1) 🌹 శ్రీమద్భగవద్గీత - 586 / Bhagavad-Gita - 586 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 182 183 / Vishnu Sahasranama Contemplation - 182, 183🌹
3) 🌹 Daily Wisdom - 6🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 139🌹
5) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 13 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 160🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 84 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 156 / Sri Lalita Chaitanya Vijnanam - 156🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 497 / Bhagavad-Gita - 497🌹
10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 105 🌹
11) 🌹. శివ మహా పురాణము - 303 🌹
12) 🌹 Light On The Path - 57🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 190 🌹
14) 🌹. చేతనత్వ బీజాలు - 254 / Seeds Of Consciousness - 254 🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 129 🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 94 / Sri Vishnu Sahasranama - 94 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 586 / Bhagavad-Gita - 586 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 03 🌴*
03. త్యాజం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ: |
యజ్ఞదానతప:కర్మ న త్యాజ్యమితి చాపరే ||
🌷. తాత్పర్యం :
సర్వకామ్యకర్మలు దోషము వలె త్యాజ్యములని కొందరు విజ్ఞులు పలుకగా, యజ్ఞము, దానము, తపస్సనెడి కర్మలు ఎన్నడును విడువరానివని మరికొందరు మునులు పలుకుదురు.
🌷. భాష్యము :
వేదములందు వివాదాస్పాదములైన పలుకర్మలు కలవు. ఉదాహరణమునకు యజ్ఞమునందు జంతుబలిని ఒసగవచ్చునని తెలుపబడినది. అయినను కొందరు అట్టి బలి యనునవి అత్యంత హేయమని పలుకుదురు. వేదములందు యజ్ఞసమయమున జంతుబలి ఉపదేశింపబడినను వాస్తవమునకు జంతువు వధింపబడినట్లుగా భావింపబడదు. యజ్ఞవిధి జంతువునకు నూతనజన్మను గూర్చగలుగుటయే అందులకు కారణము. యజ్ఞమునందు వధింపబడిన పిమ్మట జంతువుకు కొన్నిమార్లు నూతన జంతుశరీరము కాని లేదా కొన్నిమార్లు వెంటనే మానవజన్మము కాని ఒసగబడుచుండును.
కాని ఈ విషయమున ఋషుల యందు పలు భేదాభిప్రాయములు కలవు. జంతుబలి సర్వదా నిషిద్దమని కొందరు పలుకగా, కొన్ని సమయములందు అది సబబైనదే యని మరికొందరు పలుకుదురు. యజ్ఞకర్మకు సంబంధించిన ఈ భిన్నాభిప్రాయములను శ్రీకృష్ణభగవానుడే స్వయముగా పరిష్కరింపనున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 586 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 03 🌴*
03. tyājyaṁ doṣa-vad ity eke karma prāhur manīṣiṇaḥ
yajña-dāna-tapaḥ-karma na tyājyam iti cāpare
🌷 Translation :
Some learned men declare that all kinds of fruitive activities should be given up as faulty, yet other sages maintain that acts of sacrifice, charity and penance should never be abandoned.
🌹 Purport :
There are many activities in the Vedic literature which are subjects of contention. For instance, it is said that an animal can be killed in a sacrifice, yet some maintain that animal killing is completely abominable. Although animal killing in a sacrifice is recommended in the Vedic literature, the animal is not considered to be killed. The sacrifice is to give a new life to the animal.
Sometimes the animal is given a new animal life after being killed in the sacrifice, and sometimes the animal is promoted immediately to the human form of life. But there are different opinions among the sages. Some say that animal killing should always be avoided, and others say that for a specific sacrifice it is good. All these different opinions on sacrificial activity are now being clarified by the Lord Himself.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 182, 183 / Vishnu Sahasranama Contemplation - 182, 183 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻182. మహీభర్తా, महीभर्ता, Mahībhartā🌻*
*ఓం మహీభర్త్రే నమః | ॐ महीभर्त्रे नमः | OM Mahībhartre namaḥ*
మహీభర్తా, महीभर्ता, Mahībhartā
ఏకార్ణవాప్లుతాం దేవీం మహీం విష్ణుర్బభారయత్ ।
తస్మాదుక్తో మహీ భర్తా పురాణార్థ వివేకిభిః ॥
ప్రళయకాలమున ఎకార్ణవమున అనగా ఏక సముద్రమున (కలిసిపోయి భూమిని ముంచెత్తిన అన్ని సముద్రాలు) ముణిగిపోయిన భూమి దేవిని తన శక్తితో భరించిన విష్ణువు మహీభర్తా అని చెప్పబడును.
:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::
సీ. ఘనుఁడు వైవస్వత మనువుకు దృష్టమై యరుదెంచునట్టి యుగాంతసమయ మందు విచిత్రమత్స్యావతారము దాల్చి యఖిలావనీమయం బగుచుఁ జాల సర్వజీవులకు నాశ్రయభూతుఁ డగుచు నే కార్ణవంబైన తోయముల నడుమ మన్ముఖశ్లథవేదమార్గంబులను జిక్కు వడకుండ శాఖ లేర్పడఁగఁ జేసి తే. దివ్యు లర్థింప నాకర్థిఁ దెచ్చి యిచ్చి, మనువు నెక్కించి పెన్నావ వనధినడుమ మునుఁగకుండంగ నరసిన యనిమిషావ, తార మేరికి నుతియింపఁ దరమే వత్స! (142)
ప్రళయకాలంలో సమస్తమూ జలమయమైపోయింది. ఆ పరిస్థితిని వైవస్వతమనువు ముందే గ్రహించి ఒక పడవపై కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడు విచిత్రమైన మత్స్యావతారమెత్తాడు. భూతలానికి ఆశ్రయమైన ఆ దేవుడప్పుడు ఎల్లప్రాణులకూ నివాసభూతుడైనాడు. నా (బ్రహ్మ) వదనంనుండి జారిపోయిన వేదశాఖలు సంకీర్ణం కాకుండా విభజించి దేవతల కోరికమేరకు మళ్ళీ నాకు ప్రీతితో అందజేశాడు. వైవస్వతమనువు అధిష్ఠించిన నావ సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు. నాయనా! మహనీయమైన ఆ మత్స్యావతారాన్ని వివరించడం ఎవరికి సాధ్యం?
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 182🌹*
📚 Prasad Bharadwaj
*🌻182. Mahībhartā🌻*
*OM Mahībhartre namaḥ*
Ekārṇavāplutāṃ devīṃ mahīṃ viṣṇurbabhārayat,
Tasmādukto mahī bhartā purāṇārtha vivekibhiḥ.
एकार्णवाप्लुतां देवीं महीं विष्णुर्बभारयत् ।
तस्मादुक्तो मही भर्ता पुराणार्थ विवेकिभिः ॥
He who held the earth which got completely submerged under the waters during the great deluge.
Śrīmad Bhāgavata Canto 2, Chapter 7
Matsyo yugāntasamaye manunopalabdhaḥ
Kṣoṇīmayo nikhilajīvanikāyaketaḥ,
Vistraṃsitānurubhaye salile mukhānme
Ādāya tatra vijahāra ha vedamārgān. (12)
:: श्रीमद्भागवते द्वितीय स्कन्धे सप्तमोऽध्यायः ::
मत्स्यो युगान्तसमये मनुनोपलब्धः
क्षोणीमयो निखिलजीवनिकायकेतः ।
विस्त्रंसितानुरुभये सलिले मुखान्मे
आदाय तत्र विजहार ह वेदमार्गान् ॥ १२ ॥
At the end of the millennium, the would-be Vaivasvata Manu, of the name Satyavrata, would see that the Lord in the fish incarnation is the shelter of all kinds of living entities, up to those in the earthly planets. Because of my fear of the vast water at the end of the millennium, the Vedas come out of my (Brahmā's) mouth, and the Lord enjoys those vast waters and protects the Vedas.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥
Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 183 / Vishnu Sahasranama Contemplation - 183🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻183. శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥ🌻*
*ఓం శ్రీనివాసాయ నమః | ॐ श्रीनिवासाय नमः | OM Śrīnivāsāya namaḥ*
శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥయస్య వక్షసినిత్యం శ్రీర్నివసత్యనపాయినీ ।
సవైకుంఠః శ్రీనివాస ఇతి ప్రోక్తో మహాత్మభిః ॥
వాసము అనగా వసించు స్థలము. నిత్యము వసించు చోటు నివాసము. శ్రీ అనగా లక్ష్మికి నిత్యము ఎవని వక్షము చోటగునో ఆ విష్ణువు శ్రీనివాసః అని చెప్పబడును.
:: పోతన భాగవతము - పంచమ స్కంధము, ప్రథమ ఆశ్వాసము ::
సీ.అంత నావిష్కృత కాంత చతుర్భుజంబులును బీతాంబరంబును వెలుంగ
శ్రీవత్సకౌస్తుభ శ్రీరమా చిహ్నంబు లురమందు రమ్యమై యిరవు పడఁగ
శంఖ చక్రగదాంబుజాత ఖడ్గాది దివ్యాయుధంబులు సేతులందు మెఱయ
నతులిత నవ రత్నహాట కాంకిత నూత్న ఘనకిరీటద్యుతుల్ గడలుకొనఁగఁతే.గర్ణ కుండల కటి సూత్ర కనకరత్న, హారకేయూర వర నూపురాది భూషణముల భూషితుఁడైన శ్రీనాయకుండు, దంపతుల కప్పు డెదురుఁ బ్రత్యక్షమయ్యె. (43)
ప్రకాశమానములైన చతుర్భుజాలతో, పట్టుపీతాంబరంతో, రమణీయమయిన శ్రీవత్సం కౌస్తుభమణి, శ్రీదేవి విరాజిల్లే వక్షఃస్థలంతో, శంఖం, చక్రం, గద, పద్మం, ఖడ్గం మొదలయిన దివ్యాయుధాలతో; సాటిలేని నవరత్నాల కాంతుల వెదజల్లే బంగారు కిరీటంతో; మకర కుండలాలూ, మొలనూలూ, మణులు చెక్కిన స్వర్ణహారాలూ; బాహుపురులూ, కాలి అందెలూ ప్రకాశింపగా లక్ష్మీనారాయణుడు ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైనాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 183🌹*
📚 Prasad Bharadwaj
*🌻183. Śrīnivāsaḥ🌻*
*OM Śrīnivāsāya namaḥ*
Yasya vakṣasinityaṃ śrīrnivasatyanapāyinī,
Savaikuṃṭhaḥ śrīnivāsa iti prokto mahātmabhiḥ.
यस्य वक्षसिनित्यं श्रीर्निवसत्यनपायिनी ।
सवैकुंठः श्रीनिवास इति प्रोक्तो महात्मभिः ॥
Vāsa is place of living. Nivāsa is such a place where one dwells. Śrī the goddess Lakṣmi has made His chest her permanent abode and hence He is called Śrīnivāsaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥
Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 5 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 5. The Supreme Silence 🌻*
The delight of the Self is the delight of Being. It is the Bliss of Consciousness-Absolute. The Being of Consciousness is the Being of Bliss, Eternal. It does not lie in achievement but realisation and experience, not invention but discovery.
The Consciousness is more intense when the objective existence is presented near the subject, still more complete when the subjective and the objective beings are more intimately related, and fully perfected and extended to Absoluteness in the identification of the subject and the object.
This Pure Consciousness is the same as Pure Bliss, the source of Power and the height of Freedom. This is the supreme Silence of the splendid Plenitude of the Real, where the individual is drowned in the ocean of Being.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 139 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 69 🌻*
జల పంచకానికి అధిష్ఠానము ఎవరు? జలములో జలము - విష్ణువు కదా! కాబట్టి జలపంచకమంతా కూడా రేపు ప్రళయకాలంలో ఏమైపోతుంది? విష్ణువు నందు అంతర్భూతమైపోతుంది. ఆయన నుంచే వ్యక్తమైంది, ఆయనయందే తిరిగి లయమైపోతుంది.
అందుకనే నారాయణడని పేరు. నారము ఆయనము. నీరము యొక్క ఆశ్రయమంతా విష్ణువే. జలములో జలము అన్నమాట. కాబట్టి ఆ జలపంచకమంతా ఆధారభూతంగా ఉన్నటువంటి విష్ణువు ద్వారా ఏర్పడింది, తిరిగి మరలా ఆయన యందే లయించిపోయింది.
అగ్నిపంచకం.
అగ్నిలో ఆకాశము - దిక్పాలకులు, అష్ట దిక్పాలకులు!
అగ్నిలో వాయువు - వాయుదేవుడు.
అగ్నిలో అగ్ని - సూర్యుడు.
ఈ సూర్యుడే అధిష్ఠానం. మనం కూడా అగ్నిని ఎక్కడి నుంచి పొందుతున్నాము? అంటే, సూర్యుడి నుంచే పొందుతున్నాము. ప్రకాశము నుంచే పొందుతున్నాము. ఆ సూర్యప్రకాశము ఆధారంగానే క్రమశః సృష్టి జరుగుతుంది.
సూర్యుడు లేకపోతే ఈ సృష్టిలో ఏదీ లేదు. చీకటి యుగం. మంచుఖండం, హిమయుగం, నడుస్తూఉంటుందన్నమాట. ఆ సూర్యప్రభావం వల్లనే, ఆ జలంలోనుంచి జీవులన్నీ పుట్టుకొచ్చినాయి.
అగ్నిలో జలము - వరుణుడు, వరుణుడు!
అగ్నిలో పృథ్వి - అశ్వినీ దేవతలు, అశ్వనీ దేవతలు.
ఈ రకంగా ఆది దైవక సృష్టి అగ్నిపంచకానికి సంబంధించినటువంటిది. ఈ అశ్వనీ దేవతలు, అష్టదిక్పాలకులు, వరుణుడు, సూర్యుడు... వీళ్ళందరూ కూడా మనం ఆరాధించేటటువంటి దేవతలన్నమాట. వీళ్ళందరి ప్రభావం చేతనే ఋతువులన్నీ ఏర్పడుతున్నాయి. భ్రమణం ద్వారా ఏర్పడుతున్నాయి. భూభ్రమణము, భూ పరిభ్రమణము అంటున్నాము కదా!
భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు ఈ అధిష్ఠాన దేవత అనుగ్రహంచేత, ఆ యా ఋతువులన్నీ ఏర్పడి, ఆ జీవ సృష్టి అంతా జరుగతోంది. వరుణ భగవానుని అనుగ్రహం లేకపోయినట్లయితే, మనం వర్షపాతం లేక విలవిల లాడిపోతాము. ఎన్ని భూమి మీద నీళ్ళున్నప్పటికీ కూడా, వర్షం లేకపోతే ప్రాణులన్నిటికి చాలా ఇబ్బంది కరమైన జీవితం జరుగుతూఉంటుంది.
ఒక కాలానికి వచ్చేటప్పటికి అసలు వరణుడే లేకపోతాడు. ప్రళయ కాలానికి వచ్చేటప్పటికి సూర్యప్రభావం తీవ్రమైపోతుంది. తీవ్రమైపోయి, మిగిలినటువంటి అగ్ని పంచకం అంతాకూడా దేదీప్యమానమైనటువంటి ప్రభావితమై, కిందున్న జలపంచకాన్ని తనయందు కలిపేస్తుంది.
జలపంచకమేమో తన ఆధీనంలో ఉన్న పృథ్వి పంచకాన్ని కలిపేసుకుంటే, ఆ జలపంచకాన్ని, ఈ అగ్ని పంచకానికి అధిష్ఠానమైనటువంటి సూర్య తప్తత చేత, ఆ మొత్తం ఇంకిపోయేట్లు చేస్తుంది. అప్పుడు ప్రళయకాలంలో జరిగే విధానం అది. ఆది దైవతముల యొక్క ప్రభావం అంతా కూడా.
సృష్టి ఆవిర్భావ కాలమందు, సృష్టి పోషణ కాలమందు, సృష్టి తిరోధాన ప్రళకాలమందు. ఈ ఆది దైవతం యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటుంది. భూమి విలువ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, భూకంపం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈ భూమి ఉందని. అప్పటి వరకూ నేల ఉందని ఎవరూ అనుకోరు. తింటుంటాడు, తిరుగుతూ ఉంటాడు, గడిపేస్తూ ఉంటాడు.
భూకంపం వస్తే, అప్పుడు భూమి యొక్క ప్రభావం ఎంతుందో తెలుస్తుంది. భూదేవత యొక్క అనుగ్రహం అలా ఉందన్నమాట. అట్లా మనం ఈ పంచభూతాలని ఆదిదైవతంగా భావించి ఆరాధించే విధానాన్ని పెద్దలు కల్పించారు.
ఈ రకంగా పృథ్వి పంచకాన్ని, జలపంచకాన్ని, అగ్ని పంచకాన్ని తెలుసుకున్న తరువాత వాయుపంచకం.
వాయువులో ఆకాశము - జయుడు,
వాయువులో వాయువు - విశ్వయోని,
వాయువులో అగ్ని - అజుడు,
వాయువులో జలము - విశిష్ఠుడు,
వాయివులో పృథ్వి - విశ్వకర్త.
వీళ్ళే ఆధారం. వాయుదేవత అంటే వీళ్ళే. వీళ్ళందరినీ కలిపి వాయుదేవత.... వాయువులో వాయువు చాలా ముఖ్యం.
గు: వాయువులో వాయువు ఏమిటిప్పుడు?
శి: విశ్వయోని- విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 13 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. అభంగ్ - 13 🍀*
సమాధీ హరీచీ సమసుఖేవీణ్!
న సాథేల్ జాణ్ ద్వైత బుద్ధీ!!
బుద్ధి చే వైభవ్ అన్స్ నాహీ దుజే!
ఏకా కేశవ రాజే సకళ సిద్ధీ!!
రిధీ సిద్దీ నిధీ అవబీచ్ ఉపాధీ!
జవ్ త్యా పరమానందీ మన్ నాహీ!!
జ్ఞానదేవీ రమ్, రమలే సమాధాన్!
హరీ చే చింతన్ సర్వకాళ్!!
భావము:
సమసుఖము కలుగక పూర్వము శ్రీహరిలో సమాధి సుఖాన్ని పొందజాలము. ద్వైత బుద్ధి ఉన్నంత కాలము సమసుఖము సాధ్యము కాదు.
బుద్ధి యొక్క వైభవము అన్యముగా రెండవది ఏదీ లేదు. ఒక్క కేశవరాజే సకల సిద్ధులకు మూల కారణము. పరమానందునిలో మనసు స్థిరముగ లేనిచో ఈ రిద్ధి-సిద్ధి, నిధులు సర్వము అవసరము లేని ఉపాధులే అయిపోతాయి.
హరి చింతనలో సర్వకాలము నా మనసు రమించి లీనమై పోవుట వలన నాకు సమాధానము లభించినదని జ్ఞానదేవులు తెలిపినారు.
*🌻. నామ సుధ -13 🌻*
సమసుఖము కలుగక పూర్వము
హరిలో సమాధి పొందజాలము
ద్వైత బుద్ది ఉన్నంత కాలము
సమ సుఖ:ము కాదు సాధ్యము
ఇలలో బుద్ధికి మరో వైభవము
రెండవది లేదు అన్యము
ఒక కేశవ రాజే దానికి మూలము
సకల సిద్ధులకు ఆధారము
రిధీ సిద్ధీ నిధీ ఇవి సర్వము
ఉపాధులన్నీ అనవసరము
మనుస్సునందు పరమాత్ముని భావము
లేని ప్రయాస నిరుపయోగము
జ్ఞాన దేవునిలో రమించే నామము
అంతరంగమున సమాధానము
హరి చింతనలో సర్వ కాలము
గడిపిరి వారు నిరంతరము
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 160 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
152
Sloka:
Guru bhakto bhavecchighram guru gita japena tu | Dhanya mata pita dhanyo dhanya vamsya jana api | Dhanya ca vasudha yatra guru bhaktah prajayate ||
One who chants the Guru Gita becomes a disciple of Guru quickly. Such disciples, their parents, their lineage and the people of their country are blessed. For people with a wavering mind, the chanting of Guru Gita is very useful.
Sloka:
Idam rahasyam no vacyam yasmai kasmaicana priye | Abhakte vancake dhurte pasande nastike tatha | Manasapi na vaktavya gurugita kadacana ||
Siva says to Parvati that Guru Gita should not be revealed to all and sundry particularly to non-devotees, impostors, the wicked, the fallen and the atheists. The very thought of giving them the Guru Gita should not come up.
In the previous sloka, they said that even people with wavering minds can study the Guru Gita. But, here, they are specifying clearly who the Guru Gita should not be given to. The kind of people that Guru Gita should not be given to are specially being mentioned.
This is an ethical rule for knowledge, it’s also the rule for the world. For instance, food should not be given to one who is not hungry. Some people may just be interested in learning to play musical instruments. If you forcibly give them knowledge, they will not be able to absorb it.
Similarly, some people are only interested in food, some in just money and some in just clothes, they don’t aspire for good knowledge. Some people want to chant the Guru Gita just to fulfill their desires. That’s tantamount to buying the Guru Gita for money.
Just because you want to always feed the hungry, you should not wish for everyone to become poor. Just because you want to donate money, you can’t wish that people become penniless. That means that even though there is no need, you want to feel great doing these donations. You may think, “Everybody should become utterly poor, they should all get hungry, so that I can donate food”. You should never wish for such things.
Similarly, just for you to become Guru, you should not give initiation to just anyone. People keep giving initiation to whoever they like. That is also wrong. But, your Swamiji doesn’t let go of anyone, he even takes the ineligible ones, makes them eligible and gives them initiation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 84 / Sri Lalitha Sahasra Nama Stotram - 84 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 156 / Sri Lalitha Chaitanya Vijnanam - 156 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |*
*నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖*
*🌻156. 'నీరాగా'🌻*
అనురాగములకు అతీతమైనది శ్రీమాత అని భావము. రాగమనగా ఇచ్ఛ లేక కోరిక. శ్రీమాత అనురాగమునకు ఆలయమేయైనను ఆమెకు సృష్టి యందలి ఏ విషయము పైనను ప్రత్యేకముగా ఇచ్ఛ లేదు. సమస్త ఇచ్ఛలు తీరిన వారికి ఇక ఇచ్చలు ఏమి యుండును? పరిపూర్ణత్వము కారణముగా ఇచ్ఛకవకాశమే లేదు. లేని దానిపై ఇచ్ఛ కలుగును. కాని అన్నియు తానై నిండిన స్థితి యందిచ్ఛ ఎట్లుండగలదు? స్థితి యందుండగ మరియొక ఇచ్ఛ కవకాశమే లేదు.
జీవులకు లేనివి, కావలసినవి చాలా యున్నవి. ఇచ్ఛ పూర్తియగు వరకు ఇచ్చనే అనుసరించుచుందురు. వారు రాగబద్ధులు. ఇచ్ఛ వలన కొంత సాధింపబడుట జరుగును. కానీ అట్టి సాధనలో కామ క్రోదాధి అరిషడ్వర్గములు పుట్టి జీవులను బంధించు చుండును. ఇచ్ఛా నిర్వహణము. ఇచ్ఛా పరిపూర్తి, ఆపై ఇచ్ఛను దాటిన స్థితి, ఈ మూడింటిని శ్రీమాతయే ప్రసాదించగలదు. ఆరాధనయే దానికి ఆధారము.
ఆరాధనము వలన ఇచ్ఛాపూర్తి జ్ఞానము కలుగును. ధర్మ యుక్తముగా నిర్వర్తించుకొను బలము కలుగును. క్రమముగా ఆరాధనయే ఇచ్ఛాలేమి స్థితిని కూడ ప్రసాదించుచుండును. ఉదాహరణకు బంగారునగలపై జీవులకు మోజు కలదు. బంగారమునకు నగలపై యెట్టి మోజు ఉండదు. కారణము తానే నగల రూపమున ఉండుట. అట్లే శ్రీమాత కూడను.
తానే సమస్త వస్తుజాలముగ యేర్పడి ఉన్నప్పుడు యిక యిచ్చగించవలసినది ఏమియూ లేదు. వశిష్టాది బ్రహర్షులట్టి వారు. మరియొక మాట! ఇచ్ఛాపరిపూర్ణులు ఇచ్ఛారహితులై యున్నారు. వారే యితరుల ఇచ్ఛను పరిపూర్తి గావింపగలరు. పూర్ణత్వము గలవారే యితరులకు కూడ పూర్ణత్వము నందించగలరు. శ్రీమాత పరిపూర్ణ అగుటచే ఆమెయే నిజమగు నీరాగ.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 156 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻Nīrāgā नीरागा (156) 🌻*
Rāga means desire. She is without desire. Though this nāma and a few subsequent nāmas may appear similar to the previous group, in fact they are not so. Antaḥkaraṇa consists of four components mind, intellect, consciousness (in a manifested form in the mind) and ego.
These four in no way are connected to the Atman or the Brahman. The components of antaḥkaraṇa are impediments to self-realization. Apart from antaḥkaraṇa there are six other deterrents viz. desire, anger, jealousy, confusion, pride and envy.
These six need no explanation as a mere look at these words will show how dangerous they are. These nāma-s explain the means to get disassociated from these. First, Vāc Devi-s explained the concept of the Brahman and now they proceed to explain how to realise the Brahman, a true step-by-step guidance to Self-realization.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 497 / Bhagavad-Gita - 497 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 7 🌴*
07. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవమ్ |
తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసఙ్గేన దేహినమ్ ||
🌷. తాత్పర్యం :
ఓ కౌంతేయా! అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన రజోగుణము ఉద్భవించుచున్నది. దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే బద్ధుడగును
🌷. భాష్యము :
స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణము రజోగుణలక్షణము. అనగా స్త్రీ పురుషుని యెడ ఆకర్షణను కలిగియుండుట మరియు పురుషుడు స్త్రీ యెడ ఆకర్షితుడగుట యనునది రజోగుణమనబడును.
ఇట్టి రజోగుణము అధికమైనప్పుడు మనుజుడు భౌతికానందాభిలాషుడై ఇంద్రియసుఖమును అనుభవింపగోరును. అట్టి ఇంద్రియసుఖము కొరకు రజోగుణము నందున్నవాడు సంఘమునందు లేదా దేశమునందు గౌరవమును మరియు చక్కని ఇల్లు, భార్య, సంతానము కలిగిన సుఖసంసారమును వాంచించును. ఇవియన్నియును రజోగుణము నుండి పుట్టినవే. ఇట్టి విషయములకై ప్రాకులాడునంత కాలము అతడు అధికముగా శ్రమింపవలసివచ్చును.
కనుకనే రజోగుణము నందున్నవాడు తన కర్మఫలముల యెడ రతుడై యుండి, ఆ కర్మలచే బంధితుడగునని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భార్యను, సంతానమును, సంఘమును సంతృప్తిపరచుటకు మరియు తన గౌరవమును నిలుపుకొనుటకు మనుజుడు సదా కర్మయందు నిమగ్నుడు కావలసివచ్చును.
దీనిని బట్టి భౌతికప్రపంచమంతయు ఇంచుమించుగా రజోగుణమునందు ఉన్నదనియే చెప్పవచ్చును. రజోగుణము దృష్ట్యా నవనాగరికత అభివృద్ది నొందినట్లు పరిగణింపబడినను వాస్తవమునకు సత్త్వగుణాభివృద్దియే ప్రగతిగా పరిగణింపబడును. పూర్వము ఆ విధముగనే భావింపబడెడిది. సత్త్వగుణమునందు నిలిచినవారికే ముక్తిలేదన్నచో రజోగుణమున బద్ధులైనవారి మాట వేరుగా చెప్పానేల?
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 497 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 07 🌴*
07. rajo rāgātmakaṁ viddhi tṛṣṇā-saṅga-samudbhavam
tan nibadhnāti kaunteya karma-saṅgena dehinam
🌷 Translation :
The mode of passion is born of unlimited desires and longings, O son of Kuntī, and because of this the embodied living entity is bound to material fruitive actions.
🌹 Purport :The mode of passion is characterized by the attraction between man and woman. Woman has attraction for man, and man has attraction for woman. This is called the mode of passion. And when the mode of passion is increased, one develops the hankering for material enjoyment.
He wants to enjoy sense gratification. For sense gratification, a man in the mode of passion wants some honor in society, or in the nation, and he wants to have a happy family, with nice children, wife and house. These are the products of the mode of passion.
As long as one is hankering after these things, he has to work very hard. Therefore it is clearly stated here that he becomes associated with the fruits of his activities and thus becomes bound by such activities.
In order to please his wife, children and society and to keep up his prestige, one has to work. Therefore, the whole material world is more or less in the mode of passion. Modern civilization is considered to be advanced in the standard of the mode of passion.
Formerly, the advanced condition was considered to be in the mode of goodness. If there is no liberation for those in the mode of goodness, what to speak of those who are entangled in the mode of passion?
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -105 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀 33. కర్మ నిర్వహణ జ్ఞానము - ఈ ప్రపంచములో జ్ఞానముతో సమానమైన పవిత్రత కలిగినది ఏదియు లేదు. ఈ నిష్కామ కర్మయోగ జ్ఞానము కాలక్రమమున యోగసిద్ధిని గావించి, సాధకునకు 'తాను' ఎవరో స్వయముగ తెలుపును. పరమ పవిత్ర స్థితియే విభూతి. ఆచరణ యందలి నిష్కామత, ఫలమునందు నిరాసక్తి, నిర్వహణము నందు త్రికరణ శుద్ధి, సిద్ధించిన కార్యము లందు మమకార పడకుండుట మాత్రమే మార్గము. జ్ఞానము సర్వము కర్మనిర్వహణ జ్ఞానమే 🍀*
యథైధాంసి సమిద్దాం గ్ని ర్భస్మసాత్ కురుతేట ర్జున |
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా || 37
న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే |
తత్స్వయం యోగ సంసిద్ధః కాలే నాత్మని విందతి || 38
ఓ అర్జునా! బాగుగా ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెలనే ప్రకారముగ భస్మీభూత మొనర్చుచున్నదో, ఆ ప్రకారముగనే, జ్ఞానమను అగ్ని సమస్త కర్మలను భస్మము చేసి వేయును. ఈ ప్రపంచములో జ్ఞానముతో సమానమైన పవిత్రత కలిగినది ఏదియు లేదు. ఈ నిష్కామ కర్మయోగ జ్ఞానము కాలక్రమమున యోగసిద్ధిని గావించి, సాధకునకు 'తాను' ఎవరో స్వయముగ తెలుపును.
కోరికలు, ఆవేశకావేశములు, స్వార్థచింతన, అహంకార పూరితమగు భావనలు, ఫలములం దాసక్తి, కార్యములందు వక్రత, తనదనుకొను వానియందు మమకారము పచ్చి కట్టెల వంటివి. అట్టి కట్టెలు అగ్నికార్యమునకు పనికిరావు.
కేవలము చివికి నశించుట జరుగును. ఎండుకట్టె అగ్ని స్పర్శతో త్వరితముగ మండగలదు. స్థితి మార్పులు పొందగలదు. పవిత్రీకరింపబడి, విభూతియై మిగులగలదు. విభూతి పరమ పవిత్రము. కారణమేమనగ అగ్ని దానిని ఏమియును చేయలేదు. పరమ పవిత్ర స్థితియే విభూతి. అగ్నివలననే కట్టె విభూతిగ మారుచున్నది.
జ్ఞానము వలననే మనిషి మహాత్ము డగుచున్నాడు. జ్ఞానమనగ, కర్మలను నిర్వర్తించు జ్ఞానము. కర్మ నిర్వహణమున పాత కర్మలు, ప్రస్తుత కర్మలు నశించవలెను. క్రొత్తకర్మలు పుట్టరాదు. వ్యక్తిగత కర్మము నుండి విమోచనము పొందినవారు దివ్యకర్మయందే చిరకాలము జీవించుచు నుందురు. శాశ్వతులుగ నుందురు.
అట్టివారు భగవత్ విభూతియే. కేవలము దైవమే వారి నుండి వ్యక్తమగుచు, శ్రేయస్సు చేకూర్చుచు నుండును. స్వయముగ భగవంతుడే వారియందు ఉపస్థితుడై యుండుటచేత 'స్వయమును' గూర్చి కూడ వారు కాలక్రమమున తెలిసిన వారగుదురు.
ఈ రెండు శ్లోకములలో స్థూలముగ మూడు పురోగమన ములు గోచరించును.
1. జ్ఞానముతో కూడి నిర్వర్తించు కర్మ వలన కర్మ నాశనము క్రమముగ నగుట.
2. కర్మమోచనము పొందినవారు పవిత్రులై నిలచి దివ్య కార్యములకు సమర్పణ చెందియుండుట.
3. దైవము తమనుండి దివ్యకర్మను వ్యక్తము చేయుచుండగ, కాలక్రమమున తామెవ్వరో తమకు తెలియుట.
ఇట్లాత్మజ్ఞానము కర్మ నిర్వర్తించు జ్ఞానము నుండే పొంద వచ్చని, మరియొక మార్గము లేదని దైవము సూచించు చున్నాడు. ఎంత తెలిసినను, ఎంత పాండిత్యమున్నను, ఎన్ని విధములగు విద్యలు నేర్చినను, ఆచరణ యందలి నిష్కామత, ఫలమునందు నిరాసక్తి, నిర్వహణమునందు త్రికరణ శుద్ధి, సిద్ధించిన కార్యము లందు మమకార పడకుండుట మాత్రమే మార్గము. జ్ఞానము సర్వము కర్మనిర్వహణ జ్ఞానమే అని తెలియవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 304 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
74. అధ్యాయము - 29
*🌻. దక్ష యజ్ఞములో సతి - 2 🌻*
ఓరీ! ఇంద్రా! నీవు మహాదేవుని పరాక్రమమునెరుంగవా? క్రూరమగు కర్మలను చేయగలిగే హరునిచే నీ వజ్రము భస్మము చేయబడినది (21). ఓ దేవతలారా!మహాదేవుని పరాక్రమమును మీరెరుంగరా? ఓయీ అత్రీ !వసిష్ఠా! మునులారా !మీరిచట ఏమి చేసినారు ?(22) పూర్వము దారువనములో ఆ రుద్ర విభుడు భిక్షాటమును చేసినాడు. ఏలయన, ఆ సమయములో మునులగు మీరు ఆయనను భిక్షుడవు కమ్మని శపించిరి (23). అట్లు శపించిననూ రుద్రుడు ఏమి చేసినాడో మరిచినారా ఏమి? లింగ రూపుడగు శివుడు స్థావర జంగమాత్మకమగు జగత్తునంతనూ దహించివేసినాడు (24).
విష్ణువు బ్రహ్మ మొదలగు సర్వ దేవతలు, మునులు, ఇతరులు శంకరుడు లేని ఈ యజ్ఞమునకు వచ్చి మూర్ఖులైరి (25). ఎవని నుండి సర్వవేదములు, వేదాంగములు, శాస్త్రములు, వాక్కు పుట్టినవో, ఎవడు వేదాంతములచే ప్రతిపాదింపబడుచున్నాడో, అట్టి శంభుని కొందరు మాత్రమే తెలియగలరు. ఇతరులకు ఆయన అందడు (26).
బ్రహ్మ ఇట్లు పలికెను -
జగన్మాతయగు సతీదేవి కోపముతో కూడియున్నదై దుఃఖితమగు హృదయముతో అచట ఇట్టి అనేకములగు పలుకులను పలికెను (27). విష్ణువు మొదలగు సర్వ దేవతలు, మునులు భయముచే కల్లోలితమగు మనస్సులు గలవారై ఆమె మాటలను విని మిన్మకుండిరి (28). అపుడు దక్షుడు తన కుమార్తె యొక్క ఆ పలుకులను విని, ఆ సతిని క్రూరమగు చూపులతో చూచి, కోపమును పొంది, ఇట్లు పలికెను (29)..
దక్షుడిట్లు పలికెను -
నీవు అధిక ప్రసంగము నేల చేయుచున్నావు ?ఇపుడునీ కిచట పని లేదు. ఓ మంగళ స్వరూపులారా! వెళ్లెదవా ?ఉండెదవా? నీవు ఏల వచ్చితివి ?(30). నీ భర్తయగు శివుడు అమంగళుడనియు, కులహీనుడనియు, వేద బహిష్కృతుడనియు, భూత ప్రేత పిశాచములకు రాజనియు పండితులు చెప్పుచున్నారు (31). అందువలననే , ఓ పుత్రీ! విద్వాంసుడనగు నేను ఈ సత్యము నెరింగి మిక్కిలి చెడు వేషమును ధరించు రుద్రుని దేవతలు, ఋషులు కొలువు దీర్చియున్న ఈ యజ్ఞమునకు ఆహ్వానించలేదు (32).
బుద్ధిహీనుడు, పాపియగు బ్రహ్మ ప్రేరేపించగా నేను, వేదతాత్పర్యము తెలియనివాడు, గర్విష్ఠి, దుర్మార్గుడనగు రుద్రునకు నిన్ను ఇచ్చి వివాహమును చేసితిని (33). ఓ స్వచ్ఛమగు చిరునగవు గలదానా !కాన నీవు కోపమును వీడి స్వస్థురాలవు కమ్ము. నీవు ఈ యజ్ఞమునకు ఎటులైననూ వచ్చితివి గాన, దీనిలో పాలు పంచుకొనుము (34).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దక్షుడిట్లు పలుకగా, దక్షుని కుమార్తె, ముల్లోకములకు పూజ్యురాలునగు ఆ సతి నిందావచనములను పలుకు తన తండ్రిని చూచి మిక్కిలి కోపమును పొందెను (35). అపుడామె ఇట్లు తలపోసెను. నేను శంకరుని వద్దకు ఎట్లు పోగలను ? నాకగు శంకరుని చూడవలెనని యున్నది. ఆయన వివరములనడిగినచో, నేను ఏమి సమాధానము నీయగలను ? (36) అపుడు ముల్లోకములకు తల్లియగు ఆ సతి క్రోధముతో కూడినదై, నిట్టూర్పులను విడచుచున్నదై, దుర్బుద్ధియగు ఆ దక్షునితో నిట్లనెను (37).
సతి ఇట్లు పలికెను -
ఎవడు మహాదేవుని నిందించునో, ఎవడు మహాదేవుని నిందను వినునో, వారిద్దరు సూర్యచంద్రులున్నంత వరకు నరకములో నుందురు (38). కావున నేను దేహమును వీడెదను. అగ్నిని ప్రవేశించెదను. తండ్రీ !నా ప్రభువును గూర్చి అనాదరముతో నీవు పలికిన పలుకులను విన్న నాకు జీవతముతో పనియేమి ?(39).
శక్తిగలవాడు శంభుని నిందించువాని నాలుకను బలాత్కారముగా కోసివేయవలెను. అపుడా నిందావచనములను విన్న అశుద్ధి నిస్సందేహముగా తొలగిపోవును (40). అట్లు చేయ శక్తిలేని బుద్ధిమంతుడగు మానవుడు చెవులను గట్టిగా మూసుకొని అచటి నుండి తొలగిపోయినచో, ఆతడు శుధ్ధుడగునని గొప్ప పండితులు చెప్పుచున్నారు (41)|
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 58 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 5 - THE 5th RULE
*🌻 5. Kill out all sense of separateness - 3 🌻*
248. Suppose that all of us could develop the buddhic consciousness within ourselves simultaneously. Each one would realize that he had risen to that level, and that his consciousness included that of all the others, but he would still feel that inclusive consciousness to be his consciousness.
None of us would have lost his sense of individuality at all, only in it he would include very much more than he had ever done before. He would feel himself as manifesting through all these others as well. Really what we are experiencing is the one consciousness which includes us all, the consciousness of the Logos Himself.
249. It is on the nirvanic plane that we realize most intensely that all that we thought to be our consciousness, our intellect, our devotion, our love, were in reality His consciousness, His intellect, His love, His devotion, manifesting through us somewhat as a light might shine through a lens. That realization does not come fully to the man in the buddhic world, but it does so come to him in that next above.
250. In the Stanzas of Dzyan it is said, referring to man; “The spark hangs from the Flame by the finest thread of Fohat.”1 (1 The Secret Doctrine, Vol. I, p. 66.) That, I believe, is applicable at various levels; for us it may be taken to mean that the ego hangs from the Monad by the finest thread, and that thread runs through the buddhic plane. The finest thread of which you can think is all that represents the ordinary man at these buddhic levels.
As soon as he turns his attention to higher matters – when he is regularly thinking of them and aiming at them – that thread begins to thicken. It gradually becomes more and more like a cable, and later on it appears as a funnel, because it widens out up above (I am speaking of it now as one would see it clairvoyantly), and comes down into the causal body, which is a thing of definite size for the time.
Later on the causal body itself is enlarged by the inrushing of forces, and the funnel becomes very much larger, widening out at the bottom as well as the top. At the first Initiation (for many, this experience comes before that), the man abandons the causal body and plunges into the buddhic plane.
At that time, as I have explained before, the causal body absolutely vanishes – the one thing that has seemed permanent through his long line of lives, since he left the animal kingdom, disappears.2 (2 Ante., Vol. I, Part II, Ch. 2: The Life of the Bodies.) When that occurs this funnel shapes itself into a sphere. There are more dimensions there, so that I cannot actually describe it, but this is how it appears to one who is able to see it.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 190 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. వసిష్ఠమహర్షి-అరుంధతి - 3 🌻*
12. ఒక గృహస్థాశ్రమంలోనే యోగము, భోగము, తపస్సు, దానము, త్యాగము, ధర్మము, సంగానికి ఋణం తీర్చుకోవడము – ఇటువంటివన్నీ సాధ్యమవుతాయి. అటువంటి ఆదర్శమైన గృహస్థధర్మాన్నే మన ఋషులు సాధించారు.గృహస్థ ధర్మం అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే మహర్షులనే జ్ఞాపకం తెచ్చుకోవాలి. సంసారం బంధనం, బాధ అంటాం కాని; ఆ సంసారంలోనే ధార్మికదృష్టి కలిగిన వాడికి ఋణాలు తీర్చుకోవడానికి, ధర్మం అవలంబించడానికి, తపస్సు చేసుకోవడానికి అవకాశంఉంది.
13. సంసారంలో ఇబ్బందులు, బాధలు పుణ్యం లేకపోవడంవల్ల వస్తాయి. పూర్వపుణ్యం లేనటువంటి సంసారం చాలా కష్టభూయిష్టమైనది. అటువంటి సంసారంలోకూడా ఉత్తములు తపోభంగం లేకుండా జీవించారు. వాళ్ళ తపస్సుకు, నిష్ఠకు, ధర్మానికి ఏ భంగమూ కలుగకుండా వారు సంసారక్లేశాలను అనుభవించారు. కష్టంలేని సంసారమైనప్పటికీకూడా, ఇవన్నీ చేయగలమని అనుకోకూడదు. ఎన్నో కష్టాలు పడుతూకూడా మన పూర్వులు తమ ధర్మనిష్టలో లోపంరాకుండా జీవించారు. అదే భారతీయ ఆదర్శం.
14. తీవ్రమైన కోరికకలిగినా, దుఃఖంకలిగినా, గొప్ప అవమానం జరిగినా – ఈ లోకవ్యవహారాన్ని వదిలిపెట్టి తపస్సుకు వెళ్ళటమనేది ఆనాడు ఆర్యుల విధానం. ఆ తపస్సులోతప్ప శాంతికలుగదు.
15. విశ్వామిత్రుడు వసిష్ఠునిపై దండెత్తినప్పుడు, విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రసంపదంతా ఆ బ్రహ్మాండంలో లయమైపోయింది. అది నిర్గుణమైన బ్రహ్మవస్తువు. దాంట్లోంచే సగుణమైన జగత్తంతా పుట్టింది. అందువల్ల జగత్తంతా అందులో లయంచెందవలసిందే. ఈ జగత్తులో ఎటువంటి శక్తి అయినా, పదార్థమైనా, లక్షణమైనా, బలమైనా, అస్త్రమైనా బ్రహ్మలో లీనంకావలసిందే.
16. దేనియందు సృష్టియంతా లయం చెందుతుందో దానికి ప్రతీకయే ఆ బ్రహ్మదండం. అంతేకాని వసిష్ఠుడు ప్రత్యస్త్రప్రయోగం చేయడు.తిరిగి వేరే అస్త్రాలతో యుద్ధంచేయటం అనేది అవిద్యామూలకమైనదవుతుందే తప్ప, వస్తువులను లయంచేసే బ్రహ్మవస్తువు కాదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 254 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 103. This knowingness 'I am' which came spontaneously and you felt gradually, is the ignorant-child-principle, the 'Balkrishna' state. 🌻*
The Guru now calls the 'I am', which spontaneously appeared on you, the ignorant-child principle or 'Balkrishna' state.
This adds more to your understanding of the 'I am'. Indeed, when the knowledge 'I am' dawned on you it was a state complete ignorance.
You did not know what this sense of 'being' was and what to make of it. You knew only two states, those of 'I am' and 'I am not', which alternated on their own.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 129 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 8 🌻*
531. భగవంతుని చైతన్యస్థితియే - పరమాత్మ.
532. భగవంతుడు, తాను పరాత్పరునిగా శాశ్వతుడనైయున్నానని, తన అస్తిత్వమును ఎఱుకతో అనుభవించుటయే పరమాత్మస్థితి. ఈ సత్యానుభవము ఒకసారి ప్రాప్తించినచో అది శాశ్వతముగా నిలిచి యుండును.
533. పరమాత్మలో నున్న ఆత్మ జీవాత్మయై, సంస్కారముల నుండి ముక్తి పొంది, పరమాత్మలో, శివాత్మయైనది. పరమాత్మలో లీనమై పరమాత్మతో తాదాత్మ్యత చెంది, తాను పరమాత్మనని అనుభూతి నొందుచున్నది.
534. 'పరమాత్మయే ఆత్మ' అన్నది శాశ్వత సత్యము.
535. ప్రశ్న:- వాస్తవికముగా ఆత్మయే పరమాత్మ అయితే, ఆత్మకు అప్పుడు పరమాత్మలో లీనము కావలెనెడి పరిస్థితి దానికెట్లు కలుగుచున్నది?
జవాబు:- వాస్తవమునకు ఆత్మయే పరమాత్మయని గ్రహించుటకై మనము పరమాత్మను అనంత అపార సాగరముతో పోల్చుకొందము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 92 / Sri Vishnu Sahasra Namavali - 92 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*ధనిష్ట నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*
*🍀 92. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః |*
*అపరాజితః సర్వసహో నియంతాఽనియమోఽయమః ‖ 92 ‖ 🍀*
🍀 857) ధనుర్ధర: -
ధనస్సును ధరించినవాడు.
🍀 858) ధనుర్వేద: -
ధనుర్వేదము తెలిసినవాడు.
🍀 859) దండ: -
దండించువాడు.
🍀 860) దమయితా -
శిక్షించువాడు.
🍀 861) దమ: -
శిక్షానుభవము ద్వారా ఏర్పడు పవిత్రత తానైనవాడు.
🍀 862) అపరాజిత: -
పరాజయము తెలియనివాడు.
🍀 863) సర్వసహ: -
సమస్త శత్రువులను సహించువాడు.
🍀 864) నియంతా -
అందరినీ తమతమ కార్యములందు నియమించువాడు.
🍀 865) అనియమ: -
నియమము లేనివాడు.
🍀 866) ఆయమ: -
మృత్యుభీతి లేనివాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 92 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Dhanishta 4th Padam*
*🌻 92. dhanurdharō dhanurvedō daṅḍō damayitā damaḥ |*
*aparājitassarvasahō niyantā niyamō yamaḥ || 92 || 🌻*
🌻 857. Dhanurdharaḥ:
He who as Rama wielded the great bow.
🌻 858. Dhanurvedaḥ:
He who as the same Rama, the son of Dasharatha, was the master of the science of archery.
🌻 859. Daṅḍaḥ:
He who is discipline among the disciplinarians.
🌻 860. Damayitā:
He who inflicts punishments on people as Yama and as king.
🌻 861. Damaḥ:
He who is in the form of self-descipline in men as a result of enforcement.
🌻 862. Aparājitaḥ:
One who is never defeated by enemies.
🌻 863. Sarvasahaḥ:
One who is expert in all Karmas (works).
🌻 864. Niyantā:
One who appoints every person to his respective duties.
🌻 865. Aniyamaḥ:
One on whom there is no enforcement of any law, or above whom there can be no overlord to enforce anything, as He is the controller of everything.
🌻 866. Ayamaḥ:
One on whom Yama has no control, that is one who has no death.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹