గీతోపనిషత్తు -175

🌹. గీతోపనిషత్తు -175 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 18 - 1

🍀 18. నూతన చిత్తము - 1 - చిత్తమును దేనిపై నియమింపవలెను? ధ్యాన సమయమున తాను, నేను అను వెలుగు పై తన లోపల నొకచోట నియమింపవలెను. అట్లు నియమించుట హృదయము నందు గాని, భ్రూమధ్యము నందు గాని చేయవలెను. అభ్యాస వశమున చిత్తము పరిపరి విధముల ఇంద్రియ మార్గములలో ప్రవృత్తి లోనికి పరువెత్తు చుండును. దానిని మరల “తాను - నేను" అను వెలుగు వైపునకు మళ్లించుటకు కావలసినది అనునిత్య అభ్యాసము. పై తెలిపిన విధముగ నియమింప బడుటకు సాధకునకు మిక్కిలి ఓర్పు, సహనము కావలెను. సాధకుని స్ఫూర్తిని బట్టి అతని యందు మరియొక చిత్త ముద్భవించును. అట్టి నూతన చిత్తమునకు బలమేర్పడుటకే అనునిత్య అభ్యాసము. 🍀

యదా వినియతం చిత్తమాత్మన్యే వావతిష్ఠతే |
నిస్పృహ స్సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా || 18

వినియతమైన చిత్తము ఎప్పుడును ఆత్మయందే తిష్ఠ వైచి యుండునపుడు సర్వకామమలు నిస్పృహ చెందును. అట్లు చెందుట వలన యోగసాధకుడు, యోగ యుక్తుడగు చున్నాడు. సామాన్యముగ పరిపరి విధముల పోవు చిత్తమును నిర్దిష్టముగ ఒకే విషయమున నుంచుట ముందు తెలుపబడినది.

చిత్తమును నియమింపుము అని ముందు శ్లోకములలో తెలుపుట జరిగినది. చిత్తమును దేనిపై నియమింపవలెను? ధ్యాన సమయమున తాను, నేను అను వెలుగు పై తన లోపల నొకచోట నియమింపవలెను.

అట్లు నియమించుట హృదయమునందు గాని, భ్రూమధ్యము నందు గాని చేయవలెను. ఇట్లు ఏకాగ్రతతో చిత్తము ఒక నిర్దిష్ట కేంద్రమున నియమించుటకు వలసిన అనుగుణములను ముందు శ్లోకములలో వివరించుట జరిగినది.

అభ్యాస వశమున చిత్తము పరిపరి విధముల ఇంద్రియ మార్గములలో ప్రవృత్తి లోనికి పరువెత్తు చుండును. దానిని మరల “తాను - నేను" అను వెలుగు వైపునకు మళ్లించు అభ్యాసము మరియొకటి నేర్వవలెను. ఇది అభ్యాస మగువరకు తిప్పలు తప్పవు. నిత్య పరిశ్రమ అభ్యాసమును కూర్చగలదు. అంతరంగమున చిత్తము పూర్తిగ, స్థిరముగ నేనను వెలుగునందు తిష్ఠ వేయుట ఈ శ్లోకమున చెప్పబడినది.

దానికి వలసినది అనునిత్య అభ్యాసము. ప్రతిదినము రెండు మార్లుగాని, మూడు మార్లుగాని ఈ అభ్యాసము చేయవలెనని పెద్దలు తెలుపుదురు. త్రిసంధ్యలు అట్టి అభ్యాసమునకు అనుకూలమగు కాలమని కూడ పెద్దలు తెలిపిరి. ఇంద్రియ ప్రవృత్తులలో తిరుగుట నేర్చిన చిత్తము, పై తెలిపిన విధముగ నియమింపబడుటకు సాధకునకు మిక్కిలి ఓర్పు, సహనము కావలెను. జన్మల తరబడి బహిరంగమున తిరుగాడెడి చిత్తమును నిర్దిష్టముగ నొకచోట నుంచుట పరిశ్రమతో కూడినది.

తిరుగుబోతు స్వచ్ఛందముగ నింటనుండుట సాధ్యమా! గ్రామ వీధుల తిరుగాడు గ్రామసింహము (ఊరకుక్క) ఒక చోట నుండుట కిష్టపడునా! సాధకుని స్ఫూర్తిని బట్టి అతని యందు మరియొక

చిత్తము ఉద్భవించును. అట్టి నూతన చిత్తమునకు బల మేర్పడుటకే అనునిత్య అభ్యాసము.

స్ఫూర్తికి కారణము దైవ సంకల్పము. దైవ సంకల్పమే నూతన స్ఫూర్తిగ భాసించును. అదియే నూతన చిత్తము. ఈ చిత్తమును దైవారాధన ద్వారా, నిత్య అభ్యాసముద్వారా బలపరచుకొనుట సాధకుని కర్తవ్యము. సత్సాంగత్యము, సత్కర్మాచరణము, సద్గుణోపాసన, సదౌష్టి ఈ చిత్తమునకు బలమీయగలవు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

25 Mar 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 52 / Sri Lalita Sahasranamavali - Meaning - 52

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 52 / Sri Lalita Sahasranamavali - Meaning - 52 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 52. సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా ।
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ॥ 52 ॥ 🍀

🍀 199. సర్వశక్తిమయీ -
సర్వశక్తి స్వరూపిణి.

🍀 200. సర్వమంగళా -
సర్వమంగళ స్వరూపిణి.

🍀 201. సద్గతి ప్రదా -
మంచి మార్గమును ఇచ్చునది.

🍀 202. సర్వేశ్వరీ -
జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి.

🍀 203. సర్వమయీ -
సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది.

🍀 204. సర్వమంత్ర స్వరూపిణీ -
అన్ని మంత్రములును తన స్వరూపముగా గలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 52 🌹

📚. Prasad Bharadwaj

🌻 52. sarvaśaktimayī sarva-maṅgalā sadgatipradā |
sarveśvarī sarvamayī sarvamantra-svarūpiṇī || 52 || 🌻

🌻 199 ) Sarva shakthi mayi -
She who has personification of all strengths

🌻 200 ) Sarva mangala -
She who is personification of all that is good

🌻 201 ) Sad gathi prada -
She who gives us good path

🌻 202 ) Sarveshwari -
She who is goddess of all

🌻 203 ) Sarva mayi -
She who is everywhere

🌻 204 ) Sarva manthra swaroopini -
She who is personification of all manthras

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

25 Mar 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 197

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 197 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 734. పంచ గోళములు 🌻

734. పంచ గోళములు

1. భౌతిక గోళము , 2. సూక్ష్మ గోళము, 3. మానసిక గోళము, 4. సంయుక్త గోళము, 5. సత్యగోళము

ఇవి అన్నియు పరస్పర సంబంధ గోళములు.

735. సంయుక్త గోళము:

ఇది 21 అంతర్గోళములతో కూడి ఉన్నది. ఒక అర్ధములో ఇది యొక గోళము. మరియొక అర్థములో అసలు గోళమే కాదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

25 Mar 2021

శ్రీ శివ మహా పురాణము - 375

🌹 . శ్రీ శివ మహా పురాణము - 375 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 11

🌻. హిమవంతునితో శివుని సమాగమము - 3 🌻

ఓ పర్వత రాజా! నాతపస్సు ఇచట ఇపుడు అన్ని విధములా నిర్విఘ్నముగా కొనసాగునట్లు మంచి యత్నమును చేయుము (30). ఓ పర్వత శ్రేష్ఠమా ! నీవు నాకు చేయగల గొప్ప సేవ ఇదియే. కావున, ఆ కార్యమును ప్రయత్న పూర్వకముగా చేయుము. ఇప్పుడు ఆనందముతో ఇంటికి మరలుము (31).

బ్రహ్మ ఇట్లు పలికెను-

గొప్ప లీలలను ప్రకటించు వాడు జగన్నాథుడు అగు ఆ శివుడిట్లు పలికి మిన్నకుండెను. అపుడా పర్వత రాజు శంభునితో స్నేహపూర్వకముగా నిట్లనెను (32).

హిమవంతుడిట్లు పలికెను-

ఓ జగత్ప్రభో! పరమేశ్వరా! నేను ఈనాడు నిన్ను పూజించితిని. ఈ ప్రదేశమునకు నేను నిన్ను ఈనాడు స్వాగతము చెప్పుచున్నాను. నా ప్రదేశమునందున్న నిన్ను నేను ఏమి కోరెదను? (33) ఓ మహేశ్వరా! మహాయత్నముతో గొప్ప తపస్సు చేసిన దేవతలకు కూడ దర్శనము నీయని నీవు స్వయముగా ఇచటకు వచ్చితివి (34). నా కంటె గొప్ప పుణ్యాత్ముడు మరియొకడు ఉండబోడు. ఏలయన, నీవు నాశిఖరముపై తపస్సు కొరకు విచ్చేసితివి (35). ఓ పరమేశ్వరా! నీవు గణములతో కూడి ఇచటకు వచ్చి నన్ను అనుగ్రహించుటచే, నేను దేవేంద్రుని కంటె అధికుడనైతినని భావించుచున్నాను (36).

ఓ దేవదేవా! నీవు స్వతంత్రుడవు. ఇచట నిర్విఘ్నముగా గొప్ప తపస్సును చేసుకొనుము. అట్టి సేవను నేను నీకు చేయగలను. హే ప్రభో! నేను నీకు సర్వదా దాసుడను (37).

బ్రహ్మ ఇట్లు పలికెను-

పర్వత రాజు ఇట్లు పలికి వెంటనే తన గృహమునకు వచ్చి ఆ వృత్తాంతమును తన ప్రియురాలికి మిక్కిలి ఆదరముతో వివరించి చెప్పెను (38). ఓ నారదా! ఆ పర్వత రాజు తనతో వచ్చిన సేవకులను, ఇతర గణములను అందరినీ పిలిచి వారితో నిశ్చయముగా నిట్లు చెప్పెను (39).

హిమవంతుడిట్లు పలికెను-

ఈనాటినుండి ఏవ్వరైననూ నా శాసనముచే ఈ గంగావతరణమనే నా శిఖరమునకు వచ్చుట నిషేధింపబడినది. నేను సత్యమును పలుకుచున్నాను (40). అచటకు ఎవరైననూ వెళ్లినచో, అట్టి పరమదుర్మార్గుని తీవ్రముగా దండించగలను. నేను సత్యమును పలుకుచున్నాను (41). ఓ మహర్షీ ! ఆ పర్వతరాజు ఈ తీరున తన గణములన్నింటినీ శాసించి, శివుని ఏకాంతమునకు మంచి ఏర్పాటును చేసెను. ఆ వివరములను చెప్పెదను. నీవు వినుము (42).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందలి పార్వతీ ఖండలో శివశైలసమాగమ వర్ణనమనే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

25 Mar 2021

25-MARCH-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 175🌹  
2) 🌹. శివ మహా పురాణము - 375🌹 
3) 🌹 Light On The Path - 124🌹
4) 🌹 Seeds Of Consciousness - 322🌹   
5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 197🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 52 / Lalitha Sahasra Namavali - 52🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 52 / Sri Vishnu Sahasranama - 52🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -175 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 18 - 1

*🍀 18. నూతన చిత్తము - 1 - చిత్తమును దేనిపై నియమింపవలెను? ధ్యాన సమయమున తాను, నేను అను వెలుగు పై తన లోపల నొకచోట నియమింపవలెను. అట్లు నియమించుట హృదయము నందు గాని, భ్రూమధ్యము నందు గాని చేయవలెను. అభ్యాస వశమున చిత్తము పరిపరి విధముల ఇంద్రియ మార్గములలో 
ప్రవృత్తి లోనికి పరువెత్తు చుండును. దానిని మరల “తాను - నేను" అను వెలుగు వైపునకు మళ్లించుటకు కావలసినది అనునిత్య అభ్యాసము. పై తెలిపిన విధముగ నియమింప బడుటకు సాధకునకు మిక్కిలి ఓర్పు, సహనము కావలెను. సాధకుని స్ఫూర్తిని బట్టి అతని యందు మరియొక చిత్త ముద్భవించును. అట్టి నూతన చిత్తమునకు బలమేర్పడుటకే అనునిత్య అభ్యాసము. 🍀*

యదా వినియతం చిత్తమాత్మన్యే వావతిష్ఠతే |
నిస్పృహ స్సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా || 18

వినియతమైన చిత్తము ఎప్పుడును ఆత్మయందే తిష్ఠ వైచి యుండునపుడు సర్వకామమలు నిస్పృహ చెందును. అట్లు చెందుట వలన యోగసాధకుడు, యోగ యుక్తుడగు చున్నాడు. సామాన్యముగ పరిపరి విధముల పోవు చిత్తమును నిర్దిష్టముగ ఒకే విషయమున నుంచుట ముందు తెలుపబడినది.

చిత్తమును నియమింపుము అని ముందు శ్లోకములలో తెలుపుట జరిగినది. చిత్తమును దేనిపై నియమింపవలెను? ధ్యాన సమయమున తాను, నేను అను వెలుగు పై తన లోపల నొకచోట నియమింపవలెను. 

అట్లు నియమించుట హృదయమునందు గాని, భ్రూమధ్యము నందు గాని చేయవలెను. ఇట్లు ఏకాగ్రతతో చిత్తము ఒక నిర్దిష్ట కేంద్రమున నియమించుటకు వలసిన అనుగుణములను ముందు శ్లోకములలో వివరించుట జరిగినది.

అభ్యాస వశమున చిత్తము పరిపరి విధముల ఇంద్రియ మార్గములలో ప్రవృత్తి లోనికి పరువెత్తు చుండును. దానిని మరల “తాను - నేను" అను వెలుగు వైపునకు మళ్లించు అభ్యాసము మరియొకటి నేర్వవలెను. ఇది అభ్యాస మగువరకు తిప్పలు తప్పవు. నిత్య పరిశ్రమ అభ్యాసమును కూర్చగలదు. అంతరంగమున చిత్తము పూర్తిగ, స్థిరముగ నేనను వెలుగునందు తిష్ఠ వేయుట ఈ శ్లోకమున చెప్పబడినది. 

దానికి వలసినది అనునిత్య అభ్యాసము. ప్రతిదినము రెండు మార్లుగాని, మూడు మార్లుగాని ఈ అభ్యాసము చేయవలెనని పెద్దలు తెలుపుదురు. త్రిసంధ్యలు అట్టి అభ్యాసమునకు అనుకూలమగు కాలమని కూడ పెద్దలు తెలిపిరి. ఇంద్రియ ప్రవృత్తులలో తిరుగుట నేర్చిన చిత్తము, పై తెలిపిన విధముగ నియమింపబడుటకు సాధకునకు మిక్కిలి ఓర్పు, సహనము కావలెను. జన్మల తరబడి బహిరంగమున తిరుగాడెడి చిత్తమును నిర్దిష్టముగ నొకచోట నుంచుట పరిశ్రమతో కూడినది.

తిరుగుబోతు స్వచ్ఛందముగ నింటనుండుట సాధ్యమా! గ్రామ వీధుల తిరుగాడు గ్రామసింహము (ఊరకుక్క) ఒక చోట నుండుట కిష్టపడునా! సాధకుని స్ఫూర్తిని బట్టి అతని యందు మరియొక
చిత్తము ఉద్భవించును. అట్టి నూతన చిత్తమునకు బల మేర్పడుటకే అనునిత్య అభ్యాసము. 

స్ఫూర్తికి కారణము దైవ సంకల్పము. దైవ సంకల్పమే నూతన స్ఫూర్తిగ భాసించును. అదియే నూతన చిత్తము. ఈ చిత్తమును దైవారాధన ద్వారా, నిత్య అభ్యాసముద్వారా బలపరచుకొనుట సాధకుని కర్తవ్యము. సత్సాంగత్యము, సత్కర్మాచరణము, సద్గుణోపాసన, సదౌష్టి ఈ చిత్తమునకు బలమీయగలవు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 375🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 11

*🌻. హిమవంతునితో శివుని సమాగమము - 3 🌻*

ఓ పర్వత రాజా! నాతపస్సు ఇచట ఇపుడు అన్ని విధములా నిర్విఘ్నముగా కొనసాగునట్లు మంచి యత్నమును చేయుము (30). ఓ పర్వత శ్రేష్ఠమా ! నీవు నాకు చేయగల గొప్ప సేవ ఇదియే. కావున, ఆ కార్యమును ప్రయత్న పూర్వకముగా చేయుము. ఇప్పుడు ఆనందముతో ఇంటికి మరలుము (31). 

బ్రహ్మ ఇట్లు పలికెను-

గొప్ప లీలలను ప్రకటించు వాడు జగన్నాథుడు అగు ఆ శివుడిట్లు పలికి మిన్నకుండెను. అపుడా పర్వత రాజు శంభునితో స్నేహపూర్వకముగా నిట్లనెను (32).

హిమవంతుడిట్లు పలికెను-

ఓ జగత్ప్రభో! పరమేశ్వరా! నేను ఈనాడు నిన్ను పూజించితిని. ఈ ప్రదేశమునకు నేను నిన్ను ఈనాడు స్వాగతము చెప్పుచున్నాను. నా ప్రదేశమునందున్న నిన్ను నేను ఏమి కోరెదను? (33) ఓ మహేశ్వరా! మహాయత్నముతో గొప్ప తపస్సు చేసిన దేవతలకు కూడ దర్శనము నీయని నీవు స్వయముగా ఇచటకు వచ్చితివి (34). నా కంటె గొప్ప పుణ్యాత్ముడు మరియొకడు ఉండబోడు. ఏలయన, నీవు నాశిఖరముపై తపస్సు కొరకు విచ్చేసితివి (35). ఓ పరమేశ్వరా! నీవు గణములతో కూడి ఇచటకు వచ్చి నన్ను అనుగ్రహించుటచే, నేను దేవేంద్రుని కంటె అధికుడనైతినని భావించుచున్నాను (36).

ఓ దేవదేవా! నీవు స్వతంత్రుడవు. ఇచట నిర్విఘ్నముగా గొప్ప తపస్సును చేసుకొనుము. అట్టి సేవను నేను నీకు చేయగలను. హే ప్రభో! నేను నీకు సర్వదా దాసుడను (37).

బ్రహ్మ ఇట్లు పలికెను-

పర్వత రాజు ఇట్లు పలికి వెంటనే తన గృహమునకు వచ్చి ఆ వృత్తాంతమును తన ప్రియురాలికి మిక్కిలి ఆదరముతో వివరించి చెప్పెను (38). ఓ నారదా! ఆ పర్వత రాజు తనతో వచ్చిన సేవకులను, ఇతర గణములను అందరినీ పిలిచి వారితో నిశ్చయముగా నిట్లు చెప్పెను (39). 

హిమవంతుడిట్లు పలికెను-

ఈనాటినుండి ఏవ్వరైననూ నా శాసనముచే ఈ గంగావతరణమనే నా శిఖరమునకు వచ్చుట నిషేధింపబడినది. నేను సత్యమును పలుకుచున్నాను (40). అచటకు ఎవరైననూ వెళ్లినచో, అట్టి పరమదుర్మార్గుని తీవ్రముగా దండించగలను. నేను సత్యమును పలుకుచున్నాను (41). ఓ మహర్షీ ! ఆ పర్వతరాజు ఈ తీరున తన గణములన్నింటినీ శాసించి, శివుని ఏకాంతమునకు మంచి ఏర్పాటును చేసెను. ఆ వివరములను చెప్పెదను. నీవు వినుము (42).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందలి పార్వతీ ఖండలో శివశైలసమాగమ వర్ణనమనే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 124 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 17 🌻*

470. The differences at these levels are sufficiently great to warrant such a classification. On the physical plane everything depends very much upon its form, and that is also true in the astral and lower mental worlds. At the level of the causal body, though it is not quite true that we are without form, at least the forms are different and more direct. The thought of the causal body is like a flash of lightning darting directly to its object; instead of making a definite separated form, it is simply an out-rush, straight ‘to the object, of the impulse which the thought has given.

471. When we rise above that to the buddhic we reach a condition which, as I have explained before, can hardly be described in words. There the thought of each person is a pulsation of the whole plane, so that every person at that level enfolds within himself the thought of all the others and can learn from it and can experience through it, as it were. One cannot hope to make it very clear; one can only suggest.

472. It is well for us to try to understand those higher states. Almost the only way in which we can do this is by the method adopted in the Hindu books, which is always a negation. 

They do not describe a state of consciousness; they gradually eliminate all the things that it is not. After doing that, if we can manage to retain a sort of sublimated essence of the thought of the thing, we are coming a little nearer to what it really is. The followers of the Buddha often asked: “What is nirvana?”, or sometimes they would say: “Is nirvana, or is it not?” – that is to say, has it an existence, or has it not? 

The Buddha on one occasion answered: “Nirvana is; beyond a doubt it exists, and yet if you ask me if it is, I can only say that it is neither a state of being nor of not-being in the sense in which you understand those words.” Perhaps even He could not make it clear to us at our level. In our own far smaller way we have the same kind of experience. 

I can bear witness that when one develops the buddhic consciousness and uses it, much which we now cannot make clear becomes absolutely plain; but the moment one drops back from that condition of consciousness one can no longer express that which one has understood. That it is not readily to be expressed is shown by the fact that the Buddha Himself, so very much greater, was yet unable to put it into words to be understood down here, except by negatives.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 322 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 171. Waking, dreaming and deep sleep states pertain only to the 'I am', you are above these..🌻*

The three states of waking, dreaming and deep sleep that all of us commonly experience are in fact based on the 'I am' or the 'Turiya', the fourth state. 

Different ways of similar fourfold classification are found abundantly in ancient literature, these are: the four bodies (gross, subtle, causal and supra-causal) or the four forms of 'Vani' or Speech ('Vaikhari'=spoken word, 'Madhyama'=tangible word in thought, 'Pashyanti'= intangible word in formation and 'Para'=source word). 

Whichever way we may describe these states, your true natural Absolute or 'Parabrahman' state is above all these. The 'I am' or 'Turiya' only appears on the Absolute and leads to the other three states and experience of the world.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 197 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 734. పంచ గోళములు 🌻*

734. పంచ గోళములు

1. భౌతిక గోళము , 2. సూక్ష్మ గోళము, 3. మానసిక గోళము, 4. సంయుక్త గోళము, 
5. సత్యగోళము

ఇవి అన్నియు పరస్పర సంబంధ గోళములు.

735. సంయుక్త గోళము:
ఇది 21 అంతర్గోళములతో కూడి ఉన్నది. ఒక అర్ధములో ఇది యొక గోళము. మరియొక అర్థములో అసలు గోళమే కాదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
#భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/
Join and Share 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 52 / Sri Lalita Sahasranamavali - Meaning - 52 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 52. సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా ।*
*సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ॥ 52 ॥ 🍀*

🍀 199. సర్వశక్తిమయీ - 
సర్వశక్తి స్వరూపిణి.

🍀 200. సర్వమంగళా - 
సర్వమంగళ స్వరూపిణి.

🍀 201. సద్గతి ప్రదా - 
మంచి మార్గమును ఇచ్చునది.

🍀 202. సర్వేశ్వరీ - 
జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి.

🍀 203. సర్వమయీ - 
సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది.

🍀 204. సర్వమంత్ర స్వరూపిణీ - 
అన్ని మంత్రములును తన స్వరూపముగా గలది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 52 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 52. sarvaśaktimayī sarva-maṅgalā sadgatipradā |*
*sarveśvarī sarvamayī sarvamantra-svarūpiṇī || 52 || 🌻*

🌻 199 ) Sarva shakthi mayi -   
She who has personification of all strengths

🌻 200 ) Sarva mangala -   
She who is personification of all that is good

🌻 201 ) Sad gathi prada -   
She who gives us good path

🌻 202 ) Sarveshwari -   
She who is goddess of all

🌻 203 ) Sarva mayi -   
She who is everywhere

🌻 204 ) Sarva manthra swaroopini -   
She who is personification of all manthras

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and Share 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 52 / Sri Vishnu Sahasra Namavali - 52 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*🌻 52. గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః |*
*ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ‖ 52 ‖ 🌻*

*కన్యా రాశి- హస్త నక్షత్రం 4వ పాద శ్లోకం* 

🍀. గభస్తినేమి: - 
మయూఖ చక్రమునకు కేంద్రమైనవాడు.

🍀. సత్వస్థ: - 
అందరిలో నుండువాడు.

🍀. సింహ: - 
సింహమువలె పరాక్రమశాలియైనవాడు.

🍀. భూతమహేశ్వర: - 
సర్వ భూతములకు ప్రభువైనవాడు.

🍀. ఆదిదేవ: - 
తొలి దేవుడు.

🍀. మహాదేవ: - 
గొప్ప దేవుడు.

🍀. దేవేశ: - 
దేవదేవుడు.

🍀. దేవభృద్గురు: - 
దేవతల ప్రభువైన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 52🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Kanya Rasi, Hasta 4rd Padam*

*🌻 52. gabhastinemiḥ sattvasthaḥ siṁhō bhūtamaheśvaraḥ |*
*ādidevō mahādevō deveśō devabhṛdguruḥ || 52 ||*

🌻 Gabhastinemiḥ: 
He who dwells in the middle of Gabhasti or rays as the Sun.

🌻 Sattvasthaḥ: 
One who dwells specially in sattvaguna, which is luminous by nature.

🌻 Simhaḥ: 
One who ahs irresistible power like a lion.

🌻 Bhūtamaheśvaraḥ: 
The supreme Lord of all beings.

🌻 Ādidevaḥ: 
He who is the first of all beings.

🌻 Mahādevaḥ: 
One whose greatness consists in His supreme self-knowledge.

🌻 Deveśaḥ: 
One who is the lord of all Devas, being the most important among them.

🌻 Devabhṛd-guruḥ: 
Indra who governs the Devas is Devabhrut. The Lord is even that Indra's controller (Guru).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹