నిర్మల ధ్యానాలు - ఓషో - 84


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 84 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ధ్యానం నిన్ను విస్తరించిన సముద్రం వేపు తీసుకెళుతుంది. అల్ప స్థాయి నించీ అనంతం కేసి తీసుకెళుతుంది. శరీరం మనసు అన్న సరిహద్దుల్ని దాటి అవధుల్లేని చైతన్యం వేపు తీసుకెళుతుంది. 🍀

ధ్యానం నిన్ను విస్తరించిన సముద్రం వేపు తీసుకెళుతుంది. అల్ప స్థాయి నించీ అనంతం కేసి తీసుకెళుతుంది. శరీరం మనసు అన్న సరిహద్దుల్ని దాటి అవధుల్లేని చైతన్యం వేపు తీసుకెళుతుంది. అశాశ్వతత్వం నించి శాశ్వతం వేపుకు తీసుకెళుతుంది. పరిమితమైన దానినించీ అపరిమతం వేపుకు జనన మరణం నించి శాశ్వత జీవితం వేపుకు తీసుకెళుతుంది. అవసరమయిందల్లా అహం అన్న భావాన్ని వదిలెయ్యాలి. తెలివయిన మనిషికి అది కష్టమయిన విషయం కాదు. అహమన్నది అనవసరమయిన విషయమని నిజమైన తెలివైన వ్యక్తికి తెలుస్తుంది. కారణం అది పొరపాటు అభిప్రాయమని అతనికి స్పష్టంగా తెలుస్తుంది. మనల్ని వేరు చెయ్యడం కుదరదు. మనం కనీసం క్షణం కూడా వేరుగా వుండడం వీలుపడదు. శ్వాస లోపలికి పోదు, బయటికి రాదు. మనం నిరంతరం యిచ్చి పుచ్చుకుంటాం.

శ్వాస అంటే మనకు అనంతానికి మధ్య వారధి. శ్వాస అన్నది అనంతంలో మనకున్న పునాది. చెట్టుని వేర్లతో బాటు పెకలించి వేస్తే అది చనిపోవడం ఆరంభిస్తుంది అని వాటి ఆహార మార్గాలు శ్వాస ఆపేస్తే మనిషి చనిపోతాడు. సమస్తంలో శ్వాస అన్నది సున్నితమయిన అనుబంధ మార్గం 'శ్వాస' అంటేనే జీవితం. శ్వాస లేకుంటే జీవితం లేదు. మనిషి జీవించి వున్నాడన్నందుకు అదే వుదాహరణ.

ఐతే శ్వాస కనిపించదు. దానికి సంబంధించిన స్పృహ మనకు వుండదు. స్పృహ వుంటే మనం నిరంతరం అస్తిత్వం నించీ ఏదో అందుకుంటున్నామని తెలిసేది. కాబట్టి మనం జీవితాన్ని పరిశీలిస్తే అహమన్నది పనికిమాలిన అభిప్రాయం. ఏ క్షణం అహాన్ని వదిలేస్తావో అడ్డంకులు అదృశ్యమవుతాయి. నువ్వు సముద్రంలోకి పరిగెట్టవచ్చు. సముద్రంగా మారిపోవచ్చు. ఆ అనుభవం పరవశానికి సంబంధించిన, స్వేచ్ఛకు సంబంధించిన అనుభవం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


24 Oct 2021

No comments:

Post a Comment