బ్రహ్మ విద్య Braham Vidya


☘️☘️. బ్రహ్మ విద్య ☘️☘️

🍁🍁. హంస యొక్క వివరణ🍁🍁


ఈశ్వర ఉవాచ :

జీవి చాలా జన్మలందు చేసిన కర్మ ఫలితములగు సుఖదుః ఖాదులనను భవించుటకై మళ్ళీ భువిపై జన్మించి , ఈ కర్మలను తొలగించుకోలేక , మాయలోబడి మళ్ళీ జన్మకు వచ్చి కలిమాయచే మళ్ళీ ఆ పనులు చేయుచూ ఆయా కర్మల ఫలితాన్ని అనుభవిస్తారు . బ్రహ్మ మొదలగు దేవతలే గాక పరమేశ్వరుడయినా కర్మఫలితమనుభవించక తప్పదు . భూమిపై చేయు యీ పనులన్నియూ సుఖము , దుఃఖము ఒకటిగా తలంచి వీటినినాశనంచేయాలని ఆత్మనిశ్చయుడై , మంచి పనులు చెడ్డపనులు రెంటినీ చేయకుండుటచే గతకర్మలన్నియూ తగలబడిపోవును . ఎట్లాగంటే కాలిన బట్టలో ఏమీ మిగలనట్లుగా . సత్వరజో , తమోగుణములు , శరీరభోగములు , పుత్రేషణయు , జ్ఞాన మార్గములు గావు . వీటిని వీడుటయే సత్వము , అనగా జ్ఞానమునకు యోగసాధన మూలముగావున అన్ని భ్రాంతులను వీడిన తత్వబోధసాధన ఫలిస్తుంది సుమా .

పార్వతీ అనేక జన్మంబుల నుండి సంపాదించి కర్మలను వదిలించుకోలేక , వాటి ఫలితంబుగా అనేకకోట్ల జన్మలెత్తుచూ పూర్వజన్మల ఫలితములను భవించుచూ , బహుజన్మంబులజిక్కు వడునదియే ఆగామియందురు . దీనిని విడువక కలసియుండునదే సంచితమందురు . తాను చేసుకున్న కర్మతానను భవించునది ప్రారబ్ధమందురు . కావున ఈ మూడు జీవి అనుభవించుటే త్రివిధకర్మలందురు . యివి ఎట్లా నశిస్థాయంటే ?

తామరాకుకునీరంటనట్లుగా ఈ జనప్రపంచము నందుండి ఉండనట్లు జీవించు మహనీయులైన , హంసావధూత , సంయమ , యోగీశ్వరులకు సేవలు చేయుచూ అన్నవస్త్రములొసంగి రక్షించువారికి ఆ మహానుభావులు చేయు పుణ్యములు వీరులకు ప్రాప్తించి , పాపములు తొలగికర్మ విముక్తులగుదురు . అట్టి వారిని దూషించి తిరస్కరించువారికి ఆ మహనీయులకు గల దోషములు వీరలకు సంక్రమించి , వీరికి ముందుగలపాపములు కోటిరెట్లధికమై . ఆ కర్మలనను భవించుచుందురు . అట్టి దూషకుడగు దీనుడు మహానరకములనుభవించు చుండును . మరియు పార్వతీనిన్ను నన్నును సేవించిన హంసావధూత , సంయమయోగీశ్వరులైన వారికి ఎట్టిపుణ్యపాపములు చెందక నిర్మలులైనాయందు ఐక్యంబునొందియనేకమన్వంతరములుండి సుఖభోగా నందము గల బ్రహ్మము నొందెదరు . నాయందు శాశ్వతముగ నుండునట్టి వారలకు కర్మ రహితంబై , అన్ని కర్మలు కాల్చబడి భస్మంబుకాగలదనగా ఆ పార్వతి యిట్లనియే .


🌷. నధా హంసలు శరీరమందు తిరుగుదారి . వాటి రూపము , దానివలన కలుగు ఫలితములు యిప్పుడు చెప్పండి , దేహమందలి తత్వాలను ఎలా శోధించాలో ఎలా కనిపెట్టాలో చెప్పండి . ? 🌷

ఈశ్వర ఉవాచ :


కంసాలి చేతితో వాడే కత్తిర ఆకారము హంస స్వరూపము కాళ్ళు , కీళ్ళు , మూతి కలిగి ఉంటాయి . క్రిందికాలు మొదలుకొని పై ముక్కు చివర వరకు లోనా బయట 12 అంగుళాల పొడవున , ముక్కు కుడి ఎడమ రంధ్రాల ద్వారా తిరుగును యిలా తీసుకున్న 12 అంగుళాల శ్వాసలో 4 అంగుళాలు బయటకు వదిలి 8 అంగుళాలుమాత్రమే లోపలకు తీసుకుంటుంది . యిలా రేయింబవళ్ళు తక్కువ ఎక్కువలతో తిరుగుచూ , శరీరమందలి తత్వములతో కలసి ఒక్కోసమయంలో ఒక్కోరకములు ఉశ్వాస , నిశ్వాసలు , జరుగుతూ , కాలాన్ని గడుపుతూ “ దేహికి ” ఆయుః ప్రమాణము ఊపిరిని తీసుకుని విడుచు లెక్కల ప్రకారం ఉంటుంది .

24 నిముషములకొకసారి “ జీవి ” శరీరమందలి తత్వము సంచరించి మరల రెండు కనుల మధ్య ముక్కుపై భాగమున గల భ్రూమధ్యన మారి , మరల వేరుతత్వము చేరును . ఆ ప్రకారం జీవుడు తానుచేయగల బ్రహ్మవిద్యను ప్రకృతి మాయలో పడిచేయక , విరాట్ స్వరూపాన్ని చూడలేక ప్రపంచములో శరీరమే శాశ్వతమని భావించుతారు . యిది మహా అద్భుతముసుమా .

సాధకుడు భ్రూమధ్య భాగమున అనేకరకములుగా ప్రయత్నించగా , “ దేవీ నీవు సహకరించితే " శక్తి దేహానికివస్తేలో దృష్టి నిలబడుతుంది . అప్పుడు కాశీ పురమునందు ( భ్రూమధ్య ) మహాకాశాన్ని చూపట్టిన వేళాకోళముకాదు . ఈ చతుర్ధశ భువనములలో వేదాంతవిద్య సులువుకాదు సతీ . నీ సహాయం లేకపోతే సిద్ధించదు .

ఈ పక్షులు ( హంస ) ఐదు రకములు . వీటి రూపములు చాలా రకాలుగా యున్నా , ఆ రూపాన్ని పైన చూపించునొకటి చాలా రకములుగా కంటి దృష్టి నిలిపిన ఆ సుందరదృశ్యం సూటిగా కన్పడును . శ్వాసనిలగట్టి నరుడు ఏ బాధాలేక తత్వపంచకాన్ని మనసునదలచిన , ఆత్మ చేయు బోధ అనుభవాన్ని తాను పొందుతాడు . ఈ జ్ఞానాన్ని పొందటానికి కంటి చూపుకన్నా వేరే దారి లేదు . ఈ హంస ఎవరికీ దొరకదు , చూపునిలబెట్టలేకపోయినా , కన్ను చెదిరినా కావలసిన తత్వమపుడేలేకుండా పోతుంది . చూపుచూచేది దేహంలోపలనే .

మరియూ ఈ హంస ఏ నరునకు దొరుకుతుందో . అట్టి మహనీయుని చరిత్రము లోకంబులకు చిత్రముగాదోచును . ఎలాగంటే వైకృత , ప్రాకృత , సకీలకమనే ప్రాణాయామంబులచేత , ఓడ్యాణ , జాలంధర , మూలబంధములనే ఆసనములతో , ప్రాణ , అపాన , వ్యాన ఉదాన సమాన , నాగ , కూర్మ , కృకర , దేవదత్త , ధనుంజయంబుల నెడు పదివాయువులను స్వాధీనంచేసుకుని , దేహి తను జీవింపదలచినంత కాలము . యముని ఆజ్ఞమేరకు వచ్చెడి భీషణ , రోషణాకారములతో భయంకరములగు యమభటులు చేయు వాదోప వాదములను లెక్కింపక , రెండవ ఈశ్వరుని వలే చలింపక యుండినవానికి అనేక మహత్వంబులు సిద్ధించును .

అవిఏమనగా , “ అణిమాదులు ” అణిమ = అణురూపముగానుండుట . మహిమ = మహత్తులు కలిగియుండుట , గరిమ = గొప్పబరువుగా నుండుట . లఘిమ = దూదివలే తేలికగా యుండుట . ప్రాప్తి = కావలసిన వస్తువులను పొందుట . ప్రకామ్యము = కోరినదిచ్చుట . ఈశత్వము = సమస్తమునకు తానే అధికారియగుట . వశిత్వము = సమస్త భూతజాలమును వశపరచుకొనుట . దేవత్వము = ఆకాశసంచారము . యితరుల భావములు శరీర ధర్మములు తెలియబడుట = , అన్నమాట జరుగుట , ఆశ్చర్యము గొల్పు శక్తి ( కాంతి ) జరిగినది జరగనున్నది చూచుట . గాలిని భుజించుట గొప్ప బలము , యింద్రియ నిగ్రహము , యింకా అనేక మహత్వంబులు సిద్ధించును .


🙏🙏🙏🙏🙏


17 Apr 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 105


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 105 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 83. కృతజ్ఞత -2 🌻

సరాసరి దివ్యప్రేమను అనుసరించుట కుదరదు. ప్రతి స్వల్ప విషయములకు కూడ కృతజ్ఞతే సమాధానము కావలెను. అవి చిన్న సహాయము పొందినను గుర్తుంచుకొనుట ఒక సంస్కారము. మిక్కుట ముగ సహాయము పొంది గుర్తించనివారు పాషండులు. కృతజ్ఞతా భావమును మీ యందు పెంపొందించుకొనుడు.

శరీర మందలి అణువణువును కృతజ్ఞతతో నింపుడు. పంచభూతము లకు, పంచేంద్రియములకు, పంచ ప్రాణములకు, మనస్సునకు, బుద్ధికి, గ్రహతారకలకు, అంతరిక్ష దేవతలకు, పశుపక్ష్యాదులకు, సమస్త ప్రాణికోటికి కృతజ్ఞుడై యుండువాడే ప్రేమానుభూతిని పొందగలడు. అట్టి వాని నుండి ప్రేమ గంగాఝరి వలె ప్రవహించును.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


17 Apr 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 166


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 166 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ


🍀. ఉనికి నించీ నువ్వు వేరయినట్లు భావించకు. కలువు. కలసిపో. కేవలం పరిశీలకుడిగా మాత్రమే వుండకు. మెల్ల మెల్లగా నువ్వు తలుపు తట్టడాన్ని నేర్చుకుంటావు. అనుభవంతో నువ్వు అనంతంలో కలిసిపోయి ఏకత్వాన్ని పొందడం అభ్యసిస్తావు. ఆ అనుభవమే దైవం. 🍀

కేవలం ఒక నదిలాగా సముద్రంలో కలిసి అదృశ్యమయిపో. దైవత్వంలో కలిసిపో. ఉనికి నించీ నువ్వు వేరయినట్లు భావించకు. కలువు. కలసిపో. మరింతగా. మనం ఎప్పుడూ వేరని అంటూ వుంటాం. అది మతానికి సంబంధించిన భావన కాదు. ప్రత్యేకతని, వేరు కావడాన్ని ఎత్తి చూపడం. కలయికని ఒత్తి చెప్పడం మతం. అది చైతన్యం నిండిన ప్రయత్నం. సూర్యాస్తమయాన్ని చూస్తే దాంట్లోకి అదృశ్యంకా.

కేవలం పరిశీలకుడిగా మాత్రమే వుండకు. పరిశీలింపబడేది, పరిశీలింపబడేవాడు ఒకటి కావాలి. మెల్ల మెల్లగా నువ్వు తలుపు తట్టడాన్ని నేర్చుకుంటావు. అప్పుడు చెట్టునానుకుని కూచుని చెట్టులో కలిసిపోయే అనుభూతిని పొందుతావు. ఈ చిన్ని విషయాల అనుభవంతో నువ్వు అనంతంలో కలిసిపోయి ఏకత్వాన్ని పొందడం అభ్యసిస్తావు. ఆ అనుభవమే దైవం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


17 Apr 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 266 - 22. ధ్యానం యొక్క అనుభవం / DAILY WISDOM - 266 - 22. The Experience of Meditation


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 266 / DAILY WISDOM - 266 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 22. ధ్యానం యొక్క అనుభవం 🌻


అంతకుముందు భౌతిక శరీరం లోపల బంధించబడిన చైతన్యం వ్యక్తిత్వం ద్వారా కొంచెం కొంచెం గా ప్రకటించుకుని చివరకు ఆ వ్యక్తిత్వ పరిమితులను చేదించి విశాలంగా ప్రకటించ బడుతుంది. అప్పుడు లోపల ఒక శక్తిని అనుభూతి చెందుతారు. బాహ్య పరిస్థితులపై ఒక నియంత్రణను అనుభూతి చెందుతారు. పొందవలసిన దాన్ని పొందామని, జరగవసింది జరింగిందని, తెలుసుకో బడాల్సింది తెలుసుకున్నామనే తృప్తి అనుభూతి చెందుతారు.

ఇంద్రియాలు శరీరంపై తమ పట్టును వదులుకోవడం ప్రారంభిస్తాయి. కేవలం తమ భౌతిక బాధ్యతలే కాక తమ దివ్య దైవీ బాధ్యతలను తెలుసుకుని దైవీ శక్తి తమ ద్వారా ఆ ధ్యని యొక్క వ్యక్తిత్వంలోకి ప్రవహించే సాధనాలుగా మారతాయి. సూర్యుడు, చంద్రుడు నక్షత్రాలు, ఆకాశం, విశ్వం మరియు కాలం, తాము నిజంగా భౌతిక దూరాలలో లేవని, తమ అంతర్గత సాన్నిహిత్యాన్ని, సకల సృష్టితోను , తన స్వీయ వ్యక్తిత్వం తోను ఉన్న సంబంధాన్ని ధ్యాని ముందుంచుతాయి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 DAILY WISDOM - 266 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 22. The Experience of Meditation 🌻


The consciousness which earlier was locked up within the physical body begins to peep through the apertures of the localised individuality, and beholds itself in persons and things beyond the limits of the single body to which it was shackled. There is then a sense of power felt within, a feeling of control over outer conditions, and a satisfaction that one has obtained what is required to be obtained, done what is to be done, and known what is to be known.

The sense organs begin to loosen their clutches over the body and, loosening themselves from their bodily locations, relate themselves to the divinities behind their operations, becoming thereby channels of the flow of super-physical forces that enter the personality of the meditating individual. The sun and the moon and the stars, the very sky, and all space and time, slowly open up the secret of their really not being situated in large physical distances and of their internal intimacy and organic connection with the very spot and the very personality of the meditating individual.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


17 Apr 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 587 / Vishnu Sahasranama Contemplation - 587


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 587 / Vishnu Sahasranama Contemplation - 587🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 587. శాన్తిదః, शान्तिदः, Śāntidaḥ 🌻


ఓం శాన్తిదాయ నమః | ॐ शान्तिदाय नमः | OM Śāntidāya namaḥ

రాగద్వేషాదినిర్మోక్షలక్షణాం శాన్తిమచ్యుతః ।
దదాతీతి శాన్తిద ఇతి ప్రోక్తో విష్ణుర్బుధైర్వరైః ॥

రాగ, ద్వేషాది దోషములకు అతీతమైనట్టి శాంతి స్థితిని అనుగ్రహించ గలవాడు గనుక ఆ విష్ణువు శాంతిదః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 587🌹

📚. Prasad Bharadwaj

🌻587. Śāntidaḥ🌻


OM Śāntidāya namaḥ

रागद्वेषादिनिर्मोक्षलक्षणां शान्तिमच्युतः ।
ददातीति शान्तिद इति प्रोक्तो विष्णुर्बुधैर्वरैः ॥

Rāgadveṣādinirmokṣalakṣaṇāṃ śāntimacyutaḥ,
Dadātīti śāntida iti prokto viṣṇurbudhairvaraiḥ.

Since He confers Śānti, the state that is characterized by freedom from attachment and aversion etc., Lord Viṣṇu is called Śāntidaḥ.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


17 Apr 2022

17 - APRIL - 2022 ఆదివారం, భాను వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 17, ఏప్రిల్ 2022 ఆదివారం, భాను వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 188 / Bhagavad-Gita - 188 - 4-26 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 587 / Vishnu Sahasranama Contemplation - 587🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 35 / Agni Maha Purana 35🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 266 / DAILY WISDOM - 266 🌹  
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 166 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 105 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 17, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం 🍀*

*1. ఓం ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం*
*సకలభువననేత్రం రత్నరజ్జూపమేయమ్ |*
*తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాం*
*సురవరమభివంద్యం సుందరం విశ్వదీపమ్ ||*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఇతరులను తప్పు పట్టడం ఒక మానసిక రోగం. దీని వలన నష్టమే కానీ లాభం ఉండదు. మొదట మిమ్మల్ని మీరు జయించు కోవడానికి ప్రయత్నం చేయండి. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శఖ : 1944, శుభకృత్‌ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 22:02:48 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: చిత్ర 07:17:56 వరకు
తదుపరి స్వాతి
యోగం: వజ్ర 23:40:47 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: బాలవ 11:13:59 వరకు
వర్జ్యం: 12:28:58 - 13:58:06
దుర్ముహూర్తం: 16:52:07 - 17:42:22
రాహు కాలం: 16:58:24 - 18:32:37
గుళిక కాలం: 15:24:12 - 16:58:24
యమ గండం: 12:15:47 - 13:49:59
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:40
అమృత కాలం: 01:15:24 - 02:45:48
మరియు 21:23:46 - 22:52:54
సూర్యోదయం: 05:58:58
సూర్యాస్తమయం: 18:32:37
చంద్రోదయం: 19:14:39
చంద్రాస్తమయం: 06:18:03
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: తుల
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 07:17:56
వరకు తదుపరి లంబ యోగం 
- చికాకులు, అపశకునం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 188 / Bhagavad-Gita - 188 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 26 🌴*

*26. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి |*
*శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ||*

🌷. తాత్పర్యం :
*కొందరు (నిష్ఠ కలిగిన బ్రహ్మచారులు) శ్రవణాది కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహమనెడి అగ్నియందు హోమము చేయగా, మరికొందరు (నియమితులైన గృహస్థులు) ఇంద్రియార్థములను ఇంద్రియములనెడి అగ్ని యందు అర్పింతురు.*

🌷. భాష్యము :
బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్న్యాసి యను నాలుగు ఆశ్రమముల వారందరును ఉత్తమయోగులు లేదా ఆధ్యాత్మికులు కావలసియున్నది. మానవజన్మ జంతువు వలె ఇంద్రియభోగానుభవము పొందుట కొరకు కానందున మనుజుడు క్రమముగా ఆధ్యాత్మిమికజీవనమందు పరిపూర్ణుడయ్యెడి విధముగా నాలుగు ఆశ్రమములు ఏర్పాటు చేయబడియున్నవి. బ్రహ్మచారులు గురువాశ్రయములో ఇంద్రియభోగము నుండి విడివడుట ద్వారా మనస్సును నిగ్రహించుటకు యత్నింతురు. శ్రవణమనునది అవగాహన కొరకు మూలసూత్రము గనుక బ్రహ్మచారి కేవలము కృష్ణపరములగు వచనములనే శ్రవణము చేయును. 

అనగా అతడు శ్రీకృష్ణభగవానుని లీలల శ్రవణ, కీర్తనములందు సంపూర్ణముగా నిమగ్నుడై యుండును (హరేర్నామాను కీర్తనమ్). హరినామకీర్తనమును (హరేకృష్ణ మాహామంత్రము) మాత్రమే శ్రవణము చేయుచు అతడు ఇతర లౌకిక శబ్దముల నుండి విడివడియుండును. అదే విధముగా ఇంద్రియభోగమునకు అనుమతి కలిగియున్న గృహస్థులు కుడా అట్టి అనుమతిని అతి నియమముతో నిర్యహింతురు. 

మైథునభోగము, మత్తుపదార్థముల స్వీకారము, మాంసభక్షణము లనునవి మానవుల సాధారణ నైజములు. కాని నియమితుడైన గృహస్థుడు అపరిమిత మైథునభోగమునందు మరియు ఇతర ఇంద్రియభోగములందు మగ్నుడు కాకుండును. మైథునజీవనము నియమించునది కావుననే ధర్మసమ్మతమైన వివాహము నాగరికసమాజము నందు వ్యాప్తి నొందియున్నది. నియమితుడైన గృహస్థుడు ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవనము కొరకు తన సాధారణ స్వభావమైన ఇంద్రియప్రీతిని అట్టి నియమితమైన సంగత్వరహిత మైథునజీవనము కూడా ఒక విధమైన యజ్ఞమే అయియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 188 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 26 🌴*

*26. śrotrādīnīndriyāṇy anye saṁyamāgniṣu juhvati*
*śabdādīn viṣayān anya indriyāgniṣu juhvati*

🌷 Translation : 
*Some [the unadulterated brahmacārīs] sacrifice the hearing process and the senses in the fire of mental control, and others [the regulated householders] sacrifice the objects of the senses in the fire of the senses.*

🌹 Purport :
The members of the four divisions of human life, namely the brahmacārī, the gṛhastha, the vānaprastha and the sannyāsī, are all meant to become perfect yogīs or transcendentalists. Since human life is not meant for our enjoying sense gratification like the animals, the four orders of human life are so arranged that one may become perfect in spiritual life. The brahmacārīs, or students under the care of a bona fide spiritual master, control the mind by abstaining from sense gratification. 

A brahmacārī hears only words concerning Kṛṣṇa consciousness; hearing is the basic principle for understanding, and therefore the pure brahmacārī engages fully in harer nāmānukīrtanam – chanting and hearing the glories of the Lord. He restrains himself from the vibrations of material sounds, and his hearing is engaged in the transcendental sound vibration of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa. Similarly, the householders, who have some license for sense gratification, perform such acts with great restraint. 

Sex life, intoxication and meat-eating are general tendencies of human society, but a regulated householder does not indulge in unrestricted sex life and other sense gratification. Marriage on the principles of religious life is therefore current in all civilized human society because that is the way for restricted sex life. This restricted, unattached sex life is also a kind of yajña because the restricted householder sacrifices his general tendency toward sense gratification for higher, transcendental life.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 587 / Vishnu Sahasranama Contemplation - 587🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 587. శాన్తిదః, शान्तिदः, Śāntidaḥ 🌻*

*ఓం శాన్తిదాయ నమః | ॐ शान्तिदाय नमः | OM Śāntidāya namaḥ*

*రాగద్వేషాదినిర్మోక్షలక్షణాం శాన్తిమచ్యుతః ।*
*దదాతీతి శాన్తిద ఇతి ప్రోక్తో విష్ణుర్బుధైర్వరైః ॥*

*రాగ, ద్వేషాది దోషములకు అతీతమైనట్టి శాంతి స్థితిని అనుగ్రహించ గలవాడు గనుక ఆ విష్ణువు శాంతిదః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 587🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻587. Śāntidaḥ🌻*

*OM Śāntidāya namaḥ*

रागद्वेषादिनिर्मोक्षलक्षणां शान्तिमच्युतः ।
ददातीति शान्तिद इति प्रोक्तो विष्णुर्बुधैर्वरैः ॥

*Rāgadveṣādinirmokṣalakṣaṇāṃ śāntimacyutaḥ,*
*Dadātīti śāntida iti prokto viṣṇurbudhairvaraiḥ.*

*Since He confers Śānti, the state that is characterized by freedom from attachment and aversion etc., Lord Viṣṇu is called Śāntidaḥ.*


🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 266 / DAILY WISDOM - 266 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 22. ధ్యానం యొక్క అనుభవం 🌻*

*అంతకుముందు భౌతిక శరీరం లోపల బంధించబడిన చైతన్యం వ్యక్తిత్వం ద్వారా కొంచెం కొంచెం గా ప్రకటించుకుని చివరకు ఆ వ్యక్తిత్వ పరిమితులను చేదించి విశాలంగా ప్రకటించ బడుతుంది. అప్పుడు లోపల ఒక శక్తిని అనుభూతి చెందుతారు. బాహ్య పరిస్థితులపై ఒక నియంత్రణను అనుభూతి చెందుతారు. పొందవలసిన దాన్ని పొందామని, జరగవసింది జరింగిందని, తెలుసుకో బడాల్సింది తెలుసుకున్నామనే తృప్తి అనుభూతి చెందుతారు.*

*ఇంద్రియాలు శరీరంపై తమ పట్టును వదులుకోవడం ప్రారంభిస్తాయి. కేవలం తమ భౌతిక బాధ్యతలే కాక తమ దివ్య దైవీ బాధ్యతలను తెలుసుకుని దైవీ శక్తి తమ ద్వారా ఆ ధ్యని యొక్క వ్యక్తిత్వంలోకి ప్రవహించే సాధనాలుగా మారతాయి. సూర్యుడు, చంద్రుడు నక్షత్రాలు, ఆకాశం, విశ్వం మరియు కాలం, తాము నిజంగా భౌతిక దూరాలలో లేవని, తమ అంతర్గత సాన్నిహిత్యాన్ని, సకల సృష్టితోను , తన స్వీయ వ్యక్తిత్వం తోను ఉన్న సంబంధాన్ని ధ్యాని ముందుంచుతాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 266 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 22. The Experience of Meditation 🌻*

*The consciousness which earlier was locked up within the physical body begins to peep through the apertures of the localised individuality, and beholds itself in persons and things beyond the limits of the single body to which it was shackled. There is then a sense of power felt within, a feeling of control over outer conditions, and a satisfaction that one has obtained what is required to be obtained, done what is to be done, and known what is to be known.*

*The sense organs begin to loosen their clutches over the body and, loosening themselves from their bodily locations, relate themselves to the divinities behind their operations, becoming thereby channels of the flow of super-physical forces that enter the personality of the meditating individual. The sun and the moon and the stars, the very sky, and all space and time, slowly open up the secret of their really not being situated in large physical distances and of their internal intimacy and organic connection with the very spot and the very personality of the meditating individual.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 166 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఉనికి నించీ నువ్వు వేరయినట్లు భావించకు. కలువు. కలసిపో. కేవలం పరిశీలకుడిగా మాత్రమే వుండకు. మెల్ల మెల్లగా నువ్వు తలుపు తట్టడాన్ని నేర్చుకుంటావు. అనుభవంతో నువ్వు అనంతంలో కలిసిపోయి ఏకత్వాన్ని పొందడం అభ్యసిస్తావు. ఆ అనుభవమే దైవం. 🍀*

కేవలం ఒక నదిలాగా సముద్రంలో కలిసి అదృశ్యమయిపో. దైవత్వంలో కలిసిపో. ఉనికి నించీ నువ్వు వేరయినట్లు భావించకు. కలువు. కలసిపో. మరింతగా. మనం ఎప్పుడూ వేరని అంటూ వుంటాం. అది మతానికి సంబంధించిన భావన కాదు. ప్రత్యేకతని, వేరు కావడాన్ని ఎత్తి చూపడం. కలయికని ఒత్తి చెప్పడం మతం. అది చైతన్యం నిండిన ప్రయత్నం. సూర్యాస్తమయాన్ని చూస్తే దాంట్లోకి అదృశ్యంకా. 

కేవలం పరిశీలకుడిగా మాత్రమే వుండకు. పరిశీలింపబడేది, పరిశీలింపబడేవాడు ఒకటి కావాలి. మెల్ల మెల్లగా నువ్వు తలుపు తట్టడాన్ని నేర్చుకుంటావు. అప్పుడు చెట్టునానుకుని కూచుని చెట్టులో కలిసిపోయే అనుభూతిని పొందుతావు. ఈ చిన్ని విషయాల అనుభవంతో నువ్వు అనంతంలో కలిసిపోయి ఏకత్వాన్ని పొందడం అభ్యసిస్తావు. ఆ అనుభవమే దైవం.

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 105 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 83. కృతజ్ఞత -2 🌻*

*సరాసరి దివ్యప్రేమను అనుసరించుట కుదరదు. ప్రతి స్వల్ప విషయములకు కూడ కృతజ్ఞతే సమాధానము కావలెను. అవి చిన్న సహాయము పొందినను గుర్తుంచుకొనుట ఒక సంస్కారము. మిక్కుట ముగ సహాయము పొంది గుర్తించనివారు పాషండులు. కృతజ్ఞతా భావమును మీ యందు పెంపొందించుకొనుడు.*

*శరీర మందలి అణువణువును కృతజ్ఞతతో నింపుడు. పంచభూతము లకు, పంచేంద్రియములకు, పంచ ప్రాణములకు, మనస్సునకు, బుద్ధికి, గ్రహతారకలకు, అంతరిక్ష దేవతలకు, పశుపక్ష్యాదులకు, సమస్త ప్రాణికోటికి కృతజ్ఞుడై యుండువాడే ప్రేమానుభూతిని పొందగలడు. అట్టి వాని నుండి ప్రేమ గంగాఝరి వలె ప్రవహించును.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹