శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 226, 227, 228 / Sri Lalitha Chaitanya Vijnanam - 226, 227, 228


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 226, 227, 228 / Sri Lalitha Chaitanya Vijnanam - 226 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

🍀 56. మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా ।
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా ॥ 56 ॥🍀

🌻 226, 227, 228. 'మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా'' 🌻

సర్వతంత్రములకు, సర్వమంత్రములకు, సర్వయంత్రములకు మూలము శ్రీమాత అని అర్థము.

దేవీ తంత్రము, మంత్రము, యంత్రము కన్న మించిన యంత్రాదులు గాని, తంత్రాదులుగాని లేవు. మంత్రము లన్నియూ బీజాక్షర శబ్దముల కూర్పు. యంత్రములన్నియూ మంత్ర శక్తిని

అవతరింప జేయుటకు వలసిన సాధనములు.

తంత్రము లన్నియూ విధానములు. శాస్త్ర విధానముగ శబ్దములను ఉచ్చరించుచూ, యంత్రముల లోనికి ఆహ్వానించుచూ చేయు పూజా విధానము తంత్రము. శ్రీదేవి చైతన్యము శబ్ద రూపముగను, వర్ణ రూపముగను ప్రకటింపబడుచు రకరకములగు శక్తులను అవతరింపజేయును.

యంత్రములోనికి వాని నాహ్వానము చేయుట వలన యంత్రములు శక్తివంతములై పరిసరములను ప్రభావితము చేయును.

శాస్తోక్తమగు ఈ విధానమును తెనుగున తంతు అందురు. తంత్రము యొక్క వికృత పదమే తంతు. తంత్ర విధానమునకు నిష్ఠ, నియమము చాల ప్రధానము. తంత్ర విధానమున యంత్రములను పూజించు నపుడు తత్సంబంధిత చైతన్యము యంత్రమున ఆవరించును.

అందువలన యంత్రములను పవిత్రముగ భావించవలెను. అవి దైవీ స్వరూపములు. వానిని శుచియైన ప్రదేశమున నుంచుకొనుట, శుచిగ పూజ చేయుట, ఉపచారములు చేయుట, నైవేద్యములు పెట్టుట శాస్త్ర విధానముగ జరుగవలెను. అట్లు నిర్వర్తించిననే వాని ప్రభావము

ఆశీర్వచనముగ అందును.

యంత్రములను గృహములందు ఉంచు కొనుటకు చాల నిష్ఠ, నియమము లవసరము. నిత్యపూజ, నైవేద్యము కనీస నియమము. శుచి, శుభ్రత అత్యంత ప్రధానము. శాస్తోక్తముగ

చెయ్యనిచో యంత్ర పూజలు వికటింప గలవు. ఉచ్చారణ, ఉపచారము విధి విధానముగ జరుపవలెను. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు శాస్త్ర విధానమే ప్రమాణమని తెలిపినాడు.

ఈ విషయమున నిర్లక్ష్యము రజస్తమో గుణములను ప్రకోపింపజేసి, దుష్ఫలితములను దుఃఖములను కలిగింపగలవు. ఇది పెద్దల నాహ్వానించి అగౌరవించుట వంటిది. దైవీశక్తులు, మూర్తులు పెద్దలకన్న పెద్దవారగుటచే వారిని శ్రద్ధాభక్తులచే సంతుష్టులను గావించుకొనవలెను గాని అహంకార పూరితులై గొప్పలకు చేయరాదు.

యంత్రములకు సరళ రూపములే విగ్రహములు. విగ్రహముల ఆరాధనకూడ నియమనిష్ఠలతో సాగవలెను. విగ్రహారాధన విషయమున నియమ నిష్ఠలు కూడ సరళమే. భక్తి శ్రద్ధలు మాత్రము సమానమే. క్రియాహీనము, మంత్రహీనము అయినను భక్తిహీనము కానిచో విగ్రహారాధన కొంత అనుకూలించగలదు.

ప్రస్తుతకాలమున శిక్షణ పొందక, అర్హతలను అందుకొనక చేయు యంత్ర తంత్ర పూజలు రజస్తమో గుణములనే పెంపొందింప జేయు చున్నవి. కలియుగమున మానవులు షోడశోపచార పూజ క్లుప్తముగ నిత్యము నిర్వర్తించినచో చాలునని శ్రీకృష్ణుడు ఉద్ధవున కుపదేశించెను.

శ్రీదేవి మంత్రము ముందు నామములలో తెలుపబడినది. ఆమే షోడశి, ఈ మంత్రమును స్వీకరించుటకు శిష్యున కర్హత యుండవలెను. గురువు సిద్ధుడై యుండవలెను. సర్వమంత్రములకు మూల మంత్రమది.

అట్లే శ్రీ యంత్రము సర్వ యంత్రములకు మూలము. తంత్రము సర్వస్వతంత్ర తంత్రము. అనగా ఇతర తంత్రముల వలె మరే తంత్రముపై ఆధారపడినది కాదు.

శ్రీవిద్యతో సాటియైన విద్య శ్రీచక్రముతో సాటియైన యంత్రము కలదని చెప్పు వాడు మూఢబుద్ధి యని తంత్ర శాస్త్రము పేర్కొనును. శ్రీదేవి సాటి లేనిది. ఆమెయే మహామంత్రా, మహాయంత్రా, మహాతంత్రా మరియు సర్వమంత్రాత్మికా, సర్వ యంత్రాత్మకా, సర్వ తంత్రాత్మికా.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 226, 227, 228 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Mahā-tantrā महा-तन्त्रा (226) 🌻

Tantra is a way of worship. She Herself is the great tantra or all tantra-s lead to Her.

🌻. Mahā-mantrā महा-मन्त्रा (227) 🌻

She is the embodiment of all mantra-s. All mantra-s originate from the fifty one alphabets of Sanskrit. These fifty one letters are worn around Her neck in the form of a garland and all the mantra-s originate from this garland. This nāma could also mean Her Pañcadśi and ṣodaśī mantra-s, that are considered supreme amongst all mantra-s.

🌻 Mahā-yantrā महा-यन्त्रा (228) 🌻

Two interpretations are possible for this nāma. Mahā-yantr could mean Śrī cakrā in the midst of which She lives. Śrī cakrā is considered as the Supreme of all yantra-s, hence mahā-yantra. Secondly, Her form Itself represents Śrī cakrā.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


04 Mar 2021

No comments:

Post a Comment