విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 500 / Vishnu Sahasranama Contemplation - 500

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 500 / Vishnu Sahasranama Contemplation - 500 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 500. భోక్తా, भोक्ता, Bhoktā 🌻

ఓం భోక్త్రే నమః | ॐ भोक्त्रे नमः | OM Bhoktre namaḥ

పరమానంద సందోహ సంభోగాత్పరమేశ్వరః ।
జగతాం పాలకత్వాద్వా భోక్తేతి ప్రోచ్యతే బుధైః ॥

జీవ రూపమున తాను ఉండి పరమానంద సందోహమును అనగా పరమానంద రాశిని లెస్సగా అనుభవించునుగావున 'భోక్తా' అని శ్రీ విష్ణునకు వ్యవహారము. లేదా ప్రాణులను పాలించి రక్షించుచుండునుగనుక భోక్తా.

:: శ్రీమద్భగవద్గీత - క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము ::

ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః ।
పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః ॥ 23 ॥

పురుషుడు అనగా ఆత్మ ఈ శరీరమందున్నప్పటికినీ, శరీరముకంటే వేఱైనవాడూ, సాక్షీభూతుడూ, అనుమతించువాడూ, భరించువాడూ, అనుభవించువాడూ, పరమేశ్వరుడూ, పరమాత్మయూ అని చెప్పబడుచున్నాడు.

143. భోక్తా, भोक्ता, Bhoktā

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 500 🌹

📚. Prasad Bharadwaj

🌻 500. Bhoktā 🌻

OM Bhoktre namaḥ

परमानन्द सन्दोह संभोगात्परमेश्वरः ।
जगतां पालकत्वाद्वा भोक्तेति प्रोच्यते बुधैः ॥

Paramānanda sandoha saṃbhogātparameśvaraḥ ,
Jagatāṃ pālakatvādvā bhokteti procyate budhaiḥ .

He enjoys association with infinite supreme bliss. Or also because He protects, He is known by the divine name of 'Bhoktā'.

:: श्रीमद्भगवद्गीत - क्षेत्रक्षेत्रज्ञ विभाग योग ::

उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः ।
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः ॥ २३ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 13

Upadraṣṭānumantā ca bhartā bhoktā maheśvaraḥ,
Paramātmeti cāpyukto dehe’smin puruṣaḥ paraḥ. 23.

He who is the Witness, the Permitter, the Sustainer, the Experiencer, the great Lord and who is also spoken of as the transcendental Self is the supreme Person in this body.

143. భోక్తా, भोक्ता, Bhoktā

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

24 Oct 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 17

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 17 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 10. ఆశ్రమమునకు దారి - 3 🌻

కలహించక, విమర్శించక, మౌనముగ కర్తవ్యోన్ముఖుడై పయనించ వలెను. ఈ విధముగ పయనించు సాధకునకు గురువాశీర్వచనము వెన్నుదన్నుగ నిలచును. కార్యమునందలి సత్యము, ధర్మము, ప్రేమ మరియు నిర్వర్తించుట యందలి ప్రశాంతత కారణముగ అంతే వాసిత్వము లభించును. అనగా గురువు యొక్క అంతరంగ ఆశ్రమమున ఆశ్రయము లభించును.

తానుగ సంకల్పించిన యజ్ఞార్థ కర్మ పరిపూర్ణత చెందు కొలది అంతరంగమున ఆశ్రమ ప్రవేశమునకు చేరువగు చుండును. ఇదియే మా ఆశ్రమమునకు దారి. మరియొక మార్గము లేదు. వెట్టి భక్తులకు మా ఆశ్రమమున తావులేదు. వెట్టి కుదిరి మట్టివలె విస్తారముగ లోకహిత కార్యముల నొనర్చుచు సత్యమును, ధర్మమును ఆశ్రయించిన వారికి చోటు కలదు. అట్టి వారు మా హృదయ సామ్రాజ్యములోనికి ఆహ్వానించబడుదురు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

24 Oct 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 84

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 84 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ధ్యానం నిన్ను విస్తరించిన సముద్రం వేపు తీసుకెళుతుంది. అల్ప స్థాయి నించీ అనంతం కేసి తీసుకెళుతుంది. శరీరం మనసు అన్న సరిహద్దుల్ని దాటి అవధుల్లేని చైతన్యం వేపు తీసుకెళుతుంది. 🍀

ధ్యానం నిన్ను విస్తరించిన సముద్రం వేపు తీసుకెళుతుంది. అల్ప స్థాయి నించీ అనంతం కేసి తీసుకెళుతుంది. శరీరం మనసు అన్న సరిహద్దుల్ని దాటి అవధుల్లేని చైతన్యం వేపు తీసుకెళుతుంది. అశాశ్వతత్వం నించి శాశ్వతం వేపుకు తీసుకెళుతుంది. పరిమితమైన దానినించీ అపరిమతం వేపుకు జనన మరణం నించి శాశ్వత జీవితం వేపుకు తీసుకెళుతుంది. అవసరమయిందల్లా అహం అన్న భావాన్ని వదిలెయ్యాలి. తెలివయిన మనిషికి అది కష్టమయిన విషయం కాదు. అహమన్నది అనవసరమయిన విషయమని నిజమైన తెలివైన వ్యక్తికి తెలుస్తుంది. కారణం అది పొరపాటు అభిప్రాయమని అతనికి స్పష్టంగా తెలుస్తుంది. మనల్ని వేరు చెయ్యడం కుదరదు. మనం కనీసం క్షణం కూడా వేరుగా వుండడం వీలుపడదు. శ్వాస లోపలికి పోదు, బయటికి రాదు. మనం నిరంతరం యిచ్చి పుచ్చుకుంటాం.

శ్వాస అంటే మనకు అనంతానికి మధ్య వారధి. శ్వాస అన్నది అనంతంలో మనకున్న పునాది. చెట్టుని వేర్లతో బాటు పెకలించి వేస్తే అది చనిపోవడం ఆరంభిస్తుంది అని వాటి ఆహార మార్గాలు శ్వాస ఆపేస్తే మనిషి చనిపోతాడు. సమస్తంలో శ్వాస అన్నది సున్నితమయిన అనుబంధ మార్గం 'శ్వాస' అంటేనే జీవితం. శ్వాస లేకుంటే జీవితం లేదు. మనిషి జీవించి వున్నాడన్నందుకు అదే వుదాహరణ.

ఐతే శ్వాస కనిపించదు. దానికి సంబంధించిన స్పృహ మనకు వుండదు. స్పృహ వుంటే మనం నిరంతరం అస్తిత్వం నించీ ఏదో అందుకుంటున్నామని తెలిసేది. కాబట్టి మనం జీవితాన్ని పరిశీలిస్తే అహమన్నది పనికిమాలిన అభిప్రాయం. ఏ క్షణం అహాన్ని వదిలేస్తావో అడ్డంకులు అదృశ్యమవుతాయి. నువ్వు సముద్రంలోకి పరిగెట్టవచ్చు. సముద్రంగా మారిపోవచ్చు. ఆ అనుభవం పరవశానికి సంబంధించిన, స్వేచ్ఛకు సంబంధించిన అనుభవం.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

24 Oct 2021

Jeevan Ka Rajpadh - Started By Sadguru Pandit Sriram Sharma Acharya Ji

🌹 Jeevan Ka Rajpadh - Started By Sadguru Pandit Sriram Sharma Acharya Ji 🌹

🍀 All World Gayatri Pariwar 🍀

🙌 Shantikunj, Haridwar 🙌

🌹🙏🌹

🙏 Prasad Bharadwaj 🙏

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

24-OCTOBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 24 ఆగివారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 103 / Bhagavad-Gita - 103- 2-56🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 500 / Vishnu Sahasranama Contemplation - 500🌹
4) 🌹 DAILY WISDOM - 178🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 17🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 84🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-3 🌹
8) *🌹 JEEVAN KA RAJPADH - STARTED BY SADGURU PANDIT SRIRAM SHARMA ACHARYA JI 🌹*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*24, అక్టోబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ సూర్య స్తుతి - 2 🍀*

భ్రమత్యావిద్ధమఖిలం బ్రహ్మాండం సచరాచరమ్ |
త్వదంశుభిరిదం స్పృష్టం సర్వం సంజాయతే శుచి || 3 ||
క్రియతే త్వత్కరైః స్పర్శాజ్జలాదీనాం పవిత్రతా |
హోమదానాదికో ధర్మో నోపకారాయ జాయతే || 4 ||

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: కృష్ణ చవితి 29:44:54 వరకు తదుపరి కృష్ణ పంచమి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: రోహిణి 25:02:37 వరకు తదుపరి మృగశిర 
యోగం: వరియాన 23:34:37 వరకు తదుపరి పరిఘ
 కరణం: బవ 16:22:47 వరకు
వర్జ్యం: 15:59:20 - 17:47:52
దుర్ముహూర్తం: 16:15:41 - 17:02:09
రాహు కాలం: 16:21:30 - 17:48:37
గుళిక కాలం: 14:54:22 - 16:21:30
యమ గండం: 12:00:06 - 13:27:14
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 21:24:56 - 23:13:28
సూర్యోదయం: 06:11:36, సూర్యాస్తమయం: 17:48:38
వైదిక సూర్యోదయం: 06:15:12
వైదిక సూర్యాస్తమయం: 17:45:01
చంద్రోదయం: 20:27:03, చంద్రాస్తమయం: 09:06:10
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: వృషభం
ఆనందాదియోగం: ధాత్రి యోగం - కార్య జయం 25:02:37 
వరకు తదుపరి సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 
పండుగలు : కడవా చౌత్‌‌, సంకష్ట చతుర్థి, రోహిణి వ్రతము
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -103 / Bhagavad-Gita - 103 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 56 🌴*

56. దుఃఖేష్వనుద్విగ్నమనా: సుఖేషు విగతస్పృహ: |
వీతరాగభయక్రోధ: స్థితధీర్మునిరుచ్యతే ||

🌷 తత్పర్యం :
*త్రివిధ తాపములందును చలింపని మనస్సు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడును, రాగము, భయము, క్రోధముల నుండి విడివడినవాడును అగు మనుజుడు స్థిరమైన మనస్సుగల ముని యని చెప్పబడును.*

🌷. భాష్యము :
ఒక స్థిరమైన నిర్ణయమునకు రాకుండా మానసికకల్పనలతో పలురీతుల మననము కావించువాడనియే “ముని” యను పదమునకు అర్థము. ప్రతి మునికి కూడా ఒక ప్రత్యేక దృక్కోణముండును. మునియైనవాడు ఇతర మునులకు భిన్నుడు కానిచో ముని యని పిలువబడును అర్హుడు కాడు. “ న చాసౌ ఋషి: యస్యమతం న భిన్నం” (మాహాభారతము, వనపర్వము 313.117 ). కాని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తెలిపిన “స్థితధీర్ముని:” సామాన్య మునులకు అన్యమైనవాడు. సర్వవిధములైన మనోకల్పిత భావములను త్యజించి యున్నందున అట్టి స్థితధీర్ముని సదా కృష్ణభక్తిలో నిలిచి యుండును. 

అతడు “ప్రశాంత నిశ్శేష మనోరథాంతరుడు” (స్తోత్రరత్నం 43) అని పిలువబడును. అనగా అతడు సర్వవిధములిన మానసికకల్పనా భావములను అతిశయించిన శ్రీకృష్ణుడే సర్వస్వమనెడి నిర్ణయమునకు వచ్చినట్టివాడు (వాసుదేవ: సర్వమితి స మహాత్మా సుదుర్లభ:). అతడే ఆత్మయందు స్థితిని కలిగినట్టి ముని. అట్టి కృష్ణభక్తిపరాయణుడైన ముని త్రివిధతాపములను తాకిడిచే ఎట్టి కలతను పొందడు. 

తన గతము నందలి పాపములకు ఎక్కువ శిక్ష అనుభవింపవలసి యున్నదని భావించును అతడు ఆ తాపాత్రయములను భగవత్కరుణగా అంగీకరించును. అంతియేగాక భగవానుని కరుణచే తనకు దుఃఖములు అతికొద్ది పరిమాణములో కలుగుచున్నవని అతడు తలపోయును. అదే విధముగా సుఖము కలిగినప్పుడు అట్టివాడు (తానా సౌఖ్యమునకు అర్హుడు కానని తలచుచు) ఆ కీర్తిని శ్రీకృష్ణునకు ఆపాధించును. 

భగవానుని కరుణ వలననే తాను అట్టి అనుకూల, సుఖ వాతావరణములలో నిలిచి భక్తిని సాగించుగలుగుచున్నానని అతడు అవగతము చేసికొనును. అట్టి సేవ కొరకు ఆ భక్తుడు ఎల్లప్పుడు ధైర్యమును కలిగియుండి ఆసక్తి మరియు అనాసక్తులచే ప్రభావితుడు కాకుండును. ఇంద్రియభోగము కొరకు దేనినైనను గ్రహించుట యనునది ఆసక్తి కాగా, విషయసుఖముల యెడ అనాసక్తిని యనునది ఆసక్తి కాగా, విషయసుఖముల యెడ అనాసక్తి యనునది వైరాగ్యమనబడును. కాని కృష్ణభక్తి యందు స్థిరుడైనట్టివాడు జీవితమున శ్రీకృష్ణభగవానుని సేవ కొరకే అర్పించి యున్నందున అట్టి ఆసక్తి మరియు అనాసక్తులకు అతీతుడై యుండును. కావుననే తన ప్రయత్నములు విఫలమైనను అతడు క్రోధము చెందడు. అనగా కృష్ణభక్తిపరాయణుడు. జయాపజయములు రెండింటి యందును సదా ధీరుడై స్థిరనిశ్చయముతో నిలుచును.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 103 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 56 🌴*

56. duḥkheṣv anudvigna-manāḥ sukheṣu vigata-spṛhaḥ
vīta-rāga-bhaya-krodhaḥ sthita-dhīr munir ucyate

🌷Translation :
*One who is not disturbed in mind even amidst the threefold miseries or elated when there is happiness, and who is free from attachment, fear and anger, is called a sage of steady mind.*

🌷 Purport :
The word muni means one who can agitate his mind in various ways for mental speculation without coming to a factual conclusion. It is said that every muni has a different angle of vision, and unless a muni differs from other munis, he cannot be called a muni in the strict sense of the term. Nāsāv ṛṣir yasya mataṁ na bhinnam (Mahābhārata, Vana-parva 313.117). But a sthita-dhīr muni, as mentioned herein by the Lord, is different from an ordinary muni. 

The sthita-dhīr muni is always in Kṛṣṇa consciousness, for he has exhausted all his business of creative speculation. He is called praśānta-niḥśeṣa-mano-rathāntara (Stotra-ratna 43), or one who has surpassed the stage of mental speculations and has come to the conclusion that Lord Śrī Kṛṣṇa, or Vāsudeva, is everything (vāsudevaḥ sarvam iti sa mahātmā su-durlabhaḥ). He is called a muni fixed in mind. 

Such a fully Kṛṣṇa conscious person is not at all disturbed by the onslaughts of the threefold miseries, for he accepts all miseries as the mercy of the Lord, thinking himself only worthy of more trouble due to his past misdeeds; and he sees that his miseries, by the grace of the Lord, are minimized to the lowest.

🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 500 / Vishnu Sahasranama Contemplation - 500 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 500. భోక్తా, भोक्ता, Bhoktā 🌻*

*ఓం భోక్త్రే నమః | ॐ भोक्त्रे नमः | OM Bhoktre namaḥ*

పరమానంద సందోహ సంభోగాత్పరమేశ్వరః ।
జగతాం పాలకత్వాద్వా భోక్తేతి ప్రోచ్యతే బుధైః ॥

*జీవ రూపమున తాను ఉండి పరమానంద సందోహమును అనగా పరమానంద రాశిని లెస్సగా అనుభవించునుగావున 'భోక్తా' అని శ్రీ విష్ణునకు వ్యవహారము. లేదా ప్రాణులను పాలించి రక్షించుచుండునుగనుక భోక్తా.*

:: శ్రీమద్భగవద్గీత - క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము ::
ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః ।
పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః ॥ 23 ॥

పురుషుడు అనగా ఆత్మ ఈ శరీరమందున్నప్పటికినీ, శరీరముకంటే వేఱైనవాడూ, సాక్షీభూతుడూ, అనుమతించువాడూ, భరించువాడూ, అనుభవించువాడూ, పరమేశ్వరుడూ, పరమాత్మయూ అని చెప్పబడుచున్నాడు.

143. భోక్తా, भोक्ता, Bhoktā

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 500 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 500. Bhoktā 🌻*

*OM Bhoktre namaḥ*

परमानन्द सन्दोह संभोगात्परमेश्वरः ।
जगतां पालकत्वाद्वा भोक्तेति प्रोच्यते बुधैः ॥

Paramānanda sandoha saṃbhogātparameśvaraḥ ,
Jagatāṃ pālakatvādvā bhokteti procyate budhaiḥ .

*He enjoys association with infinite supreme bliss. Or also because He protects, He is known by the divine name of 'Bhoktā'.*

:: श्रीमद्भगवद्गीत - क्षेत्रक्षेत्रज्ञ विभाग योग ::
उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः ।
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः ॥ २३ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 13
Upadraṣṭānumantā ca bhartā bhoktā maheśvaraḥ,
Paramātmeti cāpyukto dehe’smin puruṣaḥ paraḥ. 23.

He who is the Witness, the Permitter, the Sustainer, the Experiencer, the great Lord and who is also spoken of as the transcendental Self is the supreme Person in this body.

143. భోక్తా, भोक्ता, Bhoktā

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

 Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 178 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 26. There was an Image of Lord Krishna Suspended in Space 🌻*

*Just for your information, it is said that in southern India near Vijayanagar, a great ancient capital of a Hindu kingdom of the past, that there was an image of Lord Krishna suspended in space. How could this be? Many engineers came and stood looking at the image as it stood in space without dropping to the earth—with no wires or connecting links from any side. British archaeologists who were interested in the phenomenon later on discovered that there were four pillars on the ground which were made up of magnets.* 

*The four magnetic pillars were pulling this iron image on the top with an equally distributed power in different directions in such a way that the image could not drop. They wanted to improve this and removed one pillar. An electromagnet was put in the pillar, but afterwards it did not succeed. They could not get the image suspended again, and the effect has been lost for ever. Those ancient people were apparently wiser and surer than the present day scientists! The pull of a magnet is a familiar phenomenon comparable to the universal magnetic pull of the stellar and planetary regions.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 17 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 10. ఆశ్రమమునకు దారి - 3 🌻*

కలహించక, విమర్శించక, మౌనముగ కర్తవ్యోన్ముఖుడై పయనించ వలెను. ఈ విధముగ పయనించు సాధకునకు గురువాశీర్వచనము వెన్నుదన్నుగ నిలచును. కార్యమునందలి సత్యము, ధర్మము, ప్రేమ మరియు నిర్వర్తించుట యందలి ప్రశాంతత కారణముగ అంతే వాసిత్వము లభించును. అనగా గురువు యొక్క అంతరంగ ఆశ్రమమున ఆశ్రయము లభించును. 

తానుగ సంకల్పించిన యజ్ఞార్థ కర్మ పరిపూర్ణత చెందు కొలది అంతరంగమున ఆశ్రమ ప్రవేశమునకు చేరువగు చుండును. ఇదియే మా ఆశ్రమమునకు దారి. మరియొక మార్గము లేదు. వెట్టి భక్తులకు మా ఆశ్రమమున తావులేదు. వెట్టి కుదిరి మట్టివలె విస్తారముగ లోకహిత కార్యముల నొనర్చుచు సత్యమును, ధర్మమును ఆశ్రయించిన వారికి చోటు కలదు. అట్టి వారు మా హృదయ సామ్రాజ్యములోనికి ఆహ్వానించబడుదురు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 84 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ధ్యానం నిన్ను విస్తరించిన సముద్రం వేపు తీసుకెళుతుంది. అల్ప స్థాయి నించీ అనంతం కేసి తీసుకెళుతుంది. శరీరం మనసు అన్న సరిహద్దుల్ని దాటి అవధుల్లేని చైతన్యం వేపు తీసుకెళుతుంది. 🍀*

ధ్యానం నిన్ను విస్తరించిన సముద్రం వేపు తీసుకెళుతుంది. అల్ప స్థాయి నించీ అనంతం కేసి తీసుకెళుతుంది. శరీరం మనసు అన్న సరిహద్దుల్ని దాటి అవధుల్లేని చైతన్యం వేపు తీసుకెళుతుంది. అశాశ్వతత్వం నించి శాశ్వతం వేపుకు తీసుకెళుతుంది. పరిమితమైన దానినించీ అపరిమతం వేపుకు జనన మరణం నించి శాశ్వత జీవితం వేపుకు తీసుకెళుతుంది. అవసరమయిందల్లా అహం అన్న భావాన్ని వదిలెయ్యాలి. తెలివయిన మనిషికి అది కష్టమయిన విషయం కాదు. అహమన్నది అనవసరమయిన విషయమని నిజమైన తెలివైన వ్యక్తికి తెలుస్తుంది. కారణం అది పొరపాటు అభిప్రాయమని అతనికి స్పష్టంగా తెలుస్తుంది. మనల్ని వేరు చెయ్యడం కుదరదు. మనం కనీసం క్షణం కూడా వేరుగా వుండడం వీలుపడదు. శ్వాస లోపలికి పోదు, బయటికి రాదు. మనం నిరంతరం యిచ్చి పుచ్చుకుంటాం. 

శ్వాస అంటే మనకు అనంతానికి మధ్య వారధి. శ్వాస అన్నది అనంతంలో మనకున్న పునాది. చెట్టుని వేర్లతో బాటు పెకలించి వేస్తే అది చనిపోవడం ఆరంభిస్తుంది అని వాటి ఆహార మార్గాలు శ్వాస ఆపేస్తే మనిషి చనిపోతాడు. సమస్తంలో శ్వాస అన్నది సున్నితమయిన అనుబంధ మార్గం 'శ్వాస' అంటేనే జీవితం. శ్వాస లేకుంటే జీవితం లేదు. మనిషి జీవించి వున్నాడన్నందుకు అదే వుదాహరణ. 

ఐతే శ్వాస కనిపించదు. దానికి సంబంధించిన స్పృహ మనకు వుండదు. స్పృహ వుంటే మనం నిరంతరం అస్తిత్వం నించీ ఏదో అందుకుంటున్నామని తెలిసేది. కాబట్టి మనం జీవితాన్ని పరిశీలిస్తే అహమన్నది పనికిమాలిన అభిప్రాయం. ఏ క్షణం అహాన్ని వదిలేస్తావో అడ్డంకులు అదృశ్యమవుతాయి. నువ్వు సముద్రంలోకి పరిగెట్టవచ్చు. సముద్రంగా మారిపోవచ్చు. ఆ అనుభవం పరవశానికి సంబంధించిన, స్వేచ్ఛకు సంబంధించిన అనుభవం. 

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-3🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*

*🌻 314-3. 'రాకేందువదనా' 🌻* 

అవ్యక్తము నందు ఆమె, ఆయన అను స్థితులు లేవు. ఆ యందు వున్న తత్త్వమును ఆమె అనలేము. ఆయన అని కూడ అనలేము. రెంటికిని మూలమగు తత్త్వమది. కాలము ననుసరించి ఈ తత్త్వము రెండుగ ఒకే మారు ఏర్పడును. అపుడు మూలపురుషుడు మూలప్రకృతిగ, ధన, ఋణ ప్రజ్ఞలుగ ఏర్పడును. ప్రకృతి ఎనిమిది ఆవరణలు ఏర్పరచు కొనినపుడు కూడ అందు అంతర్హితమై పురుషుడుండును. కనుక శాశ్వతముగ ప్రకృతి పురుషులు కలిసే యున్నవిగాని విడివడుట ఎన్నడూ జరుగదు. 

వ్యక్తమై అష్ట ప్రకృతులుగ మూలప్రకృతి తొమ్మిది ఆవరణములుగ వ్యాపించునపుడు అందు అంతర్యామియై పురుష తత్వము వుండుచు నుండును. ఆమె యేర్పరచిన ప్రకృతి స్థితుల లోనికి అతడు ప్రవేశించుట వలననే అతనిని పురుషుడనిరి. పురము లన్నియూ ఆకారములే. అందు వసించువాడు పురుషుడు. ఆకారము లేక పురుషుని దర్శించుట దుర్లభము. పురుషుడు లేక ఆకార మేర్పడుట దుస్సాధ్యము.  

అతడు 'అ'కారము. ఆమె “ఈ'కారము. సృష్టి అంతయూ ఈ రెండు అక్షరముల రసాయనమే. ఆమె యందు ఆయనను దర్శించుట పూర్ణదర్శనము. ఆయన యందు ఆమెను దర్శించుట కూడ పూర్ణ దర్శనమే. విడదీయరాని రెంటిని విడదీసి చూచుటకు చేయు ప్రయత్న మంతయూ వికారమే. చూచువానికి చూపు కలిగించునది శ్రీమాతయే. దివ్యదృష్టి కూడ శ్రీమాత శక్తియే. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 314 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya*
*Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻*

*🌻 314. Rākenduvadanā राकेन्दुवदना (314)-1 🌻*

Her face is compared to the full moon. Full moon is without blemishes. The full moon represents the dot (bindu) above the letter ‘Ī’ which gives rise to the bīja īṁ (ईं). At this stage the letter Ī (ई) has only a dot above it making it as īṁ (ईं), which is yet to transform as kāmakalā. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 JEEVAN KA RAJPADH - STARTED BY SADGURU PANDIT SRIRAM SHARMA ACHARYA JI 🌹*
*🍀 ALL WORLD GAYATRI PARIWAR 🍀*
*🙌 SHANTIKUNJ, HARIDWAR 🙌*
🌹🙏🌹
*🙏 PRASAD BHARADWAJ 🙏*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹