంచే జరగాలి. అప్పుడు మీరుచేసే ప్రతి పని ధర్మమవుతుంది.

ఎరుక చేసే పనులలో ఒకటి ధర్మం. పైపైన మీరు చేసే పని పైకి పాప కార్యంలా కనిపించక పోవచ్చు. అందువల్ల అది సమాజానికి నచ్చవచ్చు. సమాజం మిమ్మల్ని కీర్తించవచ్చు. అయినా అది పాపకార్యమే. ఎందుకంటే, మీకు తెలుసు ఆ పని చేసినందువల్ల అనవసరంగా మీరు మీ జీవితాన్ని కోల్పోయారని. 

అందువల్ల మీలో మీరు మిమ్మల్ని నిందించుకుంటూనే ఉంటారు. కాబట్టి, మీలో మీరు సంతోషంగా ఉండలేరు.
సమాజం మిమ్మల్ని కీర్తించడంలో అర్థమేముంది, అందువల్ల మీకు దక్కేదేముంది? అన్నీ సొల్లుకబుర్లే. 

వాటి కోసం, మీ చుట్టూ ఉన్న మూర్ఖుల మెప్పు కోసం మీరు మీ జీవితంతో పాటు దివ్యత్వాన్ని కూడా కోల్పోయారు. అందువల్ల అవి ముఖ్యవిషయాలు ఎలా అవుతాయి? జీవితాన్ని మీ అంతర్గత కేంద్రం నుంచి జీవించడం ప్రారంభించండి. ధ్యానమంటే అదే.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 226, 227, 228 / Sri Lalitha Chaitanya Vijnanam - 226 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*🍀 56. మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా ।*
*మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా ॥ 56 ॥🍀*

*🌻 226, 227, 228. 'మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా'' 🌻*

సర్వతంత్రములకు, సర్వమంత్రములకు, సర్వయంత్రములకు మూలము శ్రీమాత అని అర్థము.

దేవీ తంత్రము, మంత్రము, యంత్రము కన్న మించిన యంత్రాదులు గాని, తంత్రాదులుగాని లేవు. మంత్రము లన్నియూ బీజాక్షర శబ్దముల కూర్పు. యంత్రములన్నియూ మంత్ర శక్తిని
అవతరింప జేయుటకు వలసిన సాధనములు. 

తంత్రము లన్నియూ విధానములు. శాస్త్ర విధానముగ శబ్దములను ఉచ్చరించుచూ, యంత్రముల లోనికి ఆహ్వానించుచూ చేయు పూజా విధానము తంత్రము. శ్రీదేవి చైతన్యము శబ్ద రూపముగను, వర్ణ రూపముగను ప్రకటింపబడుచు రకరకములగు శక్తులను అవతరింపజేయును. 

యంత్రములోనికి వాని నాహ్వానము చేయుట వలన యంత్రములు శక్తివంతములై పరిసరములను ప్రభావితము చేయును. 

శాస్తోక్తమగు ఈ విధానమును తెనుగున తంతు అందురు. తంత్రము యొక్క వికృత పదమే తంతు. తంత్ర విధానమునకు నిష్ఠ, నియమము చాల ప్రధానము. తంత్ర విధానమున యంత్రములను పూజించు నపుడు తత్సంబంధిత చైతన్యము యంత్రమున ఆవరించును. 

అందువలన యంత్రములను పవిత్రముగ భావించవలెను. అవి దైవీ స్వరూపములు. వానిని శుచియైన ప్రదేశమున నుంచుకొనుట, శుచిగ పూజ చేయుట, ఉపచారములు చేయుట, నైవేద్యములు పెట్టుట శాస్త్ర విధానముగ జరుగవలెను. అట్లు నిర్వర్తించిననే వాని ప్రభావము
ఆశీర్వచనముగ అందును. 

యంత్రములను గృహములందు ఉంచు కొనుటకు చాల నిష్ఠ, నియమము లవసరము. నిత్యపూజ, నైవేద్యము కనీస నియమము. శుచి, శుభ్రత అత్యంత ప్రధానము. శాస్తోక్తముగ
చెయ్యనిచో యంత్ర పూజలు వికటింప గలవు. ఉచ్చారణ, ఉపచారము విధి విధానముగ జరుపవలెను. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు శాస్త్ర విధానమే ప్రమాణమని తెలిపినాడు. 

ఈ విషయమున నిర్లక్ష్యము రజస్తమో గుణములను ప్రకోపింపజేసి, దుష్ఫలితములను దుఃఖములను కలిగింపగలవు. ఇది పెద్దల నాహ్వానించి అగౌరవించుట వంటిది. దైవీశక్తులు, మూర్తులు పెద్దలకన్న పెద్దవారగుటచే వారిని శ్రద్ధాభక్తులచే సంతుష్టులను గావించుకొనవలెను గాని అహంకార పూరితులై గొప్పలకు చేయరాదు. 

యంత్రములకు సరళ రూపములే విగ్రహములు. విగ్రహముల ఆరాధనకూడ నియమనిష్ఠలతో సాగవలెను. విగ్రహారాధన విషయమున నియమ నిష్ఠలు కూడ సరళమే. భక్తి శ్రద్ధలు మాత్రము సమానమే. క్రియాహీనము, మంత్రహీనము అయినను భక్తిహీనము కానిచో విగ్రహారాధన కొంత అనుకూలించగలదు.

 ప్రస్తుతకాలమున శిక్షణ పొందక, అర్హతలను అందుకొనక చేయు యంత్ర తంత్ర పూజలు రజస్తమో గుణములనే పెంపొందింప జేయు చున్నవి. కలియుగమున మానవులు షోడశోపచార పూజ క్లుప్తముగ నిత్యము నిర్వర్తించినచో చాలునని శ్రీకృష్ణుడు ఉద్ధవున కుపదేశించెను. 

శ్రీదేవి మంత్రము ముందు నామములలో తెలుపబడినది. ఆమే షోడశి, ఈ మంత్రమును స్వీకరించుటకు శిష్యున కర్హత యుండవలెను. గురువు సిద్ధుడై యుండవలెను. సర్వమంత్రములకు మూల మంత్రమది. 

అట్లే శ్రీ యంత్రము సర్వ యంత్రములకు మూలము. తంత్రము సర్వస్వతంత్ర తంత్రము. అనగా ఇతర తంత్రముల వలె మరే తంత్రముపై ఆధారపడినది కాదు. 

శ్రీవిద్యతో సాటియైన విద్య శ్రీచక్రముతో సాటియైన యంత్రము కలదని చెప్పు వాడు మూఢబుద్ధి యని తంత్ర శాస్త్రము పేర్కొనును. శ్రీదేవి సాటి లేనిది. ఆమెయే మహామంత్రా, మహాయంత్రా, మహాతంత్రా మరియు సర్వమంత్రాత్మికా, సర్వ యంత్రాత్మకా, సర్వ తంత్రాత్మికా.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 226, 227, 228 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Mahā-tantrā महा-तन्त्रा (226) 🌻*

Tantra is a way of worship. She Herself is the great tantra or all tantra-s lead to Her. 

*🌻. Mahā-mantrā महा-मन्त्रा (227) 🌻*

She is the embodiment of all mantra-s. All mantra-s originate from the fifty one alphabets of Sanskrit. These fifty one letters are worn around Her neck in the form of a garland and all the mantra-s originate from this garland. This nāma could also mean Her Pañcadśi and ṣodaśī mantra-s, that are considered supreme amongst all mantra-s.

*🌻 Mahā-yantrā महा-यन्त्रा (228) 🌻*

Two interpretations are possible for this nāma. Mahā-yantr could mean Śrī cakrā in the midst of which She lives. Śrī cakrā is considered as the Supreme of all yantra-s, hence mahā-yantra. Secondly, Her form Itself represents Śrī cakrā.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 567 / Bhagavad-Gita - 567 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 06 🌴*

06. కర్షయన్త: శరీరస్థం భూతగ్రామమచేతస: |
మాం చైవాన్త:శరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్ ||

🌷. తాత్పర్యం : 
అచేతసులై దేహమును మరియు దేహమునందున్న పరమాత్మను కూడా కష్టపెట్టువారును అగువారలు అసురులుగా తెలియబడుదురు.

🌷. భాష్యము :
అంతియేగాక రాజకీయ ప్రయోజనార్థమై ఒనరింపబడెడి అట్టి తపస్సు లేదా ఉపావసములు ఇతరులను సైతము నిక్కముగా కలత నొందించును. అట్టి తపస్సులు వేదవాజ్మయమున తెలుపబడలేదు. అసురప్రవృత్తి గలవారు ఆ విధానము ద్వారా శత్రువుని గాని, ఎదుటి పక్షమును గాని బలవంతముగా తమ కోరికకు లొంగునట్లుగా చేసికొందుమని తలచుచుందురు. 

కొన్నిమార్లు అట్టి తపస్సు ద్వారా మరణము సైతము సంభవించుచుండును. ఈ కార్యములను శ్రీకృష్ణభగవానుడు ఆమోదించుట లేదు. ఆ కార్యములందు నియుక్తులైనవారు దానవులని అతడు వర్ణించినాడు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 567 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 17 - The Divisions of Faith - 06 🌴*

06. karṣayantaḥ śarīra-sthaṁ
bhūta-grāmam acetasaḥ
māṁ caivāntaḥ śarīra-sthaṁ
tān viddhy āsura-niścayān

🌷 Translation : 
Who are foolish and who torture the material elements of the body as well as the Supersoul dwelling within, are to be known as demons.

🌹 Purport :
Such unauthorized fasting or austerities for some political end are certainly very disturbing to others. They are not mentioned in the Vedic literature. 

A demoniac person may think that he can force his enemy or other parties to comply with his desire by this method, but sometimes one dies by such fasting. These acts are not approved by the Supreme Personality of Godhead, and He says that those who engage in them are demons.