శ్రీ లలితా సహస్ర నామములు - 90 / Sri Lalita Sahasranamavali - Meaning - 90

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 90 / Sri Lalita Sahasranamavali - Meaning - 90 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀

🍀 416. చిచ్ఛక్తిః -
చైతన్య శక్తి.

🍀 417. చేతనారూపా -
చలించు తెలివి యొక్క రూపము.

🍀 418. జడశక్తిః -
ఒక స్థితిలో ఉండి పోవునట్లు చేయు శక్తి.

🍀 419. జడాత్మికా -
జడశక్తి యొక్క స్వరూపము.

🍀 420. గాయత్రీ -
గానము చేసిన వారిని రక్షించునది.

🍀 421. వ్యాహృతిః -
ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది.

🍀 422. సంధ్యా -
చక్కగా ధ్యానము చేయబడునది.

🍀 423. ద్విజబృంద నిషేవితా -
ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 90 🌹

📚. Prasad Bharadwaj

🌻 90. cicchaktiś cetanārūpā jaḍaśaktir jaḍātmikā |
gāyatrī vyāhṛtiḥ sandhyā dvijabṛnda-niṣevitā || 90 || 🌻

🌻 416 ) Chitsakthi -
She who is the strength of holy knowledge

🌻 417 ) Chethana roopa -
She who is the personification of the power behind action

🌻 418 ) Jada shakthi -
She who is the strength of the immobile

🌻 419 ) Jadathmikha -
She who is the world of immobile

🌻 420 ) Gayathri -
She who is Gayathri

🌻 421 ) Vyahruthi -
She who is the grammar originating from letters

🌻 422 ) Sandhya -
She who is the union of souls and the God

🌻 423 ) Dwija brinda nishewitha -
She who is being worshipped by all beings

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

17 Jun 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 41

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 41 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. జీవులని అవమానించడం ఈశ్వరుని అవమానించడమే 🌻

సర్వజీవుల హృదయముల యందు భగవంతుడే ఈశ్వర రూపమున ఉన్నాడని తెలిసి దేవుని జీవుల రూపమున ఆదరింపవలెను.

అట్టి ఈశ్వరుని అవమానము చేసి దేవుని విగ్రహములను మాత్రము పూజించువాడు లోకమును మోసగించును. అతడు మోహముతో తన్ను తానే వంచించుకొనును.

ఎంత భక్తి చూపినను అది ఉచితము కాదు గనుక బూడిదలో పోసిన హోమద్రవ్యము వలె నిష్ఫలమగును.

🌹 🌹 🌹 🌹 🌹

17 Jun 2021

శ్రీ శివ మహా పురాణము - 413

🌹 . శ్రీ శివ మహా పురాణము - 413🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 23

🌻. దేవతలు శివుని దర్శించుట - 3 🌻

సర్వావయవముల యందు తాపమును పొందిన ఇంద్రాది దేవతలందరు కంగారును పొంది ఒకచో గూడి బృహస్పతిని పిలిచి సుమేరు పర్వతమునందున్న బ్రహ్మను (నన్ను) శరణు జొచ్చిరి (22). వారందరు నష్టమైన కాంతిగలవారై కంగారు పడుతూ అచటకు చేరి నన్ను స్తుతించి ముక్త కంఠముతో నిట్లనిరి (23).

దేవతలిట్లు పలకిరి -

ఈ స్థావర జంగమాత్మకమగు జగత్తంతయూ నీచే సృష్టింపబడినది. హే విభో! ఇపుడీ జగత్తు గొప్ప తాపమును పొందియున్నది. కారణము తెలియుట లేదు (24). హే ప్రభో! బ్రహ్మా! అట్లు జరుగుటకు గల కారణము నీకు తెలియును. దానిని మాకు చెప్పుము. నల్లగా మాడిపోయిన దేహములు గల దేవతలను రక్షించ గలవాడు నీవు తక్క మరియొకడు గానరాడు (25).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వారి ఈ మాటలనాలకించి నేను మనస్సులో శివుని స్మరించి, అదంతా పార్వతి యొక్క తపః ప్రభావమేనని మనస్సులో నిశ్చయించుకొంటిని (26). జగత్తు దహింప బడుచున్నది యని తెలుసుకొని, నేను వారందరితో కలిసి, విష్ణువునకు ఆదరముతో ఆ వృత్తాంతమును చెప్పుట కొరకై, వెంటనే పాలసముద్రము వద్దకు వెళ్లితిని (27).

అచటకు వెళ్లి, సుఖమగు ఆసనము నందు కులాసాగా ఉన్న విష్ణువును చూచి, దేవతలతో సహా చేతులు జోడించి నమస్కరించి స్తుతించి ఇట్లు పలికితిని (28). హే మహావిష్ణో! రక్షింపుము, రక్షింపుము. మేము తాపపీడితులమై నిన్ను శరణు పొందినాము. పార్వతి చేయుచున్న పరమోగ్ర తపస్సు మమ్ములను దహించుచున్నది (29). దేవతలతో గూడియున్న నా ఈ మాటలను విని శేషశయ్యపై కూర్చుండియున్న లక్ష్మీపతి మాతో నిట్లనెను (30).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

17 Jun 2021

గీతోపనిషత్తు -213

🌹. గీతోపనిషత్తు -213 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 4 - 2

🍀 3 - 2. యజ్ఞము - పురుషుడు మారుతున్న ప్రకృతితో కూడి తన నిజస్థితి కోల్పోయి నపుడు జీవుడుగ భ్రమపడు చున్నాడు. నాటకమున నటుడు తనను తాను మరిచి, నాటకపాత్రయే తానని భ్రమ చెందునట్లు, సహజముగ దైవమగు పురుషుడు జీవుడుగ భ్రమ చెందును. నిజముగ అష్టప్రకృతులను అధిష్ఠించి పురమున నున్న పురుషుడు దేవుడే కాని జీవుడు కాదు. అతడే అధిభూతము. పురమందున్న పురుషుడే దైవము. పురములు లేక యున్నపుడు ఆత్మ. పురము లందున్నపుడు పురుషుడు. సమాధియందు బ్రహ్మము. 🍀

అధిభూతం క్షరోభావః పురుషశ్చాధి దైవతమ్ |
అధియజో హమేవాత్ర దేహే దేహభృతాం వర || 4

తాత్పర్యము :

స్వభావము నుండి ప్రకృతి పుట్టుచున్నది. ఈ ప్రకృతి క్షరము. స్వభావము నధిష్టించి అధిదైవతముగ పురుషుడున్నాడు. అట్టి పురుషుడు నిర్వర్తించునది యజ్ఞము.

ఇట్లు అధిభూతము, అధియజ్ఞము, కర్మము, అధిదైవము, ఆధ్యాత్మముగ బ్రహ్మ స్వభావ మేర్పడుచు నుండును. కనుక నంతయు బ్రహ్మ సంబంధమే. బ్రహ్మ మాధారముగనే స్వభావము ఆత్మయగుట, అష్ట ప్రకృతులుగ నేర్పరచుట, సృష్టి కర్మమును యజ్ఞమును నిర్వర్తించుట, ఈ మొత్తము నందు తాను ప్రవేశించి వ్యాప్తి చెంది యుండుట శ్రద్ధా భక్తులతో గమనించినచో, అక్షరము పరము అగు బ్రహ్మము నుండి ఉత్పన్నమగు స్వభావము ద్వారా బ్రహ్మమెట్లు వ్యాప్తి చెంది యున్నాడో తెలియును.

కర్మము, యజ్ఞము, అష్ట ప్రకృతులు (అధిభూతములు), పురుషుడు, దైవము, ఆత్మ, పరము అను అంశములను ఇట్లు సంగ్రహముగ శ్రీకృష్ణు డుపదేశించి యున్నాడు. అధిభూతములు క్షరములు. అనగా నశించును. మార్పు చెందును. ప్రకృతి ఏర్పాటు చేయు రూపము లన్నియు మార్పు చెందును. కాని వానియందు వశించు పురుషుడు నశించడు.

పురుషుడు మారుతున్న ప్రకృతితో కూడి తన నిజస్థితి కోల్పోయి నపుడు జీవుడుగ భ్రమపడు చున్నాడు. నాటకమున నటుడు తనను తాను మరిచి, నాటకపాత్రయే తానని భ్రమ చెందునట్లు, సహజముగ దైవమగు పురుషుడు జీవుడుగ భ్రమ చెందును. నిజముగ అష్టప్రకృతులను అధిష్ఠించి పురమున నున్న పురుషుడు దేవుడే కాని జీవుడు కాదు. అతడే అధిభూతము. అనగా ఎనిమిది ప్రకృతులను అధిష్ఠించి యున్నాడు. అతడే పురుషుడు. అనగా ప్రకృతి పురములందున్నాడు.

పురమందున్న పురుషుడే దైవము. పురములు లేక యున్నపుడు ఆత్మ. పురము లందున్నపుడు పురుషుడు. సమాధియందు బ్రహ్మము. ఈ సత్యము దర్శనమిచ్చుటకు కర్మము యజ్ఞముగ మారవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

17 Jun 2021

16-JUNE-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 213🌹  
2) 🌹. శివ మహా పురాణము - 413🌹 
3) 🌹 Light On The Path - 160🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -41🌹  
5) 🌹 Osho Daily Meditations - 30🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 90 / Lalitha Sahasra Namavali - 90🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 90 / Sri Vishnu Sahasranama - 90🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -213 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 4 - 2

*🍀 3 - 2. యజ్ఞము - పురుషుడు మారుతున్న ప్రకృతితో కూడి తన నిజస్థితి కోల్పోయి నపుడు జీవుడుగ భ్రమపడు చున్నాడు. నాటకమున నటుడు తనను తాను మరిచి, నాటకపాత్రయే తానని భ్రమ చెందునట్లు, సహజముగ దైవమగు పురుషుడు జీవుడుగ భ్రమ చెందును. నిజముగ అష్టప్రకృతులను అధిష్ఠించి పురమున నున్న పురుషుడు దేవుడే కాని జీవుడు కాదు. అతడే అధిభూతము. పురమందున్న పురుషుడే దైవము. పురములు లేక యున్నపుడు ఆత్మ. పురము లందున్నపుడు పురుషుడు. సమాధియందు బ్రహ్మము. 🍀*

అధిభూతం క్షరోభావః పురుషశ్చాధి దైవతమ్ |
అధియజో హమేవాత్ర దేహే దేహభృతాం వర || 4

తాత్పర్యము : 
స్వభావము నుండి ప్రకృతి పుట్టుచున్నది. ఈ ప్రకృతి క్షరము. స్వభావము నధిష్టించి అధిదైవతముగ పురుషుడున్నాడు. అట్టి పురుషుడు నిర్వర్తించునది యజ్ఞము.

ఇట్లు అధిభూతము, అధియజ్ఞము, కర్మము, అధిదైవము, ఆధ్యాత్మముగ బ్రహ్మ స్వభావ మేర్పడుచు నుండును. కనుక నంతయు బ్రహ్మ సంబంధమే. బ్రహ్మ మాధారముగనే స్వభావము ఆత్మయగుట, అష్ట ప్రకృతులుగ నేర్పరచుట, సృష్టి కర్మమును యజ్ఞమును నిర్వర్తించుట, ఈ మొత్తము నందు తాను ప్రవేశించి వ్యాప్తి చెంది యుండుట శ్రద్ధా భక్తులతో గమనించినచో, అక్షరము పరము అగు బ్రహ్మము నుండి ఉత్పన్నమగు స్వభావము ద్వారా బ్రహ్మమెట్లు వ్యాప్తి చెంది యున్నాడో తెలియును. 

కర్మము, యజ్ఞము, అష్ట ప్రకృతులు (అధిభూతములు), పురుషుడు, దైవము, ఆత్మ, పరము అను అంశములను ఇట్లు సంగ్రహముగ శ్రీకృష్ణు డుపదేశించి యున్నాడు. అధిభూతములు క్షరములు. అనగా నశించును. మార్పు చెందును. ప్రకృతి ఏర్పాటు చేయు రూపము లన్నియు మార్పు చెందును. కాని వానియందు వశించు పురుషుడు నశించడు. 

పురుషుడు మారుతున్న ప్రకృతితో కూడి తన నిజస్థితి కోల్పోయి నపుడు జీవుడుగ భ్రమపడు చున్నాడు. నాటకమున నటుడు తనను తాను మరిచి, నాటకపాత్రయే తానని భ్రమ చెందునట్లు, సహజముగ దైవమగు పురుషుడు జీవుడుగ భ్రమ చెందును. నిజముగ అష్టప్రకృతులను అధిష్ఠించి పురమున నున్న పురుషుడు దేవుడే కాని జీవుడు కాదు. అతడే అధిభూతము. అనగా ఎనిమిది ప్రకృతులను అధిష్ఠించి యున్నాడు. అతడే పురుషుడు. అనగా ప్రకృతి పురములందున్నాడు. 

పురమందున్న పురుషుడే దైవము. పురములు లేక యున్నపుడు ఆత్మ. పురము లందున్నపుడు పురుషుడు. సమాధియందు బ్రహ్మము. ఈ సత్యము దర్శనమిచ్చుటకు కర్మము యజ్ఞముగ మారవలెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 413🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 23

*🌻. దేవతలు శివుని దర్శించుట - 3 🌻*

సర్వావయవముల యందు తాపమును పొందిన ఇంద్రాది దేవతలందరు కంగారును పొంది ఒకచో గూడి బృహస్పతిని పిలిచి సుమేరు పర్వతమునందున్న బ్రహ్మను (నన్ను) శరణు జొచ్చిరి (22). వారందరు నష్టమైన కాంతిగలవారై కంగారు పడుతూ అచటకు చేరి నన్ను స్తుతించి ముక్త కంఠముతో నిట్లనిరి (23). 

దేవతలిట్లు పలకిరి -

ఈ స్థావర జంగమాత్మకమగు జగత్తంతయూ నీచే సృష్టింపబడినది. హే విభో! ఇపుడీ జగత్తు గొప్ప తాపమును పొందియున్నది. కారణము తెలియుట లేదు (24). హే ప్రభో! బ్రహ్మా! అట్లు జరుగుటకు గల కారణము నీకు తెలియును. దానిని మాకు చెప్పుము. నల్లగా మాడిపోయిన దేహములు గల దేవతలను రక్షించ గలవాడు నీవు తక్క మరియొకడు గానరాడు (25). 

బ్రహ్మ ఇట్లు పలికెను -

వారి ఈ మాటలనాలకించి నేను మనస్సులో శివుని స్మరించి, అదంతా పార్వతి యొక్క తపః ప్రభావమేనని మనస్సులో నిశ్చయించుకొంటిని (26). జగత్తు దహింప బడుచున్నది యని తెలుసుకొని, నేను వారందరితో కలిసి, విష్ణువునకు ఆదరముతో ఆ వృత్తాంతమును చెప్పుట కొరకై, వెంటనే పాలసముద్రము వద్దకు వెళ్లితిని (27). 

అచటకు వెళ్లి, సుఖమగు ఆసనము నందు కులాసాగా ఉన్న విష్ణువును చూచి, దేవతలతో సహా చేతులు జోడించి నమస్కరించి స్తుతించి ఇట్లు పలికితిని (28). హే మహావిష్ణో! రక్షింపుము, రక్షింపుము. మేము తాపపీడితులమై నిన్ను శరణు పొందినాము. పార్వతి చేయుచున్న పరమోగ్ర తపస్సు మమ్ములను దహించుచున్నది (29). దేవతలతో గూడియున్న నా ఈ మాటలను విని శేషశయ్యపై కూర్చుండియున్న లక్ష్మీపతి మాతో నిట్లనెను (30). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 160 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 But to learn is impossible until the first great battle has been won. The mind may recognize truth, but the spirit cannot receive it. - 2 🌻*

574. Then the Master goes on to speak about the knowledge which is attained by this intuition. I have already explained that at each Initiation the candidate receives a key of knowledge which puts a different complexion upon life for him, shows him a deeper depth, a fuller unfolding, as it were, of the meaning of the occult teaching.

Each time, as he receives it, it seems to the man to be final. He says: “Now I have all knowledge; this is so satisfying, so complete, it is impossible that there could be more.” There is an infinity yet to be learnt; he is only on the road of learning. As he goes on, more and more will be unfolded before him. The Master knows precisely at what stage it is most useful to give certain information. 

People often think they ought to have it all at once. That is just as foolish as it would be to expect a teacher to explain the differential calculus to a child who was only just learning the multiplication table. He must go through many intervening stages before he can know even remotely what it means.

575. It is exactly so with us. We are a little apt often – again comes that intellectual conceit – to think that we know at least enough to be trusted with all possible knowledge. I can only say that They know better than we what is best for us, and whatever is best for each one is also that which is best for the whole.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 41 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. జీవులని అవమానించడం ఈశ్వరుని అవమానించడమే 🌻*

సర్వజీవుల హృదయముల యందు భగవంతుడే ఈశ్వర రూపమున ఉన్నాడని తెలిసి దేవుని జీవుల రూపమున ఆదరింపవలెను. 

అట్టి ఈశ్వరుని అవమానము చేసి దేవుని విగ్రహములను మాత్రము పూజించువాడు లోకమును మోసగించును. అతడు మోహముతో తన్ను తానే వంచించుకొనును.

ఎంత భక్తి చూపినను అది ఉచితము కాదు గనుక బూడిదలో పోసిన హోమద్రవ్యము వలె నిష్ఫలమగును.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 30 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 EMPTINESS 🍀*

*🕉 The greatest day in life is when you cannot find anything in you to throw out; all has already been thrown out, and there is only pure emptiness. In that emptiness you will find yourself. 🕉*

Meditation simply means becoming empty of all the contents of the mind: memory, imagination, thoughts, desires, expectations, projections, moods. One has to go on emptying oneself of all these contents. The greatest day in life is when you cannot find anything in you to throw out; all has already been thrown out, and there is only pure emptiness. In that emptiness you will find yourself; in that emptiness you find your pure consciousness. 

That emptiness is empty only as far as mind is concerned. Otherwise it is overflowing, full of being ---empty of mind but full of consciousness. So don't be afraid of the word empty; it is not negative. It negates only the unnecessary luggage, which you are carrying just from old habit, which does not help but only hinders, which is just a weight, a mountainous weight. 

Once this weight is removed you are free from all boundaries, you become as infinite as the sky. This is the experience of God or Buddhahood or whatever word one likes. Call it dhamma, call it Tao, call it truth, call it nirvana--they all mean the same thing.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 90 / Sri Lalita Sahasranamavali - Meaning - 90 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*

🍀 416. చిచ్ఛక్తిః - 
చైతన్య శక్తి.

🍀 417. చేతనారూపా - 
చలించు తెలివి యొక్క రూపము.

🍀 418. జడశక్తిః - 
ఒక స్థితిలో ఉండి పోవునట్లు చేయు శక్తి.

🍀 419. జడాత్మికా - 
జడశక్తి యొక్క స్వరూపము.

🍀 420. గాయత్రీ - 
గానము చేసిన వారిని రక్షించునది.

🍀 421. వ్యాహృతిః - 
ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది.

🍀 422. సంధ్యా - 
చక్కగా ధ్యానము చేయబడునది.

🍀 423. ద్విజబృంద నిషేవితా -
 ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడునది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 90 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 90. cicchaktiś cetanārūpā jaḍaśaktir jaḍātmikā |*
*gāyatrī vyāhṛtiḥ sandhyā dvijabṛnda-niṣevitā || 90 || 🌻*

🌻 416 ) Chitsakthi -   
She who is the strength of holy knowledge

🌻 417 ) Chethana roopa -   
She who is the personification of the power behind action

🌻 418 ) Jada shakthi -   
She who is the strength of the immobile

🌻 419 ) Jadathmikha -   
She who is the world of immobile

🌻 420 ) Gayathri -   
She who is Gayathri

🌻 421 ) Vyahruthi -   
She who is the grammar originating from letters

🌻 422 ) Sandhya -  
 She who is the union of souls and the God

🌻 423 ) Dwija brinda nishewitha -   
She who is being worshipped by all beings

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 90 / Sri Vishnu Sahasra Namavali - 90 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*ధనిష్ట నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🍀 90. అణు ర్బృహ త్కృశః స్థూలో గుణ భృన్ని ర్గుణోమహాన్ !*
*అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశ వర్ధనః !! 90 !! 🍀*

 🍀 835) అణు: - 
సూక్షాతి సూక్షమైనవాడు.

🍀 836) బృహుత్ - 
మిక్కిలి పెద్దది అయిన బ్రహ్మము స్వరూపము.

🍀 837) కృశ: - 
సన్ననివాడై, అస్థూలమైనవాడు.

🍀 838) స్థూల: - 
స్థూల స్వరూపము కలిగియున్నవాడు.

🍀 839) గుణభృత్ -
సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు.

🍀 840) నిర్గుణ: - 
గుణములు తనలో లేనివాడు.

🍀 841) మహాన్ - 
దేశకాలాదుల నధిగమించి యున్నవాడు.

🍀 842) అధృత: - 
సర్వము తానే ధరించియుండి, తనను ధరించునది మరియొకటి లేనివాడు.

🍀 843) స్వధృత: - 
తనకు తానే ఆధారమైనవాడైన భగవానుడు.

🍀 844) స్వాస్య: - 
విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు.

🍀 845) ప్రాగ్వంశ: - 
ప్రాచీనమైన వంశము కలవాడు.

🍀 846) వంశవర్థన: - 
తన వంశమును వృద్ధినొందించువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 90 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Dhanishta 2nd Padam*

*🌻 90. aṇurbṛhatkṛśaḥ sthūlō guṇabhṛnnirguṇō mahān |*
*adhṛtassvadhṛtasvāsyaḥ prāgvaṁśō vaṁśavardhanaḥ || 90 || 🌻*

🌻 835. Aṇuḥ: 
One who is extremely subtle.

🌻 836. Bṛhat: 
The huge and mighty.

🌻 837. Kṛśaḥ: 
One who is non-material.

🌻 838. Sthūlaḥ: 
Being the inner pervader of all, He is figuratively described as Stula or huge.

🌻 839. Guṇa-bhṛt: 
The support of the Gunas. He is so called because in the creative cycle of creation, sustentation, and dissolution, He is the support of the Gunas – Satva, Rajas and Tamas – with which these functions are performed.

🌻 840. Nirguṇaḥ: 
One who is without the Gunas of Prakruti.

🌻 841. Mahān: 
The great.

🌻 842. Adhṛutaḥ: 
One who, being the support of all supporting agencies, like Pruthvi (Earth), is not supported by anything external to Him.

🌻 843. Svadhṛtaḥ: 
One supported by oneself.

🌻 844. Svāsyaḥ: 
One whose face is beautiful and slightly red like the inside of a lotus flower.

🌻 845. Prāgvaṁśaḥ: 
The family lines of others are preceded by the lines of still others, but the Lord's descendent, namely, the world system, is not preceded by anything else.

🌻 846. Vaṁśavardhanaḥ: 
One who augments or destroys the world-system, which is His off-spring.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹