ఈ వీడియో లో పూజ మొదటినుండి పూజ చివర వరకు మొత్తము ఉంది .మీరు పూజకు కావాల్సిన సామానులు సిద్ధం చేసుకొని ప్రశాంతంగా కూర్చుని ఇది వింటూ పూజ చేసుకోండి.
దేవుడి గదిలో లేదా ఈశాన్యమూల స్థలాన్ని లేదా వీలుగా ఉండే తూర్పు/ఉత్తర దిశలలో శుద్ధిచేయాలి. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టి, దేవుణ్ణి ఉంచడానికి ఒక పీట వేయాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ముగ్గును వేయాలి. పాలవెల్లిని పండ్లతో అలంకరించి దానికింద ఉంచిన పీటపై గణపతి విగ్రహాన్ని ఉంచాలి.
సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగి యున్నదని చెప్పబడినది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.