మైత్రేయ మహర్షి బోధనలు - 17


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 17 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 10. ఆశ్రమమునకు దారి - 3 🌻

కలహించక, విమర్శించక, మౌనముగ కర్తవ్యోన్ముఖుడై పయనించ వలెను. ఈ విధముగ పయనించు సాధకునకు గురువాశీర్వచనము వెన్నుదన్నుగ నిలచును. కార్యమునందలి సత్యము, ధర్మము, ప్రేమ మరియు నిర్వర్తించుట యందలి ప్రశాంతత కారణముగ అంతే వాసిత్వము లభించును. అనగా గురువు యొక్క అంతరంగ ఆశ్రమమున ఆశ్రయము లభించును.

తానుగ సంకల్పించిన యజ్ఞార్థ కర్మ పరిపూర్ణత చెందు కొలది అంతరంగమున ఆశ్రమ ప్రవేశమునకు చేరువగు చుండును. ఇదియే మా ఆశ్రమమునకు దారి. మరియొక మార్గము లేదు. వెట్టి భక్తులకు మా ఆశ్రమమున తావులేదు. వెట్టి కుదిరి మట్టివలె విస్తారముగ లోకహిత కార్యముల నొనర్చుచు సత్యమును, ధర్మమును ఆశ్రయించిన వారికి చోటు కలదు. అట్టి వారు మా హృదయ సామ్రాజ్యములోనికి ఆహ్వానించబడుదురు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


24 Oct 2021

No comments:

Post a Comment