సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 13
🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 13 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 13 🍀
సమాధీ హరీచీ సమసుఖేవీణ్!
న సాథేల్ జాణ్ ద్వైత బుద్ధీ!!
బుద్ధి చే వైభవ్ అన్స్ నాహీ దుజే!
ఏకా కేశవ రాజే సకళ సిద్ధీ!!
రిధీ సిద్దీ నిధీ అవబీచ్ ఉపాధీ!
జవ్ త్యా పరమానందీ మన్ నాహీ!!
జ్ఞానదేవీ రమ్, రమలే సమాధాన్!
హరీ చే చింతన్ సర్వకాళ్!!
భావము:
సమసుఖము కలుగక పూర్వము శ్రీహరిలో సమాధి సుఖాన్ని పొందజాలము. ద్వైత బుద్ధి ఉన్నంత కాలము సమసుఖము సాధ్యము కాదు.
బుద్ధి యొక్క వైభవము అన్యముగా రెండవది ఏదీ లేదు. ఒక్క కేశవరాజే సకల సిద్ధులకు మూల కారణము. పరమానందునిలో మనసు స్థిరముగ లేనిచో ఈ రిద్ధి-సిద్ధి, నిధులు సర్వము అవసరము లేని ఉపాధులే అయిపోతాయి.
హరి చింతనలో సర్వకాలము నా మనసు రమించి లీనమై పోవుట వలన నాకు సమాధానము లభించినదని జ్ఞానదేవులు తెలిపినారు.
🌻. నామ సుధ -13 🌻
సమసుఖము కలుగక పూర్వము
హరిలో సమాధి పొందజాలము
ద్వైత బుద్ది ఉన్నంత కాలము
సమ సుఖ:ము కాదు సాధ్యము
ఇలలో బుద్ధికి మరో వైభవము
రెండవది లేదు అన్యము
ఒక కేశవ రాజే దానికి మూలము
సకల సిద్ధులకు ఆధారము
రిధీ సిద్ధీ నిధీ ఇవి సర్వము
ఉపాధులన్నీ అనవసరము
మనుస్సునందు పరమాత్ముని భావము
లేని ప్రయాస నిరుపయోగము
జ్ఞాన దేవునిలో రమించే నామము
అంతరంగమున సమాధానము
హరి చింతనలో సర్వ కాలము
గడిపిరి వారు నిరంతరము
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
22 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment