శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 156 / Sri Lalitha Chaitanya Vijnanam - 156


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 156 / Sri Lalitha Chaitanya Vijnanam - 156 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖



🌻156. 'నీరాగా'🌻

అనురాగములకు అతీతమైనది శ్రీమాత అని భావము. రాగమనగా ఇచ్ఛ లేక కోరిక. శ్రీమాత అనురాగమునకు ఆలయమేయైనను ఆమెకు సృష్టి యందలి ఏ విషయము పైనను ప్రత్యేకముగా ఇచ్ఛ లేదు. సమస్త ఇచ్ఛలు తీరిన వారికి ఇక ఇచ్చలు ఏమి యుండును? పరిపూర్ణత్వము కారణముగా ఇచ్ఛకవకాశమే లేదు. లేని దానిపై ఇచ్ఛ కలుగును. కాని అన్నియు తానై నిండిన స్థితి యందిచ్ఛ ఎట్లుండగలదు? స్థితి యందుండగ మరియొక ఇచ్ఛ కవకాశమే లేదు.

జీవులకు లేనివి, కావలసినవి చాలా యున్నవి. ఇచ్ఛ పూర్తియగు వరకు ఇచ్చనే అనుసరించుచుందురు. వారు రాగబద్ధులు. ఇచ్ఛ వలన కొంత సాధింపబడుట జరుగును. కానీ అట్టి సాధనలో కామ క్రోదాధి అరిషడ్వర్గములు పుట్టి జీవులను బంధించు చుండును. ఇచ్ఛా నిర్వహణము. ఇచ్ఛా పరిపూర్తి, ఆపై ఇచ్ఛను దాటిన స్థితి, ఈ మూడింటిని శ్రీమాతయే ప్రసాదించగలదు. ఆరాధనయే దానికి ఆధారము.

ఆరాధనము వలన ఇచ్ఛాపూర్తి జ్ఞానము కలుగును. ధర్మ యుక్తముగా నిర్వర్తించుకొను బలము కలుగును. క్రమముగా ఆరాధనయే ఇచ్ఛాలేమి స్థితిని కూడ ప్రసాదించుచుండును. ఉదాహరణకు బంగారునగలపై జీవులకు మోజు కలదు. బంగారమునకు నగలపై యెట్టి మోజు ఉండదు. కారణము తానే నగల రూపమున ఉండుట. అట్లే శ్రీమాత కూడను.

తానే సమస్త వస్తుజాలముగ యేర్పడి ఉన్నప్పుడు యిక యిచ్చగించవలసినది ఏమియూ లేదు. వశిష్టాది బ్రహర్షులట్టి వారు. మరియొక మాట! ఇచ్ఛాపరిపూర్ణులు ఇచ్ఛారహితులై యున్నారు. వారే యితరుల ఇచ్ఛను పరిపూర్తి గావింపగలరు. పూర్ణత్వము గలవారే యితరులకు కూడ పూర్ణత్వము నందించగలరు. శ్రీమాత పరిపూర్ణ అగుటచే ఆమెయే నిజమగు నీరాగ.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 156 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻Nīrāgā नीरागा (156) 🌻

Rāga means desire. She is without desire. Though this nāma and a few subsequent nāmas may appear similar to the previous group, in fact they are not so. Antaḥkaraṇa consists of four components mind, intellect, consciousness (in a manifested form in the mind) and ego.

These four in no way are connected to the Atman or the Brahman. The components of antaḥkaraṇa are impediments to self-realization. Apart from antaḥkaraṇa there are six other deterrents viz. desire, anger, jealousy, confusion, pride and envy.

These six need no explanation as a mere look at these words will show how dangerous they are. These nāma-s explain the means to get disassociated from these. First, Vāc Devi-s explained the concept of the Brahman and now they proceed to explain how to realise the Brahman, a true step-by-step guidance to Self-realization.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


22 Dec 2020

No comments:

Post a Comment