గీతోపనిషత్తు -164


🌹. గీతోపనిషత్తు -164 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚


శ్లోకము 9

🍀 9. యోగ సూత్రములు - తొమ్మిది రకముల మనుష్యులను గూర్చి ఈ శ్లోకము తెలుపుచు, అట్టివా రందరియందు యోగి సమభావన కలిగియుండవలెనని శ్రీ కృష్ణుడు బోధించుచున్నాడు. వారెవరనగ 1. సుకృత్ : అనగా ప్రతిఫలము కోరక ఉపకారము చేయువారు. 2. మిత్ర : ఉపకారమునకు ప్రత్యుపకారము చేయువారు. 3. అరి : : శత్రువు. 4. ఉదాసీన : తటస్థుడు 5. మధ్యస్థ : మధ్యవర్తి 6. ద్వేష్య : ద్వేషింప దగినవారు. 7. బంధు : బంధువు 8. సాధు : సాధువు 9. పాపేశు : పాపులు. పై తెలిపిన తొమ్మిది వర్గముల వారి యందును సమ భావము గలవాడే శ్రేష్ఠియగు యోగియని దైవము తెలుపుచున్నాడు. 🍀

సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు |
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే ||9

యోగసాధకునకు ఆత్మసంయమము కలుగుటకు మరి కొన్ని సద్విషయములు సూచింప బడినవి. అవి పై శ్లోకమున తెలుపబడినవి.

అందు మొదటిది వివిధములగు మనుజులను సంఘమున కలియుచుండుట సామాన్యముగ జరుగుచునే యుండును. అందు తొమ్మిది రకముల మనుష్యులను గూర్చి ఈ శ్లోకము తెలుపుచు, అట్టివా రందరియందు యోగి సమభావన కలిగియుండవలెనని శ్రీ కృష్ణుడు బోధించుచున్నాడు. వారెవరనగ

1. సుకృత్ : అనగా ప్రతిఫలము కోరక ఉపకారము చేయువారు.

2. మిత్ర : ఉపకారమునకు ప్రత్యుపకారము చేయువారు.

3. అరి : : శత్రువు.

4. ఉదాసీన : తటస్థుడు

5. మధ్యస్థ : మధ్యవర్తి

6. ద్వేష్య : ద్వేషింప దగినవారు.

7. బంధు : బంధువు

8. సాధు : సాధువు

9. పాపేశు : పాపులు.

పై తెలిపిన తొమ్మిది వర్గముల వారియందును సమ భావము గలవాడే శ్రేష్ఠియగు యోగియని దైవము తెలుపుచున్నాడు.

ప్రస్తుత కాలమున యోగమను పదమును విరివిగ వాడుట జరుగుచున్నది. భగవంతుని దృష్టిలో ఆత్మసంయమ యోగము పొందుటకు యోగసాధకునికి వలసిన లక్షణములు దైవము వివరించినాడు. అవి యన్నియు మరియొక్క మారు పునస్మరణ

చేయుట ఉత్తమము. అవి ఈ విధముగ నున్నవి.

1. ఫలముల నాసించక కర్తవ్య కర్మ నిర్వర్తించుట.

2. సంకల్పములను సన్యసించుట.

3. బంధము లేక కర్మను నిర్వర్తించుట,

4. శమము కలిగియుండుట.

5. శీతోష్ణములను, సుఖదుఃఖములను, మానావమానము లను తటస్థుడై గమనించుట.

6. జ్ఞానమును ఆచరణమున విజ్ఞానముగ అమలు పరచుట.

7. నిలకడ, నిశ్చలత్వము కలిగియుండుట.

8. నిగ్రహింపబడిన ఇంద్రియములు కలిగియుండుట.

9. మట్టి, లోహము, బంగారము ఇట్టి వానియందు సమ దృష్టి యుండుట.

ముందు తెలిపిన తొమ్మిది వర్గముల వారియందు సమ దర్శన ముండుట.

10. పై తెలిపిన పది సూత్రములు పాటించుటకు యోగ సాధకుడు సంసిద్ధుడు కావలెను. అట్టి సంసిద్ధత లేనపుడు ధ్యానమున కుపక్ష మించుట అవివేకమని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


04 Mar 2021

No comments:

Post a Comment